'గాలిని నువ్వు చూడగలవా? అని వూ స్నేహితుడొకడు నన్ను అడిగాడు. 'ఓ నేను చూడగలను' అని చెప్పాను. "ఎలగెలగా అన్నాడు. 'ఈ ఎండాకాలంలో సుడిగాలి వీచినప్పడు దుమ్ము ధూళి గాలితో కలిసి సుడులు తిరుగుతుంది కదా. అప్పడు గాలి మెలికలు తిరగడం నేను చూసాను’ అని చెప్పా 'గాలిని నీవు వినగలవా? అన్నాడు మళ్ళీ ‘ఓ.. గట్టిగా వీస్తున్నప్పడు చెట్టు కొమ్మల గుండా గాలిపోతూ గట్టిగా శబ్దం చేస్తుంది కదా, అది విన్నాను" అని చెప్పా, సరే సరే! గాలి వాసన చూసావా అన్నాడు. "వర్షం పడినపుడు గాలివాసన చూసాను. అని చెప్పా అంతే! నా స్నేహితుడు గమ్చిమ్ అయిపోయాడు.
సరే, గాలిని చూసా, గాలిని విన్నా వాసన, చూసా. బాగానే వుంది. గాలిని గదిలో పెట్టి గొళ్ళెం పెట్టగలమా? (బెలూన్లో గాలి బంధించడం కాకుండా వేరే ఏదైనా), ఓ, బంధించగలం. ఎలాగంటారా?. రండి చేసి చూద్దాం.
కావలసిన పరికరాలు: ఒక బాటిల్, ఫనల్ గరాటు, గ్లాసు, నీరు, l, యంసీల్.
చేయు విధానము: ఖాళీ బాటిల్ తీసుకొని దానిలోనికి ఫనల్ను అమర్చి పటంలో చూపిన విధంగా బాటిల్ అంచువద్ద ఫనల్ చుటూ యంసీల్ను పూసి ఆరబెట్టాలి. దీనివల్ల బాటిల్ లోని గాలి ఫనల్ చుట యంసిల్ ను పూసి ఆరబెట్టాలి. దీనివల్ల బాటిల్ లోని గాలి ఫనల్ చుట్టూ వున్న స్థలం నుండి బయటకు రావడం పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పడు గ్లాసు తీసుకొని నీటిని ఫనల్లో పోయండి. ఫనల్లో నీరు నిండి పోతుంది. కానీ కొంచెం నీరు కూడా బాటిల్ లోనికి ప్రవేశించదు. అంటే బాటిల్లో ఏమి వున్నట్లు,? ఆ! గాలి! కరెక్ట్, ఫనల్లో నీరు, బాటిల్లో గాలి చూశారా. గాలిని బాటిల్ గదిలో బందించి గొళ్ళెం పెట్టామా. అదీ కథ. గొళ్ళెం పెట్టామా.... అదీ కధ.
అసలేం జరిగింది: నీరు బాటిల్లో లోనికి ఎందుకు పోలేదు? దీనికి రెండు కారణాలు వున్నాయి. ఒకటి మనం ఫనల్లో నీరు పోసాము కదా. ఆ దారి గుండా గాలి రాలేదు. ఫనల్ చుటూ యంసీల్ అతికించాము కదా. అందువల్ల గాలి వెలుపలకి రాలేదు. రెండు, అసలు నీరు ఎందుకు లోపలికి పోలేదు? ఫనల్ గొట్టం చివర నీరు తలతన్యత (Surface tension) వల్ల ఒక పొరలాగ పనిచేసి గాలిని బయటకు రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల గాలి బయటకు రాదు. నీరు లోపలికి పోదు.
మరి ఈ గొళ్ళానికి తాళం తీసి గాలిని బయటకు పంపేదెలా? చాలా వీజీ స్రా తీసుకొని దాని ఒక చివర బొటనవేలుతో ముసిపెట్టి రెండవ చివరను ఫనల్ గుండా బాటిల్ లోనికి పంపండి. మెల్లగా బొటనవేలును తొలగించండి. అంటే తాళం తీసేసినట్లు గాలి స్ట్రాగుండా బయటకు వస్తుంది. నీరు బాటిల్ లోనికి ప్రవేశిస్తుంది. అదన్నమాట.
రచయిత: యం.ఎస్.యుగంధర్ బాబు, సెల్: 9394782540
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/4/2022