పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శంఖం ఎందుకు ధాన్యం పైకి తేలింది?

ధాన్యపు సాంద్రత కన్నా అడుగున ఉంచిన శంఖు నికర సాంద్రత తక్కువ కావడం వల్ల ప్లవన సూత్రాలు అమల్లో కనిపిస్తాయి.

shellప్రశ్న: ఈ మధ్య ఖాళీ డబ్బా అడుగున శంఖాన్ని ఉంచి దాని పైన నిండుగా ధాన్యం పోయగా కాసేపయ్యాక శంఖం బయటికి పొంగుకుంటూ ధాన్యం పైకి తేలింది. ఇలా శంఖం పైకి రావడాన్ని అద్భుతంగా భావించి అలా చేసిన వారిని ఘనంగా పూజిస్తున్నారు ఈ దృగ్విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ప్రశ్న అడిగిన వారు- కుమారి యం. సాత్విక, హన్మకొండ

జవాబు: మీరు ఒక లోతైన చిన్న డ్రమ్మ అడుగున ఒక స్టీలు గ్లాసును బోర్లించండి. అది అక్కడ ఎంత కాలమైనా అలాగే ఉంటుంది. ఇపుడు ఆ గ్లాసు మునిగేలా మెల్లమెల్లగా నీరు పోయండి ఇపుడు కూడా గ్లాసు అడుగున ఉందా లేక మరేదైనా ఘటన జరిగిందా గమనించండి. గ్లాసు మూత సమతలముగా ఉన్నట్లయితే డ్రమ్మ అడుగు భాగం కూడా సమతలముగా ఉన్నట్లయితే నీటిలో అలజడి లేనట్లయితే ఆ గ్లాసు ఒక్క ఉడటున పైకి తేలుతుంది. లేదా అక్కడ పైకి తేలి పైకి వచ్చే క్రమంలో నీటిని నింపుకొని తిరిగి మునిగిపోతుంది. ఇదే ప్రయోగాన్ని స్టీలుగాసు బదులు ప్లాస్టిక్ గాసుతో ప్రయత్నించండి. నీరు పోయనంత వరకు డ్రమ్మ అడుగునే ఉన్నా నీరు పోసిన వెంటనే అందులో నీరు నిండినా లేదా నిండక పోయినా ప్లాస్టిక్ గాసు పైకిలేస్తుంది.

నీవు ప్రస్తావించిన ప్రయోగంలో శంఖం మామూలు సముద్రపు శంఖమే అయినట్లయితే అది మొత్తం కాలియం కార్బనేటు గోడలతో తయారయి ఉంటుంది. శంఖంలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. శంఖువు మొలత్మన్ జీవి. అందులోనే గతపు కాలము శరీరాన్ని దాచుకొని జీవించేది. ఇపుడది ఖాళీ స్థలం. శంఖపు వస్తు పదార్థ ఘన పరిమాణం (Volume) కన్నా శంఖం లోపల ఉండే ఖాళీ ప్రదేశపు ఘన పరిమాణం చాలా ఎక్కువ. కాబట్టి గాలితో కూడిన శంఖువు నికర సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ. ఇలాంటి శంఖాన్ని గాని లేదా ఇంత కన్నా తేలికపాటి పదార్థంతో తయారయిన కృత్రిమ శంఖాకార కుహనా శంఖాన్ని (Pseudo Cone) గానీ నువ్వన్న అట్ట పెట్టె అడుగున ఉంచితే అది ఎంత కాలమైనా అలాగే ఉంటుంది. కానీ ఆ డబ్బాలోకి నింపిన ధాన్యపు పాదార్థిక ప్రభావాన్ని బట్టి నేనిపుడు వివరించే వివరణ ఆధారపడుతుంది. అలా పోసింది నిజంగా ధాన్యమేనా లేదా మరేదైనా ధాన్యం లాగా కనిపించే తేలిక పాటి రేణువుల సముదాయమాని గమనించాలి. ఒకవేళ ధాన్యమే అయితే అవి చాలా సన్నని రేణువుల సముదాయమో కాదో గుర్తించాలి. ఏదేమైనా శంఖం మీద అటూయిటూ కదిలేలా నునుపుగా ఉన్న ధాన్యాన్ని నింపినట్లయితే ఆ ధాన్యం ఓ చిక్కటి ద్రవంగా పని చేసినట్లు అర్థం. ఆ ధాన్యపు సాంద్రత కన్నా అడుగున ఉంచిన శంఖు నికర సాంద్రత తక్కువ కావడం వల్ల ప్లవన సూత్రాలు అమల్లో కనిపిస్తాయి. తత్ఫలితంగా క్రమేపీ శంఖం పైపైకి సరుకుంటూ వచ్చి తేలినట్లు కనిపిస్తుంది. ఇందులో మహిమలు, మహత్తులు, అద్భుతాలు ఏమిలేవు. ఇలాంటి వాటిని సైన్సు పద్దతిలో అన్వేషించాలి గానీ దానిని అతీత అద్భుతంగా భావించి మూఢనమ్మకాలలోకి మునిగిపోకూడదు.

జవాబు తెలిపినవారు: ప్రొ. ఎ. రామచంద్రయ్య, సెల్: 9490098910

2.99259259259
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు