অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కొరివి దయ్యం

కొరివి దయ్యం

భిక్షు: కొట్టండి సార్! వాడ్ని. విడిచి పెట్టకండి! జనం ప్రాణాలంటే లక్ష్యంలేదు! డబ్బుకోసం ఏమైనా చేస్తాడు! (ఆవేశంతో ఊగిపోజున్నాడు భిక్షు. అతడు ఎవరోకాదు, ఎదురుగా గుంజకు పెడరెక్కలు విరిచి కట్టిన తాంత్రికుడి ప్రియశిష్యుడు.)

తాంత్రికుడు: ఏయ్! భిక్షు! జాగ్రత్త. నాతో పెట్టుకుంటే .....!

భిక్షు: ఆ! పెట్టుకుంటే....? ఎం చేస్తావు? నీ టక్కుటమారి విద్యలు జనలకు చూపించు! నాపైన కాదు!

సర్కిల్ ఇన్స్పెక్టర్: ఏయ్! ఆపండ్రా మీ అరుపులు!

రఘురాం: భిక్షు! వీడు చేసే, మోసాల గురించి సి .ఐ  గారికి చెప్పు.

భిక్షు; సార్! వీడు కొరివి దయ్యాలున్నాయని గ్రామస్థులను నమ్మించడానికి ఆరు ఇండ్లు, రెండు గడ్డివాములు తగులపెట్టడండి!(అందరు వింటున్నారు) తన మాయ మాటలు నమ్మించడానికి రెండు పది ఆవుల పై విషప్రయోగం చేసి వాటిని పొట్టన పెట్టుకొన్నదండి.

సి.ఐ: నువ్వు వాడి శిష్యుడివే కదా?

భిక్షు:ఔనయ్యా! కానీ డబ్బుల్లో వట అడిగానని, నా పైన కూడా విషప్రయోగం చేసి చంపాలని చుసాడండి. నేనా వీడి బుట్టలో పాడేది.

సర్పంచ్: గ్రామంలో కొరివిదయ్యాలు చొరబడ్డాయని, ఎంత బాగా నమ్మించార్రా!

రఘురాం: గ్రామంలో రెండు పాడి ఆవులు నిష్కారణంగా చనిపోతే ఏమి చేయలేక పోయాం సార్!

భిక్షు( తాంత్రికుడివైపు చూపుతూ ) వీడేసార్! సాదాసీదా కూలీలా గ్రామంలోకి వచ్చి, గద్దేస్తున్నా ఆవులకు అరటిపండులా విషపు గుళికలు పెట్టి తినిపించడండి.

వెటర్నరీ డాక్టర్:ఆ విషయం నేను పోస్టుమార్టర్ రిపోర్టులో కూడా రాశాను సార్! కానీ గ్రామంలో ఇరు వర్గాలుగా చీలిపోతుంది...,ప్రశాంతంగా ఉన్న ఊరిలో ముఠా తగాదాలు, కేసులు వద్దంటూ, సర్పంచ్ గారే మీ వద్దకు వచ్చి కేసు withdraw చేసుకొన్నారండి!

తాత:అది జరిగిన రెండు, మూడు రోజులలోనే ఐదారు పూరిండ్లు, గడ్డివాములు తగులపడ్డాయండి!

పూజారి:ఏ దుష్ట శక్త్తో గ్రామాన్ని ఆవహించిందని గుడిలో అభిషేకం చేయించి ఊరంతా సంప్రోక్షణ కూడా చేశామండి!

భిక్షు:పూజారిగారు! మీ సంప్రోక్షణలు ఈ మాయలోడిని ఆపలేమండీ!

సి.ఐ : అంటే మీ గురువే ఇంటికి నిప్పుపెట్టాడా?

భిక్షు: నేరుగా నిప్పు పెట్టలేదండి!

సి.ఐ; మరి ఆలా చేశాడు?

భిక్షు:ఆవులకు విషం పెట్టిన రోజునే, పేడ ముద్దలా మధ్యన తెల్లభాస్వరం ఉంచి పురపాలక చూరులోనూ, గడ్డివాములు క్రింద పెట్టి వెళ్లడండి.

రఘురాం: అంటే పేడలోని తేమ తగ్గి, ఎండిపోగానే తెల్లభాస్వరం మండుకొని ఇండ్లు తగలపడి పోయాయా?

సర్పంచ్: అదెలా సాధ్యం?

రఘురాం:అగ్గి పెట్టాలా తయారీలో ఎర్రబస్వరానికి రూపాంతరము తెల్లభాస్వరం అది గాలిలోని ఆక్సిజన్ తో అంత్యంత క్రియాశీలకంగా వుంది 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద స్వయంగా అంటుకొంటుంది. (తాంత్రికుడు, భిక్షు సైతం తమకు తెలియని తెల్లభాస్వరం గురించి తెల్లముఖాలేసుకొని వింటున్నారు.)ఈ చర్యలో 2500  సెంటీగ్రేడ్ పైగానే ఉష్ణం వెలువడటం వాళ్ళ సాధారణ జ్వాలలకు అంటుకొని కొయ్యదుంగలు సైతం మండిపోతాయి.

గ్రామస్థుడు:అయ్యా! ఆ మాన్తా మండేటప్పుడు మాయింటి చూరు నుండి తెల్లటి దట్టమైన పొంగళ్ళు కూడా వచ్చాయండి.

ముసలావిడ:ఆ పొగ ఘాటుకు ఊపిరి కూడా అందలేదయ్యా!

షబీర్: ఎగిరిపడి మంటలు, దయ్యలాంటి పొగను చూచి కొరివిదయ్యం అని అందరు ఒకే పరుగు తీసాం కదా!

రఘురాం: షబ్బీర్! అది కొరివి దయ్యం కాదు. తెల్లభాస్వరం గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరపడం వాళ్ళ ఫాస్ఫోర్స్ ట్రై ఆక్సీడ్, ఫాస్పరస్ పెంటాక్సీడ్ అనే విషవాయువులు వెలువడతాయి. ఆ పొగను ఫీల్చిన వారికీ శ్వాస కష్టం కావడం, వాంతులు కావడం జరుగుతుంది.

సర్పంచ్: శ్మశానాల వద్ద ఎండిన ఎముకలలోని ఫాస్ఫోర్స్ (భాస్వరం) మండటం వల్ల అవి గాలిలో మండుతూ ఎగురుతాయి. నా చిన్నప్పటి నుండి చాల సార్లు వాటిని చూసాను కూడా...!

గ్రామస్థుడు:అంటే అవి కొరివి దయ్యాలు కదా...?

భిక్షు: (నీళ్ళ బాటిల్ లో ఉంచిన తెల్లభాస్వరం ముక్కను ఎండా బాగా పడే బండమీద వేస్తూ...)చూడవయ్యా!చూడు నీ కొరివిదయ్యం ఎలమండుతుందో! (తెల్ల భాస్వరం భగ్గున మండుతూ, దట్టమైన తెల్లటి పోగలతో అటుఇటు దొర్లసాగింది )

సి.ఐ: ఏయ్! కానిస్టేబుల్ వాడినుండి ఈ రసాయనాన్ని తీసుకో!

గ్రామస్థుడు: (తాంత్రికుడు వైపు చూస్తూ ) దుర్మార్గుడా! చిన్న సైన్స్ అంశాన్ని ఆధారంగా చేసుకొని మా కొంపలు తగల పెడతావా?

సర్పంచ్:తగల పెట్టటమే కాదు! కొరివి దయ్యాలు, శాంతులు అంటూ అన్ని కోళ్ళు కోశాడు. పొట్టేళ్ల రక్తంతో ముగ్గులు పెట్టాడు, ఊరు, వడ నెత్తురన్నం చల్లాడు...!

రఘురాం: రోజుకు 30 వేలరూపాయలు ఫీజుగా కూడా ఇచ్చారుగా.

సి.ఐ:ఇలాంటి 420 గళ్ళ చేత 7 చువ్వలు లెక్కపెట్టించడానికే కదా మేముండేది! కాసనిస్టేబుల్స్! ఈ గురు, శిష్యులను మన జీపు ఎక్కించండి!

రఘురాం:ఈ బురిడీ బాబాలు, తాంత్రికుల ఆటలు ఇకపై సాగవండి!

గ్రామ పంచాయతీ లౌడుస్పీకర్ లో పాట మొదలైంది. "విజ్ఞానంతో వికసించు జగత్తు, పసిపిల్లల చదువే అందుకు విత్తు"!......

పాట సాగిపోతుంది.

ఆధారం: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate