పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శ్రీనివాస రామానుజం

గర్వించదగ్గ గణిత మేధావి శ్రీనివాస రామానుజం గణితానికి చేసిన సేవలు.

ramanujamఒక అంకెను అదే అంకెతో భాగిస్తే ఒకటి వస్తుంది అన్నాడు టీచరు. అన్ని అంకెలకూ ఇది వర్తిస్తుందా అన్నాడు పిల్లవాడు. వర్తిస్తుంది బాబూ తప్పనిసరిగా వర్తిస్తుంది. ఇదొక గణిత సూత్రం అని టీచరు వివరించాడు.

మరి సున్నను సున్నతో భాగిస్తే కూడా ఒకటి వస్తుందా సార్ అన్నాడు పిల్లవాడు. నల్లగా సన్నగా ఉండే ఆ కుర్రవాడి ప్రశ్నకి టీచర్ నోట్లో మాటరాలేదు.

ఆయనకి ఆనందం, ఆశ్చర్యం ఒకదానినొకటి ముంచెత్తాయి. ఆ అబ్బాయి ఎవరో ఇప్పటికే మీరు పసికట్టి ఉంటారు. అతను శ్రీనివాసరామానుజం (1887 - 1920)

ఒకరోజు రామానుజం ఇంట్లో వంట చేసుకొంటుండగా అతని స్నేహితుడు వచ్చాడు. అతడు రామానుజం నీకోసం ఒక లెక్కతెచ్చాను అన్నాడు. ఆ చిన్నదే గాని నాకు దాని జవాబు కనుక్కోవడానికి 5 నిమిషాలు పట్టింది. మరి నీకు వీలవుతుందేమో చూడు ఉన్నాడు. ఇద్దరు బ్రిటీష్ ఆఫీసర్స్ ప్యారిస్ లో ఒక పొడవాటి వీధిలో వేరువేరు ఇళ్ళలో ఉన్నారు. వాళ్ల వాళ్ల నెంబర్లు రెండూ ఒకదానికొకటి ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉంటాయి. ఆ నెంబర్లు కనుక్కోవాలి. అని ఇంకొన్ని వివరాలు ఆ ఇళ్లకు సంబంధించినవి చెప్పాడు. మరుక్షణం రామానుజం రాసుకో అని మొదలుపెట్టాడు. మొదట రామానుజం చెప్పిన సమాధానం అతని స్నేహితుడు కష్టపడి తెలుసుకున్నది. ఇక అదే వరుసలో నాలుగు విధాలుగా అదే సమాధానం కనుక్కోవచ్చని చెబుతుంటే ఆ స్నేహితుడు ఆశ్చర్యంతో నోరుతెరిచాడు.

రామానుజం చిన్నప్పటి నుండి గణితంలో మనసుపెట్టి, గణితంలోనే మునిగితేలుతుండేవాడు. గణితంపట్ల అతనికున్న అభిరుచి మిగతా సబ్జెక్టులకు దూరంగా ఉంచింది. అందువల్లనే అతను స్కూల్ ఫైనల్ పూర్తిచేయలేదు. రామానుజం 33 ఏళ్ల చిన్న వయస్సులోనే మరణించడం భారతీయుల దురదృష్టం. ఆయన ఇంకొంతకాలం బ్రతికి ఉంటే గణితంలో అత్యంత మేధావిగా ప్రపంచంలోనే గుర్తింపు పరిశోధనలను ఇండియన్ మాథమెటికల్ సొసైటీకి పంపేవారు. 1914 లో అతను లండన్ ట్రీనిటీ కాలేజీకి రాయల్ సొసైటీకి పంపాడు. 1918 లో రాయలో సొసైటీ సభ్యుడయ్యాడు. తరువాత అతని ఆరోగ్యం చెడిపోవడంతో ఇండియాకి తిరిగి వచ్చేశాడు.

రామానుజం గణితంలో పరిశోధనలు చేస్తూనే ఉద్యోగ వేటలో పడ్డాడు. పేదరికంలోపుట్టి పెరిగిన రామానుజానికి పూటగడవడం కూడా కష్టమైంది. అయినా ఆయన తన పరిశోధనలు ఆపలేదు. రోజుకు 70 తెల్లకాగితాలు అవసరమైతే కనీసం వాటిని కొనడానికి కూడా డబ్బులుండేవి కావు. చివరకు చెత్త కుండీల్లో దొరికే కాగితాల్లో రాయడానికి వీలుండేవి ఎన్నుకొని లెక్కలు వేసేవాడు. ఒక్కోసారి పిల్లలు రాసి పారేసిన పుస్చకాల్లో బ్లూ ఇంక్ ఉన్న అక్షరాలమీద ఎర్ర ఇంకుతో లెక్కలు వేసేవాడు. కానీ, ఎవరూ ఆయన ప్రతిభను గుర్తించలేదు.

రామానుజం ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. ఆఖరిరోజుల్లో అతని స్నేహితుడు అతడ్ని చూడ్డానికి వచ్చినప్పుడు ఇలా అన్నాడు. “నేను వచ్చిన ఆటో నెంబరు చాలా డల్ గా ఉంది. అది 1729. రామానుజం మరణానికి దగ్గరగా ఉండి కూడా ఇలా అన్నాడు.” “నువ్వు చెప్పేది కరెక్ట్ కాదేమో !” “1729 is the lowest number that can be expressed in two different ways as the sum of two cubes”

“నాకు స్వప్నంలో కూడా ఫార్ములాలు కనుబడుతుండేవి. వాటిని తెల్లారేసరికి పేపర్ మీద రాసి నిరూపించడానికి నేను ప్రయత్నిస్తుంటాను.” అని రామానుజం చెప్పేవాడు.

2.99056603774
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు