పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

హిమక్రిము - ఐస్ క్రీం

ఇస్ క్రీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

యమలీల సినిమాలో యమధర్మరాజు పాత్రలో సత్యనారాయణగారు హిమక్రిములు కప్పులు కప్పులు తినటం మీరు చూసేవుంటారు. ఇస్ క్రీం!.. యూ స్కీం..!! వుయ్ ఆల్ స్క్రీం ఫార్ ఇస్ క్రీం!!! అని ఐస్may01.jpgక్రీం కోసం ఆంగ్లంలో ఓ రైం వుంది. నోరు తిరగని చిన్న పిల్లలు కూడా ఈ వేసవిలో 'ఐచుకీం.. 'ఐచుకీం' అని గోలచేస్తారు. ముసలి వారు కూడా బోసినోటితో ఇస్ క్రీం అని అడుగుతారు. ఐస్ క్రీం రకరకాలుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది. పుల్ల అయిసు, పాల అయిసు, సేమియా అయిసు, కుల్ఫీ అయిసు, కప్పు అయిసు, కార్నెట్లో, రకరకాల రుచులతో (పిస్తా, వెనిలా, స్ట్రాబెర్రీ, మాంగో, అనాస, గ్రేప్, బ్లాక్ కరెంట్) లభిస్తోంది. మరి చల్ల చల్లగా.. తియ్య తియ్యగా అందరు ఆప్యాయంగా తినే ఐస్ క్రీం గురించి తెలుసుకుందామా.

ఇస్ క్రీంను తొలుత ఐస్ డ్ క్రీం అని, క్రీం ఐస్ అని పిలిచేవారు. అత్యధిక కొవ్వు శాతం గల పాలను, క్రీంను ఫ్రక్టోజ్, గ్యూకోస్ కలిగిన తీపి పదార్థాలను చిలికి చల్లబరచి తయారుచేసిన మిశ్రమ పదార్థమే ఇస్ క్రీం. ఎన్నిక చేయబడిన పదార్థాల మిశ్రమాన్ని చల్లబరుస్తూ మెల్లగా చిలుకుతూ గాలిని కలుపుతూ పెద్ద పెద్ద ఐస్ పలకలు ఏర్పడకుండా కలియబెడతారు. ఫలితంగా నురుగుతో కూడిన చక్కటి ఇస్ క్రీం ఏర్పడుతుంది. వేరు వేరు దేశాలలో ఇస్ క్రీం రకరకాల పేర్లతో అందుబాటులో వున్నాయి. వీటిలో అధికంగా వాడబడే రకాలు వెనీలా, చాక్లెట్ రుచులు.

క్రీస్తు పూర్వం 400 కంటే ముందు పర్షియా రాజ్యంలో ప్రజలు చిక్కటి ద్రాక్ష రసాన్ని పాత్రలో గల ఐస్ పై పోసి ఆరగించేవారు. దీనికోసం చలికాలంలో ఐసను సేకరించి నేలమాలిగలో గల 'యారాల్' అనే గదులలో నిల్వ వుంచేవారు. రోజాపూల నీరు, వెర్మిసెల్లి కలిపి దానికి ఐస్ ను కలిపి ఆ కొత్త రకం పదార్థాన్ని తినేవారు. ఇది రాజ కుటుంబీకులు మాత్రమే సేవించేవారు. ఇంకా ఐస్ ను కుంకుమ పువ్వు, పళ్ళు మరియు ఇతర పదార్థాలు కలిపి తినేవారు. క్రీస్తుపూర్వం 200లో చైనాలో పాలు, అన్నం ఐస్ కలిపిన చల్లటి పదార్థాలను తీసుకునేవారు. రోం సామ్రాజ్య నేత నీరో క్రీ.శ. 37-68లో పళ్ళు ఐస్ ను కలిపి ఆరగించేవారట.

ఇస్ క్రీంలో పాలవాడకం మాత్రం అరబ్బు దేశంలో ప్రారంభమైంది. వారు పాలను, చక్కెర కలిపి ఇస్ క్రీం ను వ్యాపారపరంగా అభివృద్ధి చేసారు. 10వ శతాబ్దం నాటికి బాగ్దాద్, డమాస్కస్ మరియు కైరో లాంటి అరబ్బు దేశాలలో ఇస్ క్రీం వ్యాపారపరంగా బాగా వ్యాపించింది. పురాతన అరేబియా రుచులైన రోజ్ వాటర్, ఎండిన పళ్ళు, గింజలు మొదలగు వాటిని ఇస్ క్రీం లో కలిపి తయారుచేసేవారు.

ఇస్ క్రీం ను షర్బత్ ను తయారుచేసి పరికరాన్ని చైనీయులు అభివృద్ధి చేసారు. ఉప్పు కలిపితే నీటి మరుగు ఉష్ణోగ్రత పెరిగినట్లే, ఉప్పు కలపడం వల్ల నీటి యొక్క గడ్డకట్టే ఉష్ణోగ్రత సున్న కంటే తగ్గుతుంది. ఈ పద్ధతి ఉపయోగించి ఐస్ ను నిలువ వుంచేవారు. ఢిల్లీలోని మొగల్ చక్రవర్తులు మంచును హిందూ కుష్ పర్వతాల నుండి ఢిల్లీకి తీసుకురావడానికి గుర్రపు రౌతులు పనిచేసేవారు.

క్రీ.శ. 1832లో ఆఫ్రికన్- అమెరికన్ ఆగస్టన్ జాక్సన్ అనే చాక్లెట్ తయారీదారు రకరకాల రుచులతో ఇస్ క్రీం ను తయారుచేసే టెక్నాలజీని కనిపెట్టాడు. క్రీ.శ. 1843లో నాన్సీ జాక్సన్ అనే ఆయన ఇస్ క్రీం తయారీకి మొదట మేధోపరమైన హక్కును పొందాడు. 1904 నుండి కోన్ ఇస్ క్రీం ప్రచారం పొందింది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇస్ క్రీం అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంది. అన్ని దేశాలలో ఇస్ క్రీం వాడకం పెరిగింది. దీనికి కారణం తక్కువ ఖర్చుతో చల్లబరిచే సాధనం (రెఫ్రిజిరేటర్) కనుగొనబడటమే. అంతవరకు ఇస్ క్రీం అంటే గట్టిగా కొరికి తినటమే. కానీ 20వ శతాబ్దంలో అతి పెద్ద మలుపు ఏమిటంటే గాలి కలిపిన మెత్తటి ఇస్ క్రీం తయారీ. దీని ధర కూడా చాలా తక్కువ. ఇస్ క్రీం తక్షణం అమ్మే యంత్రాలు అందుబాటులోనికి వచ్చాయి. ఇస్ క్రీం అడగగానే ఇస్ క్రీం మిషన్ మీట నొక్కే బిస్కట్ కోనులో ఇస్ క్రీం ను పట్టి ఇవ్వడం ప్రారంభమైంది. ఇస్ క్రీం తయారీలో సాంకేతిక పెరగడం వల్ల ఇస్ క్రీం స్థిరంగా వుండటానికి స్టెబిలైజింగ్ ఏజంటు గ్లూటెన్లు వాడటం ప్రారంభమైంది. కానీ ఈ గ్లూటెన్ చాలామందిలో అలర్జీకి కారణం అయింది. అందువల్ల ప్రస్తుతం గ్లూటెన్ లేని ఇస్ క్రీం తయారీ జరుగుతోంది.

ఇస్ క్రీం తయారీ

ఆధునిక రిఫ్రిజిరేషన్ కనుగొనక ముందు ఇస్ క్రీం తయారీ చాలా శ్రమతో కూడుకున్న కార్యక్రమం దీనికై శీతాకాలంలో గడ్డకట్టిన చెరువులు, సరస్సుల నుండి ఐస్ ముక్కలను కత్తిరించి నేలమాళిగల ఇంకా చెక్క పెట్టెలలో, ఇటుmay03.jpgక ఐస్ గృహాలలో తవుడు కప్పి నిల్వ వుంచి వాడేవారు. ఐస్ ఉప్పు కలిపిన పెద్ద డబ్బాలలో పెద్దపాత్ర వుంచి అందులో ఐస్, పాలు, చక్కెర కలిపి పిడితో పాత్రను తిప్పుతూ చేతితో ఇస్ క్రీం తయారుచేసేవారు. ఈ పద్ధతిని పాట్-ఫ్రీజర్' పద్ధతి అని అంటారు. ఈ పద్ధతిలో ఉప్పు, మంచు మిశ్రమం వల్ల ఉష్ణోగ్రత బాగా తగ్గి గుప్తోష్ణం వల్ల నీటి ద్రవీభవన ఉష్ణోగ్రత కంటే ఉష్ణోగ్రత బాగా తగ్గి నీరు గడ్డకట్టి మంచుగా తయారవుతుంది. పాత్రను తిప్పడం వల్ల ఐస్ ముక్కలు ముక్కలుగా విడిపోయి మెత్తటి ఇస్ క్రీం తయారవుతుంది.

క్రీ.శ. 1870 తరువాత రిఫ్రిజిరేషన్ కనుగొన్న తరువాత కృత్రిమమైన ఐస్ తయారీ ప్రారంభమై, తయారీ సులభమైంది. ఆధునిక ఐస్ క్రీం తయారీలో చల్లబరిచేందుకు ద్రవీభవించిన నైట్రోజన్ వాడుతున్నారు. సాంప్రదాయ రిఫ్రిజిరేషన్ కంటే నైట్రోజన్ వాడకం వల్ల చల్లబరచడం చాలా ఖర్చు తక్కువ, లాభదాయకం. నైట్రోజన్ వల్ల అతి త్వరగా నీరు ఐస్ గా మారడం వల్ల ఐస్ చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడుతుంది. ఇస్ క్రీం అధికశాతం క్రీం కలిగిన పదార్థం. దీని వల్ల లాభాలు నష్టాలు రెండూ వున్నాయి.

అరకప్పు ఇస్ క్రీం లో 15 గ్రా. కార్బోహైడ్రేట్స్, 7 గ్రా. క్రొవ్వు, 2 గ్రా. ప్రొటీన్లతో అధిక సాంద్రత గల శక్తి ఉంటుంది. ఇందులో 137 కిలోకాలరీల శక్తి వుంటుంది. అతి తక్కువ కాలంలో అధిక బరువు పెరగాలంటే ఇస్ క్రీంలు తింటే సరిపోతుంది. ఇస్ క్రీంలో అధికంగా కాల్షియం, ఫాస్పరస్, మినరల్స్ మరియు విటమిన్లు, దియామిన్, రైబోఫ్లోవిన్, నియోసిన్, ఫోలేట్, విటమిన్ బి-6, బి-12లు వుంటాయి. రక్తం గడ్డకట్టేందు ఉపయోగపడే కె విటమిన్ కూడా కొద్దిగా ఉంటాయి.

ఇస్ క్రీం అత్యధిక పాలు, క్రొవ్వు శాతం గల పదార్థం. ఇందులో 10 శాతం క్రొవ్వు, 16% క్రీం వుంటుంది. పాల క్రొవ్వులో అధిక కొలెస్టెరాల్, టెట్ ఫ్యాట్స్ కు నిలయం. రక్తంలో కొలెస్టెరాల్ ఎక్కువ అయితే అది పొలుసులుగా, పలకలుగా తయారయి రక్తనాళాలలో రక్తప్రసరణకు అడ్డుపడి గుండెజబ్బులకు, గుండెపోటుకు దారి తీస్తుంది. అధికశాతం చక్కెర కలిగిన ఇస్ క్రీం వల్ల ఊబకాయం, పళ్ళలో రంధ్రాలు, రక్తంలో వేరొక క్రొవ్వు అయిన ట్రైగ్లిసరైడ్స్ పెంపుకు కారణం అవుతుంది. కాబట్టి ఇస్ క్రీం తగిన మోతాదులో మాత్రమే తినాలి.

ఇస్ క్రీం డైరీ తయారీ పదార్థం. అందులో లాక్టోస్ వుంటుంది. ఈ లాక్టోస్ తిన్నప్పుడు జీర్ణం అవడానికి కొన్ని ఎంజైమ్స్ కావాలి. కొందరిలో ఈ ఎంజైమ్స్ లు తక్కువగా వుంటాయి. వారు ఇస్ క్రీం తింటే జీర్ణకోశ సంబంధ సమస్యలు వస్తాయి.

ఇస్ క్రీం అందరూ ఎందుకు తింటారంటే?

  • ఎండ వేడిమి తట్టుకోలేక
  • రుచి కోసం
  • ఇతర డైరీ పదార్థాల కంటే ఎక్కువ రుచులలో లభ్యం
  • డిప్రెషన్ తప్పించుకోవడానికి

కాబట్టి ఇస్ క్రీం తగుమోతాదులో అప్పుడప్పుడు తినడం మంచిదే. కాని ఎక్కువ తింటే నష్టమే సుమా. అతి సర్వత్ర వర్జయేత్' కదా....

ఆధారం: యుగంధర్ బాబు.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు