పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వెరా రూబిన్

వెరా రూబిన్

సైన్సులో ఒకోసారి గొప్పముందడుగు పడుతుంది. కఠోరమైన దీక్ష, కృషి లేక బుద్ధికుశలత వలన , లేదంటే బుద్ది, కృషి రెండింటి మేళవింపుతో చేసే విశ్లేషణ వలన ఈ ముందంజ సాధ్యమవుతుంది. వెరా రూబిన్ విషయంలో రెండవదే  జరిగింది. ఆనాటికి అందుబాటులో వున్నా గెలాక్సీల సమాచారాన్ని ఆధారం చేసుకొని గొప్ప సూత్రీకరణ చేసింది. గెలాక్సీల సమతల భ్రమణంలో వంపు (Flat Rotation Curve )నుకనిపెట్టింది. విశ్వాన్ని అవగాహనా చేసుకోవటంలో ఇదో గొప్ప ముందడగు. ఎదైనా పదార్థం దానిపై కాంతి పాడినప్పుడు అది వికరణం చెందటం వలననే మంకు గోచరిస్తుంది. మనకు కనిపించేదే ప్రపంచం అనుకుంటాం! కాంతి వికరణం చెందని పదార్థం (అందుకే దీన్ని కృష్ణ పదార్థం అన్నారు ) ఈ విశ్వంలో ఒకటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు శతాబ్దాల క్రితమే అనుమానించారు. 1970 వ దశకంలో ప్రతిభావంతులురాలైన ఒక యువ మహిళా శాస్త్రవెత్త కృష్ణపదార్థ వునికిపై తిరుగులేని సంఖ్యలు చూపించింది. ఆమె వెరా కూపర్ రూబిన్. వెరా పరిశోధనల మూలంగానే విశ్వంలో అత్యధిక భాగం కృష్ణ పదార్థం (Dark Mark ) తోనే నిండి ఉంటుందని తెలిసింది. అప్పటివరకూ మనం సర్వస్వం అనుకునే కనిపించే భాగం కేవలం 10 శాతం లోపేనని విశిదమైంది.

సైన్సులో ఒకోసారి గొప్పముందడుగు పడుతుంది. కఠోరమైన దీక్ష, కృషి లేక బుద్ధికుశలత వలన , లేదంటే బుద్ది, కృషి రెండింటి మేళవింపుతో చేసే విశ్లేషణ వలన ఈ ముందంజ సాధ్యమవుతుంది. వెరా రూబిన్ విషయంలో రెండవదే  జరిగింది. ఆనాటికి అందుబాటులో వున్నా గెలాక్సీల సమాచారాన్ని ఆధారం చేసుకొని గొప్ప సూత్రీకరణ చేసింది. గెలాక్సీల సమతల భ్రమణంలో వంపు (Flat Rotation Curve )నుకనిపెట్టింది. విశ్వాన్ని అవగాహనా చేసుకోవటంలో ఇదో గొప్ప ముందడగు. ఎదైనా పదార్థం దానిపై కాంతి పాడినప్పుడు అది వికరణం చెందటం వలననే మంకు గోచరిస్తుంది. మనకు కనిపించేదే ప్రపంచం అనుకుంటాం! కాంతి వికరణం చెందని పదార్థం (అందుకే దీన్ని కృష్ణ పదార్థం అన్నారు ) ఈ విశ్వంలో ఒకటుందని ఖగోళ శాస్త్రజ్ఞులు శతాబ్దాల క్రితమే అనుమానించారు. 1970 వ దశకంలో ప్రతిభావంతులురాలైన ఒక యువ మహిళా శాస్త్రవెత్త కృష్ణపదార్థ వునికిపై తిరుగులేని సంఖ్యలు చూపించింది. ఆమె వెరా కూపర్ రూబిన్. వెరా పరిశోధనల మూలంగానే విశ్వంలో అత్యధిక భాగం కృష్ణ పదార్థం (Dark Mark ) తోనే నిండి ఉంటుందని తెలిసింది. అప్పటివరకూ మనం సర్వస్వం అనుకునే కనిపించే భాగం కేవలం 10 శాతం లోపేనని విశిదమైంది.

వెరా ఫ్లోరెన్స్ కూపర్ 1928  లో రోజ్ యాపిల్  బౌమ్, పీటర్ కూపర్ అనే యూదు దంపతులకు అమెరికాలోని ఫీల్డెల్ఫీయాలోజన్మించి వారి ఇద్దరు పిల్లల్లో వెరా రెండవది. వెరా బాల్యం ఆర్ధిక మహామండ కాలంలో గడిచింది. ఆ కష్టకాలంలో ఆమె తాతలు, మామలు, అత్తలు, తోహుట్టువులు మధ్య పెరిగింది. నటి ఆర్ధిక పరిస్థితుల్లో ఆమె చదువు అంతంత మాత్రంగానే సాగింది. రాబర్ట్ రూబిన్ తో ఆమె వివాహం పెద్దలు కుదిర్చిన పెళ్లి. వారిదొక అన్యోన్య జంట. రాబర్ట్ ఆమెను ప్రోత్సహించి మరి పై చదువుల కోసం జార్జితను యూనివర్సిటీలో చేర్పించారు.రాబర్ట్ రూబిన్ కూడా గొప్ప నోబెల్ భౌతికశాస్తవేత్తలు రిచర్డ్ ఫేన్ మూన్ హన్స్ బేతే, ఫిలిప్ మెర్రిసన్, సంభావ్యత సిద్ధాంతకర్త మార్క్ కక్ ల విద్యార్థి. మరో నోబెల్ శాస్త్రవేత్త పీటర్ డెభై (Peter  Debye  ) మార్గదర్శిగా 1951 లో పి.హెచ్ . డి. చేసి, జీవశాస్త్రాన్ని స్వయంగా  నేర్చుకొని జాతీయ ఆరోగ్య సంస్థ (NIH)లో  చేరిన ప్రతిభాశాలి వెరా భర్త రూబిన్.

వెరా కాలేజీ చదువుకు జార్జిటౌను యూనివర్సిటీని ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి కోర్సులు రాత్రి పూత జరగటం రెండు ఆ ప్రాంతంలో ఖగోళశాస్త్రంలో డాక్టరేట్ చేసి అవకాశమున్న యూనివెర్సిసిటీ  కూడా  అదొక్కటే కావటం. కాలేజీలో చేరే నాటికీ ఆమె గర్భవతి, కారు నడపలేని పరిస్థితి. వారంలో 2 రోజులు కాలేజీకి వెళ్తూ 1952-1954 మధ్య డిగ్రీ పూర్తిచేసింది. అమెరికా, చీలి దేశాల్లో లభించి మంచి టెలిస్కోపులు, పరిశోధన సౌకర్యాలు, ఆయా రంగాల్లో పేరుగాంచిన మంచి ప్రొఫెసర్లు ఆ యూనివెర్సిసిటీ వెఱకు లభించారు.

హబుల్ నియత మార్గం నుండి గెలాక్సీల గమనంలో వచ్చే విచలనం గురించి వెరా 1951 లో తన పోస్ట్ గాడ్ర్యూయేషన్  సిద్ధాంత వ్యాసం (థీసిస్ ) రాసింది. జార్జిగామౌ (George  Gamow) మార్గదశ్రకత్వంలో వెరా పాలపుంతల (గెలాక్సీల ) విస్తరణపై పరిశోధించి, గెలాక్సీలు సమానంగా విస్తరించక ఒక దానితో ఒకటి ముద్దలా ఏర్పడతాయని తేల్చి చెప్పింది. ఈ సత్యాన్ని 1954 లో తన పి. హెచ్. డి సిద్ధాంత వ్యాసంలోని  చెప్పిన శాస్త్ర ప్రపంచం విశ్వం మహానిర్మాణంపై 1970 వ దశకం వరకు సృష్టిసారించలేదు. పాలపుంతలు ముద్దలుగా వుండటానికి, హబుల్ నియతమార్గం నుండి గెలాక్సీల సంచలనానికి మధ్య సంభందం ఉందన్న సత్యాన్ని ఆమె సిద్ధాంతీకరించింది. ఈ గొప్ప పరిశోధనకు మెచ్చి జార్జిటౌను యూనివర్సిసిటీ ఆమెకు ఉద్యోగం ఇచ్చింది. ఒక దశాబ్దానికి పైగా వెరా ఇక్కడ పనిచేసింది. గెలాక్సీల కేంద్రానికి దూరంగా వుండే నక్షత్రాలపై అప్పటికే అందుబాటులో వున్నా సమాచారం ఆధారంగా తన ఖగోళగణంకా శాస్త్ర ( Statistical Astronomy ) విద్యార్థులతో కలిసి 1962 లో పాలపుంత గెలాక్సీ (Milk Way Galaxy ) సమతల భ్రమణంలో వంపును కనిపెట్టింది. కానీ శాస్త్ర సమాజం ఆ లెక్కలు సరికావని ఒప్పుకోలేదు. దీనితో థానే స్వయంగా రంగంలోకి దిగి పరిశీలించాలని నిశ్చయించుకుని 1965 లో ఈ ఉద్యోగాన్ని వదిలేసి వాషింగ్టన్ లోని కార్నెగీ సంస్థకు చెందిన టెర్రేస్ట్రియల్ మాగ్నెటిజం డిపార్టుమెంటు (DTM ) లో చేరింది. అప్పటివరకు  ఆ సంస్థలో అందరు మగవాళ్లే. వెరనే తొలి మహిళా. ఇది రాబర్టురూబిన్ పనిచేసే చోటుకు దగ్గర కూడా. మధ్యాహ్నం మూడున్నరకు పిల్లలు స్కూలు నుండి ఇంటికి వచ్చే వరకు కేవలం మూడోవంతు జేతనికే అక్కడ పనిచేసింది. కెంట్ ఫోర్ట్ అనే శాస్త్రవెత్త DTM లో తక్కువ పరిశీలన కాలంలో నాకష్టాలను వీక్షించే పరికరాలను రూపొందించడంలో దిట్ట. వెఱకు కూడా గెలాక్సీలపై కొత్త సమాచారం కావాలి. వీరిద్దరూ కలిసి డజన్ల కొద్దీ పాక్షిక నక్షత్రాలు, గెలాక్సీలు, రేడియో గెలాక్సీలు, లేత నీలిరంగు వస్తువులు, గ్రహనెబ్యులాల వర్ణపటాలను (Spectra ) సంపాదించారు. ఎనిమిది పరిశోధన వ్యాసాలు రాశారు. అప్పటికే విశ్వంలో వున్నా విశాల చలానాలు (Large Scale Motion ) అధ్యయనంపై పోటీ పెరిగింది వెఱకు పోటీ లేని వాతావరణం ఇష్టం. అందుకే ఆమె దగ్గరలో వుండే

ఆండ్రోమెడా గెలాక్సీ

పరిశోధనల ఆరంభంలోనే అరిజోనా నావెల్ అబ్జార్వేటరీ టెలిస్కోపు నుండి ఎముకలు కరిగే చలిలో (-20 C ) రాత్రిళ్ళు పరిశీలనలు చేపట్టింది. అనుకున్న ఫలితాలు రాలేదని కొంత నిరుత్సాహపడింది. కారు చీకటిలో కాంతిరేఖల గెరాల్డ్ క్రోన్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు వారికీ ఆశికిరణంలా కనిపించాడు. ఆయన 1940 వ దశకంలో వాల్టర్ బాడ్ తీసిన ఆండ్రోమెడా అద్భుత చిత్రాలను వెఱకు చూపించాడు. ఒక్కోదాంట్లో మూడు మార్గదర్శి నక్షత్రాలను, ఉద్గార ప్రాంతాలను వెరా ఉజ్జాయింపుగా గుర్తించి కిటీపిక్, లోవెల్ అబ్జార్వేటరీల నుండి పరిశీలనలు చేసారు. టెలిస్కోపులు చూడలేని ఉద్గార ప్రాంతాల వర్ణపటాలను రికార్డు చేసారు. బలహీనమైన  కాంతిలో, చలితో గడ్డకట్టిన చేతులతో తీసిన వర్ణపతలు అద్భుతాన్నో అవిక్షరించించాయి. కనిపించని. (అదృశ్య ) ఉద్గార ప్రాంతాన్ని చూస్తున్న క్షేత్రం వర్ణ పట మధ్య కేంద్రంలో కనుగొన్నారు. టెలిస్కోపులో కనుపించని ఉద్గార ప్రాంతాలను, నక్షత్రాలను సైతం ఈ వర్ణపటాలు రికార్డు చేశాయి. ఆండ్రోమెడా గెలాక్సీలో కూడా ఈ పరిశోధన ద్వారా వెరా ఫోర్డులు సమతల భ్రమణపు వంపును కనుగొన్నారు. కేంద్రం నుండి వ్యాపార్థం పెరిగేకొద్దీ ద్రవ్యరాశి  పెరుగుతుందని లెక్కలుగట్టి మరి చెప్పారు. కృష్ణపదార్థం గెలాక్సీల అంతటా  వ్యాపించి దురంతో పాటు ద్రవ్యరాశి పెరుగుతూ, న్యూటన్ గమన సూత్రాలకు లోబడి ఉంటుందని ఈ పరిశోధనల ద్వారా చాటి చెప్పారు. అయినప్పటికీ కృష్ణపదార్థం (Dark Matter ) అంటే ఏమిటన్నది శేషప్రశ్నగానే  ఉండిపోయింది. పదార్థపు అధిక ద్రవ్యరాశి, కాంతి నిష్పత్తి కొత్త డైనమిక్స్ కు బాటలు వేస్తాయని సూచించినప్పటికీ వెరా పరిశీలనలను సీరియస్ గ తీసుకోలేదు. సాంప్రదాయక భూమ్యాకర్షణ సూత్రాలకులోబడిన కృష్ణ వస్తువు ప్రాముఖ్యాన్ని 1980 వ దశకానికి గాని గుర్తించలేకపోయారు. విశ్వకర్షణ (Cosmic Gravity ) అనే మౌలిక డిస్కవరీ మానవజాతి చరిత్రలో ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు.

తన పరిశోధనలు, సేకరించి సమాచారంపై వున్నా గట్టి నమ్మకంతో వెరా తన అధ్యయనాన్ని మరిన్ని సర్పిలాకార గాలక్సీ (Spiral  Galaxies ) ల పై కేంద్రీకరించింది. సమతల భ్రమణంలో వంపును నిలకగా అన్ని గెలాక్సీ ల్లోనూ నిరూపించి కృష్ణపదార్థం రహస్యాన్ని ఛేదించింది. కృష్ణపదార్థం శక్తి వికర్షణ బలం భూమ్యాకర్షణను తటస్థం  చేయటం ద్వారా విశ్వవ్యాపనన్ని వెగిపరుస్తుందన్న విషయాన్నీ 1998లో సూపర్ నోవా 1  రకం పై పరిశోధనాల్లో నిరూపించిన సల్పేర్లమట్టర్, బ్రియంష్మిట్ , అదంరైసులకు 2011 లో భౌతికశాస్త్రానికిచ్చే నోబెల్ బహుమతిని ఇచ్చారు.  అదే  కృష్ణపదార్థానికి నోబెల్ బహుమానం ఇవ్వాలనుకుంటే వెరాకు అది ఏదో ఒకనాడు వచ్చి తీరుతుంది.

ఎన్నో అసాధారణ గేలక్సీలను పరిశోధించిన భ్రమణకు వంపులను కనుగొన్న వెరా రూబిన్ తో ఆమె కూతురు జుజిత్ రూబిన్ ఖగోళశాస్త్ర పరిశోధనలకు జతకట్టడం విశేషం. వెరా, జుడిత్, ఫోర్డుతో కలిసి గాలక్సీ ల విశ్వగమనం పై స్ధోదించి విశ్వవ్యాపనం ( Expansion  of  the University ) ఎనైసిట్రోఫిక్ (Anisotropic ) గ జరుగుతుందని చెప్పారు.దీన్నే శాస్త్రప్రపంచం రూబిన్ - ఫోర్డ్ - రూబిన్ (RFR  Effect ) ప్రభావంగా పిలుస్తారు. వ్యతిరేఖ దిశలో భ్రమణం చేసే నక్షత్రం డిస్కును వెరా తన 63 ఏళ్ళ వయసులో కనుగొంది. ఇలా వ్యతిరేక దిశలో భ్రమణంలో ఉండే గెలాక్సీలు అపురూపమైనవి. ద్రువచక్రపు (Polar  disk  ) గెలాక్సీలలో కేంద్రం నుండి సమానదూరంలో ఉండే నక్షత్రాల వెగం సమానంగా ఉంటుందని తెలిపింది. డిస్కులు విచ్చినం కాకుండా కలిసిపోవడం ద్రువచక్రాలు ఏర్పడటం , వ్యతిరేక దిశలో నక్షత్ర డిస్కులు త్రి అక్షసూన్యం (Triaxial  Halos ) లో కలిసిపోవటంలో వంటి ఎన్నో విశ్వరహస్యాలు వెరా రూబిన్ కనిపెట్టింది.

ఆమె ఎన్నో సంస్థలో (అమెరికన్ ఫిలోసోఫీకాలో సొసైటీ పాంటికల్ సైన్స్ అకాడమీ నేషనల్ సైన్స్ అకాడమీ) గౌరవ సభ్యురాలు. 1996  రాయల్ ఆస్ట్రానమీ బంగారు పథకాన్ని, 1993 లో అమెరికా సైన్స్ మెడల్ ను గెల్చుకుంది. జాతీయ సైన్స్ అకాడెమి ఎన్నికైన రెండవ మహిళా ఖగోళ శాస్త్రవెత్త వెరా రూబిన్.

ఆధారము;చెకుముకి

3.04615384615
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు