অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

బర్త్ డే లాజిక్

బర్త్ డే లాజిక్

హలో చిన్నారులు మనం ఈరోజు మన మిత్రుల బర్తడే ఎప్పుడో ఒక చిన్న లాజిక్ ద్వారా తెలుసుకుందాం. ఇది చాలా తమాషాగా వుంటుంది. దీని కొరకు మీ మిత్రులకు ఈ క్రింది ప్రశ్నలు అడగండి.

  1. మీరు పుట్టిన నెలను 2తో గుణించండి.
  2. వచ్చిన దానికి 5ను కలపండి.
  3. ఆ వచ్చిన మొత్తాన్ని 50తో గుణించండి
  4. ఆ వచ్చిన లబ్దానికి మీరు పుట్టిన తేదిని కలిపి చెప్పండి.

ఈ నాలుగు స్టెప్స్ వారు చేసుకొని వారి మోత్తాన్ని చెప్పగానే వెంటనే వారు పుట్టిన నెల, తేదీ చెప్పవచ్చును.

ఉదా: రమపుట్టిన తేది 28-6-1987. ఇక్కడ సంవత్సరంతో పనిలేదు. ఎందుకంటే మనం పుట్టిన నెల తేదీ మాత్రమే ప్రతి సంవత్సరం వస్తాయి కాని సంవత్సరము రాదు కదా...

పుట్టిన నెల 6 x 2 = 12

12 + 5 = 17

17 x 50 = 850

850 + 28 = 878

878 అని చెప్పగానే మనం మీరు జూన్ 28న పుట్టారు అని చెప్పాలి. మరో ఉదాహరణ...

ఉదా: 10-11-1965

11 x 2 = 22

22 + 5 = 27

27 x 50 = 1350

1350 + 10 = 1360

1360 అని చెప్పగానే నవంబర్ 10వ తేదీ అని చెప్పాలి. అది కూడా పెన్ను లేకుండానే సుమా...

క్లూ చెప్పుతున్నాను జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేసుకోండి.

క్లూ; చివరగా చెప్పిన మొత్తం నుండి 250ని తీసి వేయడమే.

878 – 250 = 628. 28వ లేదీ – 6 నెల అనగా జూన్ 1360 – 250 = 1110. 10వ తేదీ, 11 నెల నవంబర్, జవాబులోని ఒకట్లు పదుల సంఖ్య తేదీ, మిగిలిన సంఖ్య నెలగా మనం చెప్పాలి తెలిసిందా.. బైబై...

ఆధారం: ఇ. చంద్రయ్య

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate