অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పిల్లల్లో క్రుంగుబాటు

పిల్లల్లో క్రుంగుబాటు

16 ఏళ్ళ అమ్మాయి అర్చన ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొన్ని రోజుల నుండి తను ఏదో కోల్పోయినట్టుగా టీవీ చూస్తున్నా సరే, మనస్సు ఎక్కడో ఉన్నట్టు దేనిమీద ఆసక్తిలేక మార్కులు తగ్గిపోయి తిండి సరిగా తినక బరువు తగ్గి పోతున్నది. రాత్రిపూట సరిగా నిద్ర పోక సతమతమవుతున్న తన కూతురిని గమనించిన అరుణ “ఏంటమ్మా? ఇంతకు ముందులా చురుగ్గా ఉండటం లేదు? ఏమైనా ఇబ్బందులున్నాయా?” అని అడిగినా కూడా అర్చన ఎంత మాత్రం పలకకపోవడంతో తెల్లవారగానే ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి పిలిపించి అర్చన ప్రవర్తన తీరును వివరించింది. తల్లిదండ్రులు అక్షరాస్యులు కావడంతో వెంటనే అందుబాటులో ఉన్న డా. ప్రసాద్ రావు, సైకియాట్రిస్ట్ గారిని కలిసి ముందు అర్చన గురించి వివరించారు. అపుడు ఆయన వారు చెప్పిన విధానాన్ని బట్టి మీ అమ్మాయి డిప్రెషన్ (కుంగుబాటు) తో బాధపడుతుందని, మీరేమి భయపడవలసిన అవసరంలేదని వారిని బయటకు పంపించి, అర్చనను లోపలికి పిలిపించి వ్యక్తిగతంగా మాట్లాడగా...

“తను 10వ తరగతి వరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదని ఇపుడు ఇంటర్ మీడియట్ లో చేరాక కొత్త ఫ్రెండ్స్ తో కలిసి దురలవాట్లకు (సినిమాలు, షికార్లు, నెట్...) పాల్పడడం వల్ల సరిగ్గా చదవడం లేదని తద్వారా మొన్నటి Annual Exams లో సరిగ్గా ప్రిపేర్ కాక మార్కులు తక్కువగా వచ్చాయని, నాతోటి ఫ్రెండ్స్ కి ఎక్కువ వచ్చాయని అప్పటి నుండి నాలో తలనొప్పి, చికాకు నెగిటివ్ ఆలోచనలు, జీవితంపై విరక్తి, ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని” ఎంతో బాధతో చెప్పింది డాక్టర్ గారితో..

డాక్టర్ గారు అర్చన పేరెంట్స్ ని లోపలికి పిలిపించి టీనేజ్లో ఉన్న పిల్లలు డిప్రెషన్ కు లోనవ్వడం సాధరణమే అయితే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా, వారి యోగక్షేమాలపట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఆ పిల్లల్లో నియంత్రణ, కంట్రోల్ లేనితనం తద్వారా దురలవాట్లకు లోనవ్వడం, చెడు సాహవాసాలు, ఆల్కహాల్, ఇతర మాదక ద్రవ్యాలు (డ్రగ్స్), ప్రేమ, సెక్స్ కు సంబంధించిన విషయాలలో విపరీత మనస్తత్వానికి గురౌవడం జరుగుతుంది. ఇంటిలో స్కూల్లో అనుకూలించనపుడు పిల్లలు మరింత అడ్జస్ట్ మెంట్ ప్రాబ్లమ్స్ కి గురవుతారు. వ్యక్తిత్వ వికాసం దెబ్బతినడం వల్ల ఆత్మాన్యూనతా భావం, అపరాధభావం, నలుగురిలో కలువకపోవడం, చదువులో వెనకబడటం, తరచూ ఎగ్జామ్స్ ఫైలవ్వడం డిప్రెషన్ కి, ఆత్మహత్యలకి దారితీయవచ్చని ఈ టీనేజ్లో కలిగే మార్పులు వారి వ్యక్తిత్వంపై శాశ్వతమైన ముద్రవేస్తాయని అయితే ఈ మధ్య కాలంలో క్షీణిస్తున్న కుటుంబ విలువలు, కుటుంబ కలతలు, విద్యలో ఒత్తిడి (Stress) వారి ఫీలింగ్స్ ని వ్యక్తపరిచే అవకాశం ఇవ్వకపోవడం, వారిని రిలాక్స్ చేసే విధానాలు (ఆటలు, పాటలు, అభిరుచులు...) లేకపోవడం, అపరిపక్వమైన ప్రేమ వ్యవహారాలు దలైనవి పిల్లల్లో, యుక్తవయస్సు వాళ్ళలో డిప్రెషన్ ఉతంగా పెరగడానికి కారణమని వివరించారు. అలాగే దీన్ని నివారించడానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్, జోథెరపీ, పిబిటి, మందులు ఉంటాయని చెప్పి, తనకు పర్సనల్ కౌన్సెలింగ్ ఇచ్చి మందులు వ్రాసి మళ్ళీ 10 రోజుల తర్వాత రమ్మని చెప్పారు.

  • 10 రోజుల తర్వాత అర్చనలో వచ్చిన కొంత మార్పును తల్లిదండ్రులు గమనించి ఎంతో సంతోషపడ్డారు.
  • సైకియాట్రిస్ట్ ను కలిసిన తర్వాత ఆయన ఇలానే  ఈ ట్రీట్ మెంట్ కొంతకాలం వరకు తీసుకోవాలని చెప్పారు.
  • అర్చన వారి తల్లిదండ్రుల మధ్య మధ్యలో సైకియాట్రిస్ట్ ను కలిసి రెగ్యులర్ ట్రీట్ మెంట్ ఇప్పించారు.

కొంతకాలం తర్వాత అద్భుతం జరిగింది. ఏమయిపోతుందో, ఏ అఘాయిత్యానికి పాల్పడుతుందో అన్న అర్చనకు మెడిసిన్ లో సీటు వచ్చింది. స్వీట్ బాక్స్ తీసుకుని ఫ్యామిలీ సమేతంగా డాక్టర్ గారిని కలిసి తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించారు అని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆధారం: డా. జగదీష్ బాబు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate