పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రైలు పట్టాలు

రైలు నడుస్తున్నా, ధ్వని వస్తున్నా, ఆ ధ్వని తీవ్రతను తగ్గించే మార్గాలను అన్వేషించాలి.

oct10రైలు పట్టాల మీద రైలు వెళ్తున్నప్పుడు బోగికి, బోగికి మధ్య ఖాళీ ఉండడం వల్ల విపరీతమైన ధ్వని వస్తుంది. పట్టాకు, పట్టాకు (ఒక వైపున ఉన్న రైలు పట్టాలోనే) అక్కడక్కడా ఖాళీలు ఉంటాయి. ఎందుకంటే మీ కాకినాడకు మా వరంగల్ కు మద్య ఒకే పట్టాను పెట్టలేము కదా. అలా వీలయినా ఎలా మోస్తారు? ఎలా సరఫరా చేస్తారు? ఆ పట్టాపక్కల మద్య కొంత ఖాళీని ఉంచడానికి కారణాల్ని కూడా మీరు పాఠశాల తరగతుల్లో చదువుకొని ఉంటారు. ఋతువుల్ని బట్టి లోహాల పొడవు, వెడల్పు, ఘనపరిమాణాలు మారుతాయి. ఇలా ఉష్ణోగ్రత (temperature) వ్యత్యాసాల వల్ల పట్టా వ్యాకోచించినప్పుడు (expansion) ఖాళీ లేకపోతే పట్టాలు వంగి రైలు ప్రమాదాలు జరిగే దురవకాశం ఉండడం వల్ల పట్టాకు, పట్టాకు మధ్య కొంత ఖాళీని ఉంచుతారు. అలాంటి ఖాళీల మీదుగా బరువైన రైలు చక్రాలు వెళ్లే క్రమంలో మీ బడి గంట మీద సుత్తితో కొట్టినప్పుడు కన్నా ఎక్కువ ధ్యని వస్తుంది.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే వేగంగా వెళ్తున్న బోగీల రైలు పెద్ద రణగోణ ధ్వనిని తనతోపాటు తీసుకెళ్తున్నట్టు అర్థం. ఇది ఎంత భయంకరమైన కర్ణ కఠోరమైన ధ్యని అంటే ఇక రైల్లో ఎవరూ ప్రయాణించలేరు. ఆఖరికి డ్రైవరు కూడా పారిపోవాల్సిందే. మరేం చేయాలి? ధ్వనిని ఆపడం అంటే రైలును పూర్తిగా నడువకుండా ఆపడమే. ఇది మొదటికే మోసం కదా.

కాబట్టి రైలు నడుస్తున్నా, ధ్వని వస్తున్నా, ఆ ధ్వని తీవ్రత (intensity or loudness)ను తగ్గించే మార్గాలను అన్వేషించాలి. అదే పరిష్కారం. ఆ పరిష్కార మార్గమే పట్టాల మద్య కంకర రాళ్లను వేయడం. రైలు ప్రయాణం కలిగించే ధ్వని ఆ రాళ్ళ మీద పడి  ప్రతిధ్వని (echo)ని ఇస్తుంది. అయితే ఆ రాళ్లకు ఒక రూపం, ఒక నిర్దిష్ట స్వరూపం (geometry) లేకపోవడం వల్ల వివిధ దిశల్లో ఆ ధ్వని పరావర్తనం చెందుతుంది. అంతే కాదు రాయికీ, రాయికీ మధ్య గాలి ఖాళీలు (air gaps) ఉండడం వల్ల ఆ ధ్వని వెనువెంటనే అనువాధ తరంగాల్ని వివిధ ప్రావస్థాల్లో (phases) ఏర్పరుచుకుని ఆ ధ్వని శక్తిని భూమిపాలు (dissipation) చేస్తాయి.

కంకర రాళ్లు వేయడంలో మరో ముఖ్య విషయం కూడా ఉంది. ఎన్నోవేల టన్నుల బరువున్న రైలు సరాసరి నేల మీదే ఉన్న పట్టాల మీద నడిస్తే ఆ నేలలో నెర్రెలు (cracks) వచ్చి పదే పదే రైలు మార్గాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. కంకరరాళ్లు రైలు పట్టాలకు, రైలు పట్టాల్ని తమ భుజాలమోస్తున్న స్లీపర్స్ కి మధ్య అతి చేరువలో ఉండడం వల్ల ఇవి కొంతమేరకే సస్పెన్షన్  (suspension) లాగా పని చేసి ఈ నేలపై వత్తిడిని కొంత తగ్గిస్తాయి. పైగా వత్తిడి తీవ్రతను (power)ను తగ్గిస్తాయి. ప్రయాణికులు వదిలే మల మూత్రాలు, వర్షం వల్ల తొందరగా కడిగేసేలా కంకరరాళ్లు ఉపకరిస్తాయి.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

3.00314465409
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు