పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సముద్రపు తాబేలు

ప్రపంచంలో 7 రకాల సముద్రపు తాబేళ్ళు ఉనికిలో ఉన్నాయి.

tortoiseప్రస్తుతానికి ప్రపంచంలో 7 రకాల సముద్రపు తాబేళ్ళు ఉనికిలో ఉన్నాయి. వాటిల్లో 4 రకాలు మన హిందూ మహాసముద్రంలో, బంగాళాఖాతంలో ఉన్నాయి. ప్రపంచంలో ఏదైనా జంతువు ఎక్కడ పుట్టందో అదే స్ధలానికి పిల్లలు పెట్టడానికి వస్తుంది అంటే అది సముద్రపు తాబేలు మాత్రమే! అవును తను ఏ స్ధలంలో గుడ్డు నుండి బయటికి వచ్చిందో అదే స్ధలానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. సముద్రపు తాబేళ్ళు. పోనీ ఇవ్వేమైనా పుట్టిన స్ధలం చుట్టుపక్కలే ఉంటాయా అంటే అదేంకాదు. కొన్ని వేల కిలోమీటర్లు పుట్టిన స్ధలం నుండి ప్రయనిస్తుంటాయి. అసలు వీటికి స్ధిర నివాసం అంటూ ఉండదు. ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాయి. కాని గుడ్లు పెట్టేందుకు మాత్రం మళ్ళి అన్ని వేల కిలోమీటర్లు వెనక్కు వచ్చి అదే స్ధలంలో గుడ్లు పెడతాయి.

సముద్రపు తాబేళ్ళలో లెదర్ బ్యాక్ అనే జాతి తాబేళ్ళు చాలా పెద్దవి. అంటే ఇవి దాదాపు ఆరు అడుగుల పొడవు ఉంటాయి. వీటి బరువు దాదాపు 700 కేజీలు ఉంటుంది. ఇవి ఇలా ఎందుకు వస్తాయో శాస్త్రవేత్తలకి ఇప్పటికి అర్ధం కాలేదు. తాబేళ్ళన్ని ఇలా ఒకేచోటికి వచ్చి గుడ్లు పెట్టె స్ధలాలు ప్రపంచంలో నాలుగు ఉన్నాయి. అందులో రెండు కోస్టారికాలో ఉంటె ఒకటి మెక్సికోలో ఉంది. ఒరిస్సాలోని గహిర్ మాతా బీచ్ లో ఉంది.

ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు దాదాపు లక్ష తాబేళ్ళు ఒడ్డుకు వచ్చి ఇసుకలో తలా 100 గుడ్ల దాకా పెట్టి వెళతాయి. ఇలా పెట్టిన చాలా తాబేళ్ళు సముద్రంలో వెళ్ళి పెద్దవి అవుతాయి. ఈ పిల్ల తాబేళ్ళు ఇసుకలోంచి సరిగా సముద్రంలోకి వెళ్ళడానికి కారణం సముద్రం మీద చంద్రుని కాంతి పడటం వలన అని ఒక పరిశీలనలో తేలింది. ఇందుకు భిన్నంగా సముద్రపు ఒడ్డున ఉండే నియాన్ లైట్ల కాంతికి ఆకర్షితమై వ్యతిరేక దిశలో ప్రయాణించి చనిపోతున్నాయి. వాటిని కాపాడటానికి ఇప్పుడు పర్యావరణ వేత్తలు, ప్రభుత్వం గహిర్ మాత్ బీచ్ ని 1998 నుండి సురక్షిత ప్రదేశంగా ప్రకటించి జాలర్ల మీద కూడా ఆంక్షలు విధించారు. ప్రపంచంలో అరుదైన వీటిని రక్షించుకోవటం మన బాద్యత కదూ!

2.98159509202
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు