অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

హోమీ జహంగీర్ బాబా

హోమీ జహంగీర్ బాబా

ఎన్నో రంగాల్లో మనం వెనుకబడి వున్నామని పెద్దలు A5.jpgఅంటున్నా అణు పరిశోధనా రంగంలోనూ అంతరిక్ష పరిశోధనా రంగంలోనూ భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని అందరూ అంగీకరిస్తారు. ప్రగతిని సాధించిందని అందరూ అంగీకరిస్తారు. భారత దేశం అణు రంగంలో విస్తృతమైన స్వయం సమృద్ధిని సాధించింది. అణువిద్యుత్తును తయారు చేసుకోగలుగుతున్నాము. అణ్వాయుధ సంపత్తికూడా మనకు వుంది. అలాంటి సామర్థ్యంగల అతి కొన్నిదేశాలలో భారత దేశం ఒకటిని మీకు తెలుసు. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య అంతర్జాతీయ అణుశక్తి సంస్థ మనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి ఇరాన్ తో వైరుధ్యాలకు తావిచ్చింది. అంతే కాకుండా అమెరుకాతో మనం చేసుకున్న అణు ఒప్పందం వల్ల మంచి కన్నా హాని ఎక్కువని చాలా మంది శాస్త్రజ్ఞులు అంటున్నారు. ఏది ఏమైనా భారత దేశపు అణు సామర్థ్యానికి ప్రధాన కారణం ఎవరో తెలుసా ? ఆయనను అందరూ భారత దేశపు అణుశక్తి పితామహుడు అంటారు. ఆయన మరెవరో కాదు హోమి జహంగీర్ బాబా. ముంబాయిలో వున్న ట్రాంబేలోని ఈయన పేరుమీదనే నిర్మించారు. ముంబయిలోని అత గొప్ప విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ అయిన ని ప్రారంభించింది. కూడా ఈయనే. డైరాన్ వంటి నోబెల్ బహుమతి గ్రహీతల దగ్గర పరిశోధనలు చేసిన బాబా విదేశాల మోజులో పడకుండా స్వాతంత్య్రం వచ్చిన వెంటనే తన 38 సంవత్సరాల పరిపక్వ దశలో భారత దేశంలో అణు సామర్థ్యానికి అణువిజ్ఞాన పరిశోధనలకు కృషి చేశాడు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహూ ప్రోత్సహంతో ఈయన భారత దేశపు అణుశక్తి స్వయం సమృద్ధికి బీజాలు వేశాడు. అటువంటి మహనీయుని 97 వ జయంతి ఈ అక్టోబర్ 30 న జరుపుకుంటున్న శుభ సందర్బంగా ఆయన గురించి మనం స్మరించుకోవడం స్ఫూర్తి దాయకం.

A6.jpgహోమీ జహంగీర్ బాబా. 1909 సంవత్సరం అక్టోబర్ 30 వ తేదీన అప్పటు బొంబాయిలో ఒక ధనిక ఉద్యోగస్తుల కుటుంబములో జన్మించారు. ఆయన తండ్రి జహంగీర్ బాబా ఆక్స్ ఫర్ట్ లో చదివిన గొప్ప న్యాయవాది. తల్లి మైసూర్ సంస్థానంలోని విద్యావిభాగపు మంత్రిగారి కుమార్తె. మెహెరాన్

హోమీ బాబా చిన్నపుడు సరిగ్గా నిద్రపోయేవాడు కాదు. తల్లిదండ్రులు ఎందరో వైద్యుల్ని సంప్రదించారు. ఆ అబ్బాయి సంప్రదించారు. ఆ అబ్బాయి ఆరోగ్యం బాగానే వుందని అయితే ఎప్పుడూ ప్రశ్నలు, ఆలోచనలు, ప్రకృతిలోని వింతల పట్ల ఉత్సుకత ఎక్కువ కావడం వల్ల అతనికి నిద్ర సరిగ్గా పట్టడం లేదని వైద్యులందరూ సెలవిచ్చారు.

హామీ బాబాలోని విజ్ఞాన దాహం తెలుసుకున్న ఆయన తల్లిదండ్రులు అతనికి ఒక మంచి గ్రంథాలయాన్ని ఇంట్లోనే ఏర్పాటు చేశారు. అప్పటికే కఠినమైన సిద్ధాంతంగా పేర్కొన్న ఆల్బర్ట్ ఐన్ స్టీన్ గారి సాపేక్షతా సిద్ధాంతం బాబా తన 15వ ఏటనే అర్థం చేసుకున్నారు. పుస్తకాలే తన మిత్రులుగా చెప్పుకునే హోమీ బాబాకు ప్రకృతి అన్నా సాహిత్యం అన్నా, సంగీతమన్నా, చిత్రలేఖనమన్నా, చాలా ఇష్టం పాఠశాల చదువు అయ్యాక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. అయితే ఆయనకు భౌతిక శాస్త్రమన్నా, కేంద్రక భౌతిక శాస్త్రం అన్నా ప్రాణం. అక్కడే భౌతిక శాస్త్రంలో సైద్ధాంతిక పరిశోధనలు చేస్తున్న పాల్ డైరాక్ దగ్గర పరిశోధనలకు ఉపక్రమించారు. డాక్టరేట్ పట్టా పొందాక రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కావెండివ్ పరిశోధనా సంస్థలో తన ఉద్యోగాన్ని వదిలేసి భారత దేశంలో స్థిర పడ్డారు. 1930వ సంవత్సరంలో సర్ సి.వి రామన్ నేతృత్వంలో బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో (IISc) కాస్మిక్ కిరణాల పరిశోధనా శాఖను నిర్మించారు. రూథర్ ఫర్డ్, నీల్స్ బోర్, హీట్లర్, (నియంత హిట్లర్ కాదు సుమా) వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్రలతో ఆయన కలిసి పనిచేశాడు. హీట్లర్ తో హోమీ బాబా చేసిన పరిశోధనల వల్ల కాస్మిక్ కిరణాలలో ఎలక్ట్రాన్ ల జల్లు వుందనడానికి సైద్ధాంతిక భూమిక ఏర్పడింది. నేడది. బాబా – హీట్లర్ కాస్మిక్ సిద్ధాంతంగా పేరుపొందింది. ఇది ప్రాథమిక కణ భౌతిక శాస్త్రం లో ఉత్కృష్టమైన సిద్ధాంతం. మీసాన్ లకు పేరుపెట్టింది. హోమీ బాబానే. అభివృద్ధి చెందిన అమెరికా, కెనడా, గ్రిటన్, జర్మనీ ఫ్రాన్స్ వంటి దేశాలు ఈయనను తన దేశానికి ఆహ్వానించాయి. కోట్లాది డాలర్ల వేతనాలను ఎర చూపాయి. కాని భారత దేశ స్వాతంత్య్రానంతరం తన మాతృదేశపు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధే ఆశయంగా పెట్టుకున్న హోమీ జహంగార్ బాబా భారత దేశంలోనే జీవితాంతం స్థిరపడ్డాడు. 1940 సంవత్సరంలో పొందిన అతి పిన్న భౌతిక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాడు. భారత దేశం అగ్రస్తాయికి రావాలంటే విజ్ఞానశాస్త్రం ద్వారానే సాధ్యమని ఆయన అన్నాడు. మృదు స్వభావానికి తోడు మానవతా దృక్ఫథం వున్న ప్రజా శాస్త్రవేత్త హోమీ బాబా. మరణాన్ని మన శాసించలేకున్నా జీవితాన్ని ఎలా మలచుకోవాలో మన చేతులోనే వుందని దాన్ని ఎంత గొప్పగా వీలైతే అంత గొప్పగా చిరస్మరణీగా మలచుకోవాలని ఆయన అనేవాడు. భారత దేశాన్ని అణుశక్తి రంగంలో శక్తి వంతం చేయాలంటే పటిష్టమైన పరిశోధనలు కావాలని TIFR ను ఆవిష్కరించాడు. సత్యాన్వేషణకు స్వావలంబనకు, సమాజ, వికాసానికి, ఉపయోగపడని శాస్త్రం వృథా అని ఆయన అనేవాడు.

భారత దేశ రక్షణావసరాలకు, శక్తి సమృద్ధికి శాంతి సాధనకు అణు పరిశోధనలు అత్యంత కీలకమైనవని ఆయన గుర్తించారు. ట్రాంబేలో అణు పరిశోధనా సంస్థ రూపకల్పన చేస్తున్న క్రమంలో విమాన ప్రమాదంలో 1966 జనవరి 24 న ఆయన ప్రాణాలు కోల్పోయాడు. భారత దేశంలో అణుశక్తి స్వయంసమృద్ధి, స్వావలంబన గిట్టని వారే ఆయన విమాన ప్రమాదానికి పన్నాగం, పన్నారని పలు సంస్థలు, మేధావులు, అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ, బాబా విమాన ప్రమాదం ఒక మిస్టరీ గానే మిగిలిపోయింది. భారత దేశపు అణుపరిశోధన ఓ కీలక దశలో వున్నప్పుడు బాబా చాలా చురుకైన వయస్సులో వున్నప్పుడు పెళ్ళి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా విజ్ఞాన శాస్త్రంతోనే జీవితాన్ని ముడివేసుకున్నాడని తెలుసుకున్నప్పుడు ప్రతి దేశభక్తుని కళ్ళు చెమర్చకమావవు. ఈ అక్టోబర్ 30 న జరుపుకొనే ఆయన జయంతి మనకి స్ఫూర్తి దాయకం కావాలి.

రచయిత:- పొ.,  ఎ.రామ చంద్రయ్య,.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate