অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అసిమా చటర్జీ

అసిమా చటర్జీ

అసిమా చటర్జీ సెప్టెంబర్ 23, 1917 లో జన్మించింది. భారతదేశంలో సైన్సులో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయ మహిళలో ఒకరు.ఔషధ మొక్కల ప్రాముఖ్యతతను ప్రపంచ దృష్టికి తీసుకొచ్చారు. ఆమె బాల్యం నుండి స్వర సంగీతంలో ఆసక్తి కలిగి ఉంది. ఆమె భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రత్యేక శిక్షణ పొంది ఈ రంగంలో కూడా అనేక పురస్కారాలు అందుకుంది.

ఆమె చిన్న సోదరుడు సర్వశిరంజన్ ముఖర్జీ తాను ప్రఖ్యాతలు గల శాస్త్ర చికిత్స నిపుణులు . ఔషధ మొక్కలపై ఆమె చేసే పరిశోధనలో తన వంతు సహకారం అందించారు. అసిమా గారి తండ్రి కూడా వృక్షశాస్త్రం పై మక్కువ ఉండేది. ఆమె 1936 లో కలకత్తా విద్యాలయం యొక్క స్కాటిష్ చర్చి కాలేజీ నుండి కెమిస్ట్రీలో తన ఎడ్యుకేషన్ పూర్తి చేసారు.ఆమె 1938 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీని పొందింది. 1944 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో డాక్టరో ఆఫ్ సైన్స్ పట్టా పొందిన రెండవ మహిళా. ఆమె సహజ ఉత్పత్తుల కెమిస్ట్రీ (Natural  Products Chemistry ) లో పరిశోధన చేసారు. అతి ముఖ్యనగ మలేరియా మరియు కీమోథెరపీలకు ఔషధాలను అభివృద్ధి చేశారు. ఆమె మార్సిలీయ మినుట అనే మొక్క నుండి అభివృద్ధి పరిచిన ఎపిలెప్టిక్ ఔషధం అయిన ఆయుష్ -౫౬' అత్యంత విజయవంతమైంది.

చటర్జీ గారు రచించిన దాదాపు 400 కు పైగా పరిశోధన పత్రాలు జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమైనవి. ఆమెకు ఆల్కలాయిడ్స్ అనే సమ్మేళనాల పరిశోధనలకే దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. కాన్సర్ రోగ కానాల నివరకు వాడే కీమోథెరపీ సమయంలో ఈ ఆల్కలాయిడ్స్ సమర్థవంతంగా ఉపయోగపడతాయని తెలియజేసారు. ఒక స్థానిక జాతికి చెందిన 'బెల్ ' చెట్టు కొమరం (coumarin ) ని రసాయనికంగా విశ్లేషించింది. భారతదేశంలోని ఈ చెట్టు యొక్క పండ్లు మరియు బెఱగులతో వివిధ జీర్ణశయాంతర రుగ్మతలను చికిత్స చేశారు.

ఆమె కలకత్తా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ సైన్స్ 1954 లో రసాయనశాస్త్రంలో రీడర్గా చేరింది. ఆమె పొందిన విజయాలను గుర్తించి, కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెను 'ప్రేమ్ చంద్ రాయచంద్ స్కాలర్' గ మరియు 'ఖైదా ప్రొఫెస్సర్ ఆఫ్ కెమిస్ట్రీ' గా 1962-1982 నియమించింది.

న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా ఆమె 1960 లో ఎంపికైంది. 1961 లో CSIR నుండి ప్రఖ్యాత స్కిన్స్ అవార్డు, "శాంతి స్వరూప్ భట్నాగర్" బహుమతి పొందిన మొదటి మొదటి మహిళా గ్రహీతగా గుర్తింపు పొందింది. అసిమా ఫైటో మెడిసిన్ (చికిత్స కోసం మొక్కల పదార్థాలు అధ్యనంలో అవార్డును గెలుచుకుంది. మరో మహిళకు అదే బహుమతని గెలుచుకోవడానికి 14 సంవత్సరాలు, 'రాసాడాయన శాస్త్ర ' విభాగంలో విజయం సాధించడానికి 48 ఏళ్ళు పట్టింది.

1972 లో యూనివస్ర్టీ గ్రాంట్స్ కమీషనర్ మంజూరు చేసిన సహజ ఉత్పత్తి కెమిస్ట్రీ లో (Natural Product  Chemistry ) భోదన మరియు పరిశోధన తీవ్రతరం చేయడానికి గౌరవ సమన్వాయకర్తగా నియమించబడ్డారు. 1975 లో ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేయబడింది.

ఆమె ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యొక్క జనరల్ ప్రెసిడెంటుగా ఎన్నికైన మొట్టమొదట మహిళా శాస్త్రవేత్తగా కూడా గుర్తింపు పొందింది. ఫిబ్రవరి 1982 నుండి మే 1990 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఆమె నవంబర్ 22 ,2006 న మరణించింది

ఆధారము: చెకుముకి© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate