పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జంతువులకు పోటీ పెడితే

జిరాఫీ,యాంట్ ఈటర్,ముళ్ళపంది,తాబేళ్లు,హేప్పీ ఈగిల్ మరియు మొదలగు జంతువుల ప్రత్యకత

ఒలంపిక్ క్రీడల గురించి మీకు తెలిసిందే కదూ .. ఈదడం, పరిగెత్తడం, సైకిల్ తొక్కడం, దూరం నుంచి గెంతడం, బరువులెత్తడం, బాణాలు వెయ్యడం, ఇలాంటి అనేక అంశాలలో మనుషులకు పోటీని పెట్టి, గెలిచిన వారికి బంగారు, వెండి తదితర పతకాలను ఇస్తారు. ఒకవేళ జంతువుల కోసం కూడా ఇలాంటి పోటీ ఏదైనా పెడితే ఒక్కో జంతువు ఒక్కో అంశంలో తాను దిట్ట అని నిరూపించుకుంటుంది. కొన్ని జంతువులు కేవలం ఒక దానిలేనే గాక రెండో మూడో అంశాల్లో తమదే పైచేయి అని రుజువు చేసుకుంటాయి. అవును మరి. సృష్టిలో దేని ప్రత్యేకత దానిదే కదా. ఏ జీవినీ తీసిపడేయడానికి లేదు. సరే, ఇక ఇప్పుడు ఏ జంతువు దేనిలో మిన్నో తెలుసుకుందాం.

ఎత్తులోనే కాదు బి.పి. లోనూ జిరాఫీయే ఫస్ట్

ప్రపంచంలోQ.jpg అన్నింటికన్నా ఎత్తైన జంతువు ఏదంటే జిరాఫీ అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. అయితే జిరాఫీకి ఎత్తు మాత్రమే కాక మరికొన్ని ప్రత్యేకతలు కూడా వున్నాయి. వాటిలో అన్నిటికన్నా ముఖ్యమేనది రక్తపీడనం (బిపిలేక బ్లడ్ ప్రజర్) కు సంబంధించిన వ్యవహారం.

ప్రపంచంలోని ఇతర ప్రాణులన్నింటికన్నా జిరీపీకి రక్తపీడనం ఎక్కువగా వుంటుంది. దాని బిపి మనుషుల బి.పి. కన్నా సుమారు 3 రెట్లు ఎక్కువగా వుండటం విశేషం. అసలెందుకంత బి.పి. అంటారా ? ఎందుకంటే గుండె నుంచి దానికి దూరంగా వుండే దాని తల భాగం దాకా రక్త ప్రసరణం జరగాలంటే జిరాఫీ గుండె చాలా వత్తిడితో రక్తాన్ని పంపించవలసి వుంటుంది. అందుకే ఆ.బి.పి. మరి జిరాఫీ మెడలోని రక్తనాళాల్లో వుండే ప్రత్యేకమైన కవాటాలు (తోలుతో రూపొందే ద్వారాలు) దాని గుండె నుంచి వచ్చేరక్తం తలదాకా చేరేందుకు సాయం చేస్తాయి.

జిరాఫీ మెడ మాత్రమే కాక దాని తోక కూడా మిగతా జంతువులన్నింటి తోకల కన్నా పొడవుగా వుంటుంది. దాని మెడ ఆరడుగుల పొడవుంటే, తోక ఎనిమిదడుగులు వుంటుంది. జిరాఫీయా మజాకా.....

పొడవైన నాలుకలో పెద్దన్న

మెడలో, తోకల పొడవు S.jpgవిషయంలో ముందు స్థానంలో వుండే జిరాఫీ నాలుక పొడవు విషయంలో మాత్రం కాస్త వెనుకబడి పోయింది. జిరాఫీ నాలుక రమారమి 18 అంగులాల పొడవుంటుంది. అది చాలా ఎక్కువే అని చెప్పుకోవాలి. అయితే తాడిదన్నే వాడుంటే వాడి తలదన్నేవాడు మరొకడు వుంటాడన్నట్లుగా యాంట్ ఈటర్ అనే జంతువు (ఇది చీమలు, చెదపురుగులు) వంటి వాటిని తిని బతుకుతుంది.) 20 నుంచి 23 అంగుళాలు పొడవుండే నాలుకను కలిగి వుంటుంది.

ఈ నాలుగు సాయంతో సదరు జంతువు రోజుక సుమారు 35,000 కీటకాలను స్వాహా చేస్తుంది. యాంట్ ఈటర్ తన పొడవాటి నాలుకను ఒకసారి చాపితే చాలు, ఏదో బంకకు అతుక్కున్నట్లుగా వందల కొద్దీ కీటకాలు దీనికి అతుక్కుపోతాయి. ఆ తర్వాత ఇంకేముందని. అవి అంతే, యాంట్ ఈటర్ కడుపులోకి చేరుకుంటాయి. ఈ కీటక భక్షిణి తన పొడవాటి నాలుకను చీమల పుట్టల్లోకి, చెదల పుట్టల్లోకి అవలీలగా చొప్పించగల్లుతుంది. అలా నాలుకను దుర్చి తీసిన ప్రతిసారి వందల కొద్దీ చీమల్లో, చెదపురుల్నో గుటుక్కుమన్పిస్తుంది. అదీ సంగత సంగతి.

కుంభకర్ణుడి తాత ఈ ముళ్ళపంది.

రామాయణంతో ఒక R.jpgపాత్ర అయిన కుంభకర్ణుడు నెలల తరబడి నిద్రపోయే వాడని ప్రతీతి, ఐరోపాకు చెందిన ఒక ముళ్ళపంది ఈ విషయంలో కుంభకర్ణుడ్నిమించిపోతున్నది. ఈ ప్రాణి అక్టోబరు నుంచిఏప్రిల్ దాకా పూర్తి నిద్రలో (శీతనిద్ర) వుండడమే కాక, మిగతా నెలల్లోనూ రోజుకు 18 గంటలు చొప్పున నిద్రపోతుంది. అంటే ఏడాదికి 300 రోజులకు పైగా కాలాన్ని ఇది నిద్రలేనే గడుపుతుందన్న మాట. ఇక ఈ నిద్రబోతు ముందు మన కుంభకర్ణుడు ఏం పనికొస్తాడులెండి. ఏమంటారు ?

నిండు నూరేళ్ళు

006.jpgమనుషుల ఆయుష్షు రమారమీ వందేళ్ళు అని అందరికీ తెలిసిందే. ప్రపంచంలో వందేళ్ళకు పైబడి జీవించే జాతులు చాలా కొన్ని మాత్రమే వున్నాయి. వాటిలో గాల్ పెగాస్ దీవులకు చెందిన తాబ్ళ్ళు దీర్ఘాయుష్షులో మిగతా వాటన్నిటికీ త్రోసిరాజని సుమారు 152 ఏళ్ళు జీవిస్తున్నాయి. అంటే ఎక్కువ కాలం జీవించే ప్రాణులుగా ఇవి బహుమతిని కొట్టేస్తాయన్నమాట.

అన్నితికన్నా బలమైన పక్షి

T.jpgపక్షులన్నింటిలోకి బలమైన పక్షిని చూడాలంటే మీరు ఏ దక్షిణ అమెరికాకో, లేదో మధ్య అమెరికాకో వెళ్ళి తీరాలి. అప్పటికీ అది కన్పిస్తుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని చూడగలిగారు. సాధారణంగా ఎవరికంటా పడకుండా అది తన పనిని తాను తేసుకుపోతుంది. హేప్పీ ఈగిల్ అనబడ్ (గద్ద జాతికి చెందిన) ఈ పక్షికి మరొక ప్రత్యేకత కూడా ఉందండోయ్. ఇది తాను వేటాడే జంతువులను నిశితంగా గమనించేందుకై తన తలను పూర్తిగా వెనక్కి తిప్పగల్గుతుంది. చాలా గొప్ప విషయమే కదా

అందరికీ ఇష్టమయ్యే జీవి

ఇలా ఒక్కో జీవరాతి ఒక్కో ప్రత్యేకతను కలిగి వున్న నేపథ్యంలో మనుషులందరూ ఇష్టపడే జంతువు (లేదా ప్రాణి) ఏది అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కొందరు కుక్కల్ని ఇష్టపడితే మరి కొందరికి పిల్లులంటే ప్రాణం. (ఇష్టమంటే వండుకుని తినే ఇష్టంకాదు సుమా). కొందరు మేకలను గోముగా పెంచుకుంటే మరికొందరికి ఆవులంటే ప్రేమ. కొందరికి కాకులు ఇష్టమైతే మరి కొందరికి ఎలుకలంటే సరదా. ఆఖరికి పందుల్ని, పాముల్ని, కప్పల్ని, మిడతల్ని, కూడా ఇష్టపడే వారందరో ఉన్నారు. లోకోభిన్న రుచిః ఒక్కో మనిషిదీ ఒక్కో అభురుచి.

ఒకసారి మీరే ఆలోచించి చూడండి. ఈ లోకంలోని జంతువులన్నీ, అలాగే మనుషులందరూ అచ్చం ఒకేలా వుండి వున్నట్లయితే ప్రపంచం ఎంత బోర్ కొడుతుందో కదా, అందుకే వైవిధ్యతలో ఉన్న గొప్పదనాన్ని మనం మనస్ఫూర్తిగా గుర్తించాలి. లోకంలోని ప్రతి ప్రాణినీ దాని విశిష్ట లక్షణాలను దృష్టిలో పెట్టుకొని ఆదరించాలి. ఇకపై అలాగే చేస్తారు కదూ.

గెలిచేదెవరో చెప్పుండి.

జంతువులకు ఒలంపిక్ క్రీడల వంటివి నిర్వహిస్తే ఏ అంశంలో ఏది పతకం గెలుచుకుంటుందో కొన్ని జంతువులు గురించి వివరించాముగా. ఇక ఇప్పుడు మీ వంతు. ఈ క్రింది అంశాల్లో ఏయే ప్రాణులు ప్రథమ స్థానంలో నిలుస్తాయో మీరు చెప్పాల్సి వుంటుంది. సరేనా.

  • అన్నిటికన్నా పెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏది?
  • ఒకే ఒక్క ప్రయత్నంలో (గుటక) ఎక్కువ నీటిని తాగ గలిగే జంతువేది ?
  • అతి పెద్ద గుంపును కట్టే పక్షి ఏది ?
  • ముందుకీ, వెనక్కీ, చివరికీ తలకిందులుగా కూడా ఎగరగలిగే పిట్ట ఏదో చెప్పగలరా ?
  • అతి పెద్ద కొమ్ములుండే జంతువు ....ఈ విభాగంలో గెలుపెవరిది ?
  • నేలపై నివసించే జీవుల్లో అతి పెద్ద మాంసాహారి ఏదో చెప్పుకోండి.?

ఇంకోసారి, మరికొన్ని విశేషాలతో కలుపుకుందాం. ఈ లోగా పై ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారుగా.

3.04819277108
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు