పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

క్లోనింగ్ ద్వారా స్పాటి జననం

కృత్రిమ గర్భదారణ ద్వారా స్పాటి జింకపిల్ల జననం

భారతదేశానికే గర్వకారణం మన హైదరాబాదులోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (C.C.M.B) సంస్థ. అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకోసం C.C.M.B శాస్త్రవేత్తలు నడుంకట్టారు. దేశంలోనే మొదటిసారిగా వన్యప్రాణుల్లో కృత్రిమ గర్భదారణను విజయవంతంగా నిర్వహించారు. ఈ పద్ధతిలో గర్భందాల్చిన ఓ జింక మార్చి 14 వ తేదీన స్పాటీ అనే జింకపిల్లకు జన్మనిచ్చింది. స్పాటీ చాలా ఆరోగ్యంగా చలాకీగా వుంది.

C.C.M.B కి చెందిన డాక్టర్ శివాజీ. D.jpgడా,, ఉమాపతి, సోంటక్కే, అనురాధా రెడ్డిల బృందం నెహ్రూ జంతుప్రదర్శనశాల సహకారంతో ఈ పరిశోధనను చేపట్టింది. పెంపుడు జంతువుల్లో కృత్రిమ గర్భదారణ సాధారణమే అయినప్పటికీ వన్యప్రాణులపై ఈ విధానాన్ని ఇంతవరకు ఉపయోగించలేదు. ఆడ జంతువు అండాన్ని, మగజంతువు శుక్రకణంతో కలిపి ఫలదీకరణం చెందిస్తారు. ఫలదీకరణం తర్వాత, అండం ఆడజంతువు గర్భాశయంలో పిండంగా ఎదుగుతుంది. దీన్ని కృత్రిమ గర్భధారణ అంటారు. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇలాంటి ప్రయోగాలు జరుగుతుండగా, ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన చేరింది.

క్లోనింగ్ దిశలో సి.సి.యం.బి.

కుందేళ్ళను, చిరుతపులులను క్లోనింగ్ ద్వారా సృష్టించే ప్రయత్నంలో సి.సి.యం.బి అడుగులు వేస్తోంది.

క్లోనింగ్ ఎలా చేస్తారు ?

ప్రతి జీవిలోను రెండు రకాలకణాలుంటాయని మనకు తెలుసు. అవి శరీరకణాలు బీజ కణాలు, శరీర కణాల్లో క్రోమోజోములు జతలుగా ఉంటాయి. దీన్ని ద్వయస్థితికదశ అంటారు. బీజకణాల్లో క్రోమోజోములు జతలుగా ఉండక ఒంటరిగా ఉంటాయి. వీటిని ఏకస్థితిక దశ అంటారు.

స్త్రీపురుష బీజకణాలు కలిసి ఫలధీకరణ జరిగినప్పుడు ఏర్పడే జైగోట్, ద్వయస్థితిక దశలో ఉంటుంది. వీటిలో సగం క్రోమోజోములు తల్లి నుండి సగం క్రోమోజోములు తండ్రి నుండి వచ్చి వుంటాయి. ఇలా స్త్రీ, పురుష బీజకణాల కలయిక ద్వారా సంతానోత్పత్తి జరుగుతుందని అందరికీ తెలిసిందే.

ప్రతిజాతి జీవుల్లో క్రోమోజోముల సంఖ్య నిర్ధిష్టంగా వుంటుంది. ఉదా,, మానవుడిలో క్రోమోజోముల సంఖ్య 23 జతలు.E.jpg

ఇక క్లోనింగ్ విషయానికొస్తే ఇక్కడ పురుష బీజకణాలతో అవసరంలేదు.

స్త్రీ బీజకణం (అండం) లోని కేంద్రకాన్ని తొలగించి మగ జంతువు శరీరకణంలో ద్వయస్థితిక దశలో ఉన్న కేంద్రకం ను అండంలో ప్రవేశపెడతారు. ఇలా ద్వయస్థితికంగా మారిన అండకణాన్ని తిరిగి స్త్రీ జంతువు గర్భాశయంలో ప్రవేశపెడతారు. అక్కడ పిండ ప్రతిస్థాపన జరిగి పిండం అభివృద్ధి జరుగుతుంది. జన్మించిన శిశువు మమ్మూర్తులా మగ జంతువు శారీరక లక్షణాలతో జెరాక్స్ కాపీలాగా ఉంటుంది.

మొట్టమొదటిసారిగా, ఈ క్లోనింగ్ పద్దతిలో డాలీ అనే గొర్రెపిల్ల జన్మించింది. ఆ తర్వాత ఆవు, పిల్లి, కోతి లాంటి క్లోనింగ్ జంతువులు ఎన్నోవచ్చేశాయి.

ప్రకృతి వైవిధ్య భరితం. ఏ జీవీ మరొక జీనిని ముమ్మూర్తులా పోలివుండదు. కవల పిల్లల్లో కూడా కొద్దిపాటి తేడాలుంటాయి. కానీ క్లోనింగ్ ద్వారా ఒకేరకమైన శరీర లక్షణాలున్న జీవులను వేలకొలది సృష్టించవచ్చు.

క్లోనింగ్ మనిషి ఉద్భవిస్తే

మనుషుల్లో క్లోనింగ్ కోసం అనేక మంది శాస్త్రవేత్తలు ఉవ్విళ్ళూరుతున్నారు. మనుషుల్లో క్లోనింగ్ కు ప్రపంచవ్యాప్తంగా గట్టివ్యతిరేకత ఎదురవుతోంది. క్లోనింగ్ మానవులు వచ్చేస్తే మన సమాజంలో ఎన్ని సమస్యలు ఎదురవుతాయో, ఎంత అల్లకల్లోలమవుతుందో ఊహించుకుంటేనే భయంగా వుంది కదూ.

3.02272727273
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు