పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విజ్ఞాన విశేషాలు

విజ్ఞాన విశేషాలు

పంపులు తిరిగిన అడవి

vv1పోలెండ్ దేశంలోని పోమ్రానియా ప్రాంతంలో ఒక దట్టమైన అడవి ఉంది. ఈ అడవి లోతట్టు ప్రాంతంలో చెట్లన్నీ అడుగున వంగిపోయి వుంటాయి. దీనిని క్రూక్డ్ ఫారెస్ట్ అని అంటారు. చెట్లన్నీ ఇలా ఎందుకు వంగిపోయి ఉన్నాయనే దానికి స్పష్టమైన కారణం మాత్రం తెలియడం లేదు.

 

వైర్ లెస్ ఛార్జింగ్

vv3ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, ట్యాబ్ ల వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను మనం బాగానే ఉపయోగించుకుంటున్నాం. కానీ వాటిని ఛార్జింగ్ చేయడమే పెద్ద సమస్య. బ్యాటరీ ఛార్జి అయపోతే మళ్లీ ఛార్జీ చేయాల్సిందే. లేదంటే అది పనిచేయదు. ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని జపాన్ కు చెందిన ఒసియా అనే టెలికాం కంపెనీ కనిపెట్టింది. ఇది కోటా అనే టెక్నాలజీ. ఈ టెక్నీలజీ ద్వారా ఈ గ్యాడ్జెట్లన్నీంటినీ ఒకేసారి రిమోట్ గా 30 అడుగుల దూరం నుంచి కోటా పరికరం నుంచి వచ్చే విద్యుత్ తరంగాలను స్వీకరించి ఛార్జింగ్ చేయవచ్చు. ఇందుకు వైఫై లేదా బ్లూటూత్ ఆంటీనాలు రిసీవర్ లుగా ఉపయోగపడతాయి. ఇక్కడ కోటా పరికరం సెంట్రల్ హబ్ గా అంటే రూటర్ లాగా పనిచేస్తుంది.

విషవృక్షం

vv2ఉత్తర అమెరికా ఖండపు దక్షిణ ప్రాంతం, మధ్య అమెరికా, కరేబియన్ దీవులు, దక్షిణ అమెరికా ఖండపు ఉత్తర ప్రాంతాల్లో మాన్ చినీల్ అనే చెట్టు ఒక విషవృక్షం. ప్రపంచంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన చెట్టు ఎందుకంటే దీని పండును తింటే చావడం ఖాయం. అందుకే ఈ పళ్ళను డెత్ ఆపిల్స్ అన్నాడు. ఆకుపచ్చగా ఉండే ఈ చిన్న సైజు పండ్లను బీచ్ ఆపిల్, విషపు జామ అని కూడా అంటారు. మాన్ చినీల్ చెట్టును మృత్యువృక్షం అని పిలుస్తారు. ఈ చెట్టు తాలూకు అన్ని భాగాలు విషంతో నిండివుంటాయి. ప్రతిభాగం నుంచి తెల్లని, చిక్కని పసరు కారుతుంటుంది. దీనివల్ల ఏ భాగాన్ని తాకినా భరించలేని మంట పుట్టించే దద్దుర్లు వస్తాయి. ఈ పసరు విష ప్రభావం కారణం. అందులో ఉండే ఫ్లోర్బోల్ (porbol) అనే కర్బన్ రసాయనం. ఇది నీటిలో బాగా కరుగుతుంది. అందుచేతనే వర్షం వస్తుంటే, ఈ చెట్టుకింద నిలబడినా, ఆ పసరును కరిగించుకున్న వర్షపు చినుకులు చర్మం మీద పడితే చాలు చర్మాన్ని కాల్చేస్తాయి. అసలు ప్రమాదం ఆ పండును తిన్నప్పుడే వాంతులు, నీళ్ల విరేచనాలు మొదలై మనిషిని చంపుతుంది.

చందమామ ఎలా ఏర్పడిందంటే

v12అరుమగ్రహం (Mars) సైజులో ఉండే ధియా అనే యువగ్రహం అప్పటికే 10 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమిని ముఖాముఖి ఢీకొట్టిందని, ఇలా ఢీకొనడంలో భూమి, ధియా కలిసి ఒకే గ్రహంగా ఎక్రడ్డాయని, అందులోంచి ఒక శకలం విడిపోయి చందమామ ఏర్పడిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిలిస్ (యుసిఎల్ఎ) పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రక్రియ 450 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందని ఇంతకుముందే శాస్త్రజ్ఞులు గుర్తించినా 45 డిగ్రీల కోణంలో మాత్రమే ఢీకొన్నాయని భావించారు. కానీ ఈ రెండు గ్రహాలు ముఖాముఖి ఢీకొన్నాయని యుసిఎల్ఎ శాస్త్రవేత్తల బృందం అధ్యయనంలో తేలింది. మూడుసార్లు చంద్రుడి నుంచి అపోలో మిషన్ ల ద్వారా సేకరించిన రాళ్లను, హవాయి, అరిజోనాలలో లభ్యమైన అగ్నిపర్వత శిలలను శాస్త్రవేత్తలు పరిశోధించారు. ఈ రాళ్లలోని ఆక్సీజన్ అణువుల్లోని రసాయనిక విలువలు సారూప్యత కలిగి ఉన్నాయని వారు చెబుతున్నారు.

PSLV-C31 ప్రయోగం సక్సెస్

vv5స్వదేశీ నావిగేషన్ వ్యవస్థలో భాగంగా ఇస్రో చేపట్టిన ఉపగ్రహాల ప్రయోగంలో ఇదోటి, జనవరి 20 న విజయవంతంగా అంతరిక్షంలో నిర్ణీత కక్ష్యలోకి చేరింది. PSLV-C31 గా వ్యవహరించే ఈ ఉపగ్రహాన్ని  IRNSS-1 రాకెట్ కక్ష్యలో ప్రవేశపెట్టింది. మిగిలిన రెండు ఉపగ్రహాల ప్రయోగం కూడా పూర్తయితే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ వాహన చోదకులకు అందుబాటులోకి వస్తుంది.

 

సౌర వ్యవస్థలో తొమ్మిదో గ్రహం

vv6కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన అంతరిక్ష పరిశోధకులు సైరవ్యవస్థలో ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నట్లు ప్రకటించారు. ఇది భూమికన్నా 10 రేట్లు ఎక్కువ సైజులో కలిగి ఉందని, సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 10,000 నుంచి 20,000 సంవత్సరాలు తీసుకుంటుందని వారు తెలిపారు. నెఫ్యూట్ కక్ష్యకు ఇది కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో తిరుగుతుందని పేర్కొన్నారు.

 

 

టైప్-2 మధుమేహానికి ఔషధం

vv7టైప్-2 మధుమేహ చికిత్సకు ఉపయోగపడే ఆయుర్వేద ఔషధాన్నీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఆండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ రూపొందించింది. టాబ్లెట్ల రూపంలో ఈ ఔషధంను ముందుగా కేరళ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఔషధం పేరు లక్సోలోని నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఆండ్ ఎరోమేటిక్ ప్లాంట్స్ సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో ఈ ఔషధం శ్రేష్టమైందని, సురక్షితమైందని వెల్లడయిందని శాస్త్రజ్ఞులు తెలిపారు.

 

సముద్రపు నాచుతో డయాబెటీస్ క్యాప్యూల్స్

మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం లేకుండానే వ్యాధిని నియంత్రించే సరికొత్త మాత్రలను జపాన్ చెందిన ఒకినావా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ మాత్రలను సముద్రపు నాచుతో లభించే పదార్థాలతో తయారుచేశారు. ఇన్యులిన్ ను ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలను రక్షించడం ద్వారా మధుమేహం (డయాబెటీస్)ను ఈ మాత్రలు నియంత్రిస్తాయి. వీటిలో మధుమేహ బాధితులకు ఇండెక్షన్ ల బెడద తప్పిపోతుందని శాస్త్రజ్ఞులు ఆశాభావం వ్యక్తం చేశారు. టైప్-1 మధుమేహ బాధితుల్లో శరీరానికి అవసరమైనది మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు. అందుచేత కృత్రిమంగా ఇంజక్షన్ ల ద్వారా వారికి ఇన్యులిన్ ను అందించడం అవసరమవుతుంది.

మరో భూమి

vv8వోల్ఫ్ 1061-సి అనే నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఒక గ్రహం జీవులకు నివాసయోగ్యమైనదిగా ఉందని న్యూసౌత్ వేల్స్ కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన సౌర కుండలానికి ఆవల 14 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని భూమికి నాలుగురేట్లు సైజు కలిగుందని వారు చెబుతున్నారు. నివాస యోగ్యమైనవిగా భావిస్తున్న మిగితా గ్రహాలతో పోలిస్తే ఇది సౌప కుటుంబానికి అత్యంత సమీపంలో ఉందని, దీని లక్షణాలు భూమి లక్షణాలకు దగ్గరగా ఉన్నాయని వారి పరిశోధనలో గుర్తించారు.

 

ఇకపై నక్షత్ర శబ్దాలను వినగలం

ఇప్పటివరకు ఆకాశంలో నక్షత్రాలను మనం చూస్తున్నాం, గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని కనుగొన్న నేపథ్యంలో ఇకమీదట నక్షత్రాలను చూడటమే కాకుండా వాటిలో పుట్టే శబ్దాలను వినడం సాధ్య పడుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పాలల్లో కల్తీని కనిపెట్టే క్షీర్ స్కానర్

vv10పాలు సంపూర్ణ ఆహారమని, ఆరోగ్యానికి మంచివని మనకందరికీ తెలుసు. కాని కల్దీపాలు తాగితే ఆరోగ్యం మాటేమోగాని, ఎన్నో రకాల రోగాలకు గురవడం తథ్యం. యూరియా, ఉప్పు, డిటర్జెంట్, లిక్విడ్ సోప్, కాస్టిక్ సోడా, బోరిక్ ఆమ్లం, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ఎన్నో పదార్థాలతో పాలను కల్తీ చేసి విక్రయిస్తుంటారు. ఈ కల్తీని పాల సేకరణ కేంద్రాల వద్దే కనిపెట్టేందుకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR), పిలానీలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CEERI, Pilani)లకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒక సరికొత్త పరికరాన్ని కనిపెట్టారు. చేతిలో ఇమిడిపోయే ఈ పరికరం పేరు 'క్షీర్ స్కానర్'. ఈ స్కానర్ లో పాలు పోయగానే అవి ఏ రకంగా కల్తీ అయ్యాయో స్క్రీన్ పై కనిపిస్తుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూశాస్త్ర శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్థన్ ఈ పరికరాన్ని ఇటీవల విడుదల చేశారు.

టి-సెల్ థెరపీ

vv9బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న రోగులకు ఒక అద్భుతమైన చికిత్స ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించి ఉపశమనం కలిగించడం సాధ్యమని ఫ్రెడ్ హచిమన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్ (సియాటిల్) శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఈ చికిత్స పేరు టి-సెల్ థెరపీ. టి-సెల్స్ అంటే శరీరంలోని రోగ నిరోధక శక్తికి సంబంధించిన తెల్ల రక్తకణాలు. వ్యాప్తి చెందే స్వభావం గల మెటాస్టాటిక్ కణితులపై టి-సెల్స్ ను అస్త్రంగా ప్రయోగించి దాడికి దిగేలా చేయడమే ఈ చికిత్సలో కీలకం.

 

లిగో-ఇండియా ప్రాజెక్ట్ కు కేంద్రం ఆమోదం

గురుత్వాకర్షణ తరంగాలు గురించిన పరిశోధనలకు అత్యంత ఆవశ్యకమైన “లిగో" (లేసర్ ఇంటర్ పెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్టు మనదేశంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాల్టెక్, ఎంఐటి నిర్వహణలో ఉన్న అమెరికాలోని 'లిగో' లాబొరేటరీ సహకారంతో లిగో ఇండియా ప్రాజెక్టును ఏర్పాటు చేస్తారు.

వంచేందుకు వీలున్న అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్

vv11స్మార్ట్ ఫోన్ రంగంలో ఇదో కొత్త టెక్నాలజీ, పూర్తి రంగు, అధిక రిజల్యూషన్ కలిగి ఉన్న ఈ ‘రీప్లెక్స్' స్మార్ట్ ఫోన్ ను కెనడాలోని క్వీన్స్ యూనివర్శిటీ పరిశోధకులు రూపొందించారు. రబ్బర్ లాగా దీన్ని ఎటుకావాలంటే అటు వంచుకోవచ్చునట.

బ్రిడ్గామనైట్

VV12మన భూగోళంలో అత్యధికంగా లభించే ఖనిజం ఒకటి ఉంది. ఇది భూమ్మీద ప్రత్యక్షంగా మనకు కనిపించదు. కానీ భూమిలోపలి పొరల్లో 670 నుంచి 2900 కిలోమీటర్ల మధ్య ప్రాంతంలో విస్తరించి ఉంటుంది. ఇది భూమి మొత్తం ఘన పరిమాణంలో 38 శాతం ఉంది. ఇప్పటిదాకా ఈ ఖనిజానికి ఒక శాస్త్రీయమైన పేరు లేదు. ఏదో వ్యవహారికంగా సిలికేట్పెరోల్ సైట్ అని ప్రస్తావిస్తూ ఉండేవారు. ఇటీవలనే అంటే ఈ ఏడాది జూన్ 2న దీనికి బ్రిడ్గామనైట్ (Bridgmanitc) అనే పేరును ఖాయం చేశారు. 1946లో నోబెల్ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్త పేర్సీ బ్రిడ్జ్మన్ గౌరవార్థం ఈ పేరు పెట్టారు. ఈ ఖనిజం భూగర్భంలో విస్తరించి ఉందని తెలిసినా దాని నమూనాను సేకరించి రసాయన సంఘటనాన్ని, లక్షణాలను పూర్తిగా నిర్ధారించలేకపోవడంలో ఖచ్చితమైన పేరు పెట్టడం వీలు కాలేదు. ఇటీవల లాసమేగాస్ (నెవెడా రాష్ట్రం)లోని యూనివర్సిటీ ఆఫ్ నెవెడాకు చెందిన శాస్త్రవేత్త ఆలివర్ పానర్ ఈ ఖనిజం లక్షణాలకు సంబంధించి చాలా ఏళ్ళు పరిశోధనలు జరిపి అది అధిక సాంద్రత ఉన్న మెగ్నీషియం సిలికేట్ (MgSiO3)తో నిండి ఉందని గుర్తించారు.

సాలెపురుగు జీన్స్ చో హైబ్రిడ్ సిల్క్

VV13జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా సాలెపురుగు, పట్టుపురుగుల జన్యువుల (జీన్స్)ను ఉపయోగించి ఎక్కువ నిరోధకశక్తి కలిగిన సిల్‌ను జపాన్ లోని షిన్షూ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు తయారు చేశారు. దీనిపేరు స్పైడర్ సిల్క్ ఇది మామూలు సిల్క్ కంటే ఎక్కువ దృఢంగాను, మృదువుగాను ఉంటుంది. ఈ సీలొను ఉపయోగించి ఎన్నో రకాల సాక్స్ ను తయారు చేశారు. అంతేకాదు, శస్త్ర చికిత్సకు అవసరమైన దారాలు, కృత్రిమ రక్తనాళాలు ఇలా ఎన్నో రకాలుగా కూడా దీన్ని ఉపయోగించవచ్చునని శాస్త్రజ్ఞులు తెలిపారు.

 

సిట్రస్ జ్యూస్ లో ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువేనట

VV14నిమ్మ, నారింజ, దబ్బ వంటి సిట్రస్ రకానికి చెందిన పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివని మనందరికి తెలుసు. ఎందుకంటే వీటిలో ఆంటీఆక్సిడెంట్లు (Ant Oxidants) ఉంటాయి. కాని ఇటీవల స్పెయిన్ లోని గ్రనడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోన్ ఆంజెల్  రుఫియాన్  హెనారెస్ ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఈయన సిట్రస్ పండ్ల రసాల (Juice) మీద పరిశోధనలు చేసి, వాటిలో ఉన్న ఆంటిఆక్సీడెంట్లను నిర్ణయించాడు. ఈయన కనుగొన్నదేమంటే, ఈ రసాల్లో ఇప్పటిదాకా అందరూ  అనుకున్న దానికంటే పదిరేట్లు ఎక్కువగా ఆంటీఆక్సీడెంట్లు ఉన్నాయని, ఈ రసాలను సేవించడం వల్ల వాటిలోని ఆంటిఆక్సీడెంట్లు మన శరీరంలోని హానికరమైన స్వేచ్ఛా ప్రాతీపదికలను (Free Radicals) తగ్గించి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఆంటిఆక్సీజెంట్లను ఇప్పటిదాకా ఉపయోగిస్తున్న పద్ధతులకన్నా మెరుగైన పద్ధతులను హెనారెస్ కనుగొన్నాడు.

ఇస్రో ఖాతాలో మరో విజయం

142014 డిసెంబర్ 7 ఆదివారం నాడు జీశాట్ - 16 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) విజయవంతంగా ప్రయెాగించింది. ఫ్రెంచి గయానాలోని కౌరు కేంద్రం నుంచి ఏరియేస్ - 5 రాకెట్ ద్వారా జీశాట్ ఉపగ్రహం నిర్దేశత కక్ష్యలోకి ప్రవేశ పెట్టబడింద్. దీని బరువు 3181 కిలోలు. ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం.  దీనివల్ల టెలిఫోన్, టెలివిజన్, విశాట్ (VSAT) సేవలను అందించే ట్రాన్స్ పాండర్ల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా మరింత మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్ధ ఏర్పడుతుంది. ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు తన సేవలనందిస్తుంది.

 

భూమ్మీద నీరు తోక చుక్కల నుంచి రాలేదట

VV16భూమి మీద వున్న నీటిలో అధిక భాగం తోక చుక్కల నుంచి వచ్చిందేనని ఇప్పటిదాకా ఒక సిద్ధాంతాన్ని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. కొన్ని బిలియన్ సంవత్సరాల కిందట తోక చుక్కలు (Comets) భూమిని ఢీకొట్టడం వల్ల వాటి నుంచి నీరు భూమికి చేరిందని ఈ సిద్ధాంతం చెబుతుంది. కాని ఈ సిద్ధాంతం తప్పు అని శాస్త్రజ్ఞులు ఇటీవల కనుగొన్నారు. 2014 నవంబర్ లో 67P తోక చుక్క మీద దిగిన రోజెట్టామిషన్ నుంచి సేకరించిన ఫలితాల ప్రకారం ఈ తోక చుక్క మీద ఉన్న నీరు భూమి మీదున్న నీటికన్నా ఉందని తెలిసింది. సైన్స్ జర్నల్‌లో శాస్త్రజ్ఞులు వెల్లడించిన ఫలితాల ప్రకరం భూమి మీద నీరు తోక చుక్కల నుంచి కాకుండా గ్రహశకలాల (asteriods) నుండి వచ్చింది.  రోజెట్టా ప్రోబ్ గత ఆగస్టు నుంచి 67P తోక చుక్క చుట్టూ పరిభ్రమిస్తుండగా, దాని తాలూకు లాండర్ ఫిలే నవంబర్ 12న తోక చుక్కపై దిగింది. దీని రోబోలో బ్యాటరీ ఖర్చయిపోయినా ఎంతో విలువైనా శాస్త్రీయ సమాచారాన్ని సేకరించి రోజెట్టా మాతృనౌకకు పంపింతగా, అది ఆ సమాచారాన్ని విశ్లేషించింది.

జపానియుల సగటు జీవితకాలం అత్యధికంగా ఎందుకుంది?

ప్రపంచంలోనే మనిషి సగటు జీవితకాలం అత్యధికంగా ఉన్న దేశం జపాన్. జపానీయుల ఆయుర్దాయం మిగతా దేశాల్లో కన్నా ఎందుకు ఎక్కువగా ఉంది? వారి ఆరోగ్య రహస్యం ఏమిటి? ఇందుకు ఇటీవల జవాబు దొరికింది. జపాన్ కు చెందిన గ్లోబల్ హెల్త్ అండ్ మెడిసిన్ సంస్థకు చెందిన పరిశోధకులు ఈ విషయంపై ఎంతో అధ్యయనం జరిపారు. 2000 సంవత్సరంలో జపాన్ ప్రభుత్వం ప్రజల ఆహారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిందని అప్పటినుంచి ఆ సూచనలు పాటించిన ప్రజల్లో హృద్యోగం, పక్షవాతం వంటి అనేక జబ్బులు దరిచేరవని, ఈ కారణం చేత మరణాలు బాగా తగ్గి జీవితకాలం బాగా పెరిగిందని తమ అధ్యయనంలో వెల్లడయినట్లు వారు తెలిపారు. తిండిగింజలు, కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలు, కోడిగ్రుడ్లు, సోయా ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, అల్కహాల్ పానీయాలతో కూడిన సమతుల ఆహారం ప్రధానంగా హృద్యోగం వంటి రోగాల నుంచి రిస్క్ లేకుండా కాపాడుతోందని అధ్యయనంలో వెల్లడయింది.

ఇటలీలోని ఒక పట్టణంలో నిండు నూరేళ్ళు జీవిస్తున్న జనం

ఏమిటి కారణం? దక్షిణ ఇటలీలోని పశ్చిమకోస్తాలో అకియరోలి ఒక చిన్న పట్టణం. జనాభా 2000, వీరిలో సూరేళ్ళు పైగా వయసున్నవారు 300 కన్నా ఎక్కువే. ఇది సాధారణ విషయం కాదు గదా. మరి వీరి గుట్టు ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కడైనా వందేళ్ళు పైబడినవారు 0.2 శాతం మించి ఉండరు. అంటే వేయి మందితో ఇద్దరుంటే గొప్పే. మరి అకియరోలి విషయంలో ఏ ప్రత్యేకత ఉందో కనుక్కోడానికి శాండిగోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉండొచ్చునంటున్నారు. వారి జీన్స్, ప్రత్యేకమైన జీవన విధానం అంటే ఆహారపు అలవాట్లు, వ్యాయామం ఇలా ఏవైనా కావచ్చునంటున్నారు. ఏమైనా ఇది చాలా ఆసక్తి కలిగించే విషయమే కదా.

మందులకు లొంగని క్షయ పసుపుకు లొంగుతుందట

పసుపును ఏనాటి నుంచో వాడుతున్నారు. పసుపుకు అద్భుతమైన ఔషద గుణాలున్నాయని మన పూర్వీకులకు తెలుసు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కేన్సర్ గుణాలున్నాయి. అందుకే మనం తినే ఆహార పదార్థాల్లో పసుపువాడుతుంటారు. డెన్వర్ లోని యూనివర్సిటీ ఆఫ్ కొలరెడో పరిశోధకులు మరో కొత్త విషయాలను కనుగొన్నారు. అదేమిటంటే, పసుపులో కురిక్యుమిన్ అనే ఒక పదార్థం ఉందని దీనివల్ల మందులకు లొంగని క్షయవ్యాధి కూడా నయమవుతుందని. -

పశ్చిమ కనుమల్లో అరుదైన కప్పలు

ఒక అరుదైన జాతికి చెందిన కప్ప పిల్లల్ని పరిశోధకులు పశ్చిమ కనుమల్లో కనుగొన్నారు. ఈ జాతి కప్పపిల్లలు చేపపిల్లల్లా కన్పిస్తాయి. ఇవి ఇసుకలో బొరియలు తవ్వుకుని చీకట్లో జీవిస్తాయి. పూర్తిగా ఎదిగేంతవరకు ఇవి ఇదే రకంగా జీవిస్తాయని, వీటి శరీర నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కప్పలు ఇండియన్ డాన్సింగ్ ఫ్రాగ్ కుటుంబానికి చెందినవి.

చందమామపై ఒక ఊరును నిర్మిస్తాం అంటున్న ఇ.యస్.ఎ

వ్యోమగాములు 2030 నాటికి చందమామపైనే నివాసముంటారా? అవుననే అంటున్నారు నెదర్లాండ్స్ లోని యూరోపియన్ స్పేస్ రిసెర్చ్ ఆండ్ టెక్నాలజీ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు. 3డి ప్రింటర్ ల సాయంతో రాబోయే అయిదేళ్ళలో చందమామ మీద గ్రామాల నిర్మాణం ప్రారంభిస్తామని ఈ గ్రామాలు వ్యామగాముల నివాసానికి వీలుగా ఉంటాయని చెప్పారు. వీటివల్ల అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం (ISS) అవసరం ఉండదు. భవిష్యత్తులో మనుషులు వీటిలో స్థిరనివాసం ఏర్పరుచుకొని అంతరిక్షానికి సంబంధించిన అధ్యయనాలు, ప్రయోగాలు చేసే వీలుకలుగుతుంది. సౌరవ్యవస్థకు సంబంధించి అంగారకుడు లక్ష్యంగా ఎన్నో పరిశోధనలకు ఇవి స్థావరాలుగా ఉపయోగపడతాయి.

IRNSS-IG ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

ఏప్రిల్ 28, మధ్యాహ్నం 12:50 గం. లకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుండి PSLV-C33 వాహక నౌక ద్వారా ‘భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ’ (IRNSS-IG) ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా ప్రయోగించింది. ఈ వ్యవస్థకు ప్రధాని మోడి ‘నావిగేషన్ విత్ ఇండియన్ కన్సల్టేషన్’ (నావిక్) అనే పేరు పెట్టాడు. ఇది GPS కన్నా మరింత మెరుగౌనరీతిలో పని చేస్తుంది. ‘వాతావరణ అధ్యయనంలో, స్వేయింగ్, మ్యాపింగ్ చేయడానికి, నావిగేషన్ లో, వాహనాల గమనాన్ని పరిశీలించుటకు’ నావిక్ ఉపయోగపడుతుంది.

గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు ఇస్రో పరికరం

vv17గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చేసే సమయంలో రక్త ప్రసరణకు వీలు కల్పించే పరికరాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇందుకు పూర్తిగా మనదేశంలోని టెక్నాలజీనే ఉపయోగించారు. టైటానియం లోహంతో తయారైన ఈ పరికరం బరువు 100 గ్రాములు. దీని ఖరీదు షుమారు లక్షా 25 వేల రూపాయలు. ప్రస్తుతం ఇలాంటి పరికరాలను ఇతర దేశాల నుంచి చాలా ఎక్కువ ఖర్చుతో దిగుమతి చేసుకుంటున్నాము. ఈ పరికరం నిమిషానికి 3 నుంచి 5 లీటర్ల రకాన్ని ప్రసరణ చేస్తుందట. రాకెట్ సాంకేతికం లేదా ఉపగ్రహ సాంకేతికం మనుషులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ ఆవిష్కరణ మనకు తెలియజేస్తుంది.

 

అత్యంత వేడి మార్చి నెలగా నమోదైన “2016 మార్చి”

vv18అమెరికాలోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ ఆడ్మినిస్ట్రేషన్ (NOAA) సంస్థ 1880 నుండి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదు చేస్తోంది. రికార్డులు తిరగేస్తే గత 137 సంవత్సరాల్లో ఏ మార్చి నెలలోనూ… ఈ ఏడాది మార్చిలో నమోదైనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కాలేదనీ… ఇది అత్యంత వేడి మార్చి నెలగా నమోదయిందని NOAA తెలిపింది.

 

 

అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్

100 సంవత్సరాల క్రిందట ఐన్‌స్టీన్ ఊహించిన గురుత్వాకర్షణ తరంగాలను ప్రత్యక్ష నిదర్శనాలను కనుగొన్నట్లుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో శాస్త్రవేత్తలు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను కలిగించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ, శాస్త్రవేత్తలు ఈ విషయంలో మరింత ముందుకు పోవాలని నిర్ణయించారు. 2029 నాటికి అంతరిక్షం నుంచి పనిచేసే పరిశోధనశాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టాలనుకుంటున్నారు. అప్పుడే, అక్కడి నుంచి గురుత్వాకర్షణ తరంగాలను వాటి జనకస్థానం నుంచి చాలా దగ్గరగా గుర్తించడం సాధ్యపడుతుందంటున్నారు. ఈ మిషన్ కు సుమారు 1.3 బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది. ఇందుకు యూరోపియన్ స్పేస్ ఏజన్సీ ఏర్పాటుచేసిన గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ టీమ్ “గోట్' సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

సముద్రాల్లోని కాలుష్యాలను పీల్చివేయగల 'నానోబోలు’

సముద్ర జలాల కాలుష్యం నానాటికీ పెరిగిపోతూ ఆందోళన కల్గిస్తోన్న విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ పరికరాలను తయారుచేసే పరిశ్రమల్లో వేర్వేరు దశల్లో కాలుష్యాలు విడుదలై చివరకు సముద్రాల్లో కలుసునాయి. అదేవిధంగా 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువై పోతాయని ఒక అంచనా. ఇంతే కాకుండా లెడ్, మెర్క్యురీ, ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం వంటి విష స్వభావం గల లోహవ్యరాలు కూడా పెరిగిపోయి సముద్రాల్లో జీవసమతుల్యం దెబ్బతింటుందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆహారం కోసం సముద్రంమీద ఆధారపడే ఏ జంతువైనా మనగలగడం అసాధ్యమవుతుంది. మనుషులకు కూడా ఇదొక గడు సమస్యే.

ఈ విషయంలో కొంత పరిష్కారం చూపిస్తూ అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఒక లక ఆవిష్కరించింది కాదు సపించిన 'నానోటోలు' కేవలం ఒక గంటలోనే సముద్రజలాల్లోని భాగలోని పిల్చివేస్తుందట. నానోట్లో ఉపరితంమీద గ్రాఫీన్ ఆక్సైడ్ పూత ఉంటుంది. ఇది లేడితో సహా ఇతర భారలోహాలను బల్చివేస్తుంది. లోపలివెపన షాటినం పూత ఉంటుంది. ఇది ఇంజన్‌లా పనిచేసి, హెడోలక్ పెరాE చర్య ద్వారా నానోటోను ముందుకు నడిపిస్తుంది.

సముద్రం మీద తేలుతూ సౌర విద్యుదుత్పాదన చేసే సోలార్ పానెల్

vv19మన భూమి ఉపరితలంలో 70 శాతం పైగా నీటిలో కప్పబడి ఉందని మనకు తెలుసు. ఇంతటి విశాలమైన ప్రదేశాన్ని పునరుద్ధరించబడే శక్తిని (renewable energy) ఉత్పాదన చేసేందుకు ఉపయోగించుకునే మార్గాలను శాస్త్రవేత్తలు చాలా కాలంగా అన్వేషిస్తున్నారు. సరస్సులు, రిజర్వాయర్లలో తేలుతూ వుండే సోలార్ పానెల్స్ ను మనం చూస్తున్నాం. కాని సముద్రంలో ప్రమాదకరంగా ఎగిసిపడే అలలను తట్టుకుంటూ సౌరవిద్యుతను ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రియాకు చెందిన పరిశోధకులు ఒక మార్గాన్ని కనిపెట్టారు. వీరు రూపొందించిన ఒక భారీ చార్జి సోలార్ పానెల్స్ ను మోస్తూ, సముద్రం అలలను తట్టుకుంటూ స్థిమితంగా సౌర విద్యుదుత్పాదనకు వీలు కల్పిస్తుంది. దాదాపు 100 మీటర్ల పొడవుతో ఒక ఫుట్ బాల్ ఫీల్డ్ పరిమాణంలో ఉండే ఈ చార్జిని హెలీఫ్లోట్ అంటారు. ఈ హెలీఫ్లోట్ అడుగున ఉండే సిలిండర్లలో గాలి బంధింపబడి ఉంటుంది. సముద్ర కెరటాలకు ఈ గాలి షాక్ అబార్బర్గా పనిచేసి సోలార్ పానెల్స్ స్థిరంగా ఉంటూ విద్యుదుత్పాదన చేస్తాయి.

2017, జనవరి 1 నుంచి అన్ని మొబైల్ ఫోన్లలో ‘పానిక్ బటన్’

vv20వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మనదేశంలో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్లలో 'పానికబటన్' తప్పనిసరిగా ఉండాలని టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఇంతేకాకుండా 2018 జనవరి 1 నుంచి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (GPS) కూడా సెల్ ఫోన్లలో ఉండాలని కూడా స్పష్టం చేసింది. ఆపదలో చిక్కుకున్నప్పుడు సెల్ ఫోన్లోని పానిక్ బటన్ ను నొక్కినప్పుడు, భద్రతా విభాగాల నుంచి తక్షణ సహాయం అందేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారికి భద్రత కల్పించేందుకు ఈ 'పానిక్ బటన్' సదుపాయం ఉపయోగపడుతుంది. మానవ జీవితాలను మరింత మెరుగుపరిచేందుకు, ముఖ్యంగా మహిళల భద్రతను పెంచేందుకు టెక్నాలజీ ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో, ఈ ఆదేశాలను జారీ చేసినట్లు కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన థర్మామీటర్

vv21డి.ఎన్.ఏ. నిర్మాణాలను ఉపయోగించుకుని శాస్త్రజ్ఞులు ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన థర్మోమీటర్ కు రూపకల్పన చేశారు. ఇది తలవెంట్రుక కన్నా 20 వేల రెట్లు చిన్నదిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలకు అనుగుణంగా డి.ఎన్,ఏ. నిర్మాణాలు ముడతలు పడడం విప్పుకోవడం జరగడం మీద ఆధారపడి ఈ థర్మామీటర్ పనిచేస్తుంది. నానో ప్రమాణంలో ఉష్ణోగ్రతను నిర్ణయించేందుకు అవకాశం కల్పిస్తూ నానో టెక్నాలజీ గుర్తించిన అవగాహన మరింత పెంచేందుకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుందని కెనడాలోని మాంట్రియల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలియజేశారు.

 

వేగంగా విస్తరిస్తున్న విశ్వం

vv22మహావిశ్వం అనుకున్న దానికన్నా 5 నుంచి 9 శాతం ఎక్కువ వేగంగా విస్తరిస్తున్నదని ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ సాయంతో వారు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ విశ్వంలో కృష్ణశక్తి (dark energy), కృష్ణ పదార్థం (dark matter), కృష్ణ రేడియోధార్మికత (dark radiation) 95 శాతం భాగంగా ఉంటూ ఎటువంటి కాంతిని ఉద్గారించవు, వీటికి సంబంధించి ఎన్నో విషయాలు అంతుచిక్కకుండా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకునేందుకు ఈ కొత్త పరిశోధన దోహదపడుతుందని శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన నోబెల్ బహుమతి గ్రహీత ఆడమ్ రీస్ తెలిపారు. విశ్వం విస్తరణ వేగాన్ని నిర్ధారించేందుకు ఇప్పటివరకు ఉపయోగించిన పద్ధతుల్లో అనిశ్చితత్వం (uncertainity) ఎక్కువ. కాని ఈ అనిశ్చితిని కేవలం 2.4 శాతానికి తగ్గించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. సుదూర గెలాక్సీల దూరాలను కొలిచే విధానాలను - గణనీయంగా మెరుగుపరచడంతో అది సాధ్యపడింది. మొదటగా 19 గెలాక్సీలోని 2400 సెపెయిడ్ నక్షత్రాలు, సుదూర గెలాక్సీల్లోని 3000 1A సూపర్గోవాల దూరాలను ఖచ్చితంగా కొలిచారు. ఈ విలువలను ఉపయోగించి విశ్వం విస్తరణ వేగాన్ని లేదా హబుల్ స్థిరాంకాన్ని లెక్కకట్టారు. దీని విలువ 73.2 కి.మీ./సెకన్/మెగాపార్సెక్ గా నిర్ధారించారు. మెగాపార్ సెక్ 3.26 మిలియన్ కాంతి సంవత్సరాలకు సమానం. దీన్ని బట్టి చూస్తే మరో 980 కోట్ల సంవత్సరాల్లో ఖగోళ వస్తువుల మధ్య దూరం రెట్టింపవుతుంది.

అరుదైన ఐన్స్టిన్ వలయం గుర్తింపు

vv23ఖగోళశాస్త్రంలో ఒక అరుదైన విషయం ఐన్ స్టీన్ వలయం. ఒక గెలాక్సీ లేదా నక్షత్రం నుంచి వస్తున్న కాంతి అత్యంత భారీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు (వేరొక గెలాక్సీ లేదా కృష్ణబిలం) యొక్క గురుత్వ క్షేత్ర ప్రభావం వల్ల వంగి ఒక వలయాకారంలోకి విరూపణ చెందడాన్ని ఐన్‌స్టీన్ వలయం (Einstein ring) అంటారు. మొట్టమొదటిసారిగా 1998లో మాంచెస్టర్ యూనివర్సిటీ, నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ సంయుక్తంగా ఐన్‌స్టీన్ వలయాన్ని కనుగొన్నారు.

ఇటీవల మరో ఐన్‌స్టీన్ వలయాన్ని శాస్త్రవేత్తలు అంతరిక్షంలో గుర్తించారు. ఇది భూమికి 1000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక గెలాక్సీ ద్వారా రూపొందిందని, ఈ గెలాక్సీ మరో భారీ గెలాక్సీ వెనక దాగి ఉందని భావిస్తున్నారు. క్యానరీదీవుల్లోని 'ఇనిస్టిట్యూట్ డి ఆస్ట్రోపిజికా డి క్యానరియాసి'కు చెందిన మార్గరీటా బెటినెల్ల దీనిని గుర్తించారు. ఒక డ్వార్ఫ్ గెలాక్సీకి సంబంధించి డార్క్ ఎనర్జీ కెమెరా ద్వారా గ్రహించిన సమాచారాన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఆమెకు యాదృచ్ఛికంగా ఈ ఐన్‌స్టీన్ వలయం కన్పించింది. దీనిమీద ఇతర పరిశోధకులు కూడా దృష్టిసారించి ఆ వలయం భౌతిక లక్షణాలను పరిశీలించారు. దీనికి "క్యానరియాస్ ఐన్‌స్టీన్ వలయం" అని పేరు పెట్టారు.

చాలా దూరంలో ఉన్న గెలాక్సీ యొక్క విరూపణ ప్రతిబింబమే ఐన్‌స్టీన్ వలయం. ఈ గెలాక్సీని “జనకస్తానం" అని, దీని నుంచి వచ్చే కాంతికిరణాలు వంగేందుకు కారణమైన వేరొక అతిభారీ గెలాక్సీని “కటకం" అని అంటారు. జనకస్థానం, కటకం, పరిశీలకుడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు ఈ వలయం కన్పిస్తుంది. ఐన్‌స్టీన్ సాధారణ సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా ఐన్‌స్టీన్ వలయాలను శాస్త్రవేత్తలు అంచనావేస్తారు.

కాంతిని వంచడం ద్వారా మందగమనం

ఈ మహావిశ్వంలో ఎక్కడైనా శూన్యంలో కాంతివేగం ఒక స్థిరాంకమని భౌతికశాస్త్ర నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీని విలువ 299,792458 మీ/సె. కాని కాంతిని స్పర్శించడం లేదా ఆటంకపరచడం కాకుండా కేవలం కాంతి కిరణాలను వంచడం ద్వారా నెమ్మదిగా కదిలేలా చేయవచ్చునని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే ఒక కాంతిపుంజం శూన్యంలోనే ఒకచోటి నుంచి మరోచోటికి చేరేందుకు ఎక్కువకాలం పడుతుందన్నమాట. ఈ కొత్త నైపుణ్యం భవిష్యత్ తరం ఆప్టికల్ కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలకు అద్భుతంగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

కాంతి, నీరులాంటి సాంద్రతర యానకం గుండా ప్రయాణించినప్పుడు దాని వేగం తగ్గుతుందని మనకు తెలుసు. కాని ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ శాస్త్రజ్ఞులు కాంతిని మెలికలు తిప్పడం ద్వారా శూన్యంలోనూ దాన్ని నెమ్మది పరచవచ్చునని కనుగొన్నారు.

నొప్పిని గ్రహించే రోబో

vv24మరమనుషులు అంటే రోబోలు. ఇవి మనలాగే నడుస్తాయి, మాట్లాడతాయి. కాని మనకుండే మరో లక్షణం అంటే స్పర్శజ్ఞానం ద్వారా బాధను లేదా నొప్పిని గుర్తించడం వాటికి తెలియదు. మనమైతే కాలిలో ముల్లుగుచ్చుకున్నా, దెబ్బతగిలినా వెంటనే ఆ నొప్పిని, నిప్పును తాకినా కలిగే బాధను గుర్తించగలుగుతాం, తగినవిధంగా స్పందిస్తాం. అయితే, రోబోలకు కూడా ఈ రకమైన జ్ఞానాన్ని నేర్పేందుకు శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. ఈ టెక్నాలజీ అభివృద్ధి పరిస్తే రోబోలతో పనిచేసే మనుషులకు వాటి నుంచి భద్రత ఉంటుందని అంటున్నారు జర్మనీలోని వీచిన్జ్ యూనివర్సిటీకి చెందిన జానేస్ క్యూన్.

అసలు నొప్పి అనే వ్యవస్థ మనల్ని కాపాడుతుందని ఆ నొప్పి లేదా బాధకు కారణమైన స్థానం నుంచి తప్పించుకోవడం ద్వారా దెబ్బతగలకుండా తప్పించుకోగలుగుతున్నామనేది మనకు తెలిసిందే. ఈ దృష్టితోనే రోబోలకు నొప్పిని గుర్తించే జ్ఞానాన్ని అందించేలా కృత్రిమ రోబో నాడీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని జానెన్ క్యూన్ తెలియచేశారు.

ముగ్గురు సూర్యులున్న గ్రహం

vv25ఇజాక్ ఆసిమోవ్ తన సుప్రసిద్ధ నవల 'నైట్ ఫాల్లో ఆర్గురు సూర్యులున్న ఒక ప్రపంచాన్ని మరో వైపు రాత్రి. ఒక రోజులో మూడుసార్లు సూర్యాస్తమయం ఉంటుంది. ఒక దశలో ఒక వర్ణించారు. అదొక కల్పన మాత్రమే. కాని ఇప్పుడు వాస్తవంగా ముగ్గురు సూర్యులున్న ఒక గ్రహాన్ని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నేతృత్వంలోని ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. చిలీలోని అతి పెద్ద టెలిస్కోప్ సహాయంతో వారు డైరెక్ట్ ఇమేజింగ్ టెక్నిక్ ను ఉపయోగించి ఆధునిక ఖగోళశాస్త్రంలోనే ఒక గొప్ప పరిశీలన ద్వారా ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ గ్రహం పేరు HD131399Ab. ఈ గ్రహం భూమికి 320 కాంతి సంవత్సరాల దూరంలో 'సెంటారిస్' నక్షత్రకూటమిలో ఉంది. మన సూర్యుడికి అతి దగ్గరలో ఉన్న ప్రాక్సిమా సెంటారి నక్షత్రం ఈ కూటమీలోదే. ఈ గ్రహం కక్ష్యలో ఒకసారి తిరిగేందుకు పట్టేకాలం 550 సంవత్సరాలు. ఈ గ్రహానికి ఒకవైపు పగలైతే సూర్యుని అస్తమయం మరో సూర్యుని ఉదయంతో ఏకీభవిస్తుంది. ఈ గ్రహం వయస్సు 16 మిలియన్ సంవత్సరాలు.

కనుమరుగు కానున్న మెర్క్యురీ థర్మోమీటర్లు

vv26జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళితే ముందుగా నాలిక కింద థర్మోమీటర్ ను పెట్టి శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో చూస్తారు. 1714 సంవత్సరంలో డేనియల్ గేట్రియల్ ఫారెన్‌హీట్ కనిపెట్టిన మెర్క్యురీ థర్మోమీటర్ గత మూడు శతాబ్దాలుగా ఒక ముఖ్యమైన వైద్యపరికరంగా ఉపయోగపడుతోంది. కాని మెర్క్యురీ (పాదరసం) విషస్వభావం కలిగి ఉన్న కారణంగా వచ్చే డిశంబర్ 27 నాటికి వీటి వాడకం నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) తన సభ్యులందరినీ కోరింది. ఇదేవిధంగా మెర్క్యురీ కలిగి ఉండే రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) పరికరం (స్ఫైగ్మోమానోమీటర్)ను కూడా వాడకం నుంచి తప్పించాలని నిర్ణయించారు. కెనడాలోని మినమటాలో జరిగిన మెర్క్యురీ సదస్సులో ఈ మేరకు నిర్ణయించారు. మెర్క్యురీని కలిగి వున్న ఈ పరికరాల స్థానంలో వినిరాయిడ్ మానోమీటర్ లు వాడుకలోకి వచ్చాయి. నుదిటిమీద సున్నితంగా స్కాన్ చేసి శరీర ఉష్ణోగ్రతను ఖచ్చితంగా నమోదుచేసే ఎక్సర్జెన్ థర్మోమీటర్లు అనేక దేశాల్లో వాడుకలోకి వచ్చాయి.

ఇక ప్రత్యేకమైన కళ్ళజోడు అవసరం లేకుండానే 3D సినిమా చూడొచ్చు

vv27థియేటర్లో 3D సినిమా చూసేటప్పుడు ప్రత్యేకంగా ఆ థియేటర్ వాళ్ళిచ్చే కళ్ళజోడు పెట్టుకోవాలి. కాని ఇకముందు ఈ అవసరం లేకుండానే 3D సినిమా చూసేందుకు మిసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు సరికొత్త స్క్రీన్ టెక్నాలజీని కనుగొన్నారు. ఇప్పటికే ప్రత్యేకమైన కళ్ళద్దాల అవసరం లేని... టి.వి.లు వాడుకలో ఉన్నాయి. కాని పెద్దదైన సినిమా తెర మీద 3D సినిమా చూసేందుకు టి.వి.లో ఉపయోగించే టెక్నాలజీ సరిపడదు. ఈ ఇబ్బందిని తప్పించేందుకు MIT కొత్త సాంకేతికం ఉపయోగపడుతుంది.

 

సీతాకోక చిలుక రంగుల వెనుక జన్యువులు

vv28సీతాకోక చిలకల ఆకర్షణీయమైన రంగుల వెనుక వున్న జన్యువులను బ్రిటన్ షెఫీల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యువుల్ని కార్టెక్స్ గా వ్యవహరిస్తారు. హెలికోనియస్ అనే రకం సీతాకోక చిలకల రెక్కల వర్గాలపైన పరిశోధనలు చేయడం ద్వారా ఈ విషయాన్ని గనుగొన్నారు.

 

 

 

ఇస్రో ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ ప్రయోగం సక్సెస్

vv30రాకెట్లు రోదసీలోకి దూసుకెళ్ళేందుకు ఆక్సీజన్ తప్పనిసరి. ఇప్పటివరకూ ఇస్రో ద్రవరూప ఆక్సీజన్ ను రాకెట్ ప్రయోగాల్లో వినియోగిస్తోంది. కాని ఇటీవల నేరుగా వాతావరణంలోని ఆక్సీజననే వాడుకుంటూ ప్రయాణించే ‘ఎయిర్ బ్రీతింగ్ రాకెట్'ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆగష్టు 28 ఆదివారం ఉదయం ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికిల్ (ATV) ప్రయోగాన్ని ఇస్రో నిర్వహించింది. ఈ రాకెట్ కు స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన తొలి స్కామ్ జెట్ ఇంజన్ ను అమర్చారు. దీనితో ఎయిర్ బ్రీతింగ్ రాకెట్ పరిజ్ఞానం కలిగిన అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల సరసన నాలుగోదేశంగా మనదేశం చేరింది. ఈ విజయంతో భవిష్యత్తులో రాకెట్ల బరువు, ప్రయోగం ఖర్చు భారీగా తగ్గిపోతాయి.

భూమి మీద జీవం 370 కోట్ల సంవత్సరాలకు క్రితమే పుట్టిందట

మనమంతా అప్పటిదాకా అనుకున్న దానికన్నా చాలా ముందుగానే భూమి మీద జీవం పుట్టిందని, శిలాజాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 370 కోట్ల (3.7 బిలియన్) సంవత్సరాల వయసు భూగోళం మీద జీవానికి ఉంటుందని ఆస్ట్రేలియాలోని వొల్లోంగాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అలెన్ నట్మన్. న్యూసైత్ వేల్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త మార్టిన్ జువియన్ తెలియజేశారు.

ఆవర్తన పట్టికలో నాలుగు కొత్త మూలకాలు

vv31నాలుగు కొత్త మూలకాలను అధికారికంగా ఆవర్తన పట్టికలో చేర్చేందుకు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లయిడ్ కెమిస్ట్రీ (IUPAC) ఇటీవల ఆమోదం తెలిపింది. వీటి పరమాణు సంఖ్యలు 113, 115, 117, 118. ఈ మూలకాలను ఇంతకుముందే అంటే 1999 - 2010 మధ్యకాలంలోనే కనుగొన్నారు. వీటికి తాత్కాలికంగా ఇచ్చిన పేర్లు వరుసగా ununtrium(లాటిన్ భాషలో 1-1-3), ununpentium (1-1-5), unurseptium (1-1-7\ ununoctium (1-1-8). ఇప్పుడు వీటికి ఇప్పుడు IUPAC సంస్థ అధికారికంగా పేర్లు ప్రకటించింది. మూలకం 113 పేరు నిహానియమ్ (Nh). ఇది జపనీస్ భాషలో జపాన్ పేరు నిహాన్ నుంచి వచ్చింది. మూలకం 115 పేరు మాసోవియమ్ (Mc). మాస్కో సమీపంలోని గుట్నాలోని జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (JINR) శాస్త్రజ్ఞులు ఈ మూలకాన్ని కనుగొన్నారు. మూలకం 117 పేరు టెన్నెసైన్ (Ts). అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం పేరు మీదుగా ఈ మూలకం పేరు వచ్చింది. ఈ రాష్ట్రంలోని ఓక్రిడ్జి నేషనల్ లేబొరేటరీలో ఇతర విశ్వవిద్యాలయాల్లో తయారైన నమూనాలను ఉపయోగించుకొని ఈ మూలకాన్ని కనుగొన్నారు. మూలకం 118 పేరు ఒగానెస్సాస్ (Og), రష్యా శాస్త్రవేత్త యూరి ఒగానెస్సాన్ పేరు మీదుగా ఈ మూలకానికి పేరు పెట్టారు. ఈయన నాయకత్వంలోని బృందం JINR లో ఈ మూలకాన్ని కనుగొన్నారు. ఈ పేర్లను ప్రజలతో సంప్రదించి తుది నిర్ణయాన్ని IUPAC ప్రకటిస్తుంది.

గోలాక్సీల రారాజు

vv29భూమికి 250 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఒ అద్భుతమైన మిస్టరీ నక్షత్ర మండలం (గెలాక్సీ)ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ లు, అబ్జర్వేటరీలను ఉపయోగించి అత్యంత సుదూరమైన, ప్రాచీనమైన ఈ దెలాక్సీల కంటె దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, దీని అంతర్భాగం చాలా తేజోవంతంగా ఉంటుందని వారు తెలియజేశారు. దీని ఆకృతిని బట్టి ఇవి అనేక నక్షత్ర మండలాలను కలుపుకొని ఆవిర్భవించిందని కాలిఫోర్నియాలోని కార్నీజ్ శాస్త్రపరిశోధనా కేంద్రానికి చెందిన మార్క్ సి బెర్త్ అనే ఖగోళ శాస్త్రవేత్త తెలిపారు. ఈ గెలాక్సీని ఫాంకెన్ స్టీన్ గెలాక్సీగా వ్యవహరిస్తారు. ఇది పాలపుంత గెలాక్సీకన్నా 7 రెట్లు విశాలమైంది.

కొత్త గ్రూపు రక్తం

vv32మన రక్తం నాలుగు రకాల గ్రూపులుంటాయని మనకు తెలుసు. అవి A, B, O, AB. మనకెవరికైనా వీటిలో ఒక గ్రూపు రక్తం ఉంటుంది. కాని ఇవేమికాని అరుదైన బ్లడ్ గ్రూప్ ను తొలిసారిగా మనదేశంలోనే కనుగొన్నారు. 2016 సెప్టెంబర్ 3న గుజరాత్ వైద్యులు కనుగొన్న ఈ బ్లడ్ గ్రూప్ ను INRA గా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) ఆమోదం లభించింది. ఈ పేరులోని మొదటి రెండక్షరాలు ఇండియాలోని మొదటి రెండక్షరాలే. ఈ రక్తాన్ని కలిగి ఉన్న వ్యక్తి పేరులోని రెండక్షరాలు RA. ఈ నాలుగు అక్షరాలు కలిపి INRA గా కొత్త బ్లడ్ గ్రూప్ కు పేరు పెట్టారు. ఈ అరుదైన బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల రక్తం ఇతరులకు సరిపోదు కాబట్టి వీరు ఇతరులకు రక్తాన్ని ఇవ్వలేరు అలాగే ఇతరుల నుండి రక్తాన్నీ స్వీకరించలేరని వైద్యులు చెబుతున్నారు.

కలుషిత గాలిని పీలుస్తున్న 90 శాతం ప్రజలు

oct1ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం జనం కాలుష్యాలతో నిండిన గాలిని పీలుస్తున్నారని, దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల కేన్సర్, హృద్యోగాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య అసాధారణంగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవల జరిపిన ఒక సర్వేలో వెల్లడయింది. కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ వంటి విషవాయువులు గాలిని కలుషితం చేస్తున్నాయి. గాలి కాలుష్యం కలిగించే వ్యాధులు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 60 లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో 10 శాతం భారతీయులే కావడం ఆందోళన కలిగించే విషయం. నగరాల్లో పరిశ్రమలు, రవాణా, వ్యర్థపదార్థాల దహనం, థర్మల్ విద్యూత్ కేంద్రాల వల్ల గాలి కాలుష్యం పెరుగుతొందని, గ్రామాల్లో వంట కోసం బొగ్గులు, కట్టెలను వినియోగించడం వల్ల పెరుగుతొందని WHO తెలిపింది. వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్యస్థితిని దారుణంగా దెబ్బతీస్తోందని, ప్రభుత్వాలు వెంటనే మేలుకొని కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని WHO సూచించింది.

ఇస్రో ఖాతాలో మరో చరిత్ర

అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయ పరంపర కొనసాగుతోంది. 26 సెప్టెంబర్ 2016న ఒకే రాకెట్ ద్వారా రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ఎనిమిది ఉపగ్రహాలను ప్రవేశపెట్టి , సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. PSLV C - 35 ఈ ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరవేసింది. ఈ ఎనిమిది ఉపగ్రహాల్లో మూడు మన దేశానికి కాగా మిగితావి ఇతర దేశాలవి. మన దేశానికి చెందిన ఉపగ్రహాలు స్కాట్ శాట్ - 1 ప్రథమ్, పి.ఇ.శాట్ మిగిలిన ఐదు ఉపగ్రహాల్లో మూడు అల్జీరియా దేశానివి, ఇవి ఎ.ఎల్.శాట్ - 1ఎన్, ఎ.ఎల్.శాట్ - 1బి, ఎ.ఎల్.శాట్ - 2 బి. వీటితో పాటు కెనడా ఉపగ్రహం (ఎన్.ఎల్.ఎస్ - 19), అమెరికా ఉపగ్రహం (పాత్ పైండర్ - 1) కూడా ఉన్నాయి. ఈ 8 ఉపగ్రహాలను 2 వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశ పెట్టేందుకు ASLV – C 34 రాకెట్ కు 2 గం. 15 ని.  సమయం పట్టింది, బాదాపు 8 నెలల క్రితం జూన్ 22న ఇస్రో ASLV – C 34 రాకెట్ ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. కాని అప్పుడు రాకెట్ తన కక్ష్య మారలేదు. కాని ఇప్పుడు ఒకే రాకెట్ ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యలోకి ప్రవేశపెట్టడం విశేషమే. స్కాట్ శాట్ - 1 మనదేశ వాతావరణాన్ని పరిశీలిస్తూ సముద్రంపై గాలివేగాన్ని  దిశను అంచనావేస్తూ తుఫాన్లు, సునామీలు వంటి విపత్తులను పసిగట్టి ముందస్తు సమాచారాన్ని అందిస్తుంది.

జీశాట్ – 18 ప్రయోగం సక్సెస్

nov1భారీ సమాచార ఉపగ్రహం జీశాట్ – 18 ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అక్టోబర్ 7 తెల్లవారుజామున ఫ్రాన్స్ కు చెందిన ఏరియన్ – 5 VA - 231 రాకెట్ ద్వారా 3404 కిలోల జీశాట్ – 18 ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులకు ఇది ఉపయోగపడుతుంది.

 

 

ప్రపంచ రికార్డు దిశగా ఇస్రో

ఒక రాకెట్ లో 83 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఇస్రో సిద్ధమవుతోందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాకేశ్ శశిభూషణ్ తెలిపారు. వీటిలో రెండు మనదేశానికి మిగతా 81 వేర్వేరు దేశాలకు చెందిన నానో ఉపగ్రహాలు. వీటన్నింటినీ ఒకే కక్ష్యలో ప్రవేశపెడతామని ఆయన తెలియజేశారు.

కాఫీఫిల్టర్ తో తాగునీటి శుద్ధి

nov18కాఫీగింజల వ్యర్థాలతో ఇకముందు తాగునీటిని శుభ్రం చేసుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటిలో కలిసే మెర్క్యురీ, లెడ్ వంటి భారీలోహాలను తొలగించే లక్షణం కాఫీపొడికి ఉంది. ఈ లక్షణాన్ని తాగునీటిని శుభ్రం చేసుకునేందుకు వాడుకునేలా ఒక సరికొత్త ఫోమ్ ఫిల్టర్ ను ఇటలీ శాస్త్రవేత్తలు తయారుచేశారు.

 

 

గాలిలో రికార్డు స్థాయికి చేరుకున్న కార్బన్ డై ఆక్సైడ్

nov20భూమి వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) ఒక ముఖ్యమైన పర్యావరణ సమస్యగా ప్రపంచాన్ని కలవర పెడుతున్న సమస్య. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల గాఢత నానాటికీ పెరిగిపోతుండడం మరింత ఆందోళన కల్లిస్తోంది. అమెరికాలోని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాన్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ (National Oceanic and Atmospheric Administration) ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. వాతావరణ గత రికార్డులను పరిశీలిస్తే మునుపెన్నడూ లేనంతగా 2015లో వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి గణనీయంగా పెరిగిపోయిందట. హవాయిలోని మౌనలోవా అబ్జర్వేటరీ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి 400 పి.పి.ఎమ్. (Part Per Millions) మార్కును దాటిపోయింది. ఇది కార్బన్ డై ఆక్సైడ్ కు సంబంధించిన బేరీజుకు ఒక ముఖ్యమైన ప్రామాణికం. గత ఏడాది 402.6 పి.పి.ఎమ్ కు చేరుకున్న కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ఈ ఏడాదీ కొనసాగవచ్చు. 2005 - 14 మధ్యకాలంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ఏడాదికి 2.11 పి.పి.ఎమ్. పెరుగుతూ వస్తున్నా, గత ఏడాది మాత్రం ఒక్కసారిగా 3.05 పి.పి.ఎమ్. పెరిగిపోయింది. శిలాజ ఇంధనాల వాడకం పెరిగిపోవడం బలమైన ఎల్ నినో ప్రభావం ఇందుకు కారణం కావచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కార్బన్ డై ఆక్సైడ్ తో బాటు గాలిలో మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల గాధత కూడా పెరిగిపోతుందని తెలిపింది.

కిగాలి ఒప్పందం

nov25గ్లోబల్ వార్మింగ్ నే వేగంగా పెంచుతున్న శీతలీకరణ వాయువుల (హైడ్రోఫ్లోరో కార్బన్లు-HFC) వినియోగాన్ని దశలవారీగా తొలగించే లక్ష్యంతో రువాండా రాజధాని కిగాలిలో 197 దేశాల మధ్య ఇటీవల ఒక చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. ఎసిలు, రిఫ్రిజిరేటర్లు, కార్లు వంటి వాటిలో శీతలం కలిగించే యంత్రపరికరాల్లో HFC వాయువులను వాడుతున్నారు. కాని కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి వంటి ఇతర గ్రీన్హౌస్ వాయువుల కంటే HFCలు కొన్నిరెట ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ కల్గిస్తాయని, పరిశోధనలు తెలియజేస్తున్నాయి. దీనివల్ల 1987 మాట్రియల్ ఒప్పందానికి సవరణగా కిగాలి ఒప్పందం ద్వారా HFCల వినియోగంపై నియంత్రణకు ప్రపంచదేశాలు 2035 నాటికి 85 శాతానికి, వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా, ఇతర ద్వీపదేశాలు 2045 నాటికి 80 శాతానికి, ఇండియా తదితర వర్ధమాన దేశాలు 2047 నాటికి 85 శాతానికి HFC లను తొలగించుకోవాలి. వాతావరణ పరిరక్షణ దిశగా వేసిన ఒక ముందడుగు ఈ కిగాలి ఒప్పందం,

ఐన్‌స్టీన్ కాంతి వేగ సిద్దాంతానికి సవాల్

dec1ప్రకృతిలో మౌళికమైన సిద్దాంతాల్లో శూన్యంలో కాంతివేగం ఒకటని నూరేళ్ళ క్రిందటనే ఐన్‌స్టీన్ తన సాధారణ సాపేక్షతా సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. దీని విలువ సుమారుగా 3x108 మీ/సె లేదా 1,86,282 మైళ్ళు/సె. ఆధునిక భౌతికశాస్త్రానికి ఈ సిద్ధాంతం ఒక పునాదిరాయి లాంటిది. విశ్వం పుట్టుకకు కారణమైన బిగబ్యాంగ్ నుంచి నేటిదాకా కాంతివేగం స్థిరంగా ఉందని ఐన్‌స్టీన్ వాదన. కాని ఈ సిద్ధాంతాన్ని శాస్త్రజ్ఞులు సవాల్ చేస్తున్నారు. కాంతివేగం స్థిరం కాదని, బిగ్ బ్యాంగ్ జరిగిన తొలినాళ్ళలో కాంతివేగం ఇంతకన్నా ఎక్కువగా ఉండేదని విశ్వం విస్తరించిన కొద్దీ అందుకు తగినట్టుగా కాంతివేగం తగ్గిందని లండన్ ఇంపీరియల్ కాలేజీ ప్రొఫెసర్ జోవో మాగ్వేజో, కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీకి చెందిన నియేష్ ఆఫోర్ ప్రతిపాదించాడు. నిజానికి మాగ్వే 1990లోనే ఈ ప్రతిపాదన చేశారు. కాని ఇప్పుడు మాగ్వేజో అఫోర్ కలిసి ఇన్‌స్టీన్ సిద్ధాంతాన్ని సవాల్ చేస్తున్న ఈ కొత్త ప్రతిపాదనలను నిరూపించే ఒక మోడలను రూపొందించారు. తొలినాళ్ళలో విశ్వం కొన్నీ హెచ్చు తగ్గులకు గురయిందని అవే గెలాక్సీలు, ఇతర నిర్మాణాలు సృష్టికి కారణమని వారు చెబుతున్నారు. ఈ మోడల్‌ను కాస్మిటాలజిస్టులు త్వరలో పరీక్షించనున్నారు. అయితే ఐన్‌స్టీన్ సిద్ధాంతం ప్రకారం విశ్వం వ్యాకోచిస్తుంది. వ్యాకోచించే విశ్వాన్ని స్థిర నిరూపక చట్రంగా తీసుకోవడానికి విశ్లేదు. కాబట్టి చాప్టర్ ప్రభావం లాగా కాంతి పొనపున్యం తగ్గుతూ వెళ్లాలి. అయితే విశ్వానికి హద్దులున్నాయి. కాని అవధుల్లేవు. కాంతి ఎటు వెళ్లాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా కాంతి వేగంలో మార్పులు అవసరం కావచ్చును. కాబట్టి ఓ వైపున కాంతివేగం సిరం అన్న ఐన్‌స్టీన్ వాదనకు సవాలుగానూ విశ్వం వ్యాకోచిస్తున్నదన్ష వాదనకు అనుకూలముగానూ ఉన్నాయి. ఏది ఏమైనా తొందరపడి నిర్ధారణకు రాకూడదు.

అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్

dec3స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అగ్ని-1 క్షిపణిని రక్షణశాఖ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణిని ఒడిసాలోని అబ్దుల్ కలామ్ దీవి (నీలర్ ఐలాండ్)లో వున్న ఇంటిగ్రేటెడ్ వెస్ట్రేంజ్ పై ఈ పరీక్ష నిర్వహించారు. మొబైల్ లాంచర్ సాయంతో నవంబర్ 22న ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి (surface to surface) ప్రయోగించే ఈ క్షిపణి 700 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీనికి అణ్వాయుధ సామర్ధ్యం కూడా ఉంది.

 

 

పృధ్వి-2 క్షిపణుల ప్రయోగం విజయవంతం

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండు పృధ్వి-2 క్షిపఎల ప్రయోగం సక్సెస్ అయింది. ఇవి ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు. 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి, అన్యాయుధ సామర్థ్యం ఉంది. వీటిని ఒడిసాలోని ఛాందీపూర్లో పరీక్షించారు,

కోల్పోయిన శరీర భాగాలను పునరుత్పత్తి మనుషులకు కూడ సాధ్యం కావచ్చు

ఏదైనా ప్రమాదంలో కాని మరేదైనా కారణం చేతగాని కోల్పోయిన చేయి లేదా కాలు తిరిగి పెరిగి యధాస్థితికి రావచ్చు. అలాగే వెన్నెముకకు బలమైన గాయం తగిలి నాడీవ్యవస్థ చచ్చుపడితే, దాన్ని తిరిగి చురుగ్గా పనిచేయించవచ్చునని, ఏదో ఒక రోజు మనుషుల్లో ఇవన్నీ సాధ్యపడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అకశేరుకాలులో హెమీ కార్డేట్ తరగతికి చెందిన ఎకార్న్ పురుగులు శరీరనిర్మాణంలో మనకు దగ్గరగా ఉన్నాయని, ఇవి తమ శరీరంలోని ప్రతి ప్రధానభాగాన్ని కోల్పోయినా తిరిగిపెంచుకుంటాయని వారు తెలియజేశారు. ఈ పురుగులు కోరర్ లీఫ్ ల చుట్టూ ఇసుకలో కూరుకుని ఉంటాయి. వీటి జన్యునిర్మాణం, శరీర ఏర్పాటు మనుషులను పోలి ఉండడం ఆశ్చర్యం కలిగించకమానదు. సగానికి కత్తిరించిన తల, నాడీమండలం, లోపలి అవయవాలు వంటి శరీరభాగాలను ఇవి పునరుద్దరించుకుంటాయి. అద్భుతమైన ఈ శక్తికి కొన్ని మాస్టర్ కంట్రోల్ జీన్స్ కారణమని అలాంటివి మనుషుల్లో కూడా ఉన్నాయని అధ్యయన బృందంలోని ప్రముఖ శాస్త్రవేత్త షాన్లుట్రెల్ చెప్పారు. ఏ చర్యా విధానం ద్వారా ఎకార్న్ పురుగులు శరీరభాగాలను తిరిగి ఏర్పాటు చేసుకుంటున్నాయో తెలుసుకోవాల్సి ఉంది.

సూపర్ బగ్స్ కు చెక్

అనేక వ్యాధులకు కారణమవుతున్న బాక్టీరియా, యాంటీబయాటిక్స్ కు నిరోధకత పెంచుకోవడం వల్ల యాంటీబయాటిక్స్ ఏమాత్రం పని చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం ఇటీవల కాలంలో వైద్యరంగంలో ఒక ప్రధాన సమస్య అయిపోయింది. కాని ఇటీవల ఈ సమస్య పరిష్కారానికి జరిపిన పరిశోధనలు సఫలవంతమయ్యాయి. ఫలితంగా ఒక కొత్త రకం మందును తయారు చేశారు. ఈ మందు బాక్టీరియాలో యాంటి బయాటిక్స్ నిరోధకతను కలిగించే ఎప్లక్స్ పంప్స్ అనే ప్రొటీను నాశనం చేస్తాయి,ఈ కొత్త ఫార్ములా ద్వారా యాంటీబయాటిక్స్ శక్తి పదిరెట్లు పెరుగుతుందని, దీనివల్ల మానవాళికి గొప్ప మేలు జరుగుతుందని ఆశించవచ్చు.

నాలుగు కాళ్ల పాము

dec23మీరెవ్పడైనా పామును చూశారా? చూసే ఉంటారు. భయపడే ఉంటారు కూడ. పాముకు కాళ్లు వుంటాయా? పాముకు కాళ్లేమిటి అనుకుంటున్నారు కదూ! అవును అది పామే. దానికి నాలుగు కాళ్లు కూడా ఉన్నాయి. ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఈ నాలుగు కాళ్ల పాముకు సంబంధించిన శీలాన్ని (Fossil) కనుగొన్నారు. ఇది 20 సెం.మీ. పొడవు ఉందట. బ్రెజిల్ దేశంలో దొరికిన ఈ పాముజాతి శిలాజం 113 మిలియన్ సం. క్రితం జీవించింది. ఇంతకు ముందు కూడా వెనుక కాళ్లు పున్న శిలాబాలు దొరికాయి. కాని ఇది నాలుగు కాళ్లతో లభించిన మొట్టమొదటి పాము శిలాజం. నేడు మనకు కనపడే ఆధునిక జాతి పాములకు డైరెక్టు వారసుడు. దీని సున్నితమైన కాళ్లు నడిచేందుకు పని చేయవు. కాని వీటి ఐదు కాలివేళ్లు గోళ్లతో జంతువులను పట్టుకుని తినేందుకు అనుకూలంగా ఉన్నాయి. చిన్న ముట్టె, పెద్ద మొండెం నేలలో బొరియలు చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. తోక తెడ్డులా లేకపోవడం, ఈదటానికి ఉపయోగపడే రెక్కలు లేకపోవడం పాములు నీళ్ల నుంచి నేల మీదికి వచ్చాయనే నమ్మకాన్ని తప్పని తేల్చింది. దీన్ని కనిపెట్టిన డా. లాంగ్రిచ్ అభిప్రాయంలో ఈ నాలుగు కాళ్ల పాము ఆధునిక పాము లక్షణాలను చూపుతోంది. కొక్కెల వంట్ కొరలు, వెసులుబాటు కలిగిన దవడలు (Flexible Jaws), వెన్నుముక, పొలుసులు దీని ఉన్నత లక్షణాలకు నిదర్శనం. దీని పొట్టలో వున్న వెన్నముక జంతువు కూడా ఇది ఆహారం కోసం పాముల్లా జంతువులను కబళిస్తుందని చెబుతున్నది. పాములు నీటి నుండి కాకుండా భూమిపైనే పరిమాణం చెందినాయని తెలియజెప్పే ఈ 'నాలుగు కాళ్ల పాము' పరిణామ క్రమాన్ని అర్ధం చేసుకోటానికి బాగా తోడ్పడుతోంది.

3డ-ప్రింటెడ్ మైక్రోఫిష్ తో డ్రగ్ డెలివరీ

sep1త్రీడి సాంకేతికాన్నీ ఉపయోగించి అయస్కాంతంలో నియంత్రించగలిగిన చేపరూపంలో ఉండే మైక్రోరోబోను శాండియాగోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు తయారు చేశారు. దీన్ని మైక్రోఫిష్ అంటున్నారు. దీని ద్వారా శరీరంలోని నిర్దేశిత భాగాలకు ఔషధాలను పంపవచ్చునని వారు అనుకుంటున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ మైక్రోఫిష్ కు శక్తినిస్తుంది. ఇది విషాన్ని గుర్తించే సెన్సర్ గా శరీరంలో విషాన్ని తొలిగించేందుకు ఉపయోగపడుతుందంటున్నారు. దీని తోకభాగంలో ప్లాటినం సూక్ష్మకణాలను అమర్చారు. దీని ధర 7 వేల డాలర్లు. అంటే సుమారు రూ. 4.62 లక్షలు.

 

జి.ఎస్.ఎల్.వి-డి6 ప్రయోగం సక్సెస్

sep3శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇస్రో ప్రయోగించిన జి.ఎస్.ఎల్.వి-డి6 రాకెట్ ఆగస్ట్ 27వ తేది గురువారం సాయంత్రం అత్యంత ఆధునికమైన జిశాట్-6 ఉపగ్రహాన్ని దానికి నిర్ధేశించిన భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పూర్తిస్థాయి స్వేదేశి పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్ తో విజయవంతమైన రెండో ప్రయోగం ఇది. ఈ రాకెట్ ఎత్తు 41.1 మీటర్లు. ఉపగ్రహంతో కలిపి దీని బరువు 416 టన్నులు. జీశాట్ ఉపగ్రహం బరువు 2117 కిలోలు. ఈ ఉపగ్రహం 12  సంవత్సరాలు నిర్విరామంగా సేవలందిస్తుంది. మల్టీ మీడియాకు, శాటిలైట్ ఫోన్ లకు ఇది ఉపయోగపడుతుంది. క్రయోజనిక్ సత్తాను సాధించడంతో 2 నుండి 4 టన్నుల సమాచార ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించడం వీలు పడుతుంది. దేశీయ అవసరాలు తీర్చడంతోబాటు, విధేశీ భారీ ఉపగ్రహాలను పంపే అవకాశం కూడా ఇస్రోకు పంపే అవకాశం కూడా ఇస్రోకు లభిస్తుంది. ఈ ఘన విజయం సాధించిన మన శాస్త్రవేత్తలను మనమూ అభినందింద్దాం.

అమెరికా ప్రయోగశాలలో మానవ మెదడు సృష్టి

దాదాపు పూర్తిస్థాయి మానవ మెదడును అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రజ్ఞులు ప్రయోగశాలలో సృష్టించారు. ఈ శాస్త్రవేత్తల బృందంలో భారత సంతతికి చెందిన రెనె ఆనంద్ కూడా ఉన్నారు. మానవ చర్మ కణాలతో ఈ పూర్తిస్థాయి మెదడును వారు అభివృద్ధి చేశారు. ఈ మెదడులో ఐదు వారాల గర్బస్థ శిశువు మెదడులోని మెచ్చూరిటీ ఉందని చెబుతున్నారు. దీనితో నాడీవ్యవస్థలో ఏర్పడే రుగ్మతలను అధ్యయనం చేయవచ్చనీ. కొత్తగా తయారుచేసిన మందులను క్లినికల్ ట్రయల్స్ కు ముందు దీనిపై ప్రయోగించి చూసే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

భవిష్యత్తులో పెరుగనున్న సముద్ర మట్టం

sep4నాసా శాస్త్రజ్ఞులు సేకరించిన ఉపగ్రహ సమాచారం ప్రకారం రాబోయే 100 నుంచి 200 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం 3 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ పెరగవచ్చునంటున్నారు. గ్రీన్ లాండ్, అంటార్కిటికాల్లో మంచు ఎప్పటికన్నా వేగంగా కరుగుతోందని, మహాసముద్రాలు వేడెక్కి వ్యాకోచించడం కూడా గతంలో కన్న వేగవంతమైందని చెబుతున్నారు. సముద్ర జలాల మట్టం పెరుగుదల వల్ల విపరీత పరిణామాలుంటాయి. అమెరికాలోని పల్లపు ప్రాంత రాష్ట్రాలైన ఫ్లొరిడా వంటివి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచంలో పెద్ద నగరాలైన సింగపూర్, టోక్యో వంటివి కూడా ముంపుకు గురికావచ్చు.

రోజుకు 8 గ్లాసుల నీరు త్రాగనవసరం లేదట

sep5మన ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు 8 గ్లాసుల నీరు త్రాగడం తప్పనిసరి అని చాలా మంది చెబుతుంటారు. కాని ఇది నిజం కాదని, దీనికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు 2.5 లీటర్ల నీరు అవసరం అని 1945లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బోర్డ్ సిఫారసు చేయడంతో అది వాస్తవమని చాలా మంది భావించారు. కాని నీరు పండ్లు, కాయగూరల్లోను, కాఫీ, టీ ఇలా చాలా వాటిలో ఉంది. మనం తయారు చేసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఉంది. మన నీటి అవసరానికి కేవలం నీటినే నేరుగా త్రాగనక్కరలేదు. ఏ ఇబ్బందులు లేని వారు ఎక్కువ నీరు త్రాగడం వల్ల ఆరోగ్యానికి కలిసొచ్చేది కూడా ఏమీ లేదు. డీ హైడ్రేషన్ వచ్చే పరిస్థితి రాబోతుంటే, తగిన సంకేతాలను ఇచ్చే అద్భుతమైన సామర్థ్యం మన శరీరానికి ఉండనే ఉందని వారు చెబుతున్నారు..

సూపర్ బ్లడ్ మూన్

oct1ఖగోళంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు అప్పుడప్పుడు ఆవిష్కృతమౌతూ కనువిందు చేస్తుంటాయి. అలాంటిదే సెప్టెంబర్ 28న తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో కన్పించిన సూపర్ బ్లడ్ మూన్. తెల్లటి చల్లని వెన్నెల కురిపించే పున్నమినాటి చందమామ ఆరోజు నెత్తుటి రంగులో కన్పించి 'బ్లడ్ మూన్’, ‘సూపర్ మూన్’గా నందునే 'సూపర్ బ్లడ్ మూన్'గా దర్శనమిచ్చాడు. భూమికి, చంద్రుడికి మధ్య సగటు దూరం 4,06,464 కిలోమీటర్లు. కానీ బ్లడ్ మూన్ రోజు ఆ దూరం 3,56,877 కి.మీ. అంటే భూమికి అతిదగ్గరగా వచ్చాడు. ఈ కారణంగా చందమామ సాధారణం కన్నా 14 శాతం పెద్దగా కన్పించడమే కాకుండా, 30 శాతం అధికంగా కాంతిని ఇచ్చాడు. ఈ విధంగా 72 నిమిషాల పాటు కన్పించాడు. 1982 తర్వాత ఈ ఖగోళ అద్బుతం కన్పించింది ఆరోజే. తిరిగి 2033 సం. దాకా ఇది సంభవించదు. చందమామ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్ మూన్ కన్పిస్తుంది. కానీ చంద్రగ్రహణంతో ఇది కలిసినప్పుడు చంద్రునిపై భూమి నీడ కూడా పడుతుంది. విడివిడిగా ఈ రెండు సాధారణంగా జరిగేవే కాని రెండూ కలిసి ఏర్పడడం చాలా అరుదు. ఫలితమే సూపర్ బ్లడ్ మూన్. బ్లడ్ మూన్ ను చూసేందుకు ప్రత్యేకమైన పరికరాలవసరం లేదు. కళ్ళతో నేరుగా చూడవచ్చు. సూపర్ బ్లడ్ మూన్ ఉత్తర, దక్షిణ అమెరికాలలోను, ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో కన్పించింది.

తులసి జన్యుక్రమం

oct7ఎన్నో ఔషధ గుణాలు కలిగి వైద్యంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న తులసి మొక్క జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జన్యు పటాన్ని ఉపయోగించుకొని తులసితో కొత్త మందులను తయారుచేసే వీలు కలుగుతుందని ఆశిస్తున్నారు. బెంగుళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ కు చెందిన సౌదామిని రామనాథన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించింది. జన్యు నమాచారం తెలుసుకోడానికి రామతులసి, కృష్ణతులసిలతో సహా అయిదు రకాల తులసి మొక్కలను ఈ బృందం తమ పరిశోధనలకు ఎంచుకుంది. ఇప్పటికే తులసి గురించి తెలిసిన సమాచారాన్ని తిరిగి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ మొక్క ఆంటి-బాక్టీరియల్, ఆంటి-ఫంగల్, ఆంటి-పైరెటిక్, ఆంటి-కాన్సర్ గుణాలున్న జీవక్రియాశీల (Bioactive) సమ్మేళనాలను నంశ్లేషణ చేస్తుంది. తులసి తనను తాను రక్షించుకోవడానికి జీవక్రియలో భాగంగా సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని జీవక్రియ ఉత్పన్నాలు లేదా మెటబొలైట్స్ అంటారు. జన్యు సంబంధమైన సమాచారం లేనందువల్ల ఈ మెటబొలైట్లను అర్థం చేసుకోవడం వీలుపడలేదు.

సౌదామిని బృందం కృష్ణ తులసి తాలుకు జన్యువులను గురించిన అంచనాలలో ఒక అడుగు ముందుకు వేసి ఔషధ గుణాలున్న మెటాబోలైట్స్ ఉత్పత్తికి కారణమైన జన్యువులను గుర్తించింది. ఈ జన్యుక్రమం ద్వారా ఔషధగుణాలతో చాలా ముఖ్యమైన యుర్సోలిక్ ఆమ్లాన్ని తయారు చేసేందుకు తులసి ఉపయోగించుకునే మార్గాలు వెల్లడయ్యాయి.

ఆస్ట్రోశాట్ ప్రయోగం విజయవంతం

మన దేశపు తొలి స్పేస్ అబ్జర్వేటరీ 'ఆస్ట్రోశాట్'ను ఇస్రో సెప్టెంబర్ 28వ తేదీ సోమవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. PSLV-C30 ఆస్ట్రోశాట్ తో పాటు అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలు సహా మొత్తం ఆరు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోని నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఆస్ట్రోశాట్ 97 నిమిషాలకొకసారి భూమి చుట్టు పరిభ్రమిస్తుంది. అంతరిక్షంలోని కృష్ణబిలాలు (బ్లాక్ హోల్స్)ను, నక్షత్రాల అయస్కాంత క్షేత్రాలను ఆక్రోశాట్ - అధ్యయనం చేస్తుంది. రోదసి వాతావరణాన్ని విశ్వమూలాలను కూడా పరిశోధిస్తుంది.

అంగారకుడిపై నీరుంది

ఇప్పటి దాకా అందరూ అనుకున్నట్లుగా అంగారక గ్రహం(Mars) పొడిగా, ఎండిపోయినట్లుగా లేదని, అక్కడ ద్రవస్థితిలో నీటిని కనుగొన్నట్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తెలియజేసింది. గతంలో ఈ అరుణ గ్రహం మీద నీరు స్వేచ్చగా ప్రవహించిందని, దాని కారణంగానే లోయలు, లోతైన కనుములు(Canyons) ఏర్పడ్డాయని శాస్త్రజ్ఞులు భావించేవారు. కాని 300 సంవత్సరాల క్రితం అక్కడి వాతావరణంలో పెనుమార్పుల కారణంగా పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం రోవర్ అందించిన సమాచారం ప్రకారం అరుణ గ్రహం పరించిన మన అవగాహనలో విప్లవాత్మకమైన మార్పు వస్తోందని నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ జిమ్ గ్రీన్ తెలియజేశారు.

కొత్త యాంటీబయోటిక్స్ తయారీకి దారి చూపే ఆవిష్కరణ

కొత్త యాంటీబయోటిక్స్ ను అభివృద్ధి చేసేందుకు దారి చూపే సరికొత్త ఆవిష్కరణకు సెంటర్ ఫర్ సెల్యులార్ ఆండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) శాస్త్రవేత్తలు చేశారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న యాంటీబయాటిక్‌లలో చాలా వాటికి రోగకారక బాక్టీరియాలు నిరోధకతను సంతరించుకున్నాయి. ఈ కారణంగా ఏ మందులు పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది. పైగా కొత్త యాంటీబయాటిక్ ల ఆవిష్కరణ కొన్ని దశాబ్దాలుగా జరగడం లేదు. ఫలితంగా రోగాలు ముదిరి చాలా మంది మరణిస్తున్నారు. సి.సి.ఎం.బి శాస్త్రవేత్తలు వీటికొక సరికొత్త పరిష్కారం చూపిస్తున్నారు. బాక్టీరియా అణిచివేసేందుకు కొత్త టార్గెట్ ను వీరు కనుగొన్నారు. బాక్టీరియాకు శక్తినిచ్చి వాటి ఎదుగుదలకు దోహదపడే 'ఎంజైమ్'ను గుర్తించారు. ఈ ఎంజైమ్ ను లక్ష్యంగా చేసుకుంటే రోగకారక బాక్టీరియాను నాశనం చేయవచ్చని చెబుతున్నారు. NLPCP-60 అనే ఈ ఎంజైమ్లును సి.సి.ఎమ్.బి శాస్త్రవేత్త మంజుల కనుగొన్నారని ఆ సంస్థ డైరెక్టర్ సి.హెచ్. మోహన్ రావు తెలిపారు. ఈ ఎంజైమ్ ను లక్ష్యంగా చేసుకునేలా సరికొత్త యాంటీ బయోటిక్స్ తయారు చేయవచ్చని తెలియజేస్తున్నారు.

చుక్కల మందుతో శుక్లాలు మాయం

nov1నలభై సంవత్సరాల వయస్సు పైబడిన వారిలో కనుగుడ్డు మీద ఒక పొర (శుక్లం) పెరిగి చూపు మందగించడం మీకు తెల్సిందే. వారికి కంటి ఆపరేషన్ చేసి డాక్టర్లు చూపును అందిస్తున్నారు ఇప్పటి వరకూ. ఇక మందు ఆపరేషన్ల బెడద లేకుండా శుక్లాలను కరిగించే మందులొచ్చాయి. ఆ మందును రెండు చుక్కలు కంట్లో వేస్తే ఆపొర కరిగిపోయి ముందటిలాగే చూపు వస్తుందని శాస్త్రవేత్తలు ఇటీవల తెలియజేశారు. ఈ చుక్కల మందును ముందుగా కుక్కలపై ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారట. ఝూవో, అతని సహచరులు శుక్లాలు వచ్చే కుటుంబాలలో జన్యువులలో వచ్చే ఉత్పరివర్తనాలే ఇందుకు కారణమని నేచర్ (Nature) అనే ప్రఖ్యాత పరిశోధన పత్రికలో ప్రచురించారు.

కంటి కటకంలో (Lens) సాధారణంగా లానోస్టిరాల్ (Lanosterol) అనే అణువులు తయారవుతాయి. ఈ అణువు జలప్రియంగాను (hydrophilic) జల వికర్షిణి (hydrophobic ) గాను పనిచేస్తుంది. లానోస్టిరాల్ కటకం దగ్గర చేరే అవక్షేపాలను, ఎమైలాయిడ్ దారాల వంటి నిర్మాణాలను ఎప్పటికప్పుడు కరిగిస్తూ ఉంటుంది. దీనిని తయారుజేసే ఎంజైము పేరు లానోస్టిరాల్ సింథేజ్ (Lanosterol synthase - LSS). LSS వుత్పత్తికి కారణమైన జన్యువుల్లో ఉత్పరివర్తనలు (Mutations) వచ్చి మారిపోతే లానోస్టిరాల్ తయారుకాదు. దానితో కటకం పై పొర పెరుగుతుంది. కుందేళ్ళలో సహజంగా వచ్చే శుక్లాలను కరిగించటంలో లానోస్టిరాల్ బాగా పనిచేసింది. కుక్కలు, కుందేళ్ళలో సమర్థవంతంగా పనిచేసిన లానోస్టిరాల్ ముందు ముందు మనుషుల్లో శుక్లాలను సైతం కరిగించి ఆపరేషన్ల బారిన పడకుండా కాపాపడుతుందని ఆశిద్దాం.

40 రకైల పండ్లనిచ్చే చెట్టు

aug1ఇది ఒక నమ్మలేని నిజం. అదొక రంగురంగుల్లో కన్పించే చెట్టు. అంతేకాదు అది రకరకాల పండ్లనిస్తుంది. రెండు, మూడు రకాలు కాదు ఏకంగా 40 రకాల పండ్లు. అమెరికాలోని సిరాకస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న వాన్ అకెస్ ఈ చెట్టును తయారుచేశారు. అంటుకట్టడం వల్ల ఇది సాధ్యమయ్యిందని ఆయన తెలియజేశారు. ఆయనది స్వతహాగ వ్యవసాయ కుటుంబం అయినందున మొక్కలు పెంచడంలో ఆసక్తి ఎక్కువ. సంవత్సరంలో చాలా భాగం ఈ చెట్టు సాధారణంగా కన్పించినా, వేసవికాలంలో మాత్రం రంగురంగుల్లో కన్పిస్తూ, రేగు, చెర్రీ, అత్తి, జల్దరి, బాదం, జామ, దానిమ్మ, మామిడి వంటి 40 రకాల పండ్లతో ఎంతో మనోహరంగా కనిపిస్తుందట. వాన్ ఆకెన్ ఇప్పటివరకు ఇలాంటి 16 చెట్లను తయారు చేశాడు. మున్ముందు ఇలాంటి చెట్లతో పెద్ద తోటనే పెంచాలనుకుంటున్నాడయన. ఒక చెట్టు ఖరీదు 30 వేల డాలర్లు.

మలేరియా వాక్సిన్ కు అనుమతి మంజూరు

aug3ప్రపంచంలోనే మొట్టమొదటి మలేరియా వాక్సిన్ ‘మైస్క్ రిక్స్’ కు అనుమతినిచ్చినట్టు లండన్ లోని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) తెలియజేసింది. గత 30 ఏళ్లుగా వేలాది మంది చిన్నపిల్లల మీద జరుగుతున్న పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి. ఏడు ఆఫ్రికన్ దేశాల్లోని పిల్లల మీద ఈ పరిశోధనలు జరిగాయి. బ్రిటన్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాక్సో స్మిత్ క్లైన్ ఈ వాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఆరువారల నుంచి 17 నెలల వయసున్న చిన్నపిల్లలకు ఈ వాక్సిన్ ను ఉపయోగిస్తారు. ఈ వాక్సిన్ ను RTS, S అని కూడ వ్యవహరిస్తారు. ఈ వాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు 360 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని, ఆఫ్రికాలోని చిన్నారులకు ఈ వాక్సిన్ ను వినియోగించేందుకు అనుమతి లభించిందని గ్లాక్సో స్మిత్ క్లైన్ కంపెనీ తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  ఈ వాక్సీన్ ను పరీక్షిస్తోంది.

భూమిని పోలిన గ్రహాన్ని కనుగొన్న నాసా

aug4మన పాలపుంత గెలాక్సీలో భూమిని చాలా ఎక్కువగా పోలి వున్న కెప్లర్-452b అనే గ్రహాన్ని కనుగొన్నట్లు నాసా శాస్త్రజ్ఞులు ప్రకటించారు. దీనినే ‘ఎర్త్ 2.0’ అని కూడ వ్యవహరిస్తున్నారు. కెప్లర్ స్పేస్ టెలిస్కోప్ ను ఉపయోగించి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో విలువైన సమాచారం సేకరిస్తూ భూమిని పోలిన గ్రహాలను కొన్నింటిని నాసా ఇంతకుముందే కనుక్కోవడం జరిగింది. 2014లో కెప్లర్ – 186f కనుగొన్న గ్రహం. ఇటివంటి వాటిలో ఒకటి. కాని కెప్లర్ 452b మాత్రం మిగిలిన వాటి కంటే భూమిని చాలా ఎక్కువగా పోలి ఉందని నాసా శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఇది భూమి నుంచి 1400 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని, దానికి సంబంధించిన మాతృనక్షత్రం (parent star) అంటే మన భూమికి సూర్యుడి వంటి నక్షత్రం, చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 385 రోజులు పడుతుందని చెబుతున్నారు. కెప్లర్ 452b గ్రహం తన మాతృనక్షత్రం కెప్లర్ 452 నుంచి సూర్యుని నుంచి దాదాపు భూమి ఉన్నంత దూరంలోనే పరిభ్రమిస్తోందని, ఇక్కడి ఉష్ణోగ్రత పరిస్థితులు జ్రవస్థితిలో నీరు వుండేందుకే కాకుండా జీవరాశి మనుగడకు కూడ అనుకూలంగా ఉండవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కెప్లర్ 452b ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశికి దాదాపు 5 రేట్లు ఉంటుందని, అది రాళ్ళతో నిండి ఉంటే, అగ్ని పర్వచాలు ఉండవచ్చునని, గురుత్వాకర్షణ భూమికి రెట్టింపు ఉండవచ్చునని భావిస్తున్నారు. భూమి వ్యాసార్థంకంటె కెప్లర్ 452b వ్యాసార్థం సుమారు 60 శాతం ఎక్కువట.

శుక్రగ్రహం అన్వేషణకు సిద్ధమవుతున్న ఇస్రో

aug5అంగారక గ్రహం కక్ష్యలోకి మామ్ (Mars Orbiter Mission)ను గాతేడాది విజయవంతంగా ప్రవేశపెట్టి అందరి ప్రశంసలందుకున్న ఇస్రో మన భూమికి పొరుగున ఉన్న శుక్రగ్రహం (Venus) అన్వేషణకు కూడా సిద్ధమవుతోంది. శుక్రగ్రహానికే కాకుండా కొన్ని గ్రహశకలాల (Asteroids)కు కూడ ఇస్త్రో తన అన్వేషణలకు విస్తరింపజేస్తుందని అస్రో శాస్త్రజ్ఞులు తెలియజేశారు. శుక్రగ్రహానికి ఇస్రో ‘మిషన్’ను పంపించేందుకు సమగ్రమైన నివేదికలను తయారు చేయాల్సి ఉందని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ చెప్పారు. భూమికి సోదరిగా పిలువబడే శుక్రగ్రహం రాత్రివేళ్లలో చంద్రుని తర్వాత ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే ఖగోళ వస్తువు. సౌరకుటుంబంలో బుధుడు (Mercury) తర్వాత గ్రహం అయిన శుక్రుడు పరిమాణం, ద్రవ్యరాశి, సౌమిష్యత వంటి విషయాల్లో భూమిని పోలి ఉంటుంది. శుక్రగ్రహం గురించి ఇప్పటికే చాలా సమాచారం ఉన్నప్పటికి గ్రహశకలాలకు సంబంధించి అన్వేషకసౌకలను (Probes) పంపించడం కూడా శాస్త్రజ్ఞులకు చాలా ఆసక్తిని కలిగించే విషయమని కిరణ్ కుమార్ చెప్పారు. శుక్రగ్రహం మిషన్ కు సంబంధించి ఇస్రో-నాసా భాగస్వామ్యం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.

కొవ్వురుచి

aug6మనకు ఇప్పటివరకు షడ్రుచులు అంటే ఆరు రుచులు తెలుసు. ఇప్పుడు మరో కొత్త రుచు తోడయ్యింది. ఇది కొవ్వు రుచి. ఇది ఒక ప్రత్యేకమైన, అంతగా నచ్చని రుచి. దీనికి ‘ఓలియోగస్టన్’ అనే పేరు పెట్టారు. ఈ రుచి మిగితా రుచులకు భిన్నమైందని ఇండియానా (అమెరికా)లోని పర్ డ్యూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ రిఛర్డ్ మాటెస్ చెప్పారు. కొత్తగా కొవ్వు రుచిని కనుగొనడం ద్వారా దాన్ని పోలిన రుచిని కృత్రిమంగా తయారు చేయవచ్చునని శాస్త్రజ్ఞులు ఆలోచిస్తున్నారు. దీని వల్ల సహజ కొవ్వుల వల్ల వచ్చే ఊబకాయం, హృద్రోగాలను అరికట్టవచ్చునని వారు చెబుతున్నారు.

 

 

పిడుగుల దారి మళ్లించే లేజర్ కిరణాలు

july1భారీ పర్వాలతో పాటు పిడుగులు పడి ప్రతి ఏటా చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఎత్తైన భవనాలకు లైటింగ్ కండక్టర్ లను రక్షణ కోసం అమర్చుతారని మనకు తెలుసు. ముందు ముందు పిడుగుల ముప్పును తప్పించేందుకు ఒక మార్గాన్ని శాస్త్రజ్ఞులు కనుక్కోబోతున్నారు. లేజర్ కిరణాల సాయంతో పిడుగును దారి మళ్లించి నిర్మానుష్యమైన ప్రాంతంలో పడేటట్లు చేయవచ్చునంటున్నారు. అంటే ముందు ముందు ఉరుములు, మెరుపులు, పిడుగులకు భయపడనవసరం లేదన్నమాట.

 

 

భూమికి 'హలో' చెప్పిన ఫైలీ

july3మతృనౌక రోజెట్టా నుండి విడివడి గత నవంబర్ 12న 67P/చెర్యుమోప్ గెరాసిమెన్కో తోకచుక్క మీద దిగిన ఫైలీ రోబోలాబ్ 7 నెలల గాఢ నిద్ర నుంచి మేల్కొని మళ్లీ భూమిని పలకరించింది. ఫైలీ ఇప్పుడు బాగానే పనిచేస్తోందని జర్మన్ ఎరోస్పేస్ సెంటర్ తెలియజేసింది. జూన్ 19న ఫైలీ భూమికి చేసిన ఫోన్ పలకరింపు 19 నిమిషాల పాటు కొనసాగిందని, 16P తోకచుక్క మీద దిగిన తర్వాత భూమితో వార్తా సంబంధం ఏర్పరుచుకోవడం ఇది మూడోసారి. తోకచుక్క నేలను తాకిన తర్వాత తన బ్యాటరీ ఛార్జిని ఉపయోగించుకుని రీములకొద్దీ విలువైన సమాచారాన్ని భూమికి పంపించింది. కానీ బ్యాటరీ ఛార్జ్ ఖర్చయిపోయి అచేతనమైపోయింది. 7 నెలల తర్వాత మళ్లీ సూర్యుణ్ణి సమీపించి బ్యాటరీ రీఛార్జి అయి మళ్లీ నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తుందని శాస్త్రజ్ఞులు ఆశిస్తున్నారు. ఈ ఆలోచన నిజమవుతోంది. తోకచుక్కల రహస్యాలతో పాటు సౌరవ్యవస్థ ఎలా ఏర్పడిందీ అనే విషయాన్ని కూడా ఫైలీ బహిర్గతం చేయవచ్చు.

‘ఎక్సోప్లానెట్’ చుట్టూ హైడ్రోజన్ మేఘాలు

july4నెప్ట్యూన్ పరిమాణంతో సౌరవ్యవస్థ ఆవల వున్న ఒక గ్రహం చుట్టూ దట్టమైన హైడ్రోజన్ మేఘాన్ని నాసా ప్రయోగించిన హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ సాయంతో శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ పరిశోధన ఆధారంగా సౌర వ్యవస్థ ఆవల సముద్రాలను కలిగియున్న గ్రహాలను కనుగొనే అవకాశాలున్నాయంటున్నారు ఈ శాస్త్రజ్ఞులు

 

 

రక్తం మార్పిడికి కృత్రిమ రక్తం

july5ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేసిన 'సింథటిక్ బ్లడ్'తో ప్రపంచంలోనే మొట్టమొదటగా ఒక మనిషికి రక్తం మార్పిడి చేసే ప్రయత్నం 2017లో జరగనుంది. ఇందుకు కావలసిన అనుమతులు కూడా లభించాయి. కొన్ని చెంచాల సింథటిక్ బ్లడ్ ఎక్కించి, శరీరంలో ఈ రక్తం ప్రసరణ వల్ల ఏమైనా దుష్పరిమాణాలు ఏర్పడుతున్నాయా అని పరిశీలిస్తారు. ఈ ప్రయోగాలు సఫలమైతే ముందు ముందు అత్యవసర పరిస్థితుల్లో రక్తదాతల పై ఆధారపడకుండా సింథటిక్ బ్లడ్ ను ఉపయోగించుకొని చికిత్సలు చేసే వీలు ఏర్పడుతుంది.

 

 

ఇంకాచాలా సంవత్సరాల పాటు పనిచేయగల మామ్

గతేడాది సెప్టెంబర్ 24న ఇస్రో అంగారక గ్రహం చుట్టూ కక్ష్యలో మార్స్ ఆర్బిటర్ మిషన్ (MOM)ను విజయవంతంగా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఉపగ్రహం ఆరు నెలల పాటు పనిచేస్తుందనుకున్నారు. కాని దానిలో ఇంకా 45 కి.గ్రా. ఇంధనం మిగిలి ఉందనీ, ఈ ఇంధనాన్ని చాలా తక్కువగానే ఉపయోగిస్తున్నందు వల్ల ఈ ఉపగ్రహం ఇంకా చాలా సంవత్సరాల పాటు పనిచేయగలదని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నెలలో దీని జీవిత కాలాన్ని మరో ఆరునెలలు పొడిగించారు. అంగారక గ్రహాన్ని సూర్యుడు భూమి నుంచి మరుగుపరచడం వల్ల ఈ ఉపగ్రహానికి జూన్ 8 - 22 వరకు భూమితో సంబంధాలు తెగిపోయాయని, కాని ఆ తర్వాత సంబంధాలు పునరుద్ధరించబడ్డాయని ఇస్రో ఛైర్మన్ తెలియజేశారు. ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత ఇప్పటివరకు ఎటువంటి సమస్యలు తలెత్తలేదని ఆయన చెప్పారు.

జూన్ 30 కి ఒక సెకను అదనం

జూన్ 30కి ఒక మామూలుగా రోజుకు 24 గంటలు. అయితే జూన్ 30కు మాత్రం ఒక సెకన్ అదనంగా చేరనుంది. భూమి స్వయం ప్రదక్షిణ సమయం తగ్గుతుండడంతో ఈ లీప్ సెకనును కలుపుతున్నట్లు నాసాకు చెందిన గొడార్డ్ స్పేస్ ఫైట్ సెంటర్ శాస్త్రవేత్త డేనియల్ మాక్మిలన్ తెలిపారు. జూన్ 30కి సాధారణంగా ఉండాల్సిన 86,400 సెకన్లకు ఒక సెకను కలిపి 86,401 సెకన్లుగా పరిగణించనున్నట్లు వెల్లడించారు. దీంతో యూనివర్సల్ కోఆర్డినేటెడ్ టైమ్ (యూటీసీ) అర్థరాత్రి 23:59:59 నుంచి 00:00:00 కు బదులు 23:59:60 గా తర్వాత 00:00:00 (జూలై 1)గా ఉంటుంది. దీని వల్ల తలెత్తే సమస్యల పరిష్కారం కోసం సాఫ్ట్ వేర్ సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. స్థిరంగా కొనసాగే ఆటమిక్ టైమ్ కు భూ స్వయం ప్రదక్షిణ సమయాన్ని అనుసంధానం చేసేందుకు లీప్ సెకను కలుపుతుంటారు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 86,400.002 సెక్షన్లు పడుతోంది. అంటే ఈ వేగం ప్రతిరోజూ సెకనులో 2 వేల వంతు తగ్గుతూ ఉంటుంది. భూమి, సూర్యుడు, చంద్రుడి మధ్య గురుత్వాకర్షణ బలాలు దీనికి కారణం. ఈ నామమాత్రం తగ్గుదల ఏడాదంతా కొనసాగితే దాదాపు ఒక సెకను అదనంగా చేరినట్లే. ఈ నేపథ్యంలో అవసరమైనప్పుడు సమయాన్ని

సరిచేసేందుకు యూటీసీకి జూన్ 30న కానీ, డిసెంబర్ 31న కానీ లీవ్ సెకండ్ ను కలుపుతుంటారు. తొలిసారి 1972లో లీప్ సెకండ్ ను కలపడం ప్రారంభించారు. ఇప్పటివరకు 26 సార్లు కలిపారు.

చందమామ వయస్సు 447 కోట్ల సంవత్సరాలట

may1భూమికి సహజ ఉపగ్రహంగా ఉన్న చందమామ వయసు 447 కోట్ల సంవత్సరాలని సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సౌర కుటుంబంలో భూమి, చంద్రుడు, ఇతర గ్రహాలు ఏర్పడడానికి ఒక భారీ ఉత్పాతం కారణమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అంగారకుని పరిమాణంలో ఉన్న “థియా' అని పిలువబడే గ్రహం వేగంగా దూసుకువచ్చి ప్రోటోఎర్త్ ను ఢీకొనడం వల్ల చందమామ ఏర్పడిందట. ప్రేలుడు సందర్భంగా చెల్లాచెదురైన శకలాలను నిశితంగా పరిశీలించి వాటి వయస్సును శాస్త్రజ్ఞులు లెక్కిస్తారు. చందమామ వయస్సునే కాకుండా భూమి ఆరంభం, మనకు ఈనాడు తెలిసిన ప్రపంచం మొదలైన కాలం తాము తెలుసుకున్నామని కొలరెడో రాష్ట్రంలోని బౌల్డర్ లోని సౌత్ వెస్ట్ రిసెర్చి ఇన్స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ విలియం బోట్ కే చెప్పారు.

రోగనిరోధక శక్తిని పెంచే పుట్టగొడుగు

 

may2పుట్టగొడుగులలో రోగ నిరోధక శక్తి పెంచే లక్షణం ఉందని ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడయ్యింది. శుభ్రంగా ఉడికించిన పుట్టగొడుగులను నెలరోజులపాటు ఆహారంగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఫ్లోరిడా పరిశోధకులు తెలియజేశారు. స్థూలకాయానికి కారణం చెడు ఆహారమే. స్థూలకాయానికి వ్యాయామం లేకపోవడం కంటే చెడు ఆహారమే కారణమని అంతర్జాతీయ నిపుణులు తెలియజేశారు. ఒక వ్యక్తి ఎంతమేరకు వ్యాయామం చేస్తున్నాడనే దానితో స్థూలకాయానికి దాదాపుగా సంబంధం లేదని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన వ్యాసంలో శాస్త్రజ్ఞులు తెలియజేశారు. వ్యాయామం వల్ల హృద్రోగంతో పాటు కొన్ని ఇతర రోగాలను నిరోధించడం సాధ్యమేనని, కాని శరీరం బరువు తగ్గడానికి వ్యాయామం మాత్రమే సహకరించదని వారు చెబుతున్నారు.

బుధగ్రహంలోకి కుప్పకూలనున్న నాసా అంతరిక్ష నౌక

may5నాలుగు సంవత్సరాలకు పైగా బుధగ్రహం చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా అంతరిక్షనౌక మెసెంజర్ ఏప్రిల్ నెలాఖరుకు బుధగ్రహంపైన కుప్పకూలనుందని, ఇంధనం ఖర్చయిపోవడం ఇందుకు కారణమని నాసా తెలియజేసింది. ఆరున్నర సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత మార్చి 18, 2011న మెసెంజర్‌ను బుధుని కక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అంతరిక్ష నౌకలో ఉన్న పరికరాల సాయంతో బుధగ్రహం గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలను తెలియజేసింది. గడ్డకట్టిన స్థితిలో నీరు, ఇతర భాష్పశీల పదార్థాలు బుధగ్రహం ధృవ ప్రాంతాల్లోని క్రేటర్స్ లో ఉన్నాయనడానికి బలమైన ఆధారాలను మెసెంజర్ తన అన్వేషణల ద్వారా అందజేసింది

మలేరియా నిరోధక వాక్సిన్

మానవాళి ఎదుర్కొంటున్న భయంకరమైన వ్యాధుల్లో మలేరియా ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో మరణాలకు కారణమవుతున్న ఈ వ్యాధికి వాక్సిన్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని బ్రిటన్ కు చెందిన ప్రొఫెసర్ బ్రియాన్ గ్రీన్ వుడ్ తెలియజేశారు. RTS, S/ASOI గా వ్యవహరిస్తున్న ఈ వాక్సిన్ కు సంబంధించి ఫేజ్-3 ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రస్తుతం యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ(EMA) ఈ వాక్సిన్ నాణ్యత, భద్రత, సామర్థ్యంకు సంబంధించే పరీక్షలు జరుపుతోందని, ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వాక్సిన్ ను మార్కెట్ లో విడుదల చేసేందుకు అక్టోబర్ నాటికి సిఫార్సు చేస్తుందని ప్రొఫెసర్ గ్రీన్ వుడ్ చెప్పారు. ఈ వాక్సిన్ సామర్థ్యాన్ని గత నాలుగేళ్లుగా పరీక్షిస్తున్నామని, క్లీనికల్ పరీక్షల్లో తీవ్రమైన మలేరియా కేసులకు సంబంధించి చిన్నపిల్లల్లో మెరుగైన ఫలితాలనివ్వడం గమనించామని ఆయన చెప్పారు.

2017 లో చంద్రయాన్

వరుసగా ఎన్నో స్ఫూర్తిదాయక విజయాలను సాధిస్తోన్న ఇస్రో 2017లో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనుంది. గతంలో చంద్రయాన్-1 విజయవంతమైన విషయం తెలిసిందే. చంద్రయాన్-2 కోసం ఆర్బిటర్, ల్యాంటర్, రోవర్లను ఇస్రో సొంతంగా తయారుచేస్తోంది. అంతరిక్షయానం చేసే వారిని అమెరికాలో ఆస్ట్రోనాట్స్ అని, రష్యాలో కాస్మోనాట్స్ అని, చైనాలో టైకోనాట్స్ అని అంటారు. మన భారతీయ వ్యోగగాముల్ని 'వ్యోమనాట్స్' అని పిలుస్తారట. 2020 తర్వాత వ్యోమనాట్స్ కక్ష్యలో పర్యటించనున్నారు.

మళ్లీ ప్రారంభమైన ఎల్. హెచ్.సి.

మహావిశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కృష్ణ పదార్థం(dark matter) అన్వేషణకు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్ (CERN) లార్జ్ హెడ్రన్ కొలైడర్ (LHC) ద్వారా పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. ఈ అన్వేషణలోనే 2012లో హిగ్స్-బోసన్ కణాన్ని సెర్న్ కనుగొంది. కాని ఆ తర్వాత 2013లో ఎల్.హెచ్.సి. ని ఆపేశారు. తాజాగా రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ ఎల్ హెచ్ సిని ప్రారంభించారు. ఈ సారి కృష్ణ పదార్థ అన్వేషణ ఇంతకు ముందు చేసిన దానికన్నా రెట్టింపు వేగంతో చేపడుతున్నారు.

నేపాల్ భూకంపం శక్తి 20 భారీ ఆటంబాంబ్లకు సమానం

ఏప్రిల్ 25 ఉదయం నేపాల్ ను నేలమట్టం చేసిన ఘోర భూకంపం గత 80 సంవత్సరాల్లో సంభవించిన భూకంపాలలోకెల్లా అత్యంత శక్తివంతమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. రిచ్టర్ స్కేల్ మీద ఈ భూకంపం తీవ్రత 7.9గా నమోదయ్యింది. అపారమైన ప్రాణనష్టం, ఆస్తినష్టం సృష్టించిన ఈ భూకంపం శక్తి 20 హైడ్రోజన్ బాంబ్ల శక్తికి సమానమని, వీటిలో ఒక్కొక్కటి హిరోషిమాను ధ్వంసం చేసిన ఆటంబాంబ్ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనవని నిపుణులు అంటున్నారు.

ఇస్రో విజయబావుటా

july1పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసుకొంటూ మునుముందుకు దూసుకు వెళ్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని విజయబావుటా ఎగరవేసింది.

జూన్ మాసపు చివరి రోజు ఉదయం గం. 9.52 ని. లకు PSLV C-23 రోదసి వాహన నౌకను సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్) నుండి ప్రయోగించారు. 44.5 మీ. పొడవు, 230 టన్నుల బరువున్న ఈ వాహక నౌక సుమారు 735 కి.గ్రాం.ల బరువున్న 5 విదేశీ ఉపగ్రహాలను, 60 కి.గ్రా. బరువు గల ISRO కు చెందిన Advanced Inertial Navigation System Payload ను మోసుకొని నిప్పులు కక్కుచు నింగిలోకి దూసుకెళ్ళింది.

పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (PSLV) శ్రేణిలో ఇది 27వది. స్టాఫాన్ బూస్టర్లు లేని PSLV వాహక శ్రేణిలో ఇది 10వది. మొత్తం 19.55 నిమిషాల్లో ప్రాన్స్ కి చెందిన Spot-7, జర్మనీకి చెందిన Aisat, కెనడాకి చెందిన NSL7.1 & 7.2, సింగపూర్ కి

చెందిన Velax ఉపగ్రహాలను నిర్దేశించబడిన సూర్యావర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తిచేసింది ఇస్రో.

తాజా ప్రయోగ విజయంతో ఇప్పటివరకు 30 దేశీయ ఉపగ్రహాలను, 19 దేశాలకు చెందిన 38 ఉపగ్రహాలను రోదసి లోకి ప్రవేశ పెట్టి వాణిజ్యపరంగా తిరుగులేని వాహకనౌకగా PSLV జయకేతనం ఎగరవేసింది. ఇసోకు నమ్మకమైన వాహకనౌకగా నిలిచింది.

ఈ ప్రయోగాన్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి ప్రత్యక్షంగా తిలకించి, పులకించి శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేసారు. ప్రముఖుల సమక్షంలో ప్రయోగం విజయవంతం కావడంతో 55 రోజులుగా అహర్నిశలు కష్టపడి PSLV C-23 ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు సంతోషాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. చెకుముకి పాఠకులు, సంపాదక వర్గం ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ... ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నాము.

సింగిడి

jan1వాన వెలిసిన తర్వాత ఆకాశంలో ఏర్పడే 'ఏడురంగుల పట్టి’, అదే సింగిడి లేదా ఇంధ్ర ధనుస్సును చూసే ఉంటారు కదూ! కాంతిలో సమ్మిళితమైన ఏడురంగులను సింగిడి వేసినపుడు మనం స్పష్టంగా చూడవచ్చు. సింగికి సాధారణంగా కొన్ని నిమిషాల నుండి గంట సేపు ఉండవచ్చు. కానీ ఇటీవల డిసెంబర్ 5న తైవాన్‌లో ఏర్పడిన సింగిడి దాదాపు 9 గంటల వరకు నిలకడగా ఉండటాన్ని చైనా సాంస్కృతిక విశ్వవిద్యాలయ వాతావరణ విభాగ ప్రొఫెసర్ చౌకున్ హుసాన్, వారి - విద్యార్థులు వీక్షించి రికార్డు చేశారు. ఇదొక ప్రపంచ రికార్డు. ఇంతకు ముందు సుదీర్ఘకాలం పున్న సింగిడి 6 గంటలుగా గిన్నీస్ ప్రపంచ రికార్డు పేర్కొన్నది. ఈశాన్య రుతుపవనాల వలన ఏర్పడిన గాలిలో తేమ, సెకనుకు 2.5 నుండి 5 మీటర్ల వేగంతో నిలకడగా వీచే గాలి 9 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సింగిడి నిలిచి ఉండటానికి కారణం.

గ్రహాంతర వాసులుండే అవకాశమున్న ‘సూపర్ ఎర్త్’ గుర్తింపు

మన భూమికి 111 కాంతి సంవత్సరాల దూరంలో భూమిని పోలిన గ్రహం ఉందని, దానిపై జీవ మనుగడకు అవకాశం ఉందనీ కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. ఈ గ్రహానికి K2-18b అని పేరు పెట్టారు. యూనోపియన్ సౌదర్న్ అబ్జర్వేటరీ ద్వారా దీనికి సంబంధించిన సమాచారం సేకరించారు. లియో నక్షత్ర కూటమి (Constellation) లో ఎర్రని మరుగుజ్జు నక్షత్రం (Red dwarf star) చుట్టూ ఈ గ్రహం తిరుగుతోంది. రాళ్ళతో నిండిన ఈ గ్రహం మీద మన భూమిలాగే వాయు వాతావరణం ఉందని, మంచు పొరలతో నిండి ఉందని వెల్లడయింది. ఈ గ్రహం దాని నక్షత్రం తాలూకు నివాసయోగ్యమైన జోన్లో తిరుగుతున్నట్లు గుర్తించారు. ద్రవస్థితిలో నీరు ఉండే పరిస్థితుల వల్ల జీవరాశికి , అవకాశాలున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయన వివరాలు Astronomy and Astrophysics Journal లో ప్రచురితమయ్యాయి.

భూమిలాంటి మరో 20 గ్రహాలు

నాసా శాస్త్రజ్ఞులు కెప్లర్ టెలిస్కోప్ సాయంతో సౌరవ్యవస్థ బయట ఉన్న మరో 20 కొత్త గ్రహాలను గుర్తించారు. వీటిలో చాలా గ్రహాలు భూవాతావరణాన్ని పోలి ఉ న్నాయని, గ్రహాంతరవాసులతో పాటు మనుషులకు నివాస యోగ్యమైన వాతావరణం వాటిపై ఉందని పేర్కొన్నారు. కొత్తగా కనుగొన్న ఈ గ్రహాలు రాళ్ళతో నిండి ఉన్నాయట. వీటి లో కెల్లా KOI-7923.01 అనే గ్రహం అచ్చంగా మన భూమిలాగే ఉండట. ఇది మనుషుల నివాసానికి చాలా అనుకూలమైనదని, దీని సైజు భూమి సైజులో 9 శాతం ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక్కడ ఆర్కిటిక్ మంచుఎడారిని తలపించే శీతల వాతావరణం ఉంది. దాని నక్షత్రం చుట్టూ తిరిగి రావడానికి 395 రోజుల సమయం పడుతుంది. అంటే ఈ గ్రహంపై ఏడాదికి 395 రోజులు.

వయసును ఆపడం అసాధ్యం

jan18ఏమనిషైనా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే దశలను దాటాల్సిందేనని వయసును ఆపడం సాధ్యం కాదని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్తలు చెల్లడించారు. DNA ను మరమ్మతు చేసే ఔషధంతో ముసలితనం రాకుండా చేస్తామని కొందరు పరిశోధకులు చెబుతున్నా అది అసాధ్యమని వీరు అంటున్నారు. ఒకకణం వయసు తగ్గించడానికి ప్రయత్నిస్తే నెమ్మదించి దాని పనితీరు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు. గణితశాస్త్ర పరంగా, తార్కికంగా, సైద్ధాంతికంగా కూడా వయసును మనిషి మరణం అనేది తిరుగులేని వాస్తవం, దాన్ని ఆపాలని ప్రయత్నిస్తే విపత్కర పరిణామాలు ఏర్పడతాయని అడ్డుకోవడం కాని తగ్గించడంకాని సాధ్యంకాదు. వారు యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోన్నా మాసెల్ చెప్పారు. ఈ వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురించబడ్డాయి.

జనవరి 31 న అద్భుతమైన చంద్రగ్రహణం

దాదాపు 152 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన సంఘటన జనవరి 31 న సంభవించింది. అదే సూపర్, బ్లడ్, బ్లూ మూన్. సూపర్ మూన్, బ్లూ మూన్, బ్లడ్ మూన్ లు. త్రీ ఇన్ వన్ ఒకేసారి సంభవించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. ఒకే నెలలో రెండుపున్నమిలు. ఈ ఏడాది జనవరి 1 పున్నమి కాగా మళ్ళీ జనవరి 31 పున్నమి. అందుకే ఇది బ్లూ మూన్. ‘వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్’ అనే నానుడి పుట్టింది కూడా ఇది అరుదైనది కాబట్టే. చందమామ భూమికి అతి దగ్గరగా వస్తే సూపర్ మూన్ అంటారు. సాధారణం కంటే 14 శాతం దగ్గరగా, 30 శాతం ఎక్కువ ప్రకాశ వంతం ఈ సూపర్ మూన్ కనిపించాడు. ఈ చంద్రగ్రహణం సంభవించే వేళ సాయంత్రం, ఇంకా చీకటి సమయం కానందువల్ల సూర్యకాంతి భూ వాతావరణంలో పరిక్షేపణం (Catering) చెంది చందమామ ఉపరితలంపై పడి జాబిల్లి ఎర్రటి రంగులో కన్పిస్తుంది. అందుకే ఈ జాబిల్లి ఒక బ్లడ్ మూన్ లేదా రక్త చంద్రుడు అవుతున్నాడు. ఇన్ని ప్రత్యేకతలు కలబోసిన ఈ అరుదైన చంద్ర గ్రహణాన్ని ప్రపంచ వ్యాప్త కోట్లాది మంది ఏ ఉపకరణాలు లేకుండానే నేరుగా చూసి ఒక మరుపురాని అనుభూతి లోనైనారు. గ్రహణాలకు సంబంధించి గూడు కట్టుకున్న మూఢనమ్మకాలకు, భయాందోలనకు వ్యతిరేకంగా జనవిజ్ఞాన వేదిక గళమెత్తింది. ప్రజల్లో అవగాహన కల్పించింది.

2018 ఖగోళ అద్భుతాల సంవత్సరం

మార్చి 7, 8 గ్రహాల సందడి: ఫిబ్రవరి చివరి రోజులు మార్చి తొలి రోజుల్లో వేకువ ఝామున లేచి ఆకాశంకేసి ఆగ్నేయ దిశగా చూస్తే ఒక సుందర దృశ్యం కన్పిస్తుంది. శనిగ్రహం, బుధుడు, బృహస్పతి ఆకాశంలో దగ్గర దగ్గరగా తచ్చాడుతున్నట్లు మనం గమనిస్తాం. మార్చి 7 మొదలుకుని కొన్ని రాత్రిళ్ళు ఉబ్బెత్తుగా ఉండే క్షీణ చంద్రుడు (Waning gifloous moon) ఒక వరుసలో కొలువు తీరినట్లుండే ఒక్కొక్క గ్రహాన్ని పలకరించడానికి వెళ్ళున్నట్లు అగుపిస్తాడు. మార్చి 8 న చందమామ బుధుడు (Mars) బృహస్పతి (Jupiter) మధ్య చిక్కుకున్నట్లుగా కన్పిస్తాడు.

జూలై 15, శుక్ర గ్రహాన్ని కలిగే చంద్రుడు: సాయంత్రం ఆకాశం కేసి చూస్తే అమావాస్య తరువాత వృద్ధి చెంతున్న చందమామ ఆశ్యర్యం కలిగేంచేలా శుక్ర గ్రహానికి అతి దగ్గరగా కన్పిస్తాడు. నైరుతి ఆకాశం దిగువకు చూడాల్సి ఉంటుంది. ఉత్తర అమెరికాలోనైతే ఆ దృశ్యం మరింత మనోహరంగా ఉంటుంది. నింగి నేల కలుస్తున్నాట్లు ఉండే చోట ఈ దృశ్యం ఆకట్టుకుంటుంది.

జులై 27, సంపూర్ణ చంద్రగ్రహణం: ఈ ఏడాదిలో ఇది రెండోసారి వస్తున్న చంద్రగ్రహణం, జులై 27 సాయంత్రం దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రవం కనీసం కానీ జనవరి 31 సంపూర్ణ చంద్ర గ్రహానికీ దీనికి ఉంది. ఎందుకంటే, ఈ సార్ చందమామ భూమి నుంచి గరిష్ట దూరానికి చేరుకున్న దాదాపు 12 గంటల తర్వాత సంవత్సరంలోనే అతిచిన్న పున్నమి చంద్రుడు అవుతాడు.

జూలై 27, అత్యంత కాంతి వంతంగా అరుణ గ్రహం: 2003 తర్వాత ఈ ఎడాది జూలై 27 న బుధగ్రహం (Mars) అతిపెద్దదిగా అత్యంత ప్రకాశవంత మైన ఎరుపురంగులో కన్పిస్తుంది. ఆ రోజునే సంపూర్ణ చంద్రగ్రహణం కావడం విశేషం. బుధుడు చందమామ మీదికి జారుతున్నట్లు చాలా దగ్గరగా కన్పిస్తాడు. ఆకాశంలో సూర్యడికి ఎదురుగా తన కక్ష్యలోని ఒక స్థావరంలో ఉన్న స్థితిలో బుధుడుంటాడు. ఈ స్థితిలో దక్షిణ ఆకాశంలో నారింజ ఎరుపు రంగులో ధగధగ మెరిసిపోతూ కన్పిస్తాడు. అంగారకుడు (Mars). నిజాని సూర్యుని చుట్టూ బుధని కక్ష్య నిర్దిష్టమైన వలయాకార (Circular) గా ఉండదు. భూమి నుంచి చూసే ఒకప్పుడు దగ్గరగా మరొకప్పుడు దూరంగా ఉంటాడు. జూలై 31 న ఇంకా సూర్చుడికి ఎదురుగా ఉండే స్థితిలోనే భూమికి అతి దగ్గరగా 35.8 మిలియన్ వెళ్ళ దూరంలో ఉంటాడు. ఈ కారణంగానే బుధుడు మామూలు కన్నా చాలా పెద్దదిగా, అత్యంత ప్రకాశవంతంగా కన్పిస్తాడు. ఈ ఖగోళ అద్బుతం తిరిగి చూడాలంటే 2035 దాకా అగాల్సిందే.

మాములు కంటికే ఈ అరుణగ్రహం అద్భుతంగా కన్పిస్తుంది. కానీ మరింత శోభాయమానంగా, స్పష్టంగా చూడాలంటే ఇంటి పెరటివైపున ఒక టెలిస్కోప్ తో చూడాలి. బుధుని ఉ పరితలం మీద ఎన్నెన్నో విశేషాలు ముఖ్యంగా తెల్లటి ధృవటోపీలు (Polar caps), అలాగే చీకటి అలముకున్నట్లుండే అగ్నిపర్వతాల మైదానాలు (Volcanic plains) కన్పిస్తాయి.

ఆగష్టు 11, పాక్షిక సూర్యగ్రహణం: ఆగష్టు 1 న సూర్యోదయంవేళలో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది. ఉత్తర అమెరికా, ఐరోపాల్లోని ఉత్తర ప్రాంతాలు, గ్రీన్ ల్యాండ్, ఐస్ ల్యాండ్, ఆసియాల్లోని ప్రజలు దీన్ని వీక్షించవచ్చు. ఆయా ప్రాంతాల భౌగోళిక స్థితిని బట్టి సూర్యబింబం ఎంత పెద్దదిగా కన్పిస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. రష్యాలోని కొన్ని మారు మూలప్రాంతాలు, ఈశాన్య చైనాలోని హార్బిన్ నగరం వంటి ప్రాంతాల్లోనైతే చాలా అద్భుతంగా కన్పిస్తుంది. ఈ ప్రాంతాల్లో సాయంత్రం వేళలో చంద్రుని నీడ సూర్యుణ్ణి 37 శాతం కప్పివేస్తుంది. భూమ్మీద నుంచి చూస్తే పాక్షిక సూర్యగ్రహణం కన్పిస్తుంది.

ఆగష్టు 12-13, పెర్సీడ్ ఉల్కాపాతం: ఈ నెల సంభవించే రాలుడు నక్షత్రాలు పెర్సియస్ నక్షత్ర సముదాయంలోని ఒక బిందువు నుంచి పడుతున్నట్లుగా కన్పిస్తాయి. అందుకే దీన్నీ పెర్నీ ఉల్కాపాతం అంటారు. గంటకు 60 దాకా ఉల్కలు కురిపించే ఒక అపూర్వ ఖగోళ సన్నివేశం ఇది. ఆగ 12 కు ముందు రోజు అమావాస్య. కాబట్టి 12 రాత్రి దాదాపుగా చంద్రుడు లేని వేళలో 13 తెల్లవారేముందు సంభవించే ఉల్కాపాతం ఏదో సినిమా సెట్టింగ్ లో మాదిరిగా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో చంద్రోదయ వేళ ఈ ఆకాశ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే.

ఒక తోకచుక్క మార్గంలోకి భూమి ప్రవేశించినప్పుడు ఉల్కాపాతం అనేది ఏర్పడుతుంది. ఈ సందర్భంలో తోకచుక్క ఇసుక రేణువుల సైజులో ఉంటుంది. ఇవి భూవాతావరణంలో ప్రవేశించే శిధిలాల బిట్స్ నే ఉల్కలంటారు.

బహుళ వర్ణ మేఘ ధనస్సు

mar1బ్రెజిల్‌లోని రియో డి జెనెరో ఒక పర్యాటక ప్రదేశం. ఇటీవల అక్కడి ఆకాశంలో ఒక అరుదైన, అపురూప దృశ్యం చూసి బ్రెజిల్ వాసులు తమకళ్ళను తామే నమ్మలేకపోయారు. సంభ్రమాశ్యర్యాలకు లోనయ్యారు. ఇంద్రధనుస్సును తలపించే రంగురంగుల మేఘాన్ని చూసి పరవశులయ్యారు. ఈ బహుళ వర్ణ మేఘం (multi-colored cloud) దాదాపు అరగంట పాటు ఆకాశంలో కనువిందుచేసింది. అదే వారంలో కాస్త ముందుగా ఆస్ట్రేలియాలోని డార్విన్ లో కూడా ఈ రంగురంగుల మబ్బులు కన్పించాయి. కొందరు దీన్ని హిమ పట్టకం (Ice Prism) అన్నారు. మరికొందరు మేఘధనుస్సు (Cloud bow) అన్నారు. మబ్బు ఆవిష్కృతమవుతున్న కొద్దీ రంగులు కూడా మారాయి. చిన్న నీటి బిందువులు లేదా చిన్న మంచుస్ఫటికాలతో కూడిన పల్చని మేఘాలు ఒక దాని వెంట ఒకటిగా అనేకం చేరినప్పుడు పరిస్థితులు అనుకూలించి ఆ మేఘాలు రంగురంగుల్లో కన్పిస్తాయి. వేర్వేరు కోణాల్లోంచి చూస్తే రంగులు మారుతుంటాయి. దీన్నే క్లౌడ్ ఇండిస్టెన్స్ (Cloud iridescence) అంటారు. ఎక్కువ సాంద్రతవున్న మంచుస్పటికాల గుండా సూర్యకాంతి వివర్తనం (Diffraction) చెందినప్పుడు కాంతి పంగుతుంది. అద్భుతమైన కాంతులు ఏర్పడతాయి.

లేజర్ కిరణాలతో స్మార్ట్ ఫోన్ లకు వైర్లెస్ ఛార్జింగ్

గదిలో ఎక్కడినుంచైనా సరే లేజర్ కిరణాలతో స్మార్ట్ ఫోన్లను ఛార్జ్ చేసే కొత్త వ్యవస్థను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందుకోసం మొబైల్ వెనక భాగంలో పల్చని పవర్ సెల్ అమరుస్తారు. దీని ద్వారా లేజర్ బీం చుట్టూ 4.3 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్ వేగంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ లో చంద్రయాన్ - 2, ప్రయోగం

ప్రతిష్టాత్మక చంద్రయాన్-2 మిషన్ ద్వారా చంద్రుడి పైన ఎవరూధింపనిచోట తొలిసారిగా రోవరను దిం పెందుకు ఇస్రో సిద్ధమవుతోందని ఇస్రో చైర్మన్ డాకర్ కె. శివన్ ప్రయోగించనున్నారు. ఈ రోవర్ చంద్రుని ఉపరితలంపై 14 రోజులు ఉంటుందని, అక్కడ 150 - 200 కిలో మీటర్ల వరకు నడిచి అక్కడి మట్టి నమూనాలను రసాయన విశ్లేషణం చేస్తుందని డా. శివన్ చెప్పారు.

193 జన్యువ్యాధులకు ఒకే DNA పరీక్ష

mar9ఇది చిన్న పిల్లల తల్లిదండ్రులకు శుభవార్తే. ఎందుకంటే, చిన్న పిల్లలకు ముందుముందు ఏవైనా జన్యువ్యాధులు వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన జన్యుపరీక్షల కంపెనీ 'సీమా4' ఒక పరిష్కారాన్ని చూపించింది. 'సీమా4 నాటాలిస్' అనే జన్యు పరీక్షతో అప్పుడే పుట్టిన వారినుంచి పదేళ్ళలోపు పిల్లలకు వచ్చే మూర్చ, కేన్సర్, కండరాల క్షీణత ఇలా 193 జన్యురోగాలను ముందే కనిపెట్టవచ్చునని తెలియజేశారు. వ్యాధులు వచ్చే అవకాశాన్ని ముందే గుర్తిస్తే, దాని పర్యవసానాన్ని అడ్డుకునేలా వైద్యం చేసేందుకు ఈ పరీక్ష తోడ్పడుతుందని సీమా4 కంపెనీ తెలియజేసింది. చీక్ స్వాబ్‌తో పిల్లల చెంపకు వున్న లాలాజలాన్ని సేకరించి ఈ పరీక్ష నిర్వహిస్తారట.

రోబో సోఫియా మనసు విప్పి మాటాడింది

mar16హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఐటీ సదస్సు హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా' తన వాక్చాతుర్యంతో సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రపంచంలోనే ఒక దేశ (సౌదీ అరేబియా) పౌరసత్వం పొందిన రోబో సోఫియా. సదస్సులో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు తెలివిగా జవాబులు చెప్పింది. భావోద్వేగాలు నిండిన తన అంతరంగాన్ని ఆవిష్కరించింది అందరూ ఫిదా అయిపోయారు. భవిష్యత్తులో రోబోలు, మనుషులు కలిసి మెలిసి జీవించాలని, అంతటా ప్రేమ నిండాలని తన మనసులో మాటను చెప్పింది. బాలీవుడ్ లో తన కిష్టమైన నటుడు షారుక్ ఖాన్ అని, తన సృష్టికర్త డేవిడ్ హాన్సన్ తో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఇక సోఫియా సృష్టికర్త డేవిడ్ హాన్సన్ మాట్లాడుతూ, సోఫియా రహస్యాన్ని వెల్లడించారు. రోబోటిక్ హార్డ్ వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ వేర్, స్పీచ్ రికగ్నిషన్, కృత్రిమ చర్మం... ఈ నాలుగింటి కలయికే సోఫియా అన్నారు. కాగా, కృత్రిమ మేధతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం ఏదీ ఉండదని, యంత్రాల గురించి భయపడకూడదు కానీ, వచ్చే ప్రమాదాల గురించి ముందే తెలుసుకుని ఉండాలని, అదే సమయంలో వాటి వల్ల కలిగే లాభాలను గురించి కూడా ఆలోచించాలన్నారాయన.

టోక్యోలో రోబో

టోక్యో డౌన్‌టౌన్ లోని ఒక కాఫీ షాప్ కు కస్టమర్లు ఎక్కువగా వస్తున్నారట. ఈ షాపు పేరు హెన్నా కఫే అంటే ఒక వింత కాఫీషాపు అని అర్థం. ఇంతకీ ఏమిటా వింత? ఇక్కడ కాఫీ తయారుచేసి కస్టమర్లకు అందించేది సాయర్ అనే ఒక రోబో. అక్కడి వెండింగ్ మెషీన్ లో కొన్న టికెట్ ను చూపిస్తే దాన్ని రోబో స్కాన్ చేసి కస్టమర్లను సాదరంగా ఆహానిస్తుంది. “మీకు మంచి కాఫీ ఇస్తా కూర్చోండి.” అంటుంది. “మీ ఇంట్లో కాఫీ కన్నా బాగుంటుంది త్రాగి చూడండి.” అని హుందాగా చెబుతుంది. టోక్యో షిబుయా షాపింగ్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళినప్పుడు ఓ కప్పు త్రాగి చూడండి మరి.

నెప్ట్యూట్యూన్ గ్రహం మీద కుదించుకుపోతున్న చీకటి తుఫాన్

నేష్యూన్ గ్రహం మీద తుచిక్కని చీకటి తుఫాన్లు (dark storms) ఉన్నాయని 1980 దశకంలోనే నాసా వాయేజర్-2 అంతరిక్షనౌక కనుగొంది. ఇప్పుడు కొత్తగా కనుగొన్న ఒక చీకటి తుఫాన్ ను మూడేళ్ళ క్రితమే 2015 లో గుర్తించారు. కాని అప్పట్లో దాని స్వభావం గుట్టు విప్పలేకపోయారు. కానీ ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తాజాగా చేసిన అధ్యయనంలో ఈ తుఫాను కుళ్ళిన కోడిగుడ్డు వాసనతో రోజురోజుకూ కుదించుకుపోతోందని కొంతకాలానికి పూర్తిగా కనుమరుగు కావచ్చని చెప్పారు. ఇది అపసవ్య దిశలో పరిభ్రమిస్తూ నెప్యూన్ గ్రహం వాతావరణం లోతుల్లోంచి ద్రవ్యాన్ని పైకీ తవ్వితేస్తోందని, ఈ వాసనను బట్టి ఈ డార్క్ స్టార్స్ కు కారణం హైడ్రోజన్ వాయువు కావచ్చునని జోషువా లెపన్ తెలియజేశారు.

కొత్త బ్లాక్ హోల్ కు స్టీఫెన్ హాకింగ్ పేరు

apr1రష్యాకు చెందిన వ్యోమగాములు ఇటీవల ఒక కొత్త బ్లాక్ హోల్ ను కనుగొన్నాడు. స్టీఫెన్ హాకింగ్ మార్చి 14న మరణించగా 2 రోజుల తర్వాత ఈ బ్లాక్ హోల్ ను కనుగొన్నారు. తన జీవితకాలమంతా విశ్వరహస్యాలను ఛేదించడంలోనే నిమగ్నమై, ముఖ్యంగా బ్లాక్ హోల్స్ కు సంబంధించి అనేక కొత్త సిద్ధాంతాలను ఆయన ప్రతిపాదించి లార్డ్ ఆఫ్ బ్లాక్ హోల్స్ గా ఖ్యాతిగడించారు. ఆయనకు ఘనమైన నివాళిగా ఈ కొత్త బ్లాక్ హోల్ కు ఆయన పేరు పెట్టారు. ఇది ఓఫికస్ నక్షత్రాల కూటమిలో (ophiuchus constellation) ఉన్నట్లు మాస్కోస్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ కూటమిలోని నక్షత్రం పతనం కావడం వల్ల గామా కిరణాల ప్రేలుడు సంభవించి బ్లాక్ హోల్ ఏర్పడిందన్నారు. ఈ శక్తివంతమైన ప్రేలుళ్ళను స్పేయిన్ దేశంలోని టెనెరిఫ్ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన మాస్టర్ ఐఏసీ రోబోటిక్ టెలిస్కోప్ చిత్రంలో బంధించింది.

ఒలింపిక్ రింగ్ ఆకారంతో అణువు స్పష్టి

ఒలింపిక్ గేమ్స్ లోగోను పోలిన హైడ్రో కార్బన్ అణువు ‘ఒలింపిసీన్’ (olympicene) ను శాస్త్రవేత్తులు సంశ్లేషణం చేశారు. దీని ఫార్ములా C­­1912 తెల్లని చూర్ణం. నానో పరిమాణంలోని డెకాధ్లీన్ ను ఇవి పోలి ఉంటాయి. ఈ అణువులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అత్యాధునిక సెన్సార్స్, ఇన్ఫర్మేషన్ మరియు ఎనర్జీ స్టోరేజి, హైటెక్ LED లు, సోలార్ సెల్స్ లో వీటిని ఉపయోగిస్తారు.

అల్ట్రా మాసివ్ బ్లాక్ హోల్స్ గుర్తింపు

apr10మహ విశ్వంలో ఇప్పటి దాకా శాస్త్రజ్ఞులు గుర్తించిన అతిపెద్ద బ్లాక్ హోల్ కన్నా ఇంకా పెద్దవైన అల్ట్రా మాసివ్ బ్లాక్ హోల్స్ ()లను స్పేయిన్ శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇవి భూమి నుంచి 3.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. నాసా ప్రయోగించిన చంద్రా ఎక్స్‌రే టెలిస్కోప్ సేకరించిన డేటా ఆధారంగా ఈ బ్లాక్ హోల్స్ ను గుర్తించారు. ఈ పరిశోధనలకు యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్, స్పేయిన్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ లకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు 72 గాలక్సీలను పరీక్షించారు. ప్రతి గెలాక్సీ కేంద్రం వద్ద ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఉన్నట్లు గుర్తించారు. చంద్రా టెలిస్కోప్ బంధించిన రేడియో తరంగాలు, X-కిరణ ఉద్గారాలను విశ్లేషణ చేసి ఈ బ్లాక్ హోల్స్ ద్రవ్యరాశిని నిర్ణయించారు. వీటిలో సగానికి పైగా బ్లాక్ హోల్స్ సూర్యుని కన్నా 10 బిలియన్ రెట్లు ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉన్నాయి. ఇంతకు ముందు ఖగోళ శాస్త్రవేత్తలు ఊహించిన దానికన్నా ఇది పదిరేట్లు ఎక్కువ. ఇంతటి భారీ ద్రవ్యరాశి ఉండడంవల్ల వీటిని అల్ట్రామాసివ్ బ్లాక్ హోల్స్ గా అభివర్ణిస్తున్నారు. వివరాలు రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ వారి జర్నల్ లోఇటీవల ప్రచురితమయ్యాయి.

వాటర్ బాటిల్స్ లోని నీటిలో ప్లాస్టిక్ కణాలున్నాయంటున్న అధ్యయనాలు

apr12మామూలు కుళాయి నీళ్ళకంటే వాటర్ బాటిల్స్‌లోని నీళ్ళు (bottled water) ఆరోగ్యరీత్యా మంచివని జనం నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం జోరుగానే సాగుతోంది. కానీ ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వారు ప్రపంచంలో ఎక్కడైనా సరే 90 శాతం బాటిల్డ్ వాటర్ లో మైక్రోప్లాస్టిక్ కణాలున్నాయని కనుగొన్నారు. ఈ మైక్రోప్లాస్టిక్స్ వల్ల కలిగే దుష్ఫలితాలను గురించి WHO సమీక్షిస్తోందని గార్డియన్ పత్రిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 9 వేర్వేరు దేశాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో 11 పాప్యులర్ బ్రాండ్లను ఈ అధ్యయనంలో పరీక్షించారు. సగటున 325 ప్లాస్టిక్ కణాలున్నాయట. ఈ 9 దేశాల్లో అమెరికా, చైనా, ఇండియా కూడా ఉన్నాయి.

అమెరికాలో స్నో ఎమర్జెన్సీ

may1అమెరికాలోని అనేక ప్రాంతాల్లో మంచు తుఫానులు సంభవిస్తూ జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తుండడంతో అధికారులు స్నో ఎమర్జెన్సీని ప్రకటించారు. అమెరికా మిడ్ వెస్ట్, మైదాన ప్రాంతాల్లో ఏప్రిల్ 14 శనివారం నాడు విపరీతమైన గాలులతో మంచుతుఫాను సంభవించింది. అదే సమయంలో అమెరికా దక్షిణ ప్రాంతంలో టోర్నడోలు, ఉరుములతో కూడిన గాలివాన కురిసి ప్రజలను భయభ్రాంతుల్ని చేశాయి. మిన్నెసోటా, నెబ్రస్కలోవా, దక్షిణ డకోటా ప్రాంతాల్లో మంచు తుఫానుకు సంబంధించిన హెచ్చరికలను ప్రభుత్వం జారీచేసింది. ప్రత్యేకించి సెయింట్ పాల్ సీటీ మిన్నెసోటాలలో మంచుతుఫానులతో కూడిన ఎమర్జెన్సీ ప్రకటించారు.

జులైలో సూర్యునికి చాలా మానవ యాత్రకు శ్రీకారం చుడుతున్న నాసా

భగభగ మండుతూ భీకరమైన వేడిని, రేడియోషన్ ను వెలువరించే సూర్యుడు. సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటికి శక్తిప్రదాత పార్కర్ సూర్యుడే. మన భూమికి దగ్గర్లోని నక్షత్రం కూడా సూర్యూని బాహ్య వాతావరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నక్షత్రాలకు సంబంధించి ఎంత కాలంగానో ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించేందుకు నాసా నడుంకట్టింది. ఇప్పటిదాకా ఏ మానవ నిర్మితమైన వస్తువు లేదా పరికరం ప్రవేశించనంత దగ్గరగా సూర్యుని వాతావరణంలోకి నేరుగా ప్రవేశించి అక్కడి తీక్షణమైన వేడిని, రేడియేషన్లను ఎదుర్కొంటూ అధ్యయనం చేసేందుకు సూర్యుని కరోనాలోకి ప్రవేశించేలా సోలార్ ప్రోబిను ప్రయోగానికి సిద్ధం చేస్తోంది నాసా. జూల్ 31 న ఈ అంతరిక్ష నౌకను ఫారిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు. సూర్యుని కరోనా చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తూ ఎన్నో పరిశీలనలు చేస్తూ విలువైన సమాచారం సేకరిస్తుంది.

పాలపుంత గెలాక్సీ మధ్యలో వేలకొలదీ బ్లాక్ హోల్స్

మన పాలపుంత గెలాక్సీ (Milky Way galaxy) మధ్యలో సాజిట్టారియస్ A(Sgr A) సూపర్ మాసివ్ బ్లాక్ హెుల్ లేదా అతిపెద్ద కాలబిలం ఉంది. దీని చుట్టూ కొత్తగా ఒక డజను బ్లాక్ హెూల్స్ ను ఇటీవల అమెరికాలోని కొలంబియా యూనివర్సీటీకి చెందిన అంతరిక్ష శాస్త్రజ్ఞుల బృందం గుర్తించింది. అందుబాటులో ఉన్న ఎక్స్‌రే పరిశీలనల తోడ్పాటుతో వీటిని గుర్తించారు. వీటితో కలిపి ఇప్పటిదాకా 5 డజన్ల బ్లాక్ హెల్స్ ను మిల్కీవే గెలాక్సీలో గుర్తించినట్టయింది. సాధారణంగా బ్లాక్ హెూల్స్ ఉనికిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వాటినుంచి కాంతి కిరణం బయటికి రాలేదు. కానీ శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం ఇలాంటి బ్లాక్ హెూల్స్ 10,000 నుంచి 20,000 దాకా మిల్కీవే గెలాకీ మధ్యలో దాగి ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ అధ్యయన బృందానికి చెందిన ప్రొఫెసర్ ఛెక్ హైలీపాలపుంత గెలాక్సీ మధ్యలో వేలకొలదీ బ్లాక్ హోల్స్ కొన్ని వివరాలు తెలియజేశారు. మిల్కీవే గెలాక్సీ కేంద్రం ఒక అంతుబట్టని అద్భుతమైన ప్రదేశం. అక్కడ ఏడా చాలా జరుగుతోంది దీన్ని అధ్యయనం చేయాలన్న ఆసకి చాలా మందిలో ఉంది ఈ గెలాక్సీలోని బ్లాక్ హె్యూ చుట్టూ ఇంకా ఎంతో ఖాళీప్రదేశం, వాయువు ఉన్నాయి. కొత్తగా కనుగొన్న బ్లాక్ హెూల్స్ ద్రవ్యరాశి సూర్యుడి కంటే 10 రెట్లు ఎక్కువ కానీ గెలాక్సీ మధ్య ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హెూల్ వేరొకనక్షత్రంతో కలిసి జంటగా ఉంటుంది. ఈ జంట ఎక్స్ కిరణాలను ఉద్గారం చేయడం వల్లపాటి ఆధారంగా శాస్త్రజ్ఞులు వాటిని అధ్యయనం చేస్తారు. నిజానికి బైనరీ బ్లాక్ హెూల్స్ అనేవి మొత్తం బ్లాక్ హెూల్స్లో 5 శాతం మాత్రమే ఉంటాయని, అందుచేత మిల్కీవే గెలాక్సీ మధ్యలో వేలకొలదీ బ్లాక్ హెూల్స్ ఉండవచ్చునని ప్రొఫెసర్ హాలీ చెప్పారు. ఈ అధ్యయనం వివరాలు నేచర్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యాయి.పార్కర్ ప్రోబ్ తో ఎవరైనా తమ పేర్లను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికీ సూర్యుడి దాకా పంపేందుకు నాసా ఆహ్వానం

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికి నాసా అందించిన ఆహ్వానం ఇది. ఎవరైనా తమ పేర్లను ఆన్లైన్ ద్వారా పంపిస్తేవారి పేరు పార్కర్ లోని మైక్రో ఛిప్ లో చేరుస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 దాకా పేర్లను నమోదు చేసుకున్నవారికి ఈ అవకాశం లభించింది. అంటే ఈ సౌరయాత్రలో వారు కూడా పాల్గొన్నట్లే మరి!

ఇస్రో మరో విజయం పూర్తిస్థాయిలో నావిక్ దిక్సూచి వ్యవస్థ

ఇక ముందు అమెరికా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (GPS) పై ఆధారపడవలసిన అవసరం మనకు లేదు. మన దేశంలో పౌర అవసరాలకే కాకుండా సైనిక అవసరాలకు కూడా ఉపయోగపడే నావిక్ దిక్సూచి వ్యవసపూర్తిగా అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఇస్రో ఏప్రిల్ 12 న చేపట్టిన PSLV-C41 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఆకాశంలోకి దూసుకుపోయిన రాకెట్ IRNSS-1I (Indian Regional Navigation Satellite-1I) ను నిర్దేశించిన భూసమస్థితి (geosychronous) కక్ష్యలో ప్రవేశపెట్టింది. 2013 జూలైలో ప్రయోగించిన IRNSS1A లోని రుబీడియం గడియారాలు విఫలం కావడంతో దానిస్థానంలో పనిచేసేందుకు IRNSS-1I ని ప్రయోగించారు. దీనితో నావిక్ వ్యవస్థలో మొత్తం 7 ఉపగ్రహాలు రోదసిలో ఉన్నాయి. ఈ నావిక్ దిక్సూచి వ్యవస్థ సాయంతో దేశమంతటా వాహనాలు, నౌకలు, విమానాలకు, దిశానిర్దేశం చేయవచ్చు. త్వరలోనే నావిక్ ఆధారిత యాప్‌లను విడుదల చేస్తామని ఇస్రో చైర్మన్ కె. శివన్ వెల్లడించారు. ఈ యాప్‌లను మొబైల్స్‌లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఘనవిజయం సాధించిన ఇస్రో శాస్త్రజ్ఞులను జనవిజ్ఞాన వేదిక అభినందించింది.

పసిఫిక్ లో కూలిన చైనా స్పేస్ ల్యాబ్

may17నియంత్రణ కోల్పోయి తన గతితప్పిన చైనా స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-1 ఏప్రిల్ 2న దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. దీంతో అది ఎక్కడ పడుతుందో, ఏ ప్రమాదం జరుగుతోందనన్న భయానికి తెరపడింది. ఈ స్పేస్ ల్యాబ్ ను చైనా 2011 సెప్టెంబర్ 29 న ప్రయోగించింది. 12 మీటర్లపొడవు, 8 టన్నుల బరువున్న తియాంగాంగ్-1 2016 మార్చిలో పనిచేయడం ఆగిపోయి నెమ్మదిగా కక్ష్య నుంచి జరుగుతూ నియంత్రణ కోల్పోయింది.

 

అంగారకుడిపైకి నాసా ల్యాండర్ ‘ఇన్ సైట్'

jun12018 మే 5న నాసా తాను రూపొందించిన ల్యాండర్ ను అంగారక గ్రహం (Mars) పైకి పంపింది. కాలిఫోర్నియాలోని వాన్ డెన్డర్డ్ ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచి అట్లాస్ V-401 రాకెట్‌తో దీన్ని ప్రయోగించింది. ఈ ల్యాండర్ పేరు 'ఇన్ సైట్' (InSight - Interior Exploration Using Seismic Investigations, Geodesy and Heat Transport). అంగారక గ్రహం భూకంప ప్రాంతంగా ఎలా ఉందో తెలుసుకోవడం దీని పని. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం మన భూమి లాంటి రాతి గ్రహాలు (rocky planets) ఎలా ఏర్పడ్డాయో గ్రహించడం వంటి లక్ష్యాలు ఈ ల్యాండర్ కు నిర్దేశించిన లక్ష్యాల్లో ఉన్నాయి. అనుకున్న ప్రకారమే అన్నీ జరిగితే నవంబర్ 26న ‘ఇన్ సైట్’ అంగారకుని పైన ఎలైసియం ప్లానిటియా ప్రాంతంలో దిగుతుంది. ఈ ల్యాండర్ లోని పరికరాల్లో ముఖ్యమైనది ఒక సీస్మోమీటర్.

మంచు మేఘాల చిత్రాలను తీసిన నాసా ఉపగ్రహం

jun82017 మే నెలలో నాసా ఒక చిన్న ఉపగ్రహం 'ఇన్ క్యూబ్' ను ప్రయోగించింది. ఒక రొట్టెముక్క సైజులో కేవలం 10 పౌండ్ల బరువున్న ఈ ఉపగ్రహం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా మంచుమేఘాల్లోని (Ice cloud) ఘనీభవించిన చిన్న చిన్న స్పటికాల ఫోటోలను తీసింది. మంచు మేఘాలు వాతావరణంలో చాలా ఎత్తున చిన్న కణాలుగా ప్రారంభమై తేమను పీల్చుకుని మంచుస్ఫటికాలుగా మారి బరువెక్కుతాయి. ఇవి కిందికి పడుతూ కరిగి వర్షపు బిందువులను ఏర్పరుస్తాయి. భూమి శీతోష్ణస్థితి, వాతావరణ మోడల్స్ ను మంచుమేఘాలు ప్రభావితం చేస్తాయి. కుండపోతగా కురిసే వర్షాలకు ఇవి కారణమవుతాయని పరిశోధకుల్లో ఒకరైన డాంగ్ పూ చెప్పాడు.

మహా విశ్వంలోనే అతివేగంగా ఎదుగుతున్న బ్లాక్ హోల్ గుర్తింపు

మహావిశ్వంలో ఇప్పటిదాకా గుర్తించిన బ్లాక్ హెూల్స్లో అతివేగంగా ఎదుగుతున్న ఒక బ్లాక్ హెూలను ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ (ANU) కి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రతి రెండు రోజుల్లో సూర్యుడికి సమానమైన ద్రవ్యరాశిని కబళించే రాకాసి బ్లాక్ హెూల్ గా దీన్ని వర్ణించారు. వీరు మహావిశ్వం వయసులో 12 బిలియన్ సంవత్సరాలు వెనక్కువెళ్ళి అప్పటి పరిస్థితులను ప్రత్యేక పరికరాల ద్వారా పరిశోధించి చూశారు. ఈ సూపర్ మాసివ్ బ్లాక్ హెూల్ అప్పట్లోనే సూర్యుని సైజుకు 20 బిలియన్ రెట్లు ఉండేదని, ప్రతి మిలియన్ సంవత్సరాలకు ఒక శాతం చొప్పున ఎదుగుతోందని కనుగొన్నారు. ఇలా అతివేగంగా ఎదుగుతూ ఏకంగా ఒక గెలాక్సీకి మించిన కాంతితో ప్రకాశిస్తోంది. దీనికి కారణం ఈ బ్లాక్ హెూల్ ప్రతిరోజూ భారీస్థాయిలో వాయువులను పీల్చుకుంటూ ఉండడం వల్ల అమితమైన ఘర్షణ, వేడి ఏర్పడడమేనని ANU కి చెందిన శాస్త్రవేత్త క్రిస్టియన్ వోల్ఫ్ చెప్పారు. ఈ రాకాసి బ్లాక్ హోల్ సు క్వాసర్ పిలుస్తున్నారు. ఇది మన పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉంటే పున్నమి చంద్రుడు కంటే పదిరెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది ఆల్ట్రా వయొలెట్ కాంతిని, X-కిరణాలను అధికంగా వెలువరిస్తుందని, ఈ అధిక X- కిరణాల ధాటికి మన భూమ్మీద అసలు జీవరాశికి ఆస్కారమే ఉండదని శాస్త్రవేత్తలు చెప్పారు.

లావాను విరజిమ్మిన అగ్నిపర్వతం

హవాయి ద్వీపంలోని కీలావూ అగ్నిపర్వతం ఇటీవల ప్రేలి భీభత్సం సృష్టించింది. లావాను విరజిమ్మడంతో పాటు భారీస్థాయిలో సల్ఫర్ డై ఆక్సైడ్ వాయువును వెలువరించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వందలాదిమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత ఒక వారం పాటు పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక రోడ్డు పగిలి అక్కడి నుంచి ఆకాశమంత ఎత్తుకు లేచిన లావాలో రోడ్లు మునిగిపోయాయి.

జలుబు నివారణ సాధ్యమే

jun18జలుబుకు కారణమయ్యే వైరసను అడ్డుకునే జీవాణువును లండన్ లోని ఇంపీరియల్ కాలేజికి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. జలుబువైరస్లు N-మైరిస్టోల్ ట్రాన్స్‌ఫరేజ్ (NMT) అనే ఎంజైమ్‌లు లాక్కుని దాన్నో కవచంలా వాడుకుని శరీరమంతా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరు రూపొందించిన కొత్త అణువు NMT ఎంజైమ్ ను అడ్డుకుంటుంది. ఫలితంగా జలుబు వైరస్ వ్యాపించడం ఆగిపోతుంది. ఈ కొత్త అణువుతో పీల్చడానికి వీలుగా ఉండే ఔషధాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇంపీరియల్ కాలేజీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎడ్ టటే చెప్పారు.

కరుగుతున్న మంచుతో తగ్గుతున్న గ్రీన్ లాండ్ సముద్రపు లవనీయత

గ్రీన్ లాండ్ లో మంచు కరగడం వల్ల అక్కడికి  కోస్త జలాల్లో లావణీయత తగిపోతోందని. దీని ప్రభావం సముద్ర జీవాలు, యూరప్ వ్యాప్తంగా వాతావరణం మీద ఉంటుందని డెన్మార్కులోని ఆర్హస్ యూనివెర్సిసిటీ శాస్త్రజ్ఞుల అధ్యయనంలో వెల్లడయింది  ఉపగ్రహ ఛాయా చిత్రాల సాయంతో నిర్వహించిన అధ్యాయవనంలో 1983 -2003  కాలంతో పోలిస్తే ఇటీవల గ్రీన్ లాండ్ లో హిమానినాదాల (glaciers) కరుగుదల రెట్టింపయింది ఫలితంగా తాజా నీరు సాగర పర్యావరణం ప్రభావితం అవుతోందని పరిశోధకులు తెలియజేశారు.

సముద్రాల్లో 95 శాతం ప్లాస్టిక్ కాలుష్యానికి  గంగతో సహా పెద్దనదులే కారణం

గంగానది సహా 10  ప్రధాన నదులు సముద్రాల్లో 95 శాతం ప్లాస్టిక్ కాలుష్యానికి కారణమవుతున్నాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వీటిలో రెండు ఆసియాలో ఉండగా మిగిలిన ఎనిమిది నదులు ఆఫ్రికాలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువ జనాభా నివసించే ప్రాంతాల్లో ప్రవహించేవే కావా గమనార్హం. ప్రతిఏటా కొన్ని మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరడం మొత్తం భూమండలనికే త్రీవమైన పర్యావరణ సమస్యగా పరిణమించింది. పర్యవసానంగా జీవావరణం ప్రమాదంలో పడుతుంది. మనుషులు నిర్లక్షంగా విడిచిపెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు చివరగా సముద్రాల్లోకి చేరేందుకు ఈ పెద్ద నదులు వాహకాలుగా పనిచేస్తున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో సూక్ష్మపరిమాణంలో ప్లాస్టిక్ కణాలు ప్రపంచవ్యాప్తంగా నది జలాల్లో సముద్రజలాల్లో వ్యాప్తి చెందుతూ జీవరాశులకు ప్రాణాంతకమవుతున్నాయి. ఈ విపత్కర పరిణామాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని జర్మనీలోని హెల్మ్ హాల్టజ  సెంటర్ ఫార్ ఎన్త్వేర్  మెంటల్ రీసెర్చ్ శాస్త్రవెత్త క్రిప్టియన్ స్మిత్ చెప్పారు .

అంగారక గ్రహానికి టికెట్ బుక్ చేసుకున్న లక్షకు పైగా ఇండియన్ లు

2018  మే 5 న నాసా ప్రయోగించనున్న ఇన్ సైట్ (Interior Exploration  using scismic Investigation  Geodesy and Heart transport)మిషన్ ద్వారా అంగారక గ్రహానికి ప్రయాణ టిక్కెట్లను లక్షకు పైగా భారతీయులు బుక్ చేసుకున్నారు. వీలందరికి ఆన్ లైన్ బోర్డింగ్ పాస్ లు పైగా వచ్చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ యాత్రకు దాదాపు 24 లక్షల మందికి పైగా ఆసక్తి చూపుతుండగా. ఈ జాబితాలో మనదేశం మూడోస్థానంలో ఉంది. వీరంతా నేరుగా అరుణగ్రహం పైకి వెళ్లకపోయినా వారందరి పేర్లున్న ఓ చిన్న సిలికాన్ వేఫర్ ను మిక్రోఛీప్ లో పొందుపరిచి ఆ చీప్ ను ల్యాండర్ కు అనుసంధానం చేస్తారు. ఈ నాసా ఇన్ సైట్ మిషన్ 720 రోజులపాటు సాగనుంది. ఇది ఆ గ్రాహం పై పరిస్థితులను, అక్కడి భూకంపాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తుంది.

బాన్ లో ఐకాసకాప్- 23 సదస్సు

వాతావరణ మార్పుల పై ఐక్యరాజ్యసమితి ముసాయిదా సమావేశ(UNFCC , United National  Framework  Convention  on Climate  Change )సభ్యుల 23 వ కాప్ సదస్సు (COP -23, Conference of  Parties -23 ) జర్మనీలోని బాన్ లోని నవంబర్ 6 న ప్రారంభమై 17 వరకు జరిగింది. పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి కట్టుబడాలనే పిలుపుతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించుకోవడం ఈ సదస్సు లక్ష్యం. గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడం, భూతాపం ఈ శతాబ్ధాన్తానికి రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా పెరగకుండా ఉండేందుకు చర్యలు మొదలైనవి పారిస్ ఒప్పందంలో ఉన్నాయి. ఈ సదస్సుకు ఫీజీ ప్రభుత్వం అధ్యక్షత వహించింది.

భూమిని కృతిమంగా చల్లబరుస్తే ఘోర విపత్తులు తప్పవు - శాస్త్రజ్ఞుల హెచ్చరిక

గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కోడానికి అగ్నిపర్వతాలు ప్రేలుడును అనుకరిస్తే కృతిమ పద్ధతులకు దారితీస్తాయని శాస్తజ్ఞులు హెచ్చరించారు. జియో ఇంజనీరింగ్ ద్వారా కృతిమంగా ఏరోసోల్స్ ను వాతావరణంలోకి చొప్పించి గ్లోబల్ వార్మింగ్ ను అదుపుచేయవచ్చునని ఇటీవల కొందరు ప్రతిపాదించారు.కానీ ఇలాంటి ప్రయత్నాలు తరచు తూఫానులు, దుర్భిక్షాలను గురయ్యే ప్రాంతాల్లో తీర్వమైన ప్రభావాలను చుపిస్తాయని ఇటీవల నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. బ్రిటన్ తోమి ఎక్సటెర్ యూనివర్సిటీ పద్దతిలో ఉత్తరార్థగోళంలో ఏరోసోల్స్ చోపిస్తే ఆ ప్రాంతంలో కత్రినా వంటి పెను తుఫానుల తీవ్రతను కొంత తగ్గించినా, దక్షిణార్థగోళంలో తీవ్ర దుర్భిక్షాలను దారితీస్తుందని వారి అధ్యయనంలో తెలిసింది .

ప్రమాదకర స్థాయికి ఢిల్లీ కాలుష్యం

దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చిన్నారులు, వృద్దులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేస్తాయికి వాయుకాలుష్యం చేరుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. పొగమంచు విపరీతంగా కురవడం, వాహనాలు విడుదల చేసే కాలుష్యకారకాలు, పంజాబ్, హర్యానాల్లో వంట వ్యర్థాలను కాల్చడం వంటి పలు చర్యలు ఇందుకు కారణంగా జాతీయ గ్రీన్ త్రిబున్యల్ (NGT ) హెచ్చరించింది. గాలిలో కాలుష్య కారకాల సాంద్రత నవంబర్ 8 ,9 తేదీలలో PM 2.5 స్థాయి 883 మైక్రోగ్రామ్ /ఘనపు మీటర్ వుంది. ఇది సురక్షితస్తాయి 60 మైక్రోగ్రామ్/ ఘనపు మీటర్ కు 14 రెట్లపైగా ఉంది. PM 10 స్థాయి 1680 మైక్రోగ్రామ్ ఘనపు మీటర్ ఉంది.ఇది సురక్షిత స్థాయి 100 మైక్రోగ్రామ్ /ఘనపు మీటర్ కు 16 రేట్లకు పైగా ఉంది. ఇదొక ప్రజారోగ్య గ్యాస్ ఛాంబర్ గ మారడంతో కొన్ని రోజులపాటు పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది.

ఆధారం: ఢా. ఇ.ఆర్. సుబ్రహ్మణ్యం

3.008
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు