অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నగర దిష్టి

వెంకటేశ్వరా కాలిని లో దాదాపు ఓ 100 కుటుంబాలకు పైనే నివాసం ఉంటున్నారు.అక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం ప్రధాన వృత్తిగా ప్రజలు జీవిస్తుంటారు. అంట ఎక్కువుందిగా కాకపోయినా దాదాపు 75% మందికి అరా ఎకరం నుండి రెండు ,మూడు ఎకరాల వరకు పొలం కలిగిన రైతులు ఉన్నారు. మిగిలిన వారంతా రైతు కూలీలు.వివిధ రకాల కులాలు,మతాలు వారు ఉంటున్నారు కానీ ఎవరికి వారే యమునా తీరే. పిల్లలను కూడా బడికంటే కూలి పనులకు తీసుకెళ్ళడానికి ప్రాముఖ్యతనిచ్చేవారు. పనులు లేని కాలంలోనో,చిన్నపిల్లలను మాత్రమే బడికి పంపుతారు.

ఇలా ఉండగా ఒకసారి ఆ గ్రామానికి లక్ష్మణరావు అనే ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చారు. ఠాణాలు వచ్చే కొద్దిపాటి జీతంలో ఆ గ్రామంలోనే ఓ చిన్న ఇల్లు తీసుకొని ఉంటున్నాడు . అక్కడి విషయంలు అర్థమయ్యాయి. పిల్లలను బడికి పంపుట గురించి ఇళ్లకు తిరిగాడు. చదువు విలువ చెప్పాడు. ఒకరిద్దరు సరేనని పంపారు. లక్ష్మణరావు గారు పేద కుటుంబంలో పుట్టి కష్టాలు అనుభవించినవాడు. చదువు విలువ కష్టం విలువ తెలిసినవాడు. అందుకే తాను పడిన కష్టాలు అవ్వరు పడకూడదనుకునే  మంచి మనిషి  నిజాయతి పరుడు ఈ గుణాలన్నీ తన తండ్రి పురుషోత్తమరావు నుండి సంక్రమించాయి.ఉడుకు రక్తం కలిగిన కుర్రవాడు తెలివైన వాడు. బాల్యంలో తండ్రి మరణించడంతో యర్పడిన తన కష్టాల జీవితం తనకు లౌక్యం నేర్పింది. ఉద్యోగం ఉత్తమ గుణాలే తన ఆస్తిపాస్తులు. తాను చేపట్టే మంచి పనిలో యాన్ని అడ్డంకులో ఎదురైనా సాధించాలనే మనస్తత్వం ఆయన స్వంతంగా అందుకె   పట్టు  వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం సాగించాడు. సఫలీకృతుడయ్యాడు. క్రమక్రమంగా  ఆయన మాటలను  గ్రామస్తులుఅర్థం చేసుకున్నారు. కాదు, కాదు ఆలా చేసారు మన లక్ష్మణరావు గారు.

ఆయన మాతలి అందరికి రుచించాయి. ఒక రెండు సంవత్సరాల కాలంలో గ్రామంలోని పిల్లలంతా బడిలో చదువుకుని వారయ్యారు. ఓ 5  సంవత్సరాలు గడిచాయి. మాస్టారు ఒక ఒంటి వారయ్యారు. భార్య తనకు అనుకూలవతి, గుణవంతురాలు కాస్త విద్యావంతురాలు కూడా. ఆమె కూడా పేద కుటుంభం నుండే వచ్చింది. ఆమె తనకు మంచిపనిలో చేదోడు వాదోడుగా ఉంటున్నది. అందుకే ఇప్పుడు గ్రామస్తులను కలవడానికి ఇంకా ఎక్కువ సమయమ్ దొరికింది. ఆ సమయంలో అప్పుడప్పుడు గొడవలు కూడా ఉండేవి. తరచుగా కొట్టుకోవడం ఆనవాయితీ అన్నట్లుగా ఉండేవారు. పోలీస్ స్టేషన్ల  చుట్టూ తిరిగే వారు. కానీ ఇప్పుడు క్రమక్రంన్గా పరిష్కారాల కోసం మాస్టారి దగ్గరికి రాసాగారు. వారికీ చాల సంతృప్తికరమైన తీర్పులు ఇస్తూ మరో మర్యాద రామన్నగా పేరు తెచ్చుకున్నారు. మరో 5  సంవత్సరాలు గడిచాయి. గ్రామం అంట ఐకమత్యంగా ఉంటున్నారు. ప్రస్తుతంఅక్కడ గొడవల బదులు ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చోటు చేసుకున్నాయి. ఎందరో పండుగలను అందరు కలిసి సంతోషంగా చేసుకుంటున్నారు. లక్ష్మణరావు గారు అందరికి తలలో నాలుక అయ్యారు.

గ్రామస్తుల సహకారంతో క్రమమునఁగ ఊరి బాగోగులు కూడా చూడడం ప్రారంభం చేసారు. ఇంతలో ఆయనని ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ, గ్రామస్తులు మాస్టారుకి కూడా భాదగా ఉంది. మాస్టారుకి తెలియకండా గ్రామస్తులు అధికారులను సంప్రదించారు. వారి కోరిక మేరకు తిరిగి అక్కడే నియమితులయ్యారు మాస్టారు.

ఇంతలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. గ్రామస్తుల్లో ఒక ఆలోచన తళుక్కుమంది. మాస్టారునే సర్పించిగా అనుకుంటే, దూరం కాకుండా ఉంటాడని వారి ఆలోచన. అనుకున్నదే తగవుగా ఆరోజు సాయంత్రం గ్రామస్తులంతా మాస్టారి ఇంటిముందు గుమిగూడారు. ఊహించని పరిణామానికి ఏమనాలో మాస్టారికి అర్థం కాలేదు. కానీ గ్రామస్తుల మాటను కాదనలేని పరిస్థితి అయింది. ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు వారు. తన నిస్వార్థ సేవలు తనను ఆ గ్రామముకు ఏకగ్రీవ సర్పించిని చేశాయి. తన సర్పంచి అయ్యాక ఉద్యోగం వదిలి వేయాల్సి వచ్చింది.బ్రతుకుదెరువు కోసం గ్రామస్తులంతా కలిసి కొంత భూమిని ఉచితంగా ఇస్తామన్నారు, కానీ మాస్టారు ఒప్పుకోలేదు. కాలమెప్పుడూ ఒకేలాగా ఉండదనే ముందుచూపుతున్నవాడు అందుకే, థన్ కూడా ఉన్నంతలో ఒక ఎకరం పొలం కొనుక్కున్నారు తాను కూడా వ్యవసాయం చేస్తూ ఆదర్శరైతుగా , ఆదర్శ సర్పంచిగా మంచి పేరు తెచ్చుకోసాగారు.

ఊరు బాగు పడింది. లక్ష్మణరావు గారి సారథ్యంలో గ్రామంలో పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయి. పశు సంపద పెరిగింది. అప్పుడప్పుడు ఆటవిడువుగా ఊరి పొలిమేరల్లో ఆటలు ఆడుకుంటున్నారు. వనభోజనాలు చేసుకుంటున్నారు ఇప్పుడు గ్రామంలో ఉన్న దేవాలయం ,మసీదు, చర్చి, మూడు కళకళలాడుతున్నాయి. అన్ని పండుగలు ఆ ఊరి సొంతం ఊరేగింపులు ఉత్సవాలు ఆద్భుతంగా జరుగుతున్నాయి. ఆయా సంప్రదాయాలలో పండుగలను అందరు జరుపుకుంటున్నారు. పండుగలలో బండలాగుడు పోటీలు, గ్రామీణ ఆతల పోటీలు సరదాగా జరుగుతున్నాయి.

అప్పుడప్పుడు హరికథ, బుర్రకథ కాలక్షేపాలు, నాటికలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగల్లాంటి వాటికీ కోలాటాలు, గంగిరెద్దుల  ఆటలు ఉంటున్నాయి. కోడిపుంజుల ఆటలు జరుగుతున్నాయి. తోలుబొమ్మలాటలు చూడముచ్చటగా ఉంటున్నాయి. ఇలా అంతో సరదాగా, ఆహ్లాదంగా గ్రామా ప్రజలు ఉంటున్నారు. ఆ గ్రామంలోని పిల్లంత మంచి విద్యావంతులుగా అవుతున్నారు. కష్టసుఖాల్లో గ్రామస్తులంతా ఐకమత్యంగా నడుస్తున్నారు. ప్రతి ఏటా పట్టాశాలల్లో కూడా వార్షికోత్సవాలు, జాతీయ పండుగలు క్రమం తప్పకుండ జరుగుతున్నాయి. ఇప్పటికి మూడవసారి థానే సర్పంచిగా ఉంటున్నారు లక్ష్మణరావు గారు.

కాలచక్రం గిర్రున తిరిగింది

గ్రామంలోని కొందరు పిల్లలు చిన్న పెద్ద ఉద్యోగాలలో స్థిరపడ్డారు. గుడిసెలు కాస్త, బిల్డింగులుగా అంతస్తులుగా భావనాలుగా మారిపోతున్నాయి. ఇంటింటికి టీ.వీ.లు వచ్చాయి. ఇప్పుడు మాస్టారు గారి వద్దకు వచ్చేవారి సంఖ్య తగ్గింది. కుటుంబాలలో పిల్లలు పెత్తనాలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా సర్పంచిగా మరో వ్యక్తి రంగంలో దిగాడు. నిస్వార్థ బుద్దితో, ముందు చూపుతో సర్పంచిగా పనిచేసిన లక్ష్మణరావు గారికి ఏ భాద లేదు. తన వ్యవసాయం మాత్రం వదిలిపెట్టకుండా చేసుకుంటున్నాడు. వీరి కుటుంబం మాత్రం హాయిగా ఉంటున్నది. ఎవరో కొందరు పెద్దవారు మాత్రం తాను కనపడితే బాగున్నారా అని పలకరిస్తూ ఉన్నారు.

ఉద్యోగాలు సాధించిన వారు ఓ ఇంటి వారవుతున్నారా. పెద్దల మాటకు విలువ లేదు. రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. స్వార్థం పెరిగింది. ఐకమత్యం సడలింది యువత కొత్త ఆలోచనలు, పెత్తనాలు పెరిగాయి. కొత్త కొత్త వ్యాపారాలు పుంజుకున్నాయి. దాంతో పాటు పట్నం పోకడ పెరిగింది. వెంకటేశ్వర కలినీ కాస్తా వెంకటేశ్వర నగర్ అయింది.

నగరం లోనికి సెల్ టవర్లు వచ్చి చేరాయి. దాదాపు 75% ప్రజల చేతుల్లో సెల్ లు హలచల్ చేస్తున్నాయి. ఇంటెర్నేర్ సెంటర్లు వెలిశాయి. కంప్యూటర్ సెంటర్లు వచ్చాయి. పిల్లలకు మాములు ఆటలు పోయాయి .

ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి వ్యవసాయం పై మక్కువ తగ్గింది. ఫలితంగా వ్యవసాయ భూమి తగ్గింది. గృహాల సంఖ్య మూడు రేట్లు పైగా పెరిగింది వర్షాలు కురవడం తగ్గింది వెడి పెరిగింది. భూమి ప్లాట్లుగా మారింది. కరువు పరిస్థితి ఏర్పడింది. తిండి గింజలు కరువవుతున్నాయి.ప్రజల్లో తెలియని జబ్బులు వస్తున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. కూలీలా వలసలు ప్రారంభమయ్యాయి. కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. పొట్ట చేత పట్టుకొని చెట్టుకొక్కరు గ మారాల్సిన పరిస్థితి వచ్చింది స్వార్థం పెరిగింది. ధనవంతులు, పెదాలు అనే తారతమ్యాలు ఏర్పడ్డాయి. చివరికి లక్ష్మణరావు మాస్టారు కూడా గ్రామం విగిచి తన సొంత ఊరికి వెళ్లిపోయారు.

ఇక్కడ, అక్కడ పండుగలు, పబ్బాలు, లేవు పోటీలు సరదాలు లేవు. అసలు ఇంటి నుంచి బయటికి వచ్చేవారి తక్కువ. పెద్దలు  టీవీలకు, పిల్లలు సెల్ల్ఫోన్ కంప్యూటర్లకు బానిసలు అయ్యారు. బడి, గుడి పేరుకు ఉంటున్నాయి. పెత్తనాలకు మరు పేరయ్యాయి.

ఊరు నాగరికత పేరుతో నిర్మానుశ్యంగ  తయారయ్యింది. మానుషాల మద్య్హ సంబంధాలు కరువయ్యాయి. క్షామం వెంటాడుతున్నది. కొందరిలోను ఆత్మమధనం మొదలయింది. ఏం చేయాలో తోచడం లేదు. ఈ నగరానికి ఏమయింది? అని ప్రశ్నిఒంచుకోవడం ప్రారంభించారు. నగరానికి దిష్టి సోకింది. తిరుణాలం చేయాలనీ సర్పంచి ఆద్య్హర్యంలో నటి గ్రామా పెద్దలకు సంకల్పిచారు.

చందాలు పోగు చేశారు. తిరునాళ్ళకు ఏర్పాట్లు చేశారు. వివిధ మతాలు, పార్టీలు పరంగా పోటీగా ప్రజలు కట్టారు. నాటికలు, ప్రోగ్రాములు ఏర్పాట్లు చేశారు డబ్బు ఖర్చు అయింది కానీ, లాభం లేకపోయింది. కలం గడుస్తున్నా కొద్దీ వర్షాలు లేవు. కరువు పరిస్థితులలో మార్పు లేదు.

చివరికి ఏం చేయాలో తోచడం లేదు. అప్పుడు గ్రామస్తులంతా వారి ఇళ్లల్లో నున్న ముసలి తండ్రులను సలహా అడిగారు. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి ఆ మాస్టారు గారేరా., అని చెప్పారు. అప్పుడు గ్రామా పెద్దలు అందరు కలిసి లక్ష్మణరావు గారిని వెతుకుంట్ను వెళ్లారు. తప్పులు క్షమించమని ఆదుకున్నారు. పరిష్కారం చూపమని అడిగారు.

"మీరంతా గ్రామంలోని చెట్లు చేమలు నరికేశారు. పొలాలన్నిటిని బీడు భూములు చేసేశారు. పొలాలు విభజించుకుని బోరుబావుల సంక్య పెంచుకున్నారు. అందుకే ఇలా కరువు తాండవిస్తోంది.ఆ సెల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వాళ్ళ గుండెజబ్బులు లాంటివి వస్తాయి. కాబట్టి మీరు అర్జంటుగా గ్రామంలోని సెల్ టవర్లు తొలగింపజేసుకోండి . అలాగే చెట్లు లేకపోవడం వలన వర్షము ఉండదు . కాబట్టి, వెంటనే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టండి. ఇంటిటా, వీధి వీధినా నాటండి. వాటిని కాపాడండి. పట్టాన నాగరికతను మార్చండి. అప్పుడు మీ బాధలు తొలగిపోతాయి. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు లాంటివి. చెట్లు ప్రగతికి మెట్లు. కాబట్టి మీరు గ్రామాన్ని పచ్చగా మార్చడానికి యంత కృషి చేస్తారో, అంట తొందరగా మీకు కరువు దూరమవుతుంది" అని చెప్పారు.

నటి నుండి మాస్టారు సూచనలు పాటించారు. కొంతకాలానికి నగరం పల్లె అందాలను సంతరించుకోవడం ప్రారంభిందింది. మెల్లగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కుటుంబాలు మరల ఏర్పడసాగాయి. ఆలా కొన్నాళ్ళకు వారి సమస్యలు తీరిపోయాయి. నగరదిష్ఠి పోయింది. వేంకేటేశ్వరా కాలనీ బాల్యరూపం లోకి రాసాగింది.

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate