హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / శుక్రగ్రహము అత్యంత వేడిగా ఉంటుంది ఎందుకు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శుక్రగ్రహము అత్యంత వేడిగా ఉంటుంది ఎందుకు?

శుక్రగ్రహము గురించి తెలుసుకుందాం.

venusశుక్రగ్రహము యొక్క వాతావరణము మన భూవాతావరణానికి చాలా వ్యత్యాసంగా ఉంటుంది. భూమి చుట్టూ సుమారు 40 శాతం మాత్రమే మేఘాలు కప్పబడి ఉంటాయి.

అయితే శుక్రగ్రహము పూర్తిగా నూరు శాతం దట్టమైన మేఘాలతో కప్పబడి ఉంటుంది. ఇవి దాదాపు 45 కి.మీ. నుండి 70 కి.మీ. వరకూ వ్యాపించి ఉంది గాఢ సర్పూరిక్ ఆమ్ల బిందువులను కలిగి ఉంటాయి. ఇవి సల్ఫర్ - డై -ఆక్సైడ్, క్లోరిన్ లేక ఘన సల్పరును కూడా కలిగి ఉండడం వల్ల అతి నీలిలోహిత కిరణ కాంతిలో నలుపు వర్ణంలో గోచరిస్తాయి. అంతరిక్ష నౌకలు గ్రహించిన సమాచారం ప్రకారం శుక్రగ్రహము ఉపరితల వాతావరణములో ముఖ్యంగా కార్బన్-డై-ఆక్సైడ్ 96%, నైట్రోజన్ - 3.5 % మరియు కొద్ది మోతాదులలో ఆర్గాను, కార్బన్ మోనాక్సైడ్, హీలియం, సల్ఫరు-డై-ఆక్సైడ్, నీటి ఆవిరి ఉంటాయని తెలుసుకున్నారు. ఈ గ్రహపు మేఘాల పై పొరలు సగటున 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉన్ననూ గ్రహతలముపై సుమారు 462 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యునికి అతి దగ్గరగా ఉన్నా బుధగ్రహము కంటేనూ, సూర్యమండలము లోని అన్ని గ్రహాల కంటేనూ, ఇది అత్యధిత ఉష్ణోగ్రతను 480 డిగ్రీల వరకూ కూడా చేరుకుంటుంది. ఇంతటి ఉష్ణోగ్రత వద్ద సల్పరు, లెడ్, జింక్ లేదా టిన్ వంటి లోహ రసాయనాలు కూడా కరిగిపోతాయి. ఈ గ్రహముపై అధిక ఉష్ణోగ్రతకు కారణం గ్రీన్ హౌస్ ప్రభావం అని పరిగణిస్తారు. పై చెప్పిన విధంగా గ్రహాన్ని పూర్తిగా కప్పి ఉన్న మేఘాలు సూర్యునినుండి వచ్చు కిరణాలను తమ గుండా ప్రయాణింపచేసి గ్రహ వాతావరణం లోనికి ప్రవేశింపజేస్తాయి. అయితే ఆ వాతావరణంలో ఎక్కువ శాతంలో కార్బన్-డై-ఆక్సైడ్ మొదలగు వాయువులను ఉండటం వల్ల గ్రహానికి చేరిన సూర్య కిరణాలు వికిరణం చెంది తిరిగి వెలుపలికి వెళ్ళకుండా అడ్డుకోబడుతాయి. కావున అక్కడి వాతావరణము హెచ్చు ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది.

రచన: డా. ఎస్.బుద్ధుడు

3.04265402844
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు