অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సరదా సరదా ఇంగ్లీషు

సరదా సరదా ఇంగ్లీషు

302.jpgమనం గతంలో ఇంగ్లీషు భాషలో గల విశేషాలు గురించి తెలుసుకొన్నాం. ఇంగ్లీషు పదాలలోగల అక్షరాలు వ్రాయటం మర్చిపోయినప్పుడు కలిగే యిబ్బందుల గురించి చర్చించాం. ఉదా.కు విండో అనే పదాన్ని ఇంగ్లీషులో రాయాలంటే, WINDOW అని వ్రాయాలి పొరపాటున మధ్యలో గల “N” అనే అక్షరం రాయటం మర్చిపోతే, ఆ పదం WIDOW (విడో ) అవుతుంది. అర్థమే పూర్తిగా మారిపోతుంది.

ఇంతకు, విండో కు అర్థం కిటికి అని, మరి విడో అనే పదానికి అర్థం భర్త చనిపోయిన స్త్రీ అని అర్థం చూశారా బాలలు.. అర్థం ఎంత మారిపోయిందో. కాబట్టి జాగ్రత్త సుమా...

ఈసారి ఇంగ్లీషు భాషలో ఉండే కొన్ని వింత పదాలను, వాటి అర్థాలను, ఆ పదాల పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకొందాం.

డూడిలో Doodle - మనకు ఏమీ తోచనప్పుడు, ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు, దేని గురించో ఆలోచిస్తున్నప్పుడు కాగితాలపై, ఇసుకలో బొమ్మలు, గీతలు, ఆకారాలు... మొదలైనవి గీస్తూ ఉంటారు. ఈ విధంగా గీయటాన్నే డూడిల్ అంటారు.. తమాషాగా ఉంది కదా..

నారిసిసిజమ్ (Narcisiam)- తనను తాను ప్రేమించుకోవటాన్ని, ఇష్టపడటాన్ని నారిసిసిజమ్ అంటారు. ఈ పదం పుట్టుక, వెనుక, ఓ వింత కథ ఉంది. రాజు నీటిమడుగులో రోజు తన ప్రతిబింబాన్ని చూసుకొని, తన అందానికి వరవశించి, తనను తాను ప్రేమించుకొన్నాడట... వింతగా ఉంది కదా...

ఆడమ్స్ ఏపిల్ (Adan’s Apple) - బాలలు ఈ పేరేమిటో తమాషాగా ఉంది కదా... మనందరికి కాశ్మీర్ ఏపిల్ తెలుసు. ఇదేమి ఏపిల్ అనుకొంటున్నారా... ఇదేమి తినే ఏపిల్ కాదు. మానవ శరీరంలో ఒక భాగం. గొంతుభాగంలో పైకి క్రిందకూ కదులుతూ ఉంటుంది. ఈ భాగం మగవారిలో మాత్రమే సాధారణంగా కనిపిస్తుంది.

ఆల్ఫాబెట్ (Alphabet) - ఆల్ఫాబెట్ అనే పదానికి అర్థం అందరికి సాధారణంగా తెలిసే ఉంటుంది. భాషలోని అక్షరములన్నియూ అని అర్థం .....అంటే A నుండి Z వరకు అన్నమాట. మరి ఆ పంద పుట్టుక గురించి తెలుసుకొందాం. గ్రీకు మొదటి రెండు అక్షరాలు ఆల్పా మరియు బీటా అంటే మన మాతృభాషలో అ,ఆ లుగాగా.. ఆ రెండు అక్షరాలు కలిసి ఆల్ఫాబెట్ గా మారిపోయాయి. హెర్క్ లన్ (Herculean)- మనం ఏదైనా కష్టమైన పనిని చేయాలంటే ఎంతో శక్తి అవసరం. అలాంటి బలమైన పనినే హెర్క్ లన్ అంటారు.

మరి ఈ పదం ఎలా పుట్టిందో చూద్దాం... గ్రీకు పురాణాలలో హెర్క్ లన్ అనే మహాబలశాలి ఉండేవాడు. ఆయన పన్నెండు (12) అతి కష్టసాధ్యమైన ఇబ్బందులను ఎదుర్కొని విజయం సాధించాడు కావున కష్టమైన పనులు ఎదుర్కొనటాన్ని హెర్కు లీన్ టాస్క్ అంటారు. పై పదాలు ఇంగ్లీషు భాషలో కొన్ని మాత్రమే. ఇలాంటి వింతలు ఇంగ్లీషు భాషలో కోకొల్లలు. అసలు ఇంగ్లీషు భాష నిఘంటువు (Dictionary) లో ఉండేవి సుమారు ఆరు లక్షల పదాలు..నిజంగా ఎన్ని పదాలో కదా...

ఆ పదాలన్ని ఇంగ్లీషు భాషకు చెందినవే కాదు. గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, హిందీ, పంజాబీ, ..ఇలా అనేక బాషలనుంచి వచ్చి చేరాయి. అందుకనే ఇంగ్లీషు భాష అంతర్జాతీయ భాష అయ్యింది కదా.. ఇంగ్లీషు భాషలో ఎక్కువ సార్లు వాడే ఇంగ్లీషు అక్షరం ఏమిటో తెలుసా... “e” ఇంగ్లీషు భాషలో షేక్స్ పియర్ అనే గొప్ప నాటక రచయిత ఉండేవాడు. అయిన 15వ శతాబ్దానికి చెందిన వాడు. ఆయన కాలంలో ఉపయోగించిన ఇంగ్లీషు పదాల సంఖ్య, నేటికి 7 రెట్లు పెరిగిపోయాయి.

ఇంకా తమాషా అయిన విషయమేమిటంటే ...షేక్స్ పియర్ తన వయస్సు కన్నా 8 సంవత్సరాలు ఎక్కువ వయస్సుండే స్త్రీని వివాహమాడాడు. మనదేశ క్రికెటర్ సచిన్ తెండ్కూలర్ లాగా... ఇంకా మరికొన్ని వింతలు, సరదా సరదా సంగతులు మరొకసారి తెలుసుకుందాం.

రచయిత: యం. సుధారమేష్ గార్లపేట



© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate