పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రసాయన మూలకాలు – సంకేతాలు

మూలకాలు వాటి సంకేతాలు గురించి తెలుసుకుందాం.

నేడు మనకు 118 రసాయన మూలకాల ఉనికి తెలుసు. వాటిలో 100 పైగా మూలకాల ధర్మాలు స్పష్టంగా తెలుసు. ఈ మూలకాలన్నీ ఏకకాలంలో కనుగొనబడినవి కావు. కొన్ని ప్రాచీన కాలం నుండి వాడుకలో ఉండగా, మరికొన్ని మానవుని పరిశోధనల వల్ల కనుగొనబడినవి. అన్ని మూలకాలను సూచించడానికి నిర్దిష్టమైన సంకేతాలను వాడుతున్నాయి. వాటి పుట్టుపూర్వోత్తరాలు, ధర్మాలు, లభించే ప్రదేశాలు ఇంకా అనేక అంశాలతో ముడిపడి మూలకాల సంకేతాలున్నాయి. ఈ సంచికలో మనం అతి ప్రాచీనకాలం నుండి మానవునికి పరిచయమున్న కొన్ని మూలకాలు, వాటి సంకేతాలను గురించి చూద్దాం.

ప్రాచీన కాలం నుండి మానవునికి పరిచయమున్న మూలకాలు 9. వాటిలో 7 లోహాలు. 2 అలోహాలు. ఈ ఏడు లోహాలను అద్భుతమైన లోహాలు (Magnificient Seven) గా పరిగణిస్తారు. వాటిని సౌర కుటుంబంలోని గ్రహాలకు ప్రాతినిధ్యాలుగా భావించి సంకేతాలను వాడేవారు. ఈ ఏడు లోహాలను వారంలోని ఏడు రోజులకు ఆపాదించారు కూడా.

ఈ ఏడు లోహాలు కాకుండా కార్బనం మరియ గంధకం లాంటి అలోహాలు ప్రాచీన మానవునికి తెలుసు. మరి వాటి సంకేతాలు ఏమిటో ఆధారాలు లభించలేదు. అటు తర్వాత ఆధునిక రసాయన శాస్త్రపితగా పరిగణించబడుతున్న ఆంటోని లేవోయిజు వికీ (1743-1794) మూలకాలను, వాటి ధర్మాలు ను అధ్యయనం చేయడానికి నిర్దిష్టమైన సంకేతాలు ఉండాలని భావించాడు. అతని సమకాలీకుడయిన జోన్ డాల్టన్ అప్పటివరకు తెలిసిన దాదాపు 30 మూలకాలకు సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నించాడు. తర్వాత అంతర్జాతీయ అవగాహన అవగాహన కోసం. సౌలభ్యం కోసం అర్ధవంతంగా ఉండేందుకు చిత్రరూప సంకేతాల స్ధానే అక్షర రూప సంకేతాలు అవసరమని భావించి సంకేతాలు ఇవ్వడమైనది.

ఆధారం: జి.కె. షామ్ షీర్ ఖాన్, చిత్తూరు.

3.01421800948
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు