অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

విజ్ఞాన విశేషాలు

విజ్ఞాన విశేషాలు

రుచి చూసే పద్ధతి

268.jpgమనకు సాధారణంగా నాలుక మీద ఉన్న రుచి మొగ్గల వలన ఇంకా ముక్కు వలన వివిధ పదార్థాల రుచి తెలుస్తుంటుంది. అవునా? ముక్కదిబ్బడ లాంటిది వచ్చినట్లయితే దాదాపుగా అన్ని పదార్థాల రుచీ మనకు ఒకేలా అన్పిస్తుంది. కాని సముద్రంలో జీవించే క్యాట్ ఫిష్ అనే జీవికి మాత్రం అలాంటి ఇబ్బంది ఏదీ లేదు. ఎందుకంటే ఆ ప్రాణి తన ఒంట్లోని భాగం నుండైనా ఒక పదార్థం (ఆహారం) తాలూకూ రుచిని తెలుసుకోగల్గుతుంది. పిడుగులబారిన పడే వృక్షం.

వేల గ్యాలన్ల లాలాజలం

మనం జీవించే ఆహారాన్ని జీర్ణం చేసుకునే విషయంలో మన నోట్లో ఉండే లాలాజలం నిర్వహించే పాత్ర ఇంతా అంతా కాదు. నోట్లో లాలాజలం ఊరకుండా మనం ఆహారాన్ని నమిలి మింగడాన్ని అసలు ఊహించను కూడా ఊహించలేము. అసలింతకూ మనిషి జీవితకాలంలో ఎంత లాలాజలము ఊరుతుందో తెలుసా.... 10,000 గ్యాలన్లకు పైనే ఊరుతుంది.

పిడుగుల బారిన పడే వృక్షం

269.jpgఆకాశంలోంచి పడే పిడుగులకు (విద్యుత్తుకు) మనుషులని, జంతువులని ఏమీ తేడా వుండదు. తాము వేడి మీద పడితే వాటిని భస్మం చేయడమే (లేదా మసిబొగ్గులా మార్చడమే) వాటికి తెలిసిన విద్య. అసలింతకూ సంగతేమిటంటే ప్రతి ఏటా ఎంతో మంది మనుషులు, జంతువులు పిడుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే పిడుగుల వలన ఫలానా జంతువులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నాయని ఎవరూ ఎవరూ అనలేరు గాని, చెట్ల విషయానికి వస్తే మాత్రం మిగతా అన్ని చెట్ల కన్నా ఎక్కువగా ఓక్ చెట్లు (oak) గిడుగుల బారిన పడుతున్నట్లు ఒక పరిశోధనలో తేలింది.

చర్మంలోని రక్తనాళాలు

మనిషి చర్మంలోని రక్తనాళాలన్నింటినీ తీసి ఒక వరుసలో పేర్చినట్లయితే అవి ఎంత పొడవుంటాయో తెలుసా.... సరిగ్గా 45 మైళ్ళ పొడవుంటాయి. ప్రతి చదరపు అంగుళం చర్మంలోనూ మొత్తం 20 అడుగుల పొడవుంటే రక్తనాళాలు ఉంటాయి. మరి కేవలం చర్మంలో నివేగాక శరీరంలోని రక్తనాళాలన్నింటిలో తీసి ఒక వరుసలో పేరిస్తే ? అవి 20,000 కిలోమీటర్ల కన్నా పొడవుగా వుంటాయి.

ఎక్కువ పనులు చేసే అవయవం

270.jpgమన శరీరంలో అతి తక్కువ పనులు చేసే అవయవం ఏదీ అని ఎవరైనా అడిగితే మనం జవాబుకోసం తప్పక తడుముకోవలసి వస్తుంది. ఎందుకంటే మెదడు, గుండె, ఊపిరిత్తులు, మూత్రపిండాలు. ఇలా ఏ అవయవాన్ని తీసుకున్నా అవి చేసేపని లేక పనులు మనకు అతి ముఖ్యమైనవిగానే కన్పిస్తాయి. అవునా అయితే మిగతా అన్నింటికన్నా ఎక్కువ పనులు చేసే అవయవం ఏది ? అని అడిగితే మాత్రం మనం ఏమాత్రం తడుముకోకుండా కాలేయం అని జవాబివ్వవచ్చు. కాలేయం 500కు పైగా వేర్వేరు పనులను చేస్తుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

పనామా కాలువ తవ్వినప్పుడు

అమెరికా ఖండానికి తూర్పువైపున ఉన్న అట్లాంటిక్ మహాముద్రాన్ని పడమరవైపున ఉన్న పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ, ఉత్తర - దక్షిణ అమెరికా ఖండాల మధ్య పనామా కాలువను నిర్మించాలన్న సంగతి మీకు తెలిసిందే కదా. అయితే ఈ కాలువను తవ్వేటప్పుడు వివిధ కారణాల వలన సుమారు 25,000 మంది పనివాళ్ళు అసువులు బాసారు. వరిలో 20,000 మంది మలేరియా, ఇంకా ఎల్లోఫీవర్ లతో బాధపడి చనిపోయారు.

కుడి ఎడమల తేడా

మన శరీరంలో కుడి, ఎడమల్లో, వుండే ఒకే రకం అవయవాల్లో ఒకటి పెద్దదిగాను మరొకటి చిన్నదిగాను వుండదు. ఉదాహరణకు ఒక కన్ను పెద్దగాను మరొక కన్ను చిన్నగాను వుండదు. అలాగే చేతులు, చెంపలు వంటి వాటన్నింటికీ ఇది వర్తిస్తుంది. అయితే ఊపిరితిత్తుల విషయానికి వస్తే మాత్రం మన కూడా ఊపిరితిత్తుల కన్నా ఎడమ ఊపిరితిత్తి కొంచెం చిన్నగా వుంటుంది. ఇందుకు మూలకారణం గుండెకు తగినంత స్థలాన్ని వాడాల్సి రావడమే.

నాలుక ముద్రలు

వేలముద్రలు విషయంలోనూ, కనుపాపల విషయంలోనూ ఒక మనిషికీ మరొక మనిషికీ మద్య ఖచ్చితమైన తేడా ఉన్నట్లే నాలుక ముద్రల్లోనూ తేడా ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి నాలుకు ముద్ర ఎంతో కొంత ప్రత్యేకతని కలిగి వుంటుంది.

ఏకకణ జీవిగా

తల, కళ్ళు, చేతులు, ఇంకా అలాంటి శరీరావయవాలు ఏమి లేని అమీబా లాంటి ఏకకణ జీవుల గురించి మీకు తెలిసిందే కదా. మనం కూడా అంటే మనలోని ప్రతి ఒక్కరం కూడా ఒకానొక దశలో అలాంటి ఏకకణంగా కొంత సమయం పాటు మనుగడ సాగిస్తాము. తల్లిగర్భంలో ప్రాణం పోసుకున్న తరువాత, ప్రతి మనిషి సుమారు ఒక అరగంట పాటు ఏకకణంగానే తన మనుగడను కొనసాగిస్తాడు.

కొయ్య ఫిల్టరులతో నీటిశుద్ధి

కొయ్య తో ఒక సరికొత ప్రేయజొన్నా అమెరికాలోని మేరీలాండ్ యనివారింటి ఇంజినీర్లు కనుగొన్నారు. వీరిలో ఒకరు మన భారతీయడ. వరాజాలలోంచి హనానికరమున లాడే, కాపర్ వంటి భారలో హాలను కొయ్యతో చేసిన ఫిల్టరులూతో తాగించావొచ్చునని, వర్థి జలాలు సమస ఉన్న పాథలోని పరిశమలకు ఈ టెక్నాలజీ ఉపయోగించందుకు కృష్ణ చదడియాలో నాన బట్టి పరిశోధనలో చైశారు. భారలో హాలతో కలుషితమున నీటిని వేడిల్లీని భా కొన్ని చొక్కలు కలిపేత నీలంరంగు వస్తుంది. ఈ నీటిని కోయాఫిల్టర్ గుండా పోనిస్త కలిషుంలోని కొయ్య తలిగిస్తుంది. శుద్ధమున నీరు బయటకు వస్తుంది.

మేలుకణ చికిత్సలో కృతిమ మూలకణం

మూలకణం చికిత్సలో మరుగున ఫలితాలను సాధించే  క్రమంలో కృతిమ మలుకాణంలను అభివుదీ చేసినట్లు నార్త్ కోరాలిని, జెన్ యానివేరిటెలకు చెందిన శాస్త్రవేత్తలు తలియజేశారు. సమాజ మూలకణాలతో పోలీస్ ఈ కృతిమ మూలకణాలతో ఏకువ ప్రయోజనం ఉంటుందినారు. సమాజ మూలకణాలను శరీరంలో ప్రవేశపెట్టినపుడు వాడినిరోధక వ్హవస్ది తరిస్కరించా  ముప్పు ఉందనీ దేనివల్ల కణితి పెరుగుదలకు ఈ మూలకణాలు తొడడే అవకాశం ఉండినారు. కృతిమ మూలకణాలు వాలా అటువంటి  ముప్పు ఉండవని వారు తలియజెశారు.

నానో  ఎరువులతో మరో హరితవిప్లవం

ఇది వ్వవసాయరంగంలో గొప్ప పరిశోధన. న మళ్ళీ మళ్ళీ ఎరువుల వేస్తూ ఏకువ  ఖర్చులతో కుదలువతున రైతునులకు ఉరటనిచ్చా విషయం. ప్రస్తుతం పంటల దిగుబడి పంచేందుకు ఏకువ వాతడితో యారియా  వంటి ఎరువులు వాడుతున్నారు. అయితే, ఎరువులు వాడకున్న చాలావరకు తాగిస్తూనే మరింత ఏకువ దిగుబడిని  సాధించేలా శ్రీలంక ఇన్సెంటిటి అప్ నానో టెక్నాలజీ శాస్త్రవేత్తల నాది పలికారు. ఎరువులోని సారైనా భువి సామర్ధ్వతగా ఉపయోగించుకునేలా 'నానో ఎరువు' లను తయారు చైశారు. ఇవి ఎరువుల వయాని తాగించడంతో పాట, పర్యవెర్నాహతంగా కూడా పనిచేస్తాయి. వరసాగాలో మన రైతలు యరియని ఎక్కువగా వాడుతారు. ఇది వేగంగా నీటిలో కరిగి అమ్మనేయగా వచ్చినమవుతోంది. దేంతో వరిపాలలో మరియా వేయగానే ఎక్కువభాగం అమ్మనియా రూపతో నీటిలో కొట్టుకపోతుంది, దీని వల్ల పర్యావరణానికి  హాని కలగడంతో పాట కాలవల్లో గూర్పడక వంటివి పెరిగిపోతాయి. ఈ ఇబందిని అడిగావంచందుకు యారియాన నానో కణ పదార్థంతో పూటపూస్తార. దేంతో మరియా నీటిలో కరిగే వేగం చాలా రేట్లు తగి అందులో పోషకాలు బావిలోకి చేరుతాయి. మళ్ళీ మళ్ళీ ఎరవులు వేయాలిన్స్ అవసరం సగానికి తాగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక కాఫికి పాలగుళికలు

పాలు విరిగిపోవడం అనే సమస్యకు ఇక గుడ్ బై చెప్పి ఇంచక్కా పాల గుళికలతో కాఫీ లేదా టి తాయారు చేసుకోవచ్చు. ఈ పాల గుళికలు పంచదార బిళ్లల్లాగా వేడి ద్రవాల్లో కరిగి పోతాయి. ఒక స్పటికపొర ఒక గొట్టంలాగా పాలని పట్టి ఉంచుతుంది. ఈ గొట్టం లో పంచదారతో కలిసిన పాటు ఘనీకృతమై ఉంటాయి. ప్రస్తుతం బాగా తియ్యని, తక్కువ తియ్యని రకాలుగా ఈ పాలగుళికలు లభిస్తున్నాయి. ముందు ముందు పంచధారలేని పాలగుళికలను తాయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్సిటీ కి చెందిన మార్తా వెల్ నర్ చెప్పారు.

మన దేశంలో సంపూర్ణ సూర్య గ్రహణం కోసం మరో 17 ఏళ్ళు ఆగాల్సిందే

ఈ ఏడాది అగస్ట్ 21 సోమవారం నాడు అమెరికాలో 99 సవత్సరాల తరువాత మళ్ళీ సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. మొత్తం 160 సెకండ్ల పటు చంద్రబింబం సూర్యబింబాన్ని పూర్తిగా కప్పివేసింది. తిరిగి అమెరికాలో 2024 ఏప్రిల్ లో ఇది సంభవిస్తుంది. మన దేశంలో 2034 మార్చ్ 20 న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. 2019 డిసెంబర్ 26న ఒక కంకణకర (annular) సూర్యగ్రహణం దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది. 2021 జూన్ 21 న సూర్యగ్రహణం ఢిల్లీ లోను, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది.

మన దేశంలో మెట్టమెదటి హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్

ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచిన హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు స్పెటెమ్బెర్ 14 ,2017 న భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షాంజో అబే శంఖుస్థాపన చేసారు. ఈ ట్రైన్ 508 కి. మీ దూరాన్ని సుమారు 2 గంటల్లో ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో 21 కి. మీ సొరంగ మార్గం గూడా ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది. ఇందులో 7కి. మీ సముద్రం అడుగున ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ 2022 , అగస్ట్ 15 నాటికీ సిద్ధం అయ్యేలా లక్షాన్ని నిర్ణయంచారు. మొత్తం బడ్జెట్ అంచనా సుమారు 110 వేల కోట్లు. ఇదే మొత్తంలో దేశంలో మొత్తం ప్రధాన పట్టణాలలో విమానాశ్రయాలు నిర్మిస్తే గంటలోనే అతితక్కువ (బుల్లెట్ ట్రైన్ టికెట్ కాన చావకగా) టికెట్ లో విమాన ప్రయాణం చేయొచ్చునని కొందరంటున్నారు.

భూమిని ప్లాస్టిక్ గోళంగా మార్చేస్తున్నాం

ఈ రోజుల్లో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిది. మనం వాడుతున్న ప్లాస్టిక్ లో చాల వరకు భూమిలో కరిగిపోవడం లేదు. చెత్తగా పారేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కలిసిపోయేందుకు కొన్ని వేల సవత్సరాలు కూడా పట్టవచ్చు. ఈ విపరీత పరిణామాల కారణంగా భూమి ప్లాస్టిక్ గోళంగా మారిపోతుందని అమెరికాలో జార్జియా యూనివర్సిటీ ఓ అధ్యనం లో తేల్చింది. 1950 నుంచి 2015 వరకు ప్రపంచ వ్యాప్తంగా 830 కోటన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయేది. ఇందులో 630 కోట్లటన్నుల ప్లాస్టిక్ చెత్త రూపంలో భూమి మీద పేరుకుపోయిన్ది ప్లాస్టిక్ చెత్త లో 9 శాతాన్ని రీసైక్లింగ్ చేయగా, 12 శాతాన్ని కాల్చివేశారు ( incinerated ). అంటే వృధాగా ప్లాస్టిక్ లో 79 శాతం గోతుల్లో ( land fills ) ను పర్యావరణంలోను పేరుకుపోయి కలుషాన్ని కలిగిపోయేది. ధోరణి ఇలాగె కొనసాగితే 2050 నాటికీ 1200 కోట్ల ప్లాస్టిక్ చెత్త పోగుపడిపోతుందని , ఈ ప్రమాదాన్ని దృష్టి లో పెట్టుకుని మనం వాడే ప్లాస్టిక్ వస్తువులు , చెత్త యాజమాన్య పద్దతులను గురించి తీవ్రంగా ఆలోచించి జార్జియా యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫిసర్ జెన్నా జాంబెక్ పేరుకొన్నారు

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate