অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆధునిక ఎంపిక

ఆధునిక ఎంపిక

సందీప్ ఇంటర్ చదివాడు. కుటుంబం పరిస్థితుల వలన బట్టల షాపులో గుమస్తాగా చేరాడు. చదువుపై ఉన్న శ్రద్ధతో, ప్రైవేటుగా డిగ్రీ చదువుతూ, షాపులో ఒక గంట పర్మిషన్ తీసుకుని రోజు కంప్యూటర్ వర్క్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడు. ఆలా మూడు సంవత్సరాలు డిగ్రీతో పాటు కంప్యూటర్ టెక్నాలజీ కోర్సును కూడా పూర్తి చేశాడు.

ఓరోజు వాళ్ళమ్మతో , "అమ్మా! నాన్న చిన్నప్పుడే చనిపోయిన, ఇన్నాళ్లు కస్టపడి నాకు చదువు చెప్పించావు. ఈ మూడేళ్ళు బట్టల షాపులో పని చేసిన అనుభవంతో, సొంతంగా బట్టల వ్యాపారం పెడదామనుకుంటున్నా. కాకపోతే పెట్టుబడి కోసం ఆలోచిస్తున్నాను" అన్నాడు.

కొడుకుపై ఉన్న నమ్మకంతో,"అలాగే నాన్నా! పెట్టుబడి గురించి ఆలోచించకు. నా దగ్గర ఉన్న ఈ నెక్లస్ ను అమ్మేసి పెట్టుబడికి వాడుకో', అంటూ ఇచ్చేసింది. దానిని అమ్మివేశాడు. వచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉంచుకున్నాడు.

బజారులో షాపుకు తగిన స్థలం కోసం వెతికాడు. బజారుకు ఓ చివరస తక్కువ అద్దెకు చిన్న గదిని మాట్లాడుకున్నారు. అడ్వాన్సు ఇచ్చాడు షాపునకు కావలసిన బట్టలు ఫర్నిచర్ తెచ్చుకున్నాడు. ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళ అమ్మా పేరున "రామలక్ష్మి శిల్క్ ప్యాలెస్" ను ప్రారంభించాడు.

కష్టం విలువ తెలిసిన వాడు కనుక నిజాయతీగా, న్యాయంగా కొద్దిపాటి లాభాలతో ముందుగా నాణ్యత గల బట్టలను అమ్మసాగాడు. వచ్చిన డబ్బును ముందుగా కొంత పొదుపు చేసి, మిగిలింది ఖర్చులకు వాడేవాడు.

ప్రారంభంలో కస్టమర్లు అంత ఎక్కువగా రాలేదు ఓ ఆర్నెల్లు గడిచింది. షాపులో సరుకులకు నాణ్యతలో పేరు వచ్చింది. అందువల్ల ఇవ్వకున్నా వ్యాపారం పెరగసాగింది. కష్టముఖి అలవాటు పడ్డారు. కొంతవరకు లాభాలు కూడా రాసాగాయి.

ఓ రెండేళ్ళు గడిచింది. షాపులో సరుకులు పెరిగింది. ఇప్పుడు ఆ గాడి సరిపోవడం లేదు. తన చేతి నిండా పని ఎక్కువైంది. ఇంకో మనిషి ఉండాలనిపిస్తోంది. కనీసం, వచ్చిన కస్టమర్లు కూర్చోవడానికి కూడా స్థలం లేక, పక్క షోప్లోకి వెళుతున్నారు. ఇక లాభం లేదనుకుని అద్దెలు ఎక్కువైనా బజారు సెంటరులో పెద్ద గదిని తీసుకొని గుమస్తాను పెట్టుకోవడానికి నిశ్యయించుకున్నాడు.

ముందు సెంటర్లో పెద్ద గాడి వెతికాడు గుమస్తా కావాలి. కానీ, తన వ్యాపారానికి నాణ్యతపై నమ్మకమే పెట్టుబడి. కనుక అవారినంటే వారిని పెట్టుకోవడం ఇష్టంలేదు. నమ్మకంతో పాటు, వచ్చిన కస్టమర్లకు కోరిన బట్టలు చూపించుతూ కొనేలా చేయగలిగాలి. పైగా వచ్చిన కస్టమర్లు బట్టలను మడతలు విప్పి ఎలాగంటే ఆలా పడేసి వెళుతుంటారు. వాటిని సర్దుకోవాలంటే చాల సహనం కావాలి.

ఇలాంటి లక్షణాలున్న గుమస్తా కావాలి. పైగా ఏ షాపులో చుసిన నాలుగైదు వేల జీతం ఇస్తున్నారు. కోట్లల్లో గుమాస్తాలంటే పనిలేని వారో, తనలాంటి ఆర్ధిక పరిస్థితి సరిగాలేని వారూ  వస్తుంటారు. వచ్చిన, అందరు శ్రద్ధతో పనిచేస్తారని లేదు. పోనీ ఎక్కువ జీతం ఇద్దామంటే, తాను భరించగలన? ఒకవేళ ఇచ్చిన వారు అందుకు తగినట్లుగా పనిచేయాలి గదా?!అలంటి వ్యక్తిని ఎంపిక చేసుకుని మరి తీసుకుంటే సరిపోతుందని భావించాడు. ఇలాంటి వ్యక్తి కావాలని ఎవరినన్నా అడిగిన నవ్వుతారు. ఎలాగా?అని, తన కంప్యూటర్ బుఱ్ఱకు పదును పెట్టసాగాడు. బ్రహ్మాండమైన ఐడియా తట్టింది. దానిని అమలుపరచాడు.

ముందుగా, అన్ని దినపత్రికలలో "గుమస్తా కావలెను", రామలక్ష్మి శిల్క్స్ నందు పని చేయుటకు 10 వ తరగతి పాస్/ఫెయిల్, ఆకర్షణీయమైన జీతము నెలకు 10,000 /-, ఆసక్తి గల వారు తేదీ 12-03-2017 ఆదివారం ఉదయం 9 గంటలకు ఇంటి నెంబర్. 253 పటేల్ నగర్. నందు జరుగు ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. అప్లికేషన్ కు ఆఖరు తేదీ 08-03-2017 రద్దీ లేని ప్రాంతంలో ఒక పొడవైన గది అద్దెకు  తీసుకుని, ఆ చిరునామా పేరున ఒక ప్రకటన ఇచ్చాడు.

తాను అవ్వరు ఇవ్వనంత జీతాన్ని ప్రకటించాడు. కనుక అప్లికేషన్స్ వస్తాయి అని ఊహించాడు. అనుకున్నట్లే ఓ 30 మంది పంపించారు. పంపిన వారంతా వస్తారని భావించాడు. అందుకు తగినట్లు, తను కోరుకున్న వారిని ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లను ముందురేజే ప్రారంభించాడు.

ఆ గదిలో, ముందు ఒక పెద్ద హాలు, లోపల ఇంటర్వ్యూ చేయడానికి, చిన్న గాడి వచ్చేటట్లు మధ్యలో ఒక పెద్ద కార్డుబోర్డు ను బిగింపచేశాడు. చిన్న గాడి ఉన్న లేనట్లే డెకరేషన్ చేయించాడు. హాలులో ఒక పెద్ద టేబుల్ పై రకరకాల పుస్తకాలు, మేగజైనులు, ఆ రోజుటి దినపత్రికలు పెట్టాడు. ఒక 20 కుర్చీలను మాత్రమే కావాలని తక్కువగా వేయించాడు. ఒక ప్రక్క మినరల్ వాటర్, గ్లాసులు పెట్టించాడు. గదికి ముందు తప్పనిసరిగా అడుగు పెట్టి వచ్చేవిధంగా కావాలనే చాల బురద మట్టిని సహజంగా ఉండేలా పోయించాడు. ఆ మట్టిని శుభ్రం చేసుకోవడానికి లోపాళ్లకు వచ్చే చోట నీళ్ల ఏర్పాటు చేశాడు. హాలు ప్రవేశ ద్వారం వద్ద తేమ కాళ్లు తుడుచుకొని విధంగా పెద్ద కలిపెట్టను ఏర్పాటు చేయించాడు. బయట "రామలక్ష్మి ప్యాలెస్ " పేరున స్వాగతం ఫ్లెక్సీ కూడా పెట్టించాడు.

గాడి ప్రవేశం వద్ద రోడ్డు నుండి, గదిలోపల జరిగే ప్రక్రియలన్నీ కనపడాలి. వాటికోసం మంచి క్వాలిటీ ఉన్న ఆరు సిసి  కెమెరాలను ఏర్పాటు చేయించాడు. ఎవరికి అవి కనబడకూడదు. విద్యుత్ అంతరాయము జరిగిన పనిచేయాలి. తగిన కెపాసిటీ వున్న ఇంవర్టార్లను కూడా పెట్టించాడు. లోపల స్క్రీన్స్ ను ఏర్పాటు చేయించాడు. అక్కడి మాటలు వినపడేలా స్పెయికర్లు. గదికి సౌండ్ ప్రూఫ్. ఇలా  అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించాక, పరిశీలించుకుని వెళ్లాడు.

ఆదివారం ఉదయం 8 .00  ని .కే వచ్చి కూర్చున్నాడు. ఓ 10ని. లు చేసిన ఏర్పాట్లను ముందు జాగ్రత్తగా పున:పరిశీలించుకున్నాడు. 8 30ని.కే  లోపల కూర్చున్నాడు, కెమెరాలను గమనించుకుంటూ. గం 8.45ని. నుండి అభ్యర్థుల రక ప్రారంభమయింది. ఒక్కొక్కరుగా వస్తున్నారు.

కానీ, వచ్చిన వాళ్ళను పలకరించేవాళ్ళు అక్కడ ఎవరు లేరు. 9.30 ని అయింది. వాళ్ళల్లో కొందరికి ప్రశ్నలు మొదలయ్యాయి . ఇంటర్వ్యూ అన్నిటికండి? చెప్పిన టైముకు గంట దాటింది. ఆ బయట బురదేంటో? ఓహూ, ఇండియన్ పంక్చువాలిటీ గదా! ఇలా. మరి కొందరు నిశ్శబదంగా పుస్తకాలు చదువుకోసాగారు. కుర్చీలు లేక కొందరు అటు, ఇటు తిరగసాగారు. 10 గంటలు దాటింది. కొ౦న్దరి ముఖాల్లో విసుగు మొదలైంది. ఒకరిద్దరు ఇంకా వస్తుంటే, వచ్చిన కొందరు 'ఛీ,ఛీ "అనుకుంటూ, చిరాగ్గా కనిపిస్తున్నారు. ఒక్క ఫ్యాను గూడా లేదు? అసలెవరయ్య ఇంటర్వ్యూ చేసేది? ఇంకొకరి ప్రశ్న. అసలు ఇంటర్వ్యూ ఉందా?లేదా ? మరొకరి ప్రశ్న.

ఇవన్నీ లోపల ఏసీలో కూర్చుని సందీప్ గమనిస్తున్నాడు. అక్కడి వారి మాటలు వినపడుతున్నాయి. ఏమి జరుగుతున్న తన ప్లాను ప్రకారం అప్పుడే బయటకు రాదలచుకోలేదు.

సమయం 10-30 ని దాటింది ఓ 10 మందికి పైగానే  వెళ్లిపోయారు. కానీ, కొందరికి జీతం గుర్తుకు వచ్చి ఇంకో అరగంట చూద్దామని అనుకున్నారు. 11-30 ని దాటింది. సగం మంది విసుకుంటూ వెళ్లిపోయారు. అంత గమనిస్తూ, నవ్వుకుంటూ ఉన్నాడు.

చివరికి తాను కోరుకున్న విధంగా ఇద్దరు వ్యక్తులు కనిపించరు సందీప్ కు. ఆ ఇద్దరినీ తీసుకోవాలని అనుకున్నాడు. లోపల నుండి హాలులోనికి వచ్చాడు. అప్పటి వరకు అక్కడ ఆ ఒక్క గాడి మాత్రమే వుందనుకున్న వాళ్ళు, సందీప్ రాకను చూసి షాకయ్యారు. ఉన్న 15మంది ఆశ్చర్యంతో లేచి నిలుచున్నారు.

ఇంతలో సందీప్ ఆ ఇద్దరి వ్యక్తులను చూపిస్తూ "యు అండ్ యు అర్ సెలెక్టెడ్ " అని అన్నాడు. మాటలు కూడా వాళ్లకు షాకిచ్చాయి. ఒక్క క్షణంలో తేరుకున్నారు. అంత జీతం వస్తున్నా ఉద్యోగం పోతుండడంతో కొందరికి ఆవేశం, కోపం పెరిగి పోయాయి. భాద తట్టుకోలేకపోతూ,

"ఏంటి సార్ ! సెలెక్టెడ్ ? ఇక్కడ ఇంతమందిమున్నాము. ఇంటర్వ్యూ కాలేదు, ఏమి లేదు సెలెక్షన్ ఎలా చేశారు?" ఒకరి ఆక్రోశం.

"వాళ్ళేమన్నా మీ చుట్టాల ?" మరొకరి ఉక్రోషం "ఉదయం నుంచి ఇక్కడ ఇంతసేపు వెయిటింగ్ చేస్తూ ఉంటే, ఏం పిచ్చి వాళ్ళలాగా కనపడుతున్నామా ?ఇంకొకరి ఆవేదన.

ఇలా రకరకాల ప్రశ్నలతో ఒక్క 5 నిముషాలపైనే ఆ హాలులో కేకలతో దద్దరిల్లింది.వాళ్ళందరి ప్రశ్నలను పటాపంచలు చేస్తూ, సందీప్ ఏమి మాట్లాడకుండా తన చూపుడు వేలును పై భాగాన కనబడకుండా బిగించియున్న సీసీ కెమెరాల వైపు చూపించాడు. ఆప్రయత్నంగా అందరి చూపులు, అతని వేలును అనుసరించాయి . ముడుచుకున్న వారి నుదురులా విచ్చుకోసాగాయి.

"ఇక్కడికి మీరడుగు పెట్టినప్పటినుండి నేను లోపల గమనిస్తున్నాను. వీరిద్దరూ ఉదయాన్నే ఇంటర్వ్యూ సమయానికి 10 ని  ముందే చేరుకున్నారు. హాలులోపలికి ప్రవేశించేటప్పుడు కళ్ళకు అయినా మట్టిని శుభ్రాంగా జాగ్రత్తగా కడుక్కున్నారు. చెప్పులు బయట వదిలారు. కాళ్లకు అయినా తేమను పట్టకు చక్కగా, నిదానంగా తుడుచుకున్నారు. ఇక్కడ వున్నా పుస్తకాలూ పేపర్లు తిరగేశారు. కానీ, తర్వాత చక్కగా అసలా పేపర్లు ఎవరు తీయలేదేమో/అన్నట్లు ఉన్నవి ఉన్నట్లే పెట్టారు. ఎవరు చదివి లేచినప్పుడు వీరు కూర్చున్న కుర్చీలను ఇతరులు ఇతరులు ఆక్రమించారు.అయినా వారినేమనలేదు. చిరునవ్వుతో వారినే కుర్చోనిచ్చారు. అప్పటినుండి ఓపికగా ఇంతకు ముందు వరకు నిలబడే ఉన్నారు. వేరేవారు వెళ్ళాక కూర్చున్నారు. కాబట్టి, మంచి క్రమశిక్షణతో పాటు నేను అనుకున్న అన్ని లక్షణాలు వీరిలో వున్నాయి"వివరణ ఇచ్చాడు సందీప్.

సందీప్ చెబుతున్నంతసేపూ, అందరు భ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మాటలు ఆపగానే చేరుకున్నారు. విషయం యర్హమవడంతో ఇంకా ఆవరినోట ఒక్క మాట కూడా రాలేదు. తాము చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.

సెలెక్టయిన రమేష్, మహేష్ లు ఇద్దరు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అప్రయత్నాంగా రెండు చేతులు జోడించారు. సందీప్ తన ప్లాన్ ఫలించిన ఆనందంతో క్రొత్త బట్టల షాపును ప్రారంభించాడు.

సందీప్ ప్లానూ, నమ్మకం రెండు వమ్ము కాలేదు. మంచి లక్షణాలున్న ఇద్దరు శ్రద్దగా పని చేసుకోవడం ప్రారంభించారు. అనతి కాలంలోనే షాపు పేరు మునుపటికంటే మరు మ్రోగసాగింది. రామలక్ష్మి శిల్క్స్ ప్యాలెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోసాగింది.

మరో రెండేళ్ల కలం తెలియకుండా ముందుకు పరిగెతింది. అంతో నమ్మకంగా కష్టించి పనిచేసే రమేష్, మహేష్ లను పెట్టుబడి లేకుండా తన వ్యాపార భాగస్వాములను చేసుకున్నాడు సందీప్.

ఆధారము: చెకుముకి

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate