పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎందుకని? ఎందుకని?

ఎందుకని? ఎందుకని? పాట.

పల్లవి:

aug18(ఒకటవ గ్రూప్) ఎందుకనీ...? ఎందుకనీ...? ఎందుకనెందుకనేందుకనీ...? (2 సార్లు) (రెండవ గ్రూప్)

ఏమిటదీ...! ఏమిటదీ...! ఏమిటదేమిటదేమిటదీ...! (2 సార్లు) చరణం: 1

చరణం: 1

(ఒకటవ గ్రూప్)

రక్తము ఎరుపూ ఎందుకనీ...? ఆకులు పచ్చన ఎందుకనీ... ? (2సార్లు)

ఎందుకనీ...? ఎందుకనీ...? ఎందుకనెందుకనెందుకనీ...? (2సార్లు)

(రెండవ గ్రూప్)

హిమోగ్లోబిన్ ఉంటుందీ...రక్తము ఎరుపూ అందుకనీ...

క్లోరోఫిల్ ఉంటుందీ.... ఆకులు పచ్చన అందుకనీ...

అందుకనీ...! అందుకనీ...! అందుకనందుకనందుకనీ...! (2సార్లు)

చరణం: 2

(ఒకటవ గ్రూప్)

మిరప కారముండు నెందుకనీ...? వేప చేదుగుండు నెందుకనీ...? (2సార్లు)

ఎందుకనీ...? ఎందుకనీ...?ఎందుకనెందుకనెందుకనీ...? (2సార్లు)

(రెండవ గ్రూప్)

క్యాప్పాయిసిన్ తైలముంటుందీ...మిరప కారమూ అందుకనీ....

నింబినిన్ ద్రవముంటుందీ....వేప చేదుగుండు నందుకనీ...

అందుకనీ...! అందుకనీ...! అందుకనందుకనందుక... (2సార్లు)

చరణం: 3

(ఒకటవ గ్రూప్) వేడిగాలి పైకెళుతుందీ..? చల్లగాలి క్రిందికొస్తుందీ..? (2సార్లు)

ఎందుకనీ...? ఎందుకనీ...? ఎందుకనెందుకనెందుకనీ...' (2సార్లు)

(రెండవ గ్రూప్ )

వేడిగాలి తేలికుంటుంది... పైకి వెళ్ళునూ అందుకనీ....

చల్లగాలి బరువుంటుందీ... క్రిందికి వచ్చును అందుకనీ...

అందుకనీ...! అందుకనీ...! అందుకనందుకనందుకనీ...! (2సార్లు)

చరణం: 4

aug19(ఒకటవ గ్రూప్)

మెరుపులు ముందొచ్చు నెందుకనీ..? ఉరుములు వెనకొచ్చు నెందుకనీ...? (2సార్లు) ఎందుకనీ...? ఎందుకనీ..? ఎందుకనెందుకనెందుకనీ...? (2సార్లు)

(రెండవ గ్రూప్)

కాంతి వేగమెక్కువుంటుందీ... మెరుపులు ముందొచ్చు నందుకనీ...

ధ్వని వేగం తక్కువుంటుందీ... ఉరుములు వెనకొచ్చు నందుకనీ...

అందుకనీ...! అందుకనీ...! అందుకనందుకనందుకనీ...! (2సార్లు)

(వేగంగా అవరోహణా క్రమంలో ఓ 3 సార్లు పాడుకుంటూ ముగించాలి)

(ఒకటవ గ్రూప్)

ఎందుకనీ...? ఎందుకనీ...? ఎందుకనెందుకనెందుకనీ...?

(రెండవ గ్రూప్)

అందుకనీ...! అందుకనీ...! అందుకనందుకనందుకనీ...!

ఆధారం: మద్దిరాల శ్రీనివాసులు

3.11764705882
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు