పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సాలె పురుగు

సాలె పురుగులు తమ దారాలతో వలయం (web) సృష్టిస్తాయి.

a12“తాత! తాత!... “ అంటూ గట్టిగా అరుచుకుంటూ బయటనుండి పరుగెత్తుకొని వచ్చింది కీర్తన.

ఏం కొంప మునిగిందోనని భయపడుతూ వరండాలోకి వచ్చాడు తాత.

వరుగెత్తడం వలన కీర్తన ఆయాసపడుతోంది.

“ఏమైందిరా కన్నా?“ అని అడిగాడు తాత. కీర్తనను ముద్దుగా తాత కన్నా అని పిలుస్తాడు.

“ ది మేజింగ్ స్పైడర్ మాన్ సినిమా వచ్చింది. నాకు చూపిస్తావా లేదా?“ అని అడిగింది కీర్తన.

“ఏమున్నదా సినిమాలో?“ అని ప్రశ్నించాడు తాత.

“నాకిష్టమైన కార్టూన్ స్పైడర్ మాన్. మరది సినిమాగా వచ్చిందంట. చూపించవూ? “ అని గట్టిగా ప్రశ్నించింది కీర్తన.

‘స్పైడర్ మాన్’ హాస్య రేఖాచిత్రాలలో (కార్టూన్లు) ఒక విశిష్ట కాథానాయకుడు. సూపర్ హీరో కామిక్ బుక్స్ పేరుతో మార్వెల్ కంపెని ప్రచూరించిన హాస్య రేఖాచిత్రాల్లో పేరొందిన పాత్ర ,స్రైడర్ మాన్. ఈ రేఖాచిత్రాల పరంపరకు కథనందించినవాడు స్టాన్ లీ. బొమ్మలు గీసినవాడు, కొంత కథనాన్ని జోడించినవాడు స్టీవ్ డిక్టో. ఈ హాస్య రేఖాచిత్రాశ్రేణిలో పీటర్ పార్కర్ అనే ఒక అబ్బాయికి ఒక సాలెపురుగు కుట్టడం వలన కొన్ని అద్వితీయ శక్తులు సంప్రదిస్తాయి. ఈ కథలు పిల్లల్ని బాగా అలరించాయి.

“మరి అమ్మ దగ్గర సినిమా చూడడడానికి అనుమతి తీసుకో. “ అని అడిగాడు తాత కీర్తనని.

బేలగా మొహం పెట్టి “అమ్మనడగందే తీసుకెళ్ళవా“ అని అడిగింది కీర్తన.

అడ్డంగా తలవూపాడు తాత.

“అమ్మ ఎలాగూ అనుమతి ఇవ్వదని“ నిర్ణయానికి వచ్చినట్లుంది కీర్తన.

“అయితే తాత! సాలెపురుగు కుడితే స్పైడర్ మాన్ కి వచ్చినట్లు అద్వితీయ శక్తులు వస్తాయా?“ అని ప్రశ్నించింది.

“అది ఒక కథరా కన్నా.“ అని అన్నాడు తాత.

“కాని సాలెపురుగు నిజమే కదా. “ అంది కీర్తన.

“సాలెపురుగు గురించి నీకేం తెలుసు?“ అని అడిగాడు తాత.

“నువ్వు చెప్పు“ అంది కీర్తన.

జంతు విజ్ఞాన శాస్త్రంలో ఆర్థ్రోప్రొడా అనే జంతు విబాగం వుంది. నిజం చెప్పాలంటే సృష్టిలో జంతువర్గంలోకి వచ్చే ప్రాణుల్లో 80% ప్రాణులు ఈ విభాగంలోనే ఉన్నాయి. కీటకాలు, క్రస్టేషియన్లు, ఎరాక్నిడ్ లు అన్నీ ఈ విభాగంలోకి వస్తాయి. సాలెపురుగు ఎరాక్నిడ్లనే శ్రేణిలోకి వస్తుంది. దీంతో పాటు తేళ్ళు, తవిటి పురుగులు (mites), గోమార్లు (ticks) ఇవన్నీ ఈ శ్రేణిలోనే వుంటాయి. వీటన్నింటికి శరీరాల్లో రెండు ఖండాలుంటాయి. ఒకటి వక్షస్థలం (caphalo thorax) కాగా పెండవది ఉదరం (Abdomin) వీటికి రెక్కలుడవు. అలాగే మాసాల్లాంటి స్పర్శావయనాలు వుండవు. కాని ఎనిమిది కాళ్ళుంటాయి. ఇవి నమలలేవు. ఇవి ఎక్కువగా మాంసాహారులు లేక ఇతర జంతువుల మీద ఆధారపడి జీవిస్తాయి.

“సాలెపురుగులంటే ఇవి కీటకాలు కావా?“ అని అడిగింది కీర్తన.

“ఎరాక్నిడ్లనే పురుగులకూ, కీటకాలకు చాలా భేధాలున్నాయిరా కన్నా!“ అన్నాడు తాత.

“మరి ఇవ్వన్ని ఒకే జంతువిబాగంలో వున్నాయిగా“ అని ప్రశ్నించింది కీర్తన.

దీపం చుట్టూ ఎగురుకుంటూ తిరిగే దీపపు పురుగులున్నాయి. ఉసిళ్ళు కూడా ఎగురుతూ వస్తాయి. ఇవన్నీ కీటకాలు. వీటికి రెక్కలుంటాయి. పైగా నీటి శరీరం మూడుఖండాలుగా వుంటుంది. తల, కడుపు, తోక వీటికి ఆరు కాళ్ళే వుంటాయి.

“నాకు సాలె పురుగు గురించి చెప్పు. “ అంది కీర్తన.

“అయితే మధ్య మధ్య నీకు అనుమానం వచ్చినప్పుడు మాత్రం ప్రశ్నలడగాలి, విను.“ అని చెప్పడం మొలదుపెట్టాడు తాత.

సాలెపురుగులకు ఎనిమిది కాళ్ళే కాకుండా నాలుగు జతల కాళ్ళు అంటే ఎనిమిది కాళ్ళుంటాయి. వీటికి విషపుపళ్ళు tangs కూడా వుంటాయి. సాలెపురుగుల్లో ముప్పయి వేల రకాల సాలెపురుగులున్నాయి. సాలెపురుగు ఈ భూమి మీద రెండు కోట్ల సంవత్సరాల క్రితం నుండే ఉందని శాస్త్రజ్ఞుల అంచనా, వీటికి సంబంధించిన శిలాజాలు కూడా డొమినికన్ రిపబ్లిక్ లో దొరికాయని అంటారు.

వక్షస్తలాన్ని అంటిపెట్టుకునే కళ్ళు, నోరు, విషపు పళ్ళు, విషపు పళ్ళకు పక్కకి చిన్న పాదాల్లాంటి కాడలు (pedialps), నాలుగుజాతుల కాళ్ళు వుంటాయి. అలాగే విషగ్రంథులూ వుంటాయి.

రెండవఖండంలో ఉదరభాగంలో చిన్న పట్టుకాయలు (spinnerts) వుంటాయి. ఈ పట్టుకాయలే దారం సృష్టించే గ్రంథులు.

అయితే సాలెపురుగులు తాము సృష్టించే దారంలో తాము చిక్కుపడి పోకుండా దాని శరీరం ఒక రకమైన నూనె ఉత్పత్తి అవుతుంది.

సాలెపురుగు కాళ్ళు గాలిలోని చలనాలను, వాసనలను గుర్తుపడతాయి. ఈ కాళ్ళలో ఒక్కోక్కకాలికి ఆరు సంధులుంటాయి. అంటే మొత్తం ఎనిమిది కాళ్ళకు కలిపి 48 సంధులుంటాయన్నమాట. సాలెపురుగులు తమ ఆహారంగా రకరకాల పురుగులు తింటాయి. నోటి దగ్గరున్న చిన్న పాదాల్లాంటి కాడలతో పురుగుల్ని పట్టుకొని తమ విషపు దంతాలతో వాటిని కొరుకుతాయి. నోటిలో నుండి, కారె ద్రవంతో ఆ పురుగుల్ని ద్రవరూపంలోకి మార్చి దాని లోపలకు పీల్చుకుంటాయి. పురుగులు దూరంగా వుంటే తమ పట్టుకాయల నుండి దారాన్ని విసిరి వాటిని పట్టుకుంటాయి. నిజానికి ఈ పట్టుకాయల నుండి వచ్చేది ఒక రకమైన ద్రవమే. అయితే ఇదిగాల్లోకి రాగానే గట్టిపడి దారంగా మారుతుంది. దారం ఒకేదారంలా కనపడినా అందులో చాలా వరుసలుంటాయి. ఒక్కోసారి ఒకేఒక దారంతో అవి చెట్లనుండి లేక ఇంట్లోని దూలాల నుండి వేళాడుతాయి. దీన్నే ఈడ్పుదారం () అంటారు. ఇలా వేలాడిన సాలెపురుగు గాలికి ఊగి ఊగి కొత్త ఆధారాన్ని పట్టుకుంటుంది. ఒక్కొక్కసారి పెద్దసాలీల్ళు కిలోమీటరు దూరంలో ఉన్న ఆధారాన్ని కూడా చేరుకుంటాయి. దీన్నే గాలిబుడగ వాటం (balloning) అంటారు.

సాలె పురుగులు తమ దారాలతో వలయం (web) సృష్టిస్తాయి. కొన్ని రకాల సాలెపురుగులు గబ్బిలాలను, ఎలుకలను, పిట్టలను, చివరకు పాములను కూడా తమ వలయాల్తో పట్టుకొని ఆహారంగా ఉపయోగించుకుంటాయి. ఇవి నమలలేవు కాబట్టి వాటి శరీరభాగాలను కూడా ద్రవంగా మార్చి పీల్చుకుంటాయి. బొలాస్ సాలెపురుగు తమ దారాలను చివర తిన్న గోళాకారంలో డిగట నేర్పర్చి గాలంలా వాడి నీటిలోని చేపలను పట్టుకుంటాయి. ఆహారం దొరక్కుంటే ఇతర సాలెపురుగులను తింటాయి. అంతే కాకుండా పనికిరాని తమ దారాలను తామే తిని కొత్తదారాలను ఉత్పత్తి చేస్తాయి. తమ దారాలను గుడ్లుపెట్టే సంచులుగాను, ఆహారం సేకరించే పనిముట్లుగాను వాడతాయి.

సాలెపురుగులు తమ వలయాలు కూడా చాలా రకాలుగా అల్లుతాయి. గోళాకార వలయాలు (circular web), దుప్పటి వలయాలు (sheet web), గరాటు వలయాలు (tunnel web), ఒక్కోసారి ఎగురుతున్న కీటకాలు దుప్పటి వలయానికి తగిలి సాలెపురుగులకు ఆగారమవుతాయి. కొన్ని పక్షులు గోళాకార వలయాలను గుర్తించి దూరంగా ఉంటాయి. కన్ని కీటకాలు, పిట్టలు గరాటు వలయంలోకి ప్రవేశించి అడుగున కాచుకుని కూర్చున్న సాలెపురుగుకి ఆహారమవుతాయి.

ఇక వీటి నివాసస్థానం గురించి చెప్పుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. అంటార్టికా లాంటి శీతల ప్రదేశం మొదలుకొని అత్యుష్ట ప్రాంతంలో కూడా జీవించగలవు. ఎత్తయిన శిఖరాల నుండి సముద్రపు లోతుల వరకు నివసించగల సాలెపురుగులున్నాయి.

అయితే కొన్ని సాలెపురుగులు వలయాలు ఏర్పర్చకుండా వేటాడగలవు. దారాన్ని ఉత్పత్తి చేసి ఆహారాన్ని పట్టుకోవడమే చేస్తాయి. వీటి కళ్ళు శక్తివంతంగా పనిచేస్తాయి.

వీటి ఆకారాలు కూడా ఎన్నో రకాలుగా వున్నాయి. ఒకరకం సాలెపురుగు ఆకారం ఎంత పెద్దదిగా ఉంటుందంటే కాలుసైజు కనీసం పదకొండు అంగుళాలు అంటే 28 సెం.మీ. దాన్నిబట్టి దాని ఆకారం ఎంత పెద్దదో ఉహించుకోవచ్చు. ఒక రకం సాలెపురుగు ఎంత చిన్న ఆకృతి కలిగి ఉంటుందంటే ఒక సన్నని పెన్సిల్ మొనలో కనీసం పది సాలెపురుగులు కూర్చోగలవు.

సాధారణంగా మన సాలెపురుగులు ఆడ సాలెపురుగుల కంటే చిన్నగా వుంటాయి. ఒక ఆడసాలెపురుగు రెండు నుండి ఒక వేయు గుడ్ల వరకు పెడుతుంది. మన సాలెపురుగు తన కాళ్ళను కదిలిస్తూ నృత్యం చేయడం ద్వారా ఆడ సాలెపురుగు దృష్టినాకర్షిస్తుంది. కాని అది ఆడ సాలెపురుగుతో జాగ్రత్తగా మెసలుతుంది. ఎందుకంటే ఆడ సాలెపురుగు మన సాలెపురుగుని ఆహారంగా భావించి తినేయగలదు కూడా.

అయితే సాలెపురుగులు తమ సంతానాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాయి. తమదారాలతో అల్లిన సంచులతో గుడ్లను భద్రంగా దాచుకోవడమే కాకుండా కాపలాకాస్తాయి. గుడ్లలో నుండి సాలెపురుగులు బయటకు వచ్చిన తరువాత అవి తమ దారిన తామువెళ్ళిపోతాయి. తోడేలు సాలెపురుగు (wolf spider) తన సంతానం గుడ్ల నుండి బయటకు వచ్చింతర్వాత కూడా తమ వీవు మీద మోస్తూ తిరుగుతాయి. అవి తమ మొదటి ఆహారం సంపాదించుకొన్నంక వాటిని వదిలివేస్తాయి. కొన్ని సాలెపురుగులు తాము పట్టుకున్న ఆహారాన్ని ద్రవరూపంలోకి మార్చినంక ఆ ద్రవాన్ని తమ సంతానానికి నోట్లోకి  అందజేస్తాయి.

అయితే సాలెపురుగులకు అస్థిపంజరం లేకపోయినా అవి పెరిగేటప్పుడు దాని చుట్టూ ఒక గట్టి పెంకులాంటి రక్షణ నేర్పరుచుకుంటాయి.. దీన్ని మనం బయటిగూడు exo skelton అంటాం. అయితే ఈ గూటి కంటే అవి పెద్దదైనప్పుడు ఆ గూటి నుండి నెమ్మదిగా బయటపడతాయి. తమ ఎనిమిది కాళ్ళను ఈ గూట్లోనుండి బయటకులాగడం ఎంత కష్టమో ఒక్కసారి ఉహించుకోండి. అలా బయటకు వచ్చిన సాలెపురుగు మళ్ళీ ఒక బయటిగూడు ఏర్పరుచుకుంటుంది. అలా కొన్ని సార్లు జరిగి ఇక సాలెపురుగు ఎదిగే దశ లేదనుకున్న తరుణంలో ఈ బయటిగూడు ఏర్పడటం ఆగిపోతుంది.

“తాతా! నేనిమధ్య పేపర్లో చదివాను. అస్సాంలో సాలెపురుగులు కట్టి మనుషులు చచ్చిపోతున్నారట.“ అని అడిగింది కీర్తన.

“కన్నా! నికింకా వయసు ఎనిమిదేళ్ళేగా పేపరుకూడా చదువుతున్నావా?“ అని అన్నాడు తాత.

“నాకు బాగా గుర్తుంది. ఈ వార్త నేను జూన్ 6వ తారీఖున చదివాను. “ గర్వంగా చెప్పింది కీర్తన. “అయితే సాలెపురుగులు కుడితే మనుషులు చచ్చిపోతారా?“ అని అడిగింది.

“తారంతులా అనే రకమైన సాలెపురుగుల విషం ప్రమాదకరంగా వుంటుంది. అయితే అస్సోంలో ఇవి లేవని మన శాస్త్రజ్ఞులు ప్రకటించారు. ఒక నల్లని సాలెపురుగు, దీన్ని నల్ల విధవ సాలెపురుగు, అలాగే గోధుమవన్నె ఒంటరి సాలెపురుగు... ఇటువంటి సాలెపురుగులన్నీ తారంతులా రకానికి చెందినవి. ఇందులో నల్లని సాలెపురుగు ఎక్కువగా తన సంతానానికి తండ్రి అయిన మగ సాలెపురుగుని చంపి తినేస్తుందని అంటారు. వీటి విషం మనిషి నరాల మీద పనిచేసి మనిషని నిర్వేర్యం చేసి అతడి చావుకి కారణం అవుతుంది“ అని చంప్పాడు తాత.

“అంటే కొన్ని రకాల సాలెపురుగుల ఆహారంలో మని,షిని కూడా లెక్కవేసుకోవచ్చన్నమాట.“ అంది సాలోచనగా కీర్తన.

“ప్స్! సినిమాకి వెళ్తే ఏదైనా కథ ఉండేది. నువ్వు చెప్పిన సాలెపురుగుల అంశంలో ఏ కథాలేదు.“ అని పెదవి విరిచింది కీర్తన.

“సలు సాలెపురుగు ఎలా పుట్టిందని చెప్పడానికి గ్రీకు పురాణాల్లో ఒక కథ వుంది.“ అన్నాడు తాత.

“ఏమిటది?“

“ఒక గ్రామంలో ‘ఎరికాన్’ అనే ఒక అమ్మాయి ఉండేదట. ఆ అమ్మాయికి చాలా పొగరు. గ్రీకు దేవత ‘ఏధైనా’ బట్టలు బాగా నేసేదట. అయితే ఎరికాన్ ఎథేనా కంటే బాగా నేయగలదని ప్రగల్బాలు పలికింది. నిజంగానే ఎరికాన్ బట్టలు బాగా నేసేది. కాని పొగరుగా మాట్లాడడంతో ఏధేనాకు కోపం వచ్చి ఆమెను పురుగుగా మారిపొమ్మని శపించింది. దాంతో ఎరికాన్ సాలెపురుగుగా మారిపోయింది. అందుకే సాలెపురుగు ఉన్న జంతుశ్రేణిని ఎలాక్నిడ్ అంటారు. “ చెప్పాడు తాత.

“నేనెప్పుడు పొగరుగా మాట్లాడను తాత!“ అని ప్రేమగా తాత మెడచుట్టూ చేతులు వేసింది కీర్తన. తర్వాత “కాని సాలెపురుగులు మంచివి కావు. స్పైడర్ మాన్ లాగా అవి ఇతరులకి సహాయం చేయవు .“ అని కూడా అంది.

“కాదురా కన్నా! మన ఇంట్లో మనకి హాని కలిగించే కీటకాలు, దోమలు, పురుగులు లాంటి వాటిని సాలెపురుగులు తినేస్తాయి. అంతేకాకుండా సాలెపురుగు విషంతో పక్షవాతంతో దెబ్బతిన్న మనిషి మెదడు తిరిగి పనిచేసే మందని కనిపెట్టవచ్చని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. “ అని చెప్పాడు తాత.

“అవునా?“ ని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది కీర్తన.

రచన: పైడిముక్కల ఆనంద్ కుమార్

3.00330033003
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు