పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మేధస్సుకు చిహ్నం

జ్ఞాపక శక్తి తగుతుంది.

ఈ మధ్య మా పాఠశాలలో విద్యారులకి జ్ఞాపకశక్తిపై ఆటాడించాం. ఒక గదిలో బల్లమీద ఇరవై రకాల వస్తువులనుంచాం (పెన్ను నుంచి పిన్ను దాకా), ఒక్కో విద్యార్థి ఆ గదిలోకి వెళ్లి బల్లమీది వస్తువులను చూసి బయటకి వచ్చి తాను చూసిన వస్తువులను రాయడమే అది. ఒకరు అయిదు రాస్తే ఇంకొకరు పది రాశారు వేరొకరు పదిహేను రాశారు. అలా ఒక్కొ విద్యార్థి జ్ఞాపకశక్తి ఒక్కో రకంగా వుంది. దీనికి కారణమేంటి? అందరి మెదడు ఒకేలా లేదా? ఒకే రకమైనది కాదా? అనే ప్రశ్నవేసుకుంటే మెదడు అందరిదీ ఒకే రకమైన నిర్మాణంతో వుంటుంది. మెదడును ఒక క్రమపద్ధతిలో ఉపయోగించుకోవడం అంటే గుర్తుంచుకోడానికి ప్రత్యేక పద్దతిని అనుసరించడం వల్ల ఒక్కొకరు ఒక్కో రకమైన జ్ఞాపకశక్తిని కలిగివున్నారు.

జంతువులన్నింటికి ఎంతో కొంత మెదడు ఏదో రూపంలో ఉంది. అయితే జంతు ప్రపంచంలో ప్రకృతిని జయించగలిగింది మాత్రం మానవుడే. ఇదంతా మనలో బాగా ఎదిగిన మెదడు వల్ల సాధ్యమైంది. అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో అతి సంక్లిష్టరూపుదాల్చింది. మానవ మెదడు ఏ విషయాన్నైనా క్షణాల్లో చేసి పెట్టే కంప్యూటర్ ఆవిష్కరణను అభివృద్ధి చేసింది.

aug03.jpgమెదడు అనేక సున్నితమైన నాడీకణాల సమూహం. అందుకే ఇది కపాలంలో (Cranium) భద్రంగా ఉండేలా రూపుదిద్దుకుంది. శరీరం లోపల వెలుపల జరిగే మార్పులను గుర్తించేది, ప్రకృతితో నంబంధాన్ని ఏర్పరచేది వెదడే. కడుపునొప్పి వల్ల జీర్ణవ్యవస్థలోని ఇబ్బందిని తెలుసుకుంటాం. తోవలో నడిచేటప్పుడు పాము కనిపిస్తే ఆగిపోతాం. ఎందుకు? కంటి ద్వారా పాము రూపం మెదడుకు చేరింది. మెదడు విశ్లేషణ చేసి ముందుకు వెళ్లొద్దని ఆదేశిస్తుంది అందుకే ముందుడు వెయ్యలేం. వీలైతే వెనక్కు పరుగెత్తుతాం. ఇదంతా నాడీ వ్యవస్థ కండర వ్యవస్థ సమన్వయంతో జరుగుతుంది.

మెదడులో ఎన్ని నాడీ కణాలుండొచ్చు? అనేక కోట్ల నాడీ కణాలు అంటే ఆశ్చర్యం కలుగకమానదు. మెదడు ఉపరితలంపై అనేక ముడుతలు కన్పిస్తాయి. వాటిని గట్లు (GYRI), గాడులు (SULCI)గా పిలుస్తాం. వీటివల్ల మస్తిష్క వైశాల్యం పెరుగుతుంది. ఇది ఎందుకోసం? దీనిని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది.

పై రెండింటిని దారంతో కొలిస్తే ఏది పొడవుగా ఉంటుంది? స్వయంగా దారంతో కొలవండి. బి అని చెప్పొచ్చు. మెదడు పై గట్లు, గాడుల వల్ల వైశాల్యం పెరగడం, అందువల్ల ఎక్కువ సమాచారం నిలవచేయడానికి వీలయ్యింది.

aug01.jpgమెదడులో పది బిలియన్లకు పైగా (1 బిలియన్ = 100 కోట్లు) నాడీ కణాలుంటాయి. మామూలు కణానికి, నాడీ కణానికి ఆకారంలో, చేసే పనిలో తేడా కన్పిస్తుంది. వార్తలను మెదడు నుంచి అన్ని భాగాలకు చేర్చాలి కాబట్టి చాలా పొడవుగా ఉంటుంది. నాడీకణం కొనను ఏదన్న తాకినా, వేడి తగిలినా ఆకస్మిక మార్పు కన్పిస్తుంది. అతివేగంగా ఆ వార్త వెదడుకు చేరుతుంది. సామాన్యంగా ఆ ప్రసారవేగం గంటకు 321కి.మీ. వరకు ఉండొచ్చు. నాడీ సందేశం తల నుంచి కాలివేలికి 1/30 సెకండ్లలో ప్రయాణిస్తుంది. మొత్తం శరీరం బరువులో మెదడు బరువు రెండు శాతం మాత్రమే. వినియోగించే ఆక్సిజన్ మాత్రం ఇరవైశాతం పైగా ఉంటుంది.

aug02.jpgనాడీ కణాలకు విభజన చెందే శక్తి లేదు. పిండదశలో ఏర్పడిన నాడీ కణాల సంఖ్యే చివరి వరకు ఉంటుంది. పరిమాణంలో మాత్రమే పెరుగుదల కన్పిస్తుంది. అందుకే పోలియో వచ్చినవారిలో దెబ్బతిన్న మెదడు ప్రాంతం బట్టి వైకల్యం శాశ్వతంగా కాలు లేదా చేయికి ఒక వైపు వస్తుంది.

భావాలను, ఉద్దేశాలను ఇతరులకు అందజేయడం వల్ల మానవుడు అత్యున్నతమైన జాతిగా రూపొందాడు. మానవ మస్తిష్కం ఆలోచనలు ప్రపంచశాంతికి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలి. అప్పుడే ప్రకృతిలో మానవుడు శాశ్వత నివాసిగా ఉంటాడు.

ఆధారం: డా. వీరమాచనేని శరత్ బాబు.

2.99737532808
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు