অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వామన వుక్షాలు లేక మరుగుజ్జు మొక్కలు

వామన వుక్షాలు లేక మరుగుజ్జు మొక్కలు

jan26.jpgఅనంతపురం జిల్లా లోని కదిరి వద్దవున్న మర్రిమాను గురించి చాలామంది వినే ఉంటారు.కొందరు చూసే వుంటారు. చెన్నై దగ్గర అడయార్ లోని మర్రిచెట్టు బుద్ధగయలోని రావి చెట్టు హిమాచల్ ప్రదేశ్లోని పైన్ ఎసర్ వృక్షాల్ని గురించి కూడా వినే వుంటాం. యివి 50-60 అడుగులు మించిన ఎత్తు, కొన్ని కిలోమీటర్లు విస్తిరణం కలిగుంటాయి. అటువంటి మహా వృక్షాల్ని అతి చిన్నవిగా ఊహించండి. ఊహించడమే కాదు వాటిని చిన్నవిగా చెయ్యుచ్చని మన వాళ్లు (మానవులు) ఎప్పుడో కనిపెట్టారు.

jan29.jpgమహావృక్షం పక్కన నిలబడిన మనిషి దిన్ని నా ఎత్తు కంటే తక్కువగా వుండేటట్టు చేస్తే ఎలా వుంటుంది? అనుకొన్నాడు. పురానాల్లోని కనికట్టుతో యిది సాధ్యపడుతుంది గాని మామూలు మనిషికిది విలుకాదేమో. ఎందుకు కాదు? అనే ప్రశ్నతో కొందరు చేసిన ప్రయత్న ఫలితమే మరుగుజ్జు మొక్కు లేక వామవృక్షాలు. మొదట్లో చైనా దేశంలో ప్రకృతి పరంగా (natural mutation) వచ్చిన పొట్టి మొక్కల్ని చూసి మనిషి ప్రేరేపితుడయ్యాడని కూడా అధ్యయన కారులు గుర్తించారు. jan28.jpgవాటి ప్రభావంతోనే మహా వృక్షాన్ని అనగా దాని నుండి వచ్చేమోక్కల్ని మనం ఇష్టపడే ఆకృతిల్లోకి మార్చి మన ఇంటి ఆవరణలో లేక ఇంటి లోపల ఎందుకు పెటుకోకూడదు? అదుగో అందుల్లోంచి వచ్చిందే పెంజింగ్ వాన్ నాన్ బో(వియత్నాం కాబోడియా) ప్రక్రియ. కాలక్రమంలో అదే బోన్సాయి (పళ్ళెం-మొక్క) గా మారింది దాన్నే మనం మినియేచర్ ప్లాంట్ లేక పొట్టి వృక్షంగా అనుకుటున్నాం. ఇంగ్లీష్ డిక్షన రిల్లో bon sai గా యిది మారిపాయింది. అనగా ప్రపంచవ్యపితి కళ లేక సైన్స్ గా యిది మారిపాయింది.

ఈ బోన్సాయి ప్రక్రియ కు 1000-1200 సంవత్సరాల ఈ కల (చెట్లను మరుగుజ్జు అకారంల్లోకి మార్చుట) జపాjan27.jpgన్ దేశస్ధుల వల్ల విశ్వవాపితమైంది. గత 700-800 సంవత్సరాల్లో ఈ బోన్సాయి సైన్స్ అబివృద్ధి చెంది అనేక దేశాల్లో అందర్నీ ఆకర్షించే కళగా మారింది. కళగా మారెందుకు భారత దేశం కూడా తోడ్పడ్డది. ముఖ్యంగా బౌద్ద అరామాల వద్ద యివి వ్యాపించాయి. ఉత్తరప్రదేశ్లోని సారనాధ, బీహార్ లోని గయ వీటికి మూల స్ధానాలుగా ఉండేవి. అయితే వీటి విలువను పట్టించుకొనే తీరిక అవసరం సామన్యులకు కలగలేదు. కాని చైనా జపాన్ అలానే అగ్నేయాశియా దేశప్రజలు దిన్ని పెంపొందించారు. అయితే ఈ మధ్యకాలంలో ఉద్యనశాస్త్ర నిపుణులు, వృక్ష శాస్త్రజ్ఞాలు మొదలుకొని సామాన్య గృహిణుల వరకు ఈ బోన్సాయి కళను ఆదరించిన వాళ్లలో ఉన్నారు. ప్రతి సంవత్సరం బెంగుళూరు, డిల్లీ, కలకత్తా, పూణే, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో బోన్సాయి వృక్షాల ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.తద్వారా ఎందరో ఈ కళపై ఆసక్తి పెంచుకొంటున్నారు. స్ధానికంగా తిరుపతి, గుంటూరు, వరంగల్, రాజమండ్రి, ఏలూరు, విశాఖపట్నం వంటి చోట్ల బోన్సాయి చెట్లు అమ్మకానికి కూడా దొరికే స్ధితి వచ్చింది. jan36.jpgగుంటూరు నగరంలోని వెంకటేశ్వరా బాల కుటిర్ విద్యా ఈ కళలో నిష్టాతురాలుగా పేరుపొందారు. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ పొందారు. అలానే రాజమండ్రి నగరం ప్రక్కన గల కడియం ఉద్యాన నర్సరిల్లో అనేక రకాలైన మురుగుజ్జు మొక్కలు దొరుకుతాయి. వాళ్లు విదేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నారు. బోన్సాయి ప్రదర్శించి చూపరులను ఆకర్షస్తున్నారు. ఐదారు వందల సంవత్సరాల నాటి బోన్సాయి మొక్కల్ని జపాన్ లోని క్యోటోనగరంలో సందర్శకుల దర్శనార్ధం ప్రతి సంవత్సరం ఉంచుతారు.

బోన్సాయి చెయ్యదగ్గ చెట్లు

సామాన్యంగా బోన్సాయి చెట్లను చలిదేశాల్లోనైతే ఆరుబయట పూర్తి వెలుతురులో ఉంచి పెంచుతారు. అయితే మనలాటి ఉష్ణ దేశాల్లో వీటిని నీడల్లో, ఇండ్ల లోపల కూడా పెంచుతున్నారు. ఎక్కువ సందర్బాలలో వృక్ష లేక పొద జాతి మొక్కల్నే బోన్సాయి చేస్తారు. కంచెం గడ్డు పరిస్ధితుల్ని తట్టుకోగాలగిన చేట్లై Hard plants దీనికి పనికోస్తాయి. చలిదేశాల్లో పైన్, ప్లం, చెర్రి, మాపుల్, జునిపెర్ జారియా, క్వీన్స్ ఎలమ్స్ సిడార్, అర్బోర్ వేటే, ఒక్, సైప్రస్, బాక్స్ఉడ్, పైరకాంతా, దానిమ్మ సిట్రస్, వంటి చెట్లను బోన్సాయి చేస్తారు. మన దేశంలో తరచుగా మర్రి, జువ్వి, జుమ్మి, రావి, చింత, వెలగ మారేడు, దానిమ్మ, మామిడి సపోటా, జమ, బత్తాయి, నారింజ బోగన్విల్లా వంటి చెట్లను వామన వృక్షాలుగా మారుస్తునారు. అనగా చిన్న ఆకులు, దగ్గర దగ్గర కణుపులు, ఆకర్షణియమైన కాండపు బెరడు, గుబురుగా ఉండే వెళ్లు. మంచి ఆకృతినిచ్చె రెమ్మలు ఎక్కువ కత్తిరింపుల్ని తట్టుకోగలవాటిని బోన్సాయిగా మార్చడం సులువు. మొదట్లో సూది ఆకులున్న పైన్స్ జాతి మొక్కల్నే బోన్సాయికి వాడేవాళ్ళు. బహువార్షిక మొక్కలు, చెట్లు అనివార్యంగా దీనికి ప్రయోజనకారం.

బోన్సాయి చేసేదేట్లా?

బోన్సాయి చేసేందుకై ఎన్నుకొనే మొక్క దశ చెట్టును ముందుగానే గుర్తించి ప్రత్యేకంగా ఉంచుకోవాలి. దానకి ఆధారంగా నిలిచే వేడల్పాంటి లోతు తక్కువ తొట్టె లేక పళ్ళెంని ఎన్నుకోవాలి. పింగాణి, మట్టి, సిమెంట్ వాటిని ప్రాముఖ్యత నివ్వాలి. రవాణా చేసేందుకైతేనే ప్లాస్టిక్ వాడాలి.

jan30.jpgమొక్కకు సరిపడే స్ధాయిలో పోషకాల్నివ్వగల మట్టి, ఎరువుల్ని సమకూర్చుకోవాలి. వీటికి సరిపడే మోతాదులలో చేక్కముక్కులు, యిసుకల్ని కూడా సమకూర్చుకోవాలి.

మొక్క పెరుగుతున్న క్రమంలో ఆకులు కొమ్మలు, రెమ్మలు, కాండం కత్తిరించేందుకు తగిన కత్తెర సికేచర్ లు సమకూర్చుకోవాలి.

బోన్సాయి చేయ్యాల్సిన కారాన్ని ముందుగానే గుర్తించాలి. అనగా నిటారుగా నియంత్రించబడిన వెడల్పుగానా, నితారుగానా, చీపురు అకారంలోనా, గుబురుగానా, నియంత్రించబడిన వెడల్పుగానా, పక్కకు వంగేటట్టుగానా, చీపురు అకారంలోనా, గుబురుగానా అందేది నిర్ణించుకోవాలి.

ఆకారానికి తగిన ఫ్రేం-ఇనుము రాగి జింక్ తీగను సమకూర్చుకోవాలి.

బోన్సాయి మొక్క కాండం పై అంటు (మొక్క రెమ్మ) కట్టే నేర్పును కూడా (అవసరమైతే) సంతరించుకోవాలి.

బోన్సాయి పెరిగేందుకు అనువైన వెలుతురు, వేడి, తెమల్ని సమకుర్చగల వనర్లను గుర్తించాలి. ఇప్పుడు మనం బోన్సాయి ని తయారుచెయ్యేచ్చు. 4-5 సంవత్సరాల్లో మనం ఆశించే ఆకృతిల్లోకి మొక్క చెట్టును మల్చుకోవచ్చు. అయితే పోషణ నిర్వహణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమించినప్పుడల్లా తొట్టె పళ్లెం మార్చాలి.

చిన్నారులూ! మిలో చాలా మంది మీ మిత్రులకు పుట్టినరోజు కానుకలుగా పుస్తకాల్లో, బట్టలో బొమ్మలో, యిస్తుంటారు. కాని మొక్కల వైపు పర్యావరణ రక్షణ వైపు వారికి ప్రేరణ కలిగించేందుకు చెట్టును మీరు బహుమతిగా యిస్తే ఇలా ఉంటుంది. చెట్లను యివ్వడం సాద్యంకాదు కాబట్టి మినియేచర్ ప్లాంట్ బోన్సాయి ని యిస్తే అది ఎక్కువ రోజులు వారికే స్పూర్తినిస్తూ ఉంటుంది. ఎ ప్రయత్నం చేస్తారు కదూ! బోన్సాయి కళకు నూతనత్వాన్ని శాస్త్రీయతను జోడిస్తారు కదూ!!© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate