పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రక్తపోటు

బీ.పి (blood pressure) ఆరోగ్యవంతుడికి 120/80 ఉంటుంది.

a13మనకి ఆరోగ్యం బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ డాక్టర్ (blood pressure) చూస్తుంటాడు. చేతికి ఒక గుడ్డ పట్టి చుట్టి అందులోకి పుస్సు పుస్సు అని గాలి పంపి స్టెతస్కోపు పెట్టి బీపి ఉందో లేదో తెలుసుకుంటాడు కదూ.

అసలు బీపి అంటే ఏమిటి? ఇది మన శరీరంలో ఏ అవయవానికి సంబందించిన విషయం అని మనకు అనుమానం వస్తుంటుంది కదా? అదేంటో తెలుసుకుందామా!

మన శరీరంలో తల వెంట్రుకల దగ్గర్నుంచి కాలి గోటి వరకు రక్తం  రక్తనాళాలలో రక్తం నిరంతరం ప్రసరించాలంటే దాన్ని పంపు చేసే ఒక పరికరం కదా. ఆ పంపే మన గుండె (heart).

గుండెకి అన్ని అవయావల నుంచి రక్తాన్ని రక్తనాళాలు తీసుకొస్తాయి. అలాగే అవయవానికి రక్తం గుండె నుంచి వెళ్లే నాళాల ద్వారా వెళ్తుంటుంది. మధ్యలో ఉండే గుండె వ్యాకోచించి సంకోచిస్తుంది. దీనిని హార్ట్ బీట్ (heart beat) అంటారు. గుండె వ్యాకోచించేటప్పుడు రక్తం గుండె నిండా నిండుతుంది. గుండె సంకోచించేటప్పుడు రక్తం గుండె నుండి నాళాల్లోకి వెళ్ళి అవయవాలకు చేరుతుంది. ఈ ప్రక్రియ మనం జీవించినంత కాలం రక్త ప్రసరణకి కావలసిన ఒత్తిడిని గుండె తన సంకోచవ్యాకోచాల ద్వారా కలిగిస్తుంది. ఈ ఒత్తిడినే మనం బీ.పి (blood pressure) అంటాం. ఇది ఆరోగ్యవంతుడికి 120/80 ఉంటుంది. 120 అనేది గుండె సంకోచించినప్పుడు రక్తంపై ఉండే ఒత్తిడి. 80 గుండె వ్యాకోచించినప్పుడు ఉండే ఒత్తిడి. డాక్టరు గాని నర్సుగాని మన మోచేతి పైన గుడ్డ పట్టి చుట్టి అందులోకి గాలిని పంపించి చేతిపై త్తిడిని ఏర్పరుస్తారు. ఈ త్తిడి దాదాపు 200 మి.మీ. ఉంటుంది. (బీపి ఆపరేషన్ లో ‘0’ నుండి ‘240’ మి.మీ. దాకా పాదరస నాళం ఉంటుంది) మనం త్తిడి పెంచేకొద్ది పాదరసం ఈ నాళంలో పైకి ఎగబడుతుంది. స్టెతస్కోపు ద్వారా మన నాడిని వింటూ ఈ త్తిడిని తగ్గిస్తారు. ఏ కొలత వద్ద నాడి శబ్దం వినిపించడం మొదలవుతుందో అది గుండె సంకోచించినప్పుడు ఏర్పడిన త్తిడితో సమానంగా గుర్తిస్తారు. దీని Syntolic అంటారు. చేతిపై త్తిడిని తగ్గిస్తూ పోతే ఏ కొలత వద్ద నాడి చప్పుడు వినపడడం ఆగిపోతుందో అది గుండె వ్యాకోచించినప్పుడు ఏర్పడే త్తిడితో సమానమని అర్థం. దీనిని Diastolic అంటారు. ఈ syntolic diostolic  120/80 సాధారణ ఆరోగ్యవంతుడిలో కనబడుతుంది. దీని కన్నా ఎక్కువ ఉంటే అతనికి రక్తపోటు (blood pressure) అధికంగా ఉందని తక్కువగా ఉంటే (low blood pressure) ఉందని నిర్ధారిస్తారు. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ రక్తపోటు కొద్దిగా పెరుగుతుంటుంది.

ఇప్పుడు అర్థం అయిందా రక్తపోటు (blood presssure) అంటే ఏమిటో? గుండె మన జీవితకాలం పనిచేసే ఒక పంపు అని.

ఆధారం: ఆనంద్

3.00586510264
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు