పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శ్రామిక దినోత్సవం

భారతదేశం మే 1 ని మేడే గా పరిగణించింది.

fightfaworkersభారతదేశంలో 1947లో మనకు స్వాతంత్ర్యం లబించేంత వరకు భూస్వామ్య వ్యవస్థవుండేది. ఈ వ్యవస్థలో రాజులు తమకు సైనికులను, ఉంపుడుక తెలను నరవ రా చేసినందుకుగాను, విలువైన కానుకలను సమర్పించుకున్నందుకు గాను కొంతమంది వ్యక్తులకు భూములను బహుమానంగా ఇచ్చేవారు. ఈ భూముల్లో వారు శిస్తులు వసూలు చేసి కొంతభాగం రాజుకి చెల్లించగా మిగిలినది తమ సాంతానికి వాడుకొనేవారు. ఈ భూములను రైతులకు యిచ్చి వ్యవసాయం చేయించి ఫలసాయం తాము తీసుకొనేవారు. అన్ని వృత్తులవాళ్ళు ఎండనక, వాననక భూస్వాములకు పనులు చేసిపెట్టే వాళ్ళు. ఇందుకు వారికి ఎటువంటి ప్రతిఫలం లభించేదికాదు. దీనిని వెట్టి చాకిరీ అనేవాళ్ళు.

మరోవైపు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులకు నిర్దేతమైనవని గంటలు వుండేవికావు. వాళ్ళు రోజుకి 16 నుండి 18 గంటలు పనిచేయాల్సి వచ్చేది. వారికి లభించే జీతాలు అంతంత మాత్రంగానే వుండేవి. దీనితో అమెరికాలోని చికాగో పట్టణంలో 1884 లో కార్మికులు రోజుకి 8 గంటలు త్రమే పని వుండాలని ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళన 1886 నాటికి తారాస్థాయికి చేరింది. మే 1, 1886 న 40 వేల మంది కార్మికులు సమ్మె మొదలు పెడితే 3 మే నాటికి శ్రామికుల సంఖ్య లక్ష మందికి చేరుకుంది. సమ్మె ఉధృతమయ్యేసరికి పారిశ్రామిక సంస్థల యూజమానులు పోలీసు సాయంకోరగా పోలీసులు కాల్పులు జరిపారు. ఇద్దరు కార్మికులు మరణించారు. దానితో కార్మిక నాయకులు అగస్ట్ స్పైస్, e9e3S పార్సన్స్, క్లోరిన్ మోస్ట్ లూయిూస్ లింగ్ అనే నాయకుల ఆధ్వర్యంలో మెక్కార్మిక్ రీపర్ వర్క్ పారిశ్రామిక సంస్థ ముందు పెద్ద ప్రదర్శన జరిగింది. శాంతియుతంగా జరుగుతున్న ఈ ప్రదర్శన మీద పోలీసులు హేమార్కెట్ వద్ద 4 మే రోజున తిరిగి జరిగిన కాల్పులో 8 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. తర్వాతి రోజుల్లో గాయపడిన వారిలో మరో ఏడుగురు చనిపోయారు.

workersఈ కాల్పులకు కారణం కార్మిక నాయకులేనని వారి మీద హత్యానేరం మోపబడింది. నవంబరు 11, 1887 లో ఈ కార్మిక నాయకులను దోషులుగా నిర్ధారించిన కోర్టులు పార్సన్స్, స్పైస్, ఎంగెల్, ఫిషర్ లకు ఉరిశిక్ష అమలు చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ మరో కార్మికనాయకుడు లూయీస్ లింగ్ తననోటిలో బాంబు పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతాన్ని "హేమార్కెట్ దారుణ హత్యాకాండ" గా చరిత్రకారులు వర్ణిస్తారు. కార్మికనాయకుల్లో ఫిల్డన్, నీబే, ష్వాబ్ లను ఆరుసంవత్సరాలు జైలు శిక్ష పాలయ్యారు. ఈ ఉదంతాన్ని అనేక దేశాల్లో ఖండిసూ ప్రదర్శనలు జరిగాయి. 66 దేశాలలో ఆందోళనలు జరిగాయి. కార్మికులు పోరాడి 8 గంటల పనిని సాధించుకున్నారు. ఆ విజయానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం మే 1వ తారీఖున జరుగుతుంది.

statue‘హేమార్కెట్ తిరుగుబాటు’ గుర్తుగా అనేక స్మారక శిల్పాలు తయారుయ్యాయి. వాటిల్లో ఒకదాని మీద ఈ దిగువ సందేశం ప్రసిద్ధి పొందింది.

“ఈ రోజు మీరు నులుముతున్న మాకంఠ స్వరాల కంటే మా నిశ్శబ్దమే ఒక బలమైన శక్తిగా అవతరించే రోజు ఒకటి వస్తుంది."

ప్రపంచంలో అనేక దేశాలు మే దినోత్సవాన్ని సెలవు రోజుగా ప్రకటించాయి. ఇటీవలి వరకు కూడా భారతదేశం మే 1 ని సెలవు రోజుగా పరిగణించింది. కాని క్రమేణా ఈ సెలవు తీసేశారు. భారతదేశం మే 1 ని 1923 లో మొదటిసారిగా లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో మద్రాసు (ఇప్పడు చెన్నై) లో జరుపుకొంది. కార్మిక ఫ్రీ పురుషుల గౌరవార్థం ఈ రోజు కార్మికులు ఎర్రని జెండాలు ఎగురవేస్తారు. మేడేకు కారణభూతమైన చికాగో కాల్పుల్లో మరణించిన కార్మిక మృతవీరుల రక్తపు రంగుకు సంకేతంగా ఎర్ర జండా ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా 80 దేశల్లో ఈ ఉత్సవం అధీకృతంగా జరుగుతుంది. భారతదేశంలో శ్రామికులకు రోజుకు 8 పని గంటలు ప్రవేశపెట్టడానికి, స్త్రీ పురుషులకు ఒక పనికి సమాన వేతనం ఇవ్వడానికి డా. బి.అర్. అంబేద్కర్ మూల కారణం.

ఈ కాలంలో తిరిగి పని గంటల భారం పెరుగుతున్నది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం ఉద్యోగులు పనిచేయవలసి వస్తున్నది. సెలవు రోజుల్లో కూడా కొన్ని ప్రైవేటు కంపెనీలు, కాలేజీలు, స్కూళ్ళ పని చేస్తున్నాయి. కార్మిక హక్కులను కాల రాస్తున్నారు. కాబట్టి మే దినోత్సవ ప్రాముఖ్యతను మరోసారి గురు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతున్నది.

  1. రోజుకు 8 గంటలు మాత్రమే కార్మిక, కర్షక కూలీలు పనిచేయాలి.
  2. బాల కార్మికులను పనుల్లో పెట్టుకోకూడదు. వారు వుండాల్సిన చోటు పాఠశాలు మాత్రమే. బడి మానివేసిన ప్రతిపిల్లవాడు, బాలిక బాల కార్మికులే.
  3. కార్మిక కర్షక కుటుంబాలకు విద్య, వైద్యం ఉచితంగా అందాలి.
  4. ప్రపంచంలోని కార్మికులందరి కష్టమూ ఒకే విధంగా వుంటుంది. కాబట్టి తమ హక్కులు సాధించుకోవడానికి ప్రపంచకార్మికులు ఐక్యం కావాలి.
  5. శ్రామిక శక్తి దేశానికి సంపదను ఆర్ధించి  పెడుతుంది.

వ్యక్తిత్వం కొనసాగింపే అతడు లేక ఆమె చేసే 'పని'. ఆ పని ద్వారానే వారు తమను తాము నిర్వచించుకుంటారు. పని అతడి లేక ఆమె విలువను, మానవత్వాన్ని చాటి చెపుతుంది. పని ఒక వ్యక్తి సాధించే విజయం. పనిలోనే ఆనందం పొందే వ్యక్తులనే మనం శ్రామికులంటాము.

విద్యారులుగా శ్రమను గౌరవించే తత్వం అలవర్చుకోవాలి. చదువు శ్రమ విలువను తెలుపాలి. శ్రమించనిదే ఏదీ మన దరికి రాదనీ, చేతికి అందదనీ తెలుసుకోవడంలోనే శ్రామిక దినోత్సవ గొప్పదనం ఉంది.

శ్రమ మాత్రమే మానవుని అంగసౌష్టవం అందం పెంచుతుంది. శ్రమ మాత్రమే మానవ మేధస్సుకి పదును పెడుతుంది. శ్రమ మాత్రమే మనిషిని ముందుకు నడిపిస్తుంది.

ఆధారం: పైడిముక్కల ఆనంద్ కుమార్, సెల్ 9490300459

3.01373626374
మద్దెల నాగార్జున May 01, 2020 03:42 AM

మా లో వచ్చే సందేహము లకు సమాధానము చాలా స్పష్టంగా ఇచ్చారు. గురువుగారు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు