অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిరమిడ్ ఎత్తు కొలిచిన పిల్లమేధావి

పిరమిడ్ ఎత్తు కొలిచిన పిల్లమేధావి

ఉన్నట్టుండి ఒక రాజుగారి పుర్రెలో ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. jan14.jpgసదరు ఆలోచన ఏమిటంటే తన దేశంలోని ఎత్తైన పిరామిడ్ ని కొలవడం! రాజుగార్కి కొలవాలనైతే ఉంది గాని ఎలా కొలవాలో మాత్రం అంతుపట్టలేదు. అయినా దానికోసం రాజుగార్కి తన తల పగలగోట్టుకోవాల్సిన పనేముంటుంది? జనాన్ని తలలు పగలగోట్టుకొని తన ఉత్కంటతను తీర్చమని అఘమేఘాల మీద ఆజ్ఞ జారి చేశాడు. గ్రీసు దేశమంతా గగ్గోలు రేగిపోయింది.

కింది నుంచి పైదాకా అంత పెద్ద పిరమిడ్ ఎలా కొలవాలి? కొలవడమంటే ఆషామాషీ లేక్కంగాదే! ఖచ్చితంగా కొలవాలి గదా! గణిత శాస్త్రజ్ఞాలంతా తెల్లమొహం వేశారు.

తల పండిన వాళ్ళంతా తల పట్టుక్కూచున్నారు కానీ ఒక నూనుగు మీసాల కుర్రాడు ఇంకా విద్యాభ్యాసం కూడా పూర్తిగాని పిల్లాడు నేను ఆ పని చేస్తా అని ముందుకొచ్చాడు. దానికో శుభ ముహూర్తం కూడా పెట్టుకోన్నాడు. ఇంకేముంది? జనం త్నదోపతండాలుగా ఆ కుర్రాడితో పాటు పిరమిడ్ దగ్గరికి చేరుకోన్నారు. చీమ సితుకుమన్నా వినపడేంత నిశ్శబ్దం. మేధావులు, ఆస్ధాన పండితులు, సైన్యాదిపతులు సరేసరి. మన కుర్రాడు రాజు వెడలె రావితేజము అన్నట్టు జనసందోహం నుంచి ముందుకొచ్చాడు.

అతని చేతిలో గజం పొడవున్న ఒక చక్కటి కర్ర మాత్రమే ఉంది. అంత చిన్న కర్రతో అంత పెద్ద పిరమిడ్ ని ఎలా కోలుస్తాడోనని అందరూ గుడ్లప్పగించి చూస్తున్నారు. కుర్రాడు పిరమిడ్ కు పక్కగా కొంచెం దూరంలో నిటారుగా భూమి మీద పరిశీలిస్తున్నాడు. కర్ర ఎత్తుని పొడవుని మార్చి మార్చి కొలుస్తున్నాడు.

పిరమిడ్ ఎత్తు కొలవమంటే కర్రనీడ కోలుస్తాడేమిటి? ఎవ్వరికీ అప్పటికి అంతుపట్టలేదు. ఎప్పుడైతే కర్రనిడ పొడవు కర్ర ఎత్తుకు సమానంగా ఉందొ అప్పుడా కుర్రాడు పిరమిడ్ మీద పొడవును ఆ కర్రతోనే కొలిచాడు. ‘ఇదే పిరమిడ్ ఎత్తు’ అని తేల్చిచెప్పాడు.

jan15.jpgనిజమే మరి. కర్ర ఎత్తు ఎంతో నిదా పొడవూ అంటే అయినపుడు పిరమిడ్ ఎత్తు ఎంతో పిరమిడ్ పొడవూ అంటే వుంటుంది. ఈ విధంగా ఉదయం నుండి మధ్యాహ్నం లోపు ఒకసారి మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు మరోసారి రెండుసార్లు జరుగుతుంది.

ఇంతకూ ఈ కుర్రకుంక ఎవరనుకొన్నారు? ఆ వయస్సులోనే అప్పటి గ్రీకు దేశపు ఏడుగురు గణిత మేడవుల్లో ఒకడుగా గుర్తింపు పొందిన ఒకానొక విద్యార్ధి! ధేల్స్! ఇక ఆ రాజుగారి పేరు మీకు తెలిసే ఉంటుంది, అమాసిన్.

ఇంత అద్బుతమైన jan16.jpgఆలోచన ధేల్స్ కి ఎలా వచ్చింది? అందులోనూ ఓ విచిత్రం ఉంది. ఒకరోజు అతడు ఎండలో నడుస్తున్నాడట. తన నీడను తదేకంగా గమనిస్తున్నాడట. సమానంగా ఉండటం గుర్తించాడట. అలా రోజులో రెండుసార్లు జరుగుతుందనీ అవగతం చేసుకొన్నాడట. ఆ చిన్న ఆలోచనే పిరమిడ్ ఎత్తు కనుగొనేందుకు దోహదోహదపడింది.

మేధావులు గాల్లోంచి పుట్టారు. వాళ్ళు మనలానే పుడతారు. కానీ వాళ్ళ చూచే పద్ధతి వేరు. మనం చూచే పద్ధతి వేరు. ఆ పద్ధతే ఆ జిజ్ఞాసతో కూడిన దృష్టే వాళ్ళని, మేధావుల్ని చేస్తుంది. సరే. ఇంకేం మరి మన పిల్లగాళ్ళనీ ఊరి మీదికి తరమండి తాటిచెట్లు, కరెంటు స్ధంభాలు, జండా పోల్సు ఒక్కటేమిటి ఎంత ఎత్తయితేనేం కొల్చుకొని రమ్మనండి. కొల్చుకొని వచ్చేస్తారు.

అసలు కర్ర ఎత్తు నిడ పొడవు సమానంగా అన్నపుడే ఎందుక్కోలవాలి? మనమైతే ఎప్పుడైనా కొలవోచ్చు. కర్ర ఎత్తుకు నీడ పొడవు నాలుగవ వంతే ఉందనుకోండి. కరెంటు స్తంభం ఎత్తు దాని నీడకు నాలుగు రెట్లు వుంటుందని లెక్కించవచ్చు.

నిర్వహణ: చండ్ర శ్రీనివాస్, తురకపల్లె.

చివరిసారిగా మార్పు చేయబడిన : 3/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate