অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తెలుగు కథానికలు

తెలుగు కథానికలు

వేటగాడొకడు ఒకసారి అడవికి వేటకు వెళ్ళాడు. 09.jpg08.jpgచాలాసేపు తిరుగాడిన మీదట అతడికొక జింక కనబడింది. బాణంతో కొట్టి అతడు దాన్ని చంపాడు. దాన్ని ఒక భుజాన వేసుకుని ఇంటికి పోదామనుకుంటుండగా దారిన పోతూవున్న దానయ్య ఒకడు చచ్చిపడువున్న జింకను, వేటగాణ్ణి చూసి, చూస్తే నువ్వు వేట జీవనాధారంగా గడిపేవాడివిలాగున్నావు. ఏదో నాకు తోచిన సహాయం నీకు చేయాలని వుంది. ఇక్కడకు బారెడు దూరంలో అడవిదున్నలు తమలో తాము కలహించుకుని, భీకరంగా పోరాడుకుని ప్రాణాలు విడిచాయి. ఎలాగో ఒకలాగా వాటిని ఇంటికి చేర్చుకున్నావంటే కొద్ది రోజులు మీ భుక్తికి లోటుండదు అన్నాడు.

వేటగాడు ఆ మాటలు నమ్మి చచ్చిన జింకనక్కడే వదిలి చచ్చిన దున్నలను చూడబోయాడు. బారెడు దూరం వెళ్ళి దానయ్య చెప్పిన చోట చూస్తే దున్నల జాడే లేదు. ఒక్క ఉదుటున జింక చచ్చిపడివున్నచోటికి వస్తే అక్కడ అదీ లేదు.

మోసం జరిగిందని రూఢి అయ్యాక వేటగాడు అక్కడే ఒక చెట్టు మొదట్లో కూలబడి తలపట్టుకు కూర్చున్నాడు.

కట్టెల మోపుతో ఇంటికి పోతూ వున్న ముసలివాడొకడు వేటగాణ్ణి పలకరించాడు. వేటగాడు తను మోసపోయిన సంగతి ముసలివాడితో చెప్పాడు. అందుకు కట్టెలు కొట్టేవాడు నవ్వి ఎక్కడ ఆశ వుంటుందో అక్కడ మోసం వుంటుంది. మనిషిలోని ఆశ అనే బలహీనత నాధారం చేసుకునే మోసగాళ్ళు వంచన చేస్తారు. మనిషి వున్నదానితో తృప్తిపడక దేనికొరకో అర్రులు చాస్తే బాధపడక తప్పదు. జింక పోయిన అనుభవం వచ్చింది... కదా.. ముందుముందు మోసపోకుండా అది ఉపయోగపడుతుంది. ఈ రోజు వేట వల్ల వచ్చిన ఆదాయం అదే అనుకో పద పోదాం.... పొద్దుగూకుతున్నది అన్నాడు.

- విశాలాంధ్ర వారి సౌజన్యంతో

విందు భోజనం

011.jpgఒకనాడు గాలిబ్ ని ఆ దేశపు రాజుగారు (పాదుషా) విందుకు పిలిచారు. దాంతో అతను మహా సంబరపడిపోయాడు. గాలిబ్ మంచి కవి. అయినప్పటికీ కటిక పేదవాడు. అందుకని అతుకుల బొంతల్లా వున్న తన పాత బట్టలతోనే రాజుగారి కోటకు బయలుదేరాడు.

“ఏమిటీ అవతారం ? అంత గొప్పాయన ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి బట్టలతోనా వెళ్ళేది. ఇలా వేళ్తే నిన్నసలు కోటలోకి కూడా అడుగు పెట్టనివ్వరు. మా మాట విని ఈ ఒక్క పూటకీ ఎవరి నుంచైనా కాస్త బట్టలు అరువుగా తీసుకొని వేసుకో అని సలహా ఇచ్చారు స్నేహితులు.

గాలిబ్ చిరునవ్వు నవ్వి విందుకు రమ్మని రాజుగారు నన్ను పిలిచారే గానీ నా బట్టలను కాదు. కాబట్టి నేనెలా వున్నానో అలాగే వెళ్ళాను. అన్నాడు. కాని తీరా కోట దగ్గరికి వెళ్ళేసరికి అతని స్నేహితులు చెప్పినట్లే జరిగింది.

ఎవరు నువ్వు ? కోటలో నీకేం పని ? అంటూ కాపలా వాళ్ళు నిలదీశారు. అయ్యా, నేనొక కవిని. నన్ను గాలిబ్ అంటారు. నేను రాజుగారి స్నేహితుడ్ని. ఆయన విందుకు రమ్మని పిలిస్తే వచ్చాను. అని గాలిబ్ చెప్పిన మాటలను వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోలేదు.

013.jpgనువ్వు గాలిబ్ వైతే మాకేంటి. వాడి బాబువైతే మాకేంటి. ఇలాంటి అవతారంతో నువ్వు లోపలికి వెళ్తే రాజుగారు మా తలలు తీసేస్తారు. కాబట్టి వచ్చిన దారినే వెళ్లిపో అంటూ కాపలావాళ్ళు అతడ్ని అక్కడి నుంచి తరిమేశారు.

గాలిబ్ కి చాలా బాధగా అన్పించింది. అయితే ఈ విషయంలో రాజుగారికి ఏదో ఒక గుణపాఠం నేర్పనిదే ఊరుకో కూడదనుకున్నాడు. అందుకని ఈసారి అరువు బట్టలు వేసుకుని చక్కగా ముస్తాబై మళ్ళీ వెళ్ళాడు. ఇంతకు ముందు ఛీ పో అని కసిరిన కాపలావాళ్ళు ఈసారి వంగి సలాము చేస్తూ అతడ్ని లోనికి పంపించారు. రాజుగారు సాదరంగా ఆహ్వానించి అతడ్ని కూర్చోబెట్టారు. రకరకాల పిండి పంటలతో విందు మొదలయ్యింది. అయితే గాలిబ్ కనీసం ఒక్క ముద్దయినా నోట్లో పెట్టుకోకుండా.

ఇదిగో తళతళా మెరిసిపోతున్న నా అంగీ, ఈ మిఠాయి తిను, ఇదిగో ... 010.jpgనవ నవ లాడుతూ వున్న నా టోపీ ..... ఈ కోడి గుడ్డు తిను. ఇదిగో బ్రహ్మాండంగా వెలిగిపోతున్న నా కోటూ ఈ చపాతీ తిను. అంటూ తన బట్టలకు తిండి తిన్పించడం మొదలుపెట్టాడు.

రాజుగారికి తల తిరిగిపోయినట్లయ్యింది. ఏమిటిది ? మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా ? అంటూ గాలిబ్ మీద మండి పడ్డాడు.క్షమించాలి మహారాజా, నేనేం చేయాలో అదే చేస్తున్నాను. అంటూ గాలిబ్ జరిగినదంతా చెప్పాడు. కాబట్టి ఈ విందు నాకు కాదని, నా బట్టలకేనని నాకు స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే వీటన్నిటినీ నా బట్టలకు తిన్పిస్తున్నాను. అన్నాడు. రాజుగారికి తన తప్పేమిటో బాగా తెలిసి వచ్చింది.

రచయిత : డా.గంగిశెట్టి శివకుమార్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate