పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అభ్యుదయవాది గురజాడ

మన తెలుగు సాహిత్యానికి వెలుగు చూపిన గురజాడ అప్పారావు .

దేశమును ప్రేమించుమన్నా

మంచియన్నది పెంచుమన్నా

వొట్టి మాటలు కట్టి పెట్టోయ్

గట్టి మేల్ తలపెట్టవోయి.

253.jpgఈ దేశభక్తి గేయం మీకందరకూ తెలుసు. దీనిని రాసిన మహానుభావుడు గురజాడ అప్పారావనీ తెలుసు. ఆ మహనీయుడు పుట్టి 145 సంవత్సరాలైంది. ఆయన పుట్టిన రోజున ఆయనను గూర్చి తెలుసుకోవాలి కదా... ఆయన గొప్ప సంఘసంస్కరణవాది. వ్యావహారిక భాషోద్యమానికి పాటుపడినవాడు.

మన తెలుగు సాహిత్యానికి వెలుగు చూపిన గురజాడ అప్పారావు విశాఖపట్నం జిల్లా యలమంచిలి తాలూకా రాయవరంగ్రామములో 21-9- 1862 తాతగారింట జన్మించాడు. ఈయన తండ్రి రామదాసు. తల్లి కౌసల్యమ్మ.

గురజాడ అప్పారావు ప్రాధమిక విద్యను చీపురుపల్లిలోనూ, ఉన్నత విద్య విజయనగరంలోనూ చదివి బి.ఏ. పాసయ్యాడు. ఆయన ప్రతిభను గుర్తించి ఆయన చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర శాస్త్రి ఆయనఇంట్లో ఉంచుకొని చదివించాడు. చదువుకునే రోజుల్లోనే ఎన్నో కవిత్వాలు రాసేవాడు. బి.ఏ. చదివాక విజయనగర కళాశాలలో 1891 లో అధ్యాపకుడుగా చేరాడు. అక్కడ ఆయనకు విజయనగర రాజు ఆనందగజపతితో స్నేహం ఏర్పడింది. ఈయన విద్యకు, విద్యార్థులకు వన్నె తేవాలని కలలు కన్నాడు. అందుకే ఆయనకు ఎందరో ప్రియతమ శిష్యులయ్యారు.

19వ శతాబ్ధము రెండో భాగంలో సంఘసంస్కరణ ఉద్యమము ప్రారంభమైంది. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు. కందుకూరి వీరేశలింగం దేశంలో అవతరించారు. ఆ కోవలోనే సాంఘీక దురాచారాలను తన కవిత్వము ద్వారా బయట పెట్టిన మహనీయుడు గురజాడ. మూఢనమ్మకాలను, మూఢాచారాలను, బాల్యవివాహాలను, అంటరానితనాన్ని కులవ్యవస్థలను వ్యతిరేకించాడు. అందుకే ఆయన కన్యాశుల్కము, ముత్యాలసరాలు, దిద్దుబాటు, కొండుభట్టీయము, మొదలగు గ్రంధాలను రాశాడు. పుత్తడిబొమ్మ గేయాలు, కన్యక గేయాలు రాశాడు. జాతీయోద్యమం కోసం దేశభక్తి గేయం రాశాడు.

ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అంటాడు. సమాజానికి పట్టిన వేరుపురుగులను నాశనం చేస్తే

దేశమనియెడు దొడ్డవృక్షం

ప్రేమలను పూవెత్తునంటాడు గురజాడ.

1910 అందరిలో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తాడు, కులవ్యవస్థధికరిస్తాడు.

మతములన్నియు వెలుగునంటాడు.

మంచిచెడ్డలు మనుజులందున

యెంచిచూడగ రెండేకులములు

మంచియన్నది మాతయైతే

ఆమాలనేనవుతానంటాడు - ఈయన

1910 లో తోకచుక్క కనిపించింది. ఏదో మహాప్రళయం వస్తుందని ప్రజలు భయపడ్డారు.

కవులకల్పన కలిమివెన్నో

వన్నెచిన్నెలు గాంచువస్తువు

లందు వెర్రి పురాణాగాధలు

నమ్మజెల్లునె పండితుల్ అంటూ ఇవి

పుక్కింట పురాణకథలని ప్రజలలో మూఢనమ్మకాలు పోగొట్టుటకు ప్రయత్నించాడు.

ఆ రోజులలో 5 సం||లలోపు ఆడపిల్లలకి కన్యాశుల్కము ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకొనేవారు. కడుపులోవున్నది ఒకవేళ ఆడబిడ్డ అయితే ముందుగా శుల్కము ఇచ్చేవారు. ఇది సాంఘికదురాచారమని కన్యాశుల్కమును రచించాడు.

ఇంతేకాదు పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అంటూ బాల్యవివాహాలపై ధ్వజమెత్తాడు.

కాసుకు లోనై తల్లీద్రండ్రీ

నెవరూ న్యాయము వీడి

పుత్తడి బొమ్మ పూర్ణమ్మను

ముదుసలి మెగుడికి ముడివేస్రి.

 

డబ్బుకాశపడి తల్లీదండ్రులు పూర్ణమ్మను ముసలివానికిచ్చి పెళ్లి చేస్తే పూర్ణమ్మ అవమానంతో చనిపోతుంది. ఈ పాటను ప్రజలో ప్రచారం చేయించి బ్యాలవివాహవ్యవస్థను నిరసించాడు.

రాజు మధాండుడై వైశ్య కన్యకను

పట్టబోతే పట్టపగలే నట్టి వీధిని,

పట్టబోరే జార చోరులు

పట్టదలచతివింక నీవొక పట్టమేలే రాజువట

చేతనైతే పట్టమంటూ

రాజును సవాలు చేసి మంటలో దుమికింది. అచ్చటనున్న వారిని మేల్కొలిపింది. ఇలాంటి సామాజిక దురాచారాలపై ప్రజల్ని మేల్కొలుపుతూ ఎన్నో కవిత్వాలు రాశారాయన.

గురజాడ అనారోగ్యముతో 1915 నవంబరు 30 వ తేదీన మరణించాడు. ఇంత గొప్పవాడు కనుకే అభ్యుదయానికి అడుగుజాడ గురజాడ అన్నాడు. మహాకవి శ్రీ.శ్రీ. గురజాడ జయంతి రోజైన సెప్టెంబర్ 21న మన పాఠశాలలో గురజాడ జయంతి జరుపుకుందాం. ఆ మహానీయుడికి నివాళులర్పిద్దాం. డబ్బుకాశపడి తల్లీదండ్రులు పూర్ణమ్మను ముసలివానికిచ్చి పెళ్లి చేస్తే పూర్ణమ్మ అవమానంతో చనిపోతుంది. ఈ పాటను ప్రజలో ప్రచారం చేయించి బ్యాలవివాహవ్యవస్థను నిరసించాడు.

రచయిత: ఎం. సూర్యప్రకాశ్, వరిగొడ

2.98148148148
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు