హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / సైన్స్ పరంగా ప్రాణం పోవడం అంటే ఏమిటి?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సైన్స్ పరంగా ప్రాణం పోవడం అంటే ఏమిటి?

జీవికి, నిర్జీవికీ తేడా ఈషణ్మాత్రం కూడా లేని స్థాయికి జీవి దిగజారడాన్ని సైన్సు పరంగా ప్రాణం పోవడం అంటాము.

జీవికి, నిర్జీవికీ తేడా ఈషణ్మాత్రం కూడా లేని స్థాయికి జీవి దిగజారడాన్ని సైన్సు పరంగా ప్రాణం పోవడం అంటాము. అది వివిధ జీవుల్లో వివిధ రూపాల్లో ద్యోతకమవుతుంది. చిన్న తరగతుల్లోనే జీవులకూ నిర్జీవులకూ, తేడాలు, సారూప్యతలు చదువుకుంటాము. ఇందులో కేవలం సారూప్యత మాత్రమే ఉండిపోయి తేడాలు పూర్తిగా మటుమాయం అయితే అప్పుడు ఆ జీవికి ప్రాణం పోయింది అంటాము.

మనుషుల్లో మరణాన్ని గుండె ఆగపోవడం ద్వారాను, శ్వాస ఆగిపోవడం ద్వారాను, బయటి పరిస్థితులకు ఏమాత్రం స్పందించకపోవడం ద్వారాను, మెదడులో కార్యకలాపాలు పూర్తిగా  స్తంభించిపోవడం ద్వారాను పసిగడతాము. వృక్షాల్లో మరణాన్ని శ్వాసక్రియ ఎదుగుదల, కిరణ్యజన్య సంయోగ ప్రక్రియ, కణ విభజన వంటి జీవ చర్యలు ఆగిపోవడం ద్వారా గుర్తిస్తాము. సైన్స్ పరంగా మరణం అంటే అర్థం ఇదే.

కానీ ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ కు వ్యతిరేకంగా ఆ శాస్త్రీయతో కూడిన నమ్మకాలు/విశ్వాసాలు ఉన్నవారే అధికం. (అందుకే జనవిజ్ఞాన విదిక వంటి సంస్థల అవసరం, ఆవశ్యకత చాలా ఉంది. అది ప్రస్తుతం వేరే విషయం). వారి నమ్మకాల ప్రకారం ప్రతి జీవిలోను ఆత్మ (spirit or soul) అనేది ఒకటి ఉంటుంది. అది పరమాత్మ (absolute spirit)తో సంధానించుకొని ఉంటుంది. ఆ పరమాత్మే దేవుడు అంతే. తోలుబొమ్మలాట (puppet show)లో తోలుబొమ్మలు ఆత్మలయితే ఆ తోలు బొమ్మల్ని చేతివ్రేళ్లతో దారాలతో పట్టుకొని తోలుబొమ్మలాడించేవాడు పరమాత్మ లేదా దేవుడన్నమాట. దేవుడు, తోలుబొమ్మలు, తోలుబొమ్మలాడించేవాడు ఏమో గాని ఆత్మ అంటూ ఏమీ లేదు. ఆత్మ అంటూ ఒక వస్తువుగాని, ఓ రూపంగానీ, ఓ వ్యవస్థ (system) గానీ ఉన్నట్లు ఏ మాత్రం దాఖలాలు లేవు.

ఎలక్ట్రాన్లకన్నా సూక్ష్మ రూపమున్న క్వార్కుల్ని, ఇతర లెప్టాన్లు, బోసాన్లు, ఫెర్మియన్లు, మొన్నటికి మొన్న హిగ్స్ కణాల్ని ఆవిష్కరించగలిగిన అత్యద్భుత సైన్సు పరిశీలనకు ఏ కోశానా కానరాని ఆత్మ అనే విషయాన్ని కోట్లాదిమంది ఇంకా నమ్ముతుండడం చాలా ఆందోళనకరం.

మరణాన్ని ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా కాలుష్య నివారణ ద్వారా వాయిదా వేయగలం గానీ, మరణాన్ని పూర్తిగా ఆపలేము. అది ప్రకృతికి విరుద్ధం.

ఆధారం: ప్రొ. ఎ. రామచంద్రయ్య

3.00943396226
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు