హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / సూర్యగ్రహణం చంద్రగ్రహణం సందర్భాల్లో మనం సూర్యుణ్ణి ఎందుకు చూడకూడదు?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సూర్యగ్రహణం చంద్రగ్రహణం సందర్భాల్లో మనం సూర్యుణ్ణి ఎందుకు చూడకూడదు?

ఇవ్వనీ మనకున్న మూడనమ్మకాలు.

సూర్యగ్రహణం పగలే వస్తుంది. చంద్రగ్రహణం పౌర్ణమినాడే రాత్రే వస్తుంది. కాబట్టి చంద్రగ్రహణం నాడు సూర్యుడ్ని చూసే విషయం తరువాత మాట్లాడదాం! సూర్యగ్రహణం సందర్భంలో కన్నా మామూలు సందర్భంలోనే సూర్యకాంతిలో అతినిలలోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కాంతి తీవ్రత కూడా మామూలు రోజుల్లోనే ఎక్కువ ఉంటుంది. అయితే మామూలు రోజుల్లో సూర్యుణ్ణి పనికట్టుకొని చూసే ఆసక్తి ఏమి ఉండదుకదా! మన ఊర్లో ఓ దిక్కున ఉన్న కొండను ఆసక్తిగా రోజూ అదేపనిగా చూస్తామా? కాని గ్రహణం అపుడు సూర్యుడు పాక్షికంగా కాని సంపూర్ణంగా కాని కనిపించని పరిస్ధితి కొంత ఏర్పడుతుంది. కాబట్టి అదో వింతగా వుంటుంది. అందువల్ల అలాంటి సూర్యబింబాన్ని చుడాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికే కలుగుతుంది. అయితే ఆ సమయంలో కూడా సూర్యకాంతి మామూలుగా ఉన్నట్టే ప్రమాదకర స్ధాయిలోనే ఉంటుంది. వింతగా ఉంది కదా అని అదే పనిగా చూస్తే దృష్టి లోపాలు శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల సౌర ఫిల్టర్ వాడి చూడవచ్చు. ఫిల్టర్ వాడుతూ సూర్యుణ్ణి ఎపుడైనా చూడవచ్చు. అరుదుగా వచ్చే సుర్యగ్రహణాన్ని ఫిల్టర్ వాడికూడా చూడవద్దనుకోవడం పూర్తిగా చందసం.

నిండు పున్నమి నాడు చంద్ర బింబాన్ని ఎంతసేపు చూసినా ప్రమాదం లేదు. అలాంటిది చంద్రగ్రహణపు చంద్రుణ్ని చుడకపోవడంలో అర్ధం లేదు. గ్రహణంలో ఉన్న చంద్రుణ్ని చూస్తే అవేవో నీలాపనిందలు వస్తాయనుకోవడం మనకున్న మూడనమ్మకాల్లో ఒకటి. గ్రహణం రోజు పిల్లలు పుడితే వారు గ్రహణ మొర్రి (Clift Pallate) తో పుడతారన్న నమ్మకం కూడా అర్ధం పర్ధం ఆధారం లేనిదే.

ఆధారం: ఎ. రామచంద్రయ్య

2.99402985075
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు