অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రామానుజన్ సంఖ్య 1729

రామానుజన్ సంఖ్య 1729

రామానుజన్ సంఖ్య 1729 అని మీకు తెలుసుగదా. ఈ సంచికలో 1729 యొక్క ప్రత్యేకతలు చర్చిద్దాం.

  1. రెండు ఘనాల మొత్తంగా రెండు విధాలుగా వ్రాయగల్గిన సహజ సంఖ్యలలో కనిష్ఠ సంఖ్య 1729
  2. 1729 = 13+123 = 93+103

    ఇలాంటి సంఖ్యలు 50,00,000లో 101 మాత్రమే ఉన్నాయి. 1729 తరువాత ఈ విధంగా వ్రాయగలిగిన సంఖ్య 4104.

    4104 = 23+163 = 93+153

  3. 1729 ను రెండు వర్గ సంఖ్యల భేదంగా కూడ వ్రాయవచ్చును.
  4. 1729 = 552-362 = 732-602 = 1272-1202 = 8652-8642

  5. 1729 లోని అంకెల మొత్తము 19. 1729 ను 19 నిశ్శేషంగా భాగిస్తుంది. ఇలాంటి సంఖ్యలనే హర్షద్ సంఖ్యలు అందురు.
  6. మరి కొన్ని హర్షద్ సంఖ్యలు 874, 1387 మరియు 1558.

  7. ఇది పరిశీసించండి ఎంత ఆసక్తిదాయకంగా ఉందో.
  8. 1729 = 18x81+17x71-15x51-14x41+13x31

  9. 1729 = 1x7x13x19 = 1 (6+1) (6+6+1) (6+6+6+1)
  10. ఇలాంటి ధర్మాలు మరి కొన్ని మీరు తయారుచేసి, ఆనందించండి.

ఆధారం: శ్రీ కృష్ణసాయి



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate