పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సోడియం

సోడియం మూలకం గురించి తెలసుకుందాం.

సోడియం సంయోగ పదార్థాలైన సోడియం క్లోరైడ్ అలాంటివి మానవునికి అనాది నుంచి తేలిసినవే. సోడియం జంతువుల జీవరసాయన శాస్త్రంలో ఒక మూలకం. ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా సోడియం, భౌతిక, రసాయన ధర్మాలు మనం అర్ధం చేసుకోవచ్చు.

లభ్యతలో సోడియం భూమికి సంబంధించి ఏడో స్ధానంలో ఉన్న మూలకం, ఐదవ అత్యధిక లభ్య లోహం. Al, Fe, Ca, Mg లు మాత్రమే దీని కంటే అధికంగా లభిస్థాయి. పురాతన సముద్ర జలాలు ఆవిరైపోయాక సోడియం లవణాలు అన్ని ఖండాల్లోనూ భూమిపై దొరుకుతున్నాయి. గ్రేట్సాల్ట్ లే (Utah), డెడ్సీల నుంచి NaCl లభిస్తుంది. రాక్ సాల్ట్ (NaCl), ట్రోనా (Na2,CO3), సాల్ట్ పిటర్ (NaNO3), సల్ఫేట్ (Mirabi Lite, Na22SO4), బొరేట్ (బోరాక్స్, కెర్నైట్)లు సోడియం ముఖ్య. 40% NaCl, 60% CaCI2, ఒక స్థిరమైన భవన స్థానమున్న మిశ్రమం (Eutectic Mixture). ఈ యుటిక్టిక్ మిశ్రమాన్ని 580°C దగ్గర ద్రవీభవింపచేసి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా సోడియంను తయారుచేస్తారు. దీనికి డౌన్ విద్యుత్ ఘాతాన్ని వాడవచ్చు. ఈ ఘటంలో ప్రత్యేకంగా అమర్చిన స్టీలు కాధోడ్ వద్ద ఏర్పడే సోడియం కాల్షియంలను వేరు చేసే ఏర్పాటు ఉంటుంది. గ్రాఫైట్ అనోడ్ వద్ద క్లోరిన్ వాయువు వెలువడుతుంది.

సోడియంను జ్వాలాపరీక్ష (Flame test)లో గుర్తించవచ్చు. బాహ్యకర్బర ఎలక్ట్రాన్ ఉద్రిక్త స్థితికి చేరడం వల్ల ఈ జ్వాలా పరీక్ష వీలవుతుంది. ఇది Flame Photometry) లేదా ఎటామిక్ ఎబార్షన్ స్పెక్ట్రోస్కోప్ ద్వారా చేస్తారు. సోడియం వర్ణపటంలో D-Line Doublet 589.0, 589.6 nm ల వద్ద పసుపు వర్ణం గల గీతలను 3p-3s ఎలక్ట్రాన్ పరివర్తనల వలన ఇస్తుంది.

రసాయన ధర్మాలు చూస్తే సోడియం చాలా చురుకైన లోహం. ఆక్సిజన్ తో Na0ను, కొంత Na2O2 ను కొంత  Na2O ను ఏర్పరుస్తుంది.

సోడియం మొదటి అయనీకరణ శక్తి తక్కువ. రెండో అయనీకరణ శక్తి చాలా ఎక్కువ. అందుకే సోడియం +1 ఆక్సీకరణ స్థితిలో ఉంటుంది.

Na20 ను Na202, NaOH లేదా NaNO2 ను సోడియం లోహంతో చర్య ద్వారా తయారుచేస్తారు.

Na2O2 + 2Na → 2 Na2O;

NaOH + Na – Na20+ 1/2 H2

NaNO2 + 3Na → 2Na2O + 1/2N2

NaOH ఒక బలమైన క్షారము. ఆమ్లాలతో జలద్రావణంలో చర్య జరిపి లవణాలనేర్పరుస్తుంది.

NaOH ని కాస్టిక్ సోడా అని కూడా, రసాయనాల తయారీలోను కాగితం టెకైల్ పరిశ్రమలోను, సబ్బు, డిటర్జెంటి, దీనిని వాడతారు.

Washing Soda (Na2C0310H2O) ఒక్కపుడు వాషింగ్ కు ఉపయోగపడినా ప్రస్తుతం డిటర్జెంట్ లు సబ్బులు ఆ స్థానాన్ని ఆశ్రయించాయి. Na2CO సోడాయాష్ (Soda ash) అంటారు. అయితే గాని తయారీ పరిశ్రమలో ఇది చాలా ఉపయోగపడుతుంది పారిశ్రామికంగా SO2 ను తొలగించడానికి వాడతారు బేకింగ్ సోడా (NaHCO3) బేకింగ్ పౌడర్ల తయారీలోనూ Machines తయారిలోనూ నిప్పునార్పే యంత్రాలలో అధికంగా ఉపయోగపడుతుంది. సాల్ట్ కేక్ కాగితం పరిశ్రమలోనూ, గాజు, డిటర్జెంట్ పరిశ్రమల్లోనూ ఉపయోగపడుతుంది. Na2SO410H ను గ్లోబల్ సాల్ట్ అంటారు. చిలిసాల్ట్ పీటర్ (NaNO2) తక్కువ ద్రవీభవన స్థానంలో వేడి చేసినప్పుడు వియోగం చెందుతుంది.

ద్రవ అమోనియలో సోడియం అమ్మోనియా ఎలక్ట్రాన్ లను ఇస్తుంది. వీటితో ద్రవణానికి నిలిరం వస్తుంది.

సోడియంను PbEt4 (టెట్రా ఇథైల్ లెడ్) తయారీలోనూ Ti, Zr ఇతర లోహాల క్లోరైడ్లను క్ష్యయకరణం చెందించి ఆయా లోహాలు తయారు చేయడంలోనూ, ఉత్ర్పేరకంగాను, ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్లతో ఉష్ణవినిమయ చర్యకు, కర్బన సంయోగ పధార్ధలోని మూలకాలను గుర్తించడానికి ముఖ్యంగా వాడతారు. సోడియం చర్యాశీలత అధికం కావడం వల్ల గాలితో చర్య జరుపకుండా కిరోసిన్ లో ఉంచుతారు.

మరొక్క ముఖ్య విషయం. పేరు సోడియం. మరి సంకేతం 'Na' ఇదేమిటి? 'Na' సంకేతం లాటిన్ పదం నట్రీయం (Natrium) నుంచి వచ్చింది. 18, 19, 20వ

శతాబ్దాల్లో జర్మన్లకు, ఇంగ్లీష్, ఫ్రెంచి వారికి మధ్య సైన్స్ పై ఉన్న ఆధిక్యత ఇలాంటి కొన్ని ఇబ్బందులను తెచ్చింది. జర్మన్లకు గ్రీకు, లాటిన్ పేర్లను సైన్సులో ఉంచాలనే ఆలోచన ఉంటే, ఇంగ్లీష్, ఫ్రెంచి వారు ఇంగ్లీష్ పేర్లకు ప్రాముఖ్యత నిచ్చేవారు.

సోడియంను మొదటిసారిగా విద్యుద్విశ్లేషణ చర్యలో తయారుచేసిన హంఫ్రీడేవీ ఇంగ్లీష్ పేరు సోడాకార్న్ తీసుకొని దానికి 'So' సంకేతం ఇచ్చాడు. ఇవే Sodium లోని మొదటి రెండు అక్షరాలు. దానిని జర్మన్ భాషలోకి తర్జుమా చేసిన గిల్బర్ట్ దానికి తిరిగి Na (Natrium లాటిన్ పదం నుంచి) సంకేతం ఇచ్చాడు.

రచన: ప్రొ. కోయ వెంకటేశ్వరరావు

3.00398406375
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు