పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వేగుచుక్క విన్యాసం

ఖగోళ వితలు విశేషాల గురించి తెలుసుకుందాం.

aoneసైన్స్ అభివృద్ధి చెందని రోజుల్లో ఆకాశంలో కనిపించే గ్రహణాలు, ఉల్కలు, తోకచుక్కలు చూసి మన పూర్వీకులు తీసుకొనేవాళ్ళు. ఏవేవో ఉపద్రవాలు జరగబోతున్నాయని గ్రహించుకొని భయాందోళనలకు లోనయ్యే వాళ్లు.

గ్రహణ కాలంలో గర్భవతులు బయట తిరిగితే గ్రహణశూల, మొర్రి వస్తాయని కాంతి దూరని చీకటి గదుల్లో వారిని బంధించేవాళ్ళు.

కాని ఈ పరిస్థితులు నేడు చాలా వరకు మారాయి. మూఢనమ్మకాల ఇనుప తెరలను చీల్చుకొని క్రమంగా జనం బయటికి వస్తున్నారు. ఖగోళ దృశ్యాలను వీక్షించడంలో ఆసక్తి చూపుతున్నారు. గ్రహణాలు ఏర్పడ్డా, తోకచుక్కలు దర్శనమిచ్చినా, గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినా జనం టెలిస్కోపు అందుబాటులో ఉంటే దాని వద్ద క్యూ లు కడుతున్నారు. వాటిని పరిశీలించాలని ఉబలాటపడుతున్నారు. సైన్సు పట్ల, సైన్సు వివరిస్తున్న వినూత్న విషయాల పట్ల జనంలో ఆసక్తి పెరుగుతోంది. చాందసవాదం ఎన్ని అవరోధాలు కల్పించినా అంతిమ విజయం విజ్ఞాన శాస్త్రానిదేనని చరిత్ర రుజువు చేసింది.

atwoగ్రహణాలు, తోకచుక్కలంత అద్భుతం గొలిపేవి కాకపోయినా, సూర్యుడికి, భూమికి మధ్య మరో గ్రహం వచ్చే సన్నివేశాలు కూడా ఉన్నాయి. వీటిని అక్కల్టేషన్స్ అంటారు. ఇలాంటిది జూన్ 8న జరగబోతుంది. సూర్యుడికి, భూమికి మధ్య శుక్రగ్రహం వస్తుంది. గతంలో 121 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన మళ్ళీ జరుగబోతుంది.

సౌరకుటుంబంలో భూమికి సూర్యుడికి మధ్య శుక్రగ్రహం, బుధగ్రహం ఉన్నాయి. ఇవి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్యలు ఒకే తలంలో లేనందువల్ల ఒకదానికొకటి అడ్డురావు. 121 సంవత్సరాల కొకసారి, భూమి, శుక్రుడు సూర్యుడు ఒకే సరళరేఖా మార్గంలోకి వస్తే అప్పుడు ఒక అక్కల్టేషన్ ఏర్పడుతుంది.

శుక్రగ్రహం దాదాపు భూమితో సమాన పరిమాణంలో ఉన్నా మనకు చాలా దూరంలో (సుమారు4.12 కోట్ల కిలో మీటర్ల) ఉన్నందున మనం సూర్యుడిపై కదులుతున్న చిన్న మచ్చను మాత్రమే చూడగలం. దీన్నేమనం ట్రాన్సిట్ ఆప్ వీనస్ అంటాం.

athreeజూన్ 8న శుక్రగ్రహం తన కక్ష్యలో తిరుగుతూ భూమికి సూర్యుడికి మధ్యలో వస్తుంది. అది సూర్యుడి మీదుగా ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. అలా ప్రయాణించేప్పుడు అది సూర్యుని మీద ఒక చిన్న నల్లటి మచ్చలా కనిపిస్తుంది. మేము చెప్పాము కదా అని జూన్ 8వ తేది సూర్యుని వైపు తదేకంగా చూడకూడదు. అది చాలా ప్రమాదకరం. సూర్యుడిని కంటితో నేరుగా చూడకూడదు. చూపుపోయే ప్రమాదం ఉంది. ఎలా చూడాలో చెప్పడానికే ఈ ప్రయత్నం. కెప్లెర్ మహాశయుడు గ్రహాలు వాటి కక్ష్యలో తిరిగే విధానాన్ని చక్కగా లెక్కకట్టడమే కాకుండా ఈ ట్రాన్సిట్ ప్రతి 121 సంవత్సరాలకి ఒకేసారి, వస్తుందని ట్రాన్సిట్ వచ్చిన నాటి నుండి మళ్ళీ 8 సంవత్సరాలకి ఇంకో ట్రాన్సిట్ వస్తుందని కూడా తన పుస్తకంలో వ్రాసుకొన్నాడు. అతడు చెప్పినట్లే ప్రతి రెండు ట్రాన్సిట్ లకి మధ్య మొదటి ట్రాన్సిట్ వచ్చిన 8 సంవత్సరాలకి ఇంకో ట్రాన్సిట్ వచ్చింది. అంటే ట్రాన్సిట్ లు 121-8-121 సంవత్సరాలకి వస్తాయన్నమాట. జూన్ 8, 2004న వచ్చిన ట్రాన్సిట్ తరువాత, జూన్ 6, 2012న ఇంకో ట్రాన్సిట్ వస్తుందన్నమాట. మనలో చాలా మంది 2012 లో వచ్చే ట్రాన్సిట్ ని కూడా చూడవచ్చన్నమాట.

afourక్రింద 1631 తరువాత వచ్చిన ట్రాన్సిట్ లు 2004 తరువాత 2368 దాకా రాబోయే ట్రాన్సిట్ లు వాటి తేదీలు ఇస్తున్నాం చూడండి.

1631 డిసెంబర్ 07

1639 డిసెంబర్ 04

1761 జూన్ 06

1769 జూన్ 03

1874 డిసెంబర్ 09

1882 డిసెంబర్ 06

2004 జూన్ 08

2012 జూన్ 06

2117 డిసెంబర్ 11

2125 డిసెంబర్ 08

2247 జూన్ 11

2225 జూన్ 09

2360 డిసెంబర్ 13

2368 డిసెంబర్ 10

అంటే ట్రాన్సిట్ లు డిసెంబర్ 4 నుంచి 13 తేదీలలో, జూన్ 3 నుంచి 11 తేదీలలో, మాత్రమే వస్తాయి.

జూన్ 8న వచ్చే ట్రాన్సిట్ ఆసియా, యూరప్, ఆఫ్రికాలోచాలా భాగం వరకు ప్రజానీకం చూడవచ్చు.

శుక్రుడు ప్రతి 584 రోజులకి ఒకసారి సూర్యుడు చుట్టూ తిరిగినా ప్రతిసారి భూమికి సూర్యునికి మధ్యనించి ప్రయాణించినా ట్రాన్సిట్ లు సంభవించవు ఎందుకంటే భూమి, శుక్రుడు, సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యలు ఒకదా ఒకటి 3 డిగ్రీలు పక్కకు వంగి ఉండడం వల్ల 121 సంవత్సరాలకి ఒకసారి, మధ్యలో 8 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఒకే లైనులోకి వస్తాయి. అప్పుడు మాత్రమే ట్రాన్సిట్ లు ఏర్పడతాయి.

afiveజూన్ 8, 2004 న ఉదయం 10 గంటల నిమిషాలకు శుక్రుడు సూర్యుని అంచుని తాకుతాడు(ఆగ్నేయ దిశ). అలా సూర్యునిలోకి ప్రవేశించిన తరువాత 6 గంటల పాటు, సూర్యుడిపై ప్రయాణం చేస్తాడు. సాయంత్రం 4 గంటల 56 నిమిషాలకు సూర్యుడిని దాటి బయటకు వస్తాడు. శుక్రుడు సూర్యగోళంలో 32 వ వంతు ఉంటాడు. ఈ 32వ వంతు నల్లటి మచ్చను చక్కగా గుర్తించవచ్చు. ట్రాన్సిట్ ని సురక్షితంగా ఎలా చూడగలమో తెలుసు కొందామా !

సూర్యగ్రహణం చూసేందుకు వాడే పద్ధతుల ద్వారా మనం ట్రాన్సిట్ ని కూడా చూడొచ్చు.

ఎక్స్ ఫోజ్ అయిన ఫోటో ఫిల్ములను మూడింటిని కలిపి వాటి ద్వారా చూడవచ్చు.

వెల్డింగ్ చేసేప్పుడు ఉపయోగించే నల్లటి అద్దాలు రెండు కలిపి అందులో నించి చూడవచ్చు.

గాజు పలకకు బాగా మసిపట్టించి చూడవచ్చు. (మసి పూర్తిగా పట్టేలా చూసుకోవాలి లేకపోతే ప్రమాదం)

లోహపు కోటింగ్ ఇచ్చిన ప్లాస్టిక్ ఫిల్మ్ (మైలార్ ఫిల్మ్) రెండు కలిపి అందులోంచి చూడవచ్చు.

పైన చెప్పిన పద్ధతులలో ఒకరు లేక ఇద్దరు కలిపి ట్రాన్సిట్ ని చూడొచ్చు. పైగా పై పద్ధతులలో ఎంతో కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి వుంటుంది.

అలాకాక ఇంకా తక్కువ ఖర్చుతో ఇంకా ఎక్కువ మంది చూసే పద్ధతి ఒకటుంది. అది ఈ సంచికలోనే చూద్దాం శీర్షికలో చూడండి.

సూర్యుడికి భూమికి మధ్య ఇంకో గ్రహం వస్తే అది గ్రహణం కదా, మరి దీనిని గ్రహణం అనకుండా ట్రాన్సిట్ అన్నారెందుకు అనే ప్రశ్న మీకు ఈ పాటికి రావాలి.

సూర్యగ్రహణం, భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడు వస్తే వస్తుంది. చంద్రుడు భూమి మీద నించి చూస్తే సూర్యుడికన్నా 400 రెట్లు చిన్నవాడు కాని 400 రెట్లు మనకు దగ్గరగా ఉన్నాడు కనుక చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసెయ్యగలడు. శుక్రుడు ట్రాన్సిట్ జరిగేపుడు 4 కోట్ల మైళ్ల దూరంలో ఉండడం వలన శుక్రడి సైజు దాదాపు భూమి అంత వున్నప్పటికి మనకు ఒక చిన్న నల్లని చుక్కలాగా మాత్రమే సూర్యునిపై పాకుతూ కనిపిస్తాడు. కాబట్టి దీన్ని గ్రహణం అనకుండా అంతర్యానం అన్నారు.

asixట్రాన్సిట్ చరిత్రలో భారత్ :

1761 మరియు 1769 ట్రాన్సిట్ లు భారతదేశంలో కూడా సంభవించాయి. వీటికి, సంబంధించిన ఒక సంఘటన ఇక్కడ ప్రస్తావించడం సబబే అనిపిస్తుంది.

1761 లో ఫ్రెంచి ఖగోళ శాస్త్రవేత్త గ్యూల్లయ్ లీ జెంటిల్ ఆనాటి ట్రాన్సిట్ భారతదేశంలో చక్కగా కనబడుతుందని భావించి మన దేశంలో ఫ్రెంచి వారి పాలనలో వున్న పాండిచ్చేరి నుంచి చూడాలని ఓడలో బయలుదేరాడు. తీరా అతను ఇండియాను చేరేలోగా పాండిచ్చేరి ఫ్రెంచి వారి వలస నుంచి ఇంగ్లీషు వారికి కైవసం అయింది. లీ జెంటిల్ ని ఇంగ్లీషు సైనికులు పాండిచ్చేరి లో అడుగుపెట్టనివ్వలేదు. అప్పుడు జెంటిల్ అక్కడి నుంచి మారిషస్ ప్రయాణించాడు. ఆయన మార్గమధ్యలో ఓడ మీది నుంచి ట్రాన్సిట్ చూసాడు. కాని అతనికి సంతృప్తి కలుగలేదు. అతను చేయదలచిన పరిశోధలను చేయలేకపోయాడు. అందుకని మరలా 8 సం,, తరువాత వచ్చే ట్రాన్సిట్ కూడా ఇండియాలోనే కనబడుతుంది. కాబట్టి అప్పటి దాకా ఇండియాలోనే ఉండి ట్రాన్సిట్ ని చూచి వెళదామని ఇక్కడే ఉండిపోయాడు. ఈసారి ఇతడు పాండిచ్చేరి ట్రాన్సిట్ చూడకుండా జైపూర్ (రాజస్థాన్) లో చూసేందుకు అక్కడికి వెళ్ళాడు. అతని దురదృష్టం ఆ రోజు జైపూర్ లో పూర్తి ఆకాశం మేఘాలతో నిండుకొని సూర్యదర్శనం జరగలేదు. పాపం, జెంటిల్ నిరాశతో ఫ్రాన్స్ కి వెళ్ళిపోయాడు. తీరా తన స్వగ్రామం చేరేలోగా ఇతగాడి వారసులు ఇతను చనిపోయుంటాడని అనుకొని అతని ఆస్తిని పంచుకొనే ఏర్పాట్లు చేసుకొన్నారట. ఇతను కనిపించగానే వాళ్ళు నిరాశకి గురయ్యారట. ఇలా జెంటిన్ లాంటి శాస్త్రజ్ఞులు ట్రాన్సిట్ చూడలేకపోయామని నిరాశచెందితే అతని వారసులు అతని ఆస్తి పంచుకోలేకపోయామని నిరాశ చెందారు.

మనం మాత్రం ట్రాన్సిట్ ఆప్ వీనస్ లేదా వేగుచుక్క విన్యాసాన్ని 8, జూన్ 2004 న మరియు 6 జూన్ 2012 న చూసి ఆనందించుదాం.

రచన: సి.హెచ్. ఆనందరాంసింగ్, జి. కామయ్య, నెల్లూరు.

3.0310880829
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు