অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మార్చి నెలలో సైన్సు సంగతులు

మార్చి నెలలో సైన్సు సంగతులు

mar10.jpg

మార్చి 1-1982: సోవియాట్ రష్యా వారి అంతరిక్ష నౌక వేనిరా-13 శుక్రగ్రహం మీద డిగా దాదాపు 127 నిమిషాలు పాటు సమాచారం పంపింది.

 

mar4.jpgమార్చి 3-1703: పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి సుక్ష్మదర్శినిని ఉపయోగించి మొక్కలలో తేనెపట్టు గడులలాంటి కనాలున్నాయని చెప్పిన బ్రిటిష్ శాస్త్రవేత్త రాబర్డ్ హుక్ మరణించిన రోజు.

mar5.jpgమార్చి 5-1827: విద్యుత్ ఘటంను రూపొందించిన ఇటలి శాస్త్రవేత్త. అలస్పెండ్రో వోల్ట్ మరణించిన రోజు. ఈయన కృషికి గుర్తుగా విద్యుత్ బలం కు వోల్ట్ అని పేరు పెట్టబడింది.

mar9.jpgమార్చి 6-1986: సోవియట్ అంతరిక్ష నౌక వేగా-1 హేలీ తోకచుక్క సమీపానికి వెళ్ళి ఫోటోలను భూమికి చేరవేసింది.

 

mar7.jpgమార్చి 10-1876: మొట్టమొదటి సారిగా మానవ స్వరం టెలిఫోన్ తీగల ద్వారా ప్రయాణించిన రోజు. టెలిఫోన్ సృష్టికర్త అలెగ్జాండర్ గ్రహెంబల్ మాట్లాడిన “మిస్టర్ వాట్సన్, కం హియర్, ఐ వాంట్ యూ” అనే మాటలు తొలిసారిగా తీగలలో ప్రయాణించాయి.

మార్చి 11-1955mar8.jpg: “పెన్సిలిన్” సృష్టికర్త అలెగ్జాండర్ ప్లెమింగ్ మరణించిన రోజు. లాలాజలం , కన్నీరులో కూడా బాక్టీరియా ఉందని ఈయన కనుగొన్నారు .

mar6.jpgమార్చి 14-1879: ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ జన్మించిన రోజు. సాపేక్షతా సిద్దాంతం వీరి ప్రముఖ ప్రతిపాదన. photo electric effect సూత్రాలు రూపొందించినదుకు 1921లో నోబెల్ బహుమతి లభించింది.

mar11.jpgమార్చి 17-1988: భారతదేశం తయారుచేసిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం IRS-1A సోవియట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడింది.

మార్చి 18-1858: డిజిల్ ఇంజన్ సృష్టి కర్త , ఫ్రెంచ్ ఇంజనీర్ రుడాల్ఫ్ డిజిల్ జన్మించిన రోజు.

mar12.jpgమార్చి 20-1727 : ఇంగ్లిష్ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణించిన రోజు న్యూటన్ సిధ్ధాతం కం న్యూటన్ గమన నియమాలు, బలానికి ప్రమాణమైన న్యూటన్ ఈయనకు సంబంధించినవే.

మార్చి 22-1990: నేచర్ పత్రికలో పూనేకు చెందినా “నేషనల్ కెమికల్ లాబరేటరీ” (NCL) శాస్త్రవేత్తలు Tissue clulture ద్వారా మొటమొదట సారిగా వెదురును పుష్చంపచేయడాన్ని గూర్చి పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు.

మార్చి 25-1989: భారతదేశంలో సూపర్ కంప్యుటార్ ను ప్రారంభించిన రోజు. Cray XMP-14 అనే సూపర్ కంప్యూటర్ ను అమెరికా నుండి ఢిల్లీలోకి వాతావరణ శాస్త్ర విభాగం దిగుమతి చేసుకుంది.

mar13.jpgమార్చి 27-1968: అంతరిక్షంలో ప్రయాణించిన యూరిగగారిన్ విమాన ప్రమాదంలో చనిపోయిన రోజు.

 

మార్చి 31-1811: ప్రయోగశాలలో వాడే బున్ సేన్ బర్నర్ రూపశిల్పి Robert wilhelm Bunsen జన్మించిన రోజు .

చివరిసారిగా మార్పు చేయబడిన : 3/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate