పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శీతాకాలంలో పక్షుల వలన

శీతల ప్రదేశాల్లో ఉండే జీవులు శీతాకాలంలో వెచ్చని ప్రదేశాలకు చేరుకుంటాయి. తిరిగి వసంతకాలంలో స్వస్ధలానికి చేరుకుంటాయి.

mar1.jpgజంతువులు, పక్షులు, కీటకాలలో వలస సహజ లక్షణం. వలస అంటే రుతుక్రమంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరడం. “శీతల ప్రదేశాల్లో ఉండే జీవులు శీతాకాలంలో వెచ్చని ప్రదేశాలకు చేరుకుంటాయి. తిరిగి వసంతకాలంలో స్వస్ధలానికి చేరుకుంటాయి.”

చేపలలో ‘సాల్ మన్’ ఈల్ చేపల వలన పోతాయి. ఉభయచర జీవులైన కప్పలు గుడ్లు పెట్టె కాలంలో నీటిలోపలికి వలస పోతాయి.

ఏకకణజీవి అయిన అమీబా నుండి క్షిరదానికి చెందిన ఎలుగుబంటి వరకు శీతలాన్ని తప్పించుకొనుటకు సుప్తావస్ధను గడుపుతాయి. సుప్తావస్ధ అంటే, ‘’ఆహారం తీసుకోకుండా దీర్ఘంగా నిద్రపోవుట. సాధారణంగా శీతాకాలంలో వాతావరణ ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గగానే అది జీవుల శరీర రక్త ఉషోనోగ్రత పై ప్రభావం చూపుతుంది.

ఈ కారణంగా చలించాలేవు. అందువలన అవి సుప్తావస్ధలోకి వెళతాయి. కాని పక్షుల్లో సుప్తావస్ధలోకి వెళతాయి. కానీ పక్షుల్లో సుప్తావస్దను పొందే లక్షణం లేదు. అందుచేత పక్షులు వలన పోతాయి.

సాధారణంగా వలస ఉత్తరం నుంచి దక్షిణ దిక్కుకు వెళ్ళి మరల ఉత్తర దిక్కుకు రావదాన్ని ‘అక్షాంశవలస’ అంటారు. వలసకు ముఖ్యకారణాలు: ఆహారపుకోరత నీటికోరత మరియు సంతానోత్పత్తికి ప్రతికూల వాతావరణం.

శీతాకాలంలో దృవ ప్రాంతాలు , చల్లని ప్రదేశాలలో మంచు అత్యధికంగా పడుతుంది. అధిక మంచువలన ఆ ప్రాంతాలలో సూర్యకిరణాలు కూడా సోకవు. జీవులు చురుకుగా వాటి జీవ అవసరాలు నిర్వహించడానికి సూర్యరశ్మి అవసరం. అందుచేత అవి శీతల ప్రాంతాన్ని విడిచి, వెచ్చని ప్రాంతాలకు వస్తాయి. మంచు ఎక్కువగా కురియడం వల్ల వాటి శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి గడ్డకట్టేస్ధితికి చేరుకుంటాయి. అంతేకాక నీటి పై మంచు ఫలకంలా ఏర్పడి చేపలు ఆ ఫలకం క్రింద ఉండిపోవడం వలన పక్షులకు ఆహారపు కొరత కూడా ఏర్పడుతుంది.

ఆహారంకోసం సూర్యరశ్మి కోసం పక్షులు అనుకూల పరిస్ధితులు గల ప్రదేశాన్ని ఎన్నుకుంటాయి. పక్షుల ప్రత్యత్పత్తి కాలము కూడా అదేకాలము అవటం వల్ల వలన పోతాయి. ప్రతికూల పరిస్ధితులలో వాటి సంతానం సక్రమంగా పెరగలేకపోవడం, మరణించడం జరుగుతాయి. తమ జాతిని నిలబెట్టేందుకు పక్షులు వలన జరుపుకుంటాయి.

పక్షుల వలసలో భిన్నత్వం కనిపిస్తుంది. కొన్ని పక్షులు పగలు మాత్రమే ప్రయాణం చేస్తాయి. ఉదా : గల్ పక్షులు, కాకులు. కొన్ని పక్షులు రాత్రిపూట ప్రయాణం చేస్తాయి. ఉదా: పిచ్చుకలు. కొన్ని పక్షులు పగలు, రాత్రి నిరంతరము గమ్యం చేరేవరకు ప్రయాణం చేస్తాయి. ఉదా: ఫ్లోవర్. ఇది ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తుంది. కాబట్టి దీనిని “నాన్ స్టాప్ బర్డ్” అంటారు. పక్షులు వలసపోయే వేగము గంటకు 30కి.మీ నుండి 60కి.మీ ఉంటుంది. ఇవి ఇంచుమించు 900 మీటర్ల ఎత్తునుండి 100 మీటర్లు మించి ఎగరలేవు. సాధారణంగా ఇవి మేఘాల దిగువ స్ధాయిలోనే ఎగురుతాయి.

వలసలో పక్షులకు ఎన్నో అటంకాలు ఎదురవుతాయి. కొండలు, సముద్రాలు దాటినపుడు మంచువర్షాలు, తుఫాన్ లు సంభవిస్తే గమ్యస్ధానం చేరకుండానే మరణించడం లేదా దారి తప్పిపోవడం గానీ జరుగుతుంది. ఆహారపు కొరత శత్రువు గమనంలో నిరోధకాలుగా వుంటాయి. రాత్రి ప్రయాణం చేసినపుడు పక్షులు రంగుల కాంతులకు భ్రమపడి విద్యుద్ఘాతానికి గురి అవుతాయి. తక్కువ ఎత్తులో ప్రయాణం చేసే చిన్న జీవులకు విద్యుత్ తీగలు కూడా మరణానికి హేతువులు.

వలస పోవడంలో ఒక తమాషా ఉంది. పక్షులు ప్రతి సంవత్సరం ఒకే ప్రదేశానికి వెళు తుంటాయి. వలస పోయే సందర్భంలో వలస వెళ్ళే ప్రాంతానికి ముందు సురక్షిత వాతావరణంలో ఆగుతాయి. అందులో మగపక్షులు ఫైలట్ లా వచ్చి కిందటి సంవత్సరం నివసించిన ప్రాంతం జివనయోగ్యమా! కాదా ! అని పరిశిలస్తాయి. అక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటే వాటి పాట గూడులను పడద్రోసి వెళ్ళిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఆడ మగ పక్షులు కలిసి వస్తాయి. ఇవి ప్రయాణం చేసినపుడు ‘V’ ఆకారంలో చలిస్తాయి.

ప్రతి సంవత్సరము ఒకే ప్రదేశానికి ఏ ఆధారం లేకుండా ఎలా చేరుతున్నాయి?..... పక్షులు వాతావరణంలో మార్పులను గ్రహిస్తూ, సూర్యకిరణాలు ఆధారంగా చేరుకుంటున్నాయని శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తాయి.

వాతావరణంలో కొద్ది పాటి మార్పులు, ప్రకృతి లో వైవిద్యం నీటి ఉష్ణోగ్రతలో గల తేడాలను బట్టి పక్షులు ప్రయాణం చేయడం ప్రారంభిస్తాయి. పక్షులు వలస రావడానికి ముందు వాటిలో కొన్ని ప్రత్యేకమైన పొందికలను ఏర్పరచుకుంటాయి. కొని వేల మైల దూర ప్రయాణం చేయడానికి వాటికీ శక్తి అవసరము. శక్తిని పొందుటకు అవి ఆహారం స్వీకరించిన తర్వాత కంత జీవవ్యపారులకు వినియోగించిన మిగిలినది క్రొవ్వు రూపంలో నిలువ చేసుకుంటాయి. ఈ క్రొవ్వును వలస పాయినపుడు ఉపయోగించుకుంటాయి. ఈకలు ఉదా: నిర్మోచనం చేసుకొని, క్రోత ఈకలను పెంపొందించుకుంటాయి. దీనివలన శరీరానికి అదనపు శక్తి వస్తుంది. క్రొత్త ఈకలను పటుత్వం కలిగి సక్రమంగా ఎగిరే శక్తి వస్తుంది. సంతానోత్పత్తికి ముందు అవి కొని రకాల హార్మోన్ లను ఉత్పత్తి చేస్తాయి. వీటివలన పీడనం అధికం అయి వలస సుగమం అవుతుంది. mag పక్షులలో ప్రత్యేకమైన లక్షణాలు, రంగులు ఏర్పడతాయి.

పక్షులలో ప్రత్యుత్పత్తి కాలము డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు ఉండును. చెట్ల పై జతగూడుటకు ముందు మగ, ఆడ పక్షులు రెండూకలిసి గూళ్ళను నిర్మిస్తాయి. ఒకే చెట్టు పై అనేక పక్షులు వాటి వాటి గూళ్ళను నిర్నించుకుంటాయి. ఇది ఒక సమాజానికి ప్రతిరూపము. ఆడపక్షి గుడ్లు పెట్టిన తర్వాత కొంతసేపు బయట విహారం చేసి ఎక్కువ కాలం గూడుకు కాపలా కాస్తుంది. మగ పక్షులు ఆహార సంపాదన చేస్తాయి.

పక్షులలో సంతానపాలన కొన్ని వారాల వరకు మాత్రమే ఉంటుంది. ఈకాలంలో పక్షులు ఆహారాన్ని పిల్లలకు అందివ్వడం, ఎగురుటలో మెలకువలను నేర్పుతాయి. చిన్న పక్షి పిల్లలు వాటి రెక్కల్లో పటుత్వం రాగానే తక్కువ ఎత్తులో కొమ్మల పై ఎగరడము సెలయేరులో పారే నీటిలో చేపలను వేటాడటం ప్రారంభిస్తాయి. పక్షి పిల్లలకు ఎగిరేశక్తి సంపూర్ణంగా అందగానే తల్లిదండ్రులను అనుసరించి స్వదేశానికి చేరుకుంటాయి. అవి వేరేసరికి స్వదేశంలో శీతలం తగ్గి వసంతం ప్రారంభమై ఉంటుంది.

సరస్సులు నిర్మలంగా ఉండటము, జలచరాలు పుష్కలంగా లభించడం వల్ల మన దేశానికి కొన్ని వందలజాతుల పక్షులు వేలసంఖ్యలో వచ్చి మనల్ని అలరిస్తూన్నాయి. మన రాష్టంలో నెల్లూరు జిల్లా వద్ద పులికాట్ సరస్సుకు 145 రకాల పక్షులు నలుమూలలనుంచి వస్తున్నాయి. ఈ పక్ష్లులు నలుమూలలనుంచి వస్తున్నాయి. ఈ పక్షులు ముఖ్యంగా సైజిరియా, చైనా, ఉత్తరఅమెరికా, దక్షణ అమెరికా, ఉత్తర అట్లాంటిక్ నుండి వస్తాయి. ఈ ప్రదేశానికి పెయింటెడ్ స్ట్రాక్, పెలికాన్స్ డాక్టర్, గూడబాతులు, స్తున్బిల్, బ్రౌన్ హెడెడ్ గల్, బ్లాక్ హెడెడ్ గల్, ఇండియన్ రీఫ్ హెరాన్, పర్పుల్ రండ్ట్, సన్ బర్డ్ వైట్ ఐబిస్, ఇండియన్ మూర్ హెన్, బిపెన్ బిల్ స్ట్రాక్ మొదలగు పక్షులు ఎక్కువ సంఖ్యలో వస్తాయి. అవి నవంబరునుండి ఏప్రిల్ వరకు ఉంటాయి. మే నెలలో స్వదేశానికి చేరుకుంటాయి.

మంచినీటి సరస్సు అయిన కొల్లేరుకు కూడా వందల జాతుల పక్షులు వలస వస్తాయి. అవి డిసెంబరు నుండి మార్చి వరకు గడిపి ఏప్రిల్ లో స్వదేశానికి వెళ్ళిపొతాయి. ఈ ప్రదేశానికి కూడా సైబీరియా, చైనా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్, యూరప్, ఫిజి, పర్షియా మొదలగు దేశాలనుండి వలస వస్తాయి. కొల్లేరు ప్రాంతానికి భూచరజీవులు, జలచర జీవులు వస్తాయి. కొన్ని రకాల పక్షులు నీటిలో జీవనం సాగిస్తాయి. కొన్ని రకాల పక్షులు చెట్ల పై జీవనం గడుపుతాయి. ఈ ప్రాంతానికి ఫైట్ క్రస్టేడ్ కుకూ ఇండియన్ కొయిల్ (హిమాల యాలునుండి), బ్రాహ్మల్ కైట్, రెడ్ క్రి స్టేడ్ ప్రోబార్డ్, గోసిఐబీస్, గార్గినీ, ఫిన్టైల్స్, బ్లాక్ బిట్టరన్, స్కోడ్ డక్, లార్జ్ విజిటింగ్ టైల్ మొదలుగునవి కొల్లేరును చేరుకొని సంతానోత్పత్తి నిర్వహించి స్వదేశంకు చేరతాయి .

ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెలీనిలాపురం, తేలుకుంచి వంటి ప్రాంతాలకు సైబీరియా పక్షులు అయిన పెయింటెడ్ స్టార్క్, పెలికాన్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చి సంతానం అభివృద్ధి చెందిన తర్వాత కనుమరుగు అవుతాయి. తేలినీలాపురంలో పక్షులను గమనించుటకు ప్రత్యేకమైన వాచ్ టవర్ కలదు. వలస పక్షులు పల్లె ప్రజల మధ్య చెట్ల పై జీవనం సాగిస్తాయి. అక్కడ ప్రజలు కూడా వలస పక్షులు ను అతిధులుగా భావిస్తారు. ఈ పక్షులు వాటి పిల్లలలోకోసం గూడు రక్షిస్తున్న పక్షికి 2 లేదా 3 కేజీలు బరువున్న చేవలను తెచ్చి అందిస్తాయి. పొరపాటున చెపక్రిందపడితే అవి ఆహారంగా తిసుకోవు. క్రింద పడిన పక్షిని కూడా గూటిలో చేర్చకు క్రిందకు తోసివేస్తాయి.పక్షులు విడుదలచేసి రెట్టను పంటపొలాల్లో వేయుట వలన అధిక దిగుబడిని రైతులు సాధిస్తున్నారు.

mar2.jpgపిట్టమాంసం రుచి అని హంటింగ్ నా వృత్తి అని షూటింగ్ నాహాబి అనే వారి వల్ల ఎన్నో పక్షులు బలి అవుతున్నాయి. ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా వాటి సంఖ్య తగ్గుతున్నాయి. అతిధులు గా వచ్చిన జీవులను అందరించాలి అనే కనీస ధర్మం ప్రతి ఒక్కరూ పాటిస్తే పక్షులకు స్వరణయుగమే!

2.98854961832
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు