పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వరి పంట విశేషాలు

వరి పంట విశేషాలు, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ గురించి తెలుసుకుందాం.

 

dec2ప్రపంచంలోని జనాభాలో ఏభై శాతంకి పైగా తినే ఆహారపు పంట వరి. ఇది ‘పోయేసి' కుటుంబానికి ఏ చెందిన ఏకబీజదళ మొక్క ఆసియాలో 'ఒరైజా సెటైవా'ను పండిస్తే, ఆఫ్రికా దేశంలో 'ఒరైజ గ్లాబరీమా'ను పండిస్తారు. వరిగడ్డిని పలు దేశాలలో పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. మొట్టమొదటగా వరిని 8200 నుంచి 13,500 సంవత్సరాల క్రితం చైనాలోని పర్ల్ రివర్ వాలీలో సాగుచేసిన ఆధారాలున్నాయి. ఆ తర్వాత అది తూర్పు ఆసియా నుంచి, దక్షిణ తూర్పు అటు నుంచి దక్షిణ ఆసియాకు వ్యాప్తి చెందింది. ఐరోపా ఖండంలోకి వరి పడమర ఆసియాకు వచ్చి, ఐరోపా ఖండం నుండి అమెరికా ఖండంకు తీసుకెళ్లబడింది.

మీలో చాలా మంది మీ సొంత ఊరులో వరిసాగు చేస్తుంటారు కదు. పొలాల్లో వరి మొక్కలకు చూసే ఉంటారు కదు. ఇది ఏకవార్షిక మొక్క కాని వరి పంట కోసిన తర్వాత మళ్ళీ మొలకెత్తి ఆ పిలకలతో మరో వరి పంటను తీసుకోవడానికి కూడా వీలవుతుంది. కాని దిగుబడి తగ్గుతుంది. చీడపీడలు ఎక్కువ అవుతాయి. వరి మొక్క దాని రకాన్ని బట్టి 50 సెంటీమీటర్ల నుంచి 1 లేదా 1 ½  మీటర్ల పొడవుగా పెరుగుతాయి. ఆకులు పచ్చగా ఉండి సమాంతర ఈనెల పత్రవిన్యాసం కలిగి ఉంటాయి. దీనికి గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగే

పూలు ఉంటాయి. ఈ పూలు వ్రేలాడే శాఖాయుత పుష్ప విన్యాసంలో అమరి ఉంటాయి. పుష్పవిన్యాసంలో బయటకు వచ్చిన 30 రోజులుకు గింజ పరిపక్వం చెంది ధాన్యపు గింజలుగా మారతాయి. ధాన్యపు గింజలు ఏర్పడిన వరి పంటను నూర్చి, ధాన్యాన్ని బస్తాల్లో సేకరించి, రైతులు ఆ ధాన్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొంటారు. ఆ ధాన్యాన్ని వడ్లమిల్లులో మరపట్టి బియ్యంగా చేస్తారు. ఆ బియ్యమే మార్కెట్లో కొని మనం (వినియోగదారులం) అన్నంగా వండుకొని ముఖ్యమైన ఆహారంగా వాడుకొంటున్నాము.

వరిని మొదట చదునుగా ఉన్న భూముల్లో నేరుగా వెదజల్లి సాగు చేసేవారు. కాని ఆ వెదజల్లి పండించిన పంటలో కలుపు తీవ్రత ఎక్కువ. ఆ కలుపు సమస్యగా మారటం వలన, రైతులు వరిని నాటు పద్ధతిలో సాగు చేయడం మొదలు పెట్టారు. వరినాట్లు వేయడానికి అధికంగా నీరు, మానవ వనరులు అవసరం.

ఆ వనరులు ఇప్పుడు తగ్గటంతో వరి నాటడానికి కూలీ ధర కూడా పెరిగింది. అందుకని, శాస్త్రజ్ఞులు - వరిని వరసల్లో నేరుగా విత్తి అధిక దిగుబడి పొందగల ఏ వంగడాలతో, సాగు పద్ధతులను తయారు చేశారు.ప్రస్తుతం నేరుగా విత్తే వరిలో ఉండే కలుపు సమస్యకై నే కలుపు నిర్మూలన రసాయనాలు కనుగొన్నారు. అవి అందుబాటులో ఉన్నాయి. వాటిని రైతులు || వాడుతున్నారు. తీనితో పాటు చీడ పీడలను నివారించటానికి రసాయనిక మందులు, అధిక దిగుబడికి రసాయనిక ఎరువులు కూడా విరివిగా వాడడం జరుగుతున్నది. ఈ విధమైన పద్దతులను ఉపయోగించి ప్రస్తుతం 20% పైగా సాగు భూములలో వరినే నేరుగా పండిస్తున్నారు. అయినా ఇప్పటికి 75% పైగా భూములలో నాటు పద్ధతిలోనే సాగుచేస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వరి 162.3 మిలియన్ హెక్టారులలో సాగు చేయబడుతోంది. ప్రతి సంవత్సరం 7381 మిలియన్ టన్నుల వరిని రైతులు పండిస్తున్నారు. చైనా, భారతదేశం, ఇండోనేషియా, వియత్నాం , థాయ్లాండ్, బంగ్లాదేశ్, మయన్మార్, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, జపాన్, పాకిస్తాన్, కంబోడియా, అమెరికా, కొరియా, ఈజిప్టు, నేపాల్, నైజీరియా, మడగాస్కర్, శ్రీలంక, లావోస్ దేశాలలో వరిని ఎక్కువగా పండిస్తున్నారు. ఈజిప్టు దేశంలో అత్యధిక వరి దిగుబడి (9,5 టన్నులు ఒక హెక్టారులో) సాధించుతుండగా, ఆస్ట్రేలియా (8.9 టన్నులు ఒక హెక్టారులో) తరువాత స్థానంలో ఉంది. మనదేశంలో 40 మిలియన్ హెక్టారుల నుండి 152.6 మిలియన్ టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. అంటే మనదేశంలో ఒక హెక్టారుకు 3 టన్నులు పండిస్తున్నారు. ఆ దీనిని బట్టి మనదేశంలో హెక్టారు వరి దిగుబడి పెంచేందుకు అవకాశం చాలా ఉందని అర్ధమవుతుంది.

ఈ మధ్యకాలంలో మనకు వాతావరణంలో మార్పులు రావటం చూస్తున్నాం. దానికి కారణం వివిధ వాతావరణ కాలుష్యాలు, పర్యావరణ కాలుష్యాలు కావడమే. వ్యవసాయ పంటలలో వరిసాగు విడుదల చేసే 'మిథేన్' వాయువు వాతావరణంలోకి విడుదలయ్యే మొత్తం 'మిథేన్'లో 11 శాతం. ఇది ఒక హరితగృహ వాయువు. గ్రీన్ హౌస్ వాయువులలో కార్బన్ డై ఆక్సైడ్ కంటే మిథేన్ 20 రెట్లు ఎక్కువ హానికరమయినదని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అందుకని, వరిసాగు నుంచి మిథేన్ విడుదలను తగ్గించే సాగు పద్ధతులను శాస్త్రజ్ఞులు అన్వేషిస్తున్నారు. నేరుగా పొడి నేలలో వరి విత్తి, నేలలోని తేమను వరి పంట పొడుగునా ఉంచుతూ, వరిమడిలో నీరు నిల్వ లేకుండా వరిసాగు చేస్తే మిథేన్ విడుదల తక్కువగా ఉంటుందని కనుగొన్నారు. అందుకే అటువంటి నూతన పద్దతులతో వరి సాగును శాస్త్రజ్ఞులు ప్రోత్సహిస్తున్నారు.

మారుతున్న వాతావరణ పరిస్థితుల మూలంగా, రాబోయే కాలంలో వరి పంట దిగుబడి గణనీయంగా తగ్గబోతోందని అంచనా వేశారు. మారే వాతావరణానికి అనువైన, అధిక దిగుబడి సాధించగల నూతన పద్దతులను, వంగడాలను కనుగొనటానికి వరి శాస్త్రజ్ఞులు దేశ విదేశాలలో కృషి చేస్తున్నారు. పెరిగే జనాభా అవసరాలకు అవసరమైన దిగుబడి కోసం వరిసాగు పద్దతులను రైతులు అవలంబించాలి. రాబోయే కాలానికి సరిపడ నూతన పద్దతులను కూడా రపకల్పన జరిగి ఆ తరువాత రైతులు వాటిని అనుసరించితే తప్పకుండా - వరి దిగుబడి పెరిగి ప్రపంచంలో పేదరిక నిర్మూలనకు సహాయపడుతుంది.

అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ

dec6ప్రపంచంలోని సగం పైగా ప్రజల ఆహారం వరి. మొత్తం వరి దిగుబడిలో 90 శాతం వరిని పండించేది ఆసియా ఖండం. ఈ ఖండంలోని ప్రజలకు 30-75% Calories శక్తిని ఇచ్చేది వరే. అందుకే మన ఖండంలో పెరుగుతున్న జనాభాకి సరిపడ ఆహారం పండించటానికి వీలవుతుందా? అనే సందేహం మొదలయిన 1959 సంవత్సర ప్రాంతంలో ఫోర్లు మరియు రాక్ ఫెల్లర్స్ ఫౌండేషన్లు సంయుక్తంగా ఫిలిప్పైన్స్లో స్థాపించిన స్వతంత్ర లాభపేక్షలేని పరిశోధనా సంస్థే "అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ” (International Rice Research Institute). దీన్నే ఇర్రి IRRI అని సంక్షిప్తంగా పిలుస్తారు. ఫిలిప్పైన్స్ దేశంలోని లాస్ బావ్యోస్ ప్రాంతంలో 'ఇర్రి' ప్రధాన పరిశోధన సంస్థ కార్యాలయాలు వున్నాయి. వరి ఉత్పత్తి, నిర్వహణ, వంపిణీ, వినియోగానికి సంబంధించిన వాటిపై ప్రాథమిక, అనువర్తిత పరిశోధనలు చేయాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ సంస్థ ఈ రోజుకి అనేక కొత్త వంగడాలను ఉత్పిత్తి చేసి పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందజేయటంలో సఫలీకృతమైంది. మొట్టమొదటిసారిగా నవంబర్ 29, 1966 న అధిక దిగుబడినిచ్చే 'ఐఆర్ఎస్' అనే పొట్టి వరి వంగడాన్ని ఇర్రి ప్రపంచానికి అందించింది. హరితవిప్లవానికి కారకమైన దీనినే “అద్భుత వరి” (Miracle Rice)గా వర్ణించారు. ఇప్పటివరకు 843 పైగా వంగడాలను 77 దేశాలలో విడుదల చేసింది.

సెప్టెంబర్ 16, 1959న ఫోర్డ్, రాక్ పెల్లర్ సారథ్యంలో ఫిలిప్పైన్స్ కాబినేట్ అంగీకారంతో మొదలైన ఇర్రీ లో ప్రస్తుతం వెయ్యిమంది ఉద్యోగులు తమవంతు బాధ్యతలను నెరవేరుస్తున్నారు. స్థాపించిన నాటి నుండి ఇప్పటిదాకా 1,30,000 విద్యార్ధులు, శాస్త్రజ్ఞులు, రైతులు, వివిధ దేశాల ఉద్యోగస్తులు, వరి సాగు పరిజ్ఞానంలో శిక్షణ పొందారు. వారిలో నేను కూడా ఒకదానిని అవటం ఓ అదృష్టం. 2014 సంవత్సరపు ‘ఇర్రి' బడ్జెట్టు 199.19 మిలియన్ల డాలర్లు. వివిధ దేశాలు, CGIAR ఉమ్మడి సంస్థ, ప్రైవేటు రంగం, విశ్వవిద్యాలయాలు, ఇలా అనేక సంస్థలు ఇచ్చిన ఈ మొత్తంతో ‘ఇర్రి' పరిశోధనలు చేస్తుంది. దానితో పాటు శిక్షణ కూడా ఇస్తుంది.

ఇర్రి పరిశోధనకు ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే:

  • వరి, వరి ఆధారిత వైవిధ్య పంటల అభివృద్ధితో పేదరిక నిర్మూలన,
  • వాతావరణ మార్పులకు అనుగుణంగా, వాతావరణ సమతుల్యాన్ని రక్షిస్తూ, స్థిరంగా వరి పంట అధిక దిగుబడి సాధించడం.
  • వరిని ఆహారంగా తీసుకునే పేద వినియోగదారుల పోషణ, ఆరోగ్యాలను మెరుగుపరచడం.
  • వరి శాస్త్రవిజ్ఞానాన్ని సమంగా అందరికి అందుబాటులో ఉంచి, భావితరానికి శాస్త్రజ్ఞులను తయారు చేయడం,
  • శాస్త్రజ్ఞులకు, రైతులకు, విశేష జన్యు సంపదను అందుబాటులో ఉంచటం, అత్యాధునికమైన, మెరుగైన శాస్త్రీయ పద్ధతులతో వరి పంట దీగుబడిని పెంచడం.

ఈ వరి పరిశోధనా సంస్థలో అత్యంత అమూల్యమైనది 'వరి జన్యు బ్యాంక్'. దీనినే 'టి.టి. చాంగ్ జెనిటిక్ రిసోర్స్ సెంటర్' అని పిలుస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 1,27,000 రకాల వరి విత్తనాలు సేకరించి, ఇక్కడ జాగ్రత్తగా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి భద్రపరిచారు. ఈ వరి రకాలలో నిక్షిప్తమయిన 'జన్యు విశేషాలు', రాబోయే కాలంలో వచ్చే వాతావరణ, ఇతర మార్పులు, విపరీత పరిస్థితులను తట్టుకొని, పోషక విలువలు అధికంగా కలిగి, చీడ పీడలను తట్టుకోగలిగిన వరి రకాలు తయారు చేయడంలో ఎంతో ఉపయోగ పడతాయనడంలో సందేహం లేదు. ఇది భావితరాలకు ఉపయోగపడే, అందరికీ అందుబాటులో ఉండే 'వరీ జన్యు గుప్తనిధి'. వీటిలోని 83 దేశాలకు చెందిన 3024 వరి రకాలకు 'జన్యు విశ్లేషణ' కూడా చేశారు.

ఇటీవల, విటమిన్ 'ఎ' లోపం వలన కలిగే అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యను అధికమించడానికి 'ఇర్రి' 'బంగారు వరి' (Golden Rice)ని జన్యుమార్పిడి ద్వారా రూపొందించి విడుదల చేసింది. శాస్త్రజ్ఞులు, తదితరులు అవిశ్రాంతంగా, కలుపు, చీడపీడలను అదుపులో ఉంచే మార్గాలు, పోషక పదార్థాల సరియైన ఉపయోగం, నీటిని సమర్థవంతంగా వాడుకోవటంపై ఆధునిక పద్ధతులను కనిపెట్టటానికి నిరంతరం కృషి జరుపుతూ, అహర్నిశలు పాటు పడుతున్నారు. ‘ఇర్రి' కనుగొనబడిన “IR36” మనదేశంలో సాగులోకి తేవడం మనదేశంలో ‘హరిత విప్లవానికి' ఒక ముఖ్యకారణం. మన దేశస్థుడు డా. ఎమ్.ఎస్. స్వామినాథన్ ఇర్రికి డైరెక్టరు జనరల్ గా పనిచేయడం భారతీయులందరికి గర్వకారణం. మీలో మరింతమంది శాస్త్రజ్ఞులయి ‘ఇర్రి'లో పనిచేసి, భవిష్యత్తులో ప్రపంచ ఆహార అవసరాలు తీర్చడంలో పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాము.

ఆధారం: అడుసుమిల్లి నాగమణి

2.9877675841
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు