অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విక్రమ్ సారాభాయ్

విక్రమ్ సారాభాయ్

vikramsarabhaiజననం : ఆగస్టు 12, 1919

మరణం : డిసెంబర్  31, 1971

జన్మస్థలం : అహ్మదాబాద్ (గుజరాత్)

తల్లిదండ్రులు : అంబాలాల్, సరళాదేవి

విద్యావ్యాసంగం : రిట్రీట్ స్కూల్ (అతడి తల్లిదండ్రులు నడిపిన పాఠశాల) కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం (ఇంగ్లాండ్) సెయింట్ జాన్స్ స్కూల్

అవార్డులు : శాంతిస్వరూప్ భట్నాగర్ మెడల్ (1962), పద్మభూషణ్ (1966), పద్మవిభూషణ్ (మరణాంతరం, 1972)

ఈనాడు 104 ఉపగ్రహాలను ఏకకాలంలో అంతరిక్షంలోకి ప్రయోగించి ప్రపంచం ప్రశంసలనందుకున్న భారత అంతరిక్ష పరిశోధనలకు జనకుడు, ఇసో (1969) స్థాపకుడు విక్రమ్ సారాభాయ్ 12 ఆగస్టు 1919న అహ్మదాబాద్లో అంబలాల్, సరళాదేవి దంపతులకు జన్మించాడు. ఒక సంపన్న కుటుంబంలో అభ్యుదయ భావాలు కలిగిన తల్లిదండ్రులకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో ఒకడు. తల్లిదండ్రులు మాంటిస్సోరీ విద్యా విధానంలో ప్రారంభించిన 'రిట్రీట్’ లోనే అతడి పాఠశాల విద్యకొనసాగింది. అంబాలాల్ ఇంటికి ఎంతో మంది గొప్ప ప్రముఖులు వచ్చిపోతుండేవారు. విశ్వకవి రవీంద్రనాథ్టాగోర్, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి, ప్రముఖ ఉపన్యాసకుడు, సాత్రంత్ర్య పోరాట యోధుడు వి.ఎస్ శ్రీనివాస శాస్త్రి, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీ నాయుడు, విద్యావేత్త సి. ఎస్ ఆండ్రూస్, మౌలానా అబుల్ కలాం అజాద్, సి.వి రామన్ మొదలైనవారితో ముఖాముఖి ముచ్చటించ గలిగిన అవకాశాలు ఆయనకు దక్కాయి.

మెట్రిక్యులేషన్ తర్వాత ఆయన ప్రకృతి (Natural Sciences) చదవాలని 1940 లో ఆయన ఇంగ్లాండ్ బయలుదేరి కేంబ్రిడ్డి విశ్వవిద్యాలయ అనుబంధిత సెయింట్ జాన్స్ స్కూల్లో చేరాడు. అయితే అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945) మొదలైంది. కొంతకాలం తర్వాత, ఆ పరిస్థితుల్లో చదువు కొనసాగించలేక ఆయన తిరిగి భారతదేశం చేరుకుని ఇండియన్ ఇన్స్టిటూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ వద్ద పరిశోధక Soon (Research Scholar) చేరాడు. అక్కడ అతడికి విశ్వ శాస్త్రం (Cosmology) ప్రో ఆసక్తి కల్లింది. విశ్వకిరణాల కిరణాల మీద పరిశోధన చేయాలని సంకల్పించుకుని బెంగళూరులోనే పరికరాలు తయారు చేసుకున్నాడు. బెంగళూరు, పుణే హిమాలయాల్లో వాటిని గూర్చి కొన్ని కొలతలు తీసుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే 1945 లో తిరిగి ఇంగ్లాండు చేరుకుని 1947 లో పి.హెచ్డి. పట్టా పొందాడు.

ఇండియాకు తిరిగివచ్చి భౌతికశాస్త్ర పరిశోధనా (Soporate) (Physical Research Laboratory-PRL) అహ్మదాబాద్లో తల్లిదండ్రులు నడిపిస్తున్న మహాత్మాగాంధీ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అహ్మదాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన నాలుగు గదుల్లో ఏర్పాటు చేశాడు. తర్వాత కాలంలో దీనిని శాస్ర, పారిశ్రామిక పరిశోధనా సంస్థ (Council of Scientific and Industrial Research - CSIR) ప్రభుత్వంలోని అణు శక్తి విభాగం (Department of Atomic Energy – DAE) గుర్తించాయి. విశ్వ కిరణాల (Cosmic Rays) పై వాతావరణ పరిస్థితులు ఏ - ప్రభావం చూపవనీ, సూర్యునిలో జరిగే సార చర్యలే విశ్వ కిరణాలలోని మార్పులకు కారణమవుతాయనీ తేల్చి చెప్పాడు. అంతేకాకుండా గ్రహాంతర భౌతిక శాస్రంలో పరిశోధనలు జరిగే తరుణం ఆసన్నమైందని కూడా భావించాడు.

vikramstatue1957-58 సంవత్సరాన్ని అంతర్జాతీయ భూ భౌతిక సంవత్సరంగా (International Geo-Physical year - IGY) అమెరికా ప్రకటించింది. అదే సమయంలో సోవియెట్ యూనియన్ తన మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుట్నిక్-1 ని ప్రయోగించింది. దానితో భారతదేశం వెంటనే స్ఫూర్తిపొంది విక్రం సారాభాయ్ చైర్మన్గా భారత జాతీయ పరిశోధనా కమిటీని నియమించింది.

భారత అణుశక్తి కార్యక్రమ పితామహుడు హెూమి జహంగీర్ భాభా సహకారంతో విక్రం సారాభాయ్ రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తుంబా (తిరువనంతపురం సమీపంలో) నెలకొల్పాడు. తుంబా మధ్యవృతీయ రాకెట్ ప్రయోగ కేంద్రం (Thumba Equatorial Rocket Launching Station-TERLS) సంక్షిప్తంగా ఈనాడు తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రంగా పిలుసున్నారు. దీన్ని నవంబర్ 21, 1963 లో ప్రారంభించారు. రెండేళ్ళలోపునే ఐక్యరాజ్య అంతర్జాతీయ సదుపాయాలున్న కేంద్రంగా గుర్తించింది.

విక్రం సారాభాయ్ భార్య మృణాళినీ సారాభాయ్ ప్రఖ్యాతిగాంచిన భరతనాట్యం, కథాకళి నృత్యకారిణి. ఆమే కేరళ రాష్ట్రానికి చెందినది. భర్తతో కలిసి ఆమె అహ్మదాబాద్లో దర్పణ్ అకాడమిని నాట్య నాటక శిక్షణ కోసం నెలకొల్పింది. సారాభాయ్ దంపతులకు యిద్దరు పిల్లలు. మల్లిక సారాభాయ్ కూడా ప్రఖ్యాత నాట్యకారిణియే కాకుండా రాజకీయాల్లో యల్. కె. అద్వానీ (భారతీయ జనతా పార్టీకి అప్పటి ప్రధాని అభ్యర్థి) అభ్యర్థిత్వాన్ని గాంధీనగర్ నియోజక వర్గం (గుజరాత్) లో సవాలు చేసి స్వతంత్ర అభ్యర్థిగా 2009 సాధారణ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైంది. మరొక సంతానం కార్తికేయ సారాభాయ్ పర్యావరణ శాస్రవేత్తగా తర్వాతి కాలంలో "పద్మశ్రీ" అవారు స్వీకరించాడు.

విక్రం సారాభాయ్ హోమి జె. భాభా మరణాంతరం మే, 1962 లో అణుశక్తి కమీషన్కి చైర్మన్గా భారత ప్రభుత్వం నియమించింది. సైన్సు ఫలాలు సామాన్యునికి అందాలని కష్టించిన విక్రం సారాభాయ్ నిదురలోనే డిసెంబర్ 31, 1971 లో శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు.

రచయిత: -పైడిముక్కల ఆనంద్ కుమార్, సెల్:9490300459© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate