పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వచ్చేది వర్షాకాలం

వర్షాకాలంలోనే అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి.

rainవర్షాకాలంలోనే అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయి. వర్షాకాలంలో పడిన వర్షపు నీరు రకరకాల ప్రదేశాల నుండి పోగుపడి కాలువలుగా పారుతాయి. ఈ ప్రదేశాలు మురికి గుంటలు కావచ్చు లేక మలముత్రాలతో కలిసి వుండవచ్చు. కలుషిత నీరు నేల పోరల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు నేల పొరల్లోను గాలిలోను ఉండే ఎన్నో సూక్ష్మజీవులు, బాక్టీరియా వీటిని ఆశించిన వైరస్ లు ఆ నీటిలో కలుస్తాయి.

ఈ వర్షపు నీటిలో లవణాలు, జంతు సంబంధం వ్యర్ధ పదార్ధాలు, పోషక విలువలుండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ లు , కొవ్వు పదార్ధాలు సమృద్దిగా వుంటాయి. పైగా ఆ నీటి ఉష్ణోగ్రత కడా అనువుగా వుండడం వల్ల సూక్ష్మజీవులు తమ సంతతిని తండోపతండాలుగా పెంచుకుంటాయి. నీటిలోని బురదకణాలు ఈ సుక్ష్మజీవులకు అవాసాలుగా ఉపకరిరస్తాయి.

ఇలా వృద్దతంగా పెరిగిన సూక్ష్మజీవులు నీటి లోను నేల మీద గాలిలోను విస్తారంగా తిరుగుతుంటాయి. ఈ నీరు మనం రోజూ వాడే నీటి వనరులలోకి కలవడం వల్ల ఆ నీరూ కలుషితం అవుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నీటిని వాడటం వల్ల ఎన్నో రకాల వ్యాధికారక జీవులు మన శారిరంలోకి చేరి మనను రోగాల పాలు చేస్తాయి.

గాలిలో వున్న బాక్టీరియాలు వైరస్ లు వీటికి తోడై చాలా మందికి వ్యాధులు సోకుతాయి. వ్యాధిగ్రస్తులలోని కొన్ని రోగకారక జీవులకు తమ జీవిత చక్రంలో కొన్ని దశలుంటాయి. ఈ దశలు సమృద్ధిగా లభించటం వల్ల వ్యాధులు ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తాయి. వీటినే అంటువ్యాధులు అంటాం. అందువల్లే వర్షాకాలంలో అంటువ్యాధులు, ఇతర వ్యాధులు ఎక్కువ ప్రబులుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • సాధ్యమైనంత వరకు కలుషిత నీటిని స్నానాలకు వాడకూడదు. ఏమాత్రం త్రాగరాదు.
  • త్రాగే నీటిని బాగా మరగకాచి వడపోసి, చల్లార్చి తాగాలి.
  • జబ్బుచేస్తే వెంటనే డాక్టర్ ద్వారానే చికిత్స చేసుకోవాలి. నాటు వైద్యాలు మంచిది కాదు.
  • కలారా వంటి వ్యాధులు ప్రబలితే అవి ఈ కలుషిత నీటివల్లె తప్పు దేవతలకు కోపం వచ్చి కాదు. అందువల్ల బలులు ఇచ్చి మొక్కులు మొక్కి కాలయాపన చేయకండి.
2.97878787879
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు