অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తాయత్తుకు తలఒగ్గని దెయ్యం

తాయత్తుకు తలఒగ్గని దెయ్యం

రమణ పండరిపురం హైస్కూలులో 6వ తరగతి చదువుతున్న పిల్లవాడు. వారిది పండరిపురం పట్టణానికి 8 కిలో.మీ.ల దూరంలో ఉన్న మదారుపల్లె. అక్కడి నుండి రోజు ఆటోలో వెళ్లి వస్తుంటాడు . సాంబయ్య, శాంతమ్మ అమ్మానాన్నలు. కూలీలకు వెళూ జీవనం సాగిస్తుంటారు. వాళ్లిద్దరికీ రమణ ఒక్కడే కొడుకు. దాంతో గారాబంగా పెంచారు. అందుకే చేతనైనంతలో వాడి కోరికలన్నీ తీరుస్తుంటారు. అలా, వాడి ఇష్ట ప్రకారమే వండరిపురంలోని హైస్కూలులో చేరాడన్నమాట.

రాను పోను, ఆటో ఛార్జి రూ.10 ల తో పాటు రోజూ మరో రూ.10 లు అదనంగా ఇచ్చి ఏదైనా కొనుక్కోమనేవాడు సాంబయ్య. అలా పిల్లవాడిని చాలా ఫ్రేమగా చూసుకునేవారు. ఓ రెణెల్లు గడిచింది.

ఇపుడు ఒక్కో రోజు రమణ, “నాన్నా ఈరోజు ఇంకో పది రూపాయలు ఇవ్వవా?” అనేవాడు.

నవ్వుకుంటూ, “దేనికిరా?” అనేవాడు.

“అబ్బ...హు హు హు... ఇవ్వు నాన్నా! కావాలి” అంటూ మారాం చేసేవాడు.

సరే, ఎప్పుడో ఒకసారే కదా! పైగా తన కొడుకు దుబారా చేయడు కూడాను' అనుకుని ఇచ్చేవాడు బయ్య.

ఓ ఆర్నెల్లు గడిచింది. ఈ మధ్య రమణ ఇంట్లో ప్రతి పూట సరిగా అన్నం తినడం లేదని శాంతమ్మ గాంచింది. కానీ, పిల్లవాడు మాత్రం రోజురోజుకూ కాస్త లావవుతున్నాడని మాత్రం అర్ధమయింది. అందుకే, సరేలే ఏదో వాడికి కాబట్టినంత తిన్నీయిలే అనుకునేది.

కానీ, మరలా ఉండబట్టలేక ఓ రోజు రాత్రి, “ఒరే. సంటోడా! ఏమిట్రా! ఈ అన్నం తినడం. సరిగ్గా నాలుగు మెతుకులు కూడా తినడం లేదు ?” అడిగింది.

“నాకాబట్టిన కాడికి తింటున్నా గదా.” అంటూ కాస్త కోపంగా మాట్లాడాడు.

“సర్లెయ్యా! కోప్పడమాకు. అట్టనేలే” అంటూ ఊరుకుంది. పిల్లవాడి మీద ప్రేమతో వాడిని ఏమీ అడగలేదు కానీ, ఏదో పిల్లవాడిలో మార్పులపై కాస్త అనుమానపడింది శాంతమ్మ...

అదే విషయం ఓ రోజు రాత్రి భోజన సమయంలో భర్త సాంబయ్యతో , “ఏమయ్యా మన సంటోన్ని చూశావా?” అన్నది.

“రోజూ చూస్తూనే ఉన్నాగదా” అన్నాడు..

“అది గాదయ్యా! వాడు ఈ మధ్య కాస్త లావయినట్లు కనపడ్డంలా” అన్నది.

“అబ్బా! పెరుగుతున్న పిల్లోడు లావు గాక, సన్నంగైతాడా? ఏమి మాటలే అయ్యి.” అన్నాడు.

“లావు సరే. నీరసంగా ఉంటన్నాడు. సరిగా బువ్వ కూడా తింటంలేదు. ఆటలకు ఎల్లడం లేదు. ఏదన్నా అడిగితే విసుక్కుంటున్నాడు” అంటుంటే....,

“అబ్బబ్బా! ఏంది నీగోల? పగలంతా కూలి నాలి చేసుకోనెత్తే, ఒక్క ముద్ద బువ్వ గూడా పెశాంతంగా అన్నివ్వవా నన్ను?” అంటూ విసుక్కున్నాడు.

'సరిపోయింది. ఇద్దరూ ఇసుక్కునేవాళ్ళే.” అనుకుంటూ చేసేది లేక, ఊరుకుంది.

ఇలా ఉండగా ఓరోజు పొలం పనులకు వెళ్లిన శాంతమ్మను, తోటి కూలీ ఒకామె, “ఏందొదినా! ఈ మద్దె ఏదోలా ఉంటన్నావు."ఏమైంది?” అని అడిగింది.

“ఏం లేదులే వదినా”, అంది. .

“అట్టా గాదులే. నేం గమనిత్తన్నాగా... ఏదో ఉంది. నా దగ్గిరేందుకొదినా దాపరికం?” అంది.

ఇక లాభం లేదనుకునుకుంది శాంతమ్మ. చూద్దాం. ఏపుట్టలో ఏ పాముందో? అననుకుని, “ఈ మద్దె మా సంటోన్లో ఏదో తేడాగుందొదినా.. నిద్దర్లో పొర్లడం, తిండి సరిగా తినకపోవడం. నాకేందో అనుమానంగా ఉందొదినా. అదే దిగులు”, అంటూ విషయం వివరించింది.

జిట్టి దయ్యకపోయావా?” అంది. “అన్ని రకాల జిట్టులు దీశానోదినా, కానీ లాభంలేదు” అంది.

“ఏదైనా గాలి సోకిందేమో ఒదినా. పక్కూర్లో ఈరాసామికి సూపించక పోయావా?”

"ఈరాసామా?” అర్ధం కాలేదు శాంతమ్మకు అనుభవం లేక.

"అవునొదినా... ఎట్టాంటి సీడపీడలనైనా ఇట్టే తీసేత్తడు” అంది భరోసాగా.

శాంతమ్మకు ప్రాణం లేచివచ్చినట్టయింది. “అవునా వదినా! ఆ యివరాలు సెప్పవా” ఆతృతగా అడిగింది.

“రేపాదివారం పిల్లోడింటికాన్నే ఉంటాడు గదా! తీసప్పో” అంటూ వివరాలు అందించింది.

“నాకొత్త గదొదినా. నువు గూడా తోడొత్తవా?” అన్నది శాంతమ్మ.

“సరే. వత్తాలే ఏమైది.” అన్నది.

ఆదివారం నాడు, ఇద్దరూ రమణను తీసుకుని, వీరాస్వామి ఉన్న ఊరికి వెళ్లారు.

వీరాస్వామి ఓ ఐదేళ్ళ క్రితం స్వామినంటూ భూత వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆదివారం నాడు కాషాయ వస్త్రాలు ధరించి చుట్టుపక్కల నుంచి వచ్చే ఇలాంటి వారికి టోకరా వేస్తుంటాడు, అలా ఆ  ఊరు చేరి, బాగానే నాలుగు రాళ్ళు వెనకేశాడు ప్రస్తుతానికి అతని వ్యాపారానికి డోకా లేదు. ఎందుకంటే, వచ్చిన వాళ్ళకే ఏదోకటి చెప్పి ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ ఉన్నాడు.

మన రమణను ఆయనింట్లో, కాళికామాత గాధి దగ్గర ఓ ముగ్గు వేసి, అందులో కూర్చోబెట్టాడు ఆ స్వామి మొహాన 'కుంకుమ బొట్టు పెట్టాడు. మంత్రాలంటూ గట్టి కేకలతో ఇతరులు జడుసుకునేలా అరిచారడ.

ఓ బూడిద ప్యాకెట్ వారి చేతిలో పెట్ట ఈ విభూది రోజూ పడుకుండేటపుడు పిల్లోడి నుదుటిపై పెట్టండి. వాడి మంచం చుట్టూ కూడా వేయండి వారం తరువాత కనపడండి.” అంటూ సెలవిచ్చి తన ఫీజు రెండు వందలూ తీసుకున్నాడు.

ఓ వారం తాను చెప్పినట్లే చేసింది శాంతమ్మ కానీ, రమణ పరిస్థితిలో ఏమీ మార్పు రాకపోగా, నిద్దర్లో ఎక్కువగా ఆయాస పడుతున్నట్టుగా గమనింగ్ కూడా. భర్తకు ఏదైనా చెబుదామంటే కోప్పడ చెప్పలేదు. ఎందుకంటే, ఇలాంటివన్నీ సాంబయ! కిష్టముండదు. మళ్ళీ వారం రమణను సామి దగ్గరకు తీసుకెళ్లింది శాంతమ్మ మార్పు లేదని తెలిపింది. ఈసా స్వామి గారు కళ్ళు మూసుకుని, మౌనంగా ఏదో పద్మాస నవేసి, ఎవరితోనో మాట్లాడుతునట్లు నటించాడు.

“ఇది మంత్రాలతో ఒగ్గేది కాదమ్మా. తాయెత్తుతోనే సరి. ఐదొందలు ఖర్చు.” అన్నాడు.

“ఎంతయినా ఫర్లేదు సామీ. ముందు పిల్లోడు బాగుండాలె.” అంటూ మారు మాట లేకుండా చీర కోంగులోంచి రూ. 500ల కాగితం తీసిచ్చింది. తాయెత్తు రమణ మొలత్రాడుకు కట్టి పంపాడు.

అక్కడ నుండి వచ్చాక మళ్ళీ రోజు రమణకు బాగా జ్వరం వచ్చింది. ఉదయం నిద్ర మంచంలోనుండి వలేదు. బడికి కూడా పోలేదు.

ఇంటి దగ్గరే ఉన్న తండ్రి సాంబయ్య వెంటనే పండరిపురం లోని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. శాంతమ్మ కూడా పోయింది. డాక్టర్ ఏమయ్యిందని అడిగాడు. జ్వరమొచ్చిందని సాంబయ్య చెప్పాడు. శాంతమ్మ మాత్రం ఇలా దాదాపు ఓ నెల నుండి సరిగా అన్నం నడం లేదనీ... మొత్తం వివరాలన్నీ చెప్పింది. డాక్టరు గారు పిల్లవాడిని, “ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? అంటూ ప్రశ్నలడిగాడు.

రమణ జవాబు చెప్పాడు. శాంతమ్మ చెప్పిన వివరాల ప్రకారం డాక్టరు గారికి విషయం అర్థం అయ్యింది. అబ్బాయి తిండి వివరాలు అడిగాడు. వాడు బడికి వచ్చిన సమయంలో పట్నంలో ప్రరోజూ నూడుల్స్, పూరీలు, మసాలా దోశలు, పిజ్జాలు లాంటివి కొనుక్కుని తినడం, కూల్ డ్రింక్స్ లు అవీ బాగుతున్నట్లుగా తెలుసుకున్నాడు.

శాంతమ్మ డాక్టరు గారు అడిగే ప్రశ్నలను, రమణ జవాబులను మామూలుగానే వింటున్నది. సాంబయ్య మాత్రం ... ఆ మాత్రం కొత్త కొత్త పదార్థాలు తినడానికి తాను డబ్బులు ఇస్తున్నందుకు గర్వంగా ఉంఅదన్నట్లు ఫీలవుతున్నాడు.

ఇంత లో శాంతమ్మ ఉన్నట్లుండి , అంతేగాదయ్యా! ఈ మద్దె గాలి కూడా సోకింది. తాయత్తు కూడా కట్టించాం”, అంటూ ఆ విషయాలు కూడా చెప్పింది. సాంబయ్య అర్థం కాక, కోపంగా చూశాడు శాంతమ్మ వైపు.

డాక్టర్ “చూడమ్మా! ఇది గాలి, ధూళి సోకడం వీర ది. కాదు. ఈ బడి పిల్లలు అంతా బాగా రుచిగా ఉంటుంటాయని ఇలాంటివన్నీ తింటుంటారు. మీరేమో కు వాళ్ళకు అడిగినంత ఇస్తుంటారు. వాటిని జంక్ ఫుడ్ bడి అంటారు. అవి తింటే, లోవల కొవ్వంతా పేరుకుపోతుంది. ఆకలి మందగిస్తుంది. ఊబకాయం నే పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. రకరకాల సమస్యలు మ్మ ఏర్పడతాయి. గ్యాస్ ట్రబుల్స్ వస్తాయి. గుండె సంబంధ ఏ. వ్యాధులు కూడా రావచ్చు. అవే కొన్ని మీ అబ్బాయిలో వచ్చాయి.” అని చెబుతుంటే, శాంతమ్మ, సాంబయ్యలు విస్తుపోయి చూడసాగారు.

“డాక్టరు గారూ! మరి మా అబ్బాయికి డ ప్రమాదమేమీ లేదు కదా?” సాంబయ్య భయంతో అడిగాడు.

“మీ అబ్బాయికి ఇప్పుడిప్పుడే అన్నీ 10 మొదలవుతున్నాయి. అవన్నీ మాన్పించాలి.” అన్నాడు.

“అయితే మీరే చెప్పండి డాక్టరు గారూ! మా పిల్లోడితో. నేనేం జెప్పినా కోపగిచ్చుకుంటున్నడు”, అన్నది శాంతమ్మ.

చిన్న వయసులో ఉన్న రమణ డాక్టరు గారు చెప్పిన జబ్బుల లిస్టు విని నిర్ఘాంతపోయాడు.

అందుకే తేలికగా జంక్ ఫుడ్ మానేశాడు. డాక్టరు చెప్పినట్లు కొన్ని రోజులు మందులు వాడుతూ, ఆయన చెప్పిన పండ్లు, ఆకుకూరలు, తింటూ నీటిని ఎక్కువగా తాగడం చేశారు. నెల తిరిగే లోపు రమణ లో చాలా మార్పు వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషించారు. ఇప్పుడు రమణ ఎంతో హుషారుగా శ్రద్దగా చదువుకుంటున్నాడు. మాయ మాటలు చెప్పి మోసం చేసిన మంత్రగాడిని నమ్మొద్దని ఊరంతా ప్రచారం చేశారు.

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate