పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మూఢనమ్మకాల నుండి దేశాన్ని కాపాడండి

భారతీయ సమాజం ఒక వైపు ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలలో ముందంజ వేస్తూనే మరోవైపు మూఢనమ్మకాలకు పెద్దపీట వేస్తుంది.

dec16భారతీయ సమాజం చాలా విచిత్రమైంది. ఒక వైపు ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలలో ముందంజ వేస్తూనే మరోవైపు దేవుడికి, దయ్యాలకు, బాబాలకు అతీంద్రియ శక్తులకు, మూఢనమ్మకాలకు పెద్దపీట వేస్తుంది. అసలు పూజలు చేసి రాకెట్ ప్రయోగాల్లో పాల్గొనే శాస్త్రజ్ఞులు, అర్చనలు చేసి సర్జరీ చేసే వైద్యులు మనకున్నారు. మనకున్న వైజ్ఞానిక సదుపాయాల్ని కాదని వీళ్ళు కనీసం ఒక నిమిషం కూడా బతకలేరు. అట్లాగని వైజ్ఞానిక స్పృహతో, ఆత్మవిశ్వాసంతో నిలబడనూ లేరు. మానసిక దౌర్బల్యం గల పత్రికా విలేకరులు సమాజానికి ఎంత అపకారం చేయగలరో, మానసిక దౌర్బల్యం గల శాస్త్రజ్ఞులు అంతకు పదిరెట్లు కీడు చేయగలరు. అదే అక్షర జ్ఞానం లేనివాడు మానసిక దౌర్బల్యం గల వాడైతే సమాజానికి జరిగే కీడు అంతగా ఉండదు. అందువల్ల చదువుకున్న అజ్ఞానుల వల్లనే పండిత మూడుల వల్లనే సమాజానికి ప్రమాదం ఎక్కువ. వీళ్పు శాస్త్రీయాన్ని శాస్త్రీయంగా అశాస్త్రీయాన్ని అశాస్త్రీయంగా చూడలేరు. అశాస్త్రీయాన్ని తమ మేధో సంపత్తినంతా ఉపయోగించి ‘శాస్త్రీయం' చేయాలనుకుంటారు. ఈ ప్రయత్నాలే సమాజాన్ని చావు దెబ్బ తీస్తున్నాయి...

దేశం బాబాలతో, స్వాములతో రోగగ్రస్టుమై పోతూ ఉంటే శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు రంగంలోకి దూకరేం? ఒక పెద్ద డిగ్రీ సంపాదించుకుని, ఓ పది పరిశోధనా పత్రాల్ని ప్రచురించుకొని, మూడు సెమినార్లు, ఆరు సింపోజియాలకు హాజరైనంత మాత్రాన అయిపోయిందా? తమకు ఒక విలువను, గౌరవాన్ని ఇచ్చిన సమాజం పట్ల తమ బాధ్యత తీరిందా? మహర్షి మహేష్, యోగి 'వేదాలలో ఆధునిక శాస్త్ర విజ్ఞానమంతా ఉంది' అనంటే , రక్షణశాఖ మంత్రి పరికర్ 'మన రుషులందరూ శాస్త్రజులే' అని మన భారతీయ రక్షణ శాస్త్రవేత్తలకు ఉద్బోదిస్తే ఎవరూ ప్రతిస్పందించలేదేం? మహర్షి దయానంద సరస్వతి విమానాల తయారీగురించి, వేదాలలో ఉందని వక్రభాష్యాలు చెబితే ఎవరూ పట్టించుకోలేదేం? ఇటు మతానికి అటు రాజకీయాలకు ముడి పెట్టిన చంద్రస్వామి జైలులో పడ్డా ఎవరు పెదవి మెదపలేదేం? సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో ఆయన పడక గదిలో యువకుల హత్యలు జరిగితే, అదేదో పవిత్ర కార్యంగా భావించారా? ఏదీ మన శాస్త్రవేత్తల, మేధావుల పాత్ర, ఏదీ విద్యావేత్తల చొరవ? ప్రభుత్వాలే మూఢత్వంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కనీసం కొంతమంది వివేకవంతులైనా దైర్యంగా ముందుకు రావాలి కదా?

తమకు తాము భగవంతులమని ప్రకటించుకున్న వారి పని ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా? పెద్దవాళ్ళతో ఎన్నెన్ని పరిచయాలున్నా కోట్ల కొద్ది డబ్బు మూలుగుతున్నా చంద్ర స్వామి జైలుకు వెళ్ళక తప్పలేదు. విభూతి, స్విన్ గడియారాలు, మంగళ నూత్రాల ట్రిక్కులు తేలిపోతున్నాయన్న భయంతోనే సత్యసాయి బాబా చివరి దశలో సాంఘిక కార్యకర్తగా వేషం మార్చుకున్న విషయం గమనించాలి. చూడాలనుకునేవారు బాబాల ట్రిక్కులు యూట్యూబ్ లో స్పష్టంగా చూడొచ్చు. ఆయన కట్టించిన ఆసుపత్రులు మానవ ప్రయత్నాలే కానీ, భగవత్ సృష్టికి ఉదాహరణలు కావు. అన్ని ఆనుపత్రులలో మాదిరిగానే ఆ ఆసుపత్రులలో కూడా వైద్య విజ్ఞాన నిపుణులే ప్రాణాల్ని నిలుపుతున్నారు. బాబా చలువ వల్ల ప్రాణాలు నిలువలేదు. జబ్బులు నయం కాలేదు. ఆయన చేపట్టిన సాంఘిక కార్యక్రమాల్ని అభినందించొచ్చు. కాని ఒక అర్ధ శతాబ్దం పైగా హస్తలాఘవంతో వస్తువుల్ని సృష్టించి జనాన్ని మోసం చేస్తుంటే మన ప్రభుత్వాలేం చేశాయి ? వైజ్ఞానిక సంస్థలేం చేశాయి? ఆలోచిచండి.

“శూన్యంలోంచి శూన్యం తప్ప మరేదీరాదు” అన్న సూత్రం ఇప్పటిది కాదు క్రీ.పూ. 99 - 55లోనే లుక్రిషియస్ (Lucretius) ప్రతిపాదించాడు. (NIL POSSE CREARI DE NILO) కాని ఇన్ని వేల యేళ్ళు గడిచినా మనం శూన్యంలోంచి ఎవరైనా ఏదైనా మ్యాజిక్ చేసి సృష్టిస్తే నిజమేనని నమ్ముతున్నామే? ఇలాంటి విషయాల్లో శాస్త్ర వేత్తలు వనం వహిస్తారెందుకు? స్వభావ సిద్ధమైన ప్రకృతి సూత్రాలకు భిన్నంగా ఏదీ జరగదని జనసామాన్యానికి

తెలియజెప్పరెందుకని? వీరి మౌనమే “మానవ దేవుళ్ళ'కు ఒక రకంగా బలం చేకూర్చుతోంది. విద్యావంతులు, శాస్త్రజ్ఞులు సామాన్యుడికి అండగా నిలబడకపోవడం వల్లే అతడు అయోమయంలో కొట్టుకుపోతున్నాడు. ప్రవాహానికి ఎదురీదడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. అయితే అదెంతో కష్టమైన పని. ప్రవాహంలో పడి కొట్టుకుపోవడం చాలా తేలికైన పని. అందుకే ఎక్కువ మంది కళ్ళు మూనుకొని ప్రవాహంలో కొట్టుకుపొవడానికే ఇష్టపడుతున్నారు. అందుకే ఈ సమాజ స్వరూపం ఇలా ఉంది.

మానసిక దౌర్బల్యం గల కొంతమంది శాస్త్రవేత్తలు ప్రజల్లోకి వచ్చి, ప్రజల భావనల్ని అర్థం చేసుకొని, నిజానిజాలేవో బహిరంగంగా చర్చింలేకపోతున్నారు. నిజానికి అదేవారి ముఖ్యమైన బాధ్యత! అలాంటి వారి గూర్చి కార్ల్ సాగన్ (CARL SAGAN ) ఇలా అంటారు. Some Scientists seem unwilling to engage in public confrontations on border line Science issues because of the efforts required and the possibility that they will be perceived to loose a public debate. But it is an excellent opportunity to show how science works at its murkier borders and also a way to convey same thing of its power as well as its pleasure - అని!

“విజ్ఞానం ద్వారా బలమైన తాత్త్వికత, నిజాయితి, బుద్ధి కుశలత లభిస్తాయి. శ్రమ పట్ల గౌరవం ఏర్పడుతుంది.” అని అన్నాడు రష్యన్ మహా రచయిత - గోర్కి

ఇంతకంటే మరింత స్పష్టంగా, మరింత సూటిగా హెచ్చరించాడు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్! “సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకో! హేతువాదం చేయనివాడు మూరుడు. అవివేకి, హేతువాదం చేయ సాహసించని వాడు బానిస.”

ఇలా దార్శనికులైన కొంతమంది మహానుభావుల మాటలు చెప్పుకునేది ఎందుకంటే అందులోంచి ఏ కొంచెమైనా స్ఫూర్తి ప్రజలు అందుకుంటారని సమాజంలో శాస్త్రీయ అవగాహన

పెంచడంలో శాస్త్రవేత్తల, మేధావుల, ఉపాధ్యాయుల, రచయితల పాత్ర ఎక్కువగా ఉంటుంది. నిజమే కానీ, | పౌరులందరికీ కూడా సమాన బాధ్యత ఉంటుంది. వారు భాగస్వాములునప్పుడే మార్పు సంభవిస్తుంది. సైంటిఫిక్ డెమోక్రసీ రూపుదిద్దుకుంటుంది.

కొత్త కొత్త విషయాల్ని కని పెట్టి దేశాన్ని ప్రపంచ | దేశాల మధ్య తలెత్తుకునేట్లు చేయగల శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు మనకు తప్పకుండా కావాలి. అయితే వారు వారి ప్రయోగశాలలకు, కార్యశాలలకు మాత్రమే కుంచించుకుపోకుండా, ముందుండి నాయకత్వం వహించి, సామాన్యుడి ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారికి అండగా నిలబడగలగాలి! రాబోయే తరాల్ని ప్రభావితం చేయగలగాలి కూడా!! అంతేకాదు, మొత్తానికి మొత్తంగా సమాజంలో హేతుబద్దత పెంచగలగాలి.!!!

ఆధారం: డా. దేవరాజు మహారాజు,(వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త), 9908633949

3.02064896755
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు