హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / స్థిరమైన సోడియం-హీలియం సమ్మేళనం ఆవిష్కరణ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

స్థిరమైన సోడియం-హీలియం సమ్మేళనం ఆవిష్కరణ

సోడియం-హీలియం సమ్మేళనం నా౨హే ఆవిష్కరణ

sodiumheliumరసాయన శాస్ర చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైన పరిశోధన! aహీలియం వంటి జడ వాయువులు ఏక పరమాణుకంగానే ఉండడానికి ఇష్టపడుతాయి. ఒక పట్టాన రసాయనిక చర్యలో పాల్గొనవు. అందుకే వాటిని జడవాయువులు అన్నారు. అంతగా పాతుకుపోయిన కొన్ని శాస్త్రీయ భావనలను తిరగరాస్తూ ఒక కొత్త హీలియం సమ్మేళనాన్ని జియోడాంగ్ నేతృత్వంలోని చైనా, రష్యా, అమెరికా శాస్రవేత్తల బృందం సంశ్లేషణ చేసింది. సాధారణ పీడనానికి ఒక మిలియన్ రేట్ల కంటే ఎక్కువ అంటే సుమారుగా 113 G Pa (గిగాపాస్కల్) పీడనం ప్రయోగించి Na2He సమ్మేళనాన్ని తయారు చేశారు. ఈ విజయంతో, సోడియం, హీలియం, ఆక్సీజన్ సమ్మేళనం Na2HeO సంశ్లేషణ చేసేందుకు వారు తయారవుతున్నారు. ఆవర్తన పట్టికలోని అన్నిమూలకాల్లోను అతి తక్కువ చర్యాశీలత ఉన్న మూలకం హీలియం. ఉతృష్ణ వాయువులు వాటి స్థిరమైన ఎలక్షాన్ విన్యాసం దృష్ట్యా ఇతర మూలకాలతో కలిసి సమ్మేళనాల నేర్పరచవని చాలా కాలంపాటు శాస్రవేత్తలు భావించారు. కాని పరిశోధనల ఫలితంగా హీలియం మినహా మిగతా ఉత్పష్ట వాయువులు, నియాన్, ఆర్గాన్, కిస్తాన్, జినాన్, రేడాన్ లు సమ్మేళనాల నేర్పరుస్తాయని తెలిసింది. ఇప్పడు హీలియం కూడా ఈ జాబితాలో చేరింది. హైడ్రోజన్ తర్వాత ఈ మహావిశ్వంలో అత్యధిక లభ్యత ఉన్నమూలకం హీలియం. దీని ఎలక్ట్రాన్ ఎఫినిటీ సున్న. అయనీకరణశక్మం అత్యధికం. కాని అత్యధిక పీడనాల వద్ద హీలియం కనీసం రెండు సమ్మేళనాలను, అంటే Na2He, Na2HeO, ఏర్పరచ గలుగుతుందని న్యూయార్క్లోని స్టోనిబ్రూక్ యూనివర్సిటీ శాస్రజ్ఞలు ముందుగా ఊహించారు. వీరి ఊహలను నిజంచేస్తూ జియోడాంగ్ బృందం Na2He ని సంశ్లేషణ చేసింది.

3.05084745763
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు