অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రవేత్తలు

శాస్త్రవేత్తలు

 1. జె.బి.ఎస్. హాల్డేన్
 2. నికోలస్ కోపర్మికస్
 3. శామ్యూల్ హానిమన్
 4. మేరీ క్యూరీ
 5. ఐజాక్ అసిమోవ్
 6. జహంగీర్ చక్రవర్తి
 7. హిపోక్రటిస్
 8. ప్రఫుల్ల చంద్ర రే (పి.సి.రే)
 9. చింతామమి నాగేశ రామచంద్రరావు
 10. జెరాల్డ్ డుర్రెల్
 11. జగదీశ చంద్ర బోస్
 12. రాజా జయసింగ్
 13. నికొలా టెస్తా
 14. డా. పి.యం. భార్గవ
 15. ఒట్టో వలాష్ (క్రీ.శ.1847 -1931)
 16. క్లాడిలూయిస్ బెర్తోలెట్
 17. ప్రవర్తనా మనస్తత్వ సిద్దాంతకర్త ఇవాన్ పావ్ లోవ్
 18. ప్రాణి మూలాన్ని తెలియజేసిన “ఫ్రాంసిస్ క్రిక్”
 19. ఫిలిప్ వారెన్, యాండెర్ సన్
 20. బీర్బల్ సహానీ ( 1891 – 1949 )
 21. బెకెసీ గియర్గాన్ (1899-1972)
 22. ఆల్ రజీ మహమ్మద్ (865 -925)
 23. మేరీక్యూరీ (1867 – 1934)
 24. లూయీ బ్రెయిలీ(1809 - 1852)
 25. పీటర్ అట్కిన్స్
 26. ఇ.జె.కోరీ
 27. అహ్మద్ హెచ్.జవాలి
 28. హామిల్టన్ స్మిత్
 29. వెర్నర్ ఆర్బర్
 30. అల్బెర్ట్ బ్రూస్ శాబిన్
 31. జోనస్ ఎడ్వర్డ్ సాక్
 32. కారీ ముల్లిస్
 33. జానకి అమ్మల్
 34. లిండా బక్
 35. డా. యం.యస్. స్వామినాథన్
 36. జేన్ మోరిస్ గూడాల్
 37. జాదవ్ పయేంగ్
 38. స్టీవెన్ ఛూ
 39. క్రిస్టియేన్ న్యూష్లైన్ – వోలార్డ్
 40. శ్రీనివాస రామానుజన్
 41. దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్
 42. భాస్కర – II (1114 – 1185)
 43. ఆర్యభట్ట
 44. హరీష్ చంద్ర
 45. శకుంతలా దేవి
 46. కె.స్. చంద్రశేఖరన్
 47. రాబర్ట్ హ్యుబర్
 48. స్టిఫెన్ హాకింగ్
 49. హరగోవింద్ ఖోరానా
 50. మేరియో మొలినా
 51. డా. రిచర్డ్ ఏచేర్
 52. సర్ విలియం ఓస్లర్
 53. జిన్ మేరీ లెన్
 54. పాల్ ఫ్లోరీ
 55. హరోల్డ్ క్రోటో
 56. ఫ్రెడరిక్ శాంగర్
 57. డేన్ షెట్మన్
 58. సి.ఎన్.ఆర్. రావు
 59. డాక్టర్ పి.కె.కె. నాయర్
 60. డా. రాజీవ్ వార్షినీ
 61. మేఘనాథ్ సాహా
 62. సత్యేంద్రనాధ్ బోస్
 63. జేమ్స్ ఎడ్వర్డ్ రాత్‌మన్
 64. ఆదా యోనాత్
 65. రామన్ ఫలితం
 66. ప్రొ. సత్యజిత్ మేయర్
 67. ఫ్రోంకోయిస్ బార్-సినోస్సి
 68. సర్ జగదీష్ చంద్రబోస్
 69. పి. సి. మహాలనోబిస్
 70. సర్ ఉపేంద్రనాధ్ బ్రహ్మచారి
 71. సలీం అలీ
 72. భారత వ్యవసాయానికి మార్గదర్శి డా. వై. యల్. నీనే
 73. డాక్టర్ జాక్వేలిన్ కె. బార్టన్
 74. మిల్ రెడ్ డ్రెస్ ల్ హవుస్
 75. పి.యల్. భట్నాగర్
 76. డా. యం.పి పరమేశ్వరన్
 77. డా. సంజయ రాజారం
 78. సంజీవయ్య శర్మ
 79. ఎలిజబెత్ హెలెన్ బ్లాక్ బర్న్
 80. నాన్సి క్రేస్
 81. సి.వి. రామన్
 82. షిన్యాయమనాకా
 83. పాలపుంతల రహస్యాలు కనిపెట్టిన డా. సాండ్రామూర్ ఫేబర్
 84. సి.ఆర్. రావు
 85. గోవింద్ స్వరూప్
 86. శాస్త్రీయ స్పృహ మానవత మేళవించిన విజ్ఞాన స్పటికం ప్రొ. యం. విజయన్
 87. సైంటిఫిక్ టెంపర్ కు (శాస్త్రీయ దృక్పధం) నిలువెత్తు రూపం పద్మభూషణ్ డా.పి.ఎం.భార్గవ
 88. తు యుయు
 89. ఆల్బర్ట్ ఇన్ స్టీన్
 90. డా. రఘునాథ్ ఎ. మషేల్కర్
 91. పద్మశ్రీ డా. లాల్జీసింగ్
 92. అబ్దుల్ కలాం
 93. డా. మాధవ్ గాడ్గిల్
 94. డా. బారీ మార్షల్
 95. జోన్ లుబిషెంకో
 96. సి.వి.యస్.
 97. రోమ్యులస్ వైటేకర్
 98. ధామస్ ఆల్వా ఎడిసన్
 99. గెలీలియో
 100. డా. రుక్మాబాయి
 101. హైపేషియా

జె.బి.ఎస్. హాల్డేన్

haldenజె.బి.ఎస్. హాల్డేన్ ప్రపంచ ప్రజలందరికీ ఎంతో సుపరిచితమైనవారు. బహూముఖ ప్రజ్ఞావంతుడిగా శాస్త్ర రంగంలో ఒక ప్రత్యేక స్ధానాన్ని అలంకరించిన వ్యక్తి హాల్డేన్. చిన్నప్పటినుండీ ఈయనకు పరిసోదించే తత్వం చాల ఎక్కువుగా వుండేది.

ఆక్స్ ఫర్డ్ లో నవంబర్ 5, 1892 జె. బి.యస్ హాల్డేన్ జన్నించాడు. అయిదేళ్ళు ప్రాయం నుంచే తండ్రి చేసే ప్రయోగాల పట్ల ఆసక్తి చూపేవాడు. ఎనిమిదేళ్ళ వయస్సులోనే తండ్రితో పాటు లోతైన గనులోకి దిగి పరిశీలనలు చేసేవాడు. హాల్డేన్ ఎన్నో బాషలు నేర్చుకోన్నాడు. గణితంలో ఈయన మంచి ప్రతిభాశాలి. 16 ఏళ్ళ వయస్సులోనే రస్సల్ బహుమతి పోందాడు. హాల్డేన్ ప్రాధమిక విద్యాభ్యాసం హ్యుమానిటీస్ లతో గడించింది. ఈయనకు సైస్స్ పై మక్కువ కలగడం చాలా చిత్రంగాతోస్తుంది. 1922లో ఈయన కేంబ్రిడ్జిలో చేరి బయోకెమిస్ట్రీలో పరిశోధన చేశారు. 1925 నాటికి హాల్డేన్ జన్యు శాస్త్రంలో పరిశోధనలు చేపట్టాడు. వంశపారంపర్య లక్షణం. వైవిధ్యం అంశాలకు సంబంధించి ఈయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 1932లో ఈయనను ఫెలో అఫ్ ది రాయల్ సోసైటీగా ఎన్నుకోన్నారు. ఈయన పరిసోధనలు చేయని రంగమంటూ లేదు. ఫిజియాలజీ, మెడిసిన్, బయోకెమీస్ట్రీ, జెనీటిక్స్, కాస్మోలజీ, స్టాటిస్టిక్స్, గణితం వీటిన్నిటిలో ఆయనకు తిరుగులేని పాటవం వండేది. హాల్డేన్ పాపులర్ సైస్సు రచయిత కూడా, సైస్సు అంటే ఏమిటి, సామాన్యుడికి సైస్సుకు ఉన్న సంబంధ ఏమిటి సమాజ వికాసం సైస్సు వల్ల ఎలా సాధ్యం అందుకెవరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై అందరికీ అర్ధమయ్యేలా రాసేవాడు. ఈయన రాసిన పుస్తకాలలో ది కాజెస్ ఆఫ్ ఎవల్యూషన్, వాటీస్ లైఫ్, సైస్స్ అండ్ ఎథిక్స్ చెప్పుకోదగ్గవి. పిల్లల కోసం ఈయన రాసిన మై ఫ్రండ్ మిస్టరీ లీకీ. అనే పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. భారత దేశం పట్స భాకతీయ తత్వ శాస్త్రం పట్ల ఈయనకు మక్కువ ఎక్కువ. 1957 లో యునైటెడ్ కింగ్ డమ్ వదలి భారతదేశం వచ్చి భువనేశ్వ్ లోని జెన్ టిక్స్ అండ్ బయోమెట్రి లేబొరేటరీకి డైరెక్టర్ కాగలిగాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి హాల్డెన్ భువనేశ్వర్ లో 71 ఏళ్ళ వయస్సులో మరణించాడు. విజ్ఞాన శాస్త్ర రంగంలో ధృవతారగా మిగిలిపోయాడు.

నికోలస్ కోపర్మికస్

nicholasనేడు మనం, విజ్ఞాన శాస్త్రపు వెలుగులో అనేక నమ్మకాలను ప్రశ్నించి, చర్పించి, వాటిలోని నిజాలను నిగ్గుదేలుస్తున్నాం. కాని మధ్య యుగాలలోని ప్రజల జీవన విధానాలను మతాధికారులు శాసించేవారు. ఆనాటి మత గ్రంథాలకు వ్యతిరేకంగా నోరు విప్పే స్వేచ్ఛ ఏ ఒక్కరికీ లేదు.

భూమి కేంద్రంగా సూర్యుడు, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనే, భూకేంద్ర సిద్ధాంతాన్ని టాలెమి అనే గ్రీకు పండితుడు ప్రతిపాదిస్తే 1400 సంవత్సరాల పాటు ప్రజలు దాన్ని నమ్మారు. నిజానికి ఈ సిద్ధాంతం తప్పు. విజ్ఞానులు తప్పును ఎలా అంగీకరిస్తారు? అలాంటి తప్పుని ధైర్యంగా ప్రశ్నించి, పరిశీలించి, నిరూపించి సఫలుడైన విజ్ఞాని ధీశాలి నికోలస్ కోపర్నికస్.

పోలండ్ దేశంలోని తాడ్ని పట్టణంలో 1473 ఫిబ్రవరి 19వ నికోలస్ కొపర్నికస్ జన్నించాడు. గణితం న్యాయ వేద్య శాస్త్రాలకు పోలండ్, ఇటలీలలో అభ్యసించాడు. రోమ్ విశ్వ విద్యాలయంలో గణిత శాస్త్రాచార్యుడిగా కొన్నాళ్ళు పనిచేశారు.

ఫ్రోయన్ బర్గ్ అనే చోట క్రైస్తవ పీఠానికి అధిపతిగా నియమించబడి జీవిత పర్యంతం అక్కడే వున్నాడు. గణిత న్యాయవైద్య శాస్త్రాలు చదివినా, ఖగోళ విజ్ఞానంపై దృష్టి మళ్ళించాడు. ప్రాచీనులు రాసిన ఖగోళ శాస్త్ర విషయాలను, చదివి ఆకళింపు చేసుకున్నాడు.

తన గది గోడలకు రంధ్రాలు చేసి ఖగోళాన్ని పరిశీలించేవాడు. ఒకరోజు కుజగ్రహాన్ని పరిశీలిస్తుండగా దాని కాంతిలో వ్యాత్యాసాలున్నట్లనిపించింది. కారణాన్ని అన్వేషించి తనకున్న అపార గణితశాస్త్ర పరిజ్ఞానంతో భూకేంద్ర సిద్ధాంతం తప్పని నిశ్ఛయించుకున్నాడు.

కొపర్నికస్ ఎన్నో సంవత్సరాలు శ్రమపడి తన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. విశ్వానికి కేంద్ర స్థానంలో సూర్యుడు స్థిరంగా వున్నాడనేది కోపర్నికస్ సిద్ధాంతపు కీలకాంశం. సూర్యుని చుట్టూ నియమిత వర్తులమార్గాలలో బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గురుడు, శని క్రమంగా తిరుగుతాయన్నాడు.

అప్పటి పరిస్థితులు రీత్యా తన సిద్ధాంతాన్ని ప్రచురించడానికి కోపర్నికస్ భయపడ్డాడు. చివరికి 1543 లో కోపర్నికస్ అవసాన దశలో ఆయన శిష్యుడు ఆ సిద్ధాంతాన్ని ప్రచురించాడు. 1609 లో గెలీలియో దూరదర్శిని కనిపెట్టాక కోపర్నకస్ సిద్ధాంతం జనబాహుళ్యంలో విస్తారంగా వ్యాపించింది.

శామ్యూల్ హానిమన్

samuelప్రతి మందుకీ కొన్ని రోగ లక్షణాలను కలిగించే శక్తి వుంటుంది. అటువంటి రోగలక్షణాలు ఉన్న రోగికి అదే మందుని ఇచ్చి ఆ వ్యాధిని నివారించవచ్చునని హోమియోపతి చెబుతుంది. దీనినే సారూప్య చికిత్సా సూత్రం అంటారు.

హోమియో వైద్య విధానాన్ని, హేతుబద్దమైన శాస్త్రంగా, ప్రయోగాలకు అనువైన కళగా తీర్చి దిద్దినవారు జర్మన్ విజ్ఞాన వేత్త శామ్యూల్ హానిమన్ నిరుపేద కుటుంబలో జన్నించిన పది భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. 1779 సంవత్సరంలో యం.డి. పట్టా పుచ్చుకున్న హానిమన్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి వైద్య సేవ చేయడం ప్రారంభించాడుం. అప్పట్లో వైద్య సేవా పద్ధతులు చాలా మొరటుగా వుండేది. రోగంతో కలిగే బాధకన్నా చికిత్స సంబంధ బాధలే ఎక్కువగా వుండేది. ఒకసారి రోగం నయం చచేయకున్నవారు మరలా మరలా అదే రోగంతో వచ్చేవారు. ఈ విషయాలు ఆయనతో సంతృప్తిని పెంచాయి.

హానిమన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి అనేక భాషలోని శాస్త్రం గంధ్రాలను జర్మనీ బాషలోకి అనువాదం చేయడం ప్రారంభించాడు. ఒక అనువాదం గ్రంధం “వస్తు గుణదీపిక” సింకోనా చెట్టు బెరడు గురించి సమాచారం ఉంది.

ఇది మలేరియా జ్వరాన్ని నయం చేస్తుంది. అంతకాక మలేరియా జ్వరం క్షణాలను కలిగిస్తుంది. ఇది హానిమన్ లో ఎంతో అలజడిని రెపింది.

రోజుకి రెండుసార్లు ఒక మోతాదులో సింకోనాని తనమీద ప్రయోగించుకొని పరిశోధనలకు శ్రీకారం చుట్టాడు. అలా 99 రకాల మందులను ప్రయోగించుకుని తనలో కలిగిన శారీరక మానసిక మార్పులను నమోదు చేశాడు.

వీటన్నింటినీ క్రోడీకరించి మెటీరియామెడికాప్యూరా అనే గ్రంథాన్ని ప్రచురించాడు. హానిమన్ ఫ్రాన్స్ కు చేరుకొని తన వైద్య విధానంతో ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. దీనితో హోమియోపతి ప్రప్రచంమంతటా వ్యాపించింది. శామ్యూల్ హానిమన్ వైద్య రంగులో చిరస్థాయిలో నిలిచిపోయాడు.

మేరీ క్యూరీ

marycurieమేరీ క్యూరీ పేదరికపు పాఠశాలలో కష్టాలు కన్నీళ్లు పాఠాలను శ్రద్ధగా చదువుకున్న మేధావి. ఆమె పుట్టిన పోలెండ్ పరాయి పాలకులు పాదాల క్రింద మగ్గిన దేశం. ఆమె పరాయి పాలనలో వుండే పాశవికత్వాన్ని చవి చూసింది. అయినా ఆ వ్యతిరేక పరిస్థితులన్నీ ఆమె మేధకు పదును పెట్టాయే కాని ఆమెను ఏ మాత్రం కృంగ తీయలేదు. ఆమె ప్రజ్ఞలబ్ది 200 ప్రజ్ఞలబ్ది 120 ఉంటేనే మేధవిగా పరిగణిస్తారు. దీనినే I.Q.(Intellegence Quotient) అంటారు. అది 200 వున్న మేధావి మేరీ తప్ప ప్రపంచ చరిత్రలో మరొకరు లేరు. మేరీ క్యూరీ మేధ. పరిశ్రమ మేళవించిన శాస్త్రవేత్. ఆమెకు విజ్ఞాన శాస్త్ర సముద్రాన్ని తాగాలని ఆ సాగర మధనంలో అమృత సమానమైన నూతన ఆవిష్కరణలు చేయాలని తపన. ఆమెకు మరి దేని మీద ఆసక్తి లేదు. ఆవిడ భర్త పియరీ క్యూరీ కూడా నిత్య విజ్ఞాన శాస్త్ర పరిశోధనాభలాషి. వాళ్ళింద్దరి వైవాహిక జీవితం తక్కువ కాలమైన ఒరళ్ళ కొకళ్ళుగా బతికిన వాళ్ళు.

పియరీ క్యూరీకి రీజియన్ ఆఫ్ ఆనర్ ఇచ్చి మంత్రి గారు సత్కరింస్తారని విశ్వవిద్యాలయాధికారి ఒకసారి తెలియజేశారు. దానికి పియరీ ఇచ్చిన సమాధానమేమిటో తెలుసా? మంత్రిగారికి ధన్యవాదాలు తెలపండి. నాకు బిరుదులు, సన్మానాలు లద్దు. కానీ నాకు ప్రయోగశాల అత్యవసరం అని చెప్పిండి. ప్రయోగశాల ఏర్పాటు చేసుకోవడానికి డబ్బును మంజూరు చేయమిని అర్థం.

maricurieవాళ్ళు ప్రచారానికీ పత్రికా విలేఖరులకు దూరంగా వుండేవాళ్ళు. పరిశోధనలో శ్రమించి నూతన ఆవిష్కరణలను చేయడమం తప్పబిరుదు లూ పదవులను ఆశించడం తమ వంతు కాదని వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మారు. వాళ్ళు పత్రికా విలేఖరులను తప్పించుకు తిరిగేవారు. ఒకసారి ఒక అమెరికన్ పత్రికా విలేఖరి ఫ్రాన్స్ లో ఒక మారుమూల ప్రాంతంలో సెలవులు గడువు తున్న ఆ దంపతులను వెతకడానికి ప్రయత్నించాడు. క్యూరీ ల కుటుంబాన్ని వెతికి పట్టుకున్నాడు. అక్కడ రైతు దుస్తుల్లో ఉన్న ఒక స్త్రీని చూశాడు.

ఇంటావిడవు నువ్వేనా అని అడిగాడు. అవును అంది ఆమె అమ్మగారులోపల వున్నారా? అని అడిగాడు. లేరు అందావిడ అమ్మగారి గురించి ముఖ్యవిషయం ఏమన్నా చెబుతావా ? అన్నాడా విలేఖరి.

ఏమీ లేదు. విలేకరులకు ఆవిడ చెప్పమన్న సందేశం ఒకటే. మనుషుల గురించి ఆతృత చెందకండి. ఆలోచనలు (భావాలా) గురించి ఆతృత పడండి. అంది ఆ స్త్రీ. ఇంతకూ ఆ స్త్రీయే మేరీ క్యూరీ. ఆ గొప్ప శాస్త్రవేత్త గొప్పగా ఖరీదైన దుస్తుల్లో ఉంటుందని ఆ విలేఖరి అనుకున్నాడు.

రేడియం మానవులకు ఉపకారమే కాదు ప్రాణహానీ చేస్తుందని ఆమెకు తెలుసు అయినా ఆమె తన జీవితాన్ని రెడియంకు అంకితం చేసింది. కాదు బలి ఇచ్చింది. అందుచేతనే ఆమెకు రేడియం మహిళ అని పేరు వచ్చింది.

క్యూరీ దంపతులకు 1903 లో భౌతిక శాస్తంలో నోబెల్ బహుమతి వచ్చింది. 1911 లో మేరీ క్యూరీకి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఆమె కూమార్తె, అల్లుడు ఐరెన్ జోలియలట్ క్యూరీలకు 1935 లో రసాయన శాస్త్రంలో బహుమతి వచ్చింది. క్యూరీ దంపతులది నోబెల్ కుటుంబం.

మానవ కళ్యాణ వేదిక మీద తనను తాను సమిధగా చేసుకున్న ధన్య చరిత్ర మాన్య మాహిళ మేరీ క్యూరీ.

ఐజాక్ అసిమోవ్

issacప్రజా జాగృతిపై వందలకొలదీ సైన్య్ రచనలు చేస్తూ, ప్రజా సైన్సే తన జీవితశయంగా, రచనలే తన ఊపిరిగా గడిపన ఒక అసాధరణ శాస్త్రవేత్, రచయిత, ఐజాక్ అసిమోవ్. అసిమోవ్ జీవిత చరిత్ర వింటే, ఎవరికైనా, ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయన రచనలు చదవాలనే ఆశ అంకురిస్తుంది.

అసిమోవ్ జనవరి 2, 1920 న రష్యాలోని స్కోలెంస్క్ అనే గ్రామంలో జూడా, అన్నారాచెల్ బర్మన్ అనే దంపతులకు జన్మించాడు. 1923 లో ఆ కుంటుంబం అమెరికా వెళ్ళడంతో ఆయన విద్యాభ్యాసం అమెరికాలో ప్రారంభమైంది. ఐదేళ్ళకే తల్లిదండ్రుల సాయంతో, బ్రూక్లిన్ పట్టణ వీధుల్లోని బోర్డులు, అక్షరాలు అంకెల ఆధారంగా తానే స్వయంగా చదవడం రాయడం నేర్చుకున్నాడు. ప్రాథమిక తరగతులేవీ చదవకుండా నేరుగా హైస్కూల్ డిప్లొమాలో చేరే అవకాశం పొందాడు.

అసిమోవ్ తండ్రి, బ్రూక్లిన్ పట్టణంలో చిన్న పుస్తకాల కొట్టు నడిపేవాడు. అసిమోవ్ కూడా తన తండ్రికి సహాయపడేవాడు. ఆ కొట్టులో లభ్యమయ్యేవి. సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు కావడంతో, ఊహాలోకంలో తేలియాడే ఆ రచనలు చదివి తన కుమారుడు చదువుమాని పాడైపోతాడని తండ్రికి భయం పట్టుకుంది. అసిమోవ్ అన్నంత పనిచేశాడు. ఒకరోజు తన తండ్రికి లేనప్పుడు, ఒక సైన్స్ కథ చదివి ప్రభావితుడై వెంటనే తాను కూడా ఒక మంచి ఫిక్షన్ కథ రాసి ఒక ప్రఖ్యాత పత్రికలో ప్రచురించాడు. అదే అసిమోవ్ జీవిత చరిత్రలో మేలి మలుపు. ఆ కథకు ఎనలేని పేరు ప్రఖ్యాతులు రావడంతో అసిమోవ్ రెట్టింపు ఉత్సాహంతో, “Night Fall” అనే సైన్స్ ఫిక్షన్ కథ రాసి పాపులర్ పత్రికలో ప్రచురించాడు. 1941 సంవత్సరంలో చేసిన ఈ రచన, మరో ముప్పై ఏళ్ళ వరకు కూడా ఫిక్షన్ రచనా రంగంలో తలమానికం వంటిదని, ఆయన కథల వలన ఆ కాలానికే వెలుగొచ్చిందని అమెరికన్ రచయితలు ప్రశంసించాడు.

మన ప్రాచీన కవుల పాండిత్యానికి రాజులు అబ్బురపడి అక్షర లక్షలిచ్చినట్లు అసిమోవ్ రచనలకు పత్రికల వారు ప్రతిమాటకు మూల్యం చెల్లించే వారు. అసిమోవ్ రచనలంటే పాఠకలు ఎగబడే వారు. ఆయన రచనా శైలి, విషయాన్ని విపులీకరించే తీరు. అనతికాలంలోనే పాపులర్ సైన్స్ రచయితగా పేరు తెచ్చింది.

కొలంబియా విశ్వవిద్యాలయంలో, బి.ఎ., ఎం.,ఎ, చదివి అక్కడే రసాయన శాస్త్రంలో పి.హెడ్.డి. పొందాడు. తర్వాత బోస్టన్ యూనివర్సిటీ ఆహ్వానంపై జీవరయాన శాస్త్రంలో అధ్యాపకుడిగా చేరాడు. తన ప్రతిభతో ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. యూనివర్సిటీలో తాను చేసే పరిశోధనల కన్నా, రచనలే ఎంతో ఇష్టపడేవారు.

సంవత్సరానికి కనీసం 10 పుస్తకాలకు తక్కువ కాకుండా సుమారు 400 పుస్తకాలు రచించారు. ఎంత ఎక్కువగా రాస్తే తన కలం అంత పదునుగా ముందుకు సాగుతుందనేవారు. అసిమోవ్ రచనలకు “Best Scientific Fiction” అవార్డులెన్నో వచ్చాయి.

ఆలోచిండే మంచి మనస్సు నాది. ఆలోచింపజేసే రచనలు చేయడం నాకున్న వరం అనే వారు అసిమోవ్ మాత్రం చిరస్ఠాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి. (మన చెకుముకిలో ప్రచురితమవుతున్న రాకెట్టుకథ అద్భుత యాత్రికులు ఐజాక్ అసిమోవ్ గారి రచనలకు అనువాదమే.)

జహంగీర్ చక్రవర్తి

jahangirమొఘల్ చక్రవర్తులు సాహిత్య కలా పోషకులుగా పేరు తెచ్చుకున్నారు. హుమయాన్ పుస్తక ప్రేమికుడు అక్బర్ అపురూప భవన నిర్మాత. జహంగీర్ నూర్జహాన్ ను పెళ్ళి చేసుకున్న సౌందర్య ప్రియుడుగా మనకు తెలుసు. కానీ ఆయన చక్కటి ప్రకృతి పరిశీలకుడు. మంచి పక్షిశాస్త్రవేత్త. భారత దేశంలోని అనేకానేక జంతువుల్ని, మొక్కల్ని పరిశీలించి తన ఆత్మకథలో వాటి గురించి వివరంగా రాశాడు.

1569 ఆగస్ట్ 30న జహంగీర్ జన్మించాడు. 1605 నుండి 1627 వరకు పాలించాడు. ఆయన అనేక యుద్ధాలు చేయవలసి వచ్చింది. అయినా ఆయన తన ప్రకృతి శాస్త్ర పరిశీలనను కొనసాగించాడు. జంతువులు, పక్షులూ- అవి ఎక్కెడెక్కడ వున్నాయి. వాటి జీవన విధానం, వాటి ఆహారపు అలవాట్లు, ప్రవర్తన- వీటనన్నటినీ ఆయన పరిశీలించాడు. ఉత్తర భారతదేశంలో వుండే పక్షులు, ఒక రకమైన పిల్లి, కోతి వీటిని తన ఆత్మకథలో విపులంగా విర్ణించాడు. సారస్ కొంగల గురించి, - మగ, ఆడ పక్షులు ఎలా జంట కడతాయో వివరించాడు. ఏనుగుల ప్రపవకాలం గురించి ఖచ్చింతంగా చెప్పాడు. 19 వ శతాబ్దం దాకా ఆయన పరిశోధనలు వెలుగు చూడలేదు.

ఆయనకు వ్యక్తిగతంగా ఒత జంతు ప్రదర్శనశాల వుండేది. దాంట్లో రాత్రిళ్ళు, పగళ్ళూ జంతువుల్నీ, పక్షుల్నీ చాలా దగ్గరగా పరిశీలించేవాడు. సారస్ కొంగలు ఎలా కలుసుకుంటాయి, ఎలా గుడ్లు పెడతాయి, ఎలా పొదుగుతాయి చెప్పాడు. కోళ్ళు గుడ్లు పెడ్డటం, పొదగడం - ఇవన్నీ ఆయనకు తెలుసు కోళ్ళలో ఒక మానవ లక్షణం వుంది. అవి గుడ్లను, పిల్లలను మాత్రమే ప్రేమించవు. ఆడ, మగ కోళ్లు ఒక దానినొకటి ఇష్టపడతాయి.

ఆయన సూర్య చంద్రగ్రహణాలను పరిశీలించాడు. తోక చుక్కలను గమనించేవాడు. వాటి వృద్ధి క్షయాలను గురించి తన ఆత్మకథలో రాశాడు. హిమాలయాల వంటి ఎత్తైన ప్రదేశాలలో పెరిగే చెట్లను సమతల ప్రదేశాలలో పెంచి వృక్ష సంపదను వృద్ధి చేశాడు.

అరుదైన జంతువుల్ని చూసినప్పుడు తన ఆస్తాన చిత్రకారుడి చేత వాటి చిత్రపటాలు వేయించేవడు. ఉస్తాద్ మన్పూర్ అనే చిత్రకారుడు చాలా పక్షులు, జంతువుల పటాలను గీశాడు. అయితే అలా గీసిన చిత్రపటాలను విదేశీ దోపిడిదారులు తీసుకుపోయారు.

పాతిక సంవత్సరాల క్రిందట ఒక రష్యా పరిశోధకుడు ఒక చిత్రపటాలు లెనిన్ గ్రాడ్ మ్యూజియంలో కనుగొన్నాడు. అది అంతరించిపోయిన ఒక అరదైన పక్షి డోడో పటం. అది ఉస్తాద్ మన్సూర్ పటం అని శైలిని బట్టి స్పష్టంగా తెలుసుస్తోంది. డోడో అనే పక్షి 1624 లో మారిషస్ దీవులలో అంతరించిపోయింది. దీనిని బట్టి పక్షి శాస్త్రంలో ఆయన ఎంత ఆసక్తి గలవాడో అర్థమవుతుంది.

హిపోక్రటిస్

hipocratisక్రీ.పూ. 460 సంవత్సరం కాలంలో గ్రీసు దేశంలోని కోస్ ద్వీపంలో జన్మించాడు హిపోక్రటిస్. అతను జన్మించిన కాలంలో చాలా మంది వ్యాదులు వస్తే దేవుడికి మొక్కుకునేవారు. అమ్మవారికి బలులు ఇచ్చేవారు.

అలాంటి మూఢనమ్మకాలు ఎంతగానో అభివృద్ధి సాధించిన ఇరవై ఒకటవ శతాబ్దంలోనే వుండగా ఆ రోజుల్లో వుండటం విచిట్రం కాదుకదా.

గ్రీసు దేశంలో వ్యాధుల్ని నయం చేయడానికి దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఆ దేవాలయాల్లో “అసిలిపియన్సు” అనే ఆయన విగ్రహాలు వుండేవి.

ఆయన గ్రీకుల వైద్యానికి అది దైవమని భావించే అపోలో కుమారుడు. ఆ దేవాలయాల్లో వుండే పూజారులే వైద్యులుగా గుర్తించబడేవారు.

వైద్య విజ్ఞానాన్ని మూఢనమ్మకాల ముసుగులో నుండి శాస్త్రీయ మార్గంలోకి తీసుకువచ్చిన వాడు హిపోక్రటిస్ అతను ప్రాచీన గ్రీకు వైద్య విజ్ఞాని. ఆధునిక వైద్య శాస్త్రానికి పితామహుడిగా ప్రస్తుతించబడ్డాడు.

హిపోక్రటిస్ జన్మస్థలం ఏగియన్ సముద్ర ప్రాతంలో వున్న కోస్ ద్వీపంలో అసిలిపియస్సుకు పెద్ద దేవాలయం వుంది.

హిపోక్రటిస్ తండ్రి ఆ దేవాలయ పూజారుల్లో ఒకడు. తండ్రి దగ్గర సాంప్రదాయ వైద్యాన్ని ఇతరుల దగ్గర వైద్య వృత్తిని చేస్తూ వైద్య విద్యను బోధిస్తూ కాలం గడిపాడు. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన ఎన్నోవిషయాలను అతను, అతని, శిష్యులు గ్రంథాలుగా కూర్చారు.

అవన్నీ హిపోక్రటిస్ సేకరణగా పేరు పొందాయి. హిపోక్రటిస్ గ్రంథం 87 గ్రంథాలుగా కలిసిన అతి పెద్ద గ్రంథం వైద్యులు బైబిల్ గా పేరుపొందింది.

ప్రతివ్యాధికి హేతువుని కనిపెట్టాలన్నాది. ఆయన అభిమతం. వ్యాధిని నిర్ణయించడానికి రోగస్థితి అతని వృత్తి, దినచర్య, కుటుంబ పరిస్థితులు, అతను నివసించే పరిసరాలు ముఖ్యంగా తెలుసుకోవాలంచాడు.

రోగి కళ్ళు, చర్మం, శరీర ఉష్ణోగ్రత, ఆకలి, విసర్జన శక్తి, పరిశీలించి ప్రతిరోజూ వాటిని నమోదు చేసే చార్ట్ లు వుంచాలని తెలియజెప్పాడు హిపోక్రటిస్. ఎముకలు స్థానం తప్పిపోవడం, విరగడం అనే గ్రంథం వుంది. దానిలో విరిగిన ఎముకలకు కట్టు కట్టడం, వేడి కాయడం గురించి వివరించాడు.

ఈ పద్ధతులు ఇప్పటికీ అనుసరింపబడుతున్నాయి. అలా ఎన్నో శాస్త్రీయ దృక్ఫథాలతో వైద్యాన్ని పరిశీలించిన మొదటి వైద్యుడు హిపోక్రటీస్.

అతను వైద్య విద్యాభ్యాసం ముగిసిన తరువాత విద్యార్థుల చేత ప్రమాణం చేయించేవాడు. ఆ ప్రమామాన్ని ప్రస్తుతం కూడా చాలా మంది చేయిస్తున్నారంటే అదే అతని గొప్పతనాన్ని తెలియజేస్తుంది.

ప్రఫుల్ల చంద్ర రే (పి.సి.రే)

prafullaబంగ్లాదేశ్ లోని ఖుల్ నాలోని ఒక సంపన్నుల కుటుంబలో 1861 ఆగస్ట్ 2వ తేదిన ప్రఫుల్ల చంద్రరే జన్మించారు. ప్రఫుల్లాను ఎక్కువగా ప్రభావితం చేసింది. ప్రొపెసర్ అలెగ్జాండర్ పెడ్లర్. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలీజీలో ప్రొఫెసర్ గా పనిచేసిన అలెగ్జాండర్ పెడ్లర్ ఉపన్యాసాల వల్లనే ప్రఫుల్లా కెమిస్ట్రీలో స్పెషలైజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1882 కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి డి.ఎస్సీ. సంపాదించాడు.

ప్రఫుల్ల నెయ్యి మరియు ఆముదం యొక్క ఎడల్డరేషన్ మీద చాలా తీవ్రంగా పరిశోదనలు చేశారు. తన సహచరుడు ఇచ్చిన శాంపిల్స్ ను పరిశోధించి అవి మెర్క్యురస్ మరియు నైట్రేట్ లని గుర్తించాడు. దీని వల్ల ప్రఫుల్లాకి మాస్టర్ ఆఫ్ నైట్రేట్స్ గా పేరు వచ్చింది. ప్రఫుల్లా భారతీయ గ్రంథాలను తిరగేసి హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే రెండు వాల్యూమ్ లను రచించాడు. ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహించాడు.

బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్స్క్ లిమిటెడ్ ను స్తాపించాడు. పాదరసం నమ్మేళనాల భౌతిక రసాయనిక ధర్మాలను అధ్యయనం చేశారు. అదే సమయాన ఆయన గాంధీ మార్గాన్ని ఎన్నుకుని స్వరాజ్య పోరాటంలో పాల్గొన్నారు. భరత మాత దాస్య శృంఖలాలు విడిపోకముందే 1944 ప్రఫుల్ల చంద్రరే కన్ను మూశారు.

చింతామమి నాగేశ రామచంద్రరావు

chintamaniచింతామమి నాగేశ రామచంద్రరావు 1934 జూన్ 30 న బెంగుళూర్ జన్మించారు. ఆయన మనదేశం గర్వించదగిన శాస్త్రవేత్తలలో ఒకడు. 11 ఏళ్ళ వయసులో ఆయన ఉపాధ్యాయుడు ఆయననూ ఆయన స్నేహితులనూ బాగా చదువుకున్నందుకు సి.వి.రామన్ దగ్గరగా తీసుకెళ్లాడు. రాయమ్ 3 గంటల పాటు విజ్ఞాన శాస్త్రం గురించి మాట్టాడాడు. రామచంద్రరావుకు శాస్త్రవేత్తకు కావలసిన ప్రేరణ లభించింది. అంతే కాకుండా ఆయన తండ్రి గొప్ప శాస్త్రవేత్తల గురించి చెబుతుండేవాడు. అటువంటి ఉత్తేజకర వాతావరణంలో పెరిగిన రామచంద్రరావుకు శాస్త్రవేత్త కావడంతో ఆశ్చర్యం లేదు ఆయన ఘనస్థితి రసాన శాస్త్రజ్ఞులో ఒకడు.

1951 లో ఆయన మైసూర్ విశ్వవిద్యాలయం నుండి బి.యస్.సి.డిగ్రీని పొందాడు. అప్పటికి ఆయన వయస్సు 17 సంవత్సరాలే. రెండు సంవత్సరాల తరువాత బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఎమ్.ఎస్. సి డిగ్రీ పొందాడు. 1958 లో ఇటలీలోని పర్ డ్యూ విశ్వవిద్యాలయం నుండి పి హెచ్.డి పొందాడు. తరువాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశాడు. తిరిగి స్వదేశం వచ్చి రెండు సంవత్సరాలు పరిశోధన చేసి డి.యస్.సి పొందాడు. విరామమెరుగని శాస్త్రకృషి చేయడం వలన ఆయన ఘనస్థితి రసాయన శాస్త్రం, స్పెక్ట్రోస్కోప్ పద్ధతులనుపయోగించి మోలిక్యూల్ నిర్మాణం పరిశీలన వివిధ అత్యుష్ణ వాహనాల రసాయన శాస్త్రం వంటి వివిధ విషయాలపై పరిశోధనలు చేశాడు. ఆయన 1200 పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికకు సమర్పించాడు. తన పరిశోధనలకు సంబంధించి 37 పైగా పుస్తకాలు రాశాడు.

ఆయన బెంగుళూర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు డైరెక్టర్ గా పనిచేశాడు. 1995 నుండి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీలో ఆల్బర్డ్ ఐన్ స్టిన్ రీసెర్చ్ ప్రొఫెసర్ గా పనిచేసాడు. ఇప్పుడు బెంగుళూర్ జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ ఎడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చ్ లో లైనస్ పాలింగ్ గా రీసెర్చ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. దానికి గౌరవ అధ్యక్షుడు కూడా. అంతాకాదు ప్రధానమంత్రికి విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక శాస్త్ర విషయాలలో సలహాలిచ్చే మండలికి ఆయన ఆయన అధ్యక్షుడు. ఆయన ప్రపంచంలోని ఇరవై ప్రఖ్యాత సైన్స్ ఎకాడమీలలో సభ్యుడు (ఫెలో) రాయల్ సొసైటీ, లండన్, అమెరికా నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్, మాస్కో, రాయల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్రీ, ధర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అందులో కొన్ని. ఆయనకు భారతదేశంలోనూ విదేశాలలోనూ కడా అనేక సన్మానాలు, సత్కారాలు జరిగాయి. 1968 లో భట్నాగర్ బహుమతి పొందాడు. 1975 లో సి.విరామన్ అవార్డ్, పి.సి.రే మెడల్ పొందాడు. 1980 లో ఎస్.ఎస్. బోస్ మెడల్, 1996 లో ఆల్బర్డ్ ఐన్ స్టిన్ గోల్డ్ మెడల్, 2000 లో రాయల్ సొసైటీ వారి హ్యూస్ మెడల్ వాటిలో కొన్ని 37 గౌరవ డాక్టరేట్లు పొందాడు. 2004 లో భారత ప్రభుత్వం ఇచ్చే ఇండియన్ సైన్స్ అవార్డ్ ఈయనకు ఇచ్చారు. దీని మొదటి గ్రహీత ఈయనే, 2005 లో ఫ్రాన్స్ తమ దేశపు అత్యున్నత అవార్డ్. లెజెండ్ ఆఫ్ ఆనత్ ఇచ్చి సత్కరించింది.

జెరాల్డ్ డుర్రెల్

genarldఒక ఐదేళ్ళ కుర్రాడు అగ్గిపెట్టెల్లో తల్లి తేలును, పిల్ల తేళ్ళను పచ్చుకొని దాచాడు. వాటని దాచేలోపల భోజనానికి రమ్మని ఇంట్లో వాళ్ళు పిలిచాడు. వాటిని డ్రాయింగ్ రూమ్ లో ఉంచి బోజనానికి వెళ్ళాడు. అన్నలతో, తమ్ముళ్ళతో కబుర్లు చెబుతూ, తేళ్ళ సెగతి పూర్తిగా మర్చిపోయాడు. ఈలోగా వాళ్ళ అన్నయ్య అగ్గిపుల్ల కోసమని డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళి అగ్గిపెట్టి తెరిచాడు. అంతే తల్లితేలు ఒక్కసారి అతని చేతి మీదకు విజృంభించింది. పిల్ల తేళ్ళు గది అంతా పాకాయి. ఆ కుర్రవాడు ఒక్క గావుకేక పెట్టాడు. ఇంట్లో వాళ్ళందరూ అక్కడకు చేరారు., తేళ్ళదాడికి గురి అయ్యారు. ఈ పని చేసింది ఆ కుర్రాడే అని వాళ్ళమ్మ నిర్ధారించింది. ఆ కుర్రాడు మాత్రం అయిష్టంగా ఆ తేళ్ళను పోగుచేసి తోటలో వదిలేశాడు.

ఈ కుర్రాడు మరెవరోకాదు. ప్రకృతి ప్రేమికుడు. జంతు ప్రపంచ పరిరక్షకుడు. జెరాల్ట్ డుర్రెల్ జంతువుల్ని ఆత్మబంధువు వలె ప్రేమించాడు. ప్రమాదకరమైన జంతువులు కూడా ఆయనకు ప్రమాదకరమైనవి అనిపించలేదు. డుర్రెల్ 1925 జనవరి 7న భారతదేశంలోని జెంషెడ్ పూర్ లో జన్మించాడు. తండ్రి ఇంజనీర్ గా పనిచేస్తుండేవాడు. డుర్రెల్ చిన్నపప్పుడు మాటలు వచ్చిన తరువాత చెప్పిన మొదటి పదం జూ అని తల్లి చెప్పేది. భారతదేశంలోని జంతు ప్రదర్శనశాలలను చూచడంతో ఆయనకు జంతువుల మీద అమితమైన ఆసక్తి ఏర్పడింది. 1928 లో తండ్రి చనిపోవడంతో వాళ్ళు ఇంగ్లండ్ వెళ్ళిపోయారు. జంతుశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన డుర్రెల్ ఆయన అడవి జంతువుల్ని కూడా పెంచేవాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో ఆయన ఒక చేపల పెంపక కేంద్రంలో ఉద్యోగం చేశాడు. యుద్ధం అయిపోయిన తరువాత యూరప్ లోని జూలో ఉద్యోగిగా చేరాడు. జంతు ప్రదదర్శనశాలలకు క్రూర జంతువులను సంపాదించే పనిమీద ఆయన ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో విస్తృతంగా పర్యటించాడు.

పశ్చిన ఆఫ్రికాలో ఆయన పర్యటిస్తూ ఒక ప్రమాదకరమైన సాహసం చేశాడు. గేబన్ పొడపాములు ఉన్న ఒక గొయ్యిలోకి ఒకరాత్రి దిగాడు. పైనుండి టార్చిలైట్లు వేస్తున్నాము. ఉన్నట్టుండి లైట్లు ఆరిపోయాయి. కాలికి చెప్పు తెగిపోయింది. అతి ప్రమాదకరమైన పాముల మధ్య ఉన్నాడు. కొన్ని నిముషాలపాటు ఆయన భయానికి లోనయ్యాడు. ఈలోగా చార్చిలైట్లు వెలిగాయి. ఆ పాముల్ని ఆయన సంచీలో వేసుకొనివచ్చాడు. అలాగే ఆఫ్రికాలో ఎగిరే చుంచుల్ని పట్టుకున్నాడు. హోట్ జిన్స్ అనే నీటిపై గూళ్లూ కట్టే పక్షులను సేకరించాడు. టుకోటుకో అనే జంతువు ఆయన పట్టుకున్న అపురూప జంతువుల్లో ఒకటి. ముట్టుకుంటేనే చచ్చిపోతారని అందరూ నమ్మేపామును పట్టుకుని ప్రజల నమ్మకం మూఢనమ్మకమని నిరూపించాడు. అతి ప్రమాదకరమైన పిరన్వ చేపను పట్టుకున్నాడు. ముళ్ళపందిని, రక్కాన్ని పీల్చే గబ్బిలాలలను కూడా పట్టుకున్నాడు.

తనకంటూ జంతుప్రదర్శనశాల నిర్మించుకోవాలని ఆయన చిరకాలకోరిక చివరికి నెరవేరింది. న్యూజెర్సీ జులాజికల్ పార్క్ ను 1958 లో నిర్మించాడు. 1995 లో ఆయన చనిపోయిన తరువాత దానికి ఆయన పేరే పెట్టారు.

జగదీశ చంద్ర బోస్

jcboseమొక్కలకు కూడా జంతువులు, మనుషుల్లాగే ప్రాణం, ఉంటుందని, వేడికీ, చలికీ, కాంతికీ, శబ్దానికీ గాయాలకూ మొక్కలు స్పందిస్తాయనీ తొలిసారిగా శాస్త్రీయంగా వెల్లడించనవాడు సర్ జగదీశ చంద్ర బోస్.

జె.సి.బోస్ 1858 నవంబర్ 30 వ తేదీన ప్రస్తుత బంగ్లాదేశ్ లోని మైమెన్ సింగ్ లో జన్మించాడు. కలకత్తాలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, 1884 లో కేంబ్రిడ్జి నుండి పట్టా పుచ్చుకున్నాడు. కలకత్తాలోని ప్రెని డెన్సీ కళాళాలలో లెక్కరర్ గా జీవితం ప్రారంభించాడు.

అవి ఆంగ్లేయుల మనదేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. సుప్రసిద్ధ ప్రెసిడెన్నీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జగదీశ చంద్ర బోస్ చేరాడు. అయితే అప్పట్లో ఉన్న నియమ నిబంధనల ప్రకారం (ఒకేపని చ్సినప్పటికీ) ఐరోపాకు చెందిన ఉద్యోగులకు లభించే జీతంలో సగం మాత్రమే భారతీయ ఉద్యోగులకు లభించేది. అంటే ఒక ఇంగ్లీష్ జాతికి చెందిన ప్రొఫెసర్ కి లభించే జీతంలో సగం జీతం రంగాల్లో ఉద్యోగాలు చేసే భారీయులందరూ దీనిన కిమ్మనకుండా భరించాల్సి వచ్చేది.

ఆంగ్లేయులు చూపిస్తున్న ఈ వివక్ష జగదీశ చంద్ర బోస్ ఎంత మాత్రం నచ్చలేదు. ఒకే పని చేసే వారికి ఒకే జీతం ఉండాలి గానీ ఇదేమిటి అని అతను తన అధికారులను నిలదీశాడు. ఐరోపా ప్రొఫెసర్ల తో సమానంగా తనకూ జీతం ఇవ్వాలని పట్టుబట్టాడు.

నేను జీతమంటూ తీసుకుంటే వారితో సమానంగానే తీసుకుంటాను. లేకపోతే అసలు జీతమే తీసుకోను. అని భీష్మించుకు కూచున్నాడు. అయితే ఉద్యోగం మాత్రం మానేయలేదు. సుమా... దాన్ని అలా కొనసాగిస్తూనే వచ్చాడు. అన్నట్లుగానే బోసు పూర్తిగా మూడేళ్ళదాకా అసలు జీతమన్నదే తీసుకోలేదు. ఈ మూడేళ్ళకాలంలో అతను ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పటిదాకా ఉన్న మంచి ఇంటిని వదిలి, ఊరికి దూరంగా ఉన్న ఓ మామూలు ఇంటిలోకి మారిపోవలసి వచ్చింది. అంతేకాదు స్వయంగా పడవనడుపుకుంటూ హుగ్లీనదిని దాటాల్సి వచ్చేది. కలకత్తా నగరంలోకి వచ్చందుకై అతను తన బార్యతో సహా బయలుదేరి, హుగ్లీ నదిలో స్వయంగా పడవ నడిపి, ఇతరుల తీరానికి చేరేవాడ. తరువాత అతని భార్య పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయేది. తిరిగి సాయంత్రం ఆమె మళ్ళీ పడవ నడుపుకుంటూ వచ్చేది.

ఇలాంటి కష్టాలు ఎన్ని ఎదురైనప్పటికీ జగదీశ చంద్ర బోస్ చలించలేదు. చివరకు ఏమైతేనేం అతని ఈ పోరాటం. ముందు కాలేజీ అధికారులు తలవంచక తప్పలేదు. ఐరోపా ప్రొఫెసర్ల తో సమానంగా అతనికీ జీతం ఇవ్వడం మొదలు పెట్టారు.. ఆయన ఆత్మాభిమానం అంతగొప్పది మరి....

బోస్ రూపొందించిన క్రెస్కోగ్రాఫ్ కు వివిధ రకాల జీవనధర్మాలను కూలంకషంగా పరిషోధన చేయడం లో ఎంతగానో ఉపయోగపడింది. మొక్కల మీద ఎరువులు, కాంతి, కిరణాలు, రేడియో కిరణాలు, విష పదార్థాల ప్రభావాన్ని ఈయన వివరించాడు.

1920 లో బోస్ ను ఫెలో ఆఫ్ రాsయల్ సొసైటీగా ఎన్నుకొన్నారు. కలకత్తాలో ఈయన బోస్ ఇన్ స్టిట్యూట్ ను స్థాపించారు. నవంబర్ 23,1937 న బోస్ మనకు భౌతికంగా దూరమైన ఈయన పరిశోధనలు మాత్రం ఎంతో మందికి స్పూర్తిని కలిగిస్తూనే ఉన్నాయి.

రాజా జయసింగ్

rajajayasinghమహా సాహాసవంతుడైన రాజపుత్ర రాజు జయిసింహాడు సనాజయసింగ్ అని ఔరంగజేబు చే మెప్పుపొందిన పరాక్రమశాలి. గణితశాస్త్రవేత్తగా, ఖగోళశ్రాస్త్రజ్ఞుడిగా ఆయనకున్న విజ్ఞానం జంతర్ మంతర్ ను దర్శించిన ఎవరికైనా అబ్బురపరచక మానదు.

రాజాజయసింగ్ 1686 న జన్మించాడు. అప్పటికే మొగలాయి. ప్రభుత్వం ఔరంగజేబు పరిపాలనలో క్షీణిస్తూ ఉంది. జయసింగ్ కి ఖగోళ శాస్త్రం పట్ల జిజ్ఞాస పెరగడానికి తన రాణీ కారణమంటారు. రాణి జయసింగ్ తో అంబర్ కోటపై విహరిస్తునపుడు, మనకు చంద్రుడుకి మధ్య ఎంతదూరం ఉంది ? నక్షత్రాలకు మనకు ఎంత దూరం ఉంది ? చంద్రుడు, భూమి, నక్షత్రాలు, సూర్యుడు వీటి మధ్య ఎలాంటి సంబంధం ఉంది. ? అని అడిగిందట. ఏంచెప్పాలో తెలియక తటపటాయిస్తున్న జయసింగ్ ను చూచి ఈ మాత్రం చెప్పలేరు. మీరేం రాజులండీ అని గారాలు పోయిందట ఫలితంగా ఆయనలోని శాస్త్రజ్ఞుడు, మేల్కొన్నాడు.

పర్షియన్, అరంబిక్, యురోపియన్, భాషలలో ఉన్న ఖగోళగణిత, గ్రంథాలను జయసింగ్ పరిశీలించాడు. ఉలగ్ బేగ్ వెలువరించిన, జిబ్ ఉలగ్ బేగి టోలెమి గ్రంథం అల్మాజోస్ట్ లను ఈయన సంస్కృతంలోకి అనువదించాడు. యూరప్ నుండి టెలిస్కోప్ తెచ్చాడు.

భూభ్రమణ విధానం, భూమివాలి ఉన్న స్తి, వీటి కారణాలుగా దొర్లినలోపాలను సరిచేసి. మహమ్మదీయ, హిందూ పర్వదినాల నిర్ణయాన్ని ఈయన ఖచ్చితంగా చేశాడు. ఈయన పరిశీలలనలను అప్పటి మొగల్ చక్కవర్తి పేర బిజ్ మహమ్మద్ షాహి అనే గ్రంధంగా వెలువరించాడు.

ఖగోళ నిర్మాణాలను నిశితంగా పరిశీలించడం కోసం ఈయన జంతర్ మంతర్ లను రూపొందిచాడు. ఈ జంతర్ మంతర్ లు న్యూడిల్లి జైపూర్, వారణాసి, నగరాల్లో ఉన్నాయి. వీటి గొప్పదనాన్ని నేటికి దేశదేశాల నిపుణులు చర్చించుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

జయసింగ్ స్వయంగా రూపొందించిన యంత్రాలలో చెప్పుకోదగ్గవి. సమ్రాట్ యుంత్ర, రామ్ యుంత్ర, జయప్రకాష్ సమాట్ర్ యంత్ర అనేది సన్ డయల్ అరనిమిషం అటుఇటుగా కాలనిర్ణయం చేయగల శక్తి దీనికి వుంది.గ్రహగతుల గురించి కోణాలతో సహాకచ్చితంగా తెలుపుతుంది. జయప్రకాష్ కాలానుగుణంగా గ్రహరాశుల పరిభ్రమాణాల్ని తెలుపుతుంది.

జయప్రకాష్ ఖగోళ శాస్త్రానికి అందించిన సేవల్లో విలువైనవి.. రెండు ఒకటి విషవత్తుల నిర్ణయం రెండవది గ్రహణాల నిర్ణయం. ఏదిఏమైనా జంతర్ మంతర్ జయసింగ్ ను శాస్త్ర ప్రపంచం మరచిపోలేదు.

నికొలా టెస్తా

జూలై nikolas.jpg9 అర్ధరాత్రి తర్వాత (జూలై 10) పెద్దవడగండ్ల వాన కురుస్తుండగా నికొలా టెస్లా జన్మించాడు. చుట్టు పక్కల వాళ్ళు టెస్లా చీకటిని తీసుకొస్తాడని అంటే తల్లి మాత్రం టెస్తాను ఒక కాంతి రేఖగా భావించింది. నిజంగా ఈనాడు మనం విస్తృతంగా వాడుతున్న పర్యాయ విద్యుత్తు (Altemate Current) అతడి ఆవిష్కరణే. పర్యాయ విద్యుతులో వాడే భ్రమణంచెందే అయస్కాంత క్షేత్రం (Rotating Magnatic field) అతడే కనుగొన్నాడు. క్రొయేషియాలో జన్మించిన టెస్తా తన కుటుంబంలోని ఐదుగురు పిల్లల్లో ఒకడు. అతడి తల్లి జుకా మేండిక్ (djuka mandic) వంటగదిలో పని సులభంగా కావడానికి తన ఉపయోగం కోసం చిన్న చిన్న పరికరాలు తయారు చేసుకొనేది. తండ్రి మిలూటిన్ టెస్తా చర్చిలో మత బోధకుడు. కాని తల్లి చేసే చిన్న చిన్న ప్రయోగాలే నికొలా టెస్తాను సైన్స్ వైపుకి నడిపించాయి.

కార్ల్స్తాడ్ (క్రొయేషియా) లో తన చదువు పూర్తయింతర్వాత నికొలా బుడాపెస్ట్ చేరుకున్నాడు. అప్పటికే అతడు ఉపపాదక మోటారు (Induction Motor) కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 1882లో బుడాపెస్ట్‌లోని ఒక పార్కులో స్నేహితుడితో మాట్లాడుతూ మాట్లాడుతూ అతడు తనవాక్యాన్ని మధ్యలోనే ఆపివేసి శిలలా కూర్చున్నాడు. స్నేహితుడు గాభారాపడుతుంటే అతడ్ని సముదాయించి నేల మీద మోటారు డిజైను బొమ్మ గీచాడు. యూరప్‌లో తగిన ప్రోత్సహం లభించడం లేదని 1884 లో ఆయన అమెరికా చేరుకున్నాడు. అప్పటికే అమెరికాలో థామస్ అల్వా ఎడిసన్ ప్రత్యక్ష విద్యుత్తు (Direct Current) ఆధారిత పరికరాలను మార్కెట్లో ప్రవేశపెట్టి వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. కట్టుబట్టలతో అమెరికా చేరుకున్న టెస్లా ఎడిసన్‌తో కలిసి పనిచేయాలని సంకల్పించుకుని అతడి దగ్గర జీతానికి చేరాడు. అప్పటికే ప్రత్యక్ష విద్యుత్తుతో నడిచే తను రూపొందించిన జనరేటర్లో ఏర్పడిన ఆటంకాలను సరిచేసే 50,000 ల డాలరు యిస్తానని తనదగ్గర టెస్తాను చేర్చుకున్నాడు. జనరేటర్‌ని సరిచేసి తనకు రావాల్సిన చెల్లించాల్సిందిగా కోరాడు టెస్లా ఎడిసన్ నవ్వుతూ "నీకు అమెరికన్ హాస్యోక్తులు అర్థం కావు టెస్లా" అని డబ్బుని ఎగొట్టాడు. టెస్లా ఆయనతో విడివడి 1885 లో టెస్లా ఎలక్టిక్ లైట్ కంపెనీ స్థాపించాడు. 1887లో అతడి పర్యాయ విద్యుత్ పరికరాలకు సంబంధించి కొన్ని పేటెంటు సంపాదించగలిగాడు. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్టిక్ ఇంజనీర్స్ ముందు అతడు తన మోటారు డ్రాయింగ్‌తో వివరణ యిచ్చాడు. జార్జి వెస్టింగ్ హౌజ్ అనే వ్యాపార వేత్త అతడి వద్ద అరవైవేల డాలర్ల పేటెంట్లు కొనుగోలు చేశాడు.

ఈ సమయంలోనే టిస్తా 'టెస్తా కాయిల్ రూపొందించాడు. దీన్ని ఈ నాటికీ రేడియో సాంకేతికతల్లో ఉపయోగిస్తున్నారు. అయితే ఏ.సి కరెంటు నష్టాలు తెస్తుందని టెస్లా మీద ఒక వ్యతిరేక ప్రచారం థామస్ అల్వాఎడిసన్ మొదలుపెట్టాడు. కాని క్రమంగా ఎడిసన్ ప్రచారం విశ్వసనీయత కోల్పోయింది. current.jpg1893లో షికాగోలో జరిగిన కొలంబియన్ ప్రపంచ ప్రదర్శనలో కాంతి యోజన వెస్టింగ్ హౌజ్ కార్పోరేషన్‌కే దక్కింది. 1895లో టెస్లా ప్రయోగాలను ఆమోదించిన ప్రభుత్వం నయాగరా జలపాతం వద్ద జల విద్యుత్తు ప్రాజెక్టు నెలకొల్పడానికి టెస్తాను నియోగించింది. ఆ మరుసటి సంవత్సరమే న్యూయార్క్ రాష్ట్రంలోని సిటీ ఆఫ్ బఫ్ లో వీధి దీపాలు వెలగడంతో ప్రపంచంలో మొదటి సారి ఒక నగరం రాత్రిపూట కాంతితో నిండిపోయింది. వెస్టింగ్ హౌజ్ కార్పోరేషన్ యూనిట్‌కి 2.6 డాలర్లు టెస్లాకు చెల్లించే ఒప్పందం మీద సంతకం చేసి తర్వాత ఖర్చును చూసి భయపడింది. అయితే ప్రజలకు విద్యుత్తు తప్పని సరిగా అందించాలన్న కోరికతో నికొలా టెస్లా ఒప్పందం కాగితాలను చింపివేసి తనకు రావాల్సిన లాభాలను వదులుకున్నాడు.

టెస్లా పరిశోధనలు రాడార్ టెక్నాలజీకి రిమోట్ కంట్రోల్ సాంకేతికతకు, ఎక్స్‌రే సాంకేతికతకు, రోబోటిక్స్ కీ, నిస్రంత్రీ సాంకేతికత (Wireless Technology), కంపూటర్ సాంకేతికతకు బాటలు వేశాయి. టెస్లా ఏకసంథాగ్రాహి, పుస్తకం ఏదైనా చదివితే దాన్ని తిరిగి చూడకుండా రాయగల సమర్ణుడు. ఎనిమిది భాషల్లో ప్రావీణ్యత కలిగనవాడు. సెర్బియన్, ఇంగ్లీషు, జెక్, జర్మన్, ఫ్రెంచి, హంగేరియన్, ఇటాలియన్, లాటిన్ భాషల్లో పట్టు కలిగినవాడు.

ప్రపంచ మంతటా నిస్రంతీ సాంకేతికత విస్తరించాలని న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్‌లో వార్డెన్ క్లిఫ్ అనే ఒక వైర్లెస్ ప్రాజెక్టు, విద్యుత్ సంస్థ 1900 లో నిర్మించడం మొదలు పెట్టాడు. 1901లో పారిశ్రామిక వేత్త జె. పి మోర్గాన్ దానికి ఆర్థిక సాయం అందచేయడానికి ముందుకు వచ్చాడు. కాని మార్కెట్లో రేడియోను కనుగొన్నాడని పేరున్న మార్కొనితో పోటీ తట్టుకోలేక ఈ ప్రాజెక్టు 1915 లో మూతపడింది.

ఆర్థికంగా అత్యంత దయనీయమైన స్థితిలో జనవరి 7, 1943 న టెస్లా మరణించాడు. అప్పడతడి వయస్సు 86 సంవత్సరాలు. కాని అతడి పేరు మీద టెస్లామెమోరియల్ సొసైటీ ఏర్పడింది. అతడి మీద ఆ సొసైటీ ఒక డాక్యుమెంటరీ చిత్రం నిర్మించింది. దాని పేరు "టెస్లా - ది జీనియస్ హెూ లిట్ ద వరల్డ్", "Tesla, The Genius who Lit the world" అతడి పేరు మీద బెల్గ్రేడ్ (సెర్బియా) లో నికొలా టెస్లామ్యూజియం నెలకొల్పడింది. అతడి జీవిత చరిత్రను ఆధారం చేసుకుని 'ది సీక్రెట్ ఆఫ్ నికొలా టెస్లా', 'ది ప్రిస్టేజ్ చలన చిత్రాలు నిర్మించబడ్డాయి. న్యూయార్క్‌లో ఒక వీధికి నికొలా టెస్లా కార్నర్ అని పేరు పెట్టారు.

tesla.jpgఅతడి జీవిత చరిత్రను మార్గరెట్ పెనీ అనే రచయిత్రి టెస్లా, మ్యాన్ అవుట్ ఆఫ్ టైం' అనే పేరుతోను జాన్ జె ఒనీల్ అనే రచయిత "ప్రోడిగల్ జీనియస్" అనే పేరుతోను రచించారు. నికొలా టెస్తా కూడా 'మై యిన్వెన్షన్స్ అనే పేరుతో 1991 వరకు తను సైన్సులో చేసిన కృషిని వివరించాడు.

అయితే అతడు తలపెట్టిన వార్డెన్ క్లిఫ్ (Warden Clyffe) ప్రాజెక్టు ముతపడి ఆ స్థలం చేతులు మారినప్పటికీ 'టెస్లా సైన్స్ సెంటర్ అనే ఒక గ్రూపు ఏర్పడి దాన్ని ఒక చరిత్రాత్మక స్థలంగా మార్చాలని 1967, 1976, 1994 సంవత్సరాల్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు ప్రజల దగ్గర్నుండి విరాళాలు సేకరించి 1.6 మిలియన్ డాలర్లకు ఆ స్ధలం కొనుగోలు చేశారు. దీనికి కామిక్ వెబ్ సైట్ ఓట్మీల్ కామ్ అధినేత మాథ్యూ ఇన్మన్ సహకరించాడు. మే, 2013 లో ఈ స్థలం "టెస్లా సైన్స్ సెంటర్ కి స్వాధీనం అయింది. ఇప్పడక్కడ వార్డెన్ క్లిఫ్ ప్రాజెక్టు సమూనా నిర్మాణం కొనసాగుతున్నది. నికొలా టెస్తా ఈ ప్రపంచానికి వర్యాయు విద్యుతును ప్రసాదించి చిరస్మరణీయుడయ్యాడు.

రచయిత: పైడిముక్కల ఆనంద్ కుమార్, సెల్:-9490300459

డా. పి.యం. భార్గవ

bhargavaజననం: 22 ఫిబ్రవరి 1928

అస్తమయం: 01 ఆగస్టు 1917 (89 ఏళ్ళ వయస్సు)

జన్మస్థలం: అజ్మీరు (అజయ్ మేరు), రాజస్థాన్

తల్లిదండ్రులు: డా. రామచంద్ర భార్గవ (వైద్యుడు) గాయత్రీ భార్గవ

విద్య: బీసెంట్ థియోసాఫికల్ స్కూల్, వారణాసి, క్వీన్స్ కళాశాల, లక్నో యూనివర్సిటీ

మహాకవి శ్రీ శ్రీ గీతం సంధించిన ప్రక్కనున్న ప్రశ్నల్లో తాత్వికత ధ్వనించినా సైన్స్ అన్వేషించేది ఆ ప్రశ్నలకు సమాధానాలే! వాక్చాతుర్యంతో మనుషులు అబద్దాలు ప్రచారం చేస్తారేమో గాని సైన్సు భౌతికంగా అనేక రుజువులతో సత్యాన్ని మనముందు నిలబెడుతుంది. సైన్సు వెలుగులో ప్రజలకు సత్యమార్గం చూపించడానికి అహర్నిశలు ప్రయత్నించిన హేతువాది పుష్ప మిత్ర భార్గవ. ఈనాడు పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లోనే గాక మేధావుల గొంతుకలను నులమడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఎండ గట్టిన వాడు భార్గవ.

1944 లో బి.ఎస్సి పట్టా పొంది, 1946 లో సేంద్రీయ రసాయనాల శాస్త్రాల్లో (Organic chemistry) పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి 21 ఏళ్ళ చిరుప్రాయంలోనే పిహెచ్.డి పట్టాను లక్నో యూనివర్సిటీ నుండి స్వీకరించాడు. కొంతకాలం ఆయున లక్నో యూనివర్సిటీలో లెక్చరరుగా తర్వాతి కాలంలో ఉస్మానియా యూనిర్సిటీలో లెక్చరర్‌గా చేరి హైద్రాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆ పైన CSIR లో పరిశోధక విద్యార్థిగా చేరి 23 ఏళ్ళ వయస్సులోనే 14 పరిశోధనా పత్రాలు సమర్పించాడు. 1953లో పోస్ట్ డాక్టోరల్ ఉపకారవేతనం మీద అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో ప్రయోగశాలల్లో కొంత కాలం పరిశోధనలు చేశాడు. కేన్సర్ ఔషధం 5-ప్లోరో యురాసిల్ కనుగొనడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. మూడేళ్ళ తర్వాత యునైటెడ్ క్రింగ్డమ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చిలో కాలం పనిచేసి 1958 లో ఆయన తిరిగి హైద్రాబాదు చేరుకున్నాడు. సైంటిస్తుగా ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (Regional Research Laboratary) లో చేరాడు. ఈ ప్రయోగశాలనే మనం ఈ రోజు భారత రసాయన సాంకేతిక సంస్థగా (Indian Institue of Chemical Technology -IICT) 5 eso62Nyo. 1971-72 లో ఆయన ఇన్స్టిట్యూట్ డూ రేడియం, పారిస్ (ఫాన్సు) లో కొంతకాలం కేన్సర్ పైన పరిశోధనలు చేశాడు.

ఆయనకు కేంద్రప్రభుత్వంలోని వరిసగా ప్రధానులందరితో సన్నిహిత పరిచయం వుంది. 1977లో ఆయన హైద్రాబాదులో కేంద్రీయ కణ మరియు అనుజీవన పరిశోధనాలయం (Center for Cellular and Molecular Biology - CCMB) ని స్థాపించి దానికి వ్యవస్థాపక సంచాలకునిగా పనిచేశాడు. (ఏప్రిల్ 1977 నుండి - ఫిబ్రవరి 1990 వరకు) P-32 న్యూక్లియోటైడ్ అనుమాత్రికలను (molecular segments) తయారు చేయడం కోసం హైద్రాబాదులోనే అణుశక్తి ప్రయోగశాల 'జోనకి’ విభాగాన్ని నెలకొల్పాడు. 'గుహా పరిశోధక మహాసభల” (Guha Research Conferance) ను నిర్వహించాడు. భారత ప్రభుత్వంలో జీవ సాంకేతిక శాస్త్ర (Biotechnology) విభాగాన్ని నెలకొల్పడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. దీనికోసం మాక్స్-ప్లాంక్ జీవ భౌతిక శాస్ర సంస్థ, గోటెన్జెన్ (జర్మనీ) తో కలసి పనిచేశాడు. 2005లో భారత వైద్యపరిశోధక సంస్థ (Indian Councel for Medical Research - ICMR) లో ప్రత్యుత్పత్తి సహాయక సాంకేతికత (Assissted Reproductive Technology – ART) ను వాడే వైద్య విధానాలకోసం మార్గదర్శకాలు రూపొందించాడు. National Knowledge Commission-NKC కి ఉపాధ్యక్షునిగా (2005-2007) పనిచేసిన ఆయన తన భావాలకు విరుద్ధంగా అభిప్రాయాలు వెలిబుచ్చిన ఆ సంస్థ అధ్యక్షుడు శామ్ పిట్రోడాతో విభేదించి రాజీనామా చేశాడు . DNA Finger Printing ఆవిష్కరించి నేర పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చిన వాడు పి.యం భార్గవ.

1975 లో జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణా సంస్థ (NCERT) సంచాలకుడైన రయిూస్ అహ్మద్ విద్యార్థుల్లో సైన్స్పట్ల ఆసక్తి రేకెత్తించే విధంగా ఒక సైన్సు ఎక్టిబిషన్ రూపొందించాల్సిందిగా పి యం భార్గవని కోరాడు. హైద్రాబాదులో ప్రస్తుత IICT 53 & Method of Science (శాస్త్రీయ పద్ధతి) అనే సైన్స్ ఎక్టిబిషన్ రూపుదిద్దుకుంది. బాల్ భవన్, ఢిల్లీలో జనవరి-మార్చి 1977లో ప్రారంభించిన ఈ ఎక్టిబిషన్ జనతా ప్రభుత్వంలోని మితవాదులకు కంటగింపుగా తోచింది. 1978లో ఈ ఎక్టిబిషన్ని చడీ చప్పడు లేకుండా కనపడకుండా చేశారు. దానితో రాజధానిలో గగోలు, ఆందోళనలు జరిగి, విషయం న్యాయ స్థానాల వరకు వెళ్ళింది. చివరకు ఈ పరికరాలన్నింటినీ కోర్డు సాయంతో కనుగొన్న తర్వాత ఆ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని కొనుగోలు చేసి హైద్రాబాదుకి తరలించింది. విద్యావిషయిక ఆకర్షణగా వెలుగొందిన ఈ ప్రదర్శన కేంద్ర గ్రంధాలయంలో లక్షలాది విద్యార్థులకు, ప్రజలకు ప్రాథమిక వైజ్ఞానిక అవగాహనను కల్పించింది. కాలక్రమేణా ప్రభుత్వ సాయం అందకపోవడంతో దీనిని బిర్గా సైన్స్ సెంటర్‌కి తరలించారు. కానీ, ఇది అక్కడ కూడా ఇప్పటి వరకు ప్రదర్శనకు నోచుకోలేదు. ఈ ప్రదర్శనకు సంబంధించిన కథ అంతటినీ బి. ప్రేమానంద్ రచించిన "ఒక కళాత్మక విజ్ఞాన శాస్త్ర నిర్మాణ విధ్వంసం" (Vandalization of a Work of Art and Science) అనే పుస్తకం వివరిస్తుంది.

1963 లో ఆయన సతీష్ ధావన్, అబుర్ రహమాన్‌తో కలసి శాస్త్రీయ దృక్పథం పెంపుదలకు జాతీయ సంఘాన్ని నెలకొల్పాడు. 1980 రాజారామన్న పి.ఎన్ హక్సర్‌తో కలసి భార్గవ “శాస్త్రీయ దృక్పథ ప్రకటన” (A Statement on Scientific Temper) తయారు చేశాడు. ఈ నివేదిక భారత సామాజిక వ్యవస్థలో రావలసిన మార్పులను చర్చించింది.

భార్గవ పొందిన దేశ విదేశ అవారులకు లెక్కలేదు. ఫ్రాన్స్ దేశపు ప్రెసిడెంట్ యిచ్చే లీజియన్ డి ఆనర్? (1998) అవారు పొందిన ఘనత పియం భార్గవది. భారత ప్రభుత్వం ఆయనను 1986 లో 'పద్మభూషణ్ సత్కరించింది. ఈ మధ్యకాలంలో మతఛాందసత్వం దేశంలో వ్యాపిస్తున్న అసహనంపట్ల ధాబోల్కర్, పన్సారే, కల్బురీ ల హత్యల పట్ల కలత జెందిన భార్గవ ఆ సత్కారాన్ని 2015లో తృణపాయంగా భావించి వాపసు చేసూ తన నిరసనను ప్రకటించాడు. ఆయన ప్రజాపక్షపాతి. ప్రజలను చైతన్యపర్చడంలో ప్రముఖ పాత్ర నిర్వహించిన సేవాతత్పరుడు. Medically Aware and Responsible Citizens of Hyderabad - MARCH ని స్థాపించి అల్లోపతి మందుల ప్రామాణికత మీద ప్రతినెలా అవగాహన కలిగించేవాడు. జన విజ్ఞాన వేదికకు ఆయన ఆలంబనగా నిలిచి సైన్సు ప్రచార కార్యక్రమంలో 89 సంస్థను ముందుకు నడిపించాడు. చేపమందు అశాస్త్రీయతను ప్రశ్నించి న్యాయస్థానం వరకూ వెళ్ళి అది 'మందు కాదనీ కేవలం "ప్రసాదం" అని ఆ చేపమందు పంపిణీదారులు పలాయనం కావడానికి కారణమయ్యాడు. పాలకులు విశ్వవిద్యాలయాల్లో జ్యోతిశాస్రాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసించాడు. వాస్తు ప్రామాణికతను ప్రశ్నించాడు. సమగ్రమైన చర్చలేకుండా జీవసాంకేతిక మార్పులతో కూరగాయలను మార్కెట్లోకి ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాడు. శ్రీమతి చందనా చక్రబర్తి సహ రచయిత్రిగా ఆయన రచించిన పుస్తకాలు ‘An agenda for The Nation’, ‘Two Faces of Beauty, Science and Art’, ‘Angels, Devils and Science’, ‘The Saga of Indian Science Since Independence in a Nutshell’, ‘Proteins of Seminal Plasma’ (శివాజీ, కార్ల్ హైండా ఫైట్ సహకారంతో) ప్రజా సైన్స్ ఉద్యమానికి బలమైన ఊతమిచ్చాయి.

లౌకికవాద సమాజం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో ప్రజా సైన్సు ప్రచార సంస్థలకు, హేతువాదులకు ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన నుండి నిర్భీతిగా సత్యాన్ని ప్రేమించి దాని కోసం పోరాడే స్పూర్తిని అందరం పొంది శాస్త్రీయ దృక్పథ ప్రచారంలో నిరంతరం పాల్గొనాలి.

ఒట్టో వలాష్ (క్రీ.శ.1847 -1931)

ottoovalish.jpgసుగంధ పరిమళాలు, లేపనాలు, తదితర సువాసనా ద్రవ్యాలు ప్రత్యేకమైన రసాయనిక పదార్థాలు.

సుగంధాలు నాగరికతలోమమేకమైనాయి. పురాతన, కాలంలో ఎవరో వర్తకులు, ప్రజలు సుగంధాల వాణిజ్యంలో పేరు పొంది ఉన్నారు. భారతదేశం సుగంధాలకు మారుపేరుగా ఉండేది.

సుగంధాలు పరిమళాలు ఎక్కువ భాగం సహజంగానే చెట్టు నుంచి, జంతు భాగాల నుంచి లభిస్తున్నాయి.

అలాంటి సుగంధాల రసాయనిక నిర్మాణాన్ని కనుగొన్నాక వాటి లక్షణాలే ఉండే విధంగా కృత్రిమంగా కూడా సుగంధ రసాయనిక పదార్థాల్ని ప్రయోగశాలల్లోనూ, పరిశ్రమల్లోనూ తయారు చేస్తున్నారు. పాశ్చాత్య నాగరికత , వాణిజ్య మరియ జీవన విధానం అలవాటయ్యాక మధ్య తరగతి, ఉచ్చ తరగతి ప్రజానీకంలో సుగంధ ద్రవ్యాలు, పరిమళాల వాడకం హెచ్చయ్యింది. అందాల పోటీలను నిర్వహించి వాటికి ఎప్పుడూ లేని వ్యాపార ప్రతిపత్తిని కల్పించి కోట్లు పోగేసుకుంటున్నారు. అయితే సుగంధ ద్రవ్యాలన్నీ వ్యాపార నిమిత్తమే కాకుండా సత్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని ఔషధాలల్లోనూ, పానీయాల్లోనూ, ఆహార పదార్థాల్లోనూ, పిండి వంటల్లోనూ, పరిసరాల పరిశుభ్రతకు కూడా వాడుకొంటున్నాము.

ఇలాంటి సత్ప్రయోజనాలను ఆశించి సుగంధ రసాయనిక పరిశోధనల మీద విస్తృత ప్రయోగాలు చేసి కీర్తి గడించిన వాడు 17.3.1847 నాడు రష్యాలో జన్మించి ఆ తరువాత జర్మనీలో స్థిరపడ్డాడు. వల్లాష్ గల్టింగన్ విశ్వవిద్యాలయంలో వోలర్ వద్ద డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు. యూరియా తయారీకి పేరెన్నిక గన్న వోలర్ గురించి మీరు వినే ఉంటారు. ఆ తర్వాత 1870 లో ఆగస్ట్ కెకులే వద్ద పరిశోధనలు జరిపాడు. బెంజీన్ పదార్థంలో అణువులు సమ షష్టి భుజి నిర్మాణంలో ఉంటాయని చాటిన వాడు కేకులే. ఇంత గొప్ప వ్యక్తుల దగ్గర పనిచేయడం వల్ల వల్లాష్ కూడా గొప్ప వాడయ్యాడు. ఆయన క్రమేపి సుగంధ ద్రవ్యాల మీద మనసు పడ్డాడు. వివిధ పరిమళ ద్రవ్యాలు, రసాయనికంగా వేర్వేరని అందరూ అంతవరకు భావించేవారు. అయితే అవన్నీ కూడా టర్పీన్ లనే ఒక ప్రత్యేక తరహా రసాయనిక సమ్మేళనాల తరగతికి చెందినవని వల్లాష్ ఋజువు చేశాడు. కర్పూరం, మెంథాల్, సిట్రాల్ వంటివన్నీ టర్పీన్లే ఇలాంటి వందలాది పదార్థాలన్నింటిలోనూ ఒక రసాయనిక నిర్మాణాంశం సార్వత్రికంగా ఉన్నట్లు ఋజువు చేశారు. మొదట కేకులే కూడా ఇవన్నీ వివిధ రకాల పదార్థాలని విశ్వసించారు. వల్లాష్ ఆ రకంగా గురువును మించిన శిష్యుడయ్యాడు. సుగంధాన్ని విరజిమ్మే అనేక వందల పదార్థాలల్లో ఐసాప్రిన్ భాగం సార్వత్రికంగా ఉన్నట్లు సోదాహరణంగా, ప్రయోగ పూర్వకంగా ఋజువు చేసిన వలాష్ ను పరిమళాల పితామహుడు అంటారు. నిరాడంబరతకు, నిస్వార్థతకు పేరిన్నికగన్న వల్లాష్ చేసిన కృషికి గానూ, 1910 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమానం ఈయనను వరించి నోబెల్ బహుమతికి సుగంధం అబ్బింది.

క్లాడిలూయిస్ బెర్తోలెట్

cleediluyus.jpgఅనువర్తిత రసాయనశాస్త్రానికి సంబంధించి క్లాడిలూయిస్ బెర్తోలెట్ శాస్త్రవేత్త ను ఆద్యుడిగా పరిగణిస్తారు. వీరు 1748 డిసెంబర్ 9న ఫ్రాన్సు లో సావో జిల్లాలో జన్మించారు. ఇటలీ విశ్వవిద్యాలయంలో వైద్యపట్టాపొందారు.

1768 నుండి 1772 దాకా వైద్యవృత్తి చేసాడు. 1778 లో రెండు వైద్య శాస్త్ర పట్టా లభించింది. దాంతో పాటు రసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేసారు. 1785 లో బెర్తోలెట్ రసాయనిక శాస్త్రపు కొత్త వ్యవస్థను ప్రతిపాదించాడు.అది లెవోయిజర్ రూపకల్పన చేసిన ఆధారంగా రూపొందించబడింది.

ఇతని ఉద్యోగజీవితం నెపోలియన్ హయాంలో తారాస్థాయిని తేరుకుంది. నెపోలియన్ కు బెర్తోలెట్ అంటే ఎంతో అభిమానం ఉండేది. ఇటలీలో నుండి పాతచిత్రపటాలను ఫ్రాన్స్ కు తెచ్చే కమీషన్ కి బెర్తోలెట్ను పంపాడు నెపోలియన్. 1798 లో నెపోలియన్ తో ఈజిస్ట్ వెళ్ళాడు. అక్కడ తన చిరకాల మిత్రుడు మంగేతోపాటు రెండేళ్ళు ఉండి నెపోలియన్ వల్ల ఎన్నో ఉన్నత పదవులు పొందారు.

20సం,, వెచ్చించి ఎన్నో ప్రయోగాలు చేశాడు. అమ్మోనియా వేడితో నిర్మితమైందో వివరించారు. గన్ పోడర్ ను మరింత శక్తివంతం చేయడానికి కృషిచేసాడు.

పొటాషియం క్లోరేట్, కర్బనం మిశ్రమంతో తుపాకీ మందు తయారుచేసి 1788 లో ప్రజలు సమక్షంలో ప్రయోగించారు. ఈ ప్రయోగం తర్వాత మిలటరీలో వాడబడింది. క్లోరిన్ వాయువును బ్లీచింగ్ గా వాడటానికి కృషిచేశారు. ఇతని సమకాలీనుడు జేమ్స్ వాట్ లాగా ఇతను తన ఆవిష్కరణలతో ధనం సంపాదించలేదు.

ఈజిప్టులో ఉన్నప్పుడు సోడియం కార్బనేట్ ను నిరంతరం ఉత్పత్తి చేసే సహజ ప్రక్రియను గుర్తించాడు. ఎడారిలో సంభవించే ఈ సహజ ప్రక్రియకు సైద్దాంతిక వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సహజమైన ఉప్పు నిరంతరం విడిపోయి సోడియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్లు ఏర్పడాతాయని వివరించాడు.

బెర్తోలెట్ తన రసాయన శాస్త్ర పరిశోధన అంతా రెండు పుస్తకాలుగా రూపొందించాడు.

“Researches in the laws of chemical affinity (1801) Essay on chemical; statistics”

1807 లో సోషల్ ఆఫ్ అక్వేరియల్ అనే సంస్థ బెర్తో లెట్, లాప్లాస్ ల నేతృత్వంలో ఏర్పడింది. 1810 లో అతని కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంలో బెర్తో లెట్, జీవితం విషాదమయమైంది. 1822 నవంబర్ 6న బెర్తో లెట్ Arcuil లో చనిపోయాడు.

రచయిత: N.V.S. రఘు ప్రదీప్

ప్రవర్తనా మనస్తత్వ సిద్దాంతకర్త ఇవాన్ పావ్ లోవ్

evaan.jpgశరీర నిర్మాణ శాస్త్రవేత్త మనస్తత్వ శాస్త్రవేత్త మారి ఆహారానికి సంబంధించి జంతువులలో ఎటువంటి స్పందన ప్రతిచర్య ఉంటుందో అధ్యయనం చేసిన రష్యా శాస్త్రవేత్త ఇవాన్ పెట్రోవిచ్ పావ్ విచ్ 1849 సెప్టెంబర్ 26 మాస్కోలో జన్మించాడు.

1883 లో పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయం లో వైద్యం లో డిగ్రీ పొందాడు. 1885 లో శరీర ధర్మ శాస్త్ర ఆచార్యునిగా మిలటరీ మెడికల్ అకాడమీ లో చేరాడు. 1897 లో ఇన్సిట్యూట్ ఆఫ్ ఎక్స పెరి మెంటల్ మెడికల్ డైరక్టర్ పదవీ బాధ్యతలు నిర్వహించారు.

పావ్ లోవ్ జీర్ణక్రియ విధానాన్ని వివరించాడు. అదే అటు తరువాత గాస్ట్రో ఎంమటారజికి దారి తీసింది. ఈ ప్రక్రియలో లాలాజలగ్రధులు. ఉదరం, క్లోమం, కాలేయం, ఎలా రసాయనాలు కలుపుతూ ఆహారం కార్బొహైడ్రేటులు, ప్రాటీ నులు, క్రొవ్వులుగా మారుతుందో అధ్యయనం చేసాడు. ఎంటరో కైనేజ్ అనే ఎంజైమ్ ను కనుగొన్నాడు. 1920 లో జంతు ప్రవర్తనా సిద్దాంతాన్ని ప్రతి పాదించారు.

అతని ప్రకారం నేర్చుకొన్న ప్రవర్తన అనేది, అసంఖ్యాకమైన నిబందనాయుత ప్రతి చర్యల సమాహారం నిర్మాణం అని వివరించాడు. ఉద్రిక్తత భయం విపరీత ప్రపర్తనకు దారి తీస్తాయని, అందుకే ప్రశాంతంగా ఉండే పరిసరాల మద్య ఉండాలని పావి లీవ్ అంటారు.

నబంధనాయుత ప్రతిచర్య ప్రవర్తన సైరాబైల్ కార్టిక్స్ లోని విపరీత ప్రవర్తన కారణంగా కలుగుతున్న పావ్ లోన్ వివరించాడు.

1904 లో జీర్ణక్రియకు సంబంధించిన పరిశోధనకు నోబెల్ బహుమతి లభించింది. ఫిబ్రవరి 27వ పావ్ లీవ్ మరణించాడు.

ప్రాణి మూలాన్ని తెలియజేసిన “ఫ్రాంసిస్ క్రిక్”

franciscreek.jpgవిజ్ఞానశాస్త్రం మానవ జీవితాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ వుంది. ఈనాడు జీవకణ శాస్త్రం, బయోటెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం, మానవిని జీవరహస్యాన్ని ఛేదించే దశకు చేరడానికి అవకాశం కల్పించిన శాస్త్రవేత్తలలో “ఫ్రాంసిస్ క్రిక్” ముఖ్యులు. ఆధునిక జీవశాస్త్ర శిల్పిగా ప్రపంచమంతా ఈయనను గుర్తించింది.

“ఫ్రాంసిస్ క్రిక్” తన మిత్రుడైన జేమ్స్ వాట్స న్ తో కలిసి “D.N.A” (డీఆక్సీ రైజో న్సూక్లి క్ ఆసిడ్) నిర్మాణాన్ని బహిర్గతం చేయడం జన్యుశాస్త్ర విస్తరణకు ఎంతగానో తోడ్పడింది. వీరి పరిశోధనలు 19వ శతాబ్దపు డార్విన్ పరిణామ సిద్ధాంతం, మెండల్ అనువంశిక సిద్ధాతాల కొనసాగింపుగా బావించవచ్చు.

మనం నేడు జీవశాస్త్ర లోతుల్లోకెళ్ళి జన్యు మార్పిడి ద్వారా జీవి లక్షణాన్ని మార్చగలిగే స్థాయికి చేరేందుకు పునాదు లేసిన ఫ్రాంసిక్ క్రిక్ ప్రారంభదశలో జీవశాస్త్ర వేత్తకాదంటే నమ్మబుద్దికాదు. ఈయన ఇంగ్లాండ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో భౌతిక పరిశోధనా విద్యార్థిగా వున్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ కాలంలో ఆయనకు జీవశాస్త్రం పై అభిరుచి కలిగి జీవరసాయన శాస్త్రాల అధ్యయనానికి పూనుకొన్నాడు. కణరసం భౌతిక లక్షణాలపై పరిశోధన చేపట్టాడు. క్రమంగా జన్యువుల అమరికను గురించి అర్థంచేసుక ని, అమైనో ఆమ్లాల ఆధారితమైన “D.N.A” యొక్క రూపాన్ని అవిష్కరించారు. జేమ్స్ వాట్స న్ తో కలిసి క్రిక్ చేసిన పరిశోధనకు 1962 లో నోబెల్ బహుమతి లభించింది.

ఆనాటికి క్రిక్ కు డాక్టరేట్ కూడాలేదు. క్రిక్ తన పరిశోధన కొనసాగింపుగా జీవి శరీర నిర్మాణానికి కీలకమైన మాంసకృత్తులు ఏరంకంగా తయారవుతాయో తెలిపాడు.

క్రిక్ జీవితం కూడా ఆదర్సప్రాయం. నిరాడంబర జీవితం గడిపారు. బహుమతులకు వెంపర్లాడలేదు. ప్రపంచ స్థాయిలో తాను పొందిన గుర్తింపును ప్రచారాలకు వ్యాపారానికీ వాడుకోలేదు. అందుకే ఆయనకు 1999లో ఇంగ్లాండ్ దేశ అత్యున్నత అవార్డు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చారు. ప్రజా సైన్స్ ఉద్యమాల మార్గదర్శి డా. డె.డి. బెర్నాల్ వంటివారి పరిశోధనలు, క్రిక్ పరిశోధనల ప్రభావితం చెయ్యడం మరో విశేషం.

తన పరిశోధనా ఫలితాల పునాదులపై విస్తరిస్తన్న జీవసాంకేతిక రంగాన్ని క్రిక్ తన జీవిత కాలంలోనే చూడగలడం విశేషం. మానవ జన్యువు లక్షణాలు విశదంగా క్రోడీకరించగల శాస్త్రరంగ అన్వేషణ క్రమంలేనే ఫ్రాసిస్ క్రిక్ 2004 జూలై 28వతేది (తన 88వ ఏఠ) తనువు చాలించాడు. ప్రజాశాస్త్రవేత్తగా మన హృదయాలలో నిలిచిపోయాడు.

రచయిత:ప్రొ,,యన్.వేణుగోపాల్ రావు, తిరుపతి.

ఫిలిప్ వారెన్, యాండెర్ సన్

ఈ నెలలో మనము ఒక యువ శాస్త్రవేత్త కృషి గురించి తెలుసుకొందాం.

1923 సం,,లో జన్మించిన ఈ యువ శాస్త్రవేత్త అమెరికా దేశానికి చెందినవాడు. 1977 వ సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని తన సహచరుడు జాన్ వాన్ వ్లీక్ తో కలిసి పొందాడు.

అయస్కాంత, స్ఫటిక ఘానాలలో ఎలక్ట్రానుల ప్రవర్తన గురించి తాను చేసిన కృషికి ఈ పురస్కారాన్ని పొందాడు.

1960 వ దశకంలో లోపాల, మిశ్రమలోహాల అయస్కాంత లక్షణాలను అంతర్గత అణువులు ఎలా ప్రభావితం చేస్తాయో తెలిపేందుకు యాండర్ సన్ నమూనాను కనుగొన్నాడు. అలాగే స్ఫటిక పదార్థాలలో మలిన కణాల కదలికలను కూడా వివరించాడు. ప్రస్తుతం ఈ వివరణను యాండర్ సన్ లోకలైజేషన్ పేర పిలుస్తున్నారు.

వీరు సూపర్ కండక్టివిటీ, సూపర్ ప్లుయిడిటీ, లేజర్ యాక్షన్ ల మధ్య గల సంబంధాలను కూడా అధ్యయనం చేశారు. సూపర్ కండక్టివిటీ లో నిరోధకశక్తి ఉందని ఊహించారు.

కంప్యూటర్ మెనరీలు, ఎలక్ట్రానిక్ స్విచ్ లు వంటి పరికరాలలో ప్రస్తుతం వాడే ఖరీదైన సెమీ కండక్టర్ స్పటికాలకు బదులు అసంఘటితంగా ఉన్న గాజురూప ఘనాలు కూడా వాడవచ్చునని వీరి అధ్యయనాలు తెలియజేశాయి. తద్వారా ఎలక్ట్రానిక్ రంగానికి తను విశేషమైన సేవలు అందించారు.

రచయిత: పి.వి. కృష్ణారావు, చింతకాని.

బీర్బల్ సహానీ ( 1891 – 1949 )

బీర్బల్ సహానీ పేరు వింటే చాలు ఎంతో మందికి పురావృక్ష శాస్త్రం గుర్తుకు వస్తుంది. మన దేశంలో పురావృక్షశాస్త్రం గురించి లోతుగా పరిశోధన చేయటం వీరితోనే మొదలయింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ శాస్త్రవేత్త ఒకచిన్న బోటనీ మ్యూజియంలో కూర్చుని పరిశోధనలు చేయటం ఒక విదేశీ శాస్త్రవేత్తను సైతం ఆశ్చర్య చకితుడిని చేసింది.

బీర్బల్ సహానీ నవంబర్ 14, 1891 న ఇప్పటి పాకిస్థాన్ లోని “భేరా” లో జన్మించారు. చిన్నప్పటి నుండి ఈయనకు మొక్కలను, రాళ్ళను, శీలాజాలను పరిశీలించడం పట్ల ఆసక్తి చూపేవారు. ఈయన లాహోర్ లోని పంజాబ్ యూనివర్సిటీ నుండి పట్ట బద్రుడైన తర్వాత బ్రిటిన్ లోని “లండన్ యూనివర్సిటీ ” నుండి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పట్టా పుచ్చుకున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి కూడా ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పట్టాను పుచ్చుకున్న ప్రథముడిగా కీర్తి గడించారు. 1936 లో సహానీని “ఫెలో ఆఫ్ ది రాహల్ సొసైటీ గా” ఎన్నుకున్నారు.

ప్రాచీన శిలాజ మొక్కల గురించి కూలంకషంగా అధ్యయనం చేసిన ఈయన ‘భీహార్ లోని ‘రాజమహల్ కొండలలోని సమస్త వృక్ష జాలాన్ని పరిశోధించారు. ఈయన ఆవిష్కరించిన ‘పెంటోగ్జైలియా’ అనే ‘జిమ్మోస్పెర్మ్’ శిలాజం ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రజ్ఞుల దృష్టిని ఆకర్షించింది.

సహాని ‘భూగర్భ’ శాస్త్రవేత్త కూడా. కొన్ని రకాల శిలల వయస్సును సున్నితమైన పరికరాలు లేకపోయిప్పటికీ ఖచ్చితంగా నిర్ణయించారు. మధ్యప్రదేశ్ లోని ‘డెక్కన్ ట్రూవ్స్’ శిలల వయస్సు 62 కోట్ల సంవత్సరాలని తెలిపారు. ఈయన చిత్రకారుడు కూడా, స్టాంపులు, నాణేలు సేకరించటం అంటే ఇష్టం.

1949 సం,, లో భారత ప్రధాని “బీర్బల్ సహానీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పేలియో బోటనీ” సంస్థకు శంకు స్థాపన చేసిన కొద్ది రోజులకే ‘సహాని’ కన్నుమూశారు. పరిశోధనలు అంటే ప్రాణంగా భావించే సహానీ అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉంటారు.

రచయిత: యు.వి.కే.శర్మ, PS.ఆనందసాగర్

బెకెసీ గియర్గాన్ (1899-1972)

bekacigiyargaan.jpgబాలలూ టెలిఫోన్లు, రేడియోలు తదితర సమాచార సాధనాలకు సంబంధించిన ఒక ఇంజనీర్ శరీర ధర్మ శాస్త్రానికి సంబంధించిన అంశంలో చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి పొందాడంటే నమ్మగలరా ? అయినా ఇది సత్యం. బెకెసీ గియర్గాన్ స్వతహాగా టెలికమ్యూనికేషన్లకు సంబంధించిన ఇంజనీర్. పరిశ్రమల్లో పనిచేసే పారిశ్రామిక శాస్త్రవేత్త. ఈయన మనచెవిలో ఉండే లోపలి చెవి భాగంలో స్ప్రింగులుగా మొత్తగా ఉండే కాక్లియా ఏవిధంగా పనిచేస్తుందో వివరించాడు. వినడం కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ కదా.

బెకెసీ గియార్గాన్ 1899 సంవత్సరంలో హంగెరీ లో జన్మించాడు. తరువాత అమెరికాలో స్ధిరపడ్డాడు. మనకు సెల్ ఫోన్లను ఇచ్చే ఒక సంస్ధ సీమన్స్ కంపెనీ. ఇది జర్మనీలో ఉంది. దీన్లో ఆయన ఇంజనీరుగా పనిచేశాడు. 1946 లో స్వీడన్ కు వెళ్ళి అక్కడ పరిశ్రమల్లో పనిచేస్తూనే బోధన వృత్తిని కొనసాగించాడు.

అంతవరకూ పంచేద్రియాల్లో ఒకటైన చెవిఎలా పనిచేస్తుందో కొద్దోగొప్పో అందరికీ తెలిసినా, లోపలిచెవిలో వినికిడి యంత్రాంగం ఎలా పనిచేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. గాలిలోని ధ్వని తరంగాలు చెవిరంధ్రం ద్వారా ప్రయాణించి కర్ణభేరిని కదిలిస్తాయనీ, ఆ కంపనాలు చెవిలో ఉన్నప్పుడు చిన్న ఎముకల గొలుసుద్వారా, కాక్లియాకు ప్రయాణిస్తాయనీ మాత్రమే అంతవరకు తెలుసు. అయితే కాక్లియా ఎందుకు స్ప్రింగులాగా ఉందని గానీ ఆ తరువాత కాక్లియాలో ఏ చర్యలు జరగడం ద్వారా మెదడుకు సంకేతాలు వెళతాయన్న విషయంపట్ల ఎవరకీ అవగాహన లేదు. యాంత్రిక సంకేతాలు విద్యుత్ సంకేతాలుగా మారడమెలాగో అర్థంకాలేదు. గియర్గాన్ హార్వర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ అక్కడే చెవిపనిచేసేవిధానం పట్ల లోతైన పరిశోధనలు చేశారు. కాక్లియా నమూనాలను తయారు చేసి ఆ నమూనా గోడలు మందాన్ని మారుస్తూ వాటిలో రకరకాల ద్రవాలను నింపి ఆ ద్రవాల్లో అల్యూమినియం పొడిని కలిపి విద్యుత్ సంకేతాలు పంపేవాడు. ధ్వని తరంగాలను పంపి వివిధ ప్రాంతాల్లో వివిధ మోతాదుల్లో ధ్వని వ్యతిరేకంగా గుర్తించాడు. ధ్వనితరంగాలు కాక్లియాలోని ద్రవం గుండా ప్రయాణిస్తూ కంపనాలను కలిగిస్తాయనీ పీజో ఎలక్ట్రసిటీ లనే దృగ్వియం ద్వారా ధ్వని తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారతాయనీ, అవి కర్ణనాడుల ద్వారా మెదడుకు చేరుతాయని వివరించాడు.

ఈయన చేసిన కృషికి గుర్తింపుగా 1961 సంవత్సరపు వైద్యశరీర ధర్మాల రంగపు నోబెల్ బహుమతి ని గియార్గన్ కు బహుకరించారు.

పిల్లలు చూశారా ఇంజనీర్ అయినా ఇతర రంగాల్లో కూడా అవగాహన ఉండడం వల్ల అంతరీయ రంగాల పరిశోధనలెలా వీలవుతాయో ! మీరు కూడా విజ్ఞానాన్ని అన్నికోణాల్లో అవగాహన చేసుకోవాలి మరి.

ఆల్ రజీ మహమ్మద్ (865 -925)

మత తత్వం కాటేసిన మధ్యయుగాల మహామేధావి

మధ్య యుగాల మహామేధావి గా పేర్కొనబడ్డ ఆల్ రజీ వైద్య శాస్త్రాన్ని కొత్తపుంతల తొక్కించిన శాస్త్రవేత్త.ఒకవైపు వైద్య పరిశోధన చేస్తూ మరోవైపువైద్యం చేస్తూ ఆయన ఆ రోజుల్లో అఖండ పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

రష్యాలో పుట్టి పెరిగిన ఆల్ రజీ బాగ్దాద్ కెళ్ళి వైద్య విద్యను అభ్యసించాడు. ఎంత చదివినా, ఎన్ని నేర్చినా అది తన దేశప్రజలకే ఉపయోగపడాలని మాతృదేశానికి తిరిగి వచ్చాడు. వైద్యం ప్రారంభించాడు. అతని పరిశోధనలకు ఎంత పేరు వచ్చిందంటే అరబిక్ గాలెన్ టైటిల్ తో ఆయన్ని ప్రపంచం గౌరవించింది. గాలెన్ చరిత్ర ప్రసిద్ధికెక్కిన గ్రీకు వైద్యుడు. అసాధారణ వైద్యుడిగా ప్రజల గుండెల్లో ఆయన నిలిచి పోయాడు. కానీ ఇదంతా ఆల్ రజీ జీవిత కాలానికి ఒక పార్శ్వం.

ఆల్ రజీ చాలా విప్లవాత్మకంగా ఆలోచించేవాడు. ఆయన ఆలోచనలు ఆయన కాలంకంటే ఎంతో ముందుండేవి. మనిషి మొదట భౌతిక వాది. హేతుతత్వం. అతని భౌద్ధిక జీవితంలో విడదీయరాని భాగం. మనిషికన్నా దైవత్వం ఏదైనా వుంటే అది అతని హేతువాద దృక్పధమే అని ఆయన నమ్మేవాడు. చెప్పేవాడు. ఈ దృక్పథమే ఆవ్ రజీకి కష్టాలు తెచ్చింది. అతని గ్రంధాల్ని, పరిశోధనల్ని వెలుగు చూడకుండా చేసింది.

ఒకానొక దుర్దినం రానే వచ్చింది. మాతానికి మత భావాలకు ఆల్ రజీ దృక్పధం విరుద్ధమైనందున ఆయన్ని రాజదర్భారుకు లాక్కొచ్చారు. నిరాకరించారు. బుఖాలా అమీర్ ఆయనకి క్రూరమైన శిక్ష విధించాడు. ఆల్ రజీ అలానే తాను రచించిన వైద్య గ్రంధంతో తన తలను తానే బాదుకోవాలి. పుస్తకమైనా చినిగిపోవాలి, తల అయినా పగిలిపోవాలి ఇదే శిక్ష. ఆల్ రజీ చేశాడు. ఫలితంగా అతడి రెండు కళ్ళూపోయాయి.

దీంతో ఆల్ రజీ కి ఈ ప్రపంచం మీదే నమ్మకం పోయింది. విరక్తి పుట్టింది. కళ్ళకు చికిత్స చేస్తే చూపు వస్తుందని మిత్రులు చెప్పినప్పుడు ఇక చాలు ఈ ప్రపంచాన్ని చాలా చూశాను. ఇంకా చూడాలని లేదు అని వారించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన మరణించాడు.

మేరీక్యూరీ (1867 – 1934)

రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన గొప్ప శాస్త్రవేత్త

mercury.jpgతన అద్వితీయ ప్రతిభాపాటవాలతో రేడియంను కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త మేరీక్యూరీ. 19వ శతాబ్దంలో స్త్రీలకు లలిత కళలు, సామాజిక శాస్త్రాలు తప్ప సైన్సు చదవడానికి స్త్రీలునిరాకరించేవారు. తన నిరంతర పరిశ్రమ, పట్టుదలతో కృషిచేసి నోబెల్ బహుమతి మొట్టమొదటగా పొందిన ధీరవనిత మేరీక్యూరీ. 1903 ఫిజిక్స్ లోను, 1911 లో కెమిస్ట్రీ లోను రెండుసార్లు నోబెల్ బహుమతులు పొంది చరిత్ర సృష్టించింది.

మేరీక్యూరీ 1867 లో పోలెండ్ లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. హైస్కూల్ స్థాయిలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా గుర్తించబడినా పెదరికం వల్ల చదువు మాని, 10 సంవత్సరాల పాటు ధనికుల ఇండ్లలో పిల్లల్ని చూసే సహాయకురాలుగా గడిపింది.

24 సం. ల వయస్సులో కొంత డబ్బు కూడబెట్టుకొని ఆస్ట్రియాలోని క్రాకో యూనివర్సిటీలో చేరబోతే స్త్రీలు సైన్సు చదవడానికి వీలులేదు పొమ్మన్నారు. చివరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు వచ్చి ప్రఖ్యాత పారిస్ యూనివర్శిటీలో సైన్స్ విద్యార్థినిగా చేరింది. చేరిన మరుక్షణం నుండి మేరీ తన చదువుపైనే మనసు కేంద్రీకరించి రాత్రింబవల్ళు కృషిచేసింది. పేదరికంలో మగ్గుతున్న తను కొద్దపాటి డబ్బుతో చదువుకోవాలి. ఒక చిన్న గదిలో అతి తక్కువ ఖర్చుతో, అర్థాకలితో, చలి దేశమైన ఫ్రాన్సులో ఎముకలు కొరికే చలి ఉన్నా, చేతులు కొంకర్లు పోతున్నా ఒక్కతే అర్థరాత్రి దాటేవరకు తదేక దీక్షతో చదివేది. చివరి పరీక్షలలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థినిగా విజయం సాధించింది.

తన పరిసోధనా కృషిలో మేరీకి ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు పీరీక్యూరీ తో పరిచయం ఏర్పడింది. పరిచయం అనురాగంగా మారి వారిద్దరూ భార్యాభర్తలయ్యారు. వారి పెళ్ళి మత విశ్వాసాలకు దూరంగా చాలా నిరాడంబరంగా జరిగింది.

రేడియో యాక్టివ్ పదార్థం పిచ్ బ్లెండ్ మీద జరిపిన పరిసోధనా ఫలితంగా మేరీక్యూరీ, పీరీక్యూరీ 1898 లో పోలోనియం కనుగొన్నారు. మేరీ తన స్వదేశమైన పోలండ్ జ్ఞాపకార్థం ఆ కొత్త పదార్థానికి పోలోనియం అని పేరు పెట్టింది. మరికొద్ది నెలల్లోనే వారు ఉభయులూ క్యాన్సర్ చికిత్సకు అతి ప్రధానమైన రేడియంను కనుగొన్నామని ప్రకటించారు. రేడియో అణుభారం 22.5. రేడియం యురేనియం కంటే 20 లక్షల రెట్లు శక్తివంతమైనది. సీసంలో తప్ప మిగిలిన అన్నింటిలో దాని కాంతి రేఖలు ప్రసరించగలవని ఈ యువశాస్త్రవేత్తలు కనుగొన్నారు. రేడియం చాలా ఖరీదైనది. ఒక గ్రామ్ రేడియం విలువ 7 లక్షల 50 వేల గోల్టు ఫ్రాంకులు.

మేరీ పరిసోధనకు ఆమెకు డాక్టరేట్ లభించింది.నోబెల్ బహుమానాన్ని పీరీ దంపతులకు ఇచ్చారు. రేడియో కనుగొనగానే దాన్ని వైద్యశాస్త్రంలో చికిత్స నిమిత్తం వాడడం ప్రారంభించారు. రెడియోపై రాయల్టీ పొందే అవకాశము సైన్సు ఫలితాలు సమాజం కోసం ఉపయోగపడాలన్న ఆశయంతో, తమకు రాయల్టీలు అక్కర్లేదని, విద్య, వైద్య విజ్ఞాన రంగాల్లో దానిని ఎవరైనా ఉత్పత్తి చేయవచ్చని, రేడియంను సంగ్రహించే విదానాన్ని దేశదేశాలవారికి తెలియజేశారు. తన భర్త పీరీ మరణానంతరం ఆమె ప్రాన్సులో సార్ బోర్న్ యూనివర్శిటీలో ప్రోఫెసర్ గా పనిచేసింది. 1914 ప్రపంచ యుద్ధంలో మేరీక్యూరీ X రే పరిశోధనల వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. 1934 జూలై 4న మేరీక్యూరి మరణించింది. ఈ రేడియం కనుగొనడం ద్వారా మానవ జాతి కి ఎనలేని సేవచేసిందో ఆ రేడియం కిరణాలు అధికంగా సోకి ఆమె మరణించింది. ఆమె జీవితం బావిశాస్త్రవేత్తలకు ఆదర్శంకావాలి.

లూయీ బ్రెయిలీ(1809 - 1852)

luyabrayli.jpgప్రపంచ అంధులకు జ్ఞాన కవాటాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ 1809 సం,, జనవరి 4న పారిస్ దగ్గరలోని “క్రూవే” గ్రామంలో జన్మించాడు.

బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. చదువుపై కొడుకు ఆసక్తిని గుర్తించి , పారిస్ లోని అంధుల పాఠశాలలో చేర్చాడు అతని తండ్రి. అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని, తన ప్రతిభతో చివరికి అదే పాఠశాలలో ఉపాధ్యాయుడుగా ఎదిగాడు బ్రెయిలీ.

పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై కృషిచేసాడు. 1821 లో ఛార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి, తన సైనికులు చీకటిలో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు 12 ఉబ్బెత్తు చుక్కలతో సంకేత లిపిని తయారు చేసాడు. దీని గురించి తెలుసుకున్న బ్రెయిలీ 12 చుక్కలను ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను, పదాలను అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.

ఈ నిరంతర శ్రమవల్ల 1851 లో క్షయ వ్యాధికి గురై 1852 జనవరి 6న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చి బ్రెయిలీని తమ దేశపు ముద్దుబిడ్డగా కొనియాడింది ఫ్రాన్స్.

ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ.

రచయిత: కె.వి.కె.శర్మ, పి.ఎస్.అనంతసాగర్

పీటర్ అట్కిన్స్

ఈ రోజు ప్రపంచంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భౌతిక రసాయనిక శాస్త్రం (Physical Chemistry), నిరింద్రియ రసాయనిక శాస్త్రం (Inargonic chemistry) ల్లో అత్యత ప్రామాణిక పాట్యపుస్తకాలుగా అట్కిన్స్ పుస్తకాలుంటాయి. ఈయన రాసిన ‘Physical chemistry’ పట్యపుస్తకం 9వ ముద్రణ పొదింది. పాట్యపుస్తకాలలో ఈ పుస్తకం పొందినంత ఆదరణ మరే పుస్తకం పొందలేదు. రసాయనిక శాస్త్ర అధ్యాపకుడుగా ప్రపంచప్రఖ్యాతి పొందిన సమాకాలిన శాస్త్రవేత్త పీటర్ అట్కిన్స్.

పీటర్ అట్కిన్స్ 1940 సంవత్సరం ఆగష్టు 10వ తేదిన ఇంగ్లాండులో జన్మించాడు. చాలా పేదరికంలో ఉండడంవల్ల 15వ సంవత్సరంలోనే పాటశాల విద్యకు స్వప్తి చెప్పి జీవనాధారం కోసం చిన్నపాటి ఉద్యోగాలు చేశాడు. అయితే రసాయనిక శాస్త్రంపట్ల, విద్యపట్ల తనకున్న మక్కువ,ల్ ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. విద్యపట్ల తనకున్న మక్కువ, ఆసాక్తి ఏమాత్రం తగ్గలేదు. మాన్‌శాంటో కంపెనీలో చిన్న పనివాడుగా చేరి సౌతాంప్టన్ విశ్వవీద్యలయంలో ప్రయివేటు విద్యార్ధిగా దూరవిద్య (Distance Education) కోసం ప్రయత్నించి విఫలమైనాడు,. అయితే తన ప్రతిభను ఇంటర్వ్యూలో చూపించి లైసేస్టర్ విశ్వవిద్యాలయంలో సిటు సంపాదించాడు. డిగ్రికూడా పూర్తిచేశాడు. అదే విశ్వవిద్యాలయంలో స్కాలర్ షిప్ సంపాదించడం వల్ల తన ఉద్యోగానికి స్వస్తి చెప్పిపుర్తికాలవు రసాయనిక విద్యార్ధిగా పోస్టుగ్రాడ్యుయేషన్, PhD పట్టాలను పొందాడు. ESR (Eloctron Spin Resonance) Spectroscopy లో పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. భౌతికశాస్త్రాచార్యుడుగా క్వాటం కేమిస్ట్రి, వర్ణపటమాపన పదతుల్ని, సౌష్టవం (Symmetry) సబ్జెక్టులను అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఇంగ్లాండులోని ఆక్సిఫర్డ్ రచనలో ఈయన చేసిన కృషికి గుర్హింపుగా FRS (Fellow of Royal Society) కాగలిగాడు.

పీటర్ అట్కిన్స్ గొప్ప హేతువాది. సైన్సుకు, మతానికి పొంతనికి కుదరదని ఎన్నో TV ఇంటర్వ్యూలలో వాదించాడు. సైన్‌సకు, ఛాందస వాదానికి మధ్య ఉన్న అగాధం గురించి ఎన్నో పాపులర్ సైన్స్ పుస్తకాలు రాశాడు. మానవతా వాదాన్ని ప్రోత్సహించే సంస్ధలతో కలిసి సంక్షేమ కార్యకాలాపాలలో పాల్గొంటున్నాదు. పీటర్ అట్కిన్స్ Phyical chemistry ప్రస్తావించకుండా నేడు ఆధునిక రసాయనిక శాస్త్ర పరిశోధనలు ఎక్కడా జరగవు. ఆధునిక గొప్ప 20మంది రసాయానిక శాస్త్రవేత్తలలో ఒకడిగా అట్కిన్స్ కు పేరువుంది.

ఇ.జె.కోరీ

feb2.jpgసేంద్రియ రసాయనిక శాస్త్రం (Organic Chemistry) లో, ఉన్నన్ని ప్రత్యక అనువర్తనాలు (Application) ఏ ఇతర విజ్ఞాన శాస్త్రంలోను లేవు. మన శరీరంలో జరిగే వందలాది జీవరసాయనిక చర్యల్లో 90శాతం పైగా సేంద్రియ రసాయనిక చర్యలే. మనం వాడే అనేక వస్తువుల్లో కూడా సేంద్రియ రసాయనిక ప్రధానం అటువంటి సేనంద్రియ రసాయనిక శాస్త్రంలో ఎప్పటికి అగ్రగణ్యుడు (All టైం గ్రతెస్ట్ Organic Chemist) గా పేరొందిన వాడు ఇ.జె. కోరీ .

ఈయన తన పరిశోధల ద్వారా ఎన్నో నూతన సంశ్లేషణా పద్ధతుల్ని (Novel Organic Synthetic routes) రూపొందించాడు. మానవాళిక ఉపయోగపడే అనే ఔషధాల్ని, పదార్దాల్ని నేడు కోరీ పద్ధతుల్లో వేలాదిగా పరిశ్రమలలో తయారవుతున్నాయి. సుమాయు 300 పైగా పద్దతుల్ని ఆయన తన పరిశోధనా బృందంతో కనిపెట్టారు. ఈయన పేరుతోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన రసాయనిక చర్యా యంత్రాంగాలు (Named Organic Sythetic Mechanisms) ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద రసాయనికాల సంఘంగా American Chemical Society కి చాలా పెద్ద ఆదరణ, ఘనత ఉంది. ఆ పత్రికలో కొరివి కొన్ని వందలకు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితం అయ్యాయి.

భారతదేశంలో అత్యంత గొప్ప సేంద్రియ రసాయనిక శాస్త్రజ్ఞాలకు ఈ పత్రికలో ఐదారుకు మించి ఉండవు సాధారణ రసాయనిక పదార్ధాలనుండి అత్యంత కష్టతరమూ జీవ రసాయనిక తత్వము, ఆప్టికల్ ఐసోమరిజం లక్షణాలూ ఉన్న పదార్ధాలనూ నేడు రిట్రోసింధసిస్ Retrosynthesis పద్ధతిలో తయారుచేస్తూన్నారు. ఈ పద్ధతులకు అధ్యడు, ప్రారంభకుడు కోరీ. 1928 జులై 12న జన్మించిన కోరీ 18నెలల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఐనా తల్లి ఆయన్ను గొప్పగా పెంచింది. 17సంవత్సరాల వయసుకే ప్రపంచ ప్రసిద్ధి పొందిన MIT లో సిటు సాధించి 22 సంవత్సరాలకే పట్టా పొందాడు.

27 సంవత్సరాలకే ఇలునాయిన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయ్యాదు. 1990 రసాయనిక శాస్త్రం అంటే అంత ఇష్టం? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు అయన అందులో సకల మానవాళికి అవసరమైనవి, ఆరోగ్యాన్నిచ్చే విధానాలున్నాయని అన్నాడు.

అహ్మద్ హెచ్.జవాలి

mar28.jpgమన విశ్వం విశ్వాంతరాళం మొత్తం పదార్ధము, కాలము, స్ధలములలో నిండి ఉంది. పదార్ధంలో కూడా స్ధలం (space) ఉంది కాబట్టి ఆల్బర్ట్ ఇస్ స్టీన్ ప్రకారం విశ్వమంతా స్ధాలకాల అవిచ్చిన్నత (space-time continuum) లో ఉంది. అందులో కాలం గురించి మనకు తక్కువ తెలుసు . ఉదహరణకు మన ఎదురుగా ఓ సంఘటన సెకను కాలం వ్యవధిలో జరిగితే గుర్తించగలం. సెకనులో 16వ వంతు ఏదైనా సంఘటన సెకనులో 16వ వంతు కన్నా తక్కువ వ్యవధిలో జరిగేతే దాన్ని గుర్తించలేము. దీన్నే మరో విధంగా చెబుతారు. ఏదైనా ఓ సంఘటన లేదా దృశ్యాన్ని మనం చూస్తే అదృశ్యం మన కళ్లముందునుంచి వెళ్లి పోయినా సెకనులో 16వ వంతు సమయం వ్యవధి వరకు దాని ఆనవాళ్లు మెదడులో ఉంటాయి. అంటే ఓ దృశ్యం అదృశమయి పొయినా సెకనులో 16వ వంతు వరకు (0.0625 సెకను లేదా 6.25*10-2 s) మన మెదడులో మెదలుతూనే ఉంటుంది. అందుకే ఒక బల్చును గిరిగిరా త్రిప్పినపుడు బల్చు ఏకకాలంలో ఏక ప్రాంతంలో ఉన్న మనకు అది వృత్తాకారపు వెలుగు లాగా కనిపిస్తుంది. ఈ సూత్రం ఆధారంగానే మనము టి.విలోను సినిమా హలులోనూ దృశ్యాలను చూడగలుగుతున్నాము. ఇలా మన కనిష్ఠ కాల పరిజ్ఞానం 6.25*10-2 సెకన్లకు పరిమితం. ఆధునిక 4G Hz ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్లో సెకనుకు 400 కోట్ల అంక గణనాలు (Arithmatic operations) జరుగుతాయి. ఒక సెకనులో 400 కోట్ల గణనాలంటే అర్ధం ఒక్కో గణనానికి పట్టేకాలం 2.5*10-2 సెకను లేదా 0.25*10-9 సెకను. దీనినే 0.25 నేనో సెకను వ్యవధి అంటాము. కొన్ని రసాయనిక చర్యలు (Chemical reaction) చాలా నెమ్మదిగా సంవత్సరాల తరబడి జరిగేతే, మరి కొన్ని రసాయనిక చర్యలు గంటలు లేదా నిమిషాలు లేదా సెకన్లలో అయిపోతాయి. సరియైన పరిస్దితులు కల్పిస్తే ఒక్క హైడ్రోజన్ అణువు, ఒక క్లోరిన్ అణువు కలిసి రెండు హైడ్రోక్లోరిక్ అనువులుగా మార్పు చెందడానికి పట్టే వ్యవధి కేవలం పికో సెకను (1*10-12 సెకను) ల్లో ఉంటుంది. ఇంతకన్నా వేగంగా జరిగే రసాయనిక చర్యలు కూడా ఉన్నాయి. నేడు మానవుడికున్న సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం ఫెమ్టో (1*10-15 సెకను) కాల వ్యవధిలో పుర్తయే సంఘటనలను కూడా గుర్తించగలము.

ఈ పరిజ్ఞానాన్ని పరిపుష్టి చేసి ఫెమ్టో సెకను వ్యవధిలో జరిగే రసాయనిక చర్యలు విధానాలను పసిగట్టిన ఘనత ఓ సాధారణ దేశానికి చెందిన శాస్త్రవేత్తకు దిక్కింది. ఆయన పేరు అహ్మద్ జవాలి. ఫెమ్టో సెకండ్ వర్ణపట మాపనా (Femto second spectoscopy) న్ని, ఫెమ్టోకేమిస్ట్రి అనే అత్యాధునిక శిఖరాగ్రస్దాయి రసాయనిక శాస్త్రవిభాగాన్ని పరిపుష్టి చేసిన అయన ఈజిప్టులో ఓ సాధారణ కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రులు ప్రోత్సహం మెండుగా ఉండేది. జవాలి కున ఆసక్తిని గమనించి అయన తల్లిదండ్రులు అతన్ని గొప్ప చదువులు చదివించాలను కొన్నారు,. అయన Ph.D చేయాలని వారికి ఉండేది. జవాలి గదిలో గోడమీద డా. జవాలి అని తల్లిదండులు వ్రాసి ఉండేవారు. ఎందుకంటే అతనికి లక్ష్యాన్ని అనునిత్యం గుర్తుచేయడానికన్నమాట. ఎందుకు ఏమిటి అని పరిశీలనులు చేసే జవాలి మాతృభాషలోనే చదువుకున్నాడు. గణితం, భౌతిక శాస్త్రం, రాసాయనిక శాస్తాలపట్ల ఆసక్తి బాగా ఉండేది. అంతవరకు మామూలుగా ఉండే కిరోసిన్ దిపపువత్తి, గాలి, అగ్గిపుల్లతో అంటించిన వెంటనే వెలగడానికి, అలాగే వెలుగుతూ ఉండడానికి కారణం పట్ల ఆసక్తి అతన్ని చిన్నప్పుడు దీపం వైపు పదేపదే చూసేలా చేసింది. పాటశాల చదువయ్యాక, కళాశాల విద్యాభ్యాసంలో రసాయనిక శాస్త్రం ప్రధమ సబ్జెక్టుగా తీసుకున్నాడు. చదువుల్లో రసాయనిక శాస్త్రం ప్రధమ సబ్జెక్టుగా తీసుకున్నాడు. చదువులో బాగా అగ్రగామిగా ఉండడం వల్ల 21వ సం. లోపే పిహెచ్ డి కూడా పూర్తయింది. మంచి ఉపాధ్యాలయంలో పేరు తెచ్చుకున్నాడు. ప్రతి భౌతికదృగ్విషయం (Physical phenomenon) వెనుక ప్రకృతికి సంబంధించి సరళమైన సుత్రలేవో ఉంటాయని సమ్మేవాడు. ముస్లిము కావడం వల్ల అమెరికాలో పై చదువుల కోసం వెళ్లాలన్న తన తపన ఎంతో కష్టం మిదగాని ఫలించలేదు. ఎట్టకేలకు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ లో పరిశోధకుడయ్యాడు. ఫెమ్టో సెకను వ్యవధిలో సోడియం పరమాణువులు క్లోరిన్ పరవణువులు చర్యజరుపుకొని సోడియం క్లోరైడ్ గా మారే క్షణిక చర్యలను పసిగట్టే విధానాన్ని రూపొందించాడు. 1999 సంవత్సరంలో రసాయన శాస్త్ర బహుమతిని పొందిన జవాలి ఈజిప్టు తపాలా బిళ్ళపై తన బొమ్మను చుసుకోగలుగుతున్నాడు. ఈయన పేరు కింద 4వ పిరమిడ్ అనే నినాదం ఉంటుంది.

హామిల్టన్ స్మిత్

35హామిల్టన్ స్మిత్ పరిశోధనలు జన్యు శాస్త్ర పరిశోధనల్లో నూతన శకానికి నాంది పలికాయి. జీవుల లక్షణాలను నియంత్రించే కేంద్రకామ్లం – డిఎన్ఎ (DNA)ను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కత్తిరించగల ఎంజైముల డిస్కవరీ యో ఆ పరిశోధన. DNA లో నత్రజని క్షారాలు అడిసీన్, గ్వానీస్, నైటోసిన్, థయామిన్‌లు (AGCT) ఒక నిర్ధిష్ట వరస క్రమంలో ఉండి ఆయా జీవుల ప్రత్యేకతకు కారణం అవుతుంటాయి. ఈ AGCT ను పూసలు అనుకుంటే DNA ఒక పొడువాన పూసల దండ. దీనిలో భాగమే జన్యువు. మనం ఎంచుకున్న ఒక జన్యువును కత్తిరించి వేరొక జీవి DNA లో ప్రవేశ పెట్టడం ద్వారా జన్యుమార్పిడి జరుగుతుంది. ఇటీవల ఈ ప్రక్రియ వివిధ రకాల జీవుల్లో (అంటే మొక్కల్లో, సూక్ష్మ జీవుల్లో మొ.) అవలీలగా చేస్తున్నారు. అలా జన్యుమార్పిడి చేసిన పంటే ‘బిటి కాటన్’.

ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఈ ప్రక్రియను సుసాధ్యం చేసిన మహత్తర పరిశోధన హామిల్టన్ స్మిత్ (Hamilton O. Smith), వెన్నర్ ఆర్బర్ (Werner Arber), డేనియల్ నధాన్స్ (Daniel Nathans)లు చేశారు. వారు జీవుల్లో వుడే రిస్ట్రిక్షన్ ఎంజైములను కనుగొన్నారు. ఇవి DNAను నిర్ధష్ట ప్రదేశాల్లో కత్తిరిస్తాయి. అందుకే వీటిని ‘అణు కత్తెరలు’ (Molecular Scissors)గా పిలుస్తారు. వీటిలో ఒక్కో ఎంజైము ఒక్కో ప్రత్యేక ప్రదేశం (Restriction Site) దగ్గర మాత్రమే DNA ను కత్తిరిస్తాయి. అలా కత్తిరించిన DNA లోకి మనకు కావలసిన DNA ను (జన్యువు)ను చొప్పించి నూతన DNA ను రూపొందిస్తారు. అందుకే ఈ ‘అణు కత్తెరలు’ జీవ శాస్త్రంలో ఒక విప్లవాత్మక మార్పుకు దారితీశాయి.

జీవ శాస్త్రంలో ఒక విప్లవాత్మక మార్పుకు దారితీశాయి. ఈ జిస్కవరీలో ఒకడైన స్మిత్ ఆగష్ట్ 23, 1931లో న్యూయార్క్‌లో జన్మించాడు. హైస్కూల్ విద్య అమెరికాలోని ఇల్లినాయ్ యూనివర్సిటీ స్కూల్లో జరిగింది. ప్రతి గొప్ప వ్యక్తికీ ప్రేరణ వారి ఉపాధాయులే కదా స్కూల్లో చదువుకునేటప్పుడు ఎల్బర్ హార్నిష్ అనే ఉపాధ్యాయుడు స్మిత్ ను బాగా ప్రభావితం చేశాడు. వైన్స్ హైన్స్, మెల్స్ హార్ట్లీలు గణితశాస్త్రం పై న్మిత్ కు బాగా ఇష్టం ఏర్పడేటట్లుగా చేసిన గురువులు. గణితం అంటే స్మిత్ కు ఇష్టమే గానీ దానిలో తనకు తన సోదరుని వలె ప్రావిణ్యం లోదని స్మిత్ పేర్కొన్నాడు. స్మిత్ సోదరుడు ఒకసారి కేంద్ర నాడీ వ్యవస్థను మాధమేటికల్ మోడలింగ్ చేసిన ఒక మంచి పుస్తకాన్ని తమ్ముడుకు ఇచ్చాడు. ఆ పుస్తకమే హామిల్టన్ ను జీవశాస్త్రం చదివేలా ప్రోత్సహించింది. కాలిఫోర్నియా యీనివర్సిటీ లో జీవరసాయన శాస్త్రం (Bio Chemistry) జీవశాస్త్ర అధ్యయనంపై హామిల్టన్ కృషి చేశాడు. ఆ రోజుల్లోనే జార్జివైల్డ్ అనే శాస్త్రవేత్త రెటీనా బయోకెమిస్ట్రీ (retinal Bio Chemistry) పై ఇచ్చిన ఉపన్యాసం హామిల్టన్ స్మిత్ ను పూర్తిగా జీవశాస్త్ర పరిశోధనకు పురిగొల్పింది. ఈ ప్రభావంతోనే బాప్కిన్స్ మెడికల్ స్కూల్ డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అనంతరం మానవ జన్యుశాస్త్రం పరిశోధనలు చేపట్టాడు.

మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్నప్పుడే జెనీవాకు చెందిన వెర్నర్ ఆర్బర్ పరిశోధనల గురించి విన్నాడు. ఆ తర్వాత వెర్నర్ తో కలిసి కేద్రక పూర్వజూవుల్లో వుండే ‘అణు కత్తెర’ లపై పరిశోధించాడు. హామిల్టన్ అటువంటి ఎంజైములను వివిక్తం చేసి, వాటి లక్షణాలను, వాటి ప్రాముఖ్యాన్ని పరిశోధించి లోకానికి చాటాడు. హామిల్టన్ స్మిత్ పరిశోధనలకు గాను వెర్నర్ ఆర్బర్, డేనియల్ నాథాన్స్ లతో పాటు 1978 లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు. ఈ పరిశోధన మూలంగానే జన్యుశాస్త్రంలో శరవేగ మార్పులు, రికాంబినెంట్ DNA టెక్నాలజీ అనే జెనెటిక్ ఇంజనీరింగ్ సుసాధ్యం అయింది.

వెర్నర్ ఆర్బర్

14మనలను తరుచూ జలుబు చికాకు పెడుతూ ఉంటుంది. మనం బజార్లో పోతున్నప్పుడు కొందరు గమ్మత్తుగా తిట్టుకోవడం వింటూ పుంటాం. నీకు ‘గత్తర’ (కలరా) తగలా అని తిడుతారు. అలాగే మనకు ఇబ్బంది కల్గించే వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యాధికి కారణమైన జీవికి రోగం వచ్చి చనిపోతే బావుణ్ణు అనిపిస్తుంటుంది. డయేరియా, డిఫ్తీరియా, కలరా ఇలాంటి వ్యాధులకు కారణమైన బాక్టీరియా జీవులకు మనకు జలుబు కల్గించే వైరస్ లెందుకు బాని చేయవు. అలా వైరస్ లు బాక్టీరియాలను తినేస్తే ఎంత బావుణ్ణు అనుకున్నారా మీరెపుడైనా!

మనం ఒక్కోసారీ తెలిసోతెలియకో భలేగా ఆలోచిస్తాం... అదే కోరుకుంటాం. నిజంగానే బాక్టీరియాలను తినేస్తే వైరసులున్నాయి. వాటిని బాక్టీరియా ఫాజ్ లు అంటారు. బాక్టీరియంపై దాడిచేసి కణంలో వైరస్ ప్రవేశిస్తే బాక్టీరియం చేతులు ముడుతుకుని కూంటుందా? అంతెందుకు మన శరీరం కూడ తన రక్షణకు ప్రయత్నం చేస్తుంది. అదే పనిని బాక్టీరియంలు కూడా చేస్తాయి. కాని అవి తమను వైరస్ దాడి నుండి ఎలా రక్షించుకుంటాయో మాత్రం 1960వ దశకానికి ముందు తెలియదు.

బెర్టానీ, వైగిల్ అనే శాస్త్రవేత్తలు బాక్టీరియం తనలో ప్రవేశించిన వైరస్‌లో మార్పులు చేసి వైరస్లు పెరగకుండా నియంత్రిస్తాయి అని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన అంతు తేలచడానికి పరిశోధన చేసినవాడు వెర్నర్ అర్బర్ (Werner Arber). ఆర్బర్ ప్రముఖ సూక్ష్మజీవ శాస్త్రవేత్త (Microbiologist). ఇతను స్విట్జర్లాండ్ దేశస్థుడు. 1929వ సం. జూన్ 3వ తేదీన జన్మించిన ఆర్బర్ 1958లో డెనీవా విశ్వవిద్యాలయం నుండి జీవ భౌతిక శాస్త్రం (Biophysics)లో పి.హెచ్.డి పట్టా పొందాడు. అనేక విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేశాడు.

ఆర్బర్ తన పరిశోధనల ద్వారా 1960వ దశకం ప్రారంభంలో ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. బాక్టీరియం ఒక రకమైన ప్రత్యేక ఎంజైముల ద్వారా వైరస్ దాడి నుండి తమను తాము రక్షించుకుంటాయని ఆ ఎంజైములు డిఎన్ఎ (DNA) స్థాయిలో పనిచేస్తాయనీ చెప్పాడు.

అంతేకాదు, బాక్టీరియా తన స్వంత DNA ను వైరస్  DNA నీ విచక్షణాతో గుర్తించగలుగుతుందని చెప్పాడు. తను ప్రతిపాదించిన ప్రత్యేక ఎంజైములు ఈ పని చేస్తాయని, ఆ ఎంజైములే వైరస్ DNAను  తునాతునకలు చేసి వైరస్‌లను నియంత్రిస్తాయని చెప్పాడు. అవే ఆ త్రావత వెలుగులోకి వచ్చిన అణుకత్తెరలు లేదా రిస్ట్రిక్షన్ ఎంజైములు. వైరస్ లను నియంత్రిస్తాయి కాబట్టి వాటికి ఈ పేరు వచ్చింది. అణుకత్తెరలను కన్గొన్న ముగ్గురు శాస్త్రజ్ఞుల్లో (హామిల్టన్ స్మిత్ గురించి ఇంతకు ముందే తంలుసుకున్నాం) వెర్నర్ ఆర్బర్ ప్రముఖులు, ఆర్బర్ టూకీగా సూత్రీకరించిన దానిని (ఎంజైములను) వివిక్త పరచి, వాటి లక్షణాలను కన్గొన్న ఘనత హామిల్టన్ ది. ఈ ఎంజైములను ఉపయోగించి అణు జీవశాస్త్ర పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించిన వాడు డేనియల్ నాదన్స్ (Danial Nathans)

వీరు ముగ్గురికి కలిపి 1978 మెడిసన్ లేదా శరీరధర్మశాస్త్ర నోబెల్ బహుమతి ఇచ్చారు. నాధన్స్ 1999లో చనిపోయారు. వీరి పరిశోధనలు నేటి తరం శాస్త్రజ్ఞులను, ముఖ్యంగా అణుజీవశాస్త్రం, జీవ సాంకేతిక శాస్త్రవేత్తలకు ఎందరికో స్పూర్తినిచ్చాయి. పీటర్ రిచర్డ్ నోబెల్ పురస్కార ప్రసంగంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. వీరి రిస్ట్రిక్షన్ ఎంజైములను ఇప్పటి వరకూ మూత వేసిన DNA పెట్టెను తెరిచేందుకు తోడ్పడే తాళంచెవులుగా వర్ణించాడు.

అర్బర్ పరిశోధనలు కేవలం రిస్ట్రిక్షన్ ఎంజైములకే పరిమితం కాలేదు. జీవ పరిమాణంపై కూడా విశిష్ట పరిశోధనలు చేశాడు. కాకపోతే డార్విన్ పరిణామ సిద్ధాంతంతో ఏకీభవించలేదు. ఆయన అణు పరిణామ సిద్ధాతాన్ని (Theory of Molecular evolution) ప్రతిపాదించాడు. వైవిధ్యానికి లేదా భిన్నత్వానికి (Variation) కారణమైన జన్యుయాంత్రికం (Genetic Mechanism) డార్విన్ జీవావరణ సిద్దాంతానికి లోబడి జరుగదని, అందుకు విరుద్ధంగా ఒక డిజైన్ ప్రకారం జరుగుతుందనీ పేర్కొన్నాడు.

అల్బెర్ట్ బ్రూస్ శాబిన్

మనదేశం జనవరి 13, 2012 నాటికి సంవత్సరము పాటు పోలియో రహిత దేశంగా ప్రయాణం సాగించింది. సాధారణ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, వల్స్ పోలియో టీకాల కార్యక్రమం ఈ స్థితికి రావడానికి మనం పాటించిన ప్రధాన అంశాలు.

 • j25మనం పిల్లలకు వేసే పోలియో చుక్కల మందును కనిపెట్టిన శాస్త్రవేత్త – ఆల్బెర్ట్ బ్రూస్ శాబిన్.
 • శాబిన్ ఆగష్టు 26, 1906న పుట్టారు. మార్చి 3, 1993న మరణించారు.
 • శాబిన్ పోలాండ్ దేశంలో జన్మించాడు. 1921 లో అమెరికా దేశానికి పోయి, 1930 లో అమెరికా పౌరసత్వం పొందాడు.
 • 1931 లో స్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి వైద్యంలో డిగ్రీ తీసుకున్నాడు.
 • అంట వ్యాధులపై పరిశోధన శాబిన్ అత్యంత ఇష్టం. మెదడువాపు వ్యాధికి టీకా కనిపెట్టడంతో తోడ్పాటునందించాడు.
 • 1955 నుండి 1960 వరకు రష్యా శాస్త్రవేత్తలతో కలిసి నోటి ద్వారా ఇచ్చే పోలియో చుక్కల మందును కనిపెట్టుటకు పనిచేశారు.
 • ఈ టీకా మందు నోటి ద్వారా పిల్లలకు సులభంగా ఇవ్వవచ్చును. సాముహిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాలు నిర్వహించుటలో ఎంతగానో ఉపయోగపడింది.
 • మార్చి 6, 2006న అమెరికా పోస్టల్ శాఖ శాబిన్ పేరిట ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. మన దేశం కూడా శాబిన్ పేరిట స్టాంపు విడుదల చేస్తే ఎంతో బాగుంటుంది.

జోనస్ ఎడ్వర్డ్ సాక్

పోలియో వ్యాధి నిరోధించే సూది మందు సాక్ టీకా మందు. ఈ టీకా మందు మన దేశంలో మనం వాడటం లేదు. సాక్ టీకా మందును 1955లో జోనస్ ఎడ్వర్డ్ సాక్ కనిపెట్టాడు. జోనస్ సాక్ అక్టోహర్ 28, 1914 న పుట్టారు, జూన్ 23, 1995 న మరమించారు.

 • j26సాక్ అమెరికా దేసంలోని న్యూయార్క్ లో జన్మించారు.
 • న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండే వైద్య పాఱశాలలో వైద్య పట్టా తీసుకున్నాడు.
 • సాక్ కు వైద్య పరిశోధనలు అంటే ఎంతో ఇష్టం.
 • ఒక్కొక్కరికి వైద్యం చేయటం కన్నా, అశేష మానవాళి ఆరోగ్యానికి ఉపయోగపడే పనులు చేయాలనేది సాక్ కు అత్యంత ఇష్టమైన కార్యక్రమం.
 • అమెరికా పిల్లలకు పోలియో రాకుండా సాక్ టీకా మందు వాడతారు.
 • సాక్ కు ఎవరికీ తెలియకుండా అజ్ఞానత జీవితం అంటే ఇష్టం. అయితే అమెరికన్ ప్రజలు ఆయనను గొప్ప హీరోగా గౌరవిస్తారు.
 • 30 సంవత్సరాల సాక్ టీకాను పురస్కరించుకొని మే నెల 6, 1985 ను అమెరికా ప్రజలు ‘జోనస్ సాక్ దినం’ గా జరుపుకుంటారు.
 • 2006లో అమెరికా సాక్ పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. మనదేశంలో కూడా సాక్ పేరిట స్టాంపు విడుదల చేస్తే ఎంతో బాగుంటుంది.

కారీ ముల్లిస్

27సకల జీవకోటిలో అంటే ప్రతి జీవిలో పూవులు దారంలా అంతర్లీనంగా ఉండే డీవాణువు డీ ఆక్సీరైబోస్యూక్లిక్ ఆమ్లం లేదా డిఎన్ఎ (DNA). ఈ జన్యు పదార్తమే జీవుల సకల లక్షణాలను నియంత్రించేది. సాధారణంగా జీవుల్లో కణవిభజన జరిగే సమయంలో DNA కూడా పునరుత్పత్తి చెంది పిల్లకణాల్లోకి వెళుతుంది. ఇది ప్రకృతి సబజం. ఈ ప్రక్రియను ప్రయేగశాలలో కూడా చేయగలమా? అంటే... టేసి చూపించినవాడు హరగోవింద్ ఖోరానా, DNA ను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారుచేశారు. ఖోరానా, క్లెప్పెతో కలిసి చేసిన ఈ పరిశోధనకు 1968లో నోబెల్ బహుమతిని కూడా గెలుచుకున్నాడు. వీరు ప్రయోగపూర్వకంగా సాధ్యమని చూపించిన DNA కృత్రిమ తయారీని ఒక గొలుసు చర్యలాగా చెపట్టి, DNA తయారికీ అవసరమైన న పోలిమరోస్ అనే ఎంజైమ్ సమక్షంలో పెద్దమొత్తంలో ఉత్పత్తి చేయవచ్చునునని రుజువు చేసినవాడు కారీబాంక్స్ ముల్లిస్ (Kary Banks Mullis) అనే అమెరికన్ జీవరసాయన శాస్త్రవేత్త. ఈ ప్రక్రియకు పోలిమరేజ్ చెయిన్ రియాక్షన్ (PCR)  లేదా పొలిమరేజ్ గొలుసు చర్య అనిపేరు. అతి తక్కువగా ఉన్న DNA నుండి రెండు ప్రైమర్లు, DNA పొలిమెరేజ్ ఎంజైమ్ , ఇంకా నత్రజని క్షారాలను సప్లై చేసినట్లయితే నూతన DNAను ఈ చర్య ద్వారా ఎక్కువ మెత్తంలో తయారు చేయవచ్చు. జీవశాస్త్ర పరిశోధనలను, ఇప్పటివరకు ఉన్న ఆలోచనలనూ ఈ గొలుసుచర్య లేదా PCR ఒక గొప్పమలుపు తప్పింది. ముల్లిస్ కనుగొన్న ఈ ప్రక్రియ జీవశాస్త్రాన్ని PCR కు ముందు, PCR తరువాత అనే రెండు యుగాలుగా విభజించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

ముల్లిస్ తన పరిశోధనలను 1983 చివరలో వెలువరించాడు. అప్పటికి ఆయనకు సరిగ్గా 40 డ్ల వయస్సు కూడా లేదు. అతి చిన్న వయసులో ఆయన చేసిన ఈ పరిశోధనకు 1993లో నోబెల్ బహుమతి వచ్చింది. ముల్లిస్ 1944 డిసెంబర్ 28న ఉత్తర కెరోలీనా నీలి పర్వత శ్రేణుల్లో ఉన్న లెనోయిర్ లో జన్మించాడు. ఈ గ్రామీణ ప్రాంతంలో ఆయన తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవారు. గ్రామ ప్రాంతాల్లో కనిపించే వివిధ రకాల జీవులను పరీశీలించడం చిన్నతనం నుండే ముల్లిస్ కు అలవాటు. హైస్కూల్ చదువులను కొలంబీయాలో పూర్తి చేసుకొని అట్లాంటాలోని జార్జియా ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి నుండి రసాయన శాస్త్రంలో డిగ్రీ చేశాడు. ఆ త్రవాత కాలిపోర్నియా యూనివర్సిటీ నుండి Ph.D. చేశాడు. మాంసకృతుల సంశ్లేషణ, నిర్మాణంపై పరిశోధించి కాస్నీస్ మెడికల్ స్కూల్ లో చేరి, ఆ తర్వాత ఔషధ రసాయన శాస్త్రంపై పరిశోధనలు చేశాడు.

కొంతకాలం పరిశోధనలు వదిలేసి వ్యాపారం చేయాలనుకుని రెండేళ్లపాటు బేకరీని నడిపాడు. ముల్లిస్ స్నేనిహుడు థామస్ వైట్ ముల్లిస్ ను మరలా సైన్స్ లో పరిశోధనలు జరిపేందుకు ప్రోత్సహించి ప్రముఖ బయోటెక్నాలజి కంపెనీ , సీటస్ (cetus)లో ఉదేయోగం ఇప్పించాడు. ఇక్కడ ముల్లిస్ DNA రసాయన శాస్త్రవేత్తగా పనిచేశాడు. అప్పుడే PCR పై పరిశోధనలు చేసి ఒక అధ్భుతాన్ని కనుగొన్నాడు.

ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక సామాన్యమైన మిషన్ సబాయంతో DNA జంటగడల నిచ్చెన నిర్ణాణాన్ని విడగొట్టడం (94oC వద్ద) మరల ఆ రెండు గడలు దగ్గరయ్యేలోగా ఒక జతప్రైమర్లను ఉపయోగించి నూతన గడ లేదా పొరను తయారుచేయటం దీని ప్రత్యేకత. ఈ క్రమంలో మూడు ఉష్ణోగ్రతలు (94, 58, 72) వద్ద DNA విడిపోవడం, ప్రోమర్లు ఆయా ప్రత్యేక ప్రదేశంలో విడిపోయిన పోచకు అంటుకుని నూతన DNA ఏర్పడటం ప్రధానమైనవి. దీనిలో DNA తయారుచేసే ఎంజైమును ధర్మస్ ఆక్వాటికన్ (Thermus aquaticus) అనే అధిక ఉష్ణోగ్రత వద్ద పెరిగే బాక్టీరియం నుండి తీసుకొని ముల్లిస్ విజయం సాధించాడు. దీనిలో అధిక ఉష్ణాన్ని తట్టుకునే పాలిమరేజ్ వివిధ ఉష్ణోగ్రతలను ఒక వలయంలో మళ్లీ మళ్లీ మార్చటం ద్వారా మనం కావాలనుకున్న DNA రెట్టింపుగా తయారై పోగుపడుతుంది. ముల్లిస్ కనుగొన్న PCR ప్రక్రియ ఈనాడు ప్రతి అణుజీవశాస్త్ర పరిశోధనలోనూ సులువుగా చేసే కీలక, మౌలిక ప్రక్రియగా ప్రసిద్ధిగాంచింది. దీనివల్లే ఈనాడు రకరకాల జీవుల జన్యు రచనను తెల్సుకునే వీలుచిక్కింది. వాటిలో మానవ జీనోమ్ ప్రాజెక్టు చెప్పుకోదగింది. ముల్లిస్ కాంతి ప్రభావానికి రంగులు మార్చే UV-సెన్సిటివ్ ప్లాస్టిక్ ను కూడా కనుగొన్నాడు. మనలను బాధించే వ్యాధి జనకాల చర్యను నిర్వీర్యం చేసే రోగ నిరోధక వ్యవస్తపై కూడా ముల్లిస్ కృషి చేశాడు.

ముల్లిస్ ఈ ప్రక్రియను కనుగొనేందుకు సీటస్ కంపెనీ 10 వేల డాలర్లను బహుమతిగా ఇచిచంది. ఆ తర్వాత నెబెల్ బహుమతి వచ్చింది. కాని సీటస్ కంపెని దీనిపై పెటెంట్ ను పొంది 300 మిలియన్ డాలర్లను సంపాదించింది. ముల్లిస్ ప్రయోగశాలలో పనిచేసే కంటే కారు నడిపేటప్పుడు రీసెర్చీ గురించి ఎక్కువగా ఆలచించేవాడట. కాకపోతే ముల్లిస్ కు AIDS పట్ల అది జబ్బే కాదనే కొన్ని విచిత్రమైన ఆలోచనలు ఉన్నాడు. తనకు సంబంధం లేని విషయాల్లో తొందరపడి వాఖ్యాలు చేసే అలవాటు ముల్లిస్ కు ఉంది.

జానకి అమ్మల్

21మన భారతదేశంలో మిగితా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు కేరళకి చెందిన మహిళలు స్వేచ్చనీ, స్వాధీకారాన్ని 20వ శతాబ్ధాం తొలినాళ్ళలోనే అనుభవించారని చెప్పవచ్చు. అక్కడ పిల్లలు మాతృవంశానికి చెందిన వారుగా గుర్తించబడదము అందుకు ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రాష్ట్రంతో ఆడపిల్లలకి మేధోపరమైన వృత్తులను, కళలను చేపట్టడానికి ప్రోత్సాహం లభించేది. ఇటువంటి వాతావరణానికి తోడు ఒక అమ్మాయికి సహజంగా వృక్షాలపట్ల ప్రీతి ఉన్నట్లయితే ఆమె వృక్షశాస్త్రాన్ని చదువుకోకుండా ఉండగలదా? ఆ రంగములో జ్ఞానాన్ని సంపాదించుకోదా? అందుకే కేరళలోని టెలిచెరి (Tellichery)లో 1897 సంవత్సరం నవంబర్ 5వ తేదీన పుట్టిన ఒక బాలిక పాఠశాల చదువు పూర్తికాగానే మద్రాస్ (చెన్నై) వెళ్ళి అక్కడ క్వీన్ మేరీ కళాశాలలో (Queen Mary’s College) బాచిలర్ డిగ్రీ కోర్స్ లో చేరింది. వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని 1921 మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుండి పొందింది. ఈ కాలేజీ అధ్యాపకుల ప్రభావం వల్ల ఆమెకి సహజసిద్దంగా ప్రకృతి పట్ల ఉన్న ప్రేమను మొక్కలను వాటి సహజ వాతావరణంలో (Natural environment) పరిశీలిస్తూ ప్రయోగాలు చేయాలనే తపన మరింతగా పెరిగింది. చెన్నైలో ఉమెన్స్ క్రిష్టియన్ కాలేజీ Women’s Christian College (WCC)లో బోధించింది. 1925 నాటికి యు.ఎస్.ఎ లోని మిచిగన్ విశ్వవిద్యాలయం నుండి Barbour Scholar గా చేరి మాస్టర్స్ డిగ్రీని పొందింది. భారతదేశానికి తిరిగివచ్చి మళ్లీ ఉమెన్స్ క్రిష్టియన్ తాలేజీలో తన భోదనను కొనసాగించింది. కానీ పెండవసారి మిచిగన్ విశ్వవిద్యాలయం నుండి Oriental Barbour Fellow గా పరిశోధన చేసి ఢి.ఎస్.సి. డిగ్రీని కైవసం చేసుకుంది. 1934 నుండి 1939 దాకా కోయంబత్తూర్ లో సుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ లో జన్యు శాస్త్రవేత్తగా (Geneticist) పనిచేసింది. ఆ తరువాత ఇంగ్లండ్ వెళ్లింది. 1940 నుండి 45 దాకా లండన్ లోని జాన్ఇన్స్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ (John Innes Horticulture Institute (JIHI)) లో సహాయక కణ శాస్త్రవేత్త (Assistant Cytologist)గా పనిచేసి 1945 నుండి వెస్లీ (Wisley)లోని Royal Horticultural Society వారికి కణశాస్త్రవేత్తగా 1951 వరకు తన సేవలను అందించింది. అప్పటి మన భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI)లో స్పెషల్ ఆఫీసర్ చేరి దానిని పునర్మించవలసినదిగా కోరుతూ పంపిన ఆహ్వానాన్ని అందుకొని 1951లో భారతావనికి వచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా స్స్తకి కుదురైన ఏర్పాట్లను కల్పించడమే కాక అనేక భారత ప్రబుత్వపు పదవుల్లో తన సేవలను అందించింది. అలహాబాద్ లో సెంట్రల్ బొటానికల్ లాబొరేటరీకి అధిపతిగా, జమ్ము కాశ్మీర్ లో రీజనల్ రిసెర్చ్ లాబొరెటరీ స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ గా వ్యవహరించింది. కొద్దికాలం ట్రాంబెలోనున్న బాబా అటామిక్ రీసెర్చీ సెంటర్ లోనూ పనిచేసింది. చివరగా 1970లో చెన్నైలో స్థిరపడి యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ బొటనీలో ఎమరిటన్ ప్రొఫెసర్ గా పనిచేసింది. 1984 ఫిబ్రవరిలో ఆమె చనిపోయే చివరిక్షణం వరకు చెన్నై దగ్గరున్న మదురవోయల్ (Maduravoyal )లోని  సెంటర్ కు చెందిన ఫీల్డ్ లాబోరెటరీ పనిచేస్తూ 1984లో చనిపోయే దాకా అక్కడే నివసించింది. వివాహం చేసుకోలేదు. దీనిని బట్టి  స్త్రీ మూర్తి జీవితాంతం ఎంతటి కృషి సల్పిందో మనము ఉహించవచ్చు. ఇంతదాకా మనం ఆమె గురించి తెలుసుకున్న వివరాలను బట్టి ఆమె ఎప్పుడూ విశ్రాంతి తీసికొన్నట్లు కనిపించదు. అవునా? ఆమె సల్పిన కృషి వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం చివరన ఇచ్చిన సైన్స్ పదబంధ వృక్షాన్ని (ట్రీ ఫజిల్ = Tree Puzzle) పూరించి ఆమె పేరు తెలుసుకుందాం.

20వ శతాబ్ది తొలి దశకాలలో జన్యు శాస్త్రంలో ఆ శాస్త్రాన్ని అభివృద్దిపథంలో నడపగలిగి విలువైన పరిశోధనలు జరిగాయి. మరీ ముఖ్యంగా గోధుమ (wheat), చెరకు(sugarcane)లపై మనదేశంలో మంచి పరిశోధన జరిగింది. కోయంబత్తూర్ లోని సుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ లో సి.ఎ. బార్బర్ (C.A. Barber), టి.ఎస్. వెకటరామన్ (T.S. Venkataraman)లు చెక్కర పంటలపై జన్యు పరిశోదనకు శ్రీకారం చుట్టారు. చీడలకీ, అనావృష్టికీ తట్టుకోగలిగిన (drought and disease resistant) వంటి కోయంబత్తూ చెరకు రకాలను రూపొందించారు. వాటికి మంచి అంతర్జాతీయ ప్రాముఖ్యత లభించింది. మన దేశంలో పలుచోట్ల ఊ పంట రకాలు సాగులోకి వచ్చాయి. ప్రపంచంలో పలుదేశాలు చక్కరపంట ముఖ్యంగా సాగులోనున్న ప్రాంతాలలో ఈ రకాలను ప్రవేశ పెట్టుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ మహిళ త్రివేండ్రంలో అధ్యాపక వృత్తిని వదలి కోయంబత్తూర్ లోని సుగర్ కేన్ ట్రీడింగ్ ఇన్స్టిట్యూట్ లే చేరింది. చెక్కరలో అంతర జన్యు సంకర జాతులైన (intergeneric hybrids) చక్కెర, మొక్కజొన్నల సంకరం (Saccharum x zea), చక్కెర రెవెన్న గడ్డి సంకరం (Saccharum x Erainthus) చక్కెర,  సాటిన్ టేల్ సంకరం (Saccharum x Imperata) చక్కెర, వరి సంకరం (Saccharum x Sorghum)లను రూపొందించింది. చక్కరకి వృక్షశాస్త్ర నామము సఖారంఅఫీసినేరం (Sacchurum Officinarum), సఖారంఅఫీసినేరం పైన, ఈ జాతి, ప్రజాతులకీ చెందిన వెదురువంటి (Bambusa) గడ్డి జాతులపై ఆమె సాధించిన పరిశోధనలు. ఆ దిశగా జరగబోయే అనేక పరిశోధనలు చరిత్రలో సరికొత్త యుగారంఖానికి కారణమయ్యాయి. ఇంగ్లండ్ లో వున్నప్పుడు రకరకాల తోట మెక్కల క్రోమోసోమ్ సంఖ్యలపై క్రోమోసోమ్ సంఖ్యాస్థితుల (ploidy) పై జరిపిన చాలాశాతం పరిశోధనాత్మక అధ్యాయనాలు ఆయా జాతుల, రకాల మెక్కలు జీవ పరిమాణానికి సంబంధించిన వివరాలను వెలుగులోకి తెచ్చాయి. ఆమె తన ఈ అద్యాయాలను చాలా మటుక్కి ‘The Chromosome Atlas of Cultivated Plants’  పుస్తకంలో పొందుపరచింది. ఈ పుస్తకాన్ని C.D. Darlington తో కలిసి 1945లో రచించింది. ఇంగ్లండ్ లో ముఖ్యంగా వృక్ష పరిణామము, బహుస్థితికతివము(polyploidy) లపై లోతైన అధ్యాయానాలు చేసిన మీదట ఇండియా తిరిగివచ్చాక కూడా అటువంటి అధ్యాయనాలను చాలా ప్రముఖమైన ప్రజాతుల (genera)పై కొనసాగించింది. వంగ (solanum), ఉమ్మెత (datura), తులసి, కొత్తిమీర మొదలైన సవాసనగల ఆకులున్న జాతులు (mentha), దర్బలు (cymbopogon), డయోస్కోరియా జాతి పూలమెక్కలు (dioscorea) పైన పరిశోధన చేసింది. వాటితోపాటు మందుమొక్కలు (medical plants) ను కూడా పరిశోధించింది. ఆమె సాధించిన ప్రధానమైన ఈ పరిశోధనలలో జమ్ముమింట్ (Jammu Mint) ఒక ఉదాహరణ.

ఆమె మంచి ఆలోచనాపరురాలు. చల్లని, తేమగా ఉండే ఈశాన్య ప్రాంతపు హిమాలయాలలో చల్లని పొడి ప్రదేశాలైన వాయువ్య హిమాలయాలలో కంటే మొక్కలలో జాతి ఆభివృద్ది వేగవంతంగా ఉండటానికి బహుస్తితికతే. (polyploidy) అవి ప్రతిపాదించింది. ఈశాన్య బారతదేశంలోని వృక్ష సముదాయంలో కనిపించే వైవిద్యమైన చైనా, మలియా మూలాలుగల వృక్ష జుతులకీ, ఈశాన్య భారతదేశపు వృ7జాతులకీ మధ్య జరిగిన సంగమము (Confluence) వల్ల సహజసిద్దంగా సంకర కరణము (Hybradisation) జరిగినందువల్నని ఆమె భావించింది. పదవీ విరమణ తరువాత కూడా పట్టుసడలని దీక్షతో మందు మోక్కలపైన ఇథ్నోబోటని (Ethnobotany)లోనూ పరిశోధనా ఫలితాలను ప్రచరిస్తూనే ఉంది. ఇథ్నోబొటనీ (Ethnobotany: Ethanology + botany) సంస్మృతి మరియు మొక్కల ఆధ్యయన శాత్రం. ఈ శాస్త్రం మనుష్యజాతికి మొక్కలకీ గల పరస్పర సంబంధాలను అధ్యయనం చేస్తుంది. ఇథ్నోబోటనీ విభాగానికి సంబంధించి ఈ మహిళా శాస్త్రవేత్త చేసిన అధ్యయనాలలో కేరళ రాష్ట్రం ఉపయోగించే మొక్కలపై రాబట్టిన వివరాలు చాలా విలువైనవి. కణశాస్త్రం (Cytology) తన ప్రధానమైన ఆకర్షణ అయినప్పటికీ ఆమె జన్యు శాస్త్రం (Genetics) పరిణామం (Evolution) ఫైటోజెయోగ్రాఫీ (Phytogeography) రంగాలలో కూడా కృషి చేసింది. ఫైటోడియోగ్రాఫీ భూగోళంపై వృక్షప్రాణుల వితరణను... అధ్యయనం చేసే శాస్ట్రం.కణ జన్యుశాస్త్రం (cytogenetics) భైగోళిక వృక్షశాస్త్రం (plant geography) మొక్కల వినియోగం గురించి సంసృమతీపరమైన అవగాహనతో పంటమొక్కల ఉత్పత్తి మూలాలను, వాటి పరిణామ దశల పూర్తి వివరాలను, కాలంతోనూ ప్రాదేశికంగానూ పొందుపరచడం ద్వారా ఆమె మానవ సంస్రృతిక పరిణామ చరిత్రకు ఎంతో విలువైన సమాచారాన్ని అందివ్వదలచింది. ఆమె తనకుతానుగా పెట్టుకున్న ఈ గమ్యాన్ని బిగిపోని సంకల్పబలంతో అలుపెరగక సాధించింది. ఎంతో ఓపికతో లోతైన పరిశోధనలను చేసింది. డంబము, పైపై బడాయిలు లేవు. సమ్రతతో మెలగుతూనే చాలాచురుగ్గా పనిచేసింది. తల ల7యాన్ని బద్దురాలై (stick) వుంది. ఒక మంచి కార్యం కోసమైన, న్యాయపరమైన అంశానికి పోరడడానికి వెనుకాడేది (shirk) కాదు. 1977లో భారత ప్రభుత్వము ఆమెకు పద్మశ్రీ బిరుదునిచ్చి గౌరవించింది. ఆమె చనిపోయాక జమ్ములోని రీజనల్ రిసెర్చ్ లాబొరేటరీలో (RRL) ని హేర్బేరియం (Herbarium) కి ఆమె పేరుపెట్టారు. అందులో 1935 నాటి మొక్కజాతి నుండి సుమారు 2500 జాతులున్నాయి. ఆమె వ్యక్తిత్వమును, జీవితమును దర్సంగా తీసుకొని మనమూ కూడా ఆదర్సవంతమమైన లక్ష్యాలను పెట్టుకొని కృషిచేసి భారతదేశానికి పేరు తీసుకొని రావాలి,

లిండా బక్

lindaఎత్తైన కొండలు, పర్వతాలు. వాటిని  కప్పివేస్తూ దుప్పటిలా పరుచుకున్న అడవి.  అందంగా బారులు తీరిన సముద్రతీరం. ప్రకృతి అందాలకు పెట్టినపేరు వాషింగ్టన్ లోని సియాటిల్ ప్రాంతం. ఇక్కడే లిండా బాల్యం సరదాగా గడిచింది. లిండా తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు, వారిలో రెండో అమ్మాయి లిండా. లిండా తల్లి స్వీడన్ నుండి వచ్చి స్తిరపడిన కుటుంబం నుండి వస్తే,  తండ్రి ఐరిష్ సంతతివాడు. లిండా తండ్రి విద్యూత్ డినీరు. ఎప్పుడు ఏదో కనిపెట్టాలనే దృష్టితో ఏవేవో వస్తువులు తయారు చేస్తుండేవాడు. ఇంటి బాధ్యతంతా తల్లిదే. ఆమెలో హాస్యం, దయ కలగలసి ఉండేవి. ఆమెకు సమస్యల్ని పరిష్కరించడమంటే ఇష్టం. ఏవో పజిల్స్ చేస్తూ, పిల్లలకు విడమర్చి చెబుతూ ఉత్సాహపరిచేది. లిండాకు తల్లిదండ్రుల నుండి వచ్చిదేమో ఇష్టంగా సమస్యలకు పరిష్కారాలను వెతకడం, కొత్తకొత్త విషయాలు కనుగొనడం, పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లల భవిష్యత్తుకు బంగారుబాట వేస్తారంటారు గదా? అది లిండా విషయంలో నిజమైంది. ఆమె ఎప్పుడూ శాస్త్రవేత్త కావాలని అనుకోలేదు. అందర్లాగే ఆటబొమ్మలతో ఆడుకోవడం, చదువుతోపాటు సంగీతం నేర్చుకోవటం చేసింది. కాకపోతే ఏదీ ఎక్కువ కాలం చేసే అలవాటు లిండాకు లేదు. ఆమె నైజానికది విరుద్దం. ఎప్పుడూ ఏదో కొత్తదనం కోసం పాకులాడేది.

తల్లి నుండి సంగీతాన్ని నేర్చుకుంది. తండ్రి నుండి రకరకాల పరికరాల్ని తెచ్చి వస్తువులు తయారుచేయటం నేర్చుకుంది. మన తాత, అమ్మమ్మలు చెప్పినట్లే వాల్లమ్మమ్మ చెప్పే కథలంటే చెవికోసుకునేది. అమ్మమ్మ చెప్పే చిన్ననాటి స్వీడన్ అనుభవాలు, అద్భుత గాధలకు లిండా మంచి శ్రోత్త. తన ఆటబొమ్మలకు లేసులు కుట్టడము కూడ అమ్మ దగ్గరే నేర్చుకుంది. లిండా  చేయాలనుకున్న కావలసిన స్వేచ్ఛ, కుటుంబ ప్రోత్సాహం. “నీవు ఏమైనా చేయగలవు” అన్న నమ్మకాన్ని లిండాకు కలిగించారు.  అన్నింటికి మంచి స్వతంత్ర్యంగా ఆలోచించే అలవాటును నిశితంగా పరిశీలించే జ్ఞానాన్న ప్రోది చేశారు. కాకపోతే వారు లిండాకు ఒక్క విషయం చెప్పారు. అదేమంటే “జీవితంలో నీవేది చేసినా సభూలో సభవిష్యతి లా చేయాలని. ఏవో సాదాసీదా వాటితో తృప్తి చెందవద్దని” ఆ మాటలు తనకు తెలియకుండానే లిడాలో నాటుకుపోయాయి. ఆ మాటలే నోహెల్ శాస్త్రవేత్తగా నిబెట్టడానికి ప్రేరణగా నిలిచాయి.

ఇంటి దగ్గరలో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో చదివింది. మానసిక వైద్యురాలు కావాలనిమొదట్లో మానసిక శాస్త్రాన్ని ప్రధానంగా చదివింది. కాలంతోపాటు ఆమె ఆలోచనలు మారాయి. దానిలో ఆమె చదివే సబ్జెక్టులను మార్చుకుంది. వాటిలో ఆమెకు బాగా సంతోషం కిలిగించింది – అన్యుమాలాజీ, అంటే వ్యాధి నిరోధక శాస్త్రం. ఇమ్యునాలాజీ చదువు ఆమెకు జీవశాస్త్రవేత్తగా మారటానికి కారణమైంది. తర్వాత ఆమె అదే రంగంలో పరిశోధనలు కొనసాగించించి.

ఈ రంగంలో పరిశోధనల పట్ల ఆకర్షితురాలైన లిండా టెక్సాస్ మెడికల్ సెంటర్ లో సూక్ష్మజీవశాస్త్ర (మైక్రోబయాలజీ) అధ్యయనానికి 1975లో చేరింది. శాస్త్రవేత్త అంటే ఎలా ఉండాలో ఇక్కడ లిండా నేర్చుకుంది. అందుకొక అద్భుత వ్యక్తి కారణం. ఆయన ఎల్లెస్ విట్టెట్టా. ఆమె పి.హెచ్.డీ చదువుకు మార్గదర్శి. ఈ పరిశోధనలో పరిపూర్ణతను, నిక్కచ్చితనాన్ని ఆయన నుండే నేర్చుకున్నానని సగర్వంగా చెప్పేది లిండా. రోగనిరోధకతలో ప్రధానపాత్ర పోషించే ‘బి’ లింఫోసైటుల క్రియాలక్షనాలపై పరిశోధించింది.

జీవులన్నాక రోగాలు రావటం సహజం. అలా వ్యాధి సోకినప్పుడు రకరకాల జంతువులు (జీవులు) ఎలా స్పందిస్తాయి” రోగనిరోధకశక్తి ఎలా పనిచేస్తుందనే ప్రశ్నలు విద్యార్తి దశ నుండి ఎదో తెల్చుకోవాలనే లిండా ఆలోచనలకు ఆజ్యం పోశాయి. రోగనిరోధకతలో కీలకమైన కణసముదాయాల గుట్టును రట్టు చేయదల్చుకుంది. ఇందులో పాల్గోనే మాంసకృత్తులు బి లింఫోసైటుల ఉపరితలంలో ఉంటాయని, ఇవి కణంలోపలి  ఆంటిజన్ స్వీకర్తలతో కలిసి సంక్షిష్ట పదార్థాలను ఏర్పాటు చేస్తాయని ఆమె కనిపెట్టింది. దీనిని ‘టి’ సహాయకణాలు గుర్తిస్తాయని తెలుసుకుంది. రోగనిరోధకకతలో ఇమిడివున్న ఈ గుట్టను కన్గొన్నందుకు 2004వ సంవత్సరం వైద్యశాస్త్రంలో లిండాకు నోబెల్ బహుమతి లభించింది. ఏదైనా పదార్థం దగ్గర్లోకొస్తే మనకు దాని వాసన తెలుస్తుంది. చిన్న చప్పుడైతే వినిపిస్తుంది. ఇలా మనకు వాసన వినికిడి కలగటానికి  ఏమిటి కారణం? మన ముక్కు, చెవిలో ఏం జరుగుతుందన్న దానిపై నిశితంగా, మరింత లోతుగా విశ్లేషణ చేస్తూ లిండా తన పరిశోధనల్లో ముందుకు సాగుతున్నది.

డా. యం.యస్. స్వామినాథన్

a11టైమ్’ అనే పత్రిక 1999లో ప్రజాజివనాన్ని ప్రబావితం చేసిన ఆసియా ఖండానికి చెందిన 20 మంది ప్రముఖుల జాబితాను ప్రకటించింది. వారిలో ముగ్గురే ముగ్గురు భారతీయులున్నారు. ఒకరు మనదేస స్వాతంత్ర్య సారది మహాత్మగాంధీ అయితే రెండోవారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన వంగకవి రవీంద్రనాథ్ టాగోర్ కాగా మూడో వ్యక్తి ప్రముఖ శాస్త్రవేత్త డా. మానకొంబు సాంబశివన్ స్వామినాథన్.

భారతదేశం 1960 ప్రాంతంలో ఆహారకొరతతో ఇబ్బందుల్లో ఉండేది. మనం గోధుమల్ని దిగుమతి చేసుకునే వాళ్లం. ఆ స్థితి నుండి నేడు మనం ఇతరదేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థితిలో ఉన్నాం. ముఖ్యంగా గోధుమ పంటలో అధిక దిగబడినిచ్చే వంగడాల అభివృద్ధికి కారకుడైన గొప్పశాస్త్రవేత్త డా. స్వామినాథన్. గోదుమలో వచ్చిన అధిక దిగుబడినిచ్చే ‘సొనారా 64’ వంటి వంగడాలు ఆహారోత్పత్తిలో దేశ ముఖచిత్రాన్నే మార్చివేశాయి. అందులో దాన్ని ‘హరిత విప్లవం’ గా పేర్కొంటారు. స్వామినాథన్ ను హరిత విప్లవ పితామహుడుగా కీర్తిస్తారు. ఈ మహత్తర కార్యక్రమానికి చుక్కానిగా పనిచేసిన నోబెల్ బహుమతి గ్రహిత డా. నార్మన్ బోర్లాగ్ స్వయంగా ఈ ఖ్యాతి భారతీయ శాస్త్రవేత్తలకు, ముఖ్యంగా స్వామినాథన్ కు దక్కాలని ప్రశంసించారు. గోధుమ పంటలో మెక్సికన్ పొట్టిరకాలను వెలుగులోకి తెచ్చిన ఘటన స్వామినాథన్ ద్.  మేలురకం వంగడాల అభివృద్దికి మెక్సికన్ పొట్టిరకాల్లో ఉన్న సామర్థ్యాన్ని స్వామినాథన్ పసిగట్టకపోయి వుంటే హరిత విప్లవం సాద్యమయ్యేది కాదన్నది బోర్లగ్ అభిప్రాయం . ఆయనకు ప్రపంచ ఆహార బహుమతి (World Food Prize)ని ఇచ్చినప్పుడు 1987 లో ఐక్యరాజ్య సమితి ప్రదానకార్యదర్శి డీక్యులర్ ఆహారోత్పత్తిలో స్వామినాథన్ విశిష్టతను కొనియాడారు.

స్వామినాథన్ ఆగష్టు 7, 1925 న తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణంలో జన్మించారు. అతడు చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయాడు. హైస్కూల్ చదువు కుంభకోణంలో, కాలేజి చదువు తిరువనంతపురం మహారాజా కాలేజీలో చదివాడు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చిన ఆహార కొరతను చూసి వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడు కావాలనుకున్నాడు. అందుకే తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేరాడు.  మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (Indian Agriculture Research institute)లో చేరి కణజన్యుశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నాడు. పరిశోధన చేయటానికి యునెస్కో (UNESCO) నుండి ఫెలోషిప్ పొంది నెదర్లాండ్ లో రీసెర్చ్ చేశాడు. తర్వాత కేంబ్రిడ్జీలో మొక్కలను సంకరం చేయటంలో కృషి చేసి 1952లో డాక్టరేట్ పట్టా తీసుకున్నాడు. ఆ తర్వాత అమెరికా వెళ్లి తను బంగాళాదుంప (ఆలుగడ్డ) జన్యుశాస్త్రంపై పనిచేశారు. అక్కడే విస్కాన్సిలో ఉద్యోగం ఇస్తామంటే తిరస్కరించి 1954లో స్వదేశానికి వచ్చాడు. బంగాళాదుంపతో పాటు గోధుమ, వరి, జనుము వంటి ఎన్నో పంటలపై పరిశేధనలు చేశాడు. మనదేశంలో జరిగిన వ్యవసాయ పరిశోధనలు చేశాడు. మనదేశంలో జరిగిన వ్యవసాయ పరిశోధనలకు నాయకత్వాన్నందించాడు. తాను చదువుకున్న వ్యవసాయ పరిశోధనా సంస్థకే నేతృత్వం వహించాడు. వ్యవసాయానికి సంబంధించిన ఆహార వ్యవసాయ సంస్థ (FAO) కమిటీల్లో స్వామినాథన్ ఉండి మార్గదర్శకత్వం వహించాడు. అంతర్జాతీయ వరిపరిశోధనా సంస్థ (International Rice Research Institute - IRRI)కు డైరెక్ట్‌గా పనిచేశాడు.

ఎన్ని పదవులు అలంకరించినా, హరిత విప్లవం సాధించినా తృప్తి చెందలేదు. పదవీ విరమణ చేసిన తర్వాత తన పేరుతో ‘యం.యస్. స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్’ ను స్థాపించి సుస్థిర అభివృద్ది లక్ష్యంగా నడిపిస్తున్నాడు. పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం, చిరకాలం నిలబడే ఆహార రక్షణ (Sustainable Food Security) నేటి అవసరం అంటాడు స్వామినాథన్. మన జీవవైవిద్యాన్ని  (Biodiversity) కాపాడుకోవాలనీ, అది మన మనుగడకూ, అభివృద్ధికీ కీలకం అని చెబుతున్నారు. ఆ మద్య సంభవించిన సునామీ తరువాత జీవవైవిద్య ప్రాముఖ్యతను మనం గుర్తించడానికి స్వామినాథన్ ఫౌండేషన్ కృషి చేసింది. మన సముద్ర తీరంలో ఉన్న మడ అడవులను కాపాడుకోవాలని, మరిన్ని మడ అడవులను అభివృద్ది చేసేందుకు మడ మొక్కలను నాటాలని చెప్పారు. కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి ప్రాంతాల్లో స్వామినాథన్ ఫౌండేషన్ మడ అడవుల పెంపకాన్ని పెద్దఎత్తున చేపట్టింది. తాత్కలిక ప్రయోజనం ఆశించి మడ అడవులను సరికివేసి తీరప్రాంత గ్రామాలకు ముప్పు తెస్తున్న వరవడికి తన కార్యక్రమాల ద్వారా స్వామినాథన్ ఫౌండేషన్ అడ్డుకట్ట వేసింది. జీవవైవిద్యం, అడవుల పరిరక్షణ కేవలం మాటల్లోకాక చేతల్లో చూపించాడు. మనదేశ అభివృద్ధికి ఒక్క హరిత విప్లవం చాలదని, నిత్య హరిత విప్లవం- సతత హరిత విప్లవం కావాలని కృషి చేస్తున్న వ్యక్తి యం.యస్. స్వామినాథన్.

జేన్ మోరిస్ గూడాల్

sep14జేన్ గూడాల్ (Jane Morri’s Goodall)కు చిన్నతనంలో ఆమె తండ్రి ఒక పెద్ద చింపాంజీ బొమ్మను ఇచ్చాడు. ఆదేమోగానీ గూడాల్ తన భావి జీవితంలో చింపాజీలపై పరిశోధనకు ఆ చిన్న ఘటన పురిగొల్పింది. ఆ బొమ్మను ఇప్పటికీ ఆమె ఇంటి మెయిన్ హాల్లో పదిలంగా ఉంచుకుంది. గుడాల్ తల్లి స్నేహితులైతే దాన్ని చూసి నిజమైన చింపాంజీనే అనుకొని భయపడేవారట.

గూడాల్ కు రెండు విషయాలు అత్యంత ప్రీతి పాత్రమైనవి. ఒకటి జంతువులైతే, మరొకటి ఆఫ్రికా. ఆఫ్రికా పట్ల ఆమెకున్న అభిమానమే అమెను 1957 లో కెన్యాకు ప్రయాణం కట్టించింది. అక్కడ తన స్నేహితుని సలహాపై సుప్రసిద్ధ ఆర్కియాలజిస్ట్ లూయూ లీకీని సంప్రదించింది. అప్పటికే అతను కోతుల (Great apes)పై పరిశోధించే పనిలో ఉన్నాడు. వీటిపై పరిశోధించడం ద్వారా ఆది మానవ రూపాలైన హూమానిడ్స్ (homonids)ల ప్రవర్తనను అర్థం చేసుకోవచ్చనుకున్నాడు. అందుకే ఆయన చింపాంజీ పరిశోధకుని కోసం చూస్తున్నాడు. ఆ సమయంలోనే గూడాల్ ఆయనకు ఫోన్ చేసింది. లూయూ తన భార్య మేరీతో సంప్రదించి గూడాల్ ను టాంజనియాలోని ఓల్డ్వాయ్ గోర్జ్ కు పంపారు.

అటుపిమ్మట ఆదిమానవుల (ప్రైమేట్స్) ప్రవర్తనను మరింత అధ్యయనం చేసేందుకు 1958లో లండన్ వెళ్లి ఆస్మాన్ హిల్, జాన్ నేపియర్ ల దగ్గర శిష్యరికం చేసింది. 1960 జూలై 14 న గుడాల్ ‘గోంబ్ స్ట్రీమ్ నేషనల్ పార్క్’ కు (Gombe Stream National Park) ప్రయాణమైన తొలి ‘లీకీయాంజెల్’ (Leaky’s Angel) గా అవతారం ఎత్తింది. అప్పటికింకా టాంజానియా ‘తంగనాయకా’ పేరుతో బ్రిటన్ పాలనలో ఉండేది.

గూడాల్ కు అందరిలా యీనివర్సిటీల్లో చదివిన డిగ్రీలు లేవు. కేవలం జంతువుల పట్ల ఆమెకున్న ప్రేమతోనే పరిశోధకురాలిగా మారింది. ఆమె ప్రావిణ్యాన్ని గుర్తించిన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆమెకు 1965 లో పి.హెచ్.డి పట్టా ఇచ్చింది. ఇలా యూనివర్సిటీ చదువుల్లేకుండా పి.హెచ్.డి సాధించిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో గుడాల్ ఒకరు. గోంబ్ నేషనల్ పార్క్ లో చింపాంజీల ప్రవర్తనపై ఆమె ఐదేళ్లు చేసిన పరిశోధనకు గుర్తింపుగానే ఆమె డాక్టరేట్ పట్టా పొందింది.

ఆనాటికి బలంగా ప్రాచుర్యంలో ఉన్న రెండు నమ్మకాలను గుడాల్ తన పరిశోధన ద్వారా ఛాలెంజ్ చేసింది. మొదటిది మనుషులు మాత్రమే పరికరాలను (tools) తయారు చేయగలరని, ఉపయోగించగలరని నమ్మేవారు. రెండోది చింపాంజీలు శాఖాహారులన్న నమ్మకం.

గూడాల్ తన పరిశోధనలతో ఈ రెండిటి పట్ల వున్న అభిప్రాయాలను తప్పని నిరూపించింది. చింపాంజీలు చీమల పుట్టలో దాగి వున్న చీమలను బయటకు రప్పించేందుకు ఒక చిన్న కొమ్మను తీసుకొని ఆకులు తీసి పుట్టలోకి చొప్పించి వాటిని బయటకు తెచ్చేవి. ఇది అత్యంత ఆది రూపంలో వస్తువును తయారుచేయటాన్ని ఆమె నిరూపించింది. దీన్ని చూసిన లూయూ లీకీ ‘మనిషి’ నిర్వచనాన్నే అవసరం ఉందన్నాడు. చింపాంజీలను మనుషులుగా గుర్తించాలన్నాడు.

సాధారణంగా చింపాంజీలు సాధుజీవులు. కాని వాటిలో ఉండే హింసాత్మక కోణాన్ని గూడాల్ తన పరిశోధనలో వెలువరించింది. వాటికంటే చిన్న ప్రైమేట్లను (కోతులను) వెంటాడి తినేవి. ఇవి వేటాడే వాటిని “కోలోబస్ కోతులు” (colobus monkeys) అంటారు. చింపాంజీలు సాముహికంగా వలపన్ని కోలోబస్ కోతుల్ని వేటాడేవి. ముందుగా కోలోబస్ కోతిని చెట్టు పైకి ఎక్కేటట్లుగా తరిమి, చుట్టూ చింపాంజీల వలయంగా ఏర్పడి ఒక చింపాంజీ మాత్రం చెట్టు పైకెక్కి కోలోబస్ కోతిని చంపుతోంది. చింపాంజీ ఆహారం, ప్రవర్తన విషయంలో గూడాల్ వినూత్న సత్యాన్ని ఆవిష్కరించింది.

చింపాంజీ సమూహంలో స్త్రీ చింపాంజీల ఆధిపత్యాన్ని గుడాల్ తన పరిశోధనలలో గుర్తించింది. సాధారణంగా చింపాంజీలు సాధువులనుకున్నది గూడాల్. కాని బలమైన స్త్రీ చింపామజీలను దారుణంగా చంపి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేది.

గూడాల్ చింపాంజీల పరిశోధనలో మరో మానవీయ కోణం దాగి ఉంది. సాధారణంగా జంతు పరిశోధనలో ఆయా జంతువులకు ఒక సంఖ్య లేక అంకెను ఇచ్చి గుర్తిస్తాం. కాని గూడాల్ తన చింపాంజీలను ఆప్యాయంగా వాటికి గోలియత్, మైక్, హాంఫ్రీ అంటూ పేర్లు పెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే చింపాంజీల సమూహంలోకి ‘గూడాల్’ను ఒక సభ్యురాలిగా అవి అంగీకరించాయి.

చింపాంజీల పరిరక్షణకు, అవి నివశించే పర్యావరణాన్ని కాపాడేందుకు జేన్ గూడాల్ ఇన్స్టిట్యూట్ (Jane Goodall Institute)ను 1977లో స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 19 కేంద్రాలున్నాయి, ముఖ్యంగా ఆఫ్రికాలో చింపాంజీల పరిరక్షణలో సమాజ భాగస్వామ్యాన్ని ముందుకు తెచ్చిన సంస్థగా పేరు తెచ్చుకుంది. 1991లో ఆ సంస్థ యువకుల్ని ఆకర్షించే “Roots and Shoots” అనే ప్రోగ్రాంను చేపట్టింది. ఇది 100 కు పైగా దేశాల్లో పజివేల గ్రూపులు విశ్వవ్యాప్తంగా పనిచేస్తున్నాయి.

దారుస్సలాంలో ఆమె ఇల్లు చింపాంజీల ఫోటోలతో, డాటా పుస్తకాలతో నిండిపోవడంతో “యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా” లో ఒక కేంద్రాన్ని ఏర్పరిచారు. గూడాల్ ఆర్ఖైవ్ ను ఆన్లైన్ లో పెట్టారు. దీన్ని డ్యూక్ యూనివర్సిటీకి తరలిస్తున్నట్లు ఆమె 2011లో చెప్పారు.

గూడాల్ తన జీవితాన్ని చింపాంజీల పరిశోధనకు పరిరక్షణకు అంకితం చేశారు. ఈ పనిలో సంవత్సరంలో 300 రోజులు పని చేస్తున్నది. ‘చింపాజీలను రక్షించండి’ (Ssve Chimps) అనే నినాదంతో ఎడింబరో నుండి పనిచేసే ‘జంతువుల వకీళ్లు’ (Advocates for Animals) అనే సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. ఆమె కృషిని, జీవితాన్ని ప్రతిబింబించే పాత్రలను ‘సింప్సన్ సఫారీ’ వంటి చిత్రాల్లో చూపించారు. టాంజానియాలో పరిశోధించిన గూడాల్ ఏప్రియల్ 3, 1934 లండల్ లో జన్మించారు. ఈమె ప్రైమటాలజిస్ట్ (Primatologist)గా మానవ శాస్త్రవేత్త (Anthropologist)గా ప్రసిద్ధి చెందిన గూడాల్, ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా కూడా పనిచేశారు.

జాదవ్ పయేంగ్

oct12బాలలు, ‘ఎల్జెర్డ్ బేఫియర్’ పేరు విన్నారా? వినే ఉంటారు. అతను ఓ అడవి సృష్టికర్త. ఆశ్చర్యంగా ఉందా? అవును ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింజే మరి. ఎందుకంటారా? ఓ మారుభూమిని ఎన్నుకొని నారు పోసి-నీరు పోసి, మొక్కలను మహా వృక్షాలుగా మార్చి, జంతువులను ప్రవేశ పెట్టి – పక్షులను రాబట్టి, అడవినే నివాసంగా మార్చుకుని, అడవిని సృష్టించటానికే మొత్తం జీవితాన్ని ధారపోసి, ఫ్రాణాలను సైతం లెక్క చేయకుండా అడవిని రక్షించుకొనిన ధీరోదత్తుడు బెఫియర్.

‘వృక్షో రక్షిత రక్షితః’ అన్న ఆరోక్తిని సంపూర్ణంగా విశ్వసించిన వ్యక్తి బేఫియర్, ఎందుకంటే అడవులనేది ప్రపంచ ప్రాణకోటికి ఊపిరితిత్తులవంటివి. వాతావరణంలోని బొగ్గుపులుసు వాయువుని సంగ్రహించి ప్రాణవాయువైన ఆమంలజనిని విడుదల చేసే చెట్లు మానవుల పాలిట, జీవుల పాలిట కూడా ఊపిరిదాతలు. ప్రపంచంలోని 40 శాతం ఆమ్లజనిని పర్షారణ్యాలు అందిస్తున్నాయి. ఎదిగే చెట్టు ఒక కిలో చెక్కను తయారు చేసుకోటానికి ఒకటిన్నర కిలోల కార్బన్-డా-ఆక్సైడ్ ని చెట్టు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.

అంతేకాదు ఆధునిక మానవులు తినే ఆహారం 80% వర్షారణ్యాలలోనే రూపొందుతుంది. మనం ఉపయోగించే మందుల్లో 25% లభించేది అడవుల్లోనే. అటువంటి అడవులను సృష్టించడమంటే మాటలా? ఎంతో కఠోర శ్రమ, నిబద్ధత ఉంటేనే సాధ్యం. ఫ్రెంచి నవలాకారుడు ‘జీన్ గియోనో’ 1953లో వ్రాసిన ‘ది మ్యాన్ హు ప్లాంటెడ్ ట్రీస్’ అనే నవలలోని హీరోనే మన ఈ బేఫియర్, రచయిత చెప్తేగాని పాఠకులకు బేఫియర్ నిజజీవితంలో లేదు అన్న విషయం తెలియలేదు. నిజ జీవితంలో బేఫియర్ లాంటి అడవి సృష్టికర్తలు ఉంటారా?

లేరు అనుకుంటే మన పప్పులో కలేసినట్లే. మనదేశంలోనే ‘ఫారెస్ట్ మ్యాన్’ ఉన్నాడు. జీవించేయున్నాడు. ఈ మధ్యే ‘ఎర్త్ డే’ రోజు మనదేశ రాజధాని ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఆ వ్యక్తిని పిలిచి ‘ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని బిరుదునిచ్చి సత్కరించారు. అతనే మన ‘జాదవ్ పయేంగ్’. అతను సృష్టించిన అడవే ‘మోలాయ్ కథోని’ అంటే మోలాయ్ అడవి.

మన రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ యందు ఈ మాసం ఒకటి నుంచి పంతొమ్మిదవ తేది వరకు 11 వ అంతర్జాతీయ జీవవైవిద్య సదస్సు 139 దేశాల ప్రతినిధులతో జరుగుతున్న విషయం మీ అందరికి తెలుసుకదా. మనదేశంలో 18,664 రకాల వృక్ష జాతులు, 521 జాతుల సరీసృపాలు, 458 జాతుల పక్షులు, 390 రకాల క్షీరదాలు, 231 రకాల ఉభయచరాలు మనుగడ సాగిస్తున్నాయి. ప్రపంచంలోని మొత్తం జీవరాశుల్లో ఎనిమిది శాతం ప్రాణులకు భారతావనే పుట్టినిల్లు. చాలా రకాల వైవిద్యమున్న చేపలను కలిగివున్న దేశం మనది. అత్యంత జీవవైవిద్యమున్న 17 ప్రపంచ దేశాలలో మనదేశం కూడా ఒకటి. ఇంతటి జీవవైవిద్యంతో కూడిన మనదేశంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే బేఫియర్ లాంటి నవల హీరో కాకుండా నిజ అడవి మనిషి ఒకడున్నాడంటే చాలా ధ్రిల్లింగ్ గా ఉంది కదా. మొలాయ్ అడవి సృష్టికర్త గురించి తెలుసుకుందాం.

అది 1979 వ సంవత్సరం, అంటే ఇప్పటికి 33 సంవత్సరాల క్రితం ఉత్తర అస్సాంలోని జోర్హాత్ ప్రాంతం సమీపంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో మేటు వేసిన ఓ ఇసుకదిబ్బ అది. అక్కడికి చేరుకోవాలంటే గౌహతి నుంచి 350 కి.మీ. ప్రయాణించి ఓ నది తీరానికి చేరుకుని చిన్నబోటులో ఆవలిఒడ్డుకు చేరుకుని ఇంకే‘ 7 కి.మీ. కాలినడక సాగిస్తే ఆ ఇసుక దిబ్బని చేరుకోగలం. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామంవో పదవ తరగతి చదువుకున్న ఓ 16 ఏళ్ళ బాలుడు జాదవ్ పయేంగ్. అతను ఆ ఇసుక దిబ్బకు వెళ్ళటం, దానిపై వందల సంఖ్యలో పాములు నిర్జీవంగా పడిఉండడం చూసి ఎంతో కలత చెందాడు. ఆ బాలుని జీవితాన్ని ఓ మలుపు తిప్పింది.

బ్రహ్మపుత్ర నదికి వచ్చిన వరద ఉధృతిలో కొట్టుకొచ్చి, మచ్చుకైనా పచ్చదనం లేని ఇసుకదిబ్బ వేడికి తాళలేక మాడి చచ్చిపడిఉన్న పాములను చూచి పయేంగ్ చలించిపోయాడు. ఎంతసేపు విలపించాడో అతనికే తెలియదు. చెట్లు + చేమలు నీడలేని కారణంగా పాములన్నీ కూడా చనిపోయాయని నిర్ధారించుకుని ఓ పెద్ద గుంటను తవ్వి దానిలో పాములన్నింటినీ పూడ్చి ఎలాగైనా ఈ ప్రాంతంలో ఓ అడవిని సృష్టించాలని, జీవజాతులకు ఆశ్రయం కల్పించాలని ధృడ నిర్ణయం తీసుకుని, చదువుకి స్వస్తి చెప్పి, ఇసుక దిబ్బపై నివాసాన్ని ఏర్పరుచుకొని కార్యాచరణకు పూసుకున్న గొప్ప వ్యక్తి జాదవ్.

తొలుత అడవీ అధికారులను కలిసి పరిస్థితిని వివరించి ఆ ప్రాంతంలో అడివిని పెంచమని ప్రాధేయపడ్డాడు. పయేంగ్ ని ఎగాదిగా చూచిన అటవీ అధికారులు అది గడ్డిపోచ కూడా పెరగని మారుభూమిని అవహేళన చేసి, నీకు చేతనైతే వెదురు మొక్కలు పెంచు అని ఉచిత సలహా ఇచ్చారు. నిరుత్సాహం చెందకుండా, లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ధృడసంకల్పంతో, అవరోధాలను లెక్కచేయకుండా ముందుకుసాగారు.

మొదట వెదురు మొక్కలను, తదనంతరం ఇతర జాతుల మొక్కలను నాటడం, సంరక్షణ చేపట్టాడు. నేలలో మార్పులు కొరకు కొన్ని రకాల చీమలను కూడా తెచ్చి చెట్లపై వదిలాడు. మొత్తం ప్రాంతాన్ని గడ్డిజాతులకు, పక్షిజాతులకు, జీవులకు నివాసయోగ్యంగా, పర్యావరణ ప్రతికూలంగా మార్చడం చేశాడు. ఇదంతా ఒంటిచేత్తో, ఇతరుల సహాయం లేకుండా చేశాడు. ఇదంతా ఒంటిచేత్తో, ఇతరుల సహాయం లేకుండా చేశాడు. ఆనాటి ఆ ఇసుకదిబ్బ నేడు 1360 ఎకరాల జీవవైవిద్య అడవిగా రూపాంతరం చెంది ఎన్నో పశుపక్ష్యాదులకు ఆశ్రయానిస్తూ ఏనుగులు, ఖడ్గమృగాలు, పులులు, తేళ్లు, దుప్పి, వానరులు వంటి జంతుజాలంతో అలరారుచున్నది. ఈ అడవిలో సిములు, డియోర్, సిసు, వెల్కో అర్జున్, తాడి, గమరి, సోనార్, కిష్ణాచుర, సెగున్ వంటి వృక్షజాతులున్నాయి. వివిధ రకాల వలస పక్షులకు సెలవుగా మారింది.

2008లో ఈ అడవిలోని ఓ ఏనుగుల గుంపు సమీప గ్రామంపై పడి విధ్వంసం సృష్టించే వరకు అటవీశాఖకు కూడా తెలియదు మొలాయ్ అడవి గురించి. అడవిని చూచి ఆశ్చర్యపోవడం అటవీశాఖ అధికారులవంతైంది.

ఏనుగుల పీడా వదిలించికునేందుకు సమీప గ్రామ ప్రజల అడివిని సరకాలని ప్రయత్నిస్తే ‘ముందుగా నన్ను చంపి ఆ తరువాత ఈ అడవిని నరకండి’ అని గ్రామస్తులందు ఎదురొడ్డి అడవిని రక్షించుకున్న అడవి మనిషి జాదవ్. కోకిలాముఖ్ గ్రామ సమీపంలోని పయేంగ్ సృష్టించిన మెలాయ్ అడవి ప్రకృతి ప్రేమికులకు సందర్శన నిలయంగా బాసిల్లుతుంది. ‘అడవే నా ఇల్లు, నా తుది శ్వాస వరకు అడవులను పెంచి పోషిస్తూనే ఉంటాను.’ అనే జాదవ్ మాటలు అందరిని ఆలోచింపజేస్తున్నాయి కదా. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వారు పయోంగ్ ని ప్రపంచానికి పరిచయం చేశారు.

‘టన్నులకొద్దీ ఆలోచనలకన్నా పిడికిళ్ళ కొద్ది ఆచరణ మేలు’ అంటారు మదర్ థెరిస్సా. అక్షరాలా ఈ మాటకి సరిపడిన వ్యక్తి జాదవ్ పయేంగ్. ప్రపంచానికి పయేంగ్ ల అవసరం ఎంతైనా ఉంది. చైనా ప్రభుత్వం 11 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు సంవత్సరానికి ఒక చెట్టు పెంచాలని చట్టం చేసింది. ఇలాంటి పురోగమన ఆలోచనలు మన పాలకులు కూడా చేస్తే బాగుంటుంది కదా. అయినా ఇది అందరి బాధ్యత. ఎవరికి వారు పయేంగ్ లాగా మారితే ఎంత బాగుంటుందో.

స్టీవెన్ ఛూ

stevenchuఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ శక్తి వనరులు – సుస్థిర అభివృద్ధి సంవత్సరంగా ప్రకటించింది. సక్తి వనరుల సంక్షోభం ముందెన్నడు లేనంతగా ప్రపంచాన్ని దుర్భర స్థితిలోకి నెట్టేసింది. మన ధరిత్రి వాతావరణం రోజురోజుకి వేడెక్కిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న విపత్తును ఉహించనుకూడ ఉహించలేం. వాతావరణం వేడెక్కకుండ తక్షణ చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు, ప్రణాళికా నిపుణులూ పాలకులపై వత్తిడి పెంచుతున్నారు. ఈ సంధర్భములో ఒక శాస్త్రవేత్త పాలనావర్గాలు చెబడితే, నేరుగా ప్రభుత్వ ప్రభుత్వ విధాన రూపకల్పనలో... అందునా ఒక అగ్రరాజ్యపు పలనా వ్యవహారాల్లో ఉంటే, పర్యావారణానికి మేలు జరుగుతుంది అనుకుంటాం కదా. అవును, దాన్ని నిజం చేస్తూ అమెరికా ప్రభుత్వంలో శక్తి వనరుల (Energy Resources) విభాగానికి నేతృత్వం వహిస్తున్నాడొక నోబెల్ బహుమతి గ్రహిత. ఆయనే ‘స్టీవెన్ ఛూ’ బరాక్ ఒబామా కాబినెట్ లో 2009, జనవరి 21 నుండి ఎమర్జీ డిపార్ట్మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక చైనీస్ అమెరికన్ స్టీవెన్ ఛూ. ఛూ ఒక భౌతిక శాస్త్రవేత్త. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బెర్కిలీ లో భౌతికశాస్త్రం, అణు, కణ జీవశాస్త్ర విభాగంలో ఆచార్యుడుగా పనిచేసేవాడు.

అణు భౌతిక శాస్త్రంలో పరిశోధనలు చేస్తున్న ఛూ ‘లేసర్ కూలింగ్’ (Laser cooling) ప్రక్రియను కనుగొన్నాడు. లేసర్ కాంతితో పరామాణువులను చల్లబరచడం దీని ప్రత్యేకత. దీని ద్వారా పరమాణువులను ఏరివేసి పట్టుకోవచ్చు. ఈ సాంకేతిక పరిజ్ఞాణం (technology) అత్యంత ఖచ్చితంగా పనిచేసే పరమాణు గడియారం (atomic clock)ను నిర్మించే వీలవుతుంది. ఇంత బహుళ ప్రయోజనకరమైన లేజర్ కూలింగ్ ఆవిష్కరణకు 1997 లో క్లాడ్ కొహెన్ తన్నౌడ్జీ, విలియన్ డేనియల్ ఫిలిప్స్ లతో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నాడు. లారెన్స్ బర్క్లీ జాతీయ ప్రయోగశాలకు అధిపతిగా ఉన్నప్పుడు (2004) అణువుల స్థాయిలో జీవ వ్యవస్థలను అధ్యయనం చేశాడు. ఇక్కడి ప్రయోగశాలను జీవ ఇంధనాల (bio fuels) పై, సౌరశక్తి (solar energy)పై పరిశోధనలు జరిపే ముఖ్య కేంద్రంగా తీర్చిదిద్దాడు.

కొంతకాలం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ భౌతిక శాస్త్ర విభాగానికి 1990 – 1993 వరకు, 1999 నుండి 2001 వరకు నేతృత్వం వహించాడు. ప్రతిష్టాత్మకమైన హీలియోస్ (Helios) ప్రాజెక్ట్ ను చేపట్టి రవాణా వహనాలు నడిపేందుకు సౌరశక్తిని నిల్వ చేసే పద్ధతులను కనుగొన్నాడు. స్టాన్‌ఫర్డ్ లో ఉన్నప్పుడే పరమాణు భౌతిక శాస్త్రం, జీవ భౌతిక శాస్త్రాల్లో ఎంజైము చర్యలు, ప్రోటీన్ RNA ముడుతలు పడటం (RNA Folding) గురించి పరిశోధనలు చేశారు.

తన అనుభవంతో పునరుత్పత్తి చేయగల శక్తి (Renewable Energy), అణుశక్తి (Nuclear Power) వినియోగంతో తప్ప వాతావరణంలో వచ్చే విపత్కర మార్పులు (climate change)ను నిలువరించలేమని గట్టిగా వాదించేవాడు. ప్రపంచ స్థాయిలో గ్లూకోజ్ ఎకానమీ (Glucose economy) అనే భావనకు నాంది పలికాడు. దీని ప్రకారం ఉష్ణమండల (tropics) ప్రాంతాల్లో ఎక్కువ గ్లూకోజ్ ను కలిగిన మొక్కలను పెంచి, వాటినుండి గ్లూకోజ్ ను, తద్వారా ఇంధనాన్ని ప్రాసెస్ చేసి నేడు మనం ఆయిల్ (oil)ను ఎలా వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామో అలా చేయవచ్చని సూచించాడు. ఇంతేగాక రోడ్లు, బిల్డింగ్ పై కప్పులను తెలుపు లేక లేత వర్ణంలో ఉండే విధంగా నిర్మించాలని, తద్వారా సూర్యకాంతిని అంతరిక్షంలోకి పునరుత్పత్తి చేసే శక్తిని శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా వినియోగించాలని బలంగా విశ్వసింది, ప్రచారం చేసే స్టీవెన్ ఛూ పలు అంతర్జాతీయ కమిటీలలో, సమావేశాల్లో పాల్గొని తన వాదాన్ని నిరూపించాడు. కోపెన్ హాగస్ క్లైమేట్ కౌన్సిల్ అందులో ఒకటి. పర్యావరణ ప్రణాళికను ప్రపంచ స్థాయిలో అమలు పరచాలని ఇటీవలి కాలంలో (2009 – 11) బహుళ ప్రచారం గావించాడు. శక్తి,  జీవశాస్త్ర సంస్థను (Energy Bioscience Institute) కాలిఫోర్నియా, ఇల్లానాయ్, లారెన్స్ బర్కిలీ జాతీయ ప్రయోగశాలల ఆధ్వర్యంలో ఏర్పరచడంలో కీలకపాత్ర వహించాడు.

పునరుత్పత్తి చేయగల శక్తి వనరుల్లో విస్తృత నైపుణ్యం గల చైనా సంతతికి చెందిన అమెరికా స్టీవెన్ ఛూ కు చైనాభాష రాదు. ఆయన కుటుంబీకులంతా తండ్రీ, అన్నదమ్ములు, మేనమామలు అందరూ వివిధ శాస్త్ర రంగాల్లో నిష్ణాతులు. వారి కుటుంబంలో ఇంగ్లీషు మాట్లాడడం వలన ఆయన చైనీస్ నేర్చుకోలేకపోయానన్నాడు. మిస్సోరీలోని సెయింట్ లూయూన్ లో జన్మించిన ఛూ, రోచెస్టర్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీ బర్కిలీ నుండి డాక్టరేట్ అయ్యాడు. 1977లో జీన్ ఫెట్టర్ అనే బ్రిటీష్ సంతతి అమెరికన్ ను వెళ్లాడాడు. ఆమె కూడా ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న భౌతిక శాస్త్రవేత్తనే. సైన్సుతో పాటు ఛూకు సైక్లింగ్, ఈత, బేస్ బాల్, టెన్నిస్ వంటి క్రీడల్లో ప్రావీణ్యం ఉంది. తన ఇంటికి దగ్గరల్లో ఉన్న ఒక దుకాణం నుండి వెదురుగడలను తెచ్చుకొని పోల్ వాల్ట్ నేర్చుకున్నాడు.

ఈ బహుముఖ ప్రజ్ఞశాలి ఇప్పుడు అమెరికా ప్రభుత్వంలో ఎనర్జీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు పోషిస్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది కదా.

క్రిస్టియేన్ న్యూష్లైన్ – వోలార్డ్

christianeమీరెప్పుడైనా తినిపారేసి మూలన పడివున్న అరటి తొక్కల మీద సన్నని ఈగలు (fruit fly) ఎగరటాన్ని చూశారా? చూసే ఉంటారు కానీ అవి ఎంత గొప్పవో, మానవ జాతికి ఎంత మేలు చేశాయో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకోక తప్పదు. జన్యుశాస్త్రం (genetics) గురించిన అవగాహన, జన్యు పదార్థం డి.ఎన్.ఎ కి సంబంధించిన అనేక విషయాలు ఈ చిరు ఈగను అధ్యయనం చేయటం ద్వారానే తెలుసుకోగలిగాం అంటే ఆశ్చర్యపోకండీ. దీని పేరే డ్రోసోఫిలా మెలానోగాస్టర్ (Drosophila melanogaster). దీని జన్యుశాస్త్రం పై అధ్యయనం చేసినవారికి ఎందరికో అత్యున్నత నోబెల్ బహుమానం దక్కింది. అందుకే దీనిని అణుజీవశాస్త్ర అధ్యయనం చేసే ఒక పరికరం (Molecular tool)గా పేర్కొంటారు.

దీనిలో పిండాభివృద్ధి జరిగే ప్రక్రియను వెలువరించినందుకు క్రిస్టియేన్ న్యూష్లైన్ వోలార్డ్ 1995వ సంవత్సరం నోబెల్ బహుమానం వచ్చింది. వైస్ హౌస్ తో కలిసి ఆమె చేసిన పరిశోధనలకు ఈ బహుమతి వచ్చింది. డ్రాసోఫిలా పిండాభివృద్దికి కారణమైన జన్యువులను గుర్తించి జీవశాస్త్ర పరిశోధనల్లో 1970-80 మధ్యకాలంలోనే నూతన అధ్యాయాన్ని ళిఖించింది వోలార్డి. అప్పటికింకా బహుకణ జీవుల్లో వాటి పెరుగుదలకు సంబంధించిన జన్యు సమాచారం అందుబాటులో లేదు. ఏకకణం నుండి సంక్లిష్ట స్వరూపాలతో ఉండే బహుకణ జీవి నిర్మాణాన్ని అర్థం చేసుకోవటానికి వోలార్డ్ పరిశోధనలు తోడ్పడ్డాయి.

డ్రాసోఫిలా జన్యుశాస్త్ర అధ్యయానాన్ని బాగా అనువైన చిరుకీటకం. ఇది ఎంతో వేగంగా పెరిగి పెద్దయ్యే జీవి, ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే లేక వచ్చే మంచి మోడల్ గా ఉపయోగపడతాయి. రసాయనాలనుపయోగించి వీటిలో ఉత్పరివర్తనాలు సృష్టించింది వోలార్డ్. ఈ ఉత్పిరివర్తనాలలో (mutation) కొన్ని డ్రాసోఫిలా పిండాభివృద్దిలో కీలకపాత్ర వహించటాన్ని గమనించింది. ఏ మార్పు చెందని డ్రాసోఫిలా ప్రతి భాగం (segment) తల దగ్గరలో (పూర్వబాగంలో) రోమాలను కలిగి ఉండేవి.

వోలార్డ్ సృష్టించిన ఉత్పరివర్తనం (మార్పు) చెందిన డ్రాసోఫిలాలో ఈ రోమాలలేమిని పరిశీలించి లార్వా అభివృద్ధిలో ప్రత్యేకమైన జన్యువులు ప్రభావం చూపుతున్నాయని తెలుసుకున్నారు. ఉత్పరివర్తనం చెందిన లార్వాలకు హెడ్జ్ హాగ్, కుకుంబర్స్, క్యుప్సెల్ వంటి పేర్లు పెట్టింది. ఈ పరిశోధన ద్వారా డ్రాసోఫిలా పిండాభివృద్ధిలో కీలకపాత్ర వహించే జన్యువులను ఆమె గుర్తించింది.

ఈ పరిశోధనల ప్రభావం కేవలం డ్రాసోఫిలాకే పరిమితమైతే వాటి కంత ప్రాముఖ్యత లేదు. వీరు గుర్తించిన ఈ జన్యువులు ఇతర జాతుల్లో కూడా ఉండటం, అవి ఆ జాతుల్లో కూడా శరీరాభివృద్ధిలో ఒకే రకమైన ప్రభావాన్ని చూపడంలో వోలార్డ్ పరిశోధనలకు మరింత ప్రాధాన్యత వచ్చింది.

వోలార్డ్ పరిశోధనలు బహుకణ జీవుల పరిణామక్రమాన్ని, ముఖ్యంగా ప్రోటోస్టాకులు, న్యూటిరోస్టోమ్ లు ఒకే పూర్వికుల నుండి వచ్చాయనే విషయాన్ని రుజువు చేయడానికి బాగా తోడ్పడ్డాయి. మరీ ముఖ్యంగా డి.ఎన్.ఏ నుండి ప్రోటీన్ తయారీలో అనులేఖనాన్ని (transcription) అవగాహన చేసుకోవడానికి దోహదపడ్డాయి. స్యూష్లైన్-వోలార్డ్ టోల్ (Toll) వంటి గ్రహకాలను కనుగొనటంలో కూడ ముఖ్యపాత్ర వహించారు.

ఇంతటి ప్రాముఖ్యత వున్న వోలార్డ్ 1942 అక్టోబర్ 20న రోల్ప్ వోలార్డ్, లీస్-మ్యోల్మన్ దంపతుల ఐదుగురు సంతానంలో రెండోబిడ్డ. వీరి కుటుంబం గంపెడు పిల్లలతో కళకళలాడేదని, తనకు 33 మంది సోదరీ సోదరులు (cousins) ఉన్నారని చెప్పింది. ఆమె 12 ఏళ్ళ వయసులోనే జీవశాస్త్రవేత్త కావాలనుకుందట. ఆమెకు బయాలజి టీచర్ చెప్పిన పరిణామ సిద్దాంతం, జన్యుశాస్త్ర విషయాలు, జంతువుల ప్రవర్తన తననెంతో ప్రభావితం చేశాయని చెప్పింది. 1985 నుండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ బసాలజీకి డైరెక్టర్ గా ఉంది. 1986 లో గాట్టిఫ్రైడ్ విల్వెల్మ్ లైబ్నిజ్ ప్రైజ్ గెలుచుకుంది. సామాన్యుల కోసం 2006 “Coming to Life: How Genes Drive Development” అనే పుస్తకం రాసింది.

2004లే తనపేర ఒక ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా పిల్లలున్న జర్మన్ మహిళా శాస్త్రవేత్తలకు ప్రత్యేకంగా సహాయం చేస్తున్నది. వేతనంతో పాటు పిల్లల పెంపకంపై ఈ ఫౌండేషన్ ప్రత్యేక దృష్టి సారించి, మహిళా శాస్త్రవేత్తలు పనిచేసే సమయంలో పిల్లలకోసం సంరక్షణ కేంద్రాలను ఏర్పరిచింది. ఆల్బర్ట్ లస్కర్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న వోలార్డ్ ట్యూబింజెన్ యూనివర్సిటీలో హైంజ్ షాలర్ నేతృత్వంలో డాక్టరేట్ చేసింది.

శ్రీనివాస రామానుజన్

dec1అత్యంత స్వల్ప వ్సవధిలో సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థితికి ఎదిగిన అనన్య ప్రతిభామూర్తి శ్రీనివాస రామానుజన్. ఈ డిసెంబర్ 22, 2012 నాటికి రామానుజన్ జన్మించి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా, “జాతీయ గణిత సంవత్సరం 2012” గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంగా చెకుముకి పాఠకులకు వెలువడుతున్న ప్రత్యేక వ్యాసం.

క్షీనివాస రామానుజన్ 22 డిసెంబర్ 1887 రోజున తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడు. వీరి తల్లిగారు కోమలతమ్మాళ్ స్థానిక దేవాలయంలో గాయని, తండ్రిగారు శ్రీ శ్రీనివాస అయ్యంగార్, బట్టల షాపులో లెక్కలు చూసేవాడు.

చిన్నతనం నుండే రామనుజన్ నక్షత్రాలు, ఖగోళ దూరాలను గురించి ఉపాధ్యాయులను ప్రశ్నించి వారిని ఆశ్చర్యపరిచేవాడు. ఒక రోజు గణితం భోదిస్తున్న ఉపాధ్యాయుడు, భాగహార ప్రక్రియలో భాగంగా 100 పళ్ళను 100 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి, 50 పళ్ళను 50 మందికి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి, అని పిల్లలను ప్రశ్నించి, ఒక్కొకరికి ఒకటి చొప్పున వస్తాయి అని అంటుండగానే , రామానుజన్ లేచి 0 (సున్నా) పళ్ళను 0 మందికి పంచితే 1 ఎలా వస్తుంది అని ప్రశ్నించి ఆ ఉపాధ్యాయుని దృష్టిని ఆకర్షించాడు. తన 13వ యేట 8వ తరగతిలో తన పొరిగింటి అబ్బాయినడిగి S.L. లోని రచించిన “ట్రిగ్నోమెట్రి” అను పుస్తకం చదివి దానిలోని సమస్యలను సాధించాడు.

1903 వ సంవత్సరంలో (అప్పుడు అతని వయస్సు 16 సంవత్సరాలు) G.S. కార్ రచించిన “A Synopisis of Elementary Results in Pure and Applied Mathematics” పుస్తకం చదవడమే రామానుజన్ జీవితంలో గొప్ప మలుపు. ఇందులో బీజగణితం, కలనగణితం, త్రికోణమితి, వైశ్లేషిక జ్యామితిలకు సంబంధించిన 6,165 సిద్ధాంతాలు ఉండేవి.

1903 మెట్రిక్యులేషన్ పాసై 1904 జనవరిలో కుంభకోణంలోని జూనియర్ కళాశాలలో F.A. లో చేరి ప్రతిభావంతులకిచ్చే సుబ్రమణ్యం స్కాలర్షిప్ ను పొందాడు. కాని లెక్కల మీదే ధ్యాస ఉండడం వల్ల ఇతర సబ్జెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల F.A. పరీక్ష తప్పాడు. తర్వాత కాలంలో రామానుజన్ కుటుంబ సమస్యల దృష్ట్యా ఉద్యోగం కోసం తిరిగాడు. అయితే 1909 సంవత్సరంలో జులై 14 న రామానుజన్ వివాహం 9 సంవత్సరాల జానకీతో జరిగింది. ఆనాటికి రామానుజన్ వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే.

రామానుజన్ క్లరికల్ ఉద్యోగం చేస్తున్నప్పుడు, తను వ్రాసిన పుస్తకాలు ప్రొఫెసర్ రామస్వామి అయ్యర్ కు చూపించాడు. ఆ నోట్స్ 1911 లో “ఇండియన్ మేధమేటికల్ జర్నల్” లో ప్రచూరితమైనాయి. ఇందులో రామానుజన్ బెర్నౌలీ డిజిట్స్ ను 15 స్థానాల వరకు పొడిగించాడు. ఇది రామానుజన్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.

రామానుజన్ తను కనుగొన్న ఫలితాలను 212, 352, 33 పేజీలు గల మూడు నోట్ బుక్స్ లో వ్రాసుకున్నాడు. ఇప్పుడు ఈ నోట్ బుక్స్ బహుళ ప్రసిద్ధిలో ఉన్నాయి.

రామానుజన్ 1913 సంవత్సరంలో జనవరి 16 వ తేదీన కేంబ్రిడ్జిలో ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడైన G.H. హార్డీకి లేఖతో పాటు, తాను సాధించిన సూత్రాలు, సిద్ధాంతాలు 12 జత చేశాడు. కాని హార్డీకి అవి నిజాలని తోచలేదు. అయితే తన తోటి శాస్త్రవేత్త J.E. లిటిల్ వుడ్ సాయంతో నిగ్గు తేల్చడంతో రామానుజన్ ఒక గొప్ప మేధావి అని నిర్ధారించి తన స్పందనను తెలియజేశారు. రామానుజన్ ఇంగ్లాండుకు రప్పించేందుకు ఉద్యుక్తులైనాడు.

ఈ విధంగా రామానుజన్ లోని మేధాశక్తిని గుర్తించి, దానికి మెరుగులు దిద్ది ప్రపంచ దృష్టికి తెచ్చిన మహామనిషి G.H. హార్డీ.

హార్డీ తనను కేంబ్రిడ్జ్ రమ్మని వ్రాసిన ఉత్తరంతో కుటుంబ సభ్యులను వదలి, 1914 మార్చి 17 వ తేదీన ఇంగ్లాండుకు బయలుదేరాడు. తన పేరును కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాలలో గణితశాఖలో పరిశోధక విద్యార్థిగా నమోదు చేసుకున్నాడు.

హీర్డీతో కలిసి రామానుజన్ గణిత సమస్యల సిద్ధాంత సముద్రంలో కలిసి ఎన్నో మైళ్ళు అలవోకగా ఈదారు. ఫలితంగా ఎన్నో సిద్ధాంతాలు, గణిత సమస్య సాధనలు ఉద్భవించాయి. ఇంగ్లాండుకు వెళ్లిన రెండేళ్ళకు రామానుజన్ కృషికి ఫలితంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధన B.A. పట్టాను 1916 లో ప్రకటించింది.

1917 వ సంవత్సరంలో రామానుజన్ ఆరోగ్యం దెబ్బతిన్నది. హార్డీ ఒకసారి 1729 నంబర్ గల టాక్సీలో ప్రయాణించి, హాస్పిటల్లో ఉన్న రామానుజన్ ను పలకరించడానికి వచ్చాడు. అప్పుడు రామానుజన్ ఆ సంఖ్యను చూసి, విశిష్టమైనదిగా తెలియజేశాడు. 123 + 13 మరియు 93 + 103 గా వ్రాసి, మూడు ఘాతం కలిగిన రెండు సంఖ్యల మొత్తంగా తెల్పాడు. ఈ కాలంలోనే విలువలని ఏ దశాంశం వరకైనా క్షణాల్లో చెప్పేవాడు.

రామానుజన్ గణితమును లోతుగా అధ్యయనం చేశాడు. Infinite series, continued fractions and identities మొదలగు అంశాలపై క్షుణ్ణంగా పరిశధన చేశాడు. రామానుజన్ పరిశోధనలను వర్గీకరిస్తే 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. తొలి మూడు నోట్ బుక్స్ ను మొదటి భాగంగా, 1911 సం.లో వ్రాసిన 21 అధ్యాయాలతో వ్రాసినవి రెండవ నోట్ బుక్ గా, మూడవ నోట్ బుక్ లోని విషయాలు అసంపూర్ణంగా ఉన్నాయి. చాలాకాలం కనిపించకుండా పోయిన చివరి నోట్ బుక్ అయిన ‘లాస్ట్ నోట్ బుక్’ ను మూడవ భాగంగా పేర్కొనవచ్చు.

1903 – 1910 మధ్యకాలంలో రామానుజన్ కనుగొన్న ఫలితమే ఆ తర్వాత రోగర్-రామానుజన్ సర్వసమీకరణంగా పేర్కొనబడింది. రామానుజన్ ఫలితాలను నేడు భౌతికశాస్త్రంలో, సాంఖ్యక, యాంత్రిక శాస్త్రంలో, కంప్యూటర్ అల్గారిథమ్ లలో, పాలిమర్ కెమిస్ట్రీ, క్యాన్సర్ మొదలగు అంశాలలో విరివిగా వినియోగిస్తున్నారు.

1918 వ సం.లో రాయల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ రామానుజన్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ సభ్యత్వం F.R.S. బిరుదుని ఇచ్చింది. అలాగే మాద్రాస్ విశ్వవిద్యాలయం కూడా తనవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అయితే రామానుజన్ ఈ ధనమును కొంత తన తల్లిదండ్రులకు, మిగిలినది పేద విద్యార్థులకు ఇవ్వాలని కోరాడు. పిల్లలూ, మనం రామానుజన్ నుండి సేవాగుణం, కష్టపడేతత్వముని కలిగి ఉండాలని తెలుసుకోవచ్చు.

అయితే 1917 లో ప్రారంభమైన అనారోగ్య లక్షణాలు తర్వాత క్షయ వ్యాధిగా గుర్తించడం జరిగింది. ఈ పరిస్థితులలో రామానుజన్ స్వదేశానికి బయలుదేరి 1919 సం. మార్చి 19న ముంబాయి చేరాడు. అనారోగ్యంతో బక్కచిక్కిన అతనిని చూసి కుటుంబ సభ్యులు, ప్రజలు ఎంతో బాధపడ్డారు.

ఈ కాలంలో రామానుజన్ కు సేవలు చేసిన ఆయన భార్య జానకి ఎంతో ఓపికగా ఆయన కష్టసుఖాలను చూసినది. చివరికి 1920 వ సంవత్సరం ఏప్రిల్ 26న రామానుజం తీవ్ర అనారోగ్య కారణాలతో మరణించాడు. గణిత ప్రపంచాన్ని తన ప్రతిభ సుగంధాలతో ముంచెత్తిన ఓ సుమం రాలిపోయింది. అతని జీవిత కాలం సరిగ్గా 32 సంవత్సరాల నాలుగు నెలల 4 రోజులు మాత్రమే.

జన్మం: డిశంబర్ 22 వ తేదీ, 1887, ఈరోడ్, తమిళనాడు

తల్లి పేరు: కోమలతమ్మాళ్

తండ్రి పేరు: శ్రీనివాస అయ్యంగార్

మరణం: ఏప్రియల్ 26వ తేదీ, 1920

అవార్డ్: ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ

పరిశోధనాంశాలు: Mathematical Analysis, Number Theory, Infinite Fractiony,  Continued Fractiony

గుర్తింపు పొందిన అంశాలు: Landan - Ramanujan Constant, Mock Theta Function, Ramanujan Conjecture, Ramanujan Prime, Ramanujan Theta function, Ramanujan Sum

రామానుజన్ సంఖ్య: 1729

జాతీయ గణిత దినోత్సవం: రామానుజన్ జన్మదినం డిశంబర్ 22న గణిత దినోత్సవంగా జరుపుకొంటున్నారు.

భారతదేశం నందు శుల్బ సూత్ర కాలం తర్వాత ఆర్యభట్ట (క్రీ.శ. 476 సం.) నుండి 2వ భాష్కరాచార్యులు (క్రీ.శ. 114 వ సం.) వరకు గణిత అభివృద్ధి జరిగినది. ఆ తర్వాత కాలంలో గణితాభివృద్ధి జరగడం లేదని భావిస్తున్న సమయంలో డిసెంబర్ 22, 1887న తమిళనాడులోని ఈ రోడ్ నందు శ్రీనివాస రామానుజన్ జన్మించారు.

రామానుజన్ గణిత శాస్త్రానికి, భారతదేశానికి ఎనలేని ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. రామానుజన్ లేని గణితశాస్త్రం అసంపూర్ణం. అతని జీవితం పూర్తిగా గణితశాస్త్ర పరిశోధనకే అంకితమైనది. రామానుజన్ కి తండ్రి శ్రీనివాస అయ్యంగారు, కుంభకోణంలో ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవారు. కావున రామానుజం కుంభకోణంలోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఎనిమిదవ తరగతి చదువుతున్నపుడు పొరిగింటి అబ్బాయి ఇచ్చిన Loney రచించిన ట్రీగ్నోమెట్రి పుస్తకం లోని సమస్యలను స్వతంగా సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఒకసారి ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుంది అని వివరిస్తూ ఉంటే రామానుజన్ లేచి ‘సున్న’ను 'సున్న'తో భాగిస్తే ఒకటి వస్తుందా అని ప్రశ్నించి ఉపాధ్యాయుని ఆశ్చర్యపరిచాడు.

రామానుజన్ 9వ తరగతి చదువుతున్నపుడు √x + y =7, √y+7 = 11 సమీకరణాలను సాధించమన్న అర్థ నిమిషంలో X = 9, y = 4 అని చెప్పారు. కుంభకోణం టౌను హైస్కూల్లో వెయ్యిన్ని అయిదు వందల మంది విద్యార్థులూ ముప్పై మంది ఉపాధ్యాయులు ఉండేవారు. వీరికి టైమ్‌టేబుల్ వేసే బాధ్యతను గణిత ఉపాధ్యాయుడు గణపతి సుబ్బియార్ రామానుజానికి అప్పజెప్పేవారు.

1903 లో కార్ (Carr) రచించిన 'ఎసినాప్సిన్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్ ఇన్ ఫ్యూర్ అండ్ అప్లైడ్ మేథమేటిక్స్' అనే పుస్తకాన్ని రామానుజన్ చదవడం వలన అతనిలోని ప్రజ్ఞను మేల్కొలిపింది. మెట్రిక్యులేషన్స్ పరీక్ష రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై 1904లో ఎఫ్.ఎ.లో చేరాడు. అక్కడ ఫిజియాలజీని నేర్చుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేని రామానుజంనకు జీర్ణప్రక్రియను వివరించమని పరీక్షలో గల ప్రశ్నకు జీర్ణవ్యవస్థకు సంబంధించి నాకు చేసిన అజీర్ణం ఇదంతా, నన్ను మన్నించండి' అని ముగించడం వల్ల ఎఫ్.ఎ. పరీక్షలో తప్పడం. స్కాలర్షిప్ నిలచిపోవడం జరిగినది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగ అన్వేషణలో విశాఖపట్టణంతో పాటు పలు ప్రదేశాలు తిరిగినప్పటికి లాభం లేక కుంభకోణం చేరుకున్నాడు. 1911లో మొదటిసారిగా ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ మేథమేటికల్ సొసైటీ'లో ప్రచురితం, 1912లో బెరానల్ అంకెల ధర్మాల గురించి ప్రచురితం అయ్యాయి. 1913లో 120 సిద్దాంతాలు రాసి ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాలలోని ప్రొఫెసర్ జి.హెచ్. హార్దికి పంపాడు. హార్డి రామానుజం గొప్పతనంను గుర్తించి కేంబ్రిడ్జికి ఆహ్వానించాడు,

1914లో ఇంగ్లాండ్ వెళ్ళిన రామానుజం అక్కడ రాసిన పరిశోధనా వ్యాసాలు కేంబ్రిడ్జి ఫిలసాఫికల్ సొసైటి, లండన్ మేథమేటికల్ సొసైటీ, రాయల్ సొసైటీలు ప్రచురించాయి. అక్కడ హార్దితో కలిసి P(n) సమీకరణానికి సంబంధించి కాంప్లెక్స్ అనాలిసిస్ నుపయోగించి అధ్యయనం చేయడం ద్వారా 150 సం.ల నుండి సాగుతున్న పరిశోధనకు పరిష్కారం లభ్యమైంది.

ఉదాహరణకు 5 అనే దానిని 2 లేదా అంతకన్నా ఎక్కువ అంకెల మొత్తంగా ఎలా రాయవచ్చో చూపించారు.

5 = 4+1

5 = 3+2

5 = 3+1+1

5 = 2+2+1

5 = 2+1+1+1

5 = 1+1+1+1+1

5 = 5+0

ఇలా ఏడు రకాలుగా రాయవచ్చు. దీన్నే P(5)=7 అంటాము. అంకెలు పెరిగే కొలది P(n) విలువ పెరుగుతుంది.

P(20) = 629 అనగా 20 అనే సంఖ్యను P(n) రకాలుగా రాయడానికి వీలు అవుతుంది.

P(100) = 19, 05, 69, 292

P(300) = 9 2 5 3 0 8 2 9 3 6 7 2 3 6 0 5 అవుతుంది.

ఇటువంటి దాని గురించి మొదట ఆలోచించింది మూలర్ అయితే దానికి భాష్యం చెప్పే సమీకరణం తయారైంది దాదాపు 150 సంవత్సరాల తర్వాత! దీన్ని హార్టీతో కలిసి రామానుజం రూపొందించాడు. అయితే కేంబ్రిడ్జిలో ఆహారం పడలేదు. ఆరోగ్యం దెబ్బతింది. వంట వండుకొని తిన్నా ప్రయోజనం లేదు. కేంబ్రిడ్జిలోని ఆస్పత్రికి వెళితే క్షయ ముదిరినదనడంతో 1919లో భారతదేశం వచ్చాడు. అనారోగ్యంతో, బాధతో వున్నప్పటికీ ఎన్నో సిద్ధాంతాలు రాసి ఫలితాలను సాధించాడు. 1920 ఏప్రిల్ 26న శ్రీనివాస రామానుజం భౌతికంగా కేవలం 32 సం.ల వయస్సులో మరణించినా నేటికీ ఆయన గణితానికి చేసిన సేవలు గుర్తిండిపోయాయి. అందుకే ఆయన జన్మదినమైన డిశంబర్ 22ను 'జాతీయ గణిత దినోత్సవం'గా 2012 సం. నుంచి జరుపుకొంటున్నాం.

రామానుజం సాధించిన కొన్ని ఫలితాలు:

1. రామానుజన్ నెంబర్ 1729

1729 = 103+93 = 123+13 ఇలా విభిన్న ఘనాల మొత్తంగా రెండు విధాలుగా వ్రాయడానికి వీలైన అతి చిన్నసంఖ్య 1729 అని తెలిపారు. అందుకే దీనిని రామానుజన్ సంఖ్య అంటాము.

2. నెస్టెడ్ స్క్యేయర్ రూట్:

ఉదా: √9

= √8 +1

= √1+2 x 4

=  √1+2 √16

= √ 1+2+√ 1+15

= √1+2+ √1+3 √25

= √1+2+ √1+3+ √1+24

= √1+2+ √1+3+√1+4 √36

ఇలా వర్గమూలాల గూడగా మనం రాస్తూ వెళ్ళవచ్చునని తెలిపారు.

3. 𝞹 విలువ గురించి రామానుజన్

ఇంగ్లాండులో రామానుజన్ చేసిన పరిశోధనలలో మొదటిసారిగా ప్రచురితమైన వ్యాసం మాడ్యులర్ ఈక్వేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ టూ 𝞹 ఈ వ్యాసంలో 𝞹 యొక్క ఉజ్జాయింపు విలువలు ప్రతిపాదించిన సూత్రాలు.

1. 22 𝞹4 = 2143

2. (92 +192/22)1/4 = 3.14159265262

3. 355/113 (1 - 0, 0003/3535) = 3,145926535897943

4 రామానుజన్ మాజిక్ స్క్వేర్

22

12

18

87

40

65

31

3

71

15

28

25

6

47

62

24


ఈ మాజిక్ స్క్వేర్‌లో ఎటుకూడిన 139 వస్తుంది. ఈ పట్టికలో 24 రకాలుగా సరైన Patternsతో కూడగా ఒకే మొత్తం (139) వచ్చే విధంగా రూపొందించడం రామానుజం గొప్పతనం. కావున మనం రామానుజంను ఆదర్శంగా చేసుకొని లెక్కలపై ఆసక్తిని పెంచుకుందాం.

కాబట్టి పిల్లలూ... శ్రీనివాస రామానుజన్ తన అసమాన మేధాశక్తితో విజ్ఞానశాస్త్ర ప్రపంచాన్ని మిరుమిట్లు గొలిపే రీతిలో ప్రభావితం చేశాడు. అతనికి నుండి మనం ప్రశ్నించేతత్త్వాన్ని, ఇష్టం ఉన్న అంశంపై ఎంత కష్టమైన భరించే స్వభావం, దేశభక్తి, సేవాగుణంలను నేర్చుకుంటారు కదూ.

ఇదే శ్రీనివాస రామానుజన్ కి మనమిచ్చే ఘనమైన 125 వ సంవత్సర జయంతి కానుక.

దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్

dattathreyaసాధారణ పాఠశాల ఉపాధ్యాయులై, అసాధారణ గణిత పరిజ్ఞానం కలిగిన మేధావి దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ మహారాష్ట్ర లోని ధరీనులో జన్మించెను. ఏదేని నాలుగంకెల సంఖ్యను తీసుకొని, ఆ అంకెలతో ఏర్పడే పెద్ద సంఖ్య నుండి చిన్నసంఖ్యను తీసివేసి, ఆ వచ్చిన సంఖ్యలో ఉండే అంకెలతో ఏర్పడే పెద్దసంఖ్య నుండి చిన్నసంఖ్య ను తీసివేసి ఇలా చేస్తూ పోతుంటే చివరకు 6174 వస్తుంది. 6174 ను కాప్రేకర్ స్థిరాంకం అంటారు. 92 = 81, 8+1=9, 452 = 2025, 20+25=45... సంఖ్యలను కాప్రేకర్ సంఖ్యలుగా పేరు పెట్టారు. అంకెలతో అద్భుతంగా ఆడుకొని, సెల్ఫ్ సంఖ్యలు, డిలోమో సంఖ్యలు, హర్షద్ సంఖ్యలు లాంటి విషయాలు యందు ఆయన కృషి అద్వితీయం.

భాస్కర – II (1114 – 1185)

bhaskaraఇతడు బ్రహ్మగుప్తుని సిద్ధాంతాల్లో ఉత్తెజితుడై సిద్దాంత శిరోమణ అను గ్రంథాన్ని రచించారు. ఏ సంఖ్యనైనా ‘0’ చే భాగిస్తే అనంతము అగునని మొదటగా చెప్పిన గణిత శాస్త్రజ్ఞుడు. త్రికోణమితి, గోళీయ త్రికోణమితి పై కొన్ని ఫలితాలను కనుగొన్నారు. Sin(A±B) = Sin A Cos B ± Cos A Sin Bని కూడా తన ఫలితాలలో వాడినాడు. ఇతని లీలావతి గణితము నందు సమస్యలు నిత్యజీవిత సమస్యలను ప్రతిబింబే విధంగా, ఆసక్తికరంగా ఉంటాయి. అతని గణితథ్యయనములో Rolle’s theorm ƒ(a) = ƒ(b) అయినచో a

ఆర్యభట్ట

dec21ఆర్యభట్ట (476 AD – 550 AD). ఖగోళశాస్త్రము, త్రికోణమితి, గోలీయ త్రికోణమితి, గ్రహణాలు ఏర్పడు విధానము, మొదటగా భూమి తనచుట్టూ తాను తిరుగుతున్నది, సూర్యుని కిరణాలు పరావర్తనము వలన చంద్రుడు ప్రకాశిస్తున్నాడని వివరించారు. సంఖ్యల వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాల, శంకపు త్రిభుజ వైశాల్యాలు వృత్తాలు, సైన్స్ పట్టికలును గూర్చి ఆర్యభట్టీయంలో 4 భాగాలుగా విభజించి అందులో వివరించారు. ఈయన జ్ఞాపకార్థం భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టినారు.

హరీష్ చంద్ర

dec22హరీష్ చంద్ర (1923 – 1983) ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. నవీన బీజగణితములో చాలా కృషి చేసాడు. హరీష్ చంద్ర ప్రమేయాలైన Harishchandra – Character formula, Harishchandra – Homomorphism, Harishchandra – Modular, Harishchandra – Schwartz space, Harish Chandra transforms, Harishchandra E function… లు గణితశాస్త్రంలో ఇతని స్థానాన్ని తెలుపుతాయి. ఇతడు గణితశాస్త్రవేత్తే కాకుండా భౌతికశాస్త్రవేత్త కూడా. ఇతడు Instituting Advanced Study Princetion, New Jersey లో ఆచార్యులుగా చివరి వరకూ పని చేసినారు.

శకుంతలా దేవి

sakuntaladeviకర్ణాటకకు చెందిన గణిత మేధావిగా పేరు పొందిన శకుంతల దేవి ఆరు సం.ల వయస్సులోనే మైసూరు విశ్వవిద్యాలయం యందు తన గణిత సామర్థ్యం, జ్ఞాపక శక్తి పట్ల ప్రదర్శన ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక అతి పెద్ద సంఖ్యను 23 కు వర్గమూలంను UNIVAC 1108 కంప్యూటర్ కు 60 సెకన్లు సమయం పట్టగా, శకుంతల దేవి 50 సంకన్లలలో సమాధానం ఇచ్చింది. మానవ కంప్యూటర్ గా పేరు పొందిన మేధావి. Puzzles to Puzzles you, none puzzles to puzzles you, mathability వంటి గణిత పుస్తకాల రచయిత.

మహిళలకు గణితంపై ఆసక్తి తక్కువ అని చాలా మంది అనుకుంటున్నారు. కాని ఇది తప్పు అని చరిత్ర చెపుతుంది. 370 – 415 సం. నకు చెందిన హైపేషియా ప్రపంచంలో మొట్టమొదటి మహిళా గణితశాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. మనదేశంలో కూడా చాలామంది మహిళా గణితవేత్తలు ఉన్నారు. 2వ శతాబ్దికి చెందిన భాస్కరాచార్య-II తన కుమార్తెకు లెక్కలపై అవగాహన పెంచి ఆయన రచించిన ‘సిద్ధాంత శిరోమణి’ గ్రంథంలో అంకగణిత భాగానికి ‘లీలావతి’ అని పేరు పెట్టారు. ఇప్పుడు మనం ప్రాథమిక విద్యకు నోచుకోకుండా పేద కుటుంబంలో పుట్టి అంకెలతో అద్భుత విన్యాసాలు చేసి ప్రపంచ గణిత మేధావుల సరసన నిలిచిన మహిళ శకుంతలా దేవి గూర్చి తెలుసుకుందాం.

1929 నవంబర్ 4వ తేదీన ఒక నిరుపేద కుటుంబంలో 14వ సంతానంగా శకుంతలా దేవి జన్మించే సమయానికి ఆమె తండ్రి వయస్సు 62 సంవత్సరాలు. 3 సంవత్సరాల వయస్సులోనే శకుంతల తన తండ్రితో పాటు వీధి గారడీలలో పాల్గొంటూ అంకెలు సంఖ్యలు గుర్తించుకోవడంలో మంచి ప్రతిభను ప్రదర్శించింది. చిన్నతనంలోనే ‘పేక’ ఆటనందు పేకముక్కలు పంచుతూ ఎవరెవరికి ఎన్ని వచ్చేది? ఎవరి వద్ద ఏ ముక్క ఉందో చెప్పేది.

6 సంవత్సరాల వయస్సులో తండ్రితో పాటు ‘సర్కస్’ కంపెనీలో చేరింది. అక్కడ పక్షులు, జంతువులు, మనుష్యులు చేసే విన్యాసాలకు వినోదాన్ని ఇస్తున్నాయి. మరి ఇలాంటి వినోదాన్ని అంకెలు, సంఖ్యలతో అందించాలనే ఆలోచన వచ్చింది. అప్పటినుంచి లెక్కల పై మరింత దృష్టి పెట్టింది. గణితంలో చతుర్విద ప్రక్రియలతో పాటు వర్గము, ఘనమూ, వర్గమూలము, ఘనమూలము ఇలా వివిధ రకాలయిన గణిత పరికర్మలను నేర్చుకుంది. పైస్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలలో గణిత ప్రదర్శనలు ఇచ్చింది. అక్కడ అందరి అభిమానాన్ని చూరగొంది. రేడియో, టి.వీ. లలో ప్రదర్శనలిచంచింది. గణితం అంటే ఇష్టం లేనివారు, గణిత పరిజ్ఞానం లేనివారు కూడ శకుంతలా దేవి ప్రదర్శనలను చూసి ఆమె ప్రతిభకు ఆశ్చర్యపోయారు.

వివేకానందుని చికాగో సభ తర్వాత విదేశాలలోని ప్రజల అభిమానాన్ని చూరగొన్నది శకుంతల. 1977వ సంవత్సరం జనవరి 24వ తేదీన అమెరికాలోని ‘సౌతర్న్ మెథడిస్ట్’ యూనివర్సిటీ అసెంబ్లీ హాలులో ‘డాక్టర్ మైరీమ్ గిన్స్ బర్గ్’ బోర్డుపై 201 అంకెల సంఖ్యను రాశాడు. ఇంతపెద్ద సంఖ్యను రాయడానికి అతనికి 10 నిమిషాలు పట్టింది. అక్కడ గణిత శాస్త్రజ్ఞులు, ప్రొఫెసర్లు, వేలసంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. బ్లాక్ బోర్డ్ పై 10 వరుసల్లో వ్రాయబడిన రెండు వందల ఒక్క అంకె గల సంఖ్య ఉంది. శకుంతలను స్టేజి పైకి పిలిచారు. ఆమె వచ్చింది. ప్రొఫసర్ స్టాప్ వాచ్ బటన్ నొక్కాడు. ఇప్పుడు శకుంతల అతిపెద్ద సంఖ్యకు 23వ మూలం (Twenty third root) చెప్పాలి. శకుంతల బోర్డుపై గల రెండు వందల ఒక్క అంకె సంఖ్యను గమనించి బోర్డుపై ‘546372891’ అన్న సమాధానాన్ని రాసింది. ఇదే ఆ సంఖ్యకు 23వ మూలం. స్టాప్ వాచ్ స్టాప్ చెయబడినది. అప్పటికి ఆ వాచ్ చూపిన సమయం ’50 సెకనులు’ మాత్రమే. ఆ సభ కేరింతలతో, చప్పట్లతో మార్మోగింది. అదే రోజు అప్పట్లో అతివేగంగా కాలిక్యులేషన్స్ చేయగల కంప్యూటర్ ‘నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్’ కు చెందిన ‘యీనివాక్ - 1108’ కంప్యూటర్ కు 45 మంది కంప్యూటర్ నిపుణుల పర్యవేక్షణలో ఈ రెండు వందల ఒక్క అంకె సంఖ్యకు 23వ మూలంను పరిశీలించిన ఆ కంప్యూటర్ 62 సెకన్లలో ‘546372891’ అనే సమాధానాన్ని ఇచ్చింది. అంటే శకుంతల కంప్యూటర్ కంటే 12 సెకన్ల ముందే సమాధానాన్ని చెప్పి ‘హ్యూమన్ కంప్యూటర్’ అనిపించుకుంది. దీనితో దేశవిదేశాలలో శకుంతలా దేవి పేరు మార్మోగింది. ఈమె ప్రధర్శనలను ప్రపంచం మొత్తం ప్రశంసించింది.

1980 సంవత్సరం జూన్ 18వ తేదీన లండన్ లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన కంప్యూటర్ డిపార్ట్మెంట్ వారు శంకుతలకు 13 అంకెలు ఉన్న రెండు సంఖ్యలు ఇచ్చి గుణకారాన్ని చేయమన్నారు. ఆ సంఖ్యలు 7,686,369,774,870 & 2,456,99,745,779. ఈ సమాధానానికి శకుంతలాదేవి తీసుకున్న సమయం కేవలం 26 సెకన్లు. కాని అప్పటి వాళ్ళ సూపర్ కంప్యూటర్స్ ఇదే సమాధానాన్ని 45 సెకన్లలో ఇచ్చింది. ఈ కాలిక్యులేషన్స్ వలన శకుంతలా గిన్నీస్ బుక్ లో ప్రవేశించడానికి దోహదపడింది.

శకుంతలాదేవి రాసిన పుస్తకాల్లో 1. బుక్ ఆప్ నంబర్స్, 2. ధ జామ్ ఆఫ్ నంబర్స్, 3. పజిల్స్ టు పజిల్ యు, 4. మోర్ పజిల్స్ ఫర్ యు, అనేవి బహుళ ప్రాచుర్యం పొందాయి.

ప్రాచీన భారతదేశంలో జరిగిన గణిత శాస్త్రాభివృద్ధికి పరిశీలించి భారతీయ గణిత మేధావులను వారి కృషికి ఎంతో కొనియాడినది. “భారతదేశం లేకుంటే ‘సున్న’ (Zero) లేదు. సున్న లేకుండా గణితశాస్త్రమే లేదు.” అని పలుచోట్ల భారతీయులు కనుగొన్న సున్న గురించి వివరించేది. శ్రీనివాస రామానుజన్ వదిలిన సమస్యలను పరిశీలించింది. వాటిలో కొన్నింటికి సమాధానాలు కనుగొంది. భారతీయ గణితశాస్తాన్ని పూర్తిగా అధ్యయనం చేసింది.

ఇంతటి మేధస్సు, అపార గణిత విజ్ఞానం కల్గిన శకుంతల తన జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ బెంగళూరులో 20 సం. లోపు పిల్లలకు గణితాన్ని ఉచితంగా బోధించింది.

పాఠశాల విద్యకు సైతం నోచుకోని శకుంతల 2013వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీన మన నుండి దూరమైనప్పటికీ ఆమె సాధించిన కీర్తి ప్రపంచం మొత్తం గుర్తించింది. ఉద్యోగ నియామక ఇంటర్వ్యూల కోసం ఇప్పటికీ విద్యార్థులు శకుంతలా దేవి వ్రాసిన ‘ఫజిల్స్’ ను పరిశీలిస్తుంటారు.

శకుంతలా దేవి పొందిన అవార్డులు

 1. 1969లో ఫిలిపైన్స్ యూనివర్సిటీ వారు బంగారు పథకంతో పాటు “Distinguished Women of the Year Award”ను బహూకరించారు.
 2. 1988లో “Ramanujan Mathematical Genius Award”.
 3. 1999లో 13 అంకెల సంఖ్య x 13 అంకెల సంఖ్య గుణాకారమునకు “Guinness Book of Mathematical Genius Award”లో స్థానం పొందినది.
 4. 4. మరణించడానికి రెండు నెలల ముందు 2013 లో “Lifetime Achievement Award”ను Mumbai లో పొందారు.

శకుంతలా దేవి ఫజిల్స్

1. అంకశ్రేణిలో గల మూడు వరుస పూర్ణసంఖ్యల లబ్దం ప్రధాన సంఖ్య అయిన ఆ శ్రేఢి లోని సంఖ్యలేవి?

: -3, -1, 1

2. ఒక కే.జి. పత్తి, ఒక కే.జి. ఇనుములో బరువైనది ఏది?

: రెండింటి బరువు సమానమే (1 కే.జి.)

3. ఒక సంఖ్యలోని అంకెల మొత్తమునకు మూడు రేట్లుగాగల సంఖ్య ఏది?

: 27; 2+7=9, 9x3=27

4. ఒక రెండంకెల సంఖ్యలో రెండవ అంకె మొదటి అంకె కంటే ‘4’ తక్కువ ఆ సంఖ్యలోని అంకెల మొత్తంలో ఆ సంఖ్యను భాగించిన భాగఫలం ‘7’ వచ్చిన ఆ సంఖ్య ఏది?

: 84; (8-4=4), 84/(8+4)=7

5. మమ్ము ఆమె స్నేహితురాలు సావల్ తో గోళీలతో ఆడుకుంటున్నాడు. మమ్ము సావల్ తో నీవు నాకు ఒక గోళీ ఇచ్చిన మన ఇద్దరిగోళీలు సమానం అవుతాయి. నేను నీకు ఒక గోళీ ఇస్తే నా వద్ద వాటి కన్నా రెట్టింపు గోళీలు నీ వద్ద ఉంటాయి అని అన్నాడు. అప్పుడు వారి వద్ద ఉన్న గోళీలు ఎన్ని?

: 5, 7 గోళీలు

6. 34 వస్తువులను ఇద్దరికి పంచిన మొదటివాడికి వచ్చుభాగం 4/7 వ వంతు రెండవవాడి భాగంలో 2/5 వ వంతు సమానమైన వారు ఒక్కొక్కరు ఎన్ని వస్తువులు పంచుకొన్నారు?

: 34 = 14+20

7. రెండు సంఖ్యలు మధ్య భేదం ‘3’ వాటి వర్గాల మధ్య భేదం 51 అయిన ఆ సంఖ్యలు ఏవి?

: 10, 7

8. ‘3’ ను ఐదుసార్లు ఉపయోగించి ‘31’ అని నిరూపించగలరా?

: 33+3+3/3 = 27+3+1 = 31

9. ‘4’ ను పదహారు సార్లు వాడి ‘1000’ అని నిరూపించగలవా?

: 444+444+44+44+4+4+4+4+4+4+4

ఇంతటి కీర్తి సాధించిన శకింతలా దేవిని ఆదర్శంగా తీసుకొని మనం గణితశాస్త్రంపై ఆసక్తిని పెంచుకుందాము.

కె.స్. చంద్రశేఖరన్

chandrashekarనవంబర్ 21, 1920లో మద్రాసు యందు జన్మించిన కె.యస్. చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్ల యందు స్కూల్ విద్య ను అభ్యసించాడు సంఖ్యావాదం యందు అమోఘమైన కృషి చేసాడు. ప్రముఖ అణు శాస్త్రవేత్త హోమిబాబా ఆహ్వానం మేరకు (), ముంబాయి యందు గణితశాస్త్ర నిపుణునిగా చేరెను. పద్మశ్రీ, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు, రామానుజన్ మోడల్ వంటి అత్యున్నత అవార్డులు పొందిన గణిత మేధావి. 2012 లో అమెరికా గణిత సంఘం యందు సభ్యుని గా చేరెను. విద్యార్థులకు గణితం పట్ల ఆసక్తి పెంచుటకు సంఖ్యావాదం యందు అనేక సిద్దాంతాలు రూపొందించెను.

రాబర్ట్ హ్యుబర్

robertతండ్రి బ్రాగ్ (Sir William Henry Bragg) తనయుడు బ్రాగ్ లు (William Lawrence Bragg) స్పటికి నిర్మాణాలను కనుగొనడానికి X-కిరణాలు వివర్తన పద్దతిని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఆ పద్ధతి (x-ray crystollography) కేవలం స్పటికరూపంలో వున్న తేలికపాటి అణువులు లేక పరమాణువులు వున్న స్వచ్చమైన ఐక్య స్పటికాలకె వీలయ్యేది. స్పటిక చూర్ణాని (Powder Csrystal) కి ఆపాదిస్తే కేవలం ప్రమాణ స్పటిక్ నిర్మితి (Unit Cell) కొలతలు తెలిసేవి కాని అందులో వున్న అణువుల నిర్మాణం తెలిసేది కాదు. కష్టపడి స్వచ్చమైన ఐక్య స్పతికాలను (Single Crystals) వేరుచేస్తేనే బ్రాగ్స్ రూపొందించిన x-ray difraction (XRD) పద్ధతిలో అణు నిర్మాణాన్ని కనుకోనగోలము. అను నిర్మాణం తెలసుకున్నట్లేతే ఆ అణువులతో తయారైన పదార్ధాల ధర్మాలకు ఆధారం తెలుస్తుంది. అయితే ప్రోటీన్లకు సహజంగా స్పాటికాకృతి వుండదు. అవి పనిచేసే క్రమంలో వివిధ రూపాలను అంతరంగికంగాను భౌతికంగాను సంతరించుకుంటాయి. ఆ క్రమంలో ప్రత్యేక మడతలు ఏర్పడి ఎంజైములుగా హోర్మోన్లుగా, ఉత్ర్పేరకాలుగా పనిచేయగలవు. ఇలా క్షణానికో రూపు మార్చుకోనడమే కాకుండా స్వతహాగానే రూపం స్ధిరంగా లేని ప్రోటీన్లను ఎంజైములను, (XRD) పధ్ధతి ద్వారా విసదికరించడం దాదాపు అసంభవం అనుకొనే రోజులవి. కానీ రాబర్ట్ హ్యుబర్ ఈ కష్టాన్ని పోగొట్టాడు.

1937 ఫిబ్రవరి 20వ తేదిన హ్యుబర్ జన్మించాడు. జర్మని దేశంలోని మ్యూనిచ్ పట్టణంలో సెబాస్టియన్ హ్యుబర్ హెలేస్ హ్యుబర్ కు జన్మించిన తొలి సంతానం మన హ్యుబర్. జన్మతః యూదుడు (Jew) కావడం వల్ల చిన్నతనంలోనే ఎన్నో ఇబ్బందులను వివక్షతను పాటశాలలోను కళాశాలలో ను ఎదుర్కొనాడు. కష్టపడి 1960 లో రసాయనిక శాస్త్రంలో డిప్లోమా పొందాడు. 1967 లో హ్యువ్ (Hoppe), బ్రౌనిజర్ (Braunitzer) అనే తోటి సీనియర్ శాస్త్రవేత్తల సహకారంతో ఎన్నో పదార్ధాలకు XRD పద్ధతి లో అణు నిర్మాణాన్ని కనుగొన్నాడు, క్రమేపి అయన ఆసక్తి జివరసాయనాల వైపు మళ్లింది. ప్రత్యేకమైన పద్ధతిలో ఎంజైములను నియంత్రిస్తూ, ప్రత్యేక పద్ధతిలో X కిరణాలను వివిధకోణాలలో పంపుతూ ఎంజైముల నిర్మాణాలను కనుగొనేందుకు బాటలు వేసాడు. ఇందుకు తనకున్న గణిత భౌతిక శాస్త్ర రసాయనిక శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు.

చూశారా బాలలూ, అయన తదుకు పరిశోధించింది. జీవ రసాయనిక ధర్మాలకు కారణమైన జీవుల ఎంజైముల గురించి. అందుకు ఉపగరించింది భౌతికశాస్త్రానికి చెందిన X కిరణ వివర్తన పద్ధతి. ఆ సాధనాన్ని నిర్దేశించింది. గణిత పద్ధతులలో. కాని ఎంజైములను వెలికితీసి వివిధ కోణాల్లో స్ధిరపరిచింది రసాయనిక విధానాలతో. కాబట్టి ఒక విషయంలోనే పరిజ్ఞానం వుంటే సరిపోదు అయన చేసిన కృషిలో పత్రహరితంలో కిరణజన్య సంయోగక్రియ (Photo Synthesis) ఎలా జరుగుతుందో అర్ధమైంది. చిన్న కణాల రూపంలో వున్న సైనో బాక్టీరియాలో వున్న క్లోరోఫ్లాస్టూలో ఉపయోగపడే ఎంజైముల నిర్మాణాన్ని కనుగొన్నాడు. ఈయనకు 1988 సం. వరకు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.

స్టిఫెన్ హాకింగ్

stephenఒక విషయంలో ప్రామాణికమైన వారని, అత్యంత గొప్ప వారిని లెజెండ్ అని అంటారు. అరిస్టాటిల్, సోక్రటిస్, న్యూట్ న్, కార్ల్ మార్క్, మహాత్మాగాంధీ, మార్టిన్లూధర్కింగ్, ఐన్ స్టీన్ అలాంటి వారు. ఆ కోవకు చెంది జీవించి ఉన్న వారిని లివింగ్ లెజెండ్ అంటారు. నోమ్ చొమ్ స్కి, స్టిఫెన్ హాకింగ్ లను ఈ కాలంలో లివింగ్ లెజెండరిలుగా పేర్కొంటుంటారు. బ్రతకడమే భరమనుకునే శారీరక రుగ్మతలను అధిగమించి తన మేధతో హాకింగ్ ఆవిష్కరిస్తున్న సత్యాలు ఆయనను ఆ స్ధానంలో నిలబెట్టింది.

1942 జనవరి 8న జన్మించిన స్టిఫెన్ హాకింగ్ తండ్రి జీవశాస్త్రవేత్త అయిన డా. ప్రాంకహాకింగ్. తల్లి ఇసబెల్. అతడి చెల్లెళ్ళు ఫిలిప్పా, మేరీ గాక తల్లిదండ్రులు దత్తత తీసుకున్న మరొక సోదరుడు ఎడ్వర్డ్ హాకింగ్ వున్నాడు.

హర్ట్ ఫోషైర్ లోని సెయింట్ అల్తాన్స్ పైస్కూల్ లో విద్యాభ్యాసం చేసి యూనివర్షిటి కాలేజ్, ఆక్స్ ఫర్డ్ లో ప్రకృతి శాస్త్రాలు చదివే విద్యార్ధిగా చేరిన హాకింగ్ భౌతికశాస్త్రాన్ని ప్రత్యేక అధ్యయనం కోసం ఎన్నుకున్నాడు 1962లో బి.ఏ పట్టా పుచ్చుకుని ట్రినిటి కళాశాల కేంబ్రిడ్జిలో సై ద్దాంతిక ఖగోళశాస్త్రాన్ని, విశ్వశాస్త్రాన్ని (Cosmology) అధ్యయనం చేయడానికి చేరాడు.

అప్పుడే అతడికి మోటార్ న్యూరాన్ వ్యాధి మొదలై కాలక్రమంలో అతడి కళ్ళు , చేతులూ , క్రమంగా శరీరం కదలకుండా చేసింది. కేవలం చక్రాల కుర్చికి పరిమితమయ్యాదు. తల్లి మందలించిందనీ, కడుపునొప్పి తీవ్రమైందని, పరీక్షల్లో ఫెయిలయ్యానని ఇలా చిన్న చిన్న కారణాలతో నేటి యువతీయువకులు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాని చక్రాల కుర్చికి పైమితమైన హాకింగ్ ఎన్నడూ ఆదైర్యపడలేదు. మొక్కవోని విశ్వాసంతో విస్వరహస్యాలను చేదించడానికి నుడుం కట్టాడు. అతడినుండి నేటి యువతరం నేర్చుకోవాల్సింది చాలా వుంది.

రాయల్ సొసైటీలో అత్యంత పిన్న వయస్కుడుగా సభ్యుడైన హాకింగ్ (1974)ఆ సంవత్సరమే పడక మీద పడుకోవడానిక్కానీ, తన ఆహారం తను తీసుకుంటానికి గానీపూర్తిగా అశక్తుడయ్యాడు. ఏమయోట్రాపిక్ లేపరల్ స్కేరాసిస్  (ALS) అని పిలువబడే ఈ వ్యాధి వల్ల శరీరం కొన్ని కండరాలు కదిలించడానికి మాత్ర పైమితమైంది. ఆ కండరాల కదలికలను కంప్యూటర్ కి అనుసంధానం చేయడం ద్వారా హాకింగ్ తన అభిప్రాయాలను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసే విధంగా కంప్యూటర్ కి కనెక్షన్లు ఇవ్వబడ్డాయి,. 1985 ప్రాంతంలో ట్రాకియోటమి శాస్త్ర చికిత్స చేయడం ద్వారా కంటస్వరం తొలగించారు. అయితే కంప్యూటర్ కి సాంకేతక నిపుణులు ఒక ప్రత్యేక పరికరం అమర్చారు. ఉన్న కొద్ది పాటి శారీరక కదలికలు ఒక స్వరసంయోజనం (Voice Synthesizer) స్వీకరించి కంప్యూటర్ నుండి మాటలు వినిపించేలా ఏర్పాటు చేశారు. ఇంతటి క్లిష్ట పరిస్ధితుల్లో కూడా అతడు డెన్నిస్ విలియం అనే సహాయకునితో పి.హెచ్.డి పూర్తి చేశాడు.

1970 లో యింకా వ్యాధి బారిన పడకముందు రోజర్ పెన్ రోజ్ తో కలిసి సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా సింగ్యులారిటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. 1974 కృష్ట బిలా మీద సిద్ధాంతాలను వెలువరించాడు. క్వాంటం కాస్మాలజి మీద పైశోధనలు చేశాడు. శారీరకం రుగ్మతలతో, అచేతన స్ధితి ఉన్నా 26 ఏప్రిల్ , 2007 లో చక్రాల కుర్చీ లేకుండా రోదసిలో భార రహిత యాత్ర చేశాడు.

రోదసి గురించి పరిశోధనలు సాగాలని భావి కాలంలో మానవుడు అంతరిక్షంలో తనకు అనువైన గ్రహన్నిగాని , నక్షత్రాన్ని గాని ఎన్నుకుని అక్కడకు జీవించడానికి వెళ్ళాలని సుదీర్ఘకాలంలో భూమి మీద మానవ జాతి అంతరించక తప్పదని స్టిఫెన్ హాకింగ్ ప్రగాఢ విశ్వాసం. ఈనాడు అభివృద్ధి పేరుతో మానవుడి అనేక చర్యలు మానవజాతిని పూర్తిగా తుడిచి పెడతాయన్న వాస్తవం మనకాళ్ళ ముందు కనబడుతూనే ఉంది. భూతావం పెరుగుతున్నది. జివాధరమైన నీరు క్రమంగా అడుగంటుతున్నవి. వ్యాపారం మీద మాత్రమే దృష్టి సారించి ధనార్జనే లక్ష్యంగా బ్రతుకుతున్న మానవుడు. భుమ్మిదగల నమతౌల్యతను అతలాకుతలం చేస్తున్నాడు. తన గొయ్యి తానే తవ్వుకున్తునాడు.

హాకింగ్ తన చుబుకొన్ని కంప్యూటర్ లోకి డేటాఎంట్రీకి వాడతాడు. ఒక ప్రశ్నకు సమాధానమివ్వడానికి తక్కువలో తక్కువగా అతడికి ఏడు నిమిషాలు పడుతుంది. ఇటువంటి స్ధితిలో కూడా అయన ఏ బ్రీష్ హిస్టరీ ఆఫ్ టైం (1988) ది యూనివర్స్ ఇన్ నట్ షెల్ (2001) బ్లాక్ హ్యుల్స్ అండ్ బేబి యూనివర్సెన్ (1993), ఏ బ్రీష్ హిస్టరీ ఆఫ్ టైం – 2 (2005) అనే గ్రంధాలు ఇతరుల సహాయంతో రచించాడు.

రెడ్ డ్వార్ఫ్, డిసెంట్, ది నెక్స్ట్ జనరేషన్, లేట్ నైట్ నిత్ కోనన్ ఓబ్రయాన్, ప్యూచరమా, ఫ్యామిలిగై లాంటి టి.వి సీరియళ్ళలో నటించాడు రాక్ బాండ్ పాడిన ఫింక్ఫ్లాయిడ్ పాటలో అతడి కంట స్వరంతో మాటలు ఉపయోగించుకున్నారు (1994). అతడి క్మిడ లఘు చలన చిత్రాలు (డాక్యుమెంటరీలు) వచ్చాయి.

అతడి మొదటి భార్య జేన్ హాకింగ్ మ్యూజిక్ టు మూవ్ దస్టార్స్ అనే పుస్తకంలో అతడితో పంచుకున్న జీవన స్మృతులను 1999 లో రాసింది. అతడి కుమారై లూసి ఒక నవలా రచయిత్రి. అతడి కొడుకు రాబర్ట్ హాకింగ్ అమెరికాలో స్దిరపడ్డాడు. హాకింగ్ శీలా విగ్రహాలు కేంబ్రిడ్జిలో నూ, నుడురంగా ఆఫ్రికాలోని కేప్ టౌన్ లోనూ స్దాపించబడ్డాయి. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ లో అతడి పేరుమీద ఒక సైన్సు మ్యూజియం ఏర్పాటు చేయబడింది.

అతడి మొదటి భార్య జెన్ హాకింగ్ 1965లో వివాహమాడి 1991 వరకు కలిసి జీవించింది. కానీ తమకు ఏకాంతం లభించడం లేదని ఎప్పుడూ ప్రపంచ దృష్టి హాకింగ్ మీదే ఉంటుందని, టి.వి. వాళ్ళు, ఇతరులు ఎప్పుడూ ప్రపంచ దృష్టి హాకింగ్ మీదే ఉంటుందని, టి.వి.వాళ్ళు, ఇతరులు ఎప్పుడూ వేదిస్తూనే వుంటారని విడిపాయింది. వారికి ముగ్గురు సంతానం. 1995లో హాకింగ్ తన బాగోగులు చూసే ఎలైన్ మేసన్ నే వివాహమాడాడు. కానీ 2006లో ఆమెతో కూడా విడిపోయాడు.

ALS వ్యాధి వచ్చిన వాళ్ళు పదేళ్ళ కంటే మించి బ్రతకరని డాక్టర్లు అన్నారు. కానీ కేవలం అత్మధైర్యంతో అతడా వ్యాధిని తట్టుకోగాలిగాడు. పరిశోధనలుచేయగలిగాదు, పుస్తకాలు రాయగలిగాడు, నటించగలిగాడు. నిజంగా అతడి జీవితం అందరికి స్పూర్తి దాయకం.

2010లో అతడన్న మాటలతోనే ఈ వ్యాసాన్ని ముగిద్దాం.

“మతానికి” సైన్సుకి ప్రాధిమికంగా ఓ భేదం ఉంది,. మతం అధికారికంగా ఓనమ్మకాన్ని మూర్ఖ పట్టుదలతో మనిషి మీద రుద్దుతుంది. కాని సైన్సు పరిశిలనతో హేతుబద్ధతతో జపనీ చేస్తుంది. మనిషికి సైన్సు నిత్యావసరం. ఎప్పటికైనా సైన్సే విజయాన్ని సాధిస్తుంది.

చావు, పునర్జన్మ గురించి హాకింగ్:

చనిపాయిన తర్వాత జీవితం ఉంటుందా? స్వర్గమని, నరకమనీ! నిజంగానే చనిపాయినా వారు అక్కడికి వెళ్తార? ఈ ప్రశ్నలు చాలా వివాదాస్పద ప్రశ్నలు. స్వర్గమూ, నరకమూ రెండూ ఇక్కడే ఈ ప్రపంచంలోనే మనుషులు అనుభవిస్తారని అనే వాళ్లున్నారు. లేదు.. లేదు! పుణ్యం చేసుకున్న వాళ్ళ౦దరూ నరకానికి వెళ్తారని బలగుద్ది చెప్పేవాళ్ళు ఉన్నారు. బౌద్ధం మహమ్మదీయమూ, క్రైస్తవమూ ఇంకా అనేక మతాలు పునర్జన్మ లేదని చేస్తాయి.

అయితే యివ్వని పక్కకు పెడితే శాస్త్రవేత్తలేమంటారు? ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తలలో పేరెన్నికగన్న స్టిఫెన్ హాకింగ్ ఇటివల బ్రిటిష్ పత్రిక గార్డియన్ కి యిచ్చిన ఇంటర్వ్యూలో వీటికి సమధానాలు చెప్పాడు.

గత 49 ఏళ్ళుగా చక్రాల కుర్చికి అంటిపెట్టుకుని అంతరిక్షంలోకి తొంగి చూసి కృష్ణబిలాల మీద సిద్ధాంతాన్ని రూపొందించిన ఈ శాస్త్రవేత్త ఏమంటాడు? హలోక జీవితం తర్వాత స్వర్గద్వారాలు లేక నరక కూపాలు మన కోసం ఎదురుచూస్తుంటాయనే అంశం ఒక కాల్పనిక గాధ. ఆ కధ చావంటే భయపడే వాళ్ళకోసం అని ఖరాకండిగా చెప్పాడు. మన మొదడు పని చేయకుండా పోవడమే మృత్యువు అని సైన్సు విర్వచనం చెపుతుంది. మన మెదడు చివరిసారిగా మినుకు మినుకుమని అరిపాయింతర్వాత అంతాశూన్యమె. ఇంకేం లేదు. 49 ఏళనుండి ఏక్షణ మైనా నెను మృత్యుఒడిలో కి వెళ్తానన్న స్పృహతోనే జీవించాను. నాకు చావంటే భయంలేదు. అలాగని నెను చావడానిక్కుడా తొందర పడటం లేదు. నేను చేయాల్సిందింకా చాలా వుంది. దానిమీద దృష్టే నా ప్రధమ కర్తవ్యం. మన ఈ మస్తిష్కం ఒక కంప్యూటర్ లాంటిది. అందులోని విడిభాగాలు పనిచేయడం మానేస్తే కంప్యూటర్ పనిచేయడం మానేస్తుంది. (అన్నట్లు మీకు కంప్యూటర్ తెలుగులో సంగణకం అంటారనితెలుసా? ) పని చేయని కంప్యూటర్ కి స్వర్గమూ, నరకమూ లేవు. మానవ శరీరం కూడా అంతే! అంటాడు హాకింగ్.

69 ఏళ్ళ ఈభౌతిక శాస్త్రవేత్త 2010 లో రాసిన పుస్తకం ది గ్రాండ్ డిజైన్ లో “ఏ సృష్టికర్త ఈ విశ్వం గురించి వివరించాల్సింది , విప్పి చెప్పాల్సింది ఏమి లేదు. అదో అనవసరైన ప్రశ్న అన్నాడు. ఈ పుస్తకం అమెరికాలో పెద్ద దుమారాన్ని సృష్టి౦చింది. యూదుమత ప్రధానయాజకుడు (ఆంగ్లంలో రబ్బీ అంటారు.) లార్డ్ సాక్స్ స్టిఫెన్ హాకింగ్ మీద విమర్శలు గుప్పించాడు. హాకింగ్ దేవుడ్ని ఒక రూపకాలంకారగా వర్ణించాడు. అంటే దేవుడు అనే పద్మ విశ్వంలో ని సృష్టిరహాస్యాలకు ఒక పర్యాయ పదంగానూ, ఒక వర్ణన గానూ అయన   భావించాడు. ఈ విశ్వాన్ని సర్వజ్యూడైన భగవంతుడు నడిపిస్తూన్నాడని విశ్వసించేవాళ్ళకు అది మింగుడుపడని విషయంగా మారింది.

మరణం తర్వాత జీవితం అనే శక్తిని సద్వినియోగం చేసుకోవాలని, మనం చేసే పనులన్నీ అత్యన్తవిలువైనవి కాబట్టి అవి మానవాళిక సుఖసంతోషాలు కలిగించేవిగా ఉండాలని అయన అన్నాడు. విస్సష్టంగా సైన్స్ ఈ విశ్వాన్ని నడిపిస్తూన్నదని నొక్కి చెప్పాడు.

సైన్స్ అనేక సమీకరణాలతో కుడి వుంది. ఏ విషయాన్ని ఒక దాని నుండి మరొకటి మినహాయించి పరిశిలించలేం. సామాజిక దృక్కోణంలో డార్విన్ సిద్ధంతాన్ని పరిశీలిస్తే ప్రకృతికి అనుకూలంగా వున్న జాతులే బతికిబట్ట కట్టాయి. వాటికే మనం విలువ కడతాం. విశ్వంలో అత్యంత చిన్న ఊర్జానువులు (Quarks) వున్నాయి. అవే పాలపుంతలకు (గేలాక్సిలు) నక్షత్రాలకు, చివరకు మానవ జీవనానికి కారణభూతాలయ్యాయి. విశ్వంలో సుక్ష్మతరంగ వికిరణం (Radiation) వుంది. దిన్ని అధ్యయనం చేస్తే విశ్వం ప్రచినకాలంలో ఇలా ఉండేదో, ఈ విశ్వంలో మన భూమికి గ్లా స్ధానం ఏమిటో నిర్దారించవచ్చు. ఎలాంటి మార్పులు రోదసిలో సంభవించాయో తెలుసుకోవచ్చు. ఈ విశ్వం అతి ప్రాకృతిక సౌష్టవం కలిగి వుండి Super symmetry). విభిన్న రకాల మార్పుల ద్వారా విభిన్న విశ్వాలు ఎటువంటి ప్రేరణ లేకుండానే ఏర్పడ్డాయి. మన జీవితాలు యాదృచ్చికం.

సైన్స్ అత్యంత సుందరమైనది. వివిధ పరిశీలనల మధ్యగల సంబంధాన్ని ప్రత్యక్ష ప్రమాణాలను తేలికగా వివరిస్తుంది. జీవశాస్త్రంలోని డబుల్ హెలిక్స్ (ద్వంద్వఅవర్తం), భౌతిక శాస్త్రంలోని ప్రాతిపదిక సిద్ధాంతాలు అన్నీ యిటువంటివేనని హాకింగ్ అంటాడు. అత్యంత ఆధునిక రోదసి పరికరాలతో మే 14, 2009న ఏరియన్ – 5 ఇ.సీఏ అని ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని యూరోపియాన్ రోదసి సంస్ధ అంతరిక్షంలో కి ప్రయోగించింది. దిన్ని ప్లాంక్ మిషన్ అని పిలుస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక కాలయంత్రం (Trime Mechine) విశ్వంలోని సుక్ష్మతరంగ వికిరణ నేపధ్యాన్ని అధ్యయనం చేయడమే దాని లక్ష్యం. విశ్వం ప్రాచీన కాలంలో ఎలా ఉండేది. ఎటువంటి మార్పులు సంతరించుకున్నది ఈ ప్లాంక్ మిషన్ తేటతెల్లంచేయగలదని శాస్త్రజ్ఞాల ధృడ విశ్వాసం.

ఈ విశ్వం ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? ఎప్పుడూ ఇలానే ఉందా? అసలు విశ్వానికి ఆరంభం అంటూ ఒకటుందా? మానవాళిని ఇటువంటి ప్రశ్నలు అనాది నుండీ వేధిస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను తత్వవేత్తలు, సైన్సు, మతం వెదుకుతూనే ఉన్నాయి. రకరకాల మతాలు సృష్టి సిద్ధాంతాన్ని ప్రచారం చేశాయి. నమ్ముతున్నాయి. సైన్సులో కూడ రకరకాల సిద్దాంతాలు వచ్చాయి. వాటిలో విశ్వం నిశ్చల స్థితిలో ఉంటుందనే సిద్ధాంతాన్ని (Steady State Theory) 20 వ శతాబ్దం ఉత్తరార్థంలో కూడ శాస్త్రవేత్తలు విశ్వసిస్తూనే ఉండేవారు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ హాయిల్ వీరిలో ముఖ్యలు. ఒకసారి లండన్ నగరంలో రాయల్ సోసైటి సమావేశంలో ఈ సిద్ధాంతం మీద ఫ్రెడ్ హాయిల్ గొప్పగా ఉపన్యాసం ఇచ్చాడు. సభ్యులు అంతే ఘనంగా హర్షధ్వానాలు చేశారు. కానీ వెనక బెంచీలో కూర్చున్న ఒక బక్క పల్చటి కుర్రాడు లేచి నిలబడి ప్రొఫెసర్ హెూయిలకు అడ్డుతగలాడు. ఇప్పటి వరకు హెయిల్ చెప్పింది కరెక్ట్ కాదని చెప్పాడు. నేను లెక్కలు వేశానని, మీరు చెబుతున్నట్లుగా విశ్వం నిశ్చల స్థితిలో ఉండదని, విశ్వం నిరంతరం మారుతూ ఉంటుందనీ, వ్యాప్తి చెందుతుందనీ చెప్పాడు. నివ్వెర పోవటం హెూయిల్ వంతు అయింది. ఇంతకీ ఎవరు ఆ కుర్రాడని ఆరా తీశాడు. అతను మరెవ్వరో కాదు. స్టీఫెన్ హాకింగ్. ఫ్రెడ్ హెూయిల్ దగ్గర డాక్టరేట్ చేయడానికే కేంబ్రిడ్జి యూనివర్సిటీకి స్టీఫెన్ హాకింగ్ వెళ్లాడు. కానీ యూనివర్సిటీ వాళ్ళు హెయిల్ దగ్గర కాకుండా విలయం సియామా దగ్గర పిహెచ్డి చేయడానికి సీటి చ్చారు. తన యూనివర్సిటీ వాడే అదీ తన డిపార్టుమెంటుకే చెందిన విద్యార్థి హెయిల్ అంతటి శాస్త్రవేత్తను ప్రశ్నించటం ఆనాడు హెూయిల్ తోపాటు అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ తర్వాత ప్రపంచాన్నే అబ్బుర పరచిన గొప్ప శాస్త్రవేత్తగా స్టీఫెన్ హాకింగ్ ఎదిగాడు.

ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ 20 వ శతాబ్దపు ఆరంభం అంటే 1905 వ సం. లో తన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని, మరో పదేళ్లకు 1915 లో సాధారణ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రపంచానికందించాడు. పదార్థ ద్రవ్యరాశి, శక్తి పరస్పరం రూపాంతరం చెందుతాయని (E=MC­­2) ఐన్‌స్టీన్ చెప్పాడు. మన వాళ్లు కాలం, కాల మహిమ, కాలచక్రం అంటూ ఉంటారు. మనమూ కామోసు అనుకుంటాము. కానీ స్టీఫెన్ హాకింగ్ పదార్థం, కాలం, స్థలం వేర్వేరు కాదని సిద్ధాంతీకరించాడు. పదార్థపు ఒకానొక లక్షణమే కాలం అని లెక్కలు వేసి మరీ రుజువులు చేశాడు. ఈ విశ్వం అంతా ఒక సూక్ష్మాతి నూక్ష్మమైన పదార్థం నుండి విస్తరించిందనీ తెలియజేశాడు. దాన్నే 'బిగ్ బాంగ్' సిద్దాంతం అంటారు. అంటే స్థలం, కాలం అనేవి విశ్వావిర్భావము తర్వాతనే వచ్చాయనీ, ఈ విశ్వం విస్తరిస్తుందనీ వెల్లడించాడు హాకింగ్.

కృష్ణ బిలాలు, లేక కాలబిలాలు అనేవి ఈ విశ్వంలో ఉన్నాయనీ వాటి ఆకర్షణ శక్తి నుండి ఏ వస్తువు కూడ తప్పించుకోలేదని చెప్పాడు. చివరకు కాంతిని కూడ ఈ కాలబిలాలు (Black holes) మింగేస్తాయని అనుకునేవారు. రోజర్ పెన్రోజ్ అనే మరో గణిత శాస్త్రజ్ఞుడితో కలసి హాకింగ్ పరిశోధనలు చేశాడు. ఐన్‌స్టీన్ సాపేక్షతా సిద్ధాంతాన్ని క్వాంటం సిద్దాంతాన్నీ రెండింటినీ కాలబిలాలకు అన్వయించాడు. కాలబిలాల నుండి ఏదీ బయటకు రాదన్న నమ్మకాన్ని వమ్ముచేస్తూ వాటి నుండి శక్తివికిరణం చెందుతుందని తెలియజేశారు. అప్పట్నుంచి దానిని హాకింగ్ పెన్రోజ్ రేడియేషన్ గా పిలుస్తున్నారు. ఇంతటి గొప్ప సత్యాలను, విశ్వరహస్యాలను కనుగొన్న సీఫెన్ హాకింగ్ మొన మొన్న మార్చి 14 వ తేదీన, కేంబ్రిడ్జ్ లోని తం స్వగృహంలో చివరిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 76. ఒక శాస్త్రవేత్తగా ప్రపంచ గుర్తింపును పొందటమే కాదు. అత్యున్నత పురస్కారాలు ఆయనను వరించాయి. శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత గౌరవ ప్రదంగా భావించే రాయల్ సొసైటీ సభ్యత్వం ఆయనకు 32 సం. వయసులోనే వచ్చింది. అంత చిన్న వయసులో ఆ గౌరవం దక్కించుకున్నవాడు హాకింగ్ ఒక్కడే! బ్రిటిష్ అమెరికా, ఇజ్రాయిల్, కెనడా ఇలా ఎన్నో దేశాలనుండి అత్యున్నత బిరుదులు పొందాడు. ఒక్క నోబెల్ తప్ప అన్నీ ఆయన ఖాతాలో చేరాయి. ఆయన సిద్ధాంతం రుజువుచేసే సాక్ష్యాలు ఇంకా లభించనందున నోబెల్ బహుమతి రాలేదు. హాకింగ్ రేడియేషన్ కు సాక్ష్యం దొరకాలంటే సునిశితమైన పరికరాలు కావాలి. దాన్ని పసిగట్టే పరికరాలు ఒకటిని రెండు వందల కోట్లతో భాగిస్తే వచ్చేంత సూక్ష్మ రేడియేషన్ ను కూడ పసిగట్టేవిగా ఉండాలి. ఏదో ఒకరోజు హాకింగ్ రేడియేషన్ ను తప్పకుండా సైన్సు గుర్తిస్తుంది. (గురుత్వాకర్షణ తరంగాలను ఈ సంవత్సర నోబెల్ విజేతలు కనుగొన్నట్లుగా) ప్రపంచం చూస్తుంది. కానీ హాకింగ్ ఉండడు.

స్టీఫెన్ హాకింగ్ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు. గొప్ప మనిషి, మానవతా స్ఫూర్తికి, చైతన్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఆయన సంకల్పం ముందు మృత్యువు సైతం తలవంచక తప్పలేదు. హాకింగ్ కేంబ్రిడ్జిలో పిహెచ్డి చేసే రోజుల్లో, ఆయన 21 వ పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది రోజులకే మహమ్మారి కండరాల వ్యాధి బారినపడ్డాడు. ఎమయోట్రోఫిక్ లేటరల్ స్లీరోసిస్ (Amyotrophic lateral Sclerosis) అనే ఈ వ్యాధి వచ్చిన వారి కండరాలను నియంత్రించే న్యూరాన్లు పనిచేయవు. దీనితో శరీరం పక్షవాతం బారిన పడుతుంది. హాకింగ్ విషయంలోనూ అదే జరిగింది. వ్యాధి క్రమంగా శరీరమంతా పాకి రెండేళ్లలో చనిపోతాడని డాక్టర్లు కూడా చెప్పారు. హాకింగ్ తండ్రి స్వయాన డాక్టరు. గురువు సియామా ప్రోత్సాహం, తండ్రి మద్దతు, మిత్రుల వెన్నుదన్ను హాకింగ్‌లు తిరిగి కార్యోన్ము ఖుడ్ని చేశాయి. ఇక హాకింగ్ జీవితంలో వెనుతిరిగి చూడలేదు. విశ్వరహస్యాలను శోధించే పని చాల బృహత్తరమైందనీ అందుకు తనకున్న సమయం చాల తక్కువనీ తెల్సుకున్న హాకింగ్ తన మేధస్సును ప్రతి నిముషం ప్రతి సెకనూ సత్యాన్వేషణకే వినియోగించాడు. ఏ సాధారణ శాస్త్రవేత్త సాధించలేని, సాధించనన్ని విజయాలను హాకింగ్ సాధించాడు. హాకింగ్ కృషికి, సంకల్పానికి మృత్యువు కూడ వెనుకంజ వేసింది. 1965 లో విశ్వం పట్ల తన నూతన విశ్లేషణలతో కూడిన సిద్ధాంత వ్యాసాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సమర్పించి సంచలనం సృష్టించాడు. చేతి కర్రలతో, గోడలు పట్టుకుని తన పదకమీదికి చేరుకోటానికి గంట అయ్యేదట. పడుతూ, లేస్తూ, నడుస్తూ తరచూ గాయాలపాలయ్యే హాకింగ్ తన స్థితి పట్ల ఏ నాడు విచారించలేదు. ఎవరో పత్రికలవాళ్లు అడిగారట మీ ఆరోగ్యం ఇలా అయినందుకు మీకు బాధగా లేదా అని. అందుకు హాకింగ్ సమాధానమేమిటో తెలుసా? బాధపడేందుకు తనకు సమయం లేదని! ఇంకా తనకీ వ్యాధి రావటం వల్లనే తన శక్తియుక్తుల్ని పూర్తిగా సైన్సుకు, పరిశోధనకు కేటాయించే వీలు కల్గిందని చెప్పాడట! చెప్పటం మాత్రమే కాదు. తానెన్నడూ వ్యాధి గురించి, శారీరక స్థితి గురించి నైరాశ్యానికీ, క్షోభకు గురికాలేదు. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి మాత్రమే తాను అవిటివాడు. హాకింగ్ కు తన శారీరక స్థితితో సంబంధం లేదు. మానసికంగా ఎంతో మందికంటే బలవంతుడు. మనోబలం గొప్పది. అందుకే తను ఆ స్థితిలో ఉండి కూడ అంతరిక్ష పరిశోధకులు ప్రయాణం చేసే శూన్య గురుత్వాకర్షణ దగ్గర వారితో కలసి ప్రయాణం చేశాడు.

హాకింగ్ లో హాస్య చతురత, కొంటెతనం కూడా కొద్దిగా ఎక్కువనే. ఆయనకు పాప్ సంగీతమంటే చాల ఇష్టం. ఒక సారి తాను ఉపన్యాసం ఇచ్చే హాలు పక్క హాల్లో సంగీత విభావరి జరుగుతున్నదంట. హాకింగ్ నేరుగా స్టేజీ మీదకు తన చక్రాల కుర్చీని నడిపించి వారి పాటలకు లయబద్దంగా కూర్చీని గిరాగిరా తిప్పుతూ డాన్స్ చేశాడట. హాకింగ్ ఆఫీసులో ఆయన కుర్చీవెనుక హాలీవుడ్ తార మారిలిన్ మన్రో ఫోటో ఉండేదంటే నమ్ముతారా? హాకింగ్ తన స్నేహితులతో పందేలు కాసే వాడట. అదీ ఆయన సిద్దాంతాల మీదనే. ఆయన సిద్ధాంతానికి ఆయనే వ్యతిరేకంగా పందెం కట్టేవాడట. అదేమిటంటే నేనోడిపోయినా నా సిద్ధాంతం గెలుస్తుంది కదా అని నవ్వేవాడట!

హాకింగ్ కుటుంబంలో అందరూ కొద్దిగా నంగిగా మాట్లాడేవారట. సరదాగా వాళ్లను ఆటపట్టిస్తూ అర్థంకాని వారి మాట్లాడే పద్దతిని హాకింగీజ్ అనే వాళ్లు, హాకింగ్ బ్రస్సెల్స్‌లో పర్యటించినపుడు న్యుమోనియా వచ్చి ప్రాణాపాయ స్థితి వచ్చింది.

హరగోవింద్ ఖోరానా

khorana1968ల్ వైద్యరంగలో నోబెల్ బహుమతి సాధించిన హరగోవింద ఖోరానా వాస్తవానికి జావరసాయనిక శాస్త్రవేత్త (BioChemist). జీవం వేరు. నిర్జీవం వేరు అన్న ఛాందనభావాలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడ్డ గొప్ప పరిశోధనలు హరగోవింద ఖోరానావి. తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మల జన్యు స్మృతి ఆధారంగానే శారీరక నిర్మాణం ఉంటుంది గానీ గత జన్మంటూ ఒకటి ఉండి, ఆ పాపపుణ్యాల ఆధారంగా మనుషులు పుడతారనే వాదన పూర్తిగా తప్పు అనేందుకు ఖోరానా పరిశోధనలు సహకరిస్తాయి,. నిర్జీవ పదార్ధాల్ని ఓ పద్ధతి ప్రకారం సంశ్లేషిస్తూ DNA లేదా RNA లాంటి పదార్ధాల్ని సృష్టించి కనకవచంలో ఉంచితే అది తప్పక జీవకణం (Living Cell) అవుతుందని ఖోరానా భాష్యం చెప్పారు.

భారాత సంతతికి చెందిన  హరగోవింద్ ఖోరానా పంజాబ్ రాష్ట్రంలోని జో కుగ్రామంలో పుట్టాడు. 1922 జనవరి 9వ తేదిన ఓ పేద పట్వారి కుటుంబంలో పుట్టిన ఇదుగురిలో ఖోరానా చిన్నవాడు, . పేదవాడే అయినా తండ్రి ఖోరానాను చదివించడానికి బాగా కష్టపడేవాడు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పశ్చిమ పంజాబ్ లో ఉండే ముల్తాన్ లో DAV ఉన్నత పాటశాలలో చదివాడు. భారత్, పాకిస్తాన్‌లు విడిపోయాక ఖోరానా కుటుంబం భారత భాగంలో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి వలస వచ్చింది. పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఖోరానా 1943లో B.Sc 1945లో M.Sc పూర్తి చేసుకొని మంచి ప్రతిభతో ఉత్తీర్ణుడయ్యాడు. యూనివర్శిటి ఆఫ్ లివర్ పుల్ (ఇంగ్లాండ్) లో రోజర్ బీర్ అనే పరిశోధకుడి నేతృత్వంలో Ph.d పొందాడు.

చదువయ్యాక భారతదేశానికి వచ్చి దేశాభివృదికి ఉపకరించే పరిశోధనలు చేయడానికి ప్రతిపాదనలు పంపగా ఎవరూ ఆయనను అందరించలేదు. ఇక్కడ కొంత కాలం గడిపాక తన శాస్త్ర పరిశోధనా తృష్ణను సంతుష్టి పరిచే పరిస్ధితులు భారతదేశంలో లేవని నిర్ధారించుకొని చాలా దిగులుగా ఇంగ్లండు దేశానికి వెళ్ళాడు. క్రమేపి రసాయనిక శాస్తం లో ప్రధాన భాగమైన జీవరసాయనిక శాస్త్రం పట్ల ఖోరానా ఆసక్తి పెరిగింది. అక్కడ యూనివర్శిటి ఆఫ్ బ్రిటిష్ కొలభియాలో దశాబ్దం పాటు అమెరికాదేశంలోని యూనివర్శిటి ఆఫ్ విస్కాన్సిన్ కు వెళ్లాడు. ఆ తర్వాత 1970 MIT (మాసాచు సెట్స్ ఇన్సిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ) లో స్ధిరపడ్డాడు.

నేటికి అక్కడ ఎమిరిటన్ ప్రోఫెసర్ గా ఉంటూ జీవరసాయనిక శాస్త్ర పరిశోధనల  చేస్తున్నాడు. ప్రస్తుత కంటికి సంబంధించిన సంజ్ఞా మార్పిడి (Transduction) విధానాల పై పరిశోధనల్లో నిమగ్నమయి ఉన్నాడు. 1952లో ఎస్టర్ ఎలిజెబెత్ సీబ్లర్ ను వివాహం చేసుకున్నాడు. అమెరికా శాస్త్రవేతగా నోబెల్ బహుమతిని వైద్యరంగానికి గాను 1968లో అందుకున్నా. తానూ మానసికంగా సంస్క్రుతికంగా భారతీయుడినే అంటడు. తన పరిశోధనలను తీసుకోవడానికి నిరాకరించిన ఖోరానా మనకందరికి ఆదర్శప్రాయుడు.

మేరియో మొలినా

marioప్రతి సంవత్సరం సెప్టెంబరు 16వ తేది నాడు ఒక ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాము. 1995 సెప్టెంబరు 16 నుంచి మనం అంతర్జాతీయ ఓజోన్ (పరిరక్షక) దినం (Ozon Day) గా అమల్లో ఉంది. సౌర కిరణాల్లో ఉండే శక్తికరమైన అతినీలలోహిత కిరణాల్ని భూమి మీదకు రాకుండా జల్లెడు పట్టే పై వాతావరణ పొరకు దుప్పటి లాగా ఉన్న పొరనే ఓజోన్ పొర అంటారు. దీని ఫార్ములా O3.ఆక్సిజన్ నుంచి తయారవుతూ, ఆక్సిజన్ మారుతూ ఎప్పుడూ అతినీలలోహిత కిరణాలను స్వాహ చేసుకుంటూ భువాతావరణాన్ని, తద్వారా భూమి మీదున్న సకల జివజాతుల్ని, పరిస్ధితుల్ని రక్షిస్తూన్న పొర ఓజోన్ పొర. పారిశ్రామిక విప్లవానంతరం క్రమేపి ఎన్నో వాతావరణ కాలుష్య కారకాలు (ముఖ్యంగా క్లోరో ఫ్లోరో కార్బన్, లేదా CFC అనబడే వాయు పదార్ధాలు) ఈ ఓజోన్ పొరను దెబ్బ తీస్తునాయి. దిన్ని కొందరు ప్రముఖ రసాయనిక శాస్త్రవేత్తలు గుర్తించారు. వారిలో అమెరికా దేశానికి చెందిన మేరియో జె.మొలినా ముఖ్యలు. CFC లలో ఉండే హేలోజన్ పరమాణువులు కాంతి సమక్షంలో ఓజోన్ తో చర్య  జరిపి ఓజోన్ ను క్షయం చేస్తాయని మొలినా తన గురువైన షేర్ఉడ్ రౌ లాండ్ (F.Sherworod Rowland 1972, -) తో సంయుక్తంగా జరిపిన పరిశోధనల ద్వారా ఋజువు చేశాడు. తద్వారా ప్రపంచం దృష్టికి CFC కాలుష్యాల ప్రభావాన్ని తీసుకువచ్చినట్లయింది. మేరియో మొలీనా అమెరికాలోని మెక్సికో సిటిలో మార్చి 19వ తేది 1943 నాడు జన్మించాడు. చిన్నప్పటి నుంచి సైన్సు పట్ల వల్ల మాలిన అభిమానం. సాధారణ సుక్ష్మ దర్శిని ద్వారా మురికి నీటిలో కదులుతున్న పేరమీషియం, అమీబా వంటి ఏక కణం జీవుల్ని చూశాక సైన్సులో ఉన్న అద్భుతాల పట్ల అబ్బురపడ్డాడు. స్నానానికెళ్లి ఒక పట్టాన బాత్ రూం నుంచి బయటికి వచ్చేవాడు కాదు. అక్కడున్న సీసాలు, సబ్బులు, షాంపూలతో పాటు వంటీంట్ లోనుంచి దొంగతనంగా బాత్ రూం లోకి తీసుకెళ్ళిన పదార్ధాల మధ్య చేసేవాడు. అంతవరకు సంగీతం పై చాలా పట్టున్న మొలీనాకు ఎలాగైనా గొప్ప రసాయనిక శాస్త్రవేత్త కావాలని పట్టుదల కలిగింది. భౌతిక రసాయనిక శాస్త్రం (Physical chemistry) లో నైపుణ్యట సాధించాలని ఆశ పడ్డాడు. అందుకు గణితం, భౌతిక శాస్త్రం చాలా అవసరమని తెలిశాక ఆ రెండు సబ్జెక్టులను నేర్చుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు.

పై చదువుల కోసం స్విట్జర్లాండు జర్మనీ వంటి దేశాలకు వెళ్లాడు. సంవత్సరాల తరబడి కష్టపడ్డాడు. చివరికి 1968 సంవత్సరంలో బెర్కిలీ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జార్జి పిమేంటల్ (George Pimentel) అనే గురువు దగ్గర లేసర్ కిరణాల సాయంతో రాసాయనిక చర్యల్లో క్షణికం (Transient) గా ఏర్పడే మధ్యమ పదార్ధాల (Reaction intermediates ) ధర్మాల్ని పసిగట్టే పద్ధతుల పై అధ్యయనం చేశాడు. 1972 లో Ph.D పూర్తయింది. ఆ తర్వాత అదే నగరంలో ఇర్విన్ లో ఉన్న షేర్ ఉడ్ రౌ లాండ్ దగ్గర పోష్టు డాక్టరల్ పరిశోధనలు చేసి వాతావరణం పై పొరల్లో ఉన్న ఓజోన్ పొరను క్లోరో ఫ్లోరో కార్బన్ పదార్ధాలు ఎలా తూట్లు పొడుస్తాయో నిశిత పరిశోధనల ద్వారా ఋజువు చేశాడు. ప్రపంచం దృష్టిని ఈ ముఖ్యమైన అంశం వైపు మళ్లించాడు. 1995 సంవత్సరం రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని తన గురువైన షేర్ ఉడ్ రౌ లండ్  సంయుక్తంగా గెలుపొందాడు. సైన్సు పరిశోధనలు మానవాళి సంక్షేమానికి ప్రపంచ సరళ గమనానికి ఉపయోగపడుతూ మొలినా ఎప్పుడూ ప్రచారం చేసేవాడు. అయన మనందిరికి ఆదర్శప్రాయుడు.

డా. రిచర్డ్ ఏచేర్

వినాళ గ్రంధుల వ్యాధులల్లో మరియు రక్తసంబంధిత వ్యాధులలో నిపుణులైన రిచర్డ్ ఏచేర్ ప్రముఖ బ్రిటిష్ డాక్టర్. అయన కాలంలో వున్న వైద్య పద్ధతుల గురించి తీవ్ర ఎక్కువ కాలం పనిచేసి ఎన్నో పుస్తకాలు మరెన్నో వ్యాసాలు రాసారు. రిచర్డ్ ఏచేర్ 1969 ఏప్రిల్ 25న ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇది ప్రపంచ వైద్యరంగాన్ని కలచివేసిన అంశం. ఆనాటి వైద్య పత్రికలు నిరుత్సాహంగా వున్నాయని పదేపదే చెప్పే అయన, వైద్యంలో సప్త మహాపాపములు అనే వ్యాసాన్ని ప్రముఖ వైద్య పాట్రిక లాన్సేట్ లో ప్రచురించారు. ఈ ఏడు మహాపాపాలు ఇవి.

 1. aug14డాక్టర్లు రోగులకు అర్ధమయ్యే లాగా మాట్లాడకుండుట.
 2. డాక్టర్లు రోగులను చులకనగా చూడటం.
 3. డాక్టర్లకు మాటల్లో నడవడికలో మర్యాద లేకుండట.
 4. పెద్ద నిపుణులే కావాలనుకోవడం – ఒకవేళ అది సహజమయినా  చిన్న చిన్న సమస్యలను వినకపోవడం.
 5. తమ విభాగం గొప్ప మిగతావి తక్కువ అనుకోవడం.
 6. వైద్యులు నైపుణ్యాన్ని పెంచుకోకపొవడం.
 7. రోగులను అర్ధం చేసుకోకపోవడం, బాగా పరీక్ష చేయకుండా ఎక్కువగా లాబరేటరీ పరీక్షలు చేయించడం.

బాలలూ ఈ సంగతులను మీతోటి వారితో పంచుకుంటారు కదూ !

సర్ విలియం ఓస్లర్

సర్ విలియం ఓస్లర్ ప్రముఖ కెనడా వైద్యుడు. అమెరికాలోని జాన్ హప్ కిన్స్ వైద్య పాటశాల ఆసుపత్రి వ్యవస్దాపకులో ఒకరు. 1849 జులై 12న జన్మించిన ఓస్లర్ గొప్ప వైద్యుడుగా ఉపాధ్యాయుడుగా మానవతావాదిగా పేరుపొంది 1919 డిసెంబర్ 29న మరణించాడు. ఓస్లర్ చెప్పిన అంశాలో మన జీవితాలకు ఉపయోగాపడుతూయి. అందులో కొన్ని...

 1. aug18మనుషుల్లో మందులు తినాలనే కోరిక ఎక్కువ. జంతువులకు ఇటువంటి కోరిక వుండదు. ఇదే మనుషులకు ఇతర జంతువులకు తేడా.
 2. పుస్తకాలు లేకుండా వైద్య చదివే వారు సముద్రం గురించి ఏమీ తెలియకుండా సముద్రయానం చేసేవారి మాదిరే. రోగులు లేకుండా వైద్యవిద్య చదివేవారు అసలు సముద్రం దగ్గరికే పోనివారు.
 3. రోగిలో ఎలాంటి వ్యాధి ఉందొ తెలుసుకోవడం కంటే వ్యాధి ఎలాంటి రోగిలో ఉందొ తెలుసుకోవడం ముఖ్యం.
 4. చదవడం కంటే పుస్తకాలు కొనడం ఎంతో సులభం. చదివినది ఆకలింపు చేసుకోవడం కంటే చదవడం సులభం.
 5. వైద్యశాస్త్రం “ఏదో తెలియనిది” మరియు ఇది కావచ్చు అనే శాస్త్రం
 6. జనాన్ని మందులు తీసుకోవద్దు అని చెప్పడం డాక్టరు ప్రధానమైన పని.
 7. సబ్బు నీరు మరియు ఇంగితజ్ఞానం సుక్ష్మాజీవుల నుండి రక్షించే ఉత్తమ సాధనాలు.
 8. మంచి డాక్టర్లు వ్యాధికి వైద్యం చేస్తారు. గొప్ప డాక్టర్లు రోగికి వైద్యం చేస్తారు.

జిన్ మేరీ లెన్

augరసాయనిక శాస్త్రాని అద్బుతమైన విజ్ఞానశాస్త్రంగా, కేంద్ర శాస్తం (Central Science) గా మార్చిన అంశాలు చాలా ఉన్నాయి. పరమాణువులు (atoms), వాటి మధ్య ఉన్న బంధాలతో ఏర్పడ్డ అణువులు (Molecules) ఈ అనువుల్లో పరమాణువుల ప్రాదేశిక విస్తారం (Spatial Disposition), బంధం గుణాలు (Bond Characteristics) బంధన బలం వగైరా అంశాలు పదార్ధాలకు భౌతిక , రసాయనిక లక్షణాలను ఆపాదించాయి. ఆ లక్షణాల ఆధారంగానే అవి వివిధ వ్యాపకాల్లో మానవ సమాజానికి ఉపకరిస్తున్నాయి.

సాధారణంగా పరమాణువుల నుంచి అణువు ఏర్పడ్డాక ఆ అణువుకు స్ధిరత్వం (Stability) వచ్చేసినట్లు అందరం భావిస్తాం. ఇక ఆపై వాటికి పెద్దగా రసాయనిక గుణం, అభిష్టాలు ఉండవని అనుకుంటాము. కానీ 19వ శతాబ్దాంతంలోనూ 20వ శతాబ్దపు ప్రధమ భాగంలోనూ ఆశ్చర్యం గొలిపే ప్రయోగాలను, రసాయనిక శాస్త్రవేత్తలు చేశారు. అణువుల మధ్య కూడా అనుబంధాలు బలంగానే ఉండడాన్ని గమనించారు. ఉదాహరణకు కొబాల్టు క్లోరైడు (CoCl2 . 6H2O) ఒక సంయోగపదార్ధం. అది సీసాలో ఎన్ని రోజులైనా స్దిరంగానే ఉంటుంది. అమ్మోనియా (NH3) వాయువు లేదా అమ్యోనియం హైడ్రాక్స్ డు (NH4 OH) కూడా స్ధిరమైన క్షార ఈ రెండు పదార్ధాల జలద్రావణాల (aqueous solutions) ను కలిపినట్లయితే అద్భుతమైన రంగు మార్పుతో కొత్త పదార్ధం ఏర్పడుతుంది. ఇలా వందలాది పదార్ధాలను తయారు చేసి అందులోని రసాయనిక లోతుపాతులను వెలికి తీసిన వాడు అల్ఫ్రెడ్ వెర్నెర్ (Alfred Werner 1866-1919).

ఈయన చేసిన కృషికి గుర్తింపు గా 1913 సం.పు  రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.

ఇలా అప్పటికి స్ధిరంగా ఉన్న సంయోగ పదార్ధాల మధ్య తిరిగి పరంపరగా మళ్ళి పెద్ద పదార్ధాలు ఏర్పడడం వెనుక ఉన్న సమన్వయ రసాయనిక శాస్త్రం (Co-Ordination chemistry) రూపకల్పనలో వెర్నర్ దాదాపు మొదటివాడు. ఇప్పుడు ఆధునిక రసాయనిక శాస్త్రంలో ఒక విశిష్ట భాగమైన నిరింద్రియ రసాయనిక శాస్తం (inorganic chemistry) లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలో సగానికి కన్నా ఎక్కువ సమన్వయ రసాయనిక శాస్త్రంలోనే జరుగుతున్నాయి. అందుకే అల్ఫ్రెడ్ వెర్నెర్ ను సమస్వయ రసాయనికశాస్త్ర పితామహుడు (ఫాదర్ of Modern Coordination Chemistry) అని కొనియాడతారు.

ఎన్నో జీవరసాయనిక ప్రక్రియలను ఎన్నో సహస్రాబ్దాలుగా మానవజాతికి తెలిసిన రంగులు అద్దకాలు ఆహారపు మార్పిడి విశేషాలలో ను సమన్వయ రసాయనిక శాస్త్రపుటంశాలు ఉండడాన్ని ఆధునిక రసాయనిక శాస్త్రం ఋజువు చేసింది. సమన్వయ సమ్మేళనాలు (co-ordination compounds) సాధారణ స్ధిరమైన అణువుల తదుపరి చర్యాపర్యంతంగా ఏర్పడిన మాట సరే ! మరి ఆ పై వాటికి స్ధిరత్వం పూర్తిగా అబ్బినట్టేనా ? సమన్వ సమ్మేళనాలు ఇక ఆపై ఏ చర్యలోనూ పాల్గోనవా ? సమన్వయ మధ్య మరో పై తరగతి చర్యలు ఉండడాన్ని కొందరు గుర్తించారు. ప్రధమ స్తానం జిన్ మేరీ లెన్ (Jean Marie Lehn 1939) ది.

ఈయన అణువులు సమన్వయ నమ్మేళనాల అణువులు పరమాణువులు అయానులు బహ్వణువులు (Polymers) జీవాణువులు (biomolecules) అణు సమూహాలు (molicular aggregates) బృహదణువులు (macro molecules) మద్య ఉండే విశిష్టమైన ప్రత్యేకమైన బంధనాల్ని గమనించాడు. గత 50 సంవత్సరాలుగా ఆ శాస్త్రం షిఘ్రగతిని విస్తరిస్తూ ఉంది. ఆ శాస్త్రాన్నే లెన్ అధ్యణురసాయనిక శాస్త్రం (Supramolecular chemistry) గా నామకరణం చేశాడు. అధ్యను రసాయనిక శాస్త్ర పితామహుడు (Father of supramolecular chemistry) గా ఆయన అతి చిన్న వయసులోనే పేరు పొందాడు. ఈయన కృషికి గుర్తింపుగా 1987లో రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని పొందాడు.

సెప్టెంబరు 30వ తేది 1939 లో ఫ్రాన్సు దేశంలోని రాషీం నగరంలో లెన్ జన్మించాడు. చిన్నప్పటికి నుంచి సంగీతం పట్ల ఆసక్తి ఉండేది. ఇంట పెద్ద శాస్త్రవేత్త అయినప్పటికీ నేటికి అయన సంగీతకచేరిలు ఇస్తాడు. దాదాపు 800 కు పైగా పరిశోధనా పత్రలను అయన ప్రచురించాడు. ఎన్నో ఆధునికఫ్ రసాయనిక శాస్త్ర పుస్తకాలను రచించాదు. హిమోగ్లోబిన్ కు ఆక్సిజన్ అంటుకోవడం వెనుక హిమోగ్లోబిన్ నుంచి మయోగ్లోబిన్ ఆక్సిజెన్ కు తస్కరించడం వెనుక ఆక్సిజన్ కు సైటోక్రోమ్ అణువుల ద్వారా ఎలక్ట్రాన్లు సంక్రమించడం వెనుక ఉన్న రసాయనిక ప్రక్రియలన్నీ అధ్యను రసాయనిక పుటంశాలుగా అయన ఋజువు చేశాడు. కణవిభజనలో DNA పునరానుకరణం (Self replicition) విటమిన్లు హర్మోన్ల పనితీరు సుప్రమాలిక్యూలార్ దృగ్విషియాలేనన్నది నేడు అందరూ నేనో టెక్నాలజికి అనుస్దాయిలో ప్రాతిపదికను ఇచ్చే అధారాలన్ని సూప్రామాలిక్యులార్ లక్షణాలేనని గుర్తించాడు.

ఒక పెద్ద అణువులో పొట్ట లాంటి ఖాళీ స్ధలాన్ని నిర్మనాత్మకంగా రూపొందించి అందులోకి మరో చిన్న అనువును భద్రంగా అమర్చడం ద్వారా రావానాచేయడం గంయస్ధానంలో వదలడం అనే అతిధి గృహస్తు (guest host) పద్దతి అణువుల్లోకి ఏర్పర్చిన శాస్త్రవేత్త లెన్. 1950 నుంచి 1957 వరకు ఫ్రాన్సు దేశంలోని ఒబెర్నాయ్ (obernai) లో ప్రాధమిక విద్య భాషా  విద్య పూర్తయ్యాక యునివర్సిటి ఆఫ్ స్ట్రాస్ బర్ లో తత్వశాస్త్రాధ్యయనం కోసం చేరాడు. కాని క్రమేపి రసాయనిక శాస్త్రమే పెద్ద తత్వశాస్త్రమణి గుర్తించి ఆ వైపు ఆసక్తి కనబర్చాడు.

ప్రసిద్ధి సేంద్రియ రసాయనిక శాస్త్రవేత్త అయిన వుడ్ వర్డ్ (R.B Woodword) దగ్గర హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసి Ph.D అత్తా పొందాడు. తిరిగి స్వదేశానికి వెళ్ళి ప్రొఫెసర్ అయ్యాడు. లెన్గొప్ప హేతువాది. ప్రాణం (Life) అంటే పనిచేస్తున్న రసాయనిక ప్రక్రియల సమితి (set of chemical events ) అన్నాడు. నేడు సుస్రామాలిక్యులర్ కెమిస్ట్రీ అనువర్తనాలు ఎలక్ట్రానిక్ , కంప్యూటర్ రంగంలోకి విస్తరిస్తున్నాయి.

పాల్ ఫ్లోరీ

paulflory1930ల నాటి నుండి ఈనాటి దాకా అమెరికన్ కెమికల్ ఇండస్ట్రి నియోప్రిస్ నైలాన్ లతో మొదలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు పాలిమర్లతో నింపిన ఒక అక్షయ పాత్రనే ఇచ్చిందని చెప్పవచ్చు. పలురకాల ఈ పాలిమర్లలో అత్యంత జారిపోయే స్వభావం గల పాలిమర్ అయిన పాలిటేట్రాప్లోరో ఇదిలిన్ కూడా (PTFE) ఒకటి. ఇది ఒక రసాయన శాస్త్రవేత్తకి యాధృచ్చికంగా (unexpectedly) అతను ప్రయోగశాలలో టెట్రాప్లోరో ఇధిలిన్ (TFE) వుంచిన వాయు సిలిండర్‌లో లభించింది.

అది 1938 సంవత్సరం డ్యుపాంట్ (Du Pont company) కంపెని వారు యు.ఎస్ లోని న్యూజర్సి (New Jersey) నగరంలో గల తమ జాక్సన్ ప్రయోగశాలలో (Jackson Laboratory) పనిచేస్తున్న ఒక యువ రసాయన శాస్త్రవేత్త (Young chemist) కి అపూర్వమైన మేలురకం శీతళీకరణిని (Refrigerant) తయారు చేసే పరిశోధనను అప్పచెప్పారు. రేఫ్రిజిరేటర్లలో వాడే శీతళీకారణులు ఫ్లోరోకార్బన్లు. వీటిని ఫ్రియాన్ (freon) వాయువులు అని కూడా అంటారు. శాస్త్రవేత్త టెట్రాఫ్లోరో ఎధిలిన్ (TFE) ని, హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCI) లను కలిపితే సరికొత్త రిఫ్రిజిరెంట్ తయారు అవుతుందని ఊహించారు.

ఏప్రిల్ 1938 నాడు ప్రయోగాన్ని మొదలు పెడుతూ సంపిడనం చెందించిన (Compressed) TFE వాయువుని ఒక సిలిండర్‌లో వుంచాడు. అది వ్యాకొచించి సిలిండర్ పేలిపోకుండా వుండడానకి సిలిండర్ ని డ్రై ఐస్ (dry ice) లో పెట్టాడు. మరుసటి రోజు వాయువుని హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కలపాలని ప్రయోగశాలకు వచ్చాడు. ఇతని దగ్గర సాంకేతిక సహాయకునిగా (Technician) పనిచేస్తున్న జాక్ రిబోక్ (Jack Rebok) TFE వున్న సిలిండర్‌ని HCI వున్న టాంకుకి చేర్చి వాయుకవాటాన్ని (valve) ని తెరిచాడు. సిలిండర్నుండి కవాటం గుండా వాయువు రావటం లేదు. వాయువు లక్ అయి పాయిందని భావిస్తూ శాస్త్రవేత్త రిబోక్ తో ఆ సిలిండర్‌ని పాడై పాయిన వస్తువులతో చేర్చమని చెప్పాడు. వేరొక సిలిండర్ వాడుతూ మళ్ళి ప్రయోగాన్ని చేద్దామన్నాడు.

రిబోక్ సిలిండర్ బరువు తూచి చూద్దామని సూచించాడు. ముందు శాస్త్రవేత అందుకు ఒప్పుకోలేదు. రోబోక్ చూద్దామంటూ పట్టుపట్టాడు. శాస్త్రవేత్త సరే అనగానే సిలిండర్ ని తూచి చూసాడు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే బరువులో తతేడారాలేదు. సిలిండర్ లో సంపిడనం చెందించి వుంచిన వాయువు. ఎమైవుంటుందో వారి ఊహకి వెంటనే తోచలేదు. టేక్నిషియన్ సిలిండర్ ని తెరచి చూస్తానన్నాడు. అందుకు మొదటా వప్పుకోకపోయినా చివరికి శాస్త్రవేత్త తెరచి చూడడానికి అనుమతి ఇచ్చాడు. టెక్నిషియన్ కి దానిలో జారిపోయే స్వభావం గల తెల్లని పొడి కనిపించింది. అది చూసి శాస్త్రవేత్త పొందిన సంభ్రమాశ్చర్యాలకి అంతులేదు. సంపిడనం సరిపోలేదని భావిస్తూ సిలెండర్లో పిడనాన్ని పెంచినట్లయితే చాలా ప్రమాదమే జరిగివుండేది.

శాస్త్రవేత్త యు.ఎన్.లోని ఒహాయో (ohio) కి చెందిన ఒక బీద వ్యవసాయదారుని కొడుకు. ఇండియానా (indiana) కాలేజిలో చదువుకొన్నాడు. ఇతను, పాల్ జాన్ ప్లోరి (Paul John Flory) కలిసి ఒకే గదిలో వుండేవారు. పాల్ ప్లోరీ పాలిమర్ రంగంలో సాదించిన ఫలితాలకి 1974 సంవత్సరపు రసాయన నోబెల్ ని పొందిన శాస్త్రవేత్త . అంతటి ప్రతిభ గల వారి సాంగత్యం ఈ శాస్త్రవేత్తకి యువకునిగా లభించింది. కాలేజిలో పొందిన విద్య శిక్షణ (education & training) ల వల్ల అపూర్వమైన (novel) వింతలను గుర్తించగలిగే లక్షణం అలవడింది. ఆ రోజు TFE ని వుంచిన సిలిండర్‌లో ఎటువంటి చర్య జరిగి వుండవచ్చో ఆలోచన లోపడిన అతని చురుకైన మెదడుకి పాలిమరీకరణ (Polymerization) చర్య జరిగిందని పాలిటెట్రాప్లోరో ఇధిలిన్ (poly tetra fluro  ethylene) ఏర్పడిందని తట్టింది. అది నిజమైంది. అన్ని పాలిమర్లలో లాగానే ఈ వాలిమర్లోకూడా కార్బన్ పరమాణువుల గొలుసు వుంటుంది. ఈ గొలుసు చుట్టూరా ప్లోరిన్ పరమాణువులు వుంటాయి. ఇవి గోలుసులోని కార్బన్ పరమాణువులతో రసాయన బంధాలతో పటం – 1 (ఎ.బి) లలో చూపించిన విధంగా బంధించబడి వుంటాయి.

ప్లోరిం – కార్బన్ బంధాలు చాలా బలమైనవి. అరుదైన ఈ అణునిర్మాణమే ఈ పాలిమర్ల కొన్ని అసాధారణ ధర్మాలు (unusual properties) కలిగి వుండడానికి కారణం. డ్యుపాంట్ కంపెని PTFE కి సంక్షిప్తంగా టేప్లాన్ అని పేరుపెట్టింది. టేప్లాన్ కి తక్కువ ఉపరితల ఘర్షణ (low surface fricition) వుండడం వల్ల అది అత్యంత జారిపోయే స్వభావం గల పదార్ధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేరింది. దీనికి నూనె అంటే పడదు. నిరన్నా కూడా గిట్టదు. అంటే నూనె విరోధి (Oleo Phobic (from the Greek (oleo) oil) refers to the physical property of a molecule that is repelled from oil (oil phobic), ) జలవిరోధి (hydrophobic) అన్న మాట. ఇంతవరకూ ఎరిగి వున్న ఏ ఇతర రసాయన పదార్ధం కంటే కూడా యిది ఎక్కువ జడత్వం గల పదార్ధం. ఏ ఇతర పదార్ధంతోనూ రసాయనికంగా చర్య పొందదు.

టేప్లాన్ అరుదైన (unusual) ధర్మాల గురించి విన్న మాక్ గ్రిగోరి (Mac Gregorie) చేపలు పట్టేటప్పుడు తీగలకి చెత్తలు అంటుకొని రాకుండా వుండడానికి వాటికీ టేప్లాన్ పూత పుసాడు. అతని పని సులువైంది. అది చుసిన అతని భార్య నా వంట గిన్నెలకి పుయవా అని అడిగింది. భార్యని సంతృప్తిపరచడానికి అతను వారింట్లోని అన్ని వంటపాత్రలకి పుతపుసాడు. ఆ పాత్రలతో వండుతున్నపుడు వాటికి నూనె, నీరు అతుక్కోవటం లేదు. వండుతున్న పదార్ధాలు పాత్రలకి అతుక్కొని గిన్నెలు అడుగంటడం లేదు. అంట్లు తోముకోవడం ఎంత సులువు ? కాస్త గోరువెచ్చని నీటితో కడిగేస్తే చాలు. ఎంత హాయి ?

మరి దానిని పూత పూస్తారు. ఆ పూత వాటికి ఎలా అంటుకొని ఉంటుంది ? ముందుగా వస్తువు పైకి చాలా వేగంగా ఇసుకను ఊది పడేలా చేస్తారు. దీనిని సాండ్ బ్లాస్టింగ్ (sand blasting) అంటారు. వస్తువుల పై ఏర్పడిన గతుకులలోకి ముందుగ ఒక ప్రమర్ని పూసి తరువాత వాటిలోకి టేప్లాన్ ని ద్రవస్దితిలో చేరుస్తారు. అది ఆ గతుకుల్లో గట్టిపడి ఉండిపోతుంది.

పాత్రలను వాడుకొంటున్న అతని భార్య సంతోషాన్ని చుసిన గ్రిగోరి అటువంటి పాత్రలను తయారు చేసి వాటిని అమ్ముతూ వ్యాపారం చెయవచ్చు కదా అనుకోని పని ప్రారంభించాడు. వాటికి టిఫాల్ (Tefal) కుక్ వేర్ అని పేరు పెట్టారు. చాలా లాభాలు వచ్చాయి. ఆ తరువాత డ్యుపాంట్ కంపెనీ  వారు కూడా అంటుకొని వంటపాత్రలను (Nonstick cook ware) వ్యాపార స్ధాయిలో తయారు చేస్తూ అమ్మకాలను వుదృతం చేసారు. PTFE తోపాటు నాన్ స్టిక్ లక్షణాలు కల అటువంటి అనేక పాలిమర్ పదార్ధాలను కూడా ప్రవేశపెట్టారు. వారు Teflon అనే వ్యాపార నామం (trade name) తోనే పిలుస్తున్నారు.

టేఫ్లోన్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొంటుంది. మంచి కాంతి ధర్మాలుగల పదార్ధం. అందువల్ల అది బయాటిక్ రంగంలోను లిదోగ్రఫిక్ ప్రింటింగ్ లోను, విద్యుత్ ఫార్మన్యూటికల్ రంగాలలోను ఉపయోగపడుతున్నది. అంతేకాక న్యూక్ష్మజీవులు చొరనీయని పేకేజింగులకి డేటా కేబుళ్లకి సెమీ కండక్టర్లకి ఇన్సులెటర్ గా వినియోగపడుతున్నది.

టేఫ్లోన్ వంటపాత్రలను 260 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ వేడిచేస్తే ఆరు కంటే ఎక్కువ విషవాయువులు వెలువడుతాయి. ఈ వాయువులను పీల్చడంతాయి. ఈ వాయువులను పిల్చడంవల్ల టేప్లాన్ ఫ్లూ (Teflon flu) అనే జ్వరం వస్తుంది. పాత్రల పై పూత గిరుకు పోయాక వాడడం మంచిదికాదు. నాన్ స్టిక్ వంటపాత్రల వినియోగంలోని చెడు ప్రభావాల పై పరిశోధనలు జరుగుతున్నాయి.

1938 సవత్సరం ఏప్రిల్ నెలలో శాస్త్రవేత్త తనకి పరిశోధనలో టెక్నికల్ సహాయాన్ని అందిస్తున్న జాక్ రిబోక్ (Jack Rebok) ఇచ్చిన సూచనను పెడచెవిని పెట్టి టేప్లాన్ అవిష్కరణలో కీలకమైన పరిశీలనను (key observation) ఆనాడు చేసి వుండకపోయినట్లయితే శాస్త్రం బయలు పడేదేకాదు.

శాస్త్రవేత్త టేప్లాన్ (PTFE) కి పేటెంట్ తీసుకోన్నాడు. తన వృత్తి జీవిత కాలమంతా (entire career life) డ్యుపాంట్ లోనే గడిపాడు. డ్యుపాంట్ వారికి బాగా లాభాలు రావడంతో శాస్త్రవేత్త కూడా అధిక మొత్తంలో డబ్బు లభించింది. జాక్ రిబోక్ కి అతని ఉద్యోగ విరమణ (retire) సమయములో శుభాకాంక్షలు చెపుతూ డ్యుపాంట్ లో వేరొక విభాగములో మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తి జాక్ రిబోక్ కి టేప్లాన్ ఆవిస్కరణకి ఒక చిల్లగవ్వకూడా ముట్టలేదని తెలుసుకొని తన విభాగం నుండి కొన్ని వందల డాలర్ల పారితోషికాన్ని అతనికి ఇప్పించాడు.

హరోల్డ్ క్రోటో

haroldనానో టెక్నాలజీ పేరు వినని విద్యార్ధి ఉండడు. నానో టెక్నాలజీకి జీవం పోసిన అణువు పుల్లరిన్ లేదా బక్ మిన్ స్టర్ పుల్లరిన్ (buckminster fullerence) దీని రసాయనిక ఫార్మలా C60 అంటే పెద్ద కార్బన్ అణువు. సాధారణంగా కర్బనం కేవలం మూడు బాహ్య భేదాలు లేదా రూపంతరాల (allotropic forms) లో ఉంటుందని అందరం అనుకునేవారము. అధి 1985 సంవత్సరానికి ముందు మాట.

1975-78 ప్రాంతంలో ఓ బ్రిటిష్ శాస్త్రవేత్త కొన్ని నక్షత్రాలలో హడ్రోజన్ కేంద్ర సంలీనం వల్ల కాకుండా కర్బనం (C) , నత్రజని (N), ఆక్సిజన్ (O) కేంద్రక మార్పిడులు ద్వారా కూడా శక్తి విడుదల అవుతుందని ఖగోళ భౌతిక శాస్త్రంలో చదివాడు. అంతే ఆ క్షణంలో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత వల్ల అడపాదడపా అక్కడ ఏర్పడ్డ కర్బన పరమాణువులు, ఎంతో కొంతగా నక్షత్రాలలో ఉండడానికి ఆస్కారమున్న హైడ్రోజాన్ పరమాణువులు కలిసి కొన్ని ఉండడాన్ని ఊహించాడు. లేజర్ వర్ణపటాల సహాయంతో ఇతర వర్ణపట పరిశోధనల ద్వారాను కంతరిక్షంలో కర్బన శృంఖం ధాతువులు ఉన్నట్లు కనుగొన్నాడు. సయనో అఫేలేటి న్ (NC-C=CH) సయనో బ్యుటాడయైన్ (HC=C-C=C-C=N) , సయనో హేక్సట్రయైన్ (HC=C-C=C-C=C-C) వంటి కర్బన శృంఖలాలు (carbon chains) ఖగోళ శున్యములో అక్కడక్కడా ఉన్నట్టు ధృవీకరించాడు.

నక్షత్రాలలో వున్న పరిస్దితుల్ని ప్రయోగాశలలోనే ఏర్పాటు చేస్తే అవే కర్బన శృంఖలాలను తయారుచేసి ఋజువు చేయవచ్చునవి భావించి స్వచ్చమైన బొగ్గును వివిధ వాయువుల సమక్షంలోనూ, వాయురహిత (anaerobic) పరిస్ధితుల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేశాడు. ఆయనే మన క్రోటో . అదే సమయంలో టేక్సాన్ రాష్టం (అమెరికా) ల్ రైన్ విశ్వవిద్యాలయంలో రిచర్డ్స్ స్మాలి (Richarad Smalley) 1943-2050) రాబర్ట్ కర్ల్ (Robert Curl, 1933-) లు కూడా కర్బన శృంఖలాల మీద కర్బన నాశాల (Carbon tubes) మీద కర్బన నారల (Carbon Fibres) మీద ప్రయోగాలూ చేస్తున్నారు. వారి దగ్గర వున్న అత్యధిక ఉష్ణోగ్రతను ఇవ్వగల కొలిమిని (Ultra High temperature furnace) ను ఉపయోగించి నక్షత్రాలలో ఉన్న పరిస్ధితుల్ని కృత్రిమంగా నిర్మించి తాను ఊహించినట్లు కర్బన శృంఖలాలు ఉన్నాయేమోనని తెలుసుకోవడానికి స్మాలి క్లర్కుల సాయాన్ని క్రోటో కోరాడు.

క్రోటో అమెరికాలోని రైన్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న క్రమంలో అనుకోకుండా మెరుస్తున్న మసి (Soot) కనిపించంది. అది మామూలు కిరోసిన్ బుడ్డిలో వచ్చే మసిలాగే వుంది. అంతే అనుకుని కాసేపు దాని గురించి మరచిపోయాడు. ఆ తరువాత ఆ కొలిమిని బాగా శుద్ధం చేయాలని కొన్ని సేంద్రియ ద్రావణాల (Organic Solvents) ను వాడాడు. అంతే, ఆశ్చర్యం ! ఆ ద్రావణాలు రంగుల ద్రావణాలు (Coloured Solutions) గా మారాయి. తానూ గత నెలరోజులుగా వాడుతున్నది కేవలం శుద్ధమైన బొగ్గు  కడ్డిలు. కానీ బొగ్గు ఎందులోనూ ద్రావణాన్ని ఇచ్చే విధంగా కరగదు. మరి ఈ రంగునిచ్చందేవరు?

వెంటనే ఆ ద్రావణాన్ని పరిశోధించగా అందులో ఒకే రకమైన పరమాణువులున్నట్లు అవి కర్బన పరమాణువులేనని 13 CNMR వర్ణపటం మూలక విశ్లేషణ (elemental analysis) లో రుజువైంది. అంటే అణురూపంలో ఉన్న కర్బన మూలకం ఉన్నట్లే. ద్రవ్యరాశి వర్ణపటం చూడగా దాని అనుభారం సుమారు 720 డాల్టన్ లు ఉంది. ఇంకేముంది. అది C60 అయితే 13C   NMR లో శిఖరం (Single Peak) రావడాన్ని బట్టి C60 లో లున్న కర్బన పరమాణువులన్నీ రాసాయనికంగా ఒకే లక్షణాలతో ఉన్నవని తేలింది.

అయితే అప్పటికే ఊహా రసాయనిక శాస్త్రవేత్తలు (Molecular Modeling Chemists) C60 అనే అణువును కంప్యూటర్ సాయంతో ఊహించి దాని ఆకృతిని (Structure), సాంద్రతను (Density) అట్లే విద్యుత్వాహకత (thermal and electrical cunductivities) ను పర్ణపాత లక్షణాల (spectral properties) ను ద్రవీభవన బాష్చిభవన ఉష్ణోగ్రతల (melting boiling points) ను ఊహంచి బొమ్మలు గిశారు. క్రోటో బెంజీన్ ద్రవణంలో కరిగిన ద్రావితం (solute) ను పరిశీలించగా దాదాపు అవే ధర్మాలున్నట్లు రూడి అయ్యింది. కర్బనపు నూతన లేదా 4వ బాహ్య భేదం ఆవిష్కృతమయ్యింది. ఓ ఆధినిక శాస్త్ర సాంకేతిక రంగమైన నానో టెక్నాలజీ (Nano Technology) అనే (ascendance) లభించింది.

కిరోసిన్ దీపానికి పట్టే మసి, పెదల పురిళ్ళలో కట్టెల పొయ్యి బొగ్గుపోయ్యి వాడేటపుడు ఇంటిపైకప్పున పట్టే నల్లని మసిలోనూ ఈ C60 అణువులన్నట్లు రుజువైంది. రిచర్డ్ బక్ మిన్ స్టర్ ఫుల్లర్ (Richard buckminster Fuller) అనే ఒక సివిల్ ఇంజనీర్ పార్కుల్లో ఇనుప కద్దిలతో నిర్మించిన ఉండడం వల్ల దీనిని బక్ మిన్ స్టర్ పుల్లరిన్  అంటున్నారు. ఇందులో 60 కర్బన పరమాణువులు , సమపంచభుజి (regular pentagon), సమషద్బూజి (regular hexagon) రూపాల్లో బంధించుకొని ఫుట్ బాల్ బంతిలాగా ఉండడం వల్ల దీనిని బక్కిబాల్ (Bucky Ball) అని కూడా అంటున్నారు.

ఇందులోని అరవై కర్బన పరమాణువులు తమ చుట్టుపక్కల ఉన్న మూడు కర్బన పరమాణువులతో సిగ్మా బంధం ఏర్పరచుకోవడం వల్ల దృడంగా ఉండే అనువుగా ఉంది. ఇక ప్రతి కార్బన్ కే చెందిన పై ఎలక్ట్రాన్ (electron) అణువు మొత్తాన్ని కప్పేసే మేఘంగా ఉండడం వల్ల తీవ్రమైన విద్యుత్ ప్రవాహకత దట్టమైన రంగు దీనికి వచ్చాయి. ఇపుడు C72 C540 అణువులు కూడా అవిష్కరించబడినాయి.

ఈ నూతన వరవాడులకు రూపశిల్పి అయిన క్రోటో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ ప్రాంతంలో 1939 అక్టోబర్ 7న జన్మించాడు. ఉన్నత విద్య షఫిల్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. తల్లి పోలాండ్ దేశాస్డురాలు. తండ్రి జర్మన్ . వీరు ఇంగ్లాండ్ లో ఎప్పుడో స్ధిరపడ్డారు. చిన్నప్పటి నుంచే క్రోతోకు గణితం, భౌతికశాస్త్రం , రసాయనిక శాస్త్రం మరింత సవాళ్ళు , అద్బుతాలు ఉంటాయని అయన అంటూ వుండేవాడు.

తాను చాలా ఘాటైన నాస్తికుడుగా క్రోటో ప్రకటించుకున్నాదు. శాస్తం మతం (Science Religion) పేరుతో జరిగే అనేక అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని మతాల్లో ఉన్న అశాస్త్రీయతను చాటి చెప్పేవారు. ఈయన పుల్లరిన్ అవిష్కరణకు గుర్తింపుగా 1996 సంవత్సరంలో రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతిని పొందాడు. Beyond belief, Science, Religion, Reason and Survival అనే పేరుతో న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన సదస్సులో ఈయన ప్రసంగం ఎంతో మంది ప్రజాసైన్సు ఉద్యమకారుల్ని మేల్కొలిపింది. ఈ సంవత్సరం జనవరి 5 నుంచి 11 వ తేదిలో ఈయన కేరళ ప్రభుత్వం ఆహ్వానంతో మన దేశంలో పర్యటించి ఎన్నో ఉపన్యాసాలిచ్చాడు. ఎన్నో IIT సాంవత్సరీక సంబరాల్లో విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారతీయ విద్యారిది లోకానకి చేరువయ్యాడు.

ఫ్రెడరిక్ శాంగర్

fredrickవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో పరిశోధనలు చేసే వారికి ఓ కల ఉంటుంది. అలాంటి కలలు కనడం వారి హక్కు అదే ! ఆయా రంగాల్లో నోబెల్ బహుమతి. ఒక శాస్త్రవేత్త తాను సాధించిన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు గుర్తింపుగా నోబెల్ బహుమతి పొందితే తన జీవితం ధన్యమైనట్లు భావిస్తాడు. భారతదేశానికి స్వాతంత్య్రానంతరం విజ్ఞానశాస్త్రరంగాల్లో ఒక్కటంటే ఒక్క నోబెల్ బహుమతి కూడా రాలేదంటే మనం బాధపడేది అందుకే. అలాంటి విశిష్టట ఉన్న నోబెల్ బహుమతిని తన రంగంలో రెండుసార్లు పొందితే ఆ శాస్త్రవేత్త ఎంత ఉప్పొంగిపోతాడో, ఆదేశం ఎంత గర్వపడుతుందో ఆలోచించండి. రెండు నోబెల్ బహుమతులోచ్చినా ఏ మాత్రం గర్వం ప్రదర్శించకుండా ఉండే అయన మనకు ఎంత ఆదర్శప్రాయుడు ? అలాంటి ఆదర్శప్రాయమైన 93 సంవత్సరాల కురువృద్ధుదైనా ఆరోగ్యంగా కనిపించే రసాయన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ శాంగర్.

సాధారణంగా ప్రాయోగిక రసాయనిక శాస్త్రవేత్తలు (experimental chemists) రసాయనాల ప్రభావంతో సాధారణం కన్నా తక్కువ కాలమే బ్రతుకుతాడన్న నానుడి ఉండగా మీరింత కాలం ఇంత ఆరోగ్యంగా నిబ్బరంగా ఎలా ఉండగలగు తున్నారు ? అని పత్రికా విలేకరులు అడగ్గా అయన ఇచ్చిన సమాధానం ఇదే !

ప్రకృతిని ప్రేమిస్తూ సత్యాన్వేషణే పరమావధిగా జీవించే వారికీ రోజువారీ వ్యక్తిగత సమస్యలు ఏవీ వారిని ఆందోళనకు గురిచేయవు. ఆందోళనే ఆరోగ్యానికి ప్రధమ శత్రువు. సరైన ఆహారనియమాలు వ్యాయామం మంచి అలవాట్లు ప్రతి శాస్త్రవేత్తకు అవసరం.

ఫ్రెడరిక్ శాంగర్ రసాయనిక శాస్త్రంలో రెండు సార్లు నోబెల్ బహుమతిని పొందిన ఏకైక శాస్త్రవేత్త. 111 సంవత్సరాల సుదీర్ఘ నోబెల్ బహుమతుల చరిత్రలో ఒకే రంగాంకి రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు ఇద్దరు ఉన్నారు. భౌతికశాస్త్రంలో బర్డిన్, రసాయనిక శాస్త్రంలో శాంగర్. వేర్వేరు శాస్త్రరంగాలకు గాను రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త మెరిక్యూరీ అని మీకు ఇప్పటికే తెలుసుననుకుంటాము. రంగాలేవైనా రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త కేవలం నలుగురే. లైనస్ పోలింగ్ (1901-1994, 1954 రసాయనిక శాస్త్రం, 1962 - శాంతి), మేరీక్యూరీ (1867-1934, 1903 భౌతిక శాస్త్రం, 1911 రసాయనిక శాస్త్రం) 3 జాన్ బర్డిన్ – (1908-1991, 1956, 1972 – భౌతిక శాస్తం) , 4 ఫ్రెడరిక్ శాంగర్ 1918 - , 1958, 1980 – రసాయానిక శాస్త్రం)

ఫ్రెడరిక్ శాంగర్ తండ్రి పేరు కూడా ఫ్రెడరిక్ శాంగరె. తల్లిపేరు సినిలీ ! ఆగష్టు 19, 1918 తేదినాడు ఇంగ్లాండు దేశపు గ్లౌసెస్టర్ షైర్ దగ్గరున్న గ్రామంలో మన ఫ్రెడరిక్ శాంగర్ పుట్టాడు. తండ్రి శాంగర్ మన శాంగర్ తో పాటు మరో కుమారుడ్ని మాట పరమైన సేవాబృందంలోకి మార్చాలని అక్కడ అభ్యాసం చేయించాడు. కానీ మన శాగర్ కు మతం కన్నా ప్రకృతిని అర్ధం చేసుకోవడంలో గొప్ప అనక్తిని కనబర్చేవాడు. క్రమేపి శాస్త్రవిజ్ఞానంతోపాటు ప్రపంచ శాంతి కోసం ఆందోళన చేసే పిన్  ప్లేడ్జ్ యూనియన్ (Peace pledge union) కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవాడు. రెండవ ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేయడానికి విద్యార్ధి దశలో నిరాకరంచాడు.

కళాశాల విద్యాభ్యాసం పూర్తయ్యాక పిహచ్.డి పట్టాకోసం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరాడు. అయన పరిశోధనాంశం గడ్డినుంచి పోషక మాంసకృత్తుల్ని వేరు చేయడం. గడ్డి అంటే సాధారణంగా సెల్యులోజ్ అందులో నత్రజని శాతం ఏమీ ఉండదు. కానీ అందులోకే నత్రజని పంపి పాలిపేఫైడుగా మార్చాలన్నది శాంగర్ ప్రోటీన్ల గురించి వేశేషంగా చదివాడు. క్రమేపి ఆయన ఆసక్తి గడ్డినుంచి మానవ శరీరంలో ఉన్న ప్రోటీన్లు ఎంజైములుగా, హార్మోన్లుగా ఎలా పనిచేస్తాయో తెలుసుకోనే పరిశోధనల వైపుమళ్లింది .

1951లో మన శరీరంలోని రక్తంలో గ్లూకోజ పరిమాణాన్ని క్రమబద్దికరించే ఇన్సులిన్ అనే హర్మోనులోని మాంసకృత్తులలో అమైన అమ్మలనే పూసలు ఏ క్రమంలో అమరి ఉన్నాయో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో అయన అప్పటికే కొంచెం కొంచెంగా అనువర్తనాలకు లోనవుతున్న క్రోమటో గ్రఫిని వాడుతూనే ఎలక్ట్రోఫోరాసిస్ అనే కొత్త పద్దతిని రంగంలోకి తీసుకోచ్చాడు. చివరికి ఇన్సులిన్ లోని ప్రోటిను నిర్మాణాన్ని చేదించాడు. ఈ కృషికి గుర్తింపుగా 1958 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ ను గెల్చుకున్నాడు.

శరీరంలో వివిధ ప్రోటీన్లను ఎంజైములను, హార్మోనులను ఎపుడు ఇలా తయారు చేయాలన్న నియమ నిబంధనలు జీవకణంలో ఉన్న కణకేంద్రకం (Cell nucleus) లో ఉన్న క్రోమోజోముల DNA లో రహస్యంగా దాగున్నాయని గ్రహించాడు. ఈ నియమనిబంధనలు డిఎన్ఎ నిర్మాణంలో అంతర్భాగంగా ఉన్న కోడాన్ల శ్రేణి (Codon sequnce) నిర్ణయిస్తుందనీ అవే జీన్లు అనీ ఆకశింపు చేసుకున్నాడు . అంటే డిఎన్ఎలో గుయనైన్ (G), సైటోసిన్ (C), ధయమిన్ (T), అడినైన్ (A), అనే నత్రజని క్షారాలు ఏ వరుసక్రమంలో ఉన్నాయన్న రసాయనిక భూమిక మీద (Chemical bafif) సమయాల్లో ఆయా రకాల మీద ఆధారపడి ఆయా ప్రోటీన్లు ఏర్పడి అవి శరీరానికి వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉపయోగ పడతాయని తేల్చుకున్నారు పద్దతిని రూపకల్పన చేశాడు.  ఈ పధ్ధతి మీద ఆధారపడే నేడు ఉన్న ప్రాణుల జినోమ్ లు తెలుసుకున్నారు. ఈ మధ్యనే మానవ జినోమ్ (Human Genome) ను కూడా తేల్చారు. శాంగర్ చేసిన డిఎన్ఎ పరిశోధనలకు గుర్తింపుగా రెండోసారి 1980 లో మళ్ళి నోబెల్ బహుమతిని పొందాడు. శాంగర్ మనకు ఆదర్శప్రాయుడు.

ఫ్రెడరిక్ శాంగర్ గురించి ప్రపంచంలో అత్యంత గౌరవాన్ని పొందుతున్న Science అనే పరిశోధనా పత్రాల మ్యాగజైన్ ఏమన్నదో గుర్తించండి.  ఫ్రెడరిక్ శాంగర్ ని మీరు కలిస్తే ప్రపంచంలో అత్యంత నిరాడంబరుణ్ణి అనుకువల గల వ్యక్తిని సమ్రతగల మనిషిని మర్యాదస్తుణ్ణి అణుకువల గల వ్యక్తిని నమ్రతగల మనిషని మర్యాదస్తుణ్ణి కలిసిన అనుభవం మీకు కల్గుతుంది. ఆయనను BBC వాళ్ళు మిగిలిన మీడియా కలిసి మతం మీద వ్యాఖ్యానం చేయమంటే ఆయన ఏమన్నాడో చేయమంటే ఆయన ఏమన్నాడో అయన మాటల్లోనే చదవండి.  నెను క్రైస్తవ గురువు కావాలని మా నాన్న నన్ను పెంచారు. జీవితంలో నేను చాలా కాలం పాటు మాట విశ్వాసాలలో పెరిగాను. కానీ శాస్త్రాభ్యాసం చేసే క్రమ్మంలో నేను క్రమేపి మతభావాలను దూరమయ్యాను. సత్యాన్వేషణ చేసేవాళ్ళు విధిగా ఋజువుల కోసం పరితపించాలి. దైవం ఉన్నాడనేందుకు నాకు ఋజువులు కనిపించడం లేదు. ఎంత  మొగమాటంలోనైనా దేవుడున్నాడని అనుకుందామనుకున్నా నాకు వీలు కావడంలేదు. నాకు తప్పనిసరిగా ఋజువుకావాలి. ప్రపంచ శాంతికి మతమే మార్గంకాదు.

డేన్ షెట్మన్

shechtman2011 సంవత్సరపు రసాయనిక శాస్త్ర నోబెల్ బహుమతి గెలుచుకున్న డేన్ షేటిషన్ వయస్సు 70 సంవత్సరాలు. ఈయన ఇజ్రాయిల్ నాటి పాలస్తీనా)లో టెల్ అవివ్ లో,  1941వ సంవత్సరం జనవరి 24వ 1 తేదీన జన్మించాడు. 1966లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బియస్సీ పూర్తి చేసుకుని 1968లో పాదార్థిక లో సాంకేతిక శాస్త్రం (Materials Engineering) లో M.Sc పూర్తి కే చేసుకున్నాడు. అదే టెన్సియన్ విశ్వవిద్యాలయంలో 1972లో "డాక్టరేట్" (Ph.D) పట్టా పొందాడు, 1981 నుంచి 1983 మధ్య కాలంలో జాస్ 1 హాప్కిన్స్ విశ్వవిద్యాలయం (అమెరికా) లో అల్యూమినియం టైటానియం మిశ్రమ లోహాల (alloys) మీద పరిశోధనలు చేస్తున్న క్రమంలో - ఆయనకు వింత గొలిపే విధంగా కొన్ని స్ఫటికాల X - కేరణవివర్తనా (X-Ray -  distraction) చిత్రాలు కనిపించాయి.

అంతవరకు ఉన్న భౌతిక రసాయనిక శాస్త్రాల సిద్ధాంతాల ప్రకారం సూక్ష్మమైన ఘన పదార్ధాలు  వైస్ లాటిస్ (Bravais Lattices) అనే 14 రకాలయిన ప్రమాణ స్ఫటిక  మాత్రిక (unit cell) లుగానే - పేర్చుకొంటాయి. అంటే పదేపదే ఆవర్తనం (Periodic) చెందేలా a,b,c అనే 3 అక్షాల దిశలో పోగుపడ్డాయి. అంటే పటంలో చూపిన 14 బొమ్మల్ని 14 రకాల  ఇటుకలనుకుంటే, మొత్తం ఘన పదార్ధం ఓ పెద్ద అరుగు (planck) అనుకుంటే ఇందులో ఏదో ఒకవిధమైన ఇటుకను పొడవు (a) , వెడల్పు (b). ఎత్తు (c) ల వైపు పేర్చుకొంటేనే ఘసం తయారవుతుంది. మరే ఇతర పద్దతి శ్రీ ద్వారా ఘనాకృతి ఏర్పడదు. కానీ షెట్షన్ తయారు చేసిన మిశ్రమలోహ స్పటికాలలో అలాంటి స్పటిక ప్రమాణాలు లేవు. X- కిరణ వివర్తన పటాలు అందుకు భిన్నంగా కన్పించాయి.

ఆనందం పట్టలేక తనలాంటి శాస్త్రవేత్తలకు చెప్పాడు. కానీ అందరూ ఎగతాళి చేశారు. ఆయన పరిశోధనల్లో ఇకాసా హెడ్రాన్, డోడెకా హైడ్రాన్ రూపాల్లో ఉన్న ప్రమాణ స్పటిక మాత్రికలు ఉన్నట్లు రూఢి అయ్యింది, సాధారణ స్పటికాల సౌష్టవంలో ఓ అంశం ప్రధానం. వాటన్నింటిలో ట్రాన్స్లేషనల్ సౌష్టవం (translatinal symmetry) ఉంటుంది. అంటే ప్రమాణ స్ఫటిక మాత్రికకు a,b,c దిశల్లో పదేపదే ఆవర్తనమయ్యేలా ఉంటాయి. కానీ పెట్మన్ స్పటికాలలో ఇలాంటి ట్రాన్స్లేషనల్ సౌష్టవం లేదు. ఎందుకంటే ట్రాన్స్లేషనల్ సౌష్టవం ఉండాలంటే ఆ మాత్రికలకు ఘనాకర సౌష్టవం (cubical symmetry) ఉండాలి. బ్రావైస్ స్పటికాలు ఏదో ఒక విధమైన ఘనాకారాలే. కానీ ఇకాసా హైద్రాస్, డోడెకా హైడ్రాన్లకు ఘనాకారం లేదు. అందువల్ల అవి a, b, c అడ్డాలంటూ ఉండేలా వునపదార్ధాన్ని ఏర్పచలేవన్నది షెట్ మన్ కు పూర్వం వైజ్ఞానిక ప్రపంచంలో ఉన్న నమ్మకం. అందువల్లే పెట్రోమెన్ ఇలాంటి స్పటికాలను క్వాసి స్పటికాలు (అసంపూర్ణ లేదా పాక్షిక స్పటికాలని) వినమ్రంగా ప్రకటించాడు.

కానీ ఎవరూ ఆయనను నమ్మలేదు. పైగా అప్పటికే ప్రొఫెసరైనా ఆయనకు వాళ్ళ సంస్థ అధిపతి ఓ మామూలు పాఠశాల స్థాయి భౌతికశాస్త్రం పుస్తకం చేతికిచ్చి దీన్ని మళ్ళీ బాగా చదువు అంటూ ఎద్దేవా చేశాడు. ఆయన తన పరిశోధనలను Journal of Applied Physics అనే పరిశోధనా పత్రికకు పంపగా వాళ్ళు దానిని ముద్రణకు అనర్హమైనదిగా త్రిప్పిపంపేశారు. ఆ అవమానం సంనకు కలిగిన అవమానంగా విశ్వవిద్యాలయం భావించి పెట్రీమనసు పరిశోధనల నుంచి తొలగించి పాఠాలు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం చేశారు. ఆఖరికి అత్యంత మేధావిగా పేరు పొందిన లైనస్ పౌలింగ్ కూడా షెట్మన్ చెప్పే పాక్షిక స్పటికాలంటూ ఎక్కడా లేవనీ కేవలం పాక్షిక శాస్త్రవేత్తలే ఉన్నట్లుందని ఎగతాళిచేశాడు. కానీ ఆయన తన పట్టుదల వదల్లేదు. పాక్షిక స్పటికాలు ఈ ప్రపంచంలో ఉన్నాయని, అది కూడా ఓ విధమైన పదార్థ నిర్మాణ రూపమని, ఇది ప్రకృతి సిద్ధమని ప్రచారం చేస్తూనే ఉండేవాడు. చివరకి ఓ సాధారణ సాదాసీదా పత్రికలో తన పరిశోధనల్ని ప్రచురించాడు. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ తమతమ ప్రయోగాల ద్వారా షెట్మన్ చేసిన ఆవిష్కరణ నిజమేనని బుజువు చేశారు.

క్వాన్ క్రిస్టల్స్ (పాక్షిక స్పటికాలు) అనేవి నిజమేనని పంచముఖ సౌష్టవం ఉండేలా అవి తయూరుకాగలవలని బుజువు అయ్యింది. ఇప్పుడు క్వాసీక్రిస్టల్స్ ద్వారా అతి దృడమైన ఉపరితలాలను, అంచుల్ని తయారుచేసి అత్యంత వేడిని, యాంత్రిక తాడనాన్ని, రాపిడిని తట్టుకోగల పద్ధతిలో పదార్థాల ఉపరితలాలను చేసేవీలయ్యింది. కత్తులు, బ్లేడ్లు, సూదులు, కొడవళ్ళు, - రైలువ ట్బాలు, లోహచక్రాలు, ఇంజనులోని గేర్లు, సిలిండర్లు, క్వాసి - క్రిస్టల్స్‌తో రూపొందితే అవి విపరీతమైన పరిస్థితులను తట్టుకోగలవని, ఎక్కువ కాలం మనగలవని ఋజువయింది. వంట పాత్రల లోపలి గోడల్ని క్వాసి క్రిస్టల్స్‌తో రూపొందిస్తే అవి దశాబ్దాల పాటు ఎంత వేడినైనా తట్టుకోగలవు. వజ్రం కన్నా దృఢమైన ఉపరితలాలను చేసి బోరు బావుల త్రవ్వకాలకు ఉపయోగిస్తున్నారు. షెట్మన్ దృఢ సంకల్పం, వజ్రం లాంటి పట్టుదల ఆయనను అవమానాలను అధిగమించి 2011 నోబెల్ బహుమతి పొందేలా చేశాయి. సత్యాన్వేషణే ఆయుధంగా పట్టుదలే ధ్యేయంగా ముందుకు వెళ్ళడమే శాస్త్రవేత్తల పని అని ఆయన చెప్పారు.

సి.ఎన్.ఆర్. రావు

స్వతంత్ర భారతదేశంలో ప్రజలే ప్రభువులు కాబట్టి బిరుదులుండవు గాని పురస్కారాలుంటాయి. బిరుదుల్ని పేర్ల ముందు రాసుకోవచ్చు. కాని పురస్కారాలను రాయరు. ఈ పురస్కారాలను ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'. ఈ పురస్కారం ఈ సారి అంటే 2014 సంవత్సరానికి ఒక క్రీడాకారుడు, ఒక శాస్త్రవేత్త ఇరువురుకీ ప్రదానం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో ఒకరు సచిన్ టెండుల్కర్ కాగా మరొకరు ప్రఖ్యాత పాదార్థిక రసాయన శాస్త్రవేత్త సి. ఎస్. ఆర్.రావు.

జనవరి 26, 2014 వేడుకల్లో భారతరత్న పురస్కారం అందుకొన్న తర్వాత ఈ పురస్కారం పొందిన మూడవ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందుతాడు. 1954లో సర్ సి.వి.రామన్, 1997లో ఏ.జి.జె. అబ్దుల్ కలామ్ ఈ గౌరవం పొందారు.

జవహర్ లాల్ నెహ్రూ ఉన్నత శాస్త్ర పరిశోధనా కేంద్రానికి గౌరవాధ్యక్షుడు, ప్రధానమంత్రి శాస్త్ర సలహా మండలి అధ్యక్షుడు, అంతర్జాతీయ పాదార్థిక శాస్త్ర విజ్ఞాన కేంద్రానికి సంచాలకుడూ అయిన సి.ఎన్.ఆర్.రావు పూర్తి పేరు చింతామణి నాగేశరామచంద్రరావు. బెంగళూరులో 30 జూన్ 1934లో పుట్టిన హనుమంత నాగేశరావు, నాగమ్మ దంపతులకు ఏకైక సంతానం. చిన్నప్పుడు బడికి వెళ్లకుండా ఇంటిలోనే తల్లి దగ్గర హిందూ సాహిత్యాన్ని, గణితాన్ని తండ్రి దగ్గర ఆంగ్లభాషనీ నేర్చుకున్నాడు. 1940లో ఆరేళ్ళ వయస్సులో బడిలో చేరి 1944లో ఏడవ తరగతి పాసయ్యాడు. పదేళ్ళ వయస్సులో హైస్కూలు 'ఆచార్య పాఠశాల'లో చేరి 1947లో ఎస్. ఎస్. ఎల్.సి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

jan02.jpgఈ బడిలో ఆయన తన మాతృభాష కన్నడం మాధ్యమంలోనే విద్యనభ్యసించాడు. ఇక్కడే ఆయనకు రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. కొడుకు మాతృభాషా మాధ్యమంలోనే విద్యనభ్యసించాడు. ఇక్కడే ఆయనకు రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి ఏర్పడింది. కొడుకు మాతృభాషా మాధ్యమంలోనే విద్యనభ్యసించాలని తండ్రి అతడ్ని కన్నడ మాధ్యమం మాత్రమే ఉన్న ఆచార్య పాఠశాలలో చేర్పించాడు, కానీ ఇంట్లో అతడితో ఆంగ్లంలో సంభాషించేవాడు. అతడు సెంట్రల్ కళాశాల, బెంగుళూరులో బీఎస్సీ ప్రథమ శ్రేణి పట్టాని 1951లో మైసూర్ విశ్వవిద్యాలయం నుండి పొందాడు. అప్పటికి సిఎన్ ఆర్ వయస్సు 17ఏళ్ళు మాత్రమే.

తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో చేరి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా గానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ చేయాలని అనుకుంటే అతడి ఉపాధ్యాయుడొకరు అతడ్ని బెనారస్ హిందూ యూనివర్శిటీలో చేరమని ప్రోత్సహించడంతో కాశీకి వెళ్ళాడు. అక్కడ రసాయన శాస్త్రంలో ఎమ్ఎస్సీ పటాని తీసుకున్నాడు. 1953లో పిహెచ్డి చేయటానికి ఐ.ఐ.టి ఖర్గపూర్లో చేరదామనుకున్న తరుణంలో అతడికి అమెరికాలోని యూనివర్సిటీలు యం.బి.టి., పెన్ స్టేట్, కొలంబియా, పర్ డ్యులు ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఆయన ఇండియానా రాష్ట్రంలోని పర్ డ్యుని ఎన్నుకున్నాడు.

1954లో అతడి మొదటి పరిశోధనా పత్రాన్ని 'ఆగ్రా యూనివర్సిటీ జర్నల్ ఆఫ్ రీసెర్చ్'లో ప్రచురించారు. కేవలం రెండేళ్ళ తొమ్మిది నెలల్లోనే ఆయన తన ఇరవైనాల్గవ ఏట 1958లో డాక్టరేట్ పట్టాని పొందాడు. బెంగుళూరు తిరిగివచ్చి ఐ.ఐ.యస్.సిలో లెక్చరర్‌గా నెలకు రూ. 500 వేతనంతో 1959 లో చేరి తన స్వంత పరిశోధన మొదలెట్టిన అతడ్ని ఐ.ఐ.టి. కాన్పూర్ లో రసాయన శాస్త్ర విభాగాధిపతిగా చేరాల్సిందిగా సంచాలకుడు పి.కె.కేల్కర్ ఆహ్వానించాడు. 1963 నుండి 1976 వరకు కాన్పూర్ లో వున్నప్పుడు అతడ్ని 'ఫెలో ఆఫ్ ఇండియస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'గా ఎన్నుకున్నట్లు సి.వి.రామన్ ఆయనకు వర్తమానం పంపాడు.

1976లో తిరిగి ఐ.ఐ.యస్ సిలో చేరి ఘన స్థితి, నిర్మితి రసాయన శాస్త్ర యూనిట్ ప్రారంభించాడు. ఘనస్థితి ఇంధనాలు కృత్రిమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించడానికి ఉపయోగపడతాయి. 1984 నుండి 1994 వరకు ఆయన ఐ.ఐ. యస్ సి కి సంచాలకునిగా పని చేశాడు. పర్ డ్యూ, ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జ్, కాలిఫోర్నియా యూనివర్శిటీలకు సందర్శక ఆచార్యులుగా విధులు నిర్వర్తించారు. ఆయన లోహపు ఆక్సైడ్లు చెందే మార్పుల మీద, పదార్థాల ధర్మాలు, వాటి నిర్మితికి వున్న సంబంధాల మీద పరిశోధనలు చేశాడు. ద్విపరిమాణ లాంథసైడ్ క్యూపేటీని సంశ్లేషణ చేసిన మొదటి శాస్త్రజ్ఞులలో సిఎన్ ఆర్ రావు ఒకరు. ఈ పరిశోధనలు నియంత్రిత లోహ ఆవాహకాలను రూపొందించడంలో సహాయపడ్డాయి. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద సూపర్ కండక్టర్లు, అయస్కాంత నిరోధకంగా వాటి తయారీలోనూ ఉపయోగపడ్డాయి. సెమీ ఆక్సైడ్ కండక్టర్లు, నానో పదార్థాలు, హైబ్రిడ్ పదార్థాలు తయారు చేయడంలో సిఎన్ఆర్ రావు కృషి చేశాడు.

ఐదు దశాబ్దాల పరిశోధనా కృషిలో సుమారు 1500 పరిశోధనా పత్రాలను, 45 గ్రంథాలను వెలువరించారు.

jan03.jpg'భారతరత్న పురస్కారం ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మనదేశంలో పాలకులు సైన్పు పరిశోధనలకు కేటాయిస్తున్న నిధులు అత్యల్పంగా వుండటం తెలివితక్కువతనమని వ్యాఖ్యానించారు. ఇస్రో సంస్థ కృత్రిమ ఉపగ్రహాల నమూనాలను తిరుపతి వెంకన్న పాదాల ముందుంచి ఆశీస్సులు కోరడం మూఢనమ్మకమని ఆక్షేపించాడు. తనకు అటువంటి మూఢనమ్మకాలు లేవని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు వచ్చిన పురస్కారాలు, బహుమతులు లెక్కలేనన్ని! ఇటీవలే చైనా ప్రభుత్వం ఆయనను 'చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో గౌరవ విదేశీ సభ్యునిగా నియమించింది. ఈ గౌరవం లభించిన మొదటి విదేశీయుడు ఆయనే.

డాక్టర్ పి.కె.కె. నాయర్

pkknayarమన చుట్టూ లెక్కలేనన్ని మొక్కలు, చెట్లు, రంగురంగుల పూలు. చూసే వాడికి కనులపండుగే. అయితే ఈ రకరకాల మొక్కలు పూలు పూసేవి. పూలే పూయనివి ఇవన్నీ ఎలా వచ్చాయి ఈ భూమ్మీదకు వీటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఆ బంధాన్ని పసిగట్టేదెలా? ఆవిర్భావం నుంచి మొక్కలు పూస్తూనే ఉన్నాయా? పుష్పించే మొక్కలకు కూడా పూర్వ చరిత్ర ఉందా? అంటే... ఉందనే సైన్సు నిర్ధారణ చేసింది. నిజానికి అది అపూర్వ చరిత్ర ఎందరో పరిశోధకులు, శాస్త్రవేత్తలు మొక్కకూ, మొక్కకూ మధ్య వుండే బాదరాయణ సంబంధాన్ని వివరించేందుకు అనేక మార్గాలనెంచుకున్నాను. పరమేశ్వర్ కృష్ణన్ కుట్టి నాయర్ మాత్రం అందుకు పరాగ రేణువులను ఎంచుకున్నాడు. మొక్కల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అతి కీలక పాత్ర పోషించే పరాగరేణువులను కదిపితే చాలు మొక్కల కథలు జాలువారుతాయి. పూలను చూసి ఆనందించని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు. కానీ ఎందరు ఆ పూవు పొడిని అమూలాగ్రంగా పరిశీలించారు? అలా పుప్పొడిని పరిశీలించి, పరిశోధించి దాన్ని ఒక శాస్త్రంగా బారతదేశంలో నిలబెట్టినవాడు డాక్టర్ నాయర్. అందుకే ఆయనను భారత పరాగ రేణువు పితామహుడని అంటారు. సూక్ష్మదర్శినితో చూస్తే ఒక్కో పరాగరేణువు ఒక్కో స్వరూపంతో, భిన్న నిర్మాణంతో తీరొక్క విధంగా కనిపిస్తాయి. పరాగరేణు స్వరూపాన్ని బట్టి మొక్కలను వర్గీకరణ చేయవచ్చునని రూఢీ చేసిన వాళ్లలో నాయర్ ముఖ్యుడు.

పరాగరేణువు శాస్త్ర నిర్వచనాన్ని విస్తృతం చేశాడు నాయర్. ఇది కేవలం పరాగరేణు స్వరూపానికే పరిమితమైంది కాదని చెప్పాడు. పరాగకోశంలో పరాగరేణువు ఏర్పడిన క్షణం నుంచి పుప్పొడి గాలిలో కలిసి మరో పువ్వును చేరుకొని దాని అండంలో సంయోగం చెందే వరకు, అది విత్తనంగా రూపుదిద్దుకునే క్రమం అంతా ఒక అద్భుతం. ఒకటి పరాగరేణు దశ అయితే, మరొకటి విత్తన దశ. ఈ క్రమాన్నంతా అధ్యయనం చేయడంలో పరాగరేణు శాస్త్ర విశిష్టత ఉందని డాక్టర్ నాయర్ పేర్కొన్నాడు.

పరాగరేణువు ప్రత్యేకమైన కణం. దాన్ని అల్లుకుని రక్షించే పొరలు, బాహ్యంగా ఎక్సైస్, లోపల అంతరపొర, బాహ్యపొరపై ఉండే అలంకరణ, రంధ్రాలు కేవలం పరాగరేణువుల మద్య తేడాలను చూపించడమే కాకుండా వాటి పరిమాణాన్ని సైతం చూపిస్తాయి. పరాగరేణు నిర్మాణం, తదితర లక్షణాల ఆధారంగా నేటి పుష్పించే మొక్కలు మూడు పాదులుగా పరిణామం చెందాయని ఆదారాలతో నిరూపించాడు డాక్టర్ నాయర్.

పుష్పించని ప్రాథమిక మొక్కలుగా పేర్కొనబడే శైవలాల సిద్ధ బీజాలు నిర్థిష్ట రూపం లేకుండా ఉంటాయి. శైనాలాలు అంటే అభివృద్ది చెందిన మొక్కలైన నాచు టెండోఫైట్లు, వివృత బీజ మొక్కలు మాత్రం బహు రూపకత్వాన్ని కలిగి ఉంటారు. చిత్రం ఏమిటంటే పుష్పించే మొక్కల్లో ప్రాథమికమైన వాటిలో త్రిరూపకత కనబడుతుంది. దీన్ని బట్టి నాయర్ పుష్పించే మొక్కల పరిణామం మూడు పాయలుగా జరిగిందని నిర్థారించారు. పరాగరేణువుల అధ్యయనాన్ని నాయర్ కేవలం మొక్కల పరిణామాన్ని అర్థం చేసుకునేందుకే వినియోగించుకోలేదు. గాలి ద్వారా వ్యాప్తి చెందే పరాగరేణువుల వలన మనుషులకు అలెర్జీ వంటి అనేక ఆరోగ్య సమస్యలు రావటాన్ని గమనించాడు. అలాగే పరాగరేణువుల అధ్యయనం నేర నిర్థారణకు కూడా తోడ్పడుతుందని, ఆయా ప్రాంతాల్లో ఏ రకం మొక్కలు వ్యాప్తి చెందాయో తెలుసుకోవచ్చునని వివరించాడు. దీనితో ఈ శాస్త్రం అనేక ముఖ్యమైన శాస్త్రాలుగా శాఖోపశాఖాలుగా విస్తరించింది.

అంతేకాదు పుప్పొడిని సేకరించి, దాన్నుండు తేనెను జమచేసే తేనెటీగలు, పరాగరేణువులకు మధ్య వుండే సంబంధాలను తెలియజేసే మెల్లిలో పేలినాకే ఇటీవలి కాలంలో బాగా అభివృద్ధి చెందింది. శిలాజ పరాగరేణువుల అధ్యయనం భూమిలో దాగి ఉన్న ఇంధన నిల్వలను కనిపెట్టగలవని వెల్లడైంది. కేరళ రాష్ట్రంలో చెంబనసెరిలో 1930 ఫిబ్రవరి 6వ తేదీన జన్మించిన నాయర్ ఈ రోజుల్లో గొప్ప విద్యా కేంద్రంగా విలసిల్లిన బెనారస్ హిందూ యూనివర్సిటిలో చదివాడు. 1952లో వృక్షశాస్త్రంలో అగ్రగణ్యుడుగా ఉత్తీర్ణుడైనాడు. లక్నో విశ్వవిద్యాలయం నుండి పి.హెడ్.డి  పట్టా  పొంది బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ లో పనిచేశాడు. జాతీయ వృక్ష పరిశోధనా సంస్థ 1958 లో చేరి బహుకాలం పని చేశాడు. కొంతకాలం తిరువనంతపురంలోని ఉష్ణమండల వృక్ష ఉద్యాన పరిశోధన సంస్థకు ఉపసంచాలకులుగా కృషి చేసినాడు.

మొక్కలే కదా, పూవ్వులే కదా, అనుకునే అందరికీ శాస్త్రీయ అధ్యయనంతో ఓ చిన్న పరాగరేణువు కూడా అనంత విశ్వ రహస్యాలను ఛేదించడంలో తోడ్పడగలదని నిరూపించిన సమకాలీన శాస్త్రవేత్త డాక్టర్ పి.కె.కె. నాయర్.

డా. రాజీవ్ వార్షినీ

rajiv‘తిండి గలిగితే కండగలదోయ్, కండకలవాడేను మనిషోయ్’ అన్న గురజాడ మాటల్ని నిజం చేయాలంటే ప్రతీ మనిషికీ కడుపునిండా తిండి అవసరం. పౌష్టికాహార లోపాలతో, రోగాలతో కునారిల్లే ప్రజలున్నప్పుడు దేశ ప్రగతి సాదించలేదు. అందుకే 2016 వ సంవత్సరం అంతర్జాతీయ అపరాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంగతి మీకు తెలుసు.

మన ఆరోగ్యానికి కీలకమైన ప్రోటీన్లనందించే పప్పుజాతి పంటలపై పరిశోధనలు చేసి మానవాళికిసేవ చేస్తున్న శాస్త్రజ్ఞుల్లో డా. రాజీవ్ కుమార్ వార్షినీ చెప్పుకోదగిన వ్యక్తి. 1973 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ దగ్గర బాజోయేల్ జన్మించిన వార్షినీకి భారతదేశంలే శాస్త్రరంగంలో విశిష్ట పరిశోధనలు చేసినందుకిచ్చే అత్యున్నత శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును 2015 లో ఇచ్చి గౌరవించారు.

అణు జీవశాస్త్రంలో ఆధునాతన పరిశోధనలు చేస్తున్నారు వార్షిని. నీటి ఎద్దడిని, వ్యాధుల్ని తట్టుకునే వేరుశనగ రకాలను గుర్తించి మేలురకం  పంటల కోసం సంకర చేయటానికి తొలి తరం అణుజీవ రకాలను అభివృద్ధి చేశారు. కంది, వేరుశనగ, శనగలు, బార్లీ గోధుమ వంటి అనేక పంటలపై పరిశోధన చేసి మంచి లక్షణాలను సూచించే వేలాది మార్కర్లను పరిశోధనలకు అందించారు. మీరు మానవ జీనోమ్ గురించి విని వుంటారు. అలాగే మన మొక్కల పూర్తి జన్యు పటాలను కూడా తయారు చేసి ఆధునిక పరిశోధనలకు బాటవేశారు. మంచి శనగ, కంది, వేరుశనగ వంటి పంటల జన్యు చిత్రాన్ని మొట్టమొదటిసారిగా డా. వార్షనీ పరిశోధించి వెలువరించారు. మంచి శనగలో నీటి ఎద్దడిని తట్టుకునే జన్యువులను గుర్తించినారు. వేరుశనగపై వచ్చే ఆకుమచ్చ వ్యాధులను నిలువరించే జన్యు సమాచారాన్ని బయటపెట్టారు.

కేవలం పప్పు గింజలు (అపరాలు) పంటలే కాక గోధుమ, బార్లీ పంటల్లో గింజల పరిమాణం ప్రోటీన్ల శాతానికి సంబంధించి అణుజీవ మార్కర్లను కనిపెట్టారు. వేరుశనగలో నూనె క్వాలిటీని పెంపొందించే జన్యువులను సైతం డా. వార్షినీ పరిశోధనలంటే ఎక్కువగా గోధుమ, వరి వంటి పంటలపై చేస్తూ ఉండేవారు. డా. వార్షీనీ కృషితో అనాధలుగా మిగిలిన అపరాలు (పప్పు జాతులు) ఆధునిక జన్యుశాస్త్ర పరిశోధనలకు మంచి వనరుగా మారాయి. అంతర్జాతీయ అపరాల సంవత్సరంగా మనం పప్పు పంటల ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసే ఈ ఏడాది డా. వార్షినీ వంటి శాస్త్రజ్ఞుల కృషిని గుర్తుచేసుకోవడం అవసరం.

డా. వార్షీనీ అంతర్జాతీయ సైన్సు ప్రపంచం కూడా గుర్తించి అనేక అవార్డులూ, రివార్డులూ ఇచ్చింది. ఎన్నో ప్రతిష్టాత్మకమైన సైన్సు పరిశోధనా పత్రికలు వార్షినీ కి తమ సంపాదక మండలిలో స్థానం ఇచ్చి గొప్పగా గౌరవించాయి. అనేక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సభలకు నేతృత్వం వహించినారు. వార్షినీ తల డిగ్రీ, పి.జి. విద్యను అలీఘర్ యూనివర్సిటీల్లో చదివారు. జర్మనీ, ఆస్ట్రేలియాలో ఉన్నత పరిశోధనలు చేసి, అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం (ఇక్రిసాట్ – ICRISAT) లో 2005 నుంచి ప్రధాన శాస్త్రవేత్తగా పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్నాయి.

భారత జాతీయ సైన్సు అకాజమీ (INSA) ప్రతిష్టాత్మకమైన FNA ఫెలోగా వార్షీని ఎన్నుకుంది. ఇక్రీసాట్ సంస్థ భవిష్త్తు ఉన్న యువ శాస్త్రవేత్తగా వార్షినీ ని గౌరవించింది. వ్యవసాయ శాస్త్ర జాతీయ అకాడమీ 2007 లో ప్లాటినం జూబ్లీ యువ శాస్త్రవేత్తగా సత్కరించింది. వ్యవసాయం వెన్నుముక్కగా ఉన్న మన భారతదేశానికి డా. రాజీవ్ వార్షినీ వంటి యువశాస్త్రవేత్తల అవసరం ఎంతో ఉంది.

మేఘనాథ్ సాహా

meghanathఅననుకూల పరిస్థితుల్లో శాస్త్రవేత్తగా ఎదిగినవాడు మేఘనాథ్ సాహా. తాను వేలు పెట్టిన ప్రతి రంగంలోనూ అసామాన్య ప్రతిభ కనబర్చిన మేథావి.

జననం: అక్టోబర్ 6, 1893

జన్మస్థలం: థాకా (అవిభక్త భారతదేశం, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)

భార్య: రాధారాణి

విద్య: థాకా కాలేజీయేట్ స్కూల్, థాకా కాలేజీ, కలకత్తా యూనివర్సిటీ, ప్రెసిడెన్సీ యూనివర్సిటీ (కలకత్తా)

ఆవిష్కరించిన ప్రసిద్ధ సిద్ధాంతం: సాహా ఈక్వేషన్

జీవన విశేషాలు:

మేఘనాథ్ సాహా చాలా పేద కుటుంబంలో జన్మించాడు, వీధి బడిలో చదువుకున్నాడు. తర్వాత సిమూలియా మాధ్యమిక పాఠశాలలో చదువుకొనేప్పుడు బెంగాల్ విభజనకు, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో సాహా పాల్గొన్నాడన్న నేరం మీద పాఠశాల నుంచి తొలగించారు. కానీ సోదరుని సాయం వలన కేశవలాల్ జూబ్లీ స్కూల్, ఢాకాలో 1906 లో చేరాడు. ఇది ఒక ప్రైవేట్ విద్యా సంస్థ. ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మూడో స్థానం పొందాడు. 1911 వ సంవత్సరంలో రసాయనశాస్త్రం తన అభిమాన విషయంగా (పెనీ డెన్సీ కళాశాల (కలకత్తా) నుండి 1913లో బి. ఎస్.సి (ఆనర్స్) పట్టా పుచ్చుకున్నాడు. 1915లో యం. ఎస్సీలో ప్రథముడిగా నిలిచాడు. కలకత్తా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తన ఉద్యోగ పర్వాన్ని ప్రారంభించాడు. రామ్‌చంద్ ప్రేమ్ చంద్ ఉపకార వేతనం పొంది డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాను పుచ్చుకున్నాడు. 1917వ | సంవత్సరం చివర్లో సాహా వరణాత్మక (ఎంపికచేయబడిన) రేడియోధాథార్మిక పీడనం అనే వ్యాసంలో సౌర " పరమాణువులపై భూమ్యాకర్షణ గురించి వ్రాసాడు. ఇది ఆస్ట్రోఫిజికల్ జర్నల్ కు ప్రచురణార్ధం పంపించాడు. ఆ జర్నల్ సంపాదకుడు సాహాకు లేఖ వ్రాసాడు. ఇంత పెద్ద నిడివి గల వ్యాసాన్ని ప్రచురించాలంటే కొన్ని వందల డాలర్లవుతాయని, ఆ ఖర్చును సాహా భరించగలిగితే ప్రచురిస్తామన్నాడు. మేఘనాథ్ సాహా ఆ ఖర్చును భరించగలిగే స్తోమత లేక మిన్నకుండిపోయాడు.

ఎర్క్స్ అబ్జర్వేటరీని 1936లో సాహో సందర్శించినప్పుడు ఆగ్రో ఫిజికల్ జర్నల్ Vol.50220(1919)లో సాహా వ్యాసం సంక్షిప్తరూపంలో ఉండటాన్ని చూసాడు. సాహా వ్యాసం గురించిన మరో ప్రస్తావన నేచర్ పత్రిక Vol.107489 (1921లో కూడా వచ్చింది. E.A. మిల్నే అనే శాస్త్రవేత్త ఈ పేరాలను సాహా వ్యాసం నుండి సంగ్రహించారని పేర్కొన్నాడు.

సాహా అనేక పరిశోధక వ్యాసాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్ లకు వ్రాసాడు, చాలా సైన్స్ పుస్తకాలను రచించాడు.

పరిశోధనలు:

ప్రఖ్యాత సైంటిస్టు ఐన్స్టీస్ మిత్ర బృందంలో మేఘనాథ్ సాహా ఒకరు. రేడియోధార్మికత మీద, నక్షత్రాల వర్ణపటాల మీద పరిశోధనలు చేశాడు. అలాగే భౌతిక శాస్త్రంలో అయాన్ల మీద పరిశోధనలు చేసి ఉషాధారిత అయోనైజేషన్ మీద సాహా సిద్దాంతాన్ని రూపొందించారు. నక్షత్రాల నేర్పర్చే మూలకాల అయాన్ల మీద పరిశోధన చేయడమే కాకుండా సౌర కిరణాల బరువు, పీడనం మీద కూడా నరిశోధనలు చేశాడు. ఇవి ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. కాంతి విశిష్ట సాంద్రతను గురించి రీసెర్చ్ చేయడమే కాకుండా మరో ప్రసిద్ద శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్‌తో కలిసి వాయువుల పరంగా సాహాబోస్ సిద్దాంతాన్ని వెలువరించాడు.

1905లో బెంగాల్ రెండుగా విభజించినప్పుడు వశ్చిమబెంగాల్ చేరుకున్న మేవునాథ్ సాహా భారతదేశంలోని యువతీయువకుల్లో శాస్త్రీయ దృక్పథం పెరగడానికి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని శచర్యలు చేపట్టాలని సూచించాడు.

అందుకుగాను అనేక సైన్సు పరిశోధనా సంస్థలు ఏర్పర్చడానికి కారకుడయ్యాడు.

జాతీయ అకాడమీ ఆఫ్ సైన్స్ (1930)

ఇండియన్ ఫిజిక్స్ సొసైటీ (1934)

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (1985)

సాహా ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ (1943)

పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాష్ట్రాల్లో ప్రవహించే దామోదర్ నది మీద దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ నిర్మించడానికి ముఖ్య కారకుడయ్యాడు. దామోదర్ నదిలో ఎక్కువగా వరదలు వచ్చేవి. అందుచేతనే దామోదర్ నదికి బెంగాల్ దుఖదాయిని అని పేరు. కాని దీని మీద ప్రాజెక్టు కట్టడం వలన విద్యుత్తు కూడా ఉత్పత్తి కావడానికి మార్గం సుగమం అయింది.

దేశం మరింతగా సైన్స్ ఫలాలు అనుభవించాలంటే తానుకూడా ప్రభుత్వంలో ఒక భాగంగా మారాల్సిందేనని భావించిన మేఘనాథ్ సాహా 1952లో పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్రునిగా పోటీ చేసి కలకత్తా ఈశాన్య నియోజకవర్గం నుండి విజయం సాధించాడు. ప్రణాళిక సంఘంలో సభ్యునిగా నియమితుడైన సాహో దాని సమావేశాలు హాజరు కావడానికి వెళ్తూ 1956లో గుండెపోటుతో మరణించాడు.

సత్యేంద్రనాధ్ బోస్

satyendranathభారతీయ శాస్త్రవేత్తలలో అత్యంత ప్రతిభావంతుడైన సత్యేంద్రనాథ్ బోస్ కి ప్రపంచ శాస్త్రవిజ్ఞానరంగంలో రావలసినంత పేరు రాలేదని చాలా మంది మేధావుల అభిప్రాయం.

జననం: 1 జనవరి 1894 - కలకత్తా (అవిభక్త బెంగాల్)

మరణ; 4 ఫిబ్రవరి 1974 - కలకత్తా (పశ్చిమబెంగాల్)

శాస్త్రవిజ్ఞానంలో కృషి చేసిన రంగాలు: గణితం, భౌతికశాస్త్రం

పనిచేసిన విశ్వవిద్యాలయాలు: కలకత్తా విశ్వవిద్యాలయం, థాకా విశ్వవిద్యాలయం (ప్రస్తుతం బంగ్లాదేశ్)

వచ్చిన భాషలు: బెంగాలి, సంస్కృతం, ఆంగ్లం, ఫ్రెంచ్, జర్మన్

సంగీతకారుడు వాయించగలిగిన వాయిద్యం: ఎస్రాజ్ (వాయోలిని పోలి ఉంటుంది Violin)

సంఘసేవ: రాత్రిబడులు నిర్వహించి అనేక మందికి చదువు చెప్పాడు.

బహుమతులు: పద్మవిభూషన్ (1954)

తల్లిదండ్రులు: సురేంద్రనాథ్ బోస్, ఆమోదినిదేవి

భార్య: ఉషాబతిఘోష్ (ఆమెకు 11 సం. ల వయస్సులో 20 సం. ల సత్యేంద్రనాథ్ బోసతో వివాహం జరిగింది)

విద్యాభ్యాసం: మెట్రిక్యులేషన్, హిందూపాఠశాల (1909) ప్రెసిడెన్సీకాలేజ్ (కలకత్తా) ఇంటర్మీడియట్ కలకత్తా యూనివర్శిటీ బిఎస్సీ 1913 రాష్ట్రంలో ప్రథముడు, యం.ఎస్.సి. 1915, రీసెర్చిస్కాలర్ 1916

సత్యేంద్రనాథ్ బోస్ ఉపాధ్యాయులలో మహామహులైన శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్, మేఘనాథ్ సాహా వుండేవారు. ప్రణాళికా సంఘానికి డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన పి.సి.మహాలనోబిస్ అతడికంటే సీనియర్ విద్యార్థి.

తర్వాతి కాలంలో గురువుగారైన మేఘనాథ్ సాహాతో కలిసి ఫ్రెంచ్, జర్మన్ భాషల నుండి ఈ శతాబ్దంలోనే గొప్ప శాస్త్రవేత్త అయిన ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన ఆంగ్లభాషలోకి అనువదించాడు. ఆయన ఐన్‌స్టీన్స్ అనుమతి కోరగానే ఇందుకు ఐన్ స్టీన్ సంతోషంతో సమ్మతించాడు. ఈ అనువాదం 1919లో జరిగింది. 1921 లో థాకా విశ్వవిద్యాలయం కొత్తగా ప్రారంభించారు. అందులో ఆయన రీడర్‌గా చేరాడు. 1921 నుండి 1945 దాకా ఢాకా విశ్వవిద్యాలయంలో ఆయన బోధించాడు.

బెంగాల్ రాష్ట్ర విభజన జరగడంతో తిరిగి వచ్చి కలకత్తా యూనివర్శిటీలో 1945 - 56 వరకు అధ్యాపకత్వం నిర్వహించాడు. ఆయన 1918 నుండి 1956 మధ్య లెక్కలేనన్ని శాస్త్రపత్రాలను (Scientific papers) రాశాడు.

పరిశోధనలు:

అయోనోస్పోర్ల ఎలక్ట్రో మాగ్నటిక్ (విద్యుదయస్కాంత) ధర్మాలను కనుగొన్నాడు. ప్లాంక్ ప్రమాణ రేడియోధార్మిక సిద్ధాంతం (Planck's Quantum Radiation Law) మీద బోస్ రాసిన వ్యాసాన్ని (1924) ఆయన ఈ శతాబ్దంలోనే ప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్ కి పంపించాడు. ఆ వ్యాసం చదివి ప్రభావితుడైన ఐన్ స్టీన్ దాన్ని స్వయంగా జర్మన్ లోకి అనువదించి బోస్ పేరిట ప్రసిద్ధ జర్మన్ భౌతిక శాస్త్రపత్రిక ‘జైట్ స్క్రిప్ట్ వర్ ఫిజిక్స్'కి పంపించాడు. అది ప్రచురించడంతో అప్పటికి డాక్టరేట్ అర్హత లేని బోసకి యూరోపియన్ ప్రయోగశాలల్లో ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు లూయీడిబ్రాంకిల్, మేడం మేరీ క్యూరీ, ఐన్‌స్టీన్ లాంటి మహామహులతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఆయన ప్రమాణ స్థితిశాస్త్రం (Quantum Statics) అవి కొత్త గణన విధానాన్ని ప్రతిపాదించాడు. అంతేకాకుండా బోస్-ఐన్‌స్టీన్ కండెన్సేట్, బోస్-ఐన్‌స్టీన్ కొరిలేషన్స్ (Correlations), బోస్ సమీకరణం (స్థితిశాస్త్రంలో) ఫోటాన్ మీద పరిశోధనలు ఇవన్నీ ఆయన సాధించిన విజయాలు.

ఆయన వివిధ రంగాలలో పరిశోధనలు కొనసాగాయి. ఉష్ణదీప్తి (Thermo luminescence), ఎక్స్‌రే స్ఫటికాకృతి శాస్త్రం (X-ray crystallography), గణాంక యాంత్రికశాస్త్రం (Statistical Mechanics), క్లాసిఫైడ్ ఫీల్డ్ సిద్ధాంతం, ఈ రంగాలన్నింటి గురించి పరిశోధనలు చేశాడు.

ఆంగ్లం రాజ్యమేలుతున్న కాలంలో ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో సైన్స్ తరగతులను కళాశాలలో బోధించేవాడు, మాతృభాషలోనే సహజసిద్ధంగా విద్యార్థులు నేర్చుకుంటారని ఆయన నమ్మేవాడు.

Y ఆకారంలో గల తీగలను, కొమ్మలను పట్టుకుని భూమి మీద నడుస్తూ నీటి ఉనికిని కనుగొనే వారి గూర్చి మాట్లాడుతూ హంగరీకి చెందిన భౌతికశాస్త్రవేత్త ఎట్స్ (Eotvos) అటువంటి పరికరాన్ని సృష్టించాడని గురుత్వాకర్షణ వలన ఆ పరికరం కదిలే వేగం బట్టి నీటి ఉనికి వివరణ గుర్తించవచ్చని ఆ శాస్త్రవేత్త వివరణ ఇచ్చాడని ఆయన మాంత్రికుడు –నీటి వెదుకులాట (The Magician - In search of water) అనే వ్యాసంలో పేర్కొన్నాడు. పైగా ఇటువంటి పరికరంతో భూమిలోని ఖనిజాలను, నూనెలను, పెట్రోలియంను కూడా కనుగొనవచ్చని పేర్కొన్నాడు. మనం ఇలాంటి నీటిని వెదికే మాంత్రికులను మనదేశంలో కూడా చాలా చోట్ల చూస్తాం.

బహుశా జీవిత కాలంలో ఆయన రాసిన వ్యాసాలకు లెక్కేలేదు, భౌతికశాస్త్రవేత్త అయిన ఆయన జీవశాస్త్రం మీద 'జీవశాస్త్రంలో నోబుల్ బహుమతి' అనే వ్యాసాన్ని ఆయన 1966 లో రాశాడు. 1965 లో వైద్యశాస్త్రంలో నోబుల్ బహుమతి ఫ్రెంచి శాస్త్రవేత్తలు ఆంధ్రావాఫ్ (Andre Lwoff), జాక్వెస్ మేవాడ్, ఫ్రాంకోయిస్ జాకబ్‌లకు లభించింది. వారు కనుగొన్న జీవకణకృత్యాలను, వారు పరిశోధన చేసిన విధానాన్ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసం ఇది.

పరిమాణ యాంత్రికశాస్త్రం లేక ప్రమాణ యాంత్రికశాస్త్రం (Quantum Mechanics)లో ఆయన రేణువుల (Particles) గూర్చి ఐన్‌స్టీన్‌తో కలిసి పరిశోధన చేస్తూ పరమాణువులో రెండు రకాల రేణువులున్నాయి. ఆయన నిర్దేశనం చేశాడు. ఒక రకం బోసాన్లు కాగా రెండవరకం ఫెర్మియాన్లు, మొదటిరకం రేణువులకు ఈ పేరు పాల్గిరక్ సత్యేంద్రనాథ్ బోస్ పేరు మీద బోసాన్లు అని నామకరణం చేశాడు.

ప్రమాణస్థితిలో (Quantum) ఉన్న అనేక రేణువుల్లో ఇటీవల రెండు ప్రోటాన్లు ఒకదానినొకటి ఢీకొనడం వల్ల హిగ్స్ బోసాన్లు (14 మార్చి 2013) ఉద్భవిస్తాయని కనుగొన్నారు. వీటినే దైవకణాలు అన్నారు. ఇందుకు పీటర్‌హిగ్స్, ఫ్రాంకోయిస్ ఎంగెర్టీకి డిసెంబర్ 10, 2013న భౌతికశాస్త్రంలో నోబుల్ బహుమతి లభించింది. అప్పటివరకు బోసాన్లలో ఇటువంటి రేణువులున్నాయని ఎవరూ కనుగొనలేదు.

భారతదేశానికి చెందిన కొంతమంది మేధావులు ఈ గౌరవంలో సత్యేంద్రనాథ్ బోసకి కూడా భాగం వుండాలని అంటారు కాని అది అసంబద్ధం అవుతుంది. పైగా మరణించినవారికి నోబుల్ బహుమతిని ప్రసాదించరు కూడా,

సత్యేంద్రనాథ్ బోన్ సైన్సు పాఠాలను ఆసక్తికరమైన కథల్లాగా చెప్పేవాడని ప్రతీతి. బహుభాషాప్రవీణుడు, సంగీతకారుడు, ప్రఖ్యాతశాస్త్రవేత్త అయిన సత్యేంద్రనాథ్ బోస్ కొంతకాలం మనదేశ పార్లమెంట్లో రాజ్యసభకు ప్రభుత్వం తరుపున నామాంకనం (Nominate) 1958 లో చేయబడ్డాడు. 1986 లో ఆయన మరణాంతరం భారత పార్లమెంట్ ఎస్. ఎన్. బోస్ జాతీయ మౌళిక విజ్ఞాన శాస్త్ర కేంద్రాన్ని చట్టం ద్వారా నెలకొల్పింది (S N Bose National Center for Basic Sciences). ఆయన బ్రతికున్న కాలంలో ఆయనను జాతీయ ప్రొఫెసర్ గా నియమించి భారత ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకొంది.

జేమ్స్ ఎడ్వర్డ్ రాత్‌మన్

jan01.jpgప్రతిరోజూ నగరాల్లో మనం రోడ్డు ఎక్కి ఎక్కడికి పోవాలన్న ట్రాఫిక్ జామ్. వాహనాల రద్దీతో ఏ ఒక్కరు పొరపాటు చేసినా, వాహనం చెడిపోయినా గంటలకొద్దీ ట్రాఫిక్ కదలలేని పరిస్థితి. ఆధునికమైన ట్రాఫిక్ లైట్ సిస్టమ్, ట్రాఫిక్ ను నియంత్రించి సకాలంలో గమ్యం చేరేలా సహాయం చేసే పోలీస్ వ్యవస్థ వుండి కూడా నరకయాతన అనుభవిస్తున్నారు ప్రయాణీకులు. నగరం, ప్రయాణం, గమ్యం, నియంత్రణ వ్యవస్థ నిత్యం మనం చూస్తున్నదే. ఇదే పనిని మన శరీరం ఎలా చేస్తుంది.

మీకు తెలుసు మన శరీరాలు వేలాది కణాలతో నిర్మితమయ్యాయని. కాలికో, చేతికో ఏదైనా గాయమైతే మెదడు పంపే సంకేతాల ద్వారా మనం ఏం చేయాలో అది చేస్తాము. అలాగే కణం గురించి మాట్లాడుకున్నాం. అసలు ఈ కణంలో సమాచారం ఎలా ఒక చోటి నుండి మరో చోటికి వెళ్తుంది? అలాగే ఒక కణం నుండి మరో కణానికి, ఒక అవయవం నుండి మరో అవయవానికి మనకు తెలియకుండానే శరీరంలో, జీవకణాల్లో సమాచారాన్ని చేరవేసే 'ట్రాఫిక్ వ్యవస్థ' ఒకటి నిత్యం, నిరంతరం పనిచేస్తూ వుంటుంది. రోడ్డు మీద ఒక్క వాహనం అడ్డువస్తేనే మొత్తం ట్రాఫిక్ చెల్లాచెదురవుతుంది. నిలిచిపోతుంది. మరి మన కణాల్లోనైతే? రకరకాల రోగాలకు, ఇంకా చెప్పాలంటే చావుకు కూడా దారితీయవచ్చు. కణాల్లో జరిగే అణువుల (సమాచారాన్ని, రసాయనాలను) ట్రాఫిక్ వ్యవస్థ గురించి ఆలోచన చేసి, పరిశోధించి దాని గుట్టును బయటపెట్టారు. శాస్త్రవేత్తల త్రయం. జేమ్స్ రాత్‌మన్, రాండీ షేక్మన్, థామస్ సుధాఫ్ లు. ఈ ముగ్గురిలో జేమ్స్ రాత్‌మన్ గురించి ఈ మాసపు సమకాలీన శాస్త్రవేత్తగా తెల్సుకుందాం.

కణాలు తయారుచేసిన రసాయనాలను లేదా హార్మోన్లను (పెరుగుదలను, వివిధ జీవన చర్యలను నియంత్రిస్తాయి) కణం వెలుపలి వాతావరణంలోకి విడుదల చేయడానికి చిన్న గాలిబుడగ వంటి నిర్మాణాలు పని చేస్తాయని తెల్సుకున్నారు. ఈ చిన్న సంచి లేదా గాలిబుడగ నిర్మాణాలను కోశికలు (Vesicles) అంటారు. కోట్లాది సం|| పరిణామక్రమంలో రూపుదిద్దుకున్న ఈ కోశికలు కణాల్లో, కణాల మధ్య వివిధ అణువుల రవాణాను పకడ్బంధీగా నిర్వహిస్తాయని నిరూపించిన గొప్ప శాస్త్రవేత్త డా||రాత్‌మన్. రాత్‌మన్ కోశికలు కణసొరలతో సంయోగం చెందేందుకు అవసరమైన ప్రోటీన్ యాంత్రికాన్ని కనుగొన్నాడు. ఇందుకు కారణమైన కణానికి కణానికి మధ్య ప్రోటీన్స్ (మాంసకృత్తులు) వెనక్కు ముందుకు ప్రయాణిస్తాయని ప్రఖ్యాత కణజీవ శాస్త్రవేత్త జార్జి పలాడే (George Palade) నలభై ఏళ్ల క్రితమే వైద్య పరిశోధనలు చేసే రాక్ ఫెల్లర్ సంస్థలో వెల్లడించాడు. కానీ అవి ఎలా ప్రయాణిస్తాయో అప్పటికి తెలియదు.

పలాడే చెప్పిన ఈ మాటలే రాత్మన్ను కణపొరలపై జరిగే ట్రాఫిక్ ను అధ్యయనం చేయటానికి స్ఫూర్తినిచ్చాయి. స్వయంగా రాత్మనే 2008లో ఈ విషయం చెప్పాడు. పలాడే 1973లో యేల్ యూనివర్సిటీలో స్థాపించిన కణజీవశాస్త్ర విభాగానికి రాత్‌మన్ నాయకత్వం వహించడం తనకు గొప్ప అదృష్టంగా భావించాడు. కోశికలు సరుకులు మోసే లారీల్లా (కార్లో) పనిచేస్తాయని తెల్సుకున్నారు. ఇది ప్రోటీన్లనే సరుకులను నింపుకుని కణంలోపలి లేదా కణం బయట ఉండే పొరలతో (త్వచాలతో) కలిసిపోయి అక్కడ తాము తెచ్చిన ప్రోటీన్లను విడుదల చేస్తాయి. 1970వ దశకంలో రాత్‌మన్ ఇలా ఆలోచిస్తుంటే చాలా మంది నవ్వుకున్నారట. అసాధ్యం అనుకున్నారు కూడా. సైన్సులో ఊహించడం ఒక ఎత్తైతే, దాన్ని నిరూపించటం గొప్ప కసరత్తు. రాత్‌మన్ కణం వెలుపల ఒక్కొక్క చర్యనూ రసాయనికంగా చేసి ప్రయోగశాలలో చూపించే ప్రయత్నం చేశాడు. అందుకే ఈ సం|| నోబెల్ బహుమతికి ఆయన ఎన్నికైనప్పుడు యేల్ యూనివర్శిటీ అధ్యక్షులు పీటర్ సాలోవే 'ఇది రాత్‌మన్ ధైర్యానికి, సృజనాత్మక పరిశోధనకూ గుర్తింపని? పొగిడారు. రాత్‌మన్ తదితర శాస్త్ర వేత్తలు కోశికలు ఏర్పడటానికి అవసరమైన ఎంజైములు, కారణమైన జన్యువులపై ఎంతో పరిశోధన చేశారు.

రాత్‌మన్ పరిశోధనలు, విరిగిన కణాలు, శుద్ధిచేసి కణాంగాలను కృత్రిమంగా వినియోగించే విశిష్ట పద్దతీ ఆధునిక త్వచ జీవశాస్త్రానికి (Modern Membrane Biology) నూతన రూపాన్నిస్తాయనటంలో సందేహం లేదు. ఇన్సులిన్ వంటి హార్మోన్లు పాంక్రియాస్లో తయారై రక్తంలోకి విడుదలవుతుంది. ఇలా సరైన పదార్థాలు, సరైన గమ్యనికి సరైన సమయంలో చేరటానికి కారణమైన వ్యవస్థ గుట్టును ఈ ముగ్గురు నోబెల్ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. జన్యువులను డా|| షెక్‌మన్ కనుగొన్నాడు. కోశికల్లో వుండే ప్రొటీన్లను ఖచ్చితంగా విడుదల చేయటానికి కావలసిన సంకేతాలను డా||సుధాఫ్ కనుగొన్నారు.

జేమ్స్ ఎడ్వర్డ్ రాత్‌మన్ 1950వ సం|| నవంబర్ 3న జన్మించాడు. కణజీవశాస్త్ర విభాగానికి అధిపతిగా, నానోబయాలజీ ఇన్స్టిట్యూట్ కు డైరెక్టర్ గా రాత్‌మన్ పనిచేస్తున్నారు. ఈ సం|| నోబెల్ పురస్కారంతో పాటు కింగ్ ఫైజల్ అంతర్జాతీయ ప్రైజ్(1996), లూసియాగ్రాస్ హార్ఫిట్స్ పైజ్, ఆల్బర్ట్ లస్కర్ అవార్డ్ ను 2002లో అందుకున్నారు. యేల్ యూనివర్శిటీ నుండి డిగ్రీ, హార్వర్డ్ నుండి 1976లో పి హెచ్ డి చేశారు. నూతన ఆలోచనలకు, వినూత్న పరిశోధనా పద్ధతులను రాత్‌మన్ ఎంతో స్ఫూర్తినిచ్చిన శాస్త్రవేత్త.

 

ఆధారం: ప్రోఫేసెర్ కట్టా సత్యప్రసాద్.

ఆదా యోనాత్

feb07.jpgమనం ఏ పని చేయాలన్నా, కనీసం మాట్లాడాలన్నా, ప్రతి జీవి తన జీవన చర్యలు జరపాలన్నా ప్రొటీన్స్ లేదా మాంసకృత్తులనేవి అవసరం. మరి ఆ ప్రొటీన్లు ఎలా తయారవుతాయి? అవి ఎక్కడ తయారవుతాయి? ప్రతి జీవకణంలో ఎన్నో కణాంగాలుంటాయి. వీటిలో ప్రొటీన్ల తయారీ కేంద్రాన్ని లేదా స్థలాన్ని 'రైబోసోము'లంటారు. మనలో ఉండే 20 రకాల అమైనో ఆమ్లాలను ఒక చోటికి రైబోసోము పైకి) చేర్చి ప్రొటీను గొలుసులను ఏర్పాటు చేస్తుంది కణం. దీన్నంతా నడిపిస్తోంది DNA అనే జన్యు పదార్థం. ఏ ప్రొటీన్ ఏర్పడాలో సమాచారం తీసుకుపోయేది RNA (రైబోన్యూక్లియిక్ ఆమ్లం). అయితే ఈ రైబోసోములెలా ఉంటాయి. అవి ఎలా పనిచేస్తాయనేది కళ్ళకు కట్టినట్లు వాటి నిర్మాణాన్ని బయట పెట్టినవారు ముగ్గురు గొప్ప శాస్త్రవేత్తలు, వారిలో చెప్పుకోదగినవారు డా. యొనాత్. ఇటీవల హైదరాబాద్ వచ్చిన భారతీయ సంతతి శాస్త్రవేత్త వెంకట్రామన్ రామకృష్ణన్, థామస్ సైట్లీలతో కలిపి ఈమెకు 2009లో రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి వచ్చింది.

రైబోసోముల నిర్మాణం, పనిచేసే విధానాన్ని కనిపెట్టడం ఈమె సాధించిన విజయం. ప్రతికణంలో ఇవి ఉంటాయి. అలా అయితే అన్ని రకాల కణాల్లో ఒకే రకంగా ఉంటాయా? మీరెప్పుడైనా ఆరోగ్యం బాగాలేక డాక్టరు దగ్గరకు వెళ్ళారా? డాక్టరు సూక్ష్మజీవనాశక మందు అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చాడా? మనకు బాక్టీరియా వంటి సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు వస్తే వాటిని చంపడానికి యాంటీ బయాటిక్స్ వాడతారు. మరి మనం యాంటీబయా టిక్ గోళీలు మింగినపుడు అవి కేవలం బాక్టీరియాలనే ఎందుకు చంపుతాయి? మన కణాలను ఎందుకు చంపవు?

ముఖ్యంగా ప్రొటీన్ తయారీని అడ్డుకునే యాంటీబయాటిక్స్ రైబోసోముల్ని పనిచేయకుండా చేస్తాయి. ఆ మందులు మనిషి కణాల్లో ఉండే రైబోసోముల్ని పనిచేయకుండా చేస్తే ప్రమాదం కదా! అలా జరగడం లేదంటే ఆ మందులు మనిషి కణాల్లోని రైబోజోముల జోలికి పోవడం లేదన్నమాట! అలాంటప్పుడు ఆ మందులు మనిషి కణాల్లో ఉండే రైబోసోముల్ని, బాక్టీరియంల రైబోసోముల్ని ఎలా విడగొట్టి చూడగలవు. లేకపోతే మనిషిలో, బాక్టీరియం వంటి సూక్ష్మజీవుల్లో ఉండే ఈ రైబోసోముల మధ్య వ్యత్యాసం ఉందా? అవును. మనిషి వంటి నిజకేంద్రక జీవుల్లో ఉండే రైబోసోములు 80s రకానివైతే బాక్టీరియంలలో 70s రకం ఉంటాయి. అందుకే మనం వాడే యాంటీబయాటిక్స్ కేవలం బాక్టీరియంలనే చంపుతాయి. వాటి నిర్మాణాల్లో ఉండే తేడాను, పూర్తి రైబోసోములను స్పటికీకరించి మరీ యోనాత్ కనిపెట్టారు. మందులు ఎక్కడ, ఏ ప్రదేశంలో జతకడతాయో కనీసం 20 రకాల యాంటీబయాటిక్స్ కనిపెట్టారు. దీనితో మనకు కావలసిన విధంగా మందులను డిజైన్ చేసుకునేందుకు సరికొత్త బాటలు వేసింది ఆదా యోనాత్.

ఆమె క్రయోబయోక్రిస్టలోగ్రఫీ అనే సరికొత్త ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఈనాడిది చాలా రోటిన్‌గా చేస్తున్నారు. దీని వల్లనే రైబోసోమ్ లో ఉండే రెండు ఉపప్రమాణాల నిర్మాణాలను కనిపెట్టగలిగింది.

రైబోసోమ్ నిర్మాణం కనిపెట్టిన శాస్త్రవేత్తగా ప్రసిద్ధిచెందిన డా. యోనాత్ మధ్యప్రాచ్యంలోనే నోబెల్ బహుమతి పొందిన మహిళ. డా. యోనాత్ జెరుసెలేంలోని గెయులా (Geula) లో 1939 జూన్ 22న జన్మించింది. తల్లిదండ్రులు జియోనిస్టు యూదులు. వారు పోలెండు నుండి ఇస్రాయిల్ వచ్చారు. అతి పేద కుటుంబం. చిన్న కిరాణా దుకాణం నడిపేవాడు తండ్రి. అంతటి పేదరికంలో కూడా తండ్రి ఆమె చదువులకు కొదువరానీయలేదు. ఆనాడు నాకు పుస్తకాలే ప్రాణంగా ఉండేవంటుంది డా. యోనాత్. యోనాత్ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో కుటుంబంలో టెల్ ఆవీన్ కు వెళ్ళింది. అక్కడ మంచి స్కూల్లో యోనాత్కు ప్రవేశం లభించింది. తల్లిది ఫీజులు చెల్లించలేని స్థితి. అందువల్ల ఆ స్కూల్లోనే గణితం బోధించి తన చదువును కొనసాగించింది.

ఆ పసివయస్సులోనే ఆమెను ప్రభావితం చేసిందో గొప్ప వ్యక్తి. ఆమె ఎవరో కాదు నోబెల్ బహుమతిని రెండు సార్లు గెల్చుకున్న తొలి మహిళ మేరీ క్యూరీ. జరుసలేం హెబ్రూ విశ్వవిద్యాలయం నుండి 1962లో డిగ్రీ 1964లో యం.యస్సీ. చేసింది. 1968లో ఎక్స్-రే క్రిస్టలోగ్రాఫీ లో (ఎక్స్-కిరణాల నుపయోగించి స్పటికాల నిర్మాణాన్ని చదివేశాస్త్రం) వైజ్మన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి డాక్టరేట్ పట్టా సంపాదించింది. ఆమెకు హాగిత్ యోనాత్ అనే కూతురు ఉంది. ఆమె షేబా వైద్య కేంద్రంలో డాక్టర్. ఇజ్రాయిల్ దేశ నరాలై నా డా. యోనాత్ పాలస్తీనియన్లను విడుదల చేయాలని కోరేది.

డా. యోనాత్ కార్నెగే వెల్లాన్ యూనివర్సిటీ (1969), యం. ఐ. టి (MIT)లలో (1970) డాక్టరేట్ అనంతరం పరిశోధనలు A చేసింది. కొంత కాలం 1976లో రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత విలియం లిప్స్ కొంబ్ జూనియర్ దగ్గర హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధనలు చేసింది. ప్రొటీన్ క్రిస్టలోగ్రఫీలో ఆమె స్థాపించిన ప్రయోగశాల ఇజ్రాయిల్‌లోనే మొదటిది - ఒకే ఒక్క లాబ్ కూడా. నోబెల్ బహుమతి కంటే ముందు మరెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకుంది డా. యోనాత్.

2000 సంవత్సరంలో మొట్టమొదటి ఐరోపా క్రిస్టలాగ్రఫీ ప్రైజ్

2002లో రసాయనశాస్త్రంలో ఇజ్రాయిల్ ప్రైజ్

2006లో రసాయనశాస్త్రానికి ఊల్ఫ్ ప్రైజ్ (Wolf prize)

2008లో యునెస్కో అవార్డు గెల్చుకున్న మొట్టమొదటి ఇజ్రాయిల్ వనిత.

2008లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ అవార్డు 2009లో నోబెల్ ప్రైజ్

ఇలా ఎన్నెన్నో విశిష్ట బహుమతులు పొందిన డా. యోనాత్ తన 11వ ఏట నుండే తన కుటుంబానికి ఆసరాగా నిల్చింది.

రామన్ ఫలితం

feb013.jpgఈ నెల 28వ తేది జాతీయ సైన్స్ దినోత్సవం, సరిగ్గా 87సంవత్సరాల క్రితం సర్. సి.వి. రామన్, అతని శిష్యుడు (పి, హెచ్. డి. విద్యార్థి) కృష్ణన్ ఫిబ్రవరి 28వ తేదీనాడు రాత్రి 10-11గంటల సమయంలో ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించారు.

ఏదైనా స్వచ్ఛమైన పదార్థంపై ఏకవర్ణ కాంతి (monochromatic light) పడ్డప్పుడు ఆ వస్తువు ఆ కాంతిని పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. ఇందులో పరావర్తనం (reflection), వక్రీభవనం(refraction), పరిక్షేపణం(scattering), శోషణం (absorption), అంతర ప్రసరణం (transmission), ధృవణం (polarisation) వంటి పలువిధాలుగా పతనకాంతి ప్రభావితం కాబడినా ఏకవర్ణ కాంతి తరంగదైర్యం ఏమాత్రం మారదు. ఇలా ఏకవర్ణకాంతి ఎన్ని విధాలైన ప్రక్రియలకు లోనైనా కూడా దాని తరంగధైర్యం ఏమాత్రం మారదని శాస్త్రవేత్తలంతా రూఢిగా నమ్మేవారు.

ఉదాహరణకు పరిక్షేపణనే తీసుకుందాం. మీ తరగతి గదిలో మీ మీద ఉపాధ్యాయుల మీదా, తోటి విద్యార్థినీ విద్యార్థుల మీదా, గోడలపై వ్రేలాడుతున్న బోర్డుల మీదా సౌరకాంతి (Sun light) నేరుగా పడకపోయినా మనకు అందరూ కనిపిస్తారు. మరి ఈ కాంతి ఎక్కడిది? బయట సూర్యకాంతి రోడ్డు మీద, నేలమీద పతనం చెంది వివిధ దశల్లో పరిక్షేపణం చెందగా, అందులో కొంత మీ తరగతి గదిలో కూడా ప్రవేశించింది. ఆ కాంతి తిరిగి తరగతి గదిలో ఉన్న వస్తువుల మీద, మనుషుల మీద పడి పరిక్షేపణం చెందడం వలన మీరు ఆయా వస్తువుల్ని చూడగలుగుతున్నారు. ఇలా పదేపదే పరిక్షేపణం చెందే కాంతిని రాలీ పరిక్షేపణం కాంతి (Rayleigh Scattering Light) అంటారు.

ఏకవర్ణ కాంతి రాలీ పరిక్షేపణానికి గురైతే పరిక్షేపణం పొందిన కాంతులన్నీ అదే ఏకవర్ణంలోనే ఉంటాయి. ఒక ఏకవర్ణ కాంతి పరిక్షేపణం చెందాలంటే ఆ కాంతి తరంగదైర్యం, పరిక్షేపణం చెందించే పదార్థ శకలం (particle) (ఇది కొల్లాయిడల్ కణం కావచ్చు లేదా అణువు కావచ్చు లేదా పరమాణువు కావచ్చు) పరిమాణానికి చేరువగా ఉండాలి. పరిక్షేపణంకు సంబంధించి ఈ రెండు నిబంధనలు శాస్త్రజ్ఞులు కాంతికి ఆపాదించేవారు.

కానీ రామన్, కృష్ణన్ ఆవిష్కరించిన సత్యం ఎందుకు భిన్నం. ఒక పదార్థంపై ఏకవర్ణకాంతి పతనమైన ఆ పదార్ధపు పరిమాణం, ఆ ఏకవర్ణ కాంతి తరంగదైర్యానికి చేరువగా ఉన్నట్లయితే అంతే తరంగదైర్ఘ్యమున్న కాంతితో పాటు ఆ తరంగధైర్యానికి కొంచెం ఎక్కువగా తరంగదైర్ఘ్యం, తక్కువ తరంగదైర్ఘ్యం ఉన్న కాంతులు కూడా పరిక్షేపణం చెందడం వారు గమనించారు. అంతవరకు ఈ పరిక్షేపణ శాస్త్రవేత్తలు ఎందుకు గుర్తించలేకపోయారు? సి.వి. రామన్, కృష్ణన్ మాత్రమే ఎందుకు గుర్తించగలిగారు? దీనికి కారణం ఎక్కువ, తక్కువ తరంగదైర్ఘ్యాలున్న కాంతులు అదే తరంగదైర్ఘ్యం ఉన్న కాంతి కంటే చాలా చాలా తక్కువ తీవ్రతలో ఉండటమే. ప్రత్యక్షంగా ఈ కాంతులను కంటితో చూడలేము. కటకాలనుపయోగించి మాత్రమే చూడగలము. రాత్రి పరిక్షేపణ తీవ్రత షుమారు 1000 ప్రమాణాలు అయితే భిన్నమైన తరంగదైర్యాలతో పరిక్షేపణం చెందే కాంతి 1, 2 ప్రమాణాలకు మించి ఉండదు.

విద్యార్థుల్లారా మీకు సునిశిత పరిశీలన ఉండాలని మేము ఆశిస్తాం. ఇలా సునిశితమైన పరిశీలన చేయడం వల్లే రామన్ తాను పదే పదే గమనించడమే కాకుండా తన విద్యార్థికి కూడా చూపించగలిగాడు. ఏకవర్ణ కాంతి తరంగదైర్ఘ్యమున్న కాంతిని స్టోక్స్ (stokes) పరిక్షేపణం అని, తక్కువ తరంగదైర్ఘ్యంతో పరిక్షేపణం చెందిన కాంతిని ఆంటీస్ట్రోక్స్ (anti stokes) పరిక్షేపణం అని అంటారు.

ఇలా ఏదైనా వస్తువుపై ఏకవర్ణ కాంతి పతనం చెందినపుడు ఆ కాంతి అధిక తీవ్రత గల రాలీ పరిక్షేపణం గానూ, తక్కువ తీవ్రతగల స్టోక్స్, ఆంటీస్ట్రోక్స్ పరిక్షేపణంగా విడపడటాన్ని రామన్ ఫలితం (Raman Effect) అంటారు. రామన్ ఫలితం కనుగొన్న వెంటనే A New Radiation అనే పేరుతో Indian Journal of Physics అనే ప్రసిద్ధ పరిశోధన గ్రంథంలో ప్రచురించాడు. ఈ ఫలితాన్ని రామన్ ఫిబ్రవరి 28 నాడు రాత్రి 9 గం. సమయంలో ఆవిష్కరించాడు.

ప్రపంచమంతా ఈ విషయం చూసి సంభ్రమాశ్చర్యం చెందింది. వెనువెంటనే దీని అనువర్తనాలు ప్రారంభమైనాయి. అంతవరకు ఆకాశం నీలం రంగులో ఎందుకుండేదో? లోతైన బావిలో నీరు నీలం రంగులో ఎందుకుంటాయో? లోతున్న సముద్రంలో నీరు నీలంగా ఉండగా, తీరప్రాంతాల్లో నీరు పారదర్శకంగా ఉండటానికి కారణం తెలియదు. మంచు పర్వతాలు ఎక్కువ భాగం తెల్లగానే ఉన్న కొంచెం నీలం రంగు ఛాయలు ఉండటానికి గల కారణం తెలిసేది కాదు. రామన్ ఫలితం ఆవిష్కరించిన తర్వాత ఈ దృగ్విషయాలకు కారణం రామన్ ఫలితం అని తెలియవచ్చింది, రామన్ ఫలితానికి గుర్తింపుగా 1930 సం.లో భౌతిక శాస్త్రానికి గాను సి.వి.రామన్ ను నోబెల్ బహుమతి లభించింది. 1980 దశకం ఆరంభంలో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతి సం. ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవాలని చట్టం చేసింది. అదే రోజు (1988 సం.) మన జనవిజ్ఞాన వేదిక కూడా రూపుదిద్దుకుంది.

ప్రొ. సత్యజిత్ మేయర్

6ఢిల్లీ, ముంబయ్, హైద్రాబాద్ వంటి నగరాలను మీరు చూసే వుంటారు. కనీసం టివిలలో... లేదంటే సినిమాల్లోనైనా! విశాలవైన రోడ్లు, ఫ్లైఓవర్లు ఉన్నా అక్కడ ట్రాఫిక్ జామ్ కావటం, రోజూ జరుగుతున్నదే. వస్తువులు లేదా ప్రజలు ఒక చోటు నుండి మరో చోటుకు పోవాలంటే వాహనాలు ఆటంకం లేకుండా నడవాలి.  అప్పుడే నగర ప్రజల బతుకులు కూడా సాఫిగా సాగేది. ఏ కొద్ది తేడా వచ్చినా గోల్ మాలే కదా! దీని కోసం ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్ద, దారి చూపే అధునాతన జిపిఎస్ (Global Positioning System) పరికరాలు, పోలీస్ వంటి ఇంకా ఎన్నో సంస్దలు కలిపి పని చేస్తుంటేనే ప్రయాణాలు సాఫిగా నడుస్తున్నాయి. ఇది మనందరికీ అంతో ఇంతో అనుభవంలోనిదే. కాని ఒకసారి మనిషి లేదా మరేదైనా జీవి గురించో ఆలోచించండి. మానవుడు ఒక బహుకణ జీవి. అంటే ప్రతి మనిషిలో లక్షలాదిగా కణాలుంటాయి. మనం జీవంచి ఉండాలంటే, జీవనచర్యలు సాఫిగా సాగాలంటే ఈ కణాన్నీ ఒక క్రమపద్ధతిలో పరస్పర సహకారంతో పని చేయాలి. అవును, అవి అలా పని చేస్తున్నాయి కాబట్టే మనమైనా మరే జివైనా బతికున్నది.

జీవుల్లో ఉండే ఏ ఒక్క కణం కూడ ఒక దానితో ఒకటి సంబంధం లేకుండా సముద్రంలో దీవుల్లా ఉండవు. ఒకటి మరొక దానితో, అది ఇంకోదానితో ఇలా ఒక చేంతాడు బంధంలా పెనవేసుకొని ఉంటాయి. ప్రతి కణాన్నీ చుడుతూ ఒక పొర ఉంటుంది. దాన్నే ప్లాస్మా పొర (Plasma Membrane) అంటారు. కణంలోకి ఏదైనా పొవాలన్నా, బయటకు ఏదైనా రావిలన్నా ఈ పొరను దాటి తీరాలి. ఇది లిపిడ్లు (క్రొవ్వు), ప్రోటీన్లతో నిర్మితమై ఉంటుంది. ఒక్కో కణంలో 30 వేలకు పైబడి పోటీన్లుంటాయని అంచనా, ఏ పని జరగాలన్నా ఈ ప్రోటీన్లే ఆధారం. ప్రోటీన్లు, పోషక పదార్దాలు, లేదా వ్యాధిని కలిగించే వైరస్ల వంటివి కణాలను చేరినప్పుడు వాటి ఉనికిని కణాలు ఎలా గుర్తిస్తాయి? అవి కణం లోపలికి ఎలా ప్రవేశిస్తాయి? బయటికి ఎలా వస్తాయి? ఇది మన జీవకణాల ముందు వున్న పెద్ద ట్రాఫిక్ సమస్య!

ఒక కణం మరో కణంతో సంభాషిస్తుందా? ఒక కణం నుంచి సమాచారం మరో కణానికి సమాచారం ఎలా వెళ్తుంది? సంకేతాలు పంపిస్తాయా? అసలు సంకేతాలంటే ఏమిటి? ఇటువంటి ఎన్నో సున్నితమైన, సూక్శ్మదర్శిని ద్వారా నానో స్ధాయిలో ఉండే ఫ్లోరసెన్స్ గుంపును కని పెట్టినవాడు డాక్టర్ సత్యజిత్ మేయర్. కణాలు ఒకదానితో ఒకటి సంభాషిస్తాయి. ఇచ్చి పుచ్చుకుంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా! ఇది నిజం. ప్రతి కణం ప్లాస్మాపొర మీద దానిని తాకిన లేదా చేరుకున్న వస్తువును (వైరస్ లేదా ప్రోటీన్) గుర్తించే స్వీకార అణువులుంటాయి. ప్లాస్మాపొర ప్రోటీన్లను, సంకేతాలను ఈ స్వీకార అణువుల ద్వారానే కణం లోపలికి పంపుతుంది. ఇందుకు కొన్నిసార్లు మార్గాలను (Channels) ఏర్పరిస్తే, మరోసారి మెాసుకుపోయేలా పోర్టర్ (Carrier) ను, ఇంకోసారి ఇంకిపోయేలా (Diffusion) పలు పద్దతుల్లో ఈ రవాణా జరుగుతుంది. ప్లాస్మాపొరను దాటి లోపలికి వెళ్లిన ప్రోటీన్ కణం లోపల ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్లాలి? ముప్పైవేల పైగా ప్రోటీన్లుంటాయని తెలుసుకున్నాం. ఇన్ని ప్రోటీన్లలో కొన్న లోపలికి వెళ్లేవైతే, ఎన్నో బయటికి వచ్చేవి ఉంటాయి. ఒక చిన్న సైకిలు అడ్డం వస్తేనో, బస్సు చెడిపోతేనో మెుత్తం ట్రాఫిక్ ఆగిపోవటం చూస్తున్నాం.  మరి లక్షలాదిగా ఇన్న కణాల్లో నిరంతరం, నిరాఘాటంగా సాగే ఈ రవాణా ప్రక్రియను చూస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామెా, ఎంత నేర్చుకోవాసో తెలుస్తుంది.

సత్యజిత్ మేయర్ ఆ కణాంతర రవాణా వ్యవస్దను అర్దం చేసుకునే ప్రయత్నమే చేశాడు. ప్లాస్మా పాృొర మీద అణువుల ఆర్గనైజేషన్ ను కణాలెలా నిర్వహిస్తాయెా, ఏ పనికి కేటాయించిన ప్రోటీన్లు ఆ పని జరిగే చోటుకి ఎలా చేరుకుంటాయెా సత్యజిత్ రనుదొన్నాడు. నీటి బుడగలను మీరు చూసేవుంటారు కదా! కణం పైన ప్లాస్మాపొరపై ఉ్న్ స్వీకార అణువు వచ్చిన వస్తువును (ప్రోటీన్, వైరస్) బుడగలా చుట్టి లోపలివైపుకు వదులుతుంది. ప్లాల్మాపొర లోపలివైపు ఉన్న ప్రత్యేపమైన డెమైన్లు వీటిని అవి వెళ్లవలసి చోటుకి చేరుస్తాయి. ఇదంత కధలా ఉంది కదా! సైన్సులో ‘కతలు నడువవు. ఇక్కడే సత్యజిత్ ప్రత్యేరత. GPI తో సంధానించబడిన ప్రోటీన్లు (ఫ్లోరసెన్స్ తళతళా మెరిసేది) ఎనైసో ట్రోపీ అనే పద్ధతిలో చిన్న చిన్న గుత్తుల్లా ఏర్పడతాయని చూపాడు.  ఈ గుత్తులు ఒక వినూత్న మార్గంలో పయనించి వాటి గమ్యం చేరుకుంటాయని చెప్పాడు. అందుకు ఆయన CDC42 అనే పధాన్ని (Pathway) ప్రతిపాదించాడు. కణాలపై, కణాలలోకి అణువుల రవాణాపై జరుగుతున్న మౌలుక పరిశోధనల్లోకి అణువుల రవాణాపై జరుగుతున్న మౌలిక పరిశోధనల్లో ఇదో గొప్ప ముందడుగు.

ఇనృవ్నీ తెలుసుకుంటే ఏమిటి ప్రయెాజనం అనుకుంటున్నారా? ఇటువంటి మౌలిక రహస్యాలను ఛేదించినప్పుడే మనం నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఉదాహరణకు వైరస్ లు మన కణాల్లోకి చేరే రదా వ్యధులు కలిగించేది? కణంలోపలికి అవి పోయే మార్గం తెలిస్తే ఆ మార్గాన్ని నిరోధించే ఉపాయాన్ని రూడా కనుక్కోగలం. అలా వైరస్ వ్యాధుల నుండి మనం బయటపడగలం. ఇలా ఇంకెన్నో ప్రయెాజనాలను మీరు కూడా శాస్ర్తవేతై పాధించవచ్చు. సత్యజిత్ మేయర్ బెంగళూరు జాచీయ జీవశాస్త్ర అధ్యయనకేంద్రం (Centre for Biological Sciences)లో ప్రొఫెసర్ గా ఉన్నారు.  ఆయన ముంబయి ఐఐటి నుండి రసాయన శాస్త్రంలో యం.యస్సీ చదివారు. అనెరికాలోని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ చేశారు (పిహెచ్.డి.). కొనపాగించారు. భారత ప్రభుత్వ సైన్సు, టెక్నాలజీ విభాగం వారిచే స్వర్ణజయంతి ఫెలోషిప్, జగదీశ్ చంద్రబోస్ ఫెలోషిప్ లే కాకుండా 2003 సం||లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును సైతం గెలుచుకున్న ఈ యువ శాస్త్రవేత్తను ఇటీవలే పాఫ్ట్నేర్ సంస్ధ ఇన్ఫోసిస్ వారు జీవవశాస్త్రాలకిచ్చే  ప్రైజ్ కూడా వరించింది.  ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఈయన సిట్రస్ పండ్ల రపాల (Juice) మీద పరిశోధనలప చేసి, వాటిలో ఉన్న ఆంటిఆక్సిడెంట్లను నిర్ణయించాడు. ఈయన కనుగొన్నదేమంటే, ఈ రసాల్లో ఇప్పటిదాకా అందరూ అనుకున్న దానికంటే పద్రెట్లు ఎక్కువగా ఆంటీఆక్సిడెంట్లు ఉన్నాయని. ఈ రసాలను సేవించడం వల్ల వాటిలోని ఆంటి ఆక్సిడెంట్లు మన శరీరంలోని హానికరమైన స్వేచ్ఛా ప్రాతిపదికలను (Free Radicals) తగ్గిచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఆంటిఆక్సిడెంట్లను ఇప్పటిదాకా ఉపయెాగిస్తున్న పద్ధతులకన్నా మెరుగైన పద్ధతులను హెనారెస్ కనుగొన్నాడు.

ఫ్రోంకోయిస్ బార్-సినోస్సి

mar01.jpgఇప్పుడు మనకు ఎయిడ్స్ వ్యాధి గురించి చాలా తెలుసు. దాని నివారణ కోసం ప్రపంచమంతా పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. కాని ఆ జబ్బుకు కారణమైన వైరస్ ను కనుగొన్నదెవరో మనలో ఎందరికి తెలుసు! ఎయిడ్స్ వ్యాధిని కలిగించే హెచ్ఐవి(Human immuno deficiency) వైరస్లు కనుగొని 2008వ సంవత్సరానికి వైద్యరంగంలో నోబెల్ బహుమతి పొందిన గొప్ప మహిళా శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రాంకోయిస్ బార్-సినోస్సీ (Francoise Barre'-Sinossi). 1947 జూలై 30వ తేదీన పారిస్ (19వ అరోండిన్ మెంట్) నగరంలో జన్మించిన బార్-సినోస్సీ చిన్ననాటి నుండి ప్రకృతి పట్ల మక్కువ ఏర్పర్చుకుంది. పుట్టింది, పెరిగింది పారిస్ నగరంలోనే అయినా సెలవుల్లో అవర్నే అనే పల్లెప్రాంతాల్లో గడిపేది. ఆ అనుభవమే భవిష్యత్తులో గొప్ప పరిశోధకురాలిగా, శాస్త్రవేత్తగా తీర్చిదిద్దింది. చిన్నతనంలో ఎంతో చిన్న కీటకాన్నైనా గంటల తరబడీ ఆసక్తితో చూసేది, పరిశీలించేది. తన చుట్టూ వున్న జీవ ప్రపంచంపై అలా ఏర్పడిన మక్కువ ఆ అమ్మాయి క్లాసు మార్కుల్లో కూడా కన్పించేదట. సైన్సులో వచ్చే మార్కులు లాంగ్వేజ్ ల్లో, తత్వశాస్త్రంలో వచ్చేవికావు. 1966లో డిగ్రీ చేసేటప్పుడు పారిస్ విశ్వవిద్యాలయంలో సైన్సును ఎంచుకుంది. డాక్టరు కోర్సు చేయటమా, డిగ్రీలో సైన్సులో చేరటమా అన్నప్పుడు బార్-సిస్సీ డిగ్రీలో సైన్సువైపే మొగ్గుచూపింది. అయితే డాక్టరు చదవాలంటే చాలా ఖర్చు, తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగకూడదనేది కూడా ఆమె నిర్ణయానికి ఒక కారణం అనుకోండి.

mar02.jpgడిగ్రీ చివరి రోజుల్లో పరిశోధన చేస్తే ఎలా వుంటుందనే ఆలోచన వచ్చింది. అందుకు ముందుగా ఏదైనా ప్రయోగశాలలో కొంతకాలం పనిచేస్తే అనుభవమూ వస్తుంది, పరిశోధనను తను వృత్తిగా చేసుకోగలనో లేదో కూడా తేలిపోతుంది. అందుకే ఆమె అనేక ప్రయోగశాలలకు అర్జీ పెట్టుకుందట. కాని ఎవ్వరూ ఆమెను చేర్చుకోవటానికి ముందుకు రాలేదు. చివరకు తన స్నేహితురాలి సహాయంతో ఒక లాబీవాళ్ళు ఆమెను వాలంటీరుగా తీసుకున్నారు. ఏదో కాలక్షేపానికి కొంతకాలం పనిచేయాలన్న కోరిక, ఆమెను వాలంటీరుగా అంగీకరించిన ప్రఖ్యాత ప్రయోగశాల ఆమె జీవిత గమనాన్ని, గమ్యాన్ని కూడా మార్చివేశాయి.

ప్రఖ్యాత పాశ్చర్ ఇనిస్టిట్యూట్ ప్రయోగశాలవాళ్లే ఆమెను వాలంటీరుగా తీసుకుంది. దానికి నాయకత్వం వహిస్తున్న జీన్-క్లాడ్-ఛైర్మన్ (Jean-Claude Cherman) గ్రూప్‌లోనే ఆమె పనిచేయబోయేది. వారప్పుడు ఎలుకల్లో కాన్సర్ కు, రిట్రోవైరన్లకు మధ్య సంబంధాన్ని పరిశోధిస్తుండేవారు. ఛైర్మన్ తనలో పరిశోధన పట్ల కలిగించిన గాఢమైన కోరిక డిగ్రీలో హాజరుకావాల్సిన కోర్సులను సైతం వదిలి పెట్టి పరిశోధనలోనే తనమున్కలయ్యేట్లు చేసింది. అదే ఆమె డాక్టరేట్ (Ph.D డిగ్రీ) పట్టా 1974లో తీసుకోవటానికి కారణమైంది. కృత్రిమంగా తయారుచేసిన ఒక రసాయన అణువు వైరస్ ద్వారా వచ్చే ల్యుకేమియాను (ఒక రకమైన రక్త కాన్సర్) నిరోధించడంపై ఆమె పనిచేసింది. ఆ రసాయన పదార్థం ఎలుకల్లో ఆ వ్యాధిని తగ్గించగలిగింది. ఆ రోజుల్లోనే అమెరికాకు చెందిన డాన్ హాపాలా, రాబర్ట్ బాస్సిన్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ mar03.jpg(National Institute of Health) నుండి వచ్చి కొంతకాలం ఛైర్మన్ లాబ్‌లో పనిచేశారు. ఆ పరిచయంతో బార్-సినోస్సీ డాక్టరేట్ తర్వాత అమెరికా వెళ్లి బాస్సిన్ దగ్గర కొంతకాలం పరిశోధనలు చేయటానికి తోడ్పడింది. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఛైర్మన్ లాబోరేటరీలోనే ప్రొఫెసర్ ల్యూక్ మోంటాన్నీర్ గ్రూప్ లో చేరింది. రిట్రోవైరస్ వ్యాధుల్ని సహజసిద్ధంగా రోగులెలా ఎదుర్కొంటున్నారో, రోగ నిరోధక శక్తి ఎలా పనిచేస్తుందో తెల్సుకోవటం ధ్యేయంగా ఆమె పనిచేసింది. ముఖ్యంగా వ్యాధి నివారణలో ఇంటర్ ఫెరాన్' (ఇదో రకం రసాయన అణువులు) పాత్రను ఎలుకలను మోడల్‌గా చేసుకుని పరిశోధనలు చేసింది.

1982 చివర్లో ప్రొఫెసర్ ల్యూక్ మోంటాన్నీర్ ను పారిస్‌లోని బిఛాట్ ఆస్పత్రిలో వైరాలజిస్ట్‌గా పనిచేస్తున్న ప్రాంకోయిస్ బ్రూన్-వెజినెట్ హెమోసెక్సువల్స్ (స్వజాతి సంపర్కం) లో విస్తారంగా వచ్చిన ఒక వ్యాధి విషయంలో సంప్రదించాడు. మోంటాన్నీర్, బార్ సినోస్సీలు ఆ వ్యాధిపై పరిశోధించసాగారు. అక్కడే బార్-సినోస్సీ జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. వారిరువురూ కలిసి ఆ వ్యాధిని కల్గిస్తున్నది ఒక రిట్రోవైరస్ అని, దానికి లింఫోఎడినోపతీ అసోసియేటెడ్ వైరస్ (Lymphadenopathy associated virus -LAV) అనే పేరు పెట్టారు. దీనిపై 1983లో ప్రముఖ శాస్త్రపరిశోధనా పత్రిక "సైన్స్”లో దీన్ని గురించి ప్రపంచానికి తెలియజేశారు. దీనితో మోంటాగ్నీర్, బార్-సినోస్సీలు ప్రపంచదృష్టిని ఆకర్షించారు. అంతేకాదు 2008లో వైద్యరంగంలో ఇచ్చే నోబెల్ బహుమతిని కూడా గెల్చుకున్నారు.

పాశ్చర్ సంస్థలో జీవశాస్త్ర విభాగానికి 1992లో బార్-సినోస్సీ అధిపతిగా నియమింపబడ్డారు. పరిమిత వనరులున్న దేశాలతో కలిసి ఎయిడ్స్ పై పరిశోధనలు కొనసాగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సుల్లో పాల్గొని ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పర్యటించారు. ఎందరో యువతీ యువకులను ఉత్తేజపరిచి పరిశోధనలో శిక్షణనిస్తోంది. అనేక ఎయిడ్స్ సంబంధిత సంస్థలకు సహాయపడుతోంది.

mar04.jpgఫ్రాన్స్ దేశపు నేషనల్ ఎయిడ్స్ ఏజెన్సీ పరిశోధనలకు, అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీకి 2012 జూలైలో అధ్యక్షురాలుగా ఎన్నికైంది. ఐక్యరాజ్య సమితి ఎయిడ్స్-హెచ్ఐవి ప్రొగ్రామ్ కు కన్సల్టెంట్ గా పనిచేస్తోంది. ఆఫ్రికా , ఆసియా దేశాల శాస్త్రవేత్తలు, ప్రజలతో కలిసి ఎయిడ్స్ పై పరిశోధనలు చేస్తున్నది. బార్-సినోస్సి ఎన్నో గౌరవ పురస్కారాలను అందుకొంది. సొవాక్ ప్రైజ్ క్యోర్బర్ యూరోపియన్ సైన్స్ ప్రైజ్, ఫ్రెంచ్ సైన్స్ అకాడమీ ప్రైజ్ , అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటి ప్రైజ్ , ఫ్రెంచ్ దేశపు జాతీయ పురస్కారాలు వాటిలో కొన్ని మాత్రమే.

సర్ జగదీష్ చంద్రబోస్

jcboseజననం: 30 నవంబర్ 1858

తల్లిదండ్రులు: భగవాన్ చంద్రబోస్, భామ సుందరీదేవి

జన్మస్థలం: మైమెన్ సింగ్ (పూర్వపు సంయుక్త బెంగాల్ రాష్ట్రం ప్రస్తుతం బంగ్లాదేశ్)

మరణం: 23 నవంబర్ 1937 (78 సం.ల వయస్సులో)

స్థలం: గిరిధ్ (ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో పుంది)

నివాసం: కోల్‌కతా

భార్య: అబలాబోస్

పనిచేసిన రంగాలు: భౌతికశాస్త్రం, జీప భౌతికశాస్త్రం, జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, పురాతత్వ శాస్త్రం, బెంగాలీ సాహిత్యం, బెంగాలి సైన్స్ కాల్పనిక కథలు.

చదువుకున్న సంస్థలు: కలకత్తా విశ్వవిద్యాలయం, క్రైస్ట్ కళాశాల, కేంబ్రిడ్డి (ఇంగ్లాండ్)

విద్యావిషయక సలహాదారు: జాన్ స్ట్రట్ రేలై

శిష్యులు: మేఘనాథ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్

గత మాసాల్లో మనం శాస్త్రజ్ఞులు మేఘనాధ్ సాహా, సత్యేంద్రనాథ్ బోస్ ల గురించి తెలుసుకున్నాం. వారికి విద్యాబోధన చేసిన గురువుగారైన జగదీష్ చంద్ర బోస్ గూర్చి మనం ఈ నెల తెలుసుకుందాం.

పనిచేసిన సంస్థలు : కలకత్తా విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం (ఇంగ్లాండు), లండన్ విశ్వవిద్యాలయం (ఇంగ్లాండు)

పనిచేసిన రంగాలలో గుర్తింపు పొందిన పరిశోధనలు: మిల్లీమీటర్ తరంగాలు, రేడియో వృక్షప్రవర్థమాన చూపకం (Cresco graph), వృక్షజీవ శాస్త్రం.

గౌరవం: జగదీష్ చంద్రబోస్ పేరు చంద్రుని మీద గల ఒక ఆగ్నిశిఖరబిలానికి పెట్టారు.

బహుమతులు, బిరుదులు:

 1. Companion of the order of the Indian Empire (CIE) - 1973
 2. Companion of the order of the Star of India (CSI) – 1911
 3. Knight Bachelor {Knighthood) - 1917

పై వివరాలు చూస్తూంటే సర్ జగదీష్ చంద్రబోస్ ఎంతటి బహుముఖ ప్రజ్ఞాశాలియో అర్థం ఆపుతుంది. జగదీష్ చంద్రబోస్ కలకత్తాలోని సెయింట్ క్యాలియర్ కళాశాల, కలకత్తా యూనివర్సిటీలో పట్టభద్రుడైన తర్వాత వైద్యవృత్తి నవలంబించాలన్న ఉద్దేశ్యంతో లండన్ యూనివర్సిటీలో వైద్యవిద్య నభ్యసించడానికి వెళ్ళాడు. కానీ ఆ క్రమంలో ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొని నోబుల్ బహుమతి గ్రహీత రేలై వద్ద పరిశోధక సహాయకునిగా పరిశోధన ఆరంభించాడు. అతడికి శవగృహం (mortuary) లోని వాసన సరిపడక వైద్యవిద్యను వదిలేశాడు. జీవితంలో మనమనుకున్నవి అన్నీ జరుగవు కదా!

జగదీష్ చంద్రబోస్ కృషి వలన భారతదేశంలో ముఖ్యంగా బెంగాల్లో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రపరిశోధనలు, సైన్స్ కాల్పనిక సాహిత్యం అభివృద్ధి చెందాయి. రేడియో సైన్స్ రంగంలో భారతదేశంలో అతడు చేసిన కృషిని Institute of Electrical and Electronic Engineers (IEEE) అతడ్ని భారతదేశంలో రేడియో సైన్స్ పితామహునిగా కీర్తించింది.

ఆ రోజుల్లో వర్ణవిచక్షణ బాగా వుండేది. శాస్త్రవరిశోధనకు నిధులు కరువయ్యేది. అన్నీ తట్టుకుంటూ బోస్ ఆంగ్లేయుల పాలనలో భారతదేశంలో నిస్త్రంత్ర గ్రాహకం (wireless signalling) లో అర్థవాహకాల (semi conductors) తో రేడియో సంకేతాలను గుర్తించవచ్చని మొదటిసారి నిరూపించాడు. దీనికి పేటెంట్ తీసుకుని ఆయన వ్యాపారం చేయకుండా తన శాస్త్ర పరిశోధనను అందరూ ఉపయోగించుకోవచ్చని ప్రకటించాడు.

ఆయన వృక్ష పదార్ధ తత్వ వివేచక శాస్త్రం (Plant Physiology) లో అనేక మార్గదర్శక పరిశోధనలు చేశాడు. వృక్షాల, మొక్కల పెరుగుదలను కొలిచే వృక్షప్రవర్ధమాన మాపకం (Cresco graph) ని కనుగొన్నాడు. ఈ పరికరం ఎంత సున్నితమైన విషయాలను రికార్డు చేయగలదంటే వృక్షభావనలను పసిగట్టుంది ముఖ్యంగా దెబ్బతగిలిన మొక్కల్లో ఈ విషయం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అతడు రాసిన పుస్తకాలు 'జీవులు-నిర్జీవుల్లో ప్రతిస్పందనలు' (1902), 'వృక్షాల్లో నాడీ యాంత్రికత' (1926) లలో ఈ విషయాలు చర్చించాడు.

ఆయన గొప్ప లౌకిక వాది. ఆయన కుటుంబ నేపథ్యం అటువంటిది. ఆ రోజుల్లో కాస్త డబ్బున్న వాళ్ళందరూ ఆంగ్లమాధ్యమం వున్న బడికి వెళ్తుంటే అతని తండ్రి భగవాన్ చంద్రబోస్ అతడ్ని బెంగాలీబడికి పంపించాడు. మాతృభాషలో పట్టులేకుండా ఆంగ్లం అలవాటు పడదని ఆయన భావన. ఆ బడిలో అతడితో పాటు తమ యింట్లో పనిచేసే ముస్లిం నౌకరు కొడుకు అతడి పక్కనే కూర్చునేవాడు, వాళ్ళను తీసుకుని ఆ తనింటికి వెళ్లే తల్లి సుందరీదేవి వారికి కూడా తినుబండారాలు పెట్టి ఆదరించేది. తన స్నేహితుల చెప్పే కథలను ఎంతో ఆనందంగా ఆస్వాదించేవాడు బోస్. బహుశా ఈ నేపధ్యమే ఆయన సైన్స్ కథలు రాయడానికి, ప్రకృతిని క్షుణ్ణంగా పరిశీలించడానికి పురిగొల్పి వుంటుంది.

సైన్స్ పట్టా పొందినంక ఎలాగూ వైద్యుడు కాలేకపోయినందుకు ఆయన సివిల్ సర్వీసు (ICS) లో చేరుదామని అనుకున్నాడు. కాని తండ్రి అందుకు ఒప్పుకోలేదు. (తండ్రి భగవాన్ దాస్ స్వయంగా సివిల్ సర్వీసులో వున్నాడప్పుడు ఇప్పటి ఐ.ఏ.ఎస్. అధికారులు తమ పిల్లలు కూడా ఐ. ఏ. ఎన్. కావాలని కోరుకుంటుంటే భగవాన్ దాస్ బోస్ ఆలోచనలు అందుకు విరుద్ధంగా వున్నాయి)

1885లో లండన్ నుండి వచ్చిం తర్వాత ఆయన లార్డ్ రిప్పన్ సన్నిహితుడు ఫాసెట్ కోరినకోరిక ననుసరించి లార్డ్ రిప్పన్ (వైస్రాయి) అతడ్ని ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేర్చుకోమని సిఫారసు చేశాడు. కాని సి హెచ్. టానీ ప్రధానాచార్యుడు రంగుభేదం పాటించే మనిషి, బోసకి యితరుల కంటే చాలా తక్కువ జీతం యిచ్చేవాడు. సిస్టర్ నివేదిత అప్పుడు బోస్ గూర్చి రాస్తూ ఒక చిన్న 24 x 24 అడుగు గదిలో ప్రయోగశాల ఏర్పాటు చేసుకొని స్థలం సరిపోక చాలా కఠిన పరిస్థితుల్లో బోస్ ప్రయోగాలు చేశాడని పేర్కొంది.

రేడియో తరంగాల మీద పరిశోధనలు:

జేమ్స్ హక్స్ వెల్ విద్యుదయస్కాంత తరంగాలున్నాయని ఊహించాడు. దానిని నిజం చేస్తూ హెన్రిక్ హెర్ట్జ్జ్ ఆకాశంలో విద్యుదయస్కాంత తరంగాల చలనాన్ని ఋజువు చేశాడు. కాని ఈ తరంగాల తరంగదైర్ఘ్యం ఎక్కువ. బోస్ తన పరిశోధనలతో ఈ తరంగ దైర్ఘ్యాన్ని 5 మిల్లీమీటర్ల స్థాయికి తీసుకుని రాగలిగాడు. ఈ మిల్లీమీటరు తరంగాలు ఉపయోగించి దూరంగా వున్న తుపాకి మందుని పేల్చడమే గాకుండా దూరంగా వున్న ఓ గంటను మోగించి ప్రయోగపూర్వకంగా చూపాడు. దీనిమీద 'అదృశ్యకాంతి' కి అనే ఒక వ్యాసాన్ని బెంగాలీలో రాసి ప్రచురించాడు. ఈ అదృశ్యకాంతి (మిల్లీమీటర్ తరంగాలు) గోడల నుండి, భవనాల నుండి చొచ్చుకొని పోగలవని అందుచేత వీటిని ఉపయోగించి సందేశాలు 5 (messages) పంపవచ్చని నిరూపించాడు. (1895). 5 వీటికి తీగలు అవసరం లేదు. On a new

Electro polarscope అనే బోస్ విరచిత వ్యాసం Nature (Vol. 36) అనే పత్రిక (లండన్)లో ప్రచురించారు. సైన్స్ ఆ రంగంలో యిదొక విప్లవంగా భావించారు.

నోబుల్ బహుమతి పొందిన సర్ నెవిల్ మాట్ 1977లో జె.సి. బోస్ తన జీవిత కాలానికి కనీసం అరవై ఏళ్ళముందున్నాడని వ్యాఖ్యానించాడు. ఆయన లోహాలు, వృక్ష కణజాలాలను పోలుస్తూ బోస్ అధ్యయనం చేశాడు. యాంత్రిక, ఉష్ణ, రసాయనిక, విద్యుత్ ప్రేరణలు లోహాలలోనూ, వృక్ష కణజాలంలోను, ఎటువంటి మార్పులు తీసుకుని వస్తాయో పోల్చి చూశాడు. వీటి మీద ఒక నివేదిక తయారుచేశాడు.

'పారిపోయే తుఫాన్' అని సైన్స్ కాల్పనిక కథలను 1896 నుండి 1921 నుండి రాసి, దాన్ని 1921లో ఒక పుస్తకంగా తీసుకుని వచ్చాడు. ఆయన మొట్టమొదటిగా నిస్త్రంత్రత కనుగొనే పరికరాన్ని కనిపెట్టాడు. ప్రఖ్యాత సైన్స్ పత్రిక నేచుర్ అతడి వ్యాసాలు 27 వరకు ప్రచురించింది. 1917లో అతడికి బ్రిటీష్ ప్రభుత్వం 'సర్' బిరుదునిచ్చి నైట్ హుడ్ ప్రదానం చేసింది. ఇండియన్ బొటానికల్ గార్డెన్ ని అతడి పేరు మీద ఆచార్య జగదీష్ చంద్రబోస్ భారత వృక్షశాస్త్ర ఉద్యానవనంగా 25 జూన్ 2009లో పేరు మార్చారు.

అత్యంత ప్రతిభాశాలి, బహుముఖ ప్రజ్ఞావంతుడు  జగదీష్ చంద్రబోస్ గిరిధ్(జార్ఖండ్)లో మరణించాడు.

పి. సి. మహాలనోబిస్

mahalanobisపూర్తి పేరు: ప్రశాంత చంద్ర మహాలనోబిస్

పుట్టిన తేది: 29 జూన్, 1893

మరణం: 28 జూన్, 1972 (వయస్సు 79 సం)

తల్లిదండ్రులు: ప్రబోధ చంద్ర మహాలనోబిస్, నిరోద్భాషిణి

మతం: బ్రహ్మ సమాజం

భార్య: నిర్మల్ కుమారి

చదువుకున్న సంస్థలు: బ్రహ్మూ ఉన్నత పాఠశాల (కలకత్తా), ప్రెసిడెన్సీ కళాశాల (కలకత్తా), కింగ్స్ కళాశాల (కేంబ్రిడ్జి)

డాక్టరేట్ పట్టా మార్గదర్శి: డబ్ల్యు. హెచ్. మెకాలే

ప్రఖ్యాత ఆవిష్కరణ: మహాలనోబిస్ దూరం

బహుమతులు:

 • వెల్డన్ స్మారక బహుమతి (ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి) (1944),
 • శ్రీదేవీప్రసాద్ సర్వాధికారి స్వర్ణ పతకం (1957),
 • దుర్గాప్రసాద్ ఖైతాన్ స్వర్ణ పతకం (1967),
 • పద్మ విభూషణ్ (1968),
 • శ్రీనివాస రామానుజన్ స్వర్ణపతకం (1968)

గౌరవాలు:

 • రాయల్ సొసైటీ, లండన్, సభ్యత్వం (1945),
 • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠం (1950),
 • ఎకనామెట్రిక్ సొసైటీ, యు.ఎస్.ఏ సభ్యత్వం (1951),
 • పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్, సభ్యత్వం (1952),
 • రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ, యూకే గౌరవ సభ్యత్వం (1954),
 • అకాడమీ ఆఫ్ సైన్సెస్, యూ.ఎన్.ఎస్.ఆర్ విదేశీసభ్యత్వం (1959),
 • కింగ్స్ కాలేజీ, కేంబ్రిడ్జ్ గౌరవ సభ్యత్వం (1959)
 • అమెరికన్ స్టాటిస్టికల్ అసోసియేషన్, సభ్యత్వం (1961)

ప్రబోధ చంద్రమహాలనోబిస్, నిరోద్భాషిణి దంపతులకు ప్రశాంత చంద్ర మహాలనోబిస్ 29 జూన్, 1893 న కలకత్తాలో జన్మించాడు. రాజారామ్మోహన్ రాయ్ ప్రబోధించిన కులమత భేదాలు పాటించని బ్రహ్మసమాజం ఆదర్శాలను ఈ కుటుంబం పాటించేది.

బ్రహ్మే బాలుర పాఠశాలలో ప్రశాంత చంద్ర 1968 లో పాఠశాల విద్యను పూర్తిచేసుకున్నాడు. తర్వాత ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన ప్రశాంత చంద్రకు జగదీష్ చంద్రబోస్, ప్రపుల్ల చంద్ర రే వంటి మహామహులు గురువులు. మేఘనాధ్ సాహా, సుభాష్ చంద్రబోస్‌లు జూనియర్లు. భౌతికశాస్త్రంలో బి.ఎస్.సి. పట్టా 1912 లో పుచ్చుకున్న మహాలనోబిస్ 1913 లో లండన్ యూనివర్సిటీలో చదువుదామన్న కోరికతో అతడు బ్రిటన్ కి బయలుదేరాడు.

బ్రిటన్ లో తాను ఎక్కవలసిన రైలు తప్పిపోయింది. అపుడు కేంబ్రిడ్జ్ లోని తన స్నేహితుడ్ని కలుసుకోవటానికి వెళ్ళినాడు. అక్కడ మహాలనోబిస్ కింగ్స్ కళాశాలలో వున్న చర్చి ముఖమంటపాన్ని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ మాట స్నేహితునితో అంటే “నువ్విక్కడే చదువుకోవచ్చు గదా' అని స్నేహితుడి మిత్రుడు యం.ఏ. కేడెల్ సలహా యిచ్చాడు. దానితో మహాలనోబిస్ కింగ్స్ కళాశాలలోనే చేరాడు. గ్రామీణ ప్రాంతాల్లో నడవటం, నదుల్లో చిన్న పడవలు నడపడం మహాలనోవిస్ అభిరుచులు.

భౌతికశాస్త్రంలో పైచదువులు పూర్తయిన తర్వాత నోబుల్ బహుమతి గ్రహీత (1927) క్యావెండిష్కి చెందిన ప్రయోగశాలలో పరిశోధనలు చేశాడు. లైబ్రరీలో 'బయోమెట్రికా' అనే పత్రిక చదివాడు. వెంటనే పాత పత్రికతో సహా ఒక సంపుటి కొన్న మహాలనోబిస్, వాటిని చదివి గణాంకశాస్త్రం పట్ల ఆకర్షితుడయ్యాడు. దానితో ఆయన ప్రయోగాలు మొదలు పెట్టి వాతావరణ శాస్త్రంలోనూ, మానవ వికాన శాస్త్రం (Anthropology) లోనూ దాన్ని ఉపయోగించవచ్చని రూఢి చేసుకున్నాడు.

భారతదేశం తిరిగి వచ్చి ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్ర అధ్యాపకునిగా చేరినాడు. అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి తన డిపార్ట్ మెంటులోనే గణాంకశాస్త్ర విభాగం ఏర్పర్చాడు, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (భారత గణాంకశాస్త్ర సంస్థ) అనే పేరుతో 28 ఫిబ్రవరి, 1932 న ఒక సహకార సంఘంగా ఏర్పరచాడు. దానిని సహకార సంఘ రిజిస్ట్రేషన్ చట్టం XXI-1860 ప్రకారం రిజిష్టరు చేయించాడు. 1959 లో ఈ సంస్థను జాతీయ సంస్థగా భారత ప్రభుత్వం ప్రకటించింది. కాని విశ్వవిద్యాలయ (Deemed University) హెూదాని ఇచ్చింది. కార్ల్ పియర్సన్ వెుదలు పెట్టిన 'బయోమెట్రికా' తరహాలో ఈ సంస్థ 'సాంఖ్య' అనే వతికను 1933 నుండి తీసుకురావడం మొదలు పెట్టింది.

‘మహాలనోబిస్ దూరం' (Mahalanobis Distance), 1920 లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఆయన 'జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా' సంచాలకులు ‘నెల్సన్ అన్నన్ డేల్ ' ని కలుసుకున్నాడు. అన్నన్ డేల్ ఆయనను భారతదేశంలో కలకత్తాలోని ఆంగ్లో ఇండియన్ల మానవాకృతి మాపనం చేయాల్సిందిగా కోరాడు. ఆంగ్లో ఇండియన్లలో భారతదేశం వైపు నుండి ఏ కులాల వారు ఎక్కువగా యూరోపియన్లను వివాహమాడారు? అనేది మానవాకృతి మాపనానికి ముఖ్యాంశంగా మహాలనోబిస్ భావించాడు. అన్నన్ డేల్ వద్ద అప్పటికే కొంత దత్తాంశం(data) ఉన్నది. దానితో ఆయన హెర్బర్ట్ రిజ్లే సేకరించిన కులాల డేటాతో యూరోపియన్లు ఎక్కువగా బెంగాలీలను, పంజాబీలను అది కూడా వారిలో ఉన్నత కులాలను మాత్రమే వివాహమాడారని నిర్ధారణకు వచ్చాడు. ఈ విశ్లేషణను అతడి శాస్త్రీయ పరిశోధనా పత్రంలో (1922) సమర్పించాడు. ఈ అధ్యయనంలో ఆయన జనాభాను సమూహాలుగా విడదీయడానికి, పోల్చడానికి ఒక బహుళ సంయోగ సామర్థ్య మాపనాన్ని రూపొందించాడు. ఈ మాపనం నేడు 'మహాలనోబిస్ దూరం' అనే పేరుతో ప్రసిద్ధమై అక్షరం 'D' - సూచించబడుతున్నది.

అంతేకాకుండా ఆయన తన ప్రయోగాలతో గణాంక శాస్త్రాన్ని విశ్వవిద్యాలయ పరీక్షల విశ్లేషణలోనూ, వాతావరణ సమస్యలను పరిష్కరించడంలోనూ వాడటం మొదలు పెట్టాడు. ఆయన కొంతకాలం వాతావరణ శాస్త్రజ్ఞుడిగా కూడా పనిచేశాడు. రెండవ పంచవర్ష ప్రణాళిక నుండి ఆయనను ప్రణాళిక సంఘంలో సభ్యునిగా చేరాల్సిందిగా అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ మహాలనోబిసని ఆహ్వానించాడు.

ఈనాడు జాతీయ నమూనా సర్వే సంస్థ ఆయన స్థాపించినదే. 'నమూనాల సేకరణ పద్ధతి' ని ఆయనే రూపొందించాడు. 1937 - 1944 మధ్య వినియోగదారుల ఖర్చులు, తేనీటి సేవన అలవాట్లు, ప్రజాభిప్రాయాలు, పంటలలో రోగాలు మొదలైన అనేక అంశాల మీద నమూనాలు సేకరించి గణాంకాలు రూపొందించాడు.

హెరాల్డ్ హాట్ వింగ్ అనే శాస్త్రజ్ఞుడు అమెరికాలోనే గాక, ఈ ప్రపంచంలో మరెక్కడా గాని లేని ఖచ్చితమైన సర్వే పద్దతులను మహాలనోబిస్ కనుగొన్నాడని ప్రశంశించాడు. సర్ ఆర్. ఏ. ఫిషర్ అనే ఆంగ్ల గణాంక శాస్త్రజ్ఞుడు 'మహాలనోబిస్’ అనుసరించిన పద్ధతులు, సాంకేతికత చాలా శక్తివంతమైనవని అన్నాడు. ఇవి పాలనలో అత్యంత ఉపయోగకరంగా వుంటాయని కూడా పేర్కొన్నాడు.

రెండవ పంచవర్ష ప్రణాళికలో వాసిలీ లియోంటిఫ్ నమూనా, మహాలనోబిన్ నమూనాలను ఉపయోగించి భారతదేశం పారిశ్రామికీకరణకు కావలసిన వివరాల సేకరణ జరిగింది. ఆ విధంగా పరిశ్రమలకు భారతదేశంలో బీజాలు పడ్డాయి.

మహాలనోబిస్, మాటమాట్లాడడం రానివారిలో గల రోగ లక్షణాలను నిర్ధారించడానికి జార్జ్జ్ కోస్టిక్, రియాదాస్, అలకానంద మిట్టల్‌లతో కలిసి పనిచేసి మాట సరిచేయడానికి పనిచేసే రంగంలో తన ప్రతిభావిశేషాలను వినియోగించాడు.

మహాలనోబిస్కు సాహిత్యం అంటే ప్రేమ. కొంతకాలం విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్రీ కార్యదర్శిగా పనిచేశాడు. భారతప్రభుత్వం అతడ్ని పద్మవిభూషణ్ (1968) తో సత్కరించింది. అంతేగాక, మహాలనోబిస్ స్మారకార్థం భారత ప్రభుత్వం అతడి పుట్టిన తేదీ (29 జూన్) ని జాతీయ గణాంక శాస్త్ర దినోత్సవంగా ప్రతీ సంవత్సరం జరుపుకోవాలని 2006 సంవత్సరంలో ప్రకటించింది.

సర్ ఉపేంద్రనాధ్ బ్రహ్మచారి

upendranathజననం: 19 డిసెంబర్ 1873

జన్మస్థలం: జమాల్ పూర్ (బీహార్)

తల్లిదండ్రులు: నీల్మోని బ్రహ్మచారి, సౌరభ్ సుందరీదేవి

విద్యాభ్యాసం: ఈస్ట్రన్ రైల్వే బాలుర ఉన్నత పాఠశాల, జమాల్ పూర్ హుగ్లీమోహసిన్ కళాశాల, హుగ్లీ ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా (కోల్‌కతా) కలకత్తా విశ్వవిద్యాలయం

సహదర్మచారిణి: నాని బాలాదేవి

మరణం: 06 ఫిబ్రవరి 1946 (72 ఏళ్ళు)

అవార్డులు: కైసర్-ఏ-హింద్, నైట్ హుడ్ ('సర్' బిరుదు), రాయ్ బహదూర్ (బిరుదు)

రాయ్ బహదూర్ సర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి వృత్తిరీత్యా వైద్యుడు. గొప్ప శాస్త్రవేత్త. 1929లో వైద్యవిభాగంలో నోబుల్ బహుమతికి అతడి పేరు సిఫారసు చేయబడింది. కాని నోబుల్ పురస్కారం అందినట్లే అంది చేజారిపోయింది.

నీల్మోని బ్రహ్మచారి, సౌరభ్ సుందరీదేవి దంపతులకు ఉపేంద్రనాథ్ 19 డిసెంబర్ 1873లో జమాల్ పూర్' లో జన్మించారు. తండ్రి తూర్పు రైల్వే మండలంలో రైల్వే డాక్టరుగా పనిచేస్తున్నారు. ఉపేంద్రనాథ్ తూర్పు రైల్వే బాలుర ఉన్నతపాఠశాల, జమాల్ పూర్లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి హుగ్లీ మొహసిన్ కళాశాల నుండి గణితం, రసాయనశాస్త్రం సబ్జెక్టులతో బి.ఏ. పట్టాను 1893 లో పొందాడు. తర్వాత వైద్యవిద్య నభ్యసించడానికి ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తాలో చేరి 1874 లో ఉన్నత రసాయనశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందాడు. కలకత్తా యూనివర్సిటీలో వైద్యవిద్య నభ్యసించి 1900 సంవత్సరంలో విశ్వవిద్యాలయంలోనే ప్రథమస్థానం సంపాదించాడు. ఆయన మెడిసిన్ లోనూ, సర్జరీలోను రెండిట్లోనూ ప్రథమునిగా నిలిచి గుడ్ ఈవ్ టెక్టివెడ్ బహుమతులను కైవసం చేసుకున్నాడు. 1902 లో యం.డి. పట్టాను పొందాడు. వైద్యంలో పరిశోధన చేసి 1904లో పి.హెచ్.డి. పట్టాను పొందాడు. 'పామోలిసిస్ వ్యాధి అధ్యయనం' మీద ఆయన సమర్పించిన పరిశోధక పత్రానికి ఆయనకు డాక్టరేట్ పట్టా లభించింది. హీమోలిసిస్ అంటే ఎర్రరక్తకణాలు విచ్ఛిన్నమై వాటిలోని కణద్రవం (సైటోప్లాజం) రక్తంలోకి విడుదల కావడం. ఈ విచ్ఛిన్నత తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది.

ఆయన 1898లో నాని బాలాదేవిని వివాహం చేసుకున్నాడు. డాక్టరు కోర్సు పూర్తి చేసింతర్వాత ఉపేంద్రనాథ్ సర్ బెరాల్డ్ బాంఫోర్డ్ (1851 - 1915) ఆధ్వర్యంలో కలకత్తాలో డాక్టరుగా సేవలందించాడు. బాంఫోర్డ్ ఉపేంద్రనాథ్ సామర్థ్యాన్ని గమనించి అతడ్ని ఢాకా మెడికల్ స్కూల్లో మానవ శరీరశాస్త్రం బోధించడానికి చేరవలసిందిగా కోరాడు (నవంబరు 1901). బాంఫోర్డ్ ప్రోత్సాహంతో ఆయన వైద్యపరిశోధనలు కొనసాగించాడు. బాంఫోర్డ్ ఆ తర్వాత ఇండియన్ మెడికల్ సర్వీస్క్ డైరెక్టర్ జనరల్ & సర్దన్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఉపేంద్రనాథ్ కలకత్తాలోని కేంద్బెల్ మెడికల్ స్కూల్ (ప్రస్తుతం దీనినే నీల్ రతన్ సర్కార్ వైద్యకళాశాల అని పిలుస్తున్నారు) లో 1905లో అధ్యాపకునిగా చేరాడు.

ఆ రోజుల్లో ఆయన ఒక చిన్నగదిలో కిరోసిన్ లాంతరు వెలుగులో ఒకే ఒక సూక్ష్మదర్శినితో రసాయనాలు కలుపుతూ ఆనాడు భారతదేశాన్ని వణికిస్తున్న కాలాఅజర్ అనే వ్యాధి (తెలుగులో 'కాలజ్వరం')కి మందు కనుక్కోటానికి ఒంటరిగా కృషిచేస్తున్నాడు. కాలా అజర్ (black fever) లేక లైష్మే నియాసిస్ అనే వ్యాధి జైష్మేనియా డోనావని అనే ప్రొటోజోవా సూక్ష్మజీవులతో ఏర్పడుతుంది. ఈ వ్యాధిలో ప్లీహం వాపు కొన్నిసార్లు కాలేయవాపు కూడా ఉంటుంది. తరచుగా జ్వరం బరువు తగ్గడం, రక్తహీనత ఏర్పడ్డాయి. అప్పటికి ప్రపంచంలో మలేరియా తర్వాత ఎక్కువగా మరణాలకు కారణమవుతున్నది ఈ వ్యాధే. ప్రతి సంవత్సరం 20 లక్షల నుండి 40 లక్షలమంది ఈ వ్యాధికి గురయ్యేవారు. హైదరాబాద్ కేంద్రంగా రోనాల్డ్ రాస్ మలేరియాకు మందు కనుగొని నోబెల్ బహుమానానికి 1902 లో అరుడయ్యాడు. 1913 లో రబీంద్రనాథ్ ఠాగోర్ భారతదేశానికి మొదటి నోబెల్ పురస్కారం అందించాడు.

'కాలా అజర్'కి కారణం ప్రోటోజోవా సూక్ష్మజీవులని అప్పుడు ఇండియాలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు విలియం బ్రేషన్, ఛార్లెస్ డోనావన్ 1903 లో కనుగొన్నారు. వారి పేర్ల మీదే ఆ సూక్ష్మజీవిని లైష్మేనియా డోనావని అని పేరు వచ్చింది. దయనీయమైన పరిస్థితులలోనే తన పరిశోధన కొనసాగించిన ఉపేంద్రనాథ్ 1919 లో 'కాలా అజర్'కి మందు కనుగొన్నాడు. ఈ మందే ఆంటిమొని సమ్మేళనం 'యూరియా స్టిబామైన్'. 1923 లో ఆయన దీన్ని ఒక సూదిమందుగా అభివృద్ధి చేశాడు. 1.5 గ్రాముల సిబామైన్తో 95% వున్న కాలా అజర్ వ్యాధి తగ్గుముఖం పట్టి 1925 కి 10%, 1936 కి 7% తగ్గి అనేకమంది ప్రాణాలు ఆయన కాపాడాడు,

అదే సమయంలో ప్రోటోజోవాలు ఒక రకమైన చర్మవ్యాధిని కూడా కలిగిస్తాయని ఉపేంధ్రనాథ్ కనుగొన్నాడు. ఆ వ్యాధికి 'బ్రహ్మచారి లైష్మనాయిడ్' అని పేరు పెట్టారు. అప్పుడే ఆయన రక్తహీనతను ఎదుర్కొంటానికి దాతల నుంచి రక్తాన్ని సేకరించాలని భావించి భారతదేశంలో మొట్టమొదటి రక్తనిధిని (blood bank) ఆయన కలకత్తాలోని ట్రాపికల్ మెడిసిన్ స్కూల్'లో ప్రారంభించాడు. ఆయన బెంగాల్ రెడ్ క్రాస్ సొసైటీకి 1935 లో చైర్మన్ గా వ్యవహరించాడు.

1929 లో ఉపేంద్ర నాథ్ నోబెల్ బహుమానానికి శాస్త్రవేత్తలు సిఫారసు చేశారు. ఆ సిఫారసుని పరిశీలన చేయడానికి స్వీడిష్ అకాడమీ హాన్స్ క్రిస్టియన్ జాకోబియన్, గోరన్ విల్జెస్ట్రాండ్ అనే శాస్త్రవేత్తలను భారతదేశం పంపింది. కాని ఆ సంవత్సర బహుమతి “విటమిన్లు' కనుగొనిన క్రిష్టియన్ ఐజర్న్స్, సర్ ఫ్రెడ్రిక్ గౌలాండ్లకు దక్కింది.

మలేరియాకు మందు కనుగొన్న రోనాల్డ్ రాస్తి బ్రిటిషర్లు బ్రహ్మరథం పట్టగా అప్పుడు ప్రపంచంలో రెండవ అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణమైన 'కాలా అజర్'కి మందు కనుగొన్న ఉపేంద్రనాథ్స్ మాత్రం భారతీయులు సంస్మరించుకోకపోవడం, ఎటువంటి గౌరవ మన్ననలను ప్రదర్శించక పోవడం మన శాస్త్రజ్ఞులను మనం ఎంత తక్కువ గౌరవంతో చూస్తామో అర్థం అవుతుంది.

బ్రిటీష్ ప్రభుత్వం మాత్రం అతడి గొప్పతనాన్ని గుర్తించింది. అతడికి 1913లో రాయ్‌బహదూర్ బిరుదుని 1914 లో ‘నైట్‌హుడ్' ని యిచ్చి ‘సర్’ బిరుదుతో సత్కరించింది.

సలీం అలీ

salimaliపూర్తి పేరు: సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ

జననం: 12 నవంబర్ 1896

స్వస్థలం: ముంబై (అప్పుడు బొంబాయి)

తల్లిదండ్రులు: మొయిజుద్దీన్, జీనతున్నిసా

సహధర్మచారిణి: తెహ్మినా అలీ

విద్యాభ్యాసం: జెనానా బైబిల్ అండ్ మెడికల్ మిషన్ గర్ల్స్ హైస్కూల్, గిర్గాం, ముంబాయి (ప్రాథమిక విద్య), సెయింట్ జేవియర్ కళాశాల, ముంబై.

మరణం: 20 జూన్ 1987 (90 ఏళ్ళు)

అవార్డులు, గౌరవాలు:

 • జాయ్ గోవింద లా గోల్డ్ మెడల్ (ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ - 1953)
 • సుందర్ లాల్ హూరా మెమోరియల్ మెడల్ (ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ -1970)
 • బ్రిటిష్ ఆర్నిథాలజిస్ట్ ల యూనియన్ గోల్డ్ మెడల్ - 1967
 • జె. పాల్ గెట్టీ వన్యమృగ సంరక్షణ బహుమతి - ఒక లక్ష పౌండ్లు – 1967
 • (ఈ బహుమతితో ఆయన సలీం అలీ ప్రకృతి సంరక్షణ నిధిని ఏర్పాటుచేశాడు)

 • జాన్.సి. ఫిలిప్స్ మెడల్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచుర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ - 1969)
 • పావ్లోవిస్కీ సెంటినరీ మెమోరియల్ మెడల్ (ది యూ.ఎస్.ఎస్.ఆర్. అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ - 1973)
 • ఆర్డర్ ఆఫ్ గోల్డెన్ ఆర్క్ (కమాండర్ ఆఫ్ నెదర్లాండ్స్ బిరుదు)
 • పద్మభూషణ్ (భారత ప్రభుత్వం - 1958)
 • పద్మవిభూషణ్ (భారత ప్రభుత్వం - 1976)
 • రాజ్యసభ సభ్యత్వం (1985 – 87)
 • అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (1958)
 • ఢిల్లీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (1973)
 • ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ (1978)

పదేండ్ల పిల్లవాడు తన బొమ్మ తుపాకినీ ఉపయోగించి గాలిలో ఎగురుతున్న ఒక పిచ్చుకను నేలకూల్చాడు. కాని దాని మెడ పసుపు రంగులో వుండి ఆ పిచ్చుక అతడికి విలక్షణంగా కనిపించింది. దాన్ని అతడు తన మేనమామ అమీరుద్దీన్ త్యాబ్ది దగ్గరకు తీసుకువెళ్ళి అది ఏరకం పక్షో చెప్పమని అడిగాడు. ఆయన సమాధానం చెప్పలేక ఆ పిల్లవాడ్ని బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ గౌరవ కార్యదర్శి డబ్ల్యు. ఎస్. మిల్లర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆ పిల్లవాడి తీవ్ర ఆసక్తిని గమనించిన మిల్లర్ట్ లోపలి భాగాలు తీసివేసి సహజమైన ఆకారం అలాగే వుండటానికి లోపల తగిన పదార్థం కుక్కిన పక్షుల శరీరాలను (Stuffed birds) చూపించాడు. అందులో పసుపురంగు మెడ కలిగిన పిచ్చుకను చూసి ఆ పిల్లవాడు ఉత్తేజితుడయ్యాడు. ఆ సంఘటనే అతడ్ని పక్షులను పరిశీలించే వాడిగా తయారుచేసింది. ఆ పిల్లవాడే సలీం అలీ. ఆ తర్వాత అతడు రాసుకున్న ఆత్మకథకు ఆయన 'ది ఫాల్ ఆఫ్ ఎ స్పారో' (నేలరాలిన ఒక పిచ్చుక) అని పేరుపెట్టుకున్నాడు.

సలీంఅలీ సులేమాని బొహ్రా ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తండ్రి మోయిజుద్దీన్, సలీం అలీకి ఒక సంవత్సరం వయసున్నపుడు మరణించాడు. తల్లి జీనతున్నీసా సలీంఅలీ మూడో ఏటనే మరణించింది. మేనమామల దగ్గర పెరిగిన సలీంఅలీకి చిన్నప్పటి నుండి 'షూటింగ్' క్రీడపట్ల ఆకర్షణ వుంది. బొమ్మ తుపాకీ(Toy Gun) తో పక్షులను వేటాడేవాడు. అతడి మరొక మేనమామ అబ్బాస్ త్యాబ్ది స్వాతంత్ర్య సమరయోధుడు. అతడి చిన్నతనంలో స్నేహితుడైన ఇస్కందర్ మీర్జా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆ దేశానికి ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

మిల్లర్ట్తో సలీం అలీ పరిచయం సలీం జీవితాన్ని పక్షుల అధ్యయనం వైపు మరల్చింది. మిల్లర్డ్ అతడికి పక్షుల మీద అనేకమైన పుస్తకాలిచ్చాడు. అందులో ఒక పుస్తకం 'ఎహ రచించిన బొంబాయిలో సాధారణంగా కనపడే పక్షులు (Common Birds of Bombay) ఒకటి. అంతేగాకుండా మిల్లర్ట్ అతడిని ఆ బాల్యావస్థలోనే బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS) సంరక్షకుడు (curator) సర్ నార్మన్ బాయిడ్ కిన్నియర్క్ పరిచయం చేశాడు. ఆయనే తర్వాత బ్రిటీష్ మ్యూజియంకి క్యురేటర్‌గా వెళ్ళి సలీం అలీకి అనేక అంశాల్లో సాయపడ్డాడు.

సెయింట్ జేవియర్‌లో మొదటి సంవత్సరం తర్వాత చదువు మానేసి కుటుంబ వ్యాపారం వోల్ఫ్రం (టంగ్స్టన్) మైనింగ్ కోసం సలీం బర్మా వెళ్ళాడు. అక్కడ అడవుల్లో వేటలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇండియాకు 1917లో తిరిగివచ్చి దావర్ కాలేజీలో కమర్షియల్ లా ఎకౌంటెన్సీ కోర్సులో చేరాడు. కాని జేవియర్ కళాశాలలోని ఫాదర్ ఎథిల్ బెర్ట్ బ్లాటర్ అతడి అభిరుచిని గమనించి జంతుశాస్త్రాన్ని అధ్యయనం చేయమని సూచించాడు. అలా అతడు జువాలజీలో ఒక కోర్సు పూర్తిచేశాడు. కాని అది డిగ్రీకాదు. అప్పుడే అతడు తన దూరపు బంధువైన తెహ్మీనాను 1918లో వివాహం చేసుకున్నాడు. తర్వాత మోటార్‌బైక్ మీద భారతదేశం నుండి యూరప్ వరకు ప్రయాణం చేసి స్వీడన్‌లోని ఉప్సాలాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఆర్నిథాలజికల్ కాంగ్రెస్ కి హాజరయ్యాడు. పక్షి విషయక శాస్త్రాన్ని అర్నిథాలజీ (Ornithology) అని ఆంగ్లంలో అంటారు. అతడికి తన పదో ఏట నుండి తను పరిశీలించిన పక్షుల వివరాలను డైరీలో రాసుకునే అలవాటుంది.

జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆర్నిథాలజిస్ట్ (పక్షి శాస్త్రజ్ఞుడు) పోస్టుకి ధరఖాస్తు చేసుకున్నా, డిగ్రీ లేనందున ఎంపిక కాలేకపోయాడు. ప్రిన్స్ వేల్స్ మ్యూజియంలో ప్రొఫెసర్ ఎర్విన్ స్టామన్ ఆధ్వర్యంలో పనిచేయడానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అక్కడ అతడికి అనేక పక్షుల నమూనాలు పరిశీలించే అవకాశం దొరికింది. ప్రపంచ ప్రసిద్ధ పక్షి శాస్త్రజ్ఞులు బెర్నార్డ్ రెంచ్, అస్కర్ హెయిన్ రాత్, ఎర్నెస్ట్ మేయర్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడే బెర్లిన్‌లో ఆయనకు భారతీయ విప్లవకారుడు చంపకరామన్ పిళ్ళైతో పరిచయం ఏర్పడింది.

1930 లో ఆయన భారతదేశం చేరుకునేసరికి ఆయన గైడ్ పదవి ప్రిన్స్ వేల్స్ మ్యూజియంలో ఆర్ధికకారణాల దృష్ట్యా రద్దుచేశారు. తర్వాత ఆయన హైద్రాబాద్, కొచ్చిన్, ట్రావెన్కూర్, గ్వాలియర్, ఇండోర్, భోపాల్‌లలో ఆయా రాచరిక ప్రాంతాల పాలకుల ఆర్థిక సాయంతో పక్షులను అధ్యయనం చేశాడు. అదే సమయంలో హుఫ్ విజ్ఞర్ అనే పక్షి శాస్త్రజ్ఞుడు రాసిన 'ది స్టడీ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ అనే పుస్తకంలో గల అసంగత అంశాలను సలీం ఎత్తి చూపాడు. ముందు చిరాకుపడిన విజ్ఞర్ తర్వాత తన తప్పులను అంగీకరించి సలీం అలీతో కలిసి పనిచేశాడు. విజ్ఞర్ అతడిని రిచర్డ్ మైనర్జీగన్ అనే మరో పక్షి శాస్త్రజ్ఞుడికి పరిచయం చేశాడు. ఇరువురూ కలిసి ఆఫ్ఘనిస్తాన్లోని పక్షులను అధ్యయనం చేశారు.

సలీం సతీమణి ఈ జీవనయానంలో అతడికి వెన్నెముకగా నిల్చింది. సలీం అలీ రాసిన పుస్తకాలలోని భాషను ఆమె సరిచేసేది. అందువల్లనే శాస్త్రజ్ఞులు కూడా సముచిత గౌరవం కల్పించారు. కాని తహ్మీనా 1939 లో మరణించింది. తర్వాత ఆయన తన సోదరి కమ్మో, బావతో కలిసి జీవించాడు.

వ్యక్తిగతంగా ముస్లిం వాతావరణంలో పెరిగినప్పటికీ సలీం సంప్రదాయవాది కాదు. పైగా అర్ధంలేని నిబంధనలని తాను భావించిన వాటిని నిరసించాడు కూడా.

సలీం పక్షుల మీద అనేక వ్యాసాలు, పుస్తకాలు రాశాడు. ముఖ్యంగా డిలియన్ రిప్లేతో కలిసి అతడు ‘హేండ్ బుక్ ఆఫ్ బర్డ్స్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్’ పది సంపుటాలు వెలువరించాడు.

అలాగే కేరళ పక్షుల మీద, గుజరాత్ పక్షుల మీద, ఈశాన్య హిమాలయాల్లోని పక్షుల మీద అతడు పుస్తకాలు రాశాడు. కొన్ని పుస్తకాలను నేషనల్ బుక్ ట్రస్ట్ అతి తక్కువ ధరలకు అందచేస్తున్నది.

అతడి దగ్గర అనేక మంది విద్యార్థులు ఆర్నిథాలజీలో పి.హెచ్.డి. చేశారు. విజయ్ కుమార్ అంబేద్కర్, తారాగాంధి మొదలైన వారు వాళ్ళలో ఉన్నారు. ఆయన గౌరవార్ధం భారతదేశంలోని కొన్ని పక్షులకు ఆయన పేరు కలిసి వచ్చేటట్లు ప్రపంచ శాస్త్రజ్ఞులు పేర్లు పెట్టారు,

ఇటీవల ఈశాన్య హిమాలయాల్లో కొత్త పక్షిని కనుగొన్న పెర్ అల్ స్టామ్ (స్వీడన్), శశాంక్ దల్వీ (బెంగళూరు) ఆ పక్షికి జూతేరా సలీమాలి అని పేరు పెట్టారు (2016). అంతకుముందే ఒక రకం గబ్బిలం తెగకి లాటిడెన్స్ సలీమాలీ అని, ఒక రకం వడ్రంగి పిట్టకి ఆయన భార్య పేరు కలిసివచ్చేటట్లు డైనోపియం బెంగాలెన్స్ తెహ్మినే అని (విట్లర్, కెన్నియర్ల ద్వారా), మరో పక్షికి ఆపస్ సలీమాలి అని పేర్లు పెట్టారు.

కోయంబత్తూరులో “సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ” వుంది. పుదుచ్చేరిలో పాండిచ్చేరి యూనివర్సిటీలో సలీం అలీ స్కూల్ ఆఫ్ ఎకాలజీ, ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్ విభాగం వుంది. BNHS వున్న ప్రాంతాన్ని ముంబాయిలో ‘డా సలీం అలీ చౌక్’ అని పిలుస్తారు. గోవాలోనూ, కేరళలోనూ ‘సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రాలు’ వున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో గుర్తింపు పొందిన పక్షి శాస్త్రజ్ఞుడ్ని యిలా పేర్లు పెట్టడం ద్వారా గౌరవించాయి.

భారత వ్యవసాయానికి మార్గదర్శి డా. వై. యల్. నీనే

apr01.jpgవ్యాధులు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా?” జబ్బునపడ్డ వాళ్లను ఓదార్చడానికి పెద్ద వాళ్లు చెప్పేమాట ఇది. కాని అది ఒకప్పటి మాట. మనుషులకే కాక మానులకు (చెట్లకు) కూడ జబ్బులు చేస్తాయన్నది కాదనలేని సత్యం. మొక్కలపై వ్యాధులను తెల్సుకోవటం, పరిశోధించటం, నివారించటం వ్యవసాయంలో చాల ప్రధానమైన అంశం. మన పంటలకు రోగాలు సోకితే ఏదో గ్రామదేవతనో, మరొకర్నో శాంతపరచడం, పూజించటం మన సమాజం తొలినాళ్లలో చేసింది. అటుతర్వాత శాస్త్రీయంగా మొక్క వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులను గుర్తించటం, వ్యాధి నివారణపై పరిశోధనలు కొనసాగాయి.

మనందరికీ అన్నం పెట్టే వరిపంటపై వచ్చే వ్యాధుల్ని పరిశోధనలు చేసి నిగ్గు తేల్చిన శాస్త్రవేత్త డా. వై.యల్. నీనే (Dr. Y.L. NENE). వరిపై వచ్చే 'ఖైరా' వ్యాధి (Khaira Disease)కి కారణాన్ని తేల్చి చెప్పిన వాడు డా. నీనే. వరి మొక్కపై ఆకులు ఇత్తడి రంగులో ఉండి గిడసబారి, కంకి వేయకుండా పోయేవి. ఇదెందుకు వస్తుందో, దీనికి కారణం ఏమిటో చాలాకాలం వరకు రహస్యంగానే మిగిలిపోయింది. రైతు దిక్కుతోచని స్థితి నుండి బైటపడటానికి డా. నీనే ముఖ్యపాత్ర పోషించాడు. ఇదేదో వైరస్ వలనో, ఇతర సూక్ష్మజీవుల వల్లనో వస్తుందని అనుకొనేవారు. కాని దీనికి కారణం ‘జింక్ లోపం అని కనిపెట్టి భారతదేశంలో వ్యవసాయానికి, రైతుకు మేలు చేసిన శాస్త్రవేత్త డా. నీనే.

డా. నీనే పూర్తి పేరు యశ్వంత్ లక్ష్మణ్ నీనే. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణంలో 1936 నీనే - జన్మించాడు. ప్రీ డిగ్రీవరకు గ్వాలియర్‌లో చదివిన నీనే 1955 లో డిగ్రీ, 1957 లో పి.జి. పట్టాలను ఆగ్రా యూనివర్సిటీ నుంచి పొందాడు. వృక్షవ్యాధి శాస్త్రంలో (plant pathology) మంచిపట్టు సాధించాడు. ఆ తర్వాత ఆమెరికా వెళ్లి మొక్కల వైరస్ల (plant viruses) పై 1960 లో పి.హెచ్.డి. చేశాడు. ఉత్తరప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి వృక్షవ్యాధి శాస్త్ర బోధనలో నూతన ధోరణులకు బీజం వేశాడు.

డా. నీనే అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం 'ఇక్రిసాట్' (ICRISAT) ను హైద్రాబాద్ లో పటాన్ చెరు దగ్గర 1974లో ఆరంభించినపుడు పప్పుజాతి పంటల ప్రధానశాస్త్రవేత్తగా పనిచేయాలనే ఆహ్వానం అందుకుని పంత్ నగర్ నుండి ఇక్రిశాట్‌కు వచ్చాడు.

ఇక్కడి ఇక్రిసాట్లోనే డా. నీనే శనగపంటపై వచ్చే ఎండు తెగులుకు కారణమైన అనేక వ్యాధి జనకజీవుల పాత్రను నిర్ధారించి, నివారణకు బాటలు వేశాడు. ఎండు తెలుగుకు ప్రధాన కారణమైన వ్యుజేరియం శిలీంద్రంలో వచ్చిన జన్యుపరమైన మార్పులు, కొత్త రేసులు ఏర్పడటాన్ని కనుగొన్నాడు.

పంటలు, వ్యాధులు, పరిశోధన నీనే జీవితంలో ఒక ఎత్తైతే, భారత వ్యవసాయం ఎలా అభివృద్ది చెందిందో గత శతాబ్దాల్లో సైన్సు పూర్తిగా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా మన దగ్గర వ్యవసాయ విజ్ఞానం ఎలా ఉండేదో సమాజానికి తెలియాలని నీనే కంకణం కట్టుకున్నాడు. ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టిపెట్టి మేల్ తలపెట్టిన ఘనుడు డా. నీనే. తన ఉద్యోగాన్ని ముందే విరమించి తన స్వంతడబ్బు ఖర్చు పెట్టి ఆసియా ఖండంలో వ్యవసాయ చరిత్ర (Asian Agri-History) పై ఒక పౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ పౌండేషన్ ఆధ్వర్యంలో సంస్కృతం, కన్నడ, మలయాళం, పర్షియన్ భాషల్లో ఉన్న వ్యవసాయ విజ్ఞాన చరిత్రను అనువదించి గత 20 సంవత్సరాల నుండి ప్రజలకు అందిస్తున్నాడు.

apr02.jpgభారతదేశంలో వ్యవసాయం పైనా, ముఖ్యంగా వృక్షవ్యాధి శాస్త్రం పైనా ప్రతి సంస్థ అభివృద్ధి వెనుక డా. నీనే ప్రోత్సాహం, పాత్ర ఉన్నాయి. భారతవృక్ష వ్యాధి శాస్త్ర సొసైటీ (Indian Phytopathological Society) కి అధ్యక్షులుగా పనిజేశారు. ఆయన అందుకున్న అవార్డులు కోకొల్లలు. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయ విజ్ఞానచరిత్ర (Asian Agri-History) పై త్రైమాసిక పత్రిక నడుస్తున్నది. భారతదేశం గ్రామాల్లో నివసిస్తుందన్న మహాత్ముని మాటకు ఇరుసులా పనిజేసే వ్యవసాయానికి సేవలందిస్తున్న మేధావి డా. వై.యల్. నీనే నేటి తరానికి గొప్ప మార్గదర్శి.

డాక్టర్ జాక్వేలిన్ కె. బార్టన్

may06.jpgమీరు మీ తల్లిదండ్రుల నుండి ఏమి ఆశిస్తారు? డబ్బా, బంగారమా, ఆస్తిపాస్తులా! లేక మంచి నడవడికనా? ఇలాంటివి ఎందరికి వస్తాయో రావో చెప్పలేం. కాని ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. వారి నుండి జన్యువులు, ఆ జన్యు సమాచారంతో వచ్చే వంశపారంపర్య లక్షణాలు మాత్రం గ్యారెంటీగా పిల్లలకు వచ్చి తీరుతాయి. జన్యువుల్లో ఉండే పదార్థం ఏది? DNA అనే ఒక కేంద్రకామ్లం.

may07.jpgఇది కేవలం మనుషుల్లోనే కాదు అన్ని రకాల జీవుల్లో కూడా ఇదే పనిచేస్తుంది. ప్రతి వ్యక్తి కణంలో ఆ మాటకొస్తే అన్ని జీవరాసుల కణాల్లో కూడ ఈ డీ ఆక్సీరైబోన్యూక్లిక్ ఆమ్లం (DNA) జన్యు సమాచారాన్ని తనలో పొదిగి ఉంచుతుంది. ఈ సమాచారం అంతా కేవలం నాలుగంటే నాలుగు అక్షరాల్లో (అవే నత్రజని క్షారాలైన ఎడినైన్ (A), గ్వానైన్ (G), సైటోసిన్ (C) థైమీన్ (T) ఒదిగి లేదా నిల్వచేయబడి ఉంటుంది.

may09.jpgకన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ఉన్న ప్రజలందరిలో జాతి, కుల, విచక్షణ లేకుండా ఈ DNA 99.9% ఒకేరకంగా ఉంటుంది. ఇంత ఏకత్వం మన DNAలో ఉంటే మనం జాతుల పేరుతో, మతాల పేరుతో, కులాల పేరుతో విడిపోయి కొట్లాడుకోవటం ఎంత అశాస్త్రీయమో మీరే ఆలోచించండి!

ప్రతి జీవిలో, మనిషిలో ఉండే ఈ DNAకి దెబ్బతగిలి, చెదిరిపోయే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆ జంట గడల నిచ్చెన వంటి మెలిదిరిగిన DNA దారాలకు హాని జరిగి ఏమైనా నష్టం జరిగితే ఎలా? ఎప్పటికీ ఏమీ జరుగక, నిక్షేపంలా ఉంటుందనుకోవడం భ్రమే. దెబ్బలు తగలటం సహజమే కదా! మరలా నష్టం వాటిల్లితే జీవులెలా వాటిని సరిదిద్దుకుంటాయి? DNAలో లోపం వస్తే ఏం జరుగుతుంది. ఊహించండి ఏమి జరుగుతుందో..! ఇలానే ఒక మహిళా శాస్త్రవేత్త ఆలోచించారు. ఆమెనే నేటి మన సమకాలిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాక్వెలిన్ బార్టన్. ప్రతి జీవికణంలో ఉండే DNAకు నష్టం లేదా లోపం ఏర్పడవచ్చని ఊహించడం సులువే. కాని దానిని కన్గోనటం ఎలా? ఏదైనా లోపాన్ని కన్గోంటేనే కదా మనం దాని నివారణా మార్గాన్ని అన్వేషించేది! ముందుగా DNA నిర్మాణక్రమంలో వచ్చేలోపాలు మనుషుల్లో రకరకాల వ్యాధులకు దారి అస్తాయని తెల్సుకున్నారు. ఆ లోపాలు మామూలు వ్యాధులకు కారణం కావటం కాదు కేన్సర్ వంటి ఎంతో ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తాయని తెల్సుకున్నారు. ఆ ప్రమాదాన్ని నివారించాలంటే ముందుగా కారణాన్ని పసిగట్టాలి మరి.

ఆ పనిలోనే జాక్వెలిన్ బార్టన్ సుదీర్ఘంగా పరిశోధనలు చేశారు. DNA అణువులో ఏ లోపం లేకుండా ఉన్నపుడు విద్యుత్ ప్రసరణ సాఫీగా సాగటాన్ని గమనించింది. మరి దానిలో లోపం ఏర్పడితే! అక్కడే జాక్వెలిన్ బార్టన్ నూతన ఆలోచనలు, అటు తర్వాత విజయానికి సోపానం వేశాయి. DNA అణువులో లోపం ఏర్పడినపుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోవటాన్ని కనిపెట్టింది. ఇంత సామాన్యమైన విషయం నుండి క్యాన్సర్ వంటి రోగ నివారణకు దారితీసే పరిశోధనలకు బాట వేసిన ఘనత డా. జాక్వెలిన్ బార్టన్ది.

may08.jpgజాక్వలిన్ బార్టన్ ఎలక్ట్రాన్లను DNA అణువులోకి ఘాట్ చేసి తుపాకీ గుండు ఎంత వేగంగా పోతుందో అలా? తదనంతరం DNA అణువులో జరిగే మార్పులను ని గమనించారు. ఈ విధంగా విద్యుత్ ప్రవహింపజేసి జన్యుస్థానాలను గుర్తించారు. అవి ఏ విధంగా అమరి ఉన్నాయో, వాటికి లోపం ఎకడైనా, ఏమైనా జరిగిందో తెల్సుకోవటానికి ఈ కొత్తపద్ధతి ఎంతో ఉపయోగపడింది. ఇదొక వినూత్న పద్దతి మాత్రమే గాక రోగనిర్ధారణకు సులువైన పద్ధతిగా కూడ ఉపయోగపడింది. దీనితో జరిగిన నష్టాన్ని లేదా ఏర్పడిన లోపాన్ని సరిదిద్ది రోగాన్ని నయంజేసే విధానాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

క్యాన్సర్ తొలిదశలోనే గుర్తించటానికి, రసాయన చికిత్సలో ఉపయోగపడే పరివర్తన మూలకాల సంక్లిష్ట సమ్మేళనాలను తయారుచేసి జాక్విలిన్ బార్టన్ పరీక్షించారు. అందులో ప్రధానమైనవి రోడియం, రుథీనియం సంక్లిష్ట సమ్మేళనాలు DNA లోపం ఉన్న ప్రదేశంలో మందును విడుదల చేసి రోగాన్ని సమర్ధవంతంగా నయం చేయటానికి రోడియం సంక్లిష్ట సమ్మేళనాలు బాగా పనిజేస్తాయి. రుథీనియం సంక్లిష్ట సమ్మేళనాలకు ఉండే దీప్తిమయ (Luminiscent) లక్షణం క్యాన్సర్ కారక కణాలను గుర్తించటానికి ఉపయోగపడతాయి.

మెలితిరిగిన జంట గల నిచ్చెన (Helical double standard DNA) వంటి DNAలో సోడియం సంక్లిషాన్ని సమ్మేళనాన్ని ఒక ప్రదేశంలోను, దానికి చాల దూరంగా రుథీనియం సంక్లిష్ట సమ్మేళనాన్ని అనుర్చవచ్చు. దుథీనియం సంక్లిష్ట సమ్మేళనంలో ఎలక్ట్రాను అధికంగా ఉండటం వలన అది ఎలన్ వనరుగా పనిచేస్తుంది, అదే రోడియం సంక్లిష్ట సమ్మేళనం ఎలక్ట్రాన్లలోటులో ధనావేశ రంధ్రంగా ఉండి విద్యుత్ ప్రవాహ రుథీనియం నుండి రోడియం వరకు సాఫీ జరిగేటట్లు చూస్తుంది, ఈ విధంగా ఎల్వను రుథీనియం నుంచి రోడియం వరకు ఒక ఫెమిటో సెకండ్ (1X10-15 సెకండ్లు) అటు, ఒక మిల్లీ సెకండ్ (1 X 10-3 సెకండ్లు) ఇటు నిరంతరం స్థిరంగా ఉండకుండా తిరుగుతూనే ఉంటాయి, మధ్యలో ఎక్కడైనా, ఏదైనా ఒక నత్రజనిక్షారం (Nitrogen Base) దెబ్బతింటే (లోపం వస్తే) విద్యుత్ ప్రవాహంలో అంతరాయం వచ్చి ఆగిపోతుంది. ఈ విధంగా DNA లో వచ్చేలోపాలను పసిగట్టవచ్చు. 'కీలెరిగి వాత బెట్టమని' మన సామెత. లోపం పసిగడితే బాగుచేయటం కూడా సులువే కదా! కష్టమైనా ప్రయత్నించవచ్చు గదా!

జాక్వెలిన్ బార్టన్ న్యూయార్క్ నగరంలో 1952లో జన్మించింది. ఆమె తండ్రి న్యూయార్క్ రాష్ట్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తి. తల్లి బెల్జియన్ యూదు నియంత హిట్లర్ సైన్యం దాడి నుండి తప్పించుకొని ఇంగ్లాండు చేరుకుంది. తర్వాత ఆమె అమెరికా వలస వెల్లింది.

రసాయన శాస్త్రంలో లెక్కకు మిక్కిలి అవార్డులు, బిరుదులు అందుకున్న జాక్వెలిన్ చిన్నపుడు స్కూల్లో రసాయన శాస్త్రాన్నే చదువుకోలేదట. ఆమె చదువుకున్న బాలికల పాఠశాలలో రసాయనశాస్త్రం బోధించేవారు కాదు. కొలంబియా యూనివర్సిటీకి వచ్చి కాలేజీ చదువులు మొదలయ్యే వరకూ రసాయనశాస్త్ర వాసనలే ఆమెకు తెలియవు. ఒక్కసారి ఆ శాస్త్రాన్ని చదవటం, వయోగాలు చేయటం మొదలు పెట్టిన తర్వాత రసాయనశాస్త్రమే ఆమె జీవితం అయింది. ప్రొఫెసర్ జి.యస్. లిప్పార్ట్ అనే సుప్రసిద్ధ రసాయనశాస్త్రవేత్త దగ్గర తను ఇనార్గానిక్ కెమిస్ట్రీలో డాక్టరేట్ (పి.హెచ్.డి.) చేసింది. డాక్టరేట్ పట్టా తీసుకున్నాక బెల్ ప్రయోగశాలలో యేల్స్ యూనివర్సిటీలో, న్యూయార్క్ సిటీ యూనివర్సిటీ హంటర్ లో పనిచేశారు. 1983లో కొలంబియా విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ, జీవశాస్త్రాలకు అసోసియేట్ ప్రొఫెసర్ గా వచ్చి మూడేళ్ళలో ప్రొఫెసర్ అయింది.

ప్రఖ్యాతి చెందిన కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రస్తుతం ఆర్థర్, మరియన్ మనీష్ మెమోరియల్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ దాదాపు 100కు పైగా విద్యార్థులను పి.హెచ్.డి., పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో శిక్షణ నిచ్చింది. 2011 అక్టోబర్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ఆదేశపు జాతీయ సైన్సు మెడల్ ను అందుకున్న గొప్ప రసాయన శాస్త్రవేత్త జాక్వెలిన్ బార్టన్.

మిల్ రెడ్ డ్రెస్ ల్ హవుస్

june03.jpgమీరెప్పుడైనా సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్ధం గురించి విన్నారా? అన్నింటికన్న పెద్ద జంతువేది? అంటే ఠకీమని సమాధానం చెబుతారు. అన్నింటికన్నా చిన్న జీవి ఏదన్నా చెప్పగలరా? మొదటిది తిమింగలం అయితే రెండవది వైరస్! అతి సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్ధం! దీన్నే నానో మెటీరియల్ అని ఇంగ్లీషులో అంటారు. 'నానో' అంటే అత్యంత సూక్ష్మమైన మాట! వీటి గురించి చెప్పే శాస్త్రమే 'నానో సైన్సు' లేదా నానో విజ్ఞాన శాస్త్రం. మనకు తెలియకుండానే నానో సైన్స్ తో ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం. ఏకంగా ‘నానో టెక్నాలజీ'నే ఒక సాంకేతిక విజ్ఞానశాస్త్రంగా ఇటీవలి కాలంలో ఆవిర్భవించి మానవాళికి ఎంతో మేలు చేస్తున్నది. అటువంటి నానో విజ్ఞానశాస్త్రంలో గొప్ప పరిశోధనలు చేసి కర్బన మహారిణిగా (Qween of Carbon) ప్రసిద్ధిచెందిన మిల్ రెడ్ డ్రెస్సె‘ల్ హావుస్ (Milred Dresselhaus).

మీరు రోజూ రాసే పెన్సిల్లో ఉండే మొన అదే గ్రాఫైట్' june04.jpgపైన ఆమె చేసిన పరిశోధనలు లోకవిఖ్యాతి గాంచాయి. గ్రాఫైట్, దానికి సంబంధించిన సంయోగ పదార్థాలు, పుల్లరీన్లు కర్బన నానోగొట్టాలు (carbon nano tubes), తక్కువ డైమెన్షన్ ఉష్ణ విద్యుత్ వాహకాల గురించి ఆమె, ఆమె సహచరులు ఎన్నో కొత్త విషయాలను కనిపెట్టారు. ఆమె పరిశోధనలు గురించి మీరిప్పుడు అర్థం చేసుకోవటం కొంచెం కష్టమైనా ఆమెలా పెద్ద శాస్త్రవేత్త అయ్యాక ఆమె గొప్పతనాన్ని మరింతగా అర్థం చేసుకుంటారు (ఆమెలా మంచి శాస్త్రవేత్త అవుతారు గదా!) అయితే ఇప్పుడు మీకో విషయాన్ని మీకర్థం అయ్యేలా చెబుతాను. ఆ విషయమే కర్బన నానో గొట్టాలు'.

కర్బన నానో గొట్టాల పట్టి నిర్మాణాన్ని (bond structure) తన సహచర శాస్త్రవేత్తలతో కలిసి ఊహించి మొట్టమొదట ప్రతిపాదించింది మిల్ రెడ్ డ్రెస్సె‘ల్ హావుస్.

వీళ్ళ పేరుతో ఆ నమూనాకు "SFDD" మోడల్ అని పేరు వచ్చింది. ఈ పేరులో ఉన్న నాలుగు అక్షరాలల్లో 'S' అంటే రిచిరో సయిత్ (Richiro Sait), 'F' అంటే మిట్యుటాకా ఫుజితా (Mitsutaka Fujitha), 'D' అంటే జీన్ డ్రెస్సల్ హవుస్ అని అర్థం. నాలుగో అక్షరం మన మిల్ రెడ్ డ్రెస్సెల్ హవుస్ నే. ఇలా ఆమె పేరు మీద 'హిక్స్ -డ్రెస్సెల్ హవుస్ మోడల్', టాంగ్ డ్రెస్సెల్ హవుస్ సిద్ధాంతం. రాష్ట్రా-డ్రెస్సెల్ హవుస్ ఎఫెక్ట్ (Rashta-Dressel Haus Effect) వంటి భౌతికశాస్త్ర సిద్ధాంతాలున్నాయి.

కర్బన నానో గొట్టాలు లేదా నానో నాళాల గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. రబ్బరు గొట్టాలు, ప్లాస్టిక్ గొట్టాలు, గాజు గొట్టాలు అని మనకు చాలా తెలుసు. కాని ఈ నానో గొట్టాల ప్రత్యేకత ఏమిటి? ముందుగా 'నానో' అంటే ఏమిటి? అత్యంత సూక్ష్మమైనది అని కదా అనుకున్నాం. సరే చిన్నదే. అయితే ఎంత చిన్నది లేదా ఎంత సూక్ష్మమైనది. మనం దేన్నయినా కొలత తీసుకునేందుకు ఏ ప్రమాణాలను వాడతాం? మీటర్లు, సెంటీమీటర్లు వగైరా! .

ఒక సెంటీమీటరుకు ఎన్ని మీటర్లు? 10-2 m. ఒక సెం.మీ. అంటే మీటర్లో నూరవ వంతు. అలాగే ఒక మైక్రోమీటరు అంటే 10-6 m. ఒక నానో మీటరు అంటే 10-9 m. అంటే ఒక మీటరును బిలియన్ తో భాగిస్తే వచ్చేంత! నానో అంటే అంత చిన్నది అని అర్థం. మీరు పరమాణువుల గురించి విన్నారు గదా! పరమాణువు సైజు ఎంతో తెలుసా? 10-10 m నానో పదార్ధపు పరిమాణం పరమాణువు సైజు కంటే కొంచెం ఎక్కువ అన్నమాట. అంత సూక్ష్మాతిసూక్ష్మమైన నానో కర్బన పరమాణువులను ఒక వరుసలో పేరిస్తే ఒక కర్బన నానో గొట్టం తయారవుతుంది. ఇంత చిన్న నాళాలతో ఏమిటి ఉపయోగం? మనం నిత్యం వాడే కంప్యూటర్లలో ఇంకా అనేక పరికరాల తయారీలో ఈ నానో పదార్థాలను, ముఖ్యంగా కర్బన నానో నాళాలను వాడుతున్నారు. ఏ విధమైన నిరోధం (అవరోధం) లేకుండా ఈ నానో పదార్థాలు విద్యుత్ ను ప్రవహింపజేస్తాయి. దీనితో విద్యుత్ ప్రసరణలో ఏ రకమైన నష్టాలు ఉండవు. అందుకే ఇవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. డ్రెస్సెల్ హవుస్ పరిశోధనల్లో ఇది ఒకటి మాత్రమే.

june01.jpgడ్రైస్సెల్ హవుస్ 1930వ సంవత్సరం నవంబర్ 11న న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో పోలెండ్ నుండి వలస వచ్చిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఆమె అందరు పేద పిల్లల్లాగే వీధిబడిలో చదువుకుంది. ఆమె సోదరుడు మాత్రం సంగీతంలో చిచ్చరపిడుగు. నాలుగేళ్ల వయసులోనే వయోలిన్ పై ప్రావీణ్యం సంపాదించాడు. ఆ ప్రేరణతో తను కూడ సంగీతం నేర్చుకోవాలని ఒక సంగీత పాఠశాలకు వెళ్లేది. అక్కడ ఆమెకు మంచి మంచి పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులతో పరిచయం అయింది. తానెందుకు మంచి బడికి పోలేక పోతున్నానని బాధపడింది. పట్టుదల పెంచుకుంది. ప్రసిద్ధి చెందిన హంటర్ కాలేజీ హైస్కూల్లో చదివేందుకు కష్టపడి సీటు సంపాదించింది. ఆ రోజుల్లో అమ్మాయిలు స్కూలు టీచర్లుగానో, సెక్రటరీలు లేదా నర్సులు గానో ఉద్యోగాలు చేసేందుకు మాత్రమే చదివేవారు.

కాని ఆమెను ఫిజిక్సు టీచర్ ఎంతగానో ప్రభావితం చేశాడు. ఆమెలో ఉన్న ప్రతిభను గుర్తించి, సైన్సులో ఆమె ఉన్నత స్థాయికి చేరుకునేలా పాఠశాల దశలోనే స్ఫూర్తినిచ్చాడు. ఆయన ఎవరో, ఎంత గొప్ప వాడవుతాడో అప్పుడు ఆమెకు తెలియదు. ఆయనే అటు తర్వాత నోబెల్ బహుమతిని గెల్చుకున్న రోసాలిన్ యాలో (Rosalyn Yalow), హంటర్ కాలేజీ నుండి ఫుల్ టైట్ ఫెలోగా పై చదువులకు పోయి కేంబ్రిడ్జి యూనివర్సిటీ (ఇంగ్లాండు)లో చదివింది. చికాగో యూనివర్సిటీ నుండి 1958లో డాక్టరేట్ (Ph.D) పట్టా పొందింది. డాక్టరేట్ చేసేటపుడు 'సూపర్ కండక్టర్స్’ పై దృష్టి నిలిపి పనిచేసింది. భౌతికశాస్త్రంలో అప్పటికే అదొక విప్లవాన్ని సృష్టించి ప్రచారంలో ఉన్న టాపిక్. అక్కడే ఆమె జీవితంలో మరో ముఖ్య ఘటన చోటు చేసుకుంది. జీన్ డ్రెస్సెల్ హావుస్ తో ఏర్పడిన పరిచయం అది. 1958లో ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత వారిద్దరికీ ప్రఖ్యాతిగాచిన MIT (Massachusetts Institute of Technology) లో ప్రొఫెసర్లుగా పనిచేసే అవకాశం వచ్చింది.

ప్రపంచం అంతా 'సెమీ కండకర్' (Semi conductors) వైపు వెళ్తుంటే డ్రెస్సెల్ హవుస్ మాత్రం 'మాగ్నెటో ఆప్టిక్స్ (Magneto optics) అనే కొత్త ఫీల్డ్ ఎంచుకుంది. దీనికి కారణం లేకపోలేదు. అన్ని రంగాల్లో లాగే సైన్స్ లో కూడా ముఖ్యంగా భౌతికశాస్త్రంలో పురుషులదే పై చేయి. కావాలనే ఆమె గ్రా ఫైట్ మీద పరిశోధించేందుకు పోటీ తక్కువగా ఉండే రంగాన్ని ఎంచుకొని విజయం సాధించింది. కానీ ఆ విజయం ఆమెకు అంత తేలిగ్గా రాలేదు సుమా! పురుషాధిక్య సమాజం, వెంట వెంటనే కలిగిన నలుగురు సంతానం, ఉదయం 8 గంటలకే ప్రయోగశాలకు వెళ్లటం ఆమెకు కత్తిమీది సామే. కాని ఆమె మనోధైర్యం ముందు ఏవీ నిలబడలేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మహిళలను ప్రోత్సహించాలని ఇచ్చే అబీ మవుజ్ (Abby Mauze) రాక్ ఫెల్లర్ ఫండ్ 1968లో గెల్చుకున్న తొలి మహిళా ప్రొఫెసర్ గా గుర్తింపు పొందింది. యువ మహిళా శాస్త్రవేత్తల కెందరికో రోల్ మోడల్ గా నిలిచింది.

june02.jpgఆమె వివిధ పరిశోధన సంస్థలకు, సంఘాలకు ఫెలోగా ఎన్నికయ్యారు. లెక్కకు మిక్కిలి అవార్డుకు గెల్చుకున్నారు. 2012లో బరాక్ ఒబామా ఆమెను ఫెర్మి అవార్డుకు బర్టన్ రిక్టర్ తో కలిపి ఎంపిక చేశారు. నానో పదార్థాలపై ఆమె పరిశోధనలకు కావ్ల ప్రైజ్ (Kavli Prize) గెల్చుకున్న శాస్త్రవేత్త, యువతరానికి స్ఫూర్తి దాత డాక్టర్ మిల్ రెడ్ డ్రెస్సెల్ హవుస్.

పి.యల్. భట్నాగర్

bhatnagarభట్నాగర్ అంటే 19 సంవత్సరాలకే రసాయన శాస్త్రంలో ఆచార్యుడై CSIR (Council of Scientific and Industrial Research) కు మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ గాను, UGC (University Grants Commission) కు మొదటి ఛైర్మన్ గా ఉన్న శాంతిస్వరూప్ భట్నగర్ అందరికీ గుర్తు వస్తుంది. కాని గణితశాస్త్రం, భౌతికశాస్త్ర రంగాలలో కృషి చేసి అత్యున్నత పురస్కారాలు పొందిన ఏ.యల్. భట్నాగర్ గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ప్రభులాల్ భట్నాగర్ 1912వ సంవత్సరం ఆగస్టు 7వ తేదీన రాజస్థాన్ లో 'కోట' అనే గ్రామంలో పుట్టాడు. దేశభక్తి గల గౌరవనీయ కుటుంబంలో జన్మించిన భట్నాగర్ తన పుట్టిన ఊరు కోటలో చదువు ప్రారంభించి రామపుర గవర్నమెంట్ స్కూలు తర్వాత హెర్బర్ట్ కాలేజీ, మహారాజా కాలేజీ, జైపూర్‌లో కళాశాల విద్యను పూర్తి చేసాడు. కాలేజీ స్థాయిలో యూనివర్శిటీకే ప్రథమ స్థానంలో పాసై ఆగ్రా యూనివర్శిటీ నుంచి 'గోల్డెమెడల్’ పొందాడు. ఇండియన్ సివిల్ సర్వీస్ పోటీ పరీక్షకు హాజరైతే తప్పనిసరిగా ఎన్నుకోబడే స్థితిలో ఉన్నా, కుటుంబ సభ్యుల ఒత్తిడిని లెక్కపెట్టకుండా అప సంపాదనకు ఏ మాత్రం అవకాశం లేని ‘పరిశోధన బోధన' అనే అంశాన్ని ఎన్నుకొన్నాడు. ఒక పెంపొందించుకొనాలనే కొరకే గాని, సంపాదన కోసం కాదని పరిశోధనల కోసం అలహాబాద్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా చేరాడు. ప్రొఫెసర్ కె.ఎల్. వర్మ ప్రోత్సా హంతో "Fourier and allied series ను పరిశోధనాంశంగా ఎన్నుకొన్నాడు. D.Phil కోసం అంశంలో పరిశోధనా పత్రం సమర్పించిన తర్వాత Astrophysics పై దృష్టి పెట్టి సౌరవ్యవస్థకు మూలం అనే పరిశోధన చేశాడు. "Aims to Stars”, “Recent Alvances in Galatic Dynamics"లు ఈ పరిశోధనను పేర్కొన్నాయి. ఈ విజ్ఞాన శాఖకు సంబంధించిన ఉత్తమ పరిశోధనకు ఇచ్చే 'E.G. హిల్ మెమోరియల్ పైజు' భట్నాగర్డు ప్రదానం చేశారు.

D.Phil తర్వాత 1949 నుండి 1956 వరకు సెయింట్ స్టీఫెన్ కాలేజిలో గణిత అధ్యాపకుడిగా పనిచేస్తూ ప్రొఫెసర్ డి.ఎస్. కొలారితో కలిసి “Skewness of Light Curve” అంశంపై పరిశోధన చేశాడు. 1947లో అలహాబాద్ యూనివర్శిటీ భట్నాగర్ ను D.Sc అవార్డుతో సత్కరించింది. 1950లో భట్నాగర్ Fellow of National Institute of Sciences (ప్రస్తుతం Indian National Science Academy) పురస్కారం అందుకొన్నాడు. తర్వాత U.S.A. లో రెండు సంవత్సరాల పాటు 'ప్లాస్మాఫిజిక్స్'లో పరిశోధన చేశాడు. Kinetis Theory మీద ఉన్న ఆధునిక భౌతిక శాస్త్ర గ్రంథంగా చెప్పుకొనే B.G.K. Model (Bhatnagar – Gross – Krook) for Collisions అనేది ఈ పరిశోధనా ఫలితమే. రెండు సంవత్సరాల తర్వాత ఢిల్లీకి తిరిగి వచ్చి యూనివర్శిటీ అధ్యాపకుడిగా ఉంటూ విద్యార్థులను పరిశోధనలపై ప్రోత్సహించాడు.

1953లో ఇండియన్ మాథమేటికల్ సొసైటీ తరపున భట్నాగర్ నిర్వహించిన మాథమెటిక్స్ ఎగ్జిబిషన్ కు విమర్శకులు సైతం అభినందించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరు అప్లైడ్ మాథమేటిక్స్ డిపార్ట్ మెంట్‌కు అధిపతిగా ఉంటూ క్రొత్త పరిశోధనలు చేశాడు. Fluid Dynamics, Non Linear Waves and Shock Waves, Non-New Tonian Fluids మొదలైన అంశాలు విదేశాలకు వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చాడు. ఫ్రాన్స్‌లో జరిగిన మొదటి International Congress on Mathematics Education (1969) లో Executive Council Member గా పాల్గొన్నాడు. అంతేకాక వివిధ దేశీయ సంస్థలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. Indian Mathematical Society కి మూడు సంవత్సరాలు, AMTI కు 1957 నుండి చనిపోయే వరకు అధ్యక్షునిగా వ్యవహరించాడు.

రాజస్తాన్ యూనివర్శిటీ, జైపూర్ కు రెండు సంవత్సరాలు వైస్ ఛాన్సలర్గాను, తర్వాత మాథమేటిక్స్ డిపార్ట్ మెంట్ కు సీనియర్ ప్రొఫెసర్ గాను, యూనియన్ పబ్లిక్ సర్వీస్మెంబర్గా, మెహతా రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (అలహాబాద్)గా ఇలా ఎన్నో పదవులకు న్యాయం చేస్తూ అహర్నిషలు పరిశోధనకే అంకితమైన భట్నాగర్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1968వ సంవత్సరం జనవరి 25న ఇతనికి “పద్మభూషణ్" అవార్డు ప్రకటించింది.

భట్నాగర్ అంతర్జాతీయ పత్రికలలో షుమారు 139 పరిశోధనా పత్రాలను ప్రచురించి 12 గ్రంథాలను రచించాడు. అంతర్జాతీయంగా భారతీయ ప్రతినిధులకు నాయకుడిగా మంచి గుర్తింపుపొందాడు. విద్యార్థులను ఉద్దేశించి “ఎటువంటి మట్టి అయనా దొరకనివ్వండి. నేను నిజాయితీగా ఆ మట్టి నుండి అందమైన రూపాన్ని తెస్తాను" అన్నారు. గణితం అంటే ఏమి తెలియదు అని చెప్పి ఏ సజీవ ప్రతిమను నాశనం చేయకూడదు అనే మాటలను నిలబెట్టుకొన్న భట్నాగర్ 1976 అక్టోబర్ 5వ తేదీన మన నుండి దూరమైన, ఆయన చేసిన సేవలు 5 ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది.

డా. యం.పి పరమేశ్వరన్

aug030.jpgఅణుబాంబులు కాదు అన్నవస్త్రాలు కావాలి! అన్న మహాకవి మాటలు ప్రముఖ భారత అణుశాస్త్రవేత్త డా. యం.పి. పరమేశ్వరన్ జీవితాన్ని చూస్తే నూటికి నూరుపాళ్ళు సత్యం అనిపిస్తుంది. పరమాణు ఇంజనీరింగ్ సైన్స్ లో డాక్టరేట్ పట్టా పొందిన తొలి భారతీయుడు డా. పరమేశ్వరన్ పిన్నలు, పెద్దలూ, మిత్రులూ ముద్దుగా పిలుచుకునే పేరు 'యం.పి., ఆయన యం.పి. గానే ప్రజలందరికీ సుపరిచితులు. ఇది ఆయన పొట్టిపేరు. ఆయన కూడా అంతే. పిట్ట కొంచెం కూత ఘనం అనేది ఆయన విషయంలో నిజం. ఆయన ఆలోచనల నిడివి మాత్రం కన్యాకుమారి నుండి కాశ్మీరమంత. ఒక విధంగా ఈ మాట కూడ చిన్నదే. సైన్స్ లాగే ఆయన ఆలోచనలు కూడ విశ్వజనీనమైనవి.

యం.పి. మాస్కో పవర్ ఇంజనీరింగ్ ఇన్సిట్యూట్ (Moscow Power Engineering Institute) నుండి 1965లో పి.హెచ్.డి. పట్టా తీసుకున్నాడు. మనదేశం పరమాణు పరిశోధనల్లో తనకాళ్ళపై తాను నిలబడే స్థాయికి తీసుకొచ్చిన హెూమీభాభా స్థాపించిన బాబా పరమాణు పరిశోధనా కేంద్రం (Bhabha Atomic Research Centre) తో అణుశాస్త్రవేత్తగా చేరి 1975 వరకు పనిచేశారు.

aug031.jpgపరిశోధన ఎంత గొప్పదైనా ప్రయోగశాల నాలుగుగోడలు దాటకపోతే ప్రయోజనం లేదు. విజ్ఞాన పలాలు సామాన్యుడి తలుపు తట్టిననాడే కదా సార్ధకత. అణుశక్తిరంగంలో కీలక పరిశోధనలు చేస్తూనే సైన్సును ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నాడు. తన స్వంత రాష్ట్రం కేరళలో జనబాహుళ్యానికి విజ్ఞానాన్నందించే ప్రయోగానికి 1970వ దశకంలో శ్రీకారం చుట్టాడు. ఆ ప్రయోగమే 'కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్తు' (Kerala Sasthra Sahitya Parishad-KSSP). ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా సైన్సు ఆధారంగా ఒక ఉద్యమానికి తెరతీశాడు.

ప్రజల్లో హేతుబద్ధంగా ఆలోచించే తత్వానికి KSSP ద్వారా బీజం వేశాడు. KSSP కేరళలో గొప్ప ప్రజా ఉద్యమంగా ఎదిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన, లాభదాయకమైన మంచి ఉద్యోగాన్ని సైతం శాస్త్ర ప్రచారం కోసం 1975లో వదులుకున్నాడు యం.పి. తన శాస్త్రప్రచార ఉద్యమాన్ని కేరళ నుండి యావత్ భారతదేశానికి విస్తరించే పనిలోపడ్డాడు.

దానికోసం 1987లో ఒక అద్భుత కార్యక్రమం దేశవ్యాపితంగా చేసేందుకు పథకం వేశాడు. దాన్ని నడిపే జాతీయ కమిటీకి యం.పి. నే కన్వీనర్ కూడా. “భారత జన విజ్ఞాన జాతా'నే ఆ అద్భుతం. సైన్సు ప్రజల కోసం అనే మూలసూత్రాన్ని దేశం మూలమూలలకూ ఈ ఉద్యమం ద్వారా తీసుకుపోయాడు. నూతన ఆలోచనలకు, చైతన్యానికి ఈ జాతీయ కార్యక్రమం బీజాలు నాటింది. దాని ఫలితంగానే పలు రాష్ట్రాల్లో సైన్సు ప్రచారసంస్థలు వెలిశాయి.

జన విజ్ఞాన వేదిక ఆవిర్భావం కూడ యం.పి. నడిపించిన జాతీయ జాతా పర్యవసానమే. ఇలా ఏర్పడిన సైన్సు ప్రచార సంస్థలన్నిటినీ ఒక వేదిక మీదికి చేర్చి ‘అఖిల భారత ప్రజాసైన్సు సంస్థల నెట్వర్క్ ను (All India People Science Network- AIPSN) నెలకొల్పాడు. దీనితో సైన్సు ప్రచారానికి, శాస్త్రీయ ఆలోచనకు ఒక దేశవ్యాపిత ప్రాతిపదిక ఏర్పడింది.

యం.పి. కేవలం సైన్సుకు, సైన్సు ప్రచారానికే పరిమితం కాలేదు. విద్య లేనిదే మనదేశంలో ఏ మార్పు సాధ్యం కాదని నమ్మాడు. నూటికి 70 శాతం అక్షరజ్ఞానానికి దూరంగా ఉంటే సైన్సు మాత్రమే కాదు ఏ అభివృద్ధి సాధ్యం కాదు. జ్ఞానం, విజ్ఞానం ఒకే. నాణేనికి బొమ్మ, బొరుసు వంటివి.

వీటిని ఏకం చేసి 1990 అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుండి నవంబర్ 14 నెహ్రూ జయంతి వరకు జాతీయస్థాయిలో ‘భారత జ్ఞాన విజ్ఞాన జాతాను చేపట్టాడు. దేశవ్యాప్తంగా సాక్షరతా ఉద్యమ సారధిగా 'భారత జ్ఞాన విజ్ఞాన సమితి' (Bharat Gyan Vigyan Samithi - BGVS) ఆవిర్భావానికి యం.పి. పరమేశ్వరన్ కీలకపాత్ర పోషించాడు. దీని నేతృత్వంలోనే అనేక రాష్ట్రాల్లో సాక్షరతా ఉద్యమం (Literacy Campaign) జరిగింది. అందరికీ అక్షరజ్ఞానం అందించటంలో గణనీయమైన పాత్ర పోషించాయి. ఈ సంస్థలు వాటిని నడిపించిన యం.పి.

యం.పి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో పుస్తకాలు వ్రాశారు. మరెన్నో సిద్ధాంత వ్యాసాలు కూర్చారు. అక్షరాస్యులైన వయోజనులకు ప్రత్యేకంగా పుస్తకాలు రాసి భారత ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డులు గెల్చుకున్నారు. ముఖ్యంగా పిల్లల సాహిత్యంలో ఆయన రచనలకు 1982లోనే అవార్డు వచ్చింది.

ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్తనో, ఆయనది అంత పసిమనసు. పిల్లాళ్లలో పిల్లాడిగా కలసిపోతాడు. పిల్లల కోసం, దేశప్రజల క్షేమం కోసం నిరంతరం తాపత్రయపడతాడు. ఒక నూతన భారతదేశం కోసం నిత్యం తపస్సు చేస్తున్న ప్రజాసైన్సు ఋషి యం.పి. పరమేశ్వరన్.

అణు విద్యుత్ కేంద్రాల స్థాపన వలన వచ్చే ప్రమాదాలను చెప్పి, 'భారతదేశానికి పరమాణుశక్తి అవసరం లేదని తేల్చి చెప్పిన అణుశాస్త్రవేత్త యం.పి. అనేక ప్రజా ఉద్యమాల్లో ముందుభాగాన నిలిచిన ధీశాలి యం.పి. కేవలం ప్రయోగశాలలకే పరిమితమై పరిశోధించడమే కాకుండా ప్రజలకోసం, ప్రజలతో కలసి ఉద్యమాలు నిర్మించిన యం.పి. పరమేశ్వరన్ వంటి గొప్ప వ్యక్తులు అరుదుగా కనిపిస్తారు. ఆయన జీవితం నేటి యువతకు గొప్ప స్ఫూర్తి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

డా. సంజయ రాజారం

sep020.jpgప్రపంచంలో అన్ని పంటల కంటే ఎక్కువ పండించే పంట ఏదో తెలుసా? గోధుమ. మనం తినే ఆహారంలో అత్యధికులు తినేది కూడా గోధుమనే. ప్రపంచ వ్యాప్తంగా 240 మిలియన్ హెక్టార్లకు పైగా గోధుమను పండిస్తున్నారు. వందకు పైగా దేశాల్లో నాలుగున్నర బిలియన్ల ప్రజలు మాంసకృత్తుల (ప్రోటీన్లు) కోసం, శక్తి కోసం గోధుమలను తింటారు. ఏడాది పొడవునా, ప్రతినెలలో ప్రపంచంలో ఏదో ఒక మూల గోధుమ పంటను కైలు (మార్పిడి) చేస్తారు.

గాలి కూడ గడ్డకట్టేంత కటిక చలిదేశాల్లోనూ, భారతదేశం వంటి ఉష్ణమండల దేశాల్లోనూ గోధుమ పండుతుంది. అందుకే గోధుమలో శీతాకాల రకాలు, వసంతకాల (Spring wheat) రకాలని వేర్వేరుగా ఉంటాయి. గోధుమ గురించి ఇంత కథ చెప్పడం దేనికంటే ఈ సంవత్సరం (2014) ప్రపంచ అన్నదాతకు ఇచ్చే ప్రతిష్టాత్మక బహుమతి (World Food Prize) ని భారత సంతతికి చెందిన డాక్టర్ సంజయ రాజారాం (Dr. Sanjaya Raja ram) గెలుచుకున్నందుకు.

sep019.jpgఒకప్పుడు మనదేశంలో ఆహారకొరత ఉండేది. అప్పుడు మనం అమెరికా గోధుమలు దిగుమతి చేసుకునే వాళ్ళం. ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్, అలాగే మన యం.యస్. స్వామినాథన్ వంటి అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా కొత్త కొత్త వంగడాలు, హైబ్రీడ్ రకాలు వచ్చి గోధుమ ఇబ్బడి ముబ్బడిగా పండింది. దీన్నే మనవాళ్ళు 'హరిత విప్లవం అంటారు. సంజయ రాజారాం బోర్లాగ్ కు వారసునిగా గోధుమ పరిశోధనలు చేపట్టి గొప్ప విజయం సాధించాడు. ఇది బోర్లాగ్ శతజయంతి సంవత్సరం కూడా. ఐక్యరాజ్యసమితి, ఆహార వ్యవసాయ సంఘం (UN-FAO) ఈ సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరం గా ప్రకటించింది కూడా.

రాజారాం గొప్పతనం ఏమిటంటే అతిశీతల ప్రదేశాల్లో పండే గోధుమ రకాలను, ఉష్ణప్రాంతాల్లో పండే రకాలతో సంకరం చేయటం. ఇలా చేయటం వల్ల అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునే కొత్త గోధుమ రకాలను అభివృద్ధి చేశాడు రాజారాం. ఆయన అభివృద్ధి చేసిన గోధుమ రకాలు ఖండఖండాల్లో (ఆరు ఖండాల్లో కూడా) ప్రసిద్ధి చెందాయి. యాబైఒక్క దేశాల్లో వాటిని పండిస్తున్నారంటే రాజారాం ఘనతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ రాజారాం ఎవరు? గోధుమ పైనే ఎందుకు పరిశోధనలు చేశాడు? తెలుసుకొందామా...

sep021.jpgడాక్టర్ సంజయ రాజారాం ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక కుగ్రామంలో 1943లో జన్మించాడు. వారిది వ్యవసాయ కుటుంబం. ఆయన తల్లిదండ్రులు వీళ్ళకున్న కొద్ది పొలంలోనే గోధుమ పండించడాన్ని చూశాడు. రాజారాంను, అతని అన్నను, చెల్లిని వాళ్ళు కష్టపడి చదివించడం, పంటలు పండీపండక పడిన ఇబ్బందులు రాజారాం ఆలోచనలను ప్రభావితం చేశాయి. తాను పెద్దవాడై ఏమైనా చేసి ఎక్కువగా పండే గోధుమను తయారు చేయాలనుకున్నాడు. అందుకే చదువులో అందరికంటే ముందున్నాడు. తల్లిదండ్రులను కష్టపెట్టకుండా ప్రతిభావంతులైన విద్యార్థుల కిచ్చే స్కాలర్ షిప్ సాధించి 1962 నాటికే వ్యవసాయశాస్త్రంలో గోరక్ పూర్ విశ్వవిద్యాలయం నుండి పట్టా తీసుకున్నాడు. అటు తర్వాత భారతవ్యవసాయ పరిశోధనా సంస్థలో (Indian Agricultural Research Institute-IARI) జన్యుశాస్త్రం, మొక్కల సంకరణ శాస్త్రంలో యం.యస్సీ. చేశాడు. అక్కడే రాజారాంకు ప్రొ. యం.యస్. స్వామినాథన్ మార్గదర్శకత్వం లభించింది. అక్కణ్ణించి ఆస్ట్రేలియా వెళ్ళి ప్రముఖ శాస్త్రవేత్త డా. ఐ.ఏ. వాట్సన్ (I.A. Watson) దగ్గర డాక్టరేట్ చేశాడు.

డా. వాట్సన్, నార్మన్ బోర్లాగ్ సహాధ్యాయుడు కావటం రాజారాంకు కలసివచ్చింది. ఆయన సలహా పై బోరాన్ దగ్గర చేరి 1969లో చేరి తన చిరకాల కోరికైన గోధుమ సంకర రకాలపై పరిశోధనలు సాగించాడు, పరిశోధనల్లో విజయం సాధించడంతో బోర్లాగే స్వయంగా తాను అప్పటివరకూ నిర్వహిస్తున్న గోధుమ బ్రీడింగ్ విభాగానికి అధ్యక్షుణ్ణి చేశాడు.

గోధుమ, మొక్కజొన్న వంటి పంటలపై విశిష్ట పరిశోధనలు చేసే సంస్థ సిమ్మిట్ (CIMMYT) లో రాజారాం పనిచేస్తున్నారు. ఇది మెక్సికోలో ఉంది. అందుకే ఆయన ఇప్పుడు మెక్సికో పౌరుడు. అంచెలంచెలుగా ఎదిగిన రాజారాం అధిక దిగుబడి రకాలనేగాక కొండ ప్రాంతాల్లో సారంలేని బీడు పొలాల్లో సైతం పండే గోధుమ రకాలను అభివృద్ధి చేశాడు. ఇప్పుడవి పాకిస్తాన్, చైనా మారుమూల ప్రాంతాల్లో కూడ పండిస్తున్నారు. బ్రెజిల్ వంటి దేశాలను అల్యూమినియంను తట్టుకునే రకాలను, ఆమ్ల నేలల్లో పండే వాటిని అందించాడు. కుంకుమ తెగులును తట్టుకునే విధంగా కొత్తరకాలను రూపొందించాడు.

ఎక్కడో మారుమూల భారతదేశంలో తనవాళ్ళ కష్టాలు దీర్చే పంటలను తయారుచేయాలనుకున్న రాజారాం నేడు ప్రపంచానికే అన్నం పెట్టి అన్నదాతగా ఎదిగాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చుననే దాన్ని రాజారాం కృషి మనకు తెలియజేస్తున్నది.

సంజీవయ్య శర్మ

sanjeevarayaపుట్టినతేది: 27.11.1907

జన్మస్థలం: కల్లూరు ప్రొద్దుటూరు, కడప జిల్లా (ప్రస్తుతం వై.ఎస్.ఆర్. జిల్లా)

మరణం: 1998

ప్రావీణ్యం: గణితం, గణిత అవధానం

బిరుదులు: 1. అంకవిద్యాసాగర్, 2. గణితబ్రహ్మ, 3. విశ్వసంఖ్యాచార్య

తల్లిదండ్రులు: లక్కోజు పెద్దపుల్లయ్య, నాగమ్మ

భార్య పేరు: ఆదిలక్ష్మమ్మ

ప్రదర్శనలు: 7000 పై గణిత ప్రదర్శనలు

పుట్టిగుడ్డిగా జన్మించి బాల్యం నుండే అంకగణితంలో అసాధారణ ప్రతిభ కనపరచి దేశవిదేశాలలో ప్రముఖుల ప్రసంశలు పొందినప్పటికి ఆయన ప్రతిభకు గుర్తింపు లేకపోవడం వలన వృద్ధాప్యంలో పొట్టకూటి కోసం శ్రీకాలహస్తి దేవాలయంలో ఫిడేలు వాయిస్తూ దేవస్థానం వారు ఇచ్చు గౌరవభృతితో జీవనం సాగించిన వ్యక్తి లక్కోజు సంజీవరాయ శర్మ.

అంగవైకల్యం ఉన్న వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారనుటకు ఇటీవలి పారాఒలింపిక్స్ నిదర్శనం. అలాగే సంజీవరాయశర్మ పుట్టుగుడ్డిగా జన్మించి 5వ తరగతి వరకు మాత్రమే చదివి గణితంపై ఆసక్తి పెంచుకొని స్వయంగా గణిత అవధానాలను నిర్వహించేవాడు. సంజీవరాయశర్మ 1928 లో తన మొట్టమొదటి గణిత ప్రదర్శనను నంద్లలో ఆంధ్రమహాసభ సర్వేపల్లి రాధాకృష్ణ ఢిల్లీకి ఆహ్వానించారు తర్వాత సంజీవరాయశర్మ జవహర్ లాల్ నెహ్రూ, డా. రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖుల వద్ద గణితప్రదర్శనలు నిర్వహించారు. చాలామంది ప్రముఖులు ఈయన ప్రదర్శనలు అభినందించారు కానీ సరైనా ఆర్థిక సహాయం చేయలేకపోయారు. సంజీవరాయశర్మ తన మెదడుకు పనిపెడుతూ ఆంధ్రప్రదేశ్ అమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మొ. రాష్ట్రాలలో సుమారు 7000 పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1960వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన హైద్రాబాద్‌లో గల శ్రీకృష్టదేవరాయ ఆంధ్రభాషా నిలయం నందు ఇచ్చిన ప్రదర్శనకు అనేక బంగారు పథకాలు లభించాయి. ఈయన 4000 సం.ల క్యాలెండర్ ను తయారు చేశాడు.

ఒకప్పుడు ఆనాటి వైస్రాయ్ సర్ జార్జిస్టెన్లీ, “శర్మగారు ఇంగ్లాండ్ లో జన్మించి వుంటే ఆయన విగ్రహాన్ని విక్టోరియా రాణి స్వయంగా ఆవిష్కరించి వుండేది.” అని అన్నాడు. 1993 లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని తెలుగు వారు అమెరికాకు ఆహ్వానించినా వీసా సమస్య  వల్ల విదేశాలకు వెళ్ళలేకపోయారు. 1996 వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను పొందారు.

సంజీవరాయశర్మ ప్రదర్శనలలో కొన్ని అద్భుత గణనలు:

1.నాలుగు రెండ్లను ఉపయోగించి రాయగల పెద్ద సంఖ్య ఏది?

జ: 2222(...) దీని విలువ 67399866668765994866675377175490766840928610563514312027590256 (దీనిలో 67 అంకెలున్నాయి) ఇంత పెద్ద సంఖ్యను అతను ఆవలీలగా వివరించాడు.

2.1728 విలువ ఎంత?

జ: 28351092476867700887730107366063041 అని 35 అంకెల సంఖ్యను చెప్పారు.

3.4567346796704 యొక్క వర్గమెంత?

జ: 20800656771363 29095263616 అని వివరించి అబ్బుపరిచారు.

4.744628984416751229029930182 27199467668020601 అన్న 44 అంకెల సంఖ్యకు 6వ మూలం (...) ఎంత?

: 20511149 అని సమాధానమిచ్చారు.

5.110+210+310+410+510+… ఇలా 1000 పదాల మొత్తం ఎంత?

జ: 9 1 4 0 9 9 2 4 2 4 1 4 2 4 2 4 3 4 2 4 2 4 1924242500 అని సమాధానమిచ్చారు.

6.ఒక పట్టణంలో ఒక వీధిలోని ఇండ్లు 50 కంటే ఎక్కువ, 500 కన్నా తక్కువగా ఒకే శ్రేణిలో ఉన్నాయి. ఒకటి మొదలుకొని ఒక మిత్రుని ఇంటి వరకు 1,2,3... గల వరుస నంబర్లు కూడినా, చివరి నుండు వరుసగా కూడినా సమానమైన మొత్తాన్ని ఇచ్చిన ఆ వీధి ఇండ్లెన్ని?

జ: మొత్తం ఇండ్లు 288, మిత్రుని ఇంటి నెంబరు 204.

సరిచూడటం:

1+2+3+4+……..+204 = 20910

204+205+206+……….+299 = 20910

ఈ విధంగా గుణకారం, భాగాహారం, ఘాతాంక ఫలితాలను ఇటువంటి వ్యక్తులు ఫిడేల్ వాయించుటూ అవలీలగా ఎలా చేయగలుగుతున్నారు? వారి పద్ధతులు ఏమిటి? అనే అంశాలపై దృష్టిసారిస్తే క్రొత్త గణితంను చూడవచ్చును.

ఎలిజబెత్ హెలెన్ బ్లాక్ బర్న్

oct01.jpgఆ రోజు సెప్టెంబర్ 26, సిసియంబిని (సెంటర్ ఫర్ సెల్యులార్, మాలిక్యులార్ బయాలజీ-CCMB), అక్కడ జరిగే వివిధ పరిశోధనలను చూసేందుకు ప్రతి సం. ఈ తేదీన ప్రజలకు మంచి అవకాశం. ఆకాష్ వాళ్ల స్కూలు మిత్రులతో వెళ్లి CCMB ఎగ్జిబిషన్ ను, ప్రయోగాలను చూసి వచ్చాడు. సాయంత్రం వాళ్ల అక్క వచ్చీరావటంతోనే ప్రశ్నల వర్షం కురిపించాడు. అక్కడ ఆకాష్ డియన్ఏ, క్రోమోజోములు ఇలా ఏవేవో చూశాడట! వాటి గురించి ఇంకా తెల్సుకోవాలని వాడి తాపత్రయం. క్రోమోజోములు, ప్రతికణంలో ఉంటాయా? కణం విభజన చెందేటప్పుడు అవి ఏమవుతాయి? క్రోమోజోముల సంఖ్య ఏమిటి? ఇలా ప్రశ్నల పరంపర ఒకదాని వెంట ఒకటి. వాడి ఉత్సాహానికి ఆశ్చర్యపోయిన వాళ్ళక్క ఓపిగ్గా జవాబులు చెప్పటం మొదలెట్టింది.

అవును ప్రతి జీవిలోనూ ఈ క్రోమోజోములనేవి ఉంటాయి. క్రోమోజోముల సంఖ్య ప్రతి జీవికి నిర్దిష్టంగా ఉంటుంది. ఉదాహరణకు మనుషుల్లో 23 జతల క్రోమోజోములుంటాయి. ఒక జత ఎక్కువగాని, ఒక జత తక్కువగాని ఉండనే ఉండవు. ఉంటే అది మనిషిజాతి కానే కాదు. ఈ సూత్రం ఏ జీవికైనా ఒకటే. ఈ క్రోమోజోముల్లోనే జన్యుపదార్థం డియన్ఏ (DNA) ఉంటుంది. ఇకపోతే కణాలు విభజన చెందే సమయంలో ఇవి కూడా ఒక క్రమపద్ధతిలో విభజన చెంది కొత్తగా ఏర్పడే పిల్లకణాల్లోకి విడిపోతాయి.

ఆకాష్ కి మరో అనుమానం. అలా అయితే కొన్ని వేల కణాలుంటాయి గదా? విభజన సమయంలో ఒక దానిలోకి ఎక్కువ, మరోదాంట్లోకి తక్కువ పోవచ్చు గదా! క్రోమోజోము పోగులు ఖచ్చితంగా ఇంత పొడవే ఉoటాయని రూలేమిటి? ఇంత మంచి, మంచి ప్రశ్నలు వేస్తున్న ఆకాష్ ను అభినందించటం అక్కవంతయ్యింది.

oct02.jpgక్రోమోజోముల సంఖ్య ఎంత ఖచ్చితంగా ఉంటుందో, క్రోమోజోము సైజు కూడా అంతే ఖచ్చితంగా ఉంటుంది. ఇదెలా అంటే మనం కలానికి కాప్ లేదా డిప్ప పెట్టి మూసివేసినట్లే. క్రోమోజోముల కొనభాగాలను “టీలోమియర్ (Telomere) అనే ప్రత్యేక నిర్మాణాలు 'కావ్' చేసి కాపాడుతాయి. క్రోమోజోములను టీమియర్లు ఎలా కాపాడుతాయో కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్త ఎలిజబెత్ హెలెన్ బ్లాక్ బర్న్ ఆమె గురించి తెల్సుకుంటే నీలాంటి వాళ్లు పెద్దయ్యాక గొప్ప పని చేయటానికి మంచి స్ఫూర్తినిస్తుంది.

oct03.jpgఆకాష్ వెంటనే చెప్పమంటూ తొందరపెట్టాడు. టీలోమియర్లపై పరిశోధన చేస్తూ క్రోమోజోములను సరైన రీతిలో, ఖచ్చితమైన సైజులో ఏర్పడేందుకు దోహదం చేసే ఏదో ఒక ఎంజైము' ఉండి తీరాలని ప్రతిపాదించింది ఎలిజబెత్. కాని అందుకు తగిన సాక్ష్యాధారాలు చాలా కాలం వరకు లభ్యం కాలేదు. బ్లాక్ బర్న్ దగ్గర చేరిన కెరోల్ అనే పరిశోధన విద్యార్థి ఈ మిష్టరీని ఛేదించింది. ఆమె ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఫలితం దక్కింది. ‘టెట్రా హైమినా' అనే ఒక ఏకకణజీవి పై చేసిన పరిశోధనలో 'టీలోమియర్' అణునిర్మాణాన్ని కల్గిన్నది. ఈ టీలోమియర్ కణ విభజనలో క్రోమోజోమ్ నశింపకుండా కాపాడేది. మరి ఈ టీలోమియన్ ఏర్పడటాన్ని నియంత్రించేది ఏమిటి? అదే టీలో మీరేజ్ అనే ఎంజైమ్. ఇదే క్రోమోజోము క్షీణించటానికి లేక టీలోమియర్ ఏర్పడటాన్ని నియంత్రిస్తుంది. ఇది కణం చురుకైన దశలో క్రోమోజోముల చివర DNAను మళ్లీ మళ్లీ చేర్చి క్రోమోజోము క్షీణించకుండా కాపాడుతుంది. విచిత్రం ఏంటంటే ఇదే ఎంజైము పనిచేయటం మానేసి (స్విచ్ ఆఫ్ చేసినట్లు) చివరి దశలో కణం చనిపోవటానికి కూడా సహాయపడుతుంది.

ఈ డిస్కవరీ శాస్త్రప్రపంచంలో గొప్ప సంచలనం సృష్టించింది. అది సరే దీని వలన మనకేమిటి లాభం అన్నాడు ఆకాష్.

దీనితో ఎన్నో ప్రయోజనాలు చేకూరే అకాశం ఉంది. వృద్ధాప్యం లేదా ముసలితనం రాకుండా కాపాడే అవకాశం ఉందనీ, కాన్సర్ వంటి వ్యాధుల నివారణలో తోడ్పడుతుందనీ గుర్తించారు.

ఈ డిస్కవరీకే ఎలిజబెత్ బ్లాక్ బర్న్ కు కెరోల్ గైడర్ (Carol Greider), జాక్ జోస్టాక్ (Jack Szostak)తో కలిపి 2009లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎలిజబెత్ బ్లాక్ బర్న్, కెరోల్ గైడర్లు మంచి స్నేహితులు మాత్రమే కాదు. వారు ఎందరో యువతీయువకులకు స్ఫూర్తిగా నిలబడ్డారు. కొత్త కొత్త పరిశోధనలకు మార్గదర్శనం చేస్తున్నారు. ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకుంది ఎలిజబెత్. ప్రతిష్టాత్మక ఆల్బర్ట్ లస్కర్ మెడికల్ రీసెర్చ్ అవార్డును 2006లో గెలుచుకుంది. ప్రముఖ పత్రిక “టైమ్ (Time)” ప్రకటించిన 100 మంది అత్యంత ప్రతిభావంతుల జాబితాలో బ్లాక్ బర్న్ కు చోటుదక్కింది.

ఆకాష్ నీవు కూడా పెద్దయ్యాక ఇలాంటి గొప్ప ! పరిశోధనలు చేస్తావు గదా! “ఓ... తప్పకుండా... అంటూ ఆకాష్ ఎగిరి గంతేశాడు.

నాన్సి క్రేస్

nancyవైజ్ఞానిక కల్పనాసాహిత్యాన్ని ఇంగ్లీషులో సైన్స్ ఫిక్షన్ SF or Sci-fi అని వ్యవహరిస్తారు. ఈ కల్పనిక సాహిత్యాన్ని ప్రస్తుతపు లేదా రానున్న వైజ్ఞానిక, సాంకేతిక ఆవిష్కరణల ఆధారంగా భవిష్యత్తులో జరుగనున్న ఆవిష్కరణలను వాటి ఫలితంగా వచ్చే మార్పులను, వాటి ప్రభావాలను రచయితలు ఊహాశక్తి తో నృజిస్తారు. సృజనాత్మక రచనలలో పూర్తిగా కల్పితమైనవాటిని 'ఫాంటసీ' (Fantasy) అంటారు. ఇవి వాస్తవంలో అసలు జరగనవి. యదార్దానికి చాలా దూరంలో వుంటాయి. సైన్స్ ఫిక్షన్ లో 'హార్డ్ సైన్స్ ఫిక్షన్' ఒక ప్రత్యేకమైన తెగకి చెందిన రచనలు చేరుతాయి. ఇవి ఖచ్చితములు, యదార్ధములు అయిన వైజ్ఞానికాంశాలతో, సాంకేతిక వివరాలతో సృజించినవే. వుంటాయి. ఇవి తర్కానికి, విశ్వసనీయతకి కట్టుబడి వుంటాయి.

నాన్సి క్రెస్ అమెరికాకి చెందిన సైన్స్ ఫిక్షన్ రచయిత్రి. 1976 నుండి రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నది. ఆమె రచించిన నవలిక Beggars in Spain కు 1991లో Science Fiction and Fantasy Writers of America (SFWA) వారి Nebula Award

ను, World Science Fiction Society (WSFS) వారి Hugo Award ను గెలుచుకొన్నది. అప్పటి నుండి నాన్సి క్రెస్ బాగా వెలుగులోకి వచ్చింది. తరువాత ఈ నవలికను ఆమె నవలగా పెంచి తిరగ రాసింది. మరో నాలుగు నవలలకి Nebula Award లను గెలుచుకొంది. ప్రస్తుతం ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిపరులైన పాఠకులు అనేకులున్నారు.

నాన్సి క్రెస్ మొదట మూడు ఫాంటసీ నవలలను రాసింది. తరువాత సైన్స్ ఫిక్షన్ రాస్తూ హార్డ్ సైన్స్ ఫిక్షన్ వైపుకి మళ్ళింది. ఆమె సమీప భవిష్యత్తులో జరగే అంశాలనే ఊహిస్తూ  అందకనుగుణమైన పాత్రలను సృజిస్తూ రచన చేస్తున్నది, ఆ పాత్రలు యదార్థ జీవితానికి దగ్గరగా ఉంటాయి. 2014లో స్పెక్ట్రం పత్రిక 50 సంవత్సరాలను పూర్తి చేసుకొన్న సందర్భంలో ఆరు సైన్స్ ఫిక్షన్ కధల సంకలాన్ని ప్రచురించింది. అందులో నాన్సి క్రెస్ “Someone to Watch: Over Me" కధను చేర్చింది. చాలా మటుక్కు ఆమె రచనలన్నిటికి జెనెటిక్ ఇంజనీరింగ్ అంశాలనే ఎన్నుకొన్నది. ఎందువల్ల అని అడిగినపుడు, “సైన్స్ విభాగాలన్నిటిలోనూ జెనెటిక్ ఇంజనీరింగ్ మన శరీరాలనీ, మెదడుని మన పిల్లల్నీ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అదే క్వాసర్లు Quasars అయితే ఎక్కడో కొన్ని మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోనివి. నేను మన భావితరానికి చెందిన సమాజంలోని పిల్లల గురించి రాస్తాను. జెనెటిక్ ఇంజనీరింగ్, ఇతర సాంకేతికాంశాల ప్రభావం వారిపై ప్రబలంగా వుంటుంది, ఇప్పుడు పుడుతున్న ఈ పిల్లలు, నాకంటే చాలా భిన్నమైన రీతిలో పెరుగుతున్నారు. నేను ఎస్.ఎం.ఎస్. లు ఎరగను. వారి వయసులో నేనుండగా నాకు ఊహకి కూడా అందనిది. వారికిప్పుడుది అతి సామాన్యమైన రోజువారీ దినచర్యలో భాగం "Someone to Watch Over Me" కధ ను నేను ఆలోచిస్తున్నప్పుడు కెమెరాలు నామదిలో మెదిలాయి. అవి తరువాతి తరం Google Glass కెమెరాలు. అవి కంటిలోనే ఒదిగి వుంటాయి. ఇతరులెవనూ వాటిని గుర్తించలేరు. అంతదాకా ఎందుకు వాటిని పెట్టుకొన్న వారికీ అవి వున్నాయన్న స్ప్రుహ  కూడా వుండదు. రికార్డ్ చేస్తున్నారని మాత్రం వారికి తెలుస్తుంది. ఈ ఊహ రాగానే సహజంగానే అటువంటి దానిని కంటిలో అమర్చుకొన్న పిల్ల నా మెదడులో తలుక్కుమన్నది. ఆవెంటనే పిల్ల ఎవరు? ఎలాంటి పరిస్థితులలో వున్నది... ఈ విధంగా ఒక పాత్రను సృజించి కథని నడుపుతాను. సాధారణంగా పాత్రతోనే కధను ప్రారంభిస్తాను." అని చెప్పింది.

నాన్సి క్రెస్ కి విద్యార్థి దశలో వైజ్ఞానిక శిక్షణ లేదు. రసాయన శాస్త్రాన్ని చదువుకోలేదు. అందుకు నేనిప్పుడు బాధపడుతున్నాను అని చెపుతుందావిడ. సామాన్యుల కోసం రచించబడిన వైజ్ఞానిక పత్రికలను పుస్తకాలను ఆమె చదువుతుంది. ఏదైనా అంశం ఆమెను ఆకర్షిస్తే దానికి సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. వెతికి, వెతికి ప్రతీ పుస్తకాన్ని అదెక్కడ దొరికినా సరే సంపాదించి చదువుతుంది. మైక్రో బయాలజిస్ట్ ల వెంటపడతాను. నేనడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పే మైక్రో బయాలజిస్ట్ లు నాకు చాలా మంది వున్నారు అని చెపుతుంది. అలా వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని సంపాదించి రచనకు పూనుకొంటుంది. అదివరకు రోజులలో సైన్స్ ఫిక్షన్ రచయితలందరూ దాదాపుగా మగవారే. ఇప్పుడు పరిస్థితి మారింది Science Fiction (& Fantasy Writers of America లో 40 నుండి 45 శాతం సభ్యులు ఆడవారే. ఇది ఒక మంచి పరిణామం. దీనివల్ల ఈ కల్పనా సాహిత్యంలోకి రక్తమాంసాలతో కళ్లకు కట్టి పాత్రలు, పాత్రల మధ్య మానవీయ సంబంధాలకు ప్రాధాన్యత వచ్చింది. మానవీయతా లక్షణాలు కల్పనకు అబ్బేయి. “వైజ్ఞానిక సాంకేతిక ఆవిష్కరణలు సామాన్య జనులపై చూపబోతున్న ప్రభావాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం జరుగుతున్నదీ అంటే అది ఈ రంగంలో స్త్రీలు ప్రవేశించడం వల్లనేనని నా అభిప్రాయం." అని చెప్పింది. ఆవిడ రచించిన కధలను మూడు సంకనాలుగా వెలువరించింది. 15 నవలలు, మూడు బయోథ్రిల్లర్ లను ప్రచురించింది. సృజన సమయంలో ఎక్కువగా ఆనందించిన మీరచన ఏది అని అడిగినప్పుడు జెనిటికల్లి ఇంజనీర్డ్ మలేరియా మీద బయోత్రిల్లర్ నవల ‘Stinger’ ని రాస్తున్నప్పుడు నేను అమితంగా ఆనందించానన్నది.

సి.వి. రామన్

cvramanఏ దేశ ప్రగతి అయినా ఆ దేశ అవసరాలకు అనుగుణంగా సైన్సులో జరిగే పరిశోధనల వలనే సాధ్యం అవుతుంది గాని ఆహారం మార్చుకోవడమో, దుస్తులను, సంస్కృతీబద్దంగా ధరించడం వలనో కాదు. దేశంలో శాస్త్రీయ దృక్పథం బాగానే ఉందని అనుకుంటే భారతదేశంలో సైన్సు పట్ల సరియైన అవగాహన కల్పించడం ముఖ్యం. అంతేగాని, ఈ సైన్సంతా మనకు ముందే తెలుసు అన్న అహంభావ ప్రదర్శన ముఖ్యం కాదు. ఈ అవగాహన తక్కువైన మనదేశంలో సైన్సు పట్ల ప్రేమను పెంచుకుని పరిశోధనలు చేసి ప్రపంచంలో పేరెన్నికగన్న కొంత మంది శాస్త్రజ్ఞులను ఈ సందర్భంగా తలుచుకుందాం.

నిజానికి సైన్సుకి మతం, కులం, ప్రాంతం లాంటి భేదభావాలు లేవు. సైన్సు అభివృద్ధి చెందాలంటే దానికి తగిన వాతావరణం ప్రజలు ఏర్పాటు చేయాలి. సరియైన ప్రయోగశాలలు ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. దేశంలో అటువంటి వాతావరణం లేకున్నా అననుకూల పరిస్థితులను మన భారతీయ శాస్త్రవేత్తలు చాలా మంది అధిగమించారు. వారిలో కొందర్ని తరుచూ మీకు పరిచయం చేస్తాను.

సర్ సి.వి.రామన్

జననం: నవంబర్ 7, 1888

పూర్తి పేరు: చంద్రశేఖర వెంకటరామన్

తల్లిదండ్రులు: చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీఅమ్మ

విద్యాభ్యాసం: పూర్తిగా భారతదేశంలోనే కొనసాగింది. ప్రెసిడెన్సీ కళాశాల, మద్రాసు నుండి 1904లో బి.ఏ. డిగ్రీ పూర్తయింది. ఇందులో భౌతికశాస్త్రానికి ఆయనకు బంగారు పథకం లభించింది. 1907లో ఎం.ఏ. పూర్తిచేసాడు.

ఉద్యోగం:

1. భుక్తి కోసం భారత్ ఆర్థిక శాఖలో ఉద్యోగం. కాని ఆఫీసు వేళల తర్వాత కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రయోగశాల్లో ధ్వనిశాస్త్రం మీద, కాంతి విజ్ఞాన శాస్త్రం (Optics) మీద పరిశోధనలు చేసేవాడు.

2. కలకత్తా యూనివర్శిటీలో 1917లో భౌతిక శాస్త్ర విభాగంలో సర్ తారక్ నాథ్ పవిత్ ప్రొఫెసర్ షిప్ పొంది ప్రొఫెసర్ గా నియామకం అయ్యారు. –

జీవన విశేషాలు:

1907లో ఆయన మే 6వ తారీఖు లోకసుందరి అమ్మాళ్ ను వివాహమాడారు. 1921లో మొదటిసారి సి.వి.రామన్ కలకత్తా యూనివర్శిటీ ప్రతినిధిగా అతడు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక సమావేశానికి బయలుదేరి ఓడలో విదేశీయానం చేశాడు. అతడి ప్రయాణంలో అతడు చేసిన ప్రయోగాలలో అతడు గమనించిన విషయాన్ని 'నీలివర్ణపు సముద్రం' అనే వ్యాసంలో పొందుపరిచాడు. ఆ తర్వాత తన సహచరుడు కె.ఎస్.కృష్ణన్ సహాయంతో అనేక పరిశోధనలు చేసిం తర్వాత కాంతియానకం మారినప్పుడు చెందే వికిరణంలో కాంతి తరంగ ధైర్ఫ్యం మారడం గమనించి దీనికి 'రామన్ ఎఫెక్ట్' అని పేరు పెట్టాడు. ఈ నూతన ఆవిష్కరణ ఫిబ్రవరి 28, 1928లో జరిగింది. జనవిజ్ఞాన వేదిక కూడా ఈ సందర్భాన్ని గుర్తుంచుకుంటూ ఫిబ్రవరి 28నే 1988లో ఏర్పడింది.

1929లో ఈ గొప్ప ఆవిష్కరణకు బ్రిటిష్ ప్రభుత్వం సి.వి.రామన్ కి 'నైట్ హుడ్' ఇచ్చి 'సర్' అనే బిరుదుతో గౌరవించింది.

1930లో 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణకు గాను ఆయనకు నోబుల్ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన మొట్టమొదటి శ్వేతేతరుడు సర్ సి. వి. రామన్. అంతేకాదు మొదటి ఆసియా వాసి కూడా ఆయనే.

1934లో బెంగళూరులో ఏర్పడిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కి ఆయన ప్రథమ సంచాలకుడు. అక్కడే ఆయన భౌతికశాస్త్ర అధ్యాపకునిగా కూడా కొనసాగాడు.

ఇక్కడే ఆయన భారతీయ వాయిద్యాలు మృదంగం, తబలా వెలువర్చే ధ్వనుల మీద పరిశోధన చేశాడు. ఈ ధ్వనులలో ఉత్పత్తి అయిన శ్రవణాతీత ధ్వని తరంగాల (Ultrasonic)ను, అమిత ధ్వని తరంగాలు (Hypersonic)ను అధ్యయనం చేశాడు (1934-42) వజ్రాలలో, స్పటికాలలో ఎక్స్ రే కిరణాలు సోకటం వలన జరిగే పరారుణ చలనాలను (Infrared) పరిశీలించాడు (1947).

1948లో ఆయన ఐ.ఐ.ఎస్.సి. మండి పదవీ విరమణ పొందాడు. కాని మరుసటి సంవత్సరమే ఆయన రామన్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ని బెంగుళూరులో స్థాపించి తన శేష జీవితాన్ని ఆ ఇన్ స్టిట్యూట్ లోనే గడిపాడు.

అక్టోబర్ 1970లో ఆయన తన ప్రయోగశాలలో కుప్పకూలిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు ఆయన 4 గంటలు మాత్రమే బతుకుతాడని చెప్పారు. కాని ఆయన ఆ తర్వాత కొన్ని రోజులు బతికి హాస్పిటల్ లో ఉండటానికి ఇష్టపడక రామన్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కి తిరిగి వచ్చాడు. 21 నవంబర్ 1970న ఆయన తుదిశ్వాస విడిచాడు.

మరణించే ముందు ఆయన తన విద్యార్థులకు చెప్పిన మాట ఏమిటంటే “మన సంస్థ నుండి వెలువడే పత్రికలను చావనివ్వకండి. అవే ఈ దేశంలో జరుగుతున్న సైన్సు పరిశోధనల వివరాలను వెల్లడించే కాంతిపుంజాలు. దేశంలో సైన్సు వేళ్లూనడానికి అవే మార్గాలు." అప్పటి నుండి నేటివరకు "Proceedings of the Indian Academy of Sciences" పేరుతో పరిశోధన పత్రాలతో పత్రికలు వెలుబడుతున్నాయి. సైన్స్ పరిశోధనలు ఆయన ఆకాంక్షల ప్రకారం మరింత వెలగాలని ఆకాంక్షిద్దాం.

షిన్యాయమనాకా

nov020.jpgఏ వ్యక్తి అయినా విజయం సాధించాలంటే కావలసింది ఏమిటి? ఈ రోజు రాహూల్ వాళ్ల క్లాస్ టీచర్ పిల్లలందర్ని ఈ ప్రశ్న అడిగింది. పిల్లలు రకరకాల జవాబులు చెప్పారు. కానీ టీచర్ బాగా ఆలోచించి, అవసరమైతే పెద్దవాళ్లను అడిగి దీనిపై చిన్న వ్యాసం రాయమని హోంవర్క్ ఇచ్చింది. పిల్లలు తమాషాగానైనా మంచి మంచి ఆలోచనలే చేశారు. ఒకరు ఎవరు కోటీశ్వరుడు? గెలిస్తే గొప్పవాళ్లు కావచ్చంటే, మరొకరు MOM (మామ్)తో కుజగ్రహాన్ని తెల్సుకునే అంతరిక్ష పరిశోధనలు చేసి గొప్ప వాళ్లు కావొచ్చన్నారు. ఇవన్నీ సరే వీటన్నింటిలో విజయం సాధించడానికి మనకు ఉండాల్సిన లక్షణం ఏమిటన్నది ప్రశ్న? జవాబు కోసం రాహుల్ వాళ్ల అక్క బుర్ర తిన్నాడు. బాగా చదవటం, బాగా కష్టపడటం అంటారు కదా! అవన్నీ అవసరమే కాని అనలు ఏది సాధించాలన్నా మనలో ఉండవల్సింది 'ఆత్మవిశ్వాసం' అన్నది వాళ్లక్క అదేమిటి, అదెలా ఉంటుంది మళ్లి ప్రశ్నలు.

గొప్పవాళ్లు, జీవితంలో ఏదైనా సాధించిన వాళ్ల జీవితాలు తెల్సుకుంటే అదేమిటో తెలుసుకోవడం సులభం. అందుకు మనం ఇటీవల అంటే 2012లో నోబెల్ బహుమతి గెలుచుకున్న జపాన్ శాస్త్రవేత్త షిన్యాయమనాకా (Shinya Yamanaka) జీవితాన్ని తెల్సుకునే ప్రయత్నం చేద్దాం.

ఎవరికైనా నోబెల్ బహుమతి వస్తే ఇంకేముంది ఎంతో గొప్పవాళ్లనుకుంటాం. వాళ్లు కూడా మనలాగే అతి సామాన్యులని మరిచిపోతాం. ఇటీవల జనవిజ్ఞాన వేదిక సభకు వచ్చి మాట్లాడిన మరో నోబెల్ శాస్త్రవేత్త వెంకట్రామన్ రామకృష్ణన్ కూడా ఇదే మాట అన్నాడు. నోబెల్ బహుమతి రాగానే వారిని మనవంటి సామాన్యుల నుండి విడదీసి చూస్తాం, వారుకూడా అందరిలాగే ఆలోచిస్తారు, కష్టపడతారు. కాకపోతే ఒక శాస్త్రీయ పద్ధతిలో పట్టుదలతో పనిచేస్తారు.

nov019.jpgసరే! మన యమనాకా నిజానికి ఒక డాక్టరు. ఎముకల శస్త్రచికిత్స చేసే వైద్యుడు. కాని ఆ పనిలో ఆయన ప్రావీణ్యం గురించి వింటే ఆశ్చర్యపోతాం. ఆయన ఒకసారి తన స్నేహితుడు షూయ్ చీ హెరీటాకు ఏర్పడిన మామూలు గడ్డ (Tumor)ను తొలగించే ఆపరేషన్ చేశాడట. గంట సేపయినా దాన్ని పూర్తి చేయలేకపోయాడట. అదే ఆ చిన్న ఆపరేషన్ ను వేరే వాళ్లు 10 ని.లలో చేస్తారట. యమనాకా పనిని చూసి అందరూ ‘జమానాకా' (జపాన్ భాషలో అవరోధం) అని వెక్కిరించేవారట. ఇది 1989లో నేషనల్ ఒసాకా ఆసుపత్రిలో పనిచేసిన నాటి సంగతి. ఆ తర్వాత 1996 వరకూ గుండె సంబంధవ్యాధుల వైద్య సంస్థలో పనిచేశాడు. 1996 నుంచి 1999 వరకూ ఒసాకా నగర యూనివర్శిటీ మెడికల్ స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు. కాని ఎక్కువగా ఆయన పరిశోధనల్లో వాడే చిట్టెలుకల బాగోగులు చూడటం వరకే ఆయన పనిగా ఉండేది. ఇదంతా ఎందుకు. చెబుతున్నావక్కా అంటూ రాహూల్ అడ్డు తగిలాడు.

ఎందుకంటే యమనాకా డాక్టర్ అయినా ఆయనకు పరిశోధనల పట్ల ఆసక్తి. ఆసక్తి అయితే ఉంది కాని అడుగు ముందుకు సాగటం లేదు. అందుకే ఆయన భార్య విసిగిపోయి పరిశోధనలు మానేసి వైద్యం చేసుకోమని సలహా కూడా ఇచ్చింది. కాని ఆయన మాత్రం పరిశోధనలకే మొగ్గు చూపాడు. నారా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీలో పనిచేయటానికి అర్జీ పెట్టుకున్నాడు. దానిఅదంత సులభమా? అసలు సాధ్యమేనా? సాధ్యం చేసి చూపిస్తానన్న 'ఆత్మవిశ్వాసం' యమనాకాను 1999లో పరిశోధకుడిగా నిలబెట్టింది.లో ఆయన రాసిన ఒక మాట, ఆయన భవిష్యత్తునే మార్చివేసింది. ఈ సంస్థకు చాలామందే అర్జీ పెట్టుకున్నారు. వారిలో చాలామంది యమనాకా కంటే మెరుగైన వాళ్లు కూడా. కాని ఆ సంస్థ వాళ్లు యమనాకాకు అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఎందుకంటే యమనాకా పిండస్థ మూలకణాల లక్షణాలను కన్గోంటానన్నందుకు ఇచ్చారు. కన్గోంటానన్నందుకు కాదు 'కనుగొనగలను' అనే ఒకే ఒక్క మాట రాసినందుకు ఎంపిక చేశారు.

1999-2003 సం. మధ్యకాలంలో ఆయన చేసిన పరిశోధనలతో, ఆ తర్వాత 2006వ సం.లో ఎదిగిన ఎలుకల 'ఫైబ్రోబ్లాస్ట్' కణాల నుండి “బహువిధ శక్తివంతమైన మూలకణాలను' (Pluripotent Stem Cells) తయారు చేసి చూపాడు. ఇవి పిండదశలో ఉండే 'బ్లాస్టోసిస్ట్' కణాలను పోలినవి. బ్లాస్టోసిస్టు కణాలంటే ఫలదీకరణ చెందిన కొద్దిరోజుల్లో ఏర్పడే పిండ కణాలు. ఇవి ఏ అవయవాలు లేక కణజాలాలుగా విభేదనం చెందవు ఆ దశలో. అంటే అవి ఎలా కావాలంటే అలా మార్పు చెందగలవు. అదే విభేదనం లేదా పరిణితి చెందిన కణాలు అలా తిరిగి పిండకణాలుగా మార్పు చెందలేవు. కాని యమనాకా సాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేశాడు. బాగా ఎదిగిన కణాల నుండి మళ్లీ పిండదశలో ఉండే కణాలను రూపొందించాడు. ఇప్పుడు చెప్పు యమనాకాకు ఇదెలా సాధ్యమైంది. ఆయన పై ఆయనకున్న నమ్మకం, విశ్వాసం. దాన్నే ఆత్మవిశ్వాసం అంటాం. ఏదైనా సాధించాలంటే ఇది తప్పనిసరి.

ఇంకో మాటకూడా చెప్పుకోవాలి. అదేమంటే ఆత్మవిశ్వాసంతో పాటు హేతుబద్ధంగా ఆలోచించడం, ప్రయోగాలు చేయడం కూడా తప్పనిసరి. ఈ పరిశోధనతో ఏమిటి లాభం? దీనితో ఎన్నో మహమ్మారి రోగాల బారిన పడిన అవయవాలను తిరిగి తయారుచేసుకోవచ్చు. అలా అయితే మనం ముందు ముందు దేనికీ భయపడనక్కర్లేదు కదా! యమనాకా కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు. మంచి క్రీడాకారుడు కూడా. 2011లో ఒసాకా మరాథాన్ లో రికార్డు సమయంలో (4:29:53) పరుగెత్తాడు. 2012లో క్యోటో మరాఠాన్ ను కేవలం నాలుగు గంటల మూడు నిమిషాల 19 సెకన్లలోనే పూర్తి చేశాడు (4:03:19). షెన్యాయమనాకా జుడోలో బ్లాక్ బెల్డ్ కూడా. ప్రస్తుతం ఆయన పూరిపొటెంట్ కణాల (బహువిధ శక్తి వంతమైన కణ) పరిశోధనా సంస్థకు అధిపతిగా, ప్రొఫెసర్ గా కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్నారు. ఆయన నోబెల్ బహుమతితో పాటు మరెన్నో ప్రఖ్యాతిగాంచిన అవార్డులు గెల్చుకున్నారు.

పాలపుంతల రహస్యాలు కనిపెట్టిన డా. సాండ్రామూర్ ఫేబర్

dec036.jpgప్రతిదానికీ ప్రశ్నించే వాళ్లను చూసి కొందరు సరదాగా వీడు పుడుతూనే ప్రశ్నలు మింగినట్లున్నాడురా అని చమత్కరిస్తారు. నిజమే, మనకది సరదాగానో, చికాకుగానో అన్పించినా మానవజాతి ఆవిర్భావానికీ ప్రశ్నించడానికీ చాలా దగ్గర సంబంధం ఉంది. ఆలోచించడం, ప్రశ్నించడం కేవలం మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే పని. జంతువులకు మనకు అక్కడే మౌలిక భేదం. మనం ఆలోచించడం, ప్రశ్నించడం మానేస్తే మానకూ ఇతర జంతువులకు పెద్దగా తేడా ఉండదు. కాబట్టి చెకుముకి నేస్తాలూ ప్రశ్నించండి! సరే ఇప్పుడు ప్రశ్నలు మింగిన మనిషి గురించి ఆలోచిద్దాం!

ప్రశ్నలు తిన్న సందేహాల రావుకి పెద్ద పెద్ద సందేహాలే వస్తుంటాయి అప్పుడప్పుడూ! ఉన్నట్టుండి మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్న తలెత్తింది. ఇదే ప్రశ్ననా? ఎక్కడుంటాం మన ఊళ్లో, హైదరాబాద్ లో.. మరి హైదరాబాద్ ఎక్కడుంది? భారతదేశంలో... భారతదేశం ఎక్కడుంది? ఆసియా ఖండంలో.. ఆసియా ఖండం ఈ భూగోళంపైన... ఈ భూగోళం ఎక్కడుంది? ఏం ప్రశ్నలురా బాబు! సూర్యకుటుంబంలో కదా! అంతేనా ఇంకేమైనా ప్రశ్నలున్నాయా అన్నట్లు చూశాడు సైన్సు తాతయ్య. తాతా నీ అంతు చూస్తానన్నట్లు సందేహాల రావు మళ్లీ ప్రశ్నందుకున్నాడు. ఈ సూర్యకుటుంబం ఎక్కడుందని అడిగాడు. సూర్యకుటుంబం పాలపుంతలో dec035.jpg(Galaxy) ఉంది. పాలపుంతనా అదెక్కడుంది? అదెలా వచ్చింది? అంటూ విశ్వం మూలాల్లోకి ప్రశ్నను సంధించాడు సందేహాల రావు. సైన్సు తాతయ్య ఇక లాభం లేదని ఈ అనంతవిశ్వం ఎలా ఆవిర్భవించిందో అదెలా పరిణామం చెందిందో తెలియజెప్పేందుకు ఓ గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్త డా. సాండ్రా మూర్ ఫేబర్ గురించి చెబుతా వినమని చెప్పాడు. బోస్టన్ లో జన్మించి, పిట్సుబర్గ్ హైస్కూల్లో చదువుకున్న ఓ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి విశ్వరహస్యాలను ఛేదించిన గొప్ప అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎలా ఎదిగిందో చెప్పసాగాడు. 1972లో హార్వర్డు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ (Ph.D) చేసి అప్పట్నుంచి శాంతాక్రజ్ (Santa Cruz), కాలిఫోర్నియా యూనివర్శిటీ అబ్జర్వేటరీలలో పరిశోధనలు చేసింది. ఈ అనంత విశ్వం ఎక్కణ్ణించి, ఎలా ఆవిర్భవించిందనేది తెల్సుకునేందుకు ఆమె పరిశోధనలెంతో దోహదం చేశాయి. పాలపుంతలేర్పడేందుకు మూలమైన శీతల కృష్ణపదార్థం (Cold dark matter) రహస్యాన్ని ఆమె ఛేదించింది. అంతేకాదు పాలపుంతల కేంద్రంలో ఉండే భారీ కృష్ణబిలాలు (black holes) గురించి తెల్సుకోటానికి కూడా సాండ్రాఫేబర్ పరిశోధన తోడ్పడింది. విశాలమైన ఈ అనంత విశ్వనిర్మాణానికి, పాలపుంతలేర్పడటానికి కారణాలను వివరించింది.

dec034.jpgరాబర్ట్ జాక్సన్ అనే విద్యార్థితో కలిసి దీర్ఘ గోళాకారంలో (elliptical) ఉండే పాలపుంతలను స్పెక్ట్రోస్కోపీ (Spectroscopy) ఉపయోగించి పరిశోధనలు చేసింది. పాలపుంత కేంద్రంలో ఉండే నక్షత్రాలు, వాటి కక్ష్యలో ప్రయాణించే వేగానికి, వాటి నుండి వెలువడే కాంతికి మధ్య ఉన్న సంబంధాన్ని కనిపెట్టింది. ఇదే “ఫేబర్-జాక్సన్ సంబంధం” (FaberJackson relation)గా ప్రసిద్ధిగాంచింది. నక్షత్రాలు పయనించే కక్ష్యావేగం, వెలుతురు మధ్యవున్న ఈ సంబంధం ఆధారంగా వివిధ పాలపుంతల మధ్య దూరాన్ని అంచనా వేసే వీలుకలిగింది. మనం నివసించే భూగోళంతో సహా మన సూర్యకుటుంబానికి పుట్టిల్లయిన పాలపుంత సిబ్బి లేక డిస్క్ (disk) వంటి నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు కూడా ఫేబర్ సూత్రాలు ఉపయోగపడ్డాయి.

dec033.jpgపాలపుంతల నక్షత్ర సముహాల నిర్మాణాన్ని, పరిణామాన్ని అధ్యయనం చేసింది. పాలపుంతల చుట్టూ అదృశ్య కృష్ణ పదార్థ వలయాలు (Halos of "dark matter") ఉంటాయనీ, ఈ కృష్ణపదార్థపు ఆకర్షణ శక్తి పాలపుంతలేర్పడటానికి, అనంత విశ్వం ఒక రూపు తీసుకోవటానికి కారణమని చెప్పింది. డోనాల్డ్ లిండెన్ బెల్ (Donld Lynden-Bell) తదితర సిద్ధాంత కర్తలతో కలిసి 1980వ దశకంలో 300 పాలపుంతల లక్షణాలను అధ్యయనం చేసింది. దీని నుండి ఆమె, ఆమె సహచరులతో కలిసి "The Great Attractor" గొప్ప ఆకర్షితుణ్ణి కన్గోన్నది. పాలపుంత, దాని చుట్టూ వున్న గెలాక్సీలు స్థానికంగా కేంద్రీకృతమయ్యే ద్రవ్యరాశి వైపు ఆకర్షించబడతాయని తేల్చి చెప్పింది.

సాండ్రా ఫేబర్ (Sandra Faber) నూతన టెలిస్కోపులను కనిపెట్టటంలోనూ దిట్ట. హబుల్ స్పేస్ టెలిస్కోప్ (Hubble Space Telescope) అద్దంలో వచ్చిన లోపాన్ని సవరించడంలో ఆ టీమ్ కు ఎంతో తోడ్పడింది. కెక్ II టెలిస్కోప్ (Keck II Telescope) ఎన్నో వస్తువుల అంతర ఛాయా చిత్రాలు తీసే స్పెక్టోగ్రాఫ్ (Deep - Imaging Multi-Object Spectrograph) అభివృద్ధిలో కూడా సాండ్రా నిర్వహించిన పాత్ర ఎనలేనిది. ఇది సుదూర ప్రాంత పాలపుంతల (10m class telescope) ఛాయా చిత్రాలు తీసే ప్రపంచంలోనే మొట్టమొదటి టెలిస్కోప్. ప్రస్తుతం సాండ్రా ఫేబర్ కాలిఫోర్నియా యూనివర్శిటీ అబ్జర్వేటరీకి డైరెక్టర్ గా పనిచేస్తోంది.

గత మూడు దశాబ్దాలుగా ఫేబర్ చేసిన పరిశోధనలు, ఆమె సిద్ధాంతాలు ఈ విశ్వవిర్భావాన్ని వివరించటమే కాదు ఎందరో యువశాస్త్రజ్ఞులను ప్రభావితం చేసింది. బ్రూస్ మెడల్, జర్మనీ అంతరిక్ష పరిశోధలకిచ్చే కార్ల్ ష్వార్చ్ చైల్డ్ (Karl Schwarzs Child) మెడల్ (2012) వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నది. పాలపుంతలు ఏర్పడటాన్ని, పరిణామం చెందటాన్ని ప్రయోగాల ద్వారా ఆవిష్కరిస్తున్న శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. వారిలో సాండ్రా ఫేబర్ మేటి. నీ సందేహాలకు సమాధానాలు సైన్సులో ఉన్నాయి. ఈ రోజు దొరకని సమాధానం రేపైనా లభిస్తుంది. కొద్దిగా ఓపిక పడితే చెకుముకి రవ్వల్లాంటి మన బాలనేస్తాలు కూడా గొప్ప శాస్త్రవేత్తలై ముందు ముందు నీ సందేహాలు తీరుస్తారు సరేనా!

సి.ఆర్. రావు

crraoతెలుగు రాష్ట్రాలలో పాఠశాల చదువును, విశాఖలో కాలేజీ చదువును అభ్యసించి ఆంధ్ర యూనివర్సిటీలో గణితం నందు ఎమ్.ఏ ను పూర్తి చేసి స్టాటిస్టిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి 40 సంవత్సరాల పాటు I.S.I. (Indian Statistical Institute)లో పని చేసి దేశ విదేశాలలో సాంఖ్యకశాస్త్రంనకు చేసిన కృషికి సైన్స్ పరిశోధనలలో లభించే అత్యున్నత పురస్కారాలు పద్మవిభుషణ్ తో పాటు పలు అవార్డులు పొంది కూచిపుడి నృత్యం, హస్య కథలు, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ లలో నైపుణ్యం చూపిన బహుముఖ ప్రజ్ఞశాలి సి.ఆర్. రావు. ఈ నెలలో 95 వసంతాలు పూర్తి చేసుకొంటూ తెలుగువారికే కాదు, యావత్ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచారు.

కల్యంపూడి రాధాకృష్ణారావు (సి.ఆర్. రావు) కర్ణాటక రాష్ట్రంలోని హడగలిలో సెప్టెంబర్ 10, 1920న జన్మించారు. ఇతను సి.డి. నాయుడు, లక్ష్మీకాంతమ్మ గార్లకు 8వ సంతానం. ఇతనికి ఆరుగురు సోదరులు, నలుగురు అక్కాచెల్లెళ్లు కలరు. రావు పాఠశాల విద్యను గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలలోని పాఠశాలల్లో చదువుకొని తండ్రి సలహాతో ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్.ఏ. గణితశాస్త్రంలో ప్రథముడిగా నిలిచారు.

1941 లో పరిశోధన రంగంలో కృషి చేయాలని కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (I.S.I.)కు వెళ్లాడు. మూడు గదులలో గల ఈ సంస్థలో ఉన్న గణనయంత్రాలు, సమాచారాలను తెలియజేసే రంగురంగుల పట్టీలు, సి.ఆర్. రావుకు ఆశక్తిని కలిగించాయి. తర్వాత ఇతను తన తండ్రిని ఒప్పించి ఎమ్.ఎ.స్టాటిస్టిక్స్ కోర్సులో చేరి గోల్డ్ మెడల్ సాధించారు. 1944లో I.S.I. లో స్టాటిస్టిషియన్ గా చేరి అక్కడే 1972లో దానికి డైరెక్టర్ అయ్యారు. బెంగాళ్ కు చెందిన ప్రశాంతచంద్రమహలనొబిస్ చే కలకత్తాలో 1932లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ను (I.S.I.)ని ప్రారంభించబడినది. మహాలనోబిస్, సి.ఆర్. రావుల కృషి వలన I.S.I. అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సంపాదించింది. అందుకే కొద్దిమంది “Bengali is the mother tongue of statistics and Telugu is the father of tongue” అని సరదాగా చెప్పుకుంటారు. కాని వీరిద్దరు సాంఖ్యక శాస్త్రంనకు చేసిన కృషి ఫలితమే ‘ఆధునిక సాంఖ్యక శాస్త్రం’ అనడంలో అతిశయోక్తి లేదు.

ఒకసారి కేంబ్రిడ్జి అంత్రపొలాజికల్ మ్యూజియం నుండి మహాలనోబిస్ కు ఒక్క ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో బ్రిటీష్ పరిశోధకులు ఆఫ్రికాలో అంత్రపొలాజికల్ అవశేషాల కోసం త్రవ్వుతున్నప్పుడు కొన్ని అస్తిపంజరాలు, ఎముకలు దొరికాయి. వీటిని పరిశీలించడానికి ఒక మనిషి కావాలని ఉంది. అందుకు మహాలనోబిస్ నేను చాలా సమర్థుడైన సాంఖ్యక శాస్త్రవేత్తను పంపుతున్నాను, కాని అతనికి ఆంత్రపాలజీ గురించి తెలియదు కాబట్టి అతనితో పాటు ఆంత్రపాలజీ శాస్త్రవేత్తను కూడా పంపిస్తున్నానని సి.ఆర్. రావును కేంబ్రిడ్జికి పంపారు. అక్కడ సి.ఆర్. రావు అస్తిపంజరాలను వాటి కొలతల ప్రకారం అంచనా వేసి విశ్లేషణ చేసే సిద్ధాంతాలను తెలియజేశాడు. అందుకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ రావుకు డాక్టరేట్ ప్రధానం చేసింది. ఇక్కడ సి.ఆర్. రావు ప్రపంచ సాంఖ్యకశాస్త్ర పితామహుడు  ఆర్.ఎ. ఫిషర్ పర్యవేక్షణలో పనిచేశాడు. ఫిషర్ తో కలిసి జన్యుశాస్త్రానికి సంబంధించి ఎలుకలు జీవకణాలలోని క్రోమోజోమ్స్ పై పరిశోధనలు చేసి ‘మాథమెటికల్ జెనటిక్స్’ శాస్త్ర అభివృద్ధికి కృషి చేశారు.

1945లో సి.ఆర్. రావు ‘థియరీ ఆఫ్ ఎస్టిమేషన్’ గణాంక శాస్త్ర నిపుణులను ఆశ్చర్యపరిచింది. స్టాటిస్టిక్స్ లో రావ్-క్రామర్ ఇనీక్వాలిటి, రావ్-ఫిషర్ థియరీ, రావ్-బ్లాక్ వెల్లిజేషన్ వంటి సూత్రాలు, సిద్ధాంతాలు సాంఖ్యక శాస్త్రంలోనే అత్యున్నత స్థాయి పరిశోధనా ఫలితాలుగా గుర్తించబడ్డాయి. ఇతను తెలియపరిచిన ‘డిజైన్ ఆఫ్ ఎక్స్పరిమెంట్స్’ పరిశ్రమలో ఉత్పాదకతను పెంచడానికి, ‘మల్టివేరియట్ అనాలసిస్’ వైద్యంలో రోగ నిర్ధారణకు, మొక్కల క్రొత్త వంగడాల ఉత్పత్తి బయోమెట్రి అంటే బయాలజీలో గణిత సంబంధమైన కొలతలకు సంబంధించిన శాస్త్రంలో ఉపయోగపడుతున్నది. ఇతను 40 సం. ల పాటు I.S.I లో పనిచేసే పదవీ విరమణ చేసిన ఆనాటి ప్రధానమంత్రులు, జనహర్ లాల్ నెహ్రూ, శ్రీమతి ఇదిరాగాంధీలు రావుగారిని ప్రొఫెసర్ గా ప్రత్యేక ఉద్యోగ హోదా నియమించారు.

1990లో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో బెర్లి ప్రొఫెసర్ గా పనిచేశారు. రావు ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాథమెటికల్ సైన్సెస్, ద ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సౌసైటీ, ఇండియన్ ఎకనామికల్ సొసైటీలకు అధ్యక్షత వహించిన సి.ఆర్. రావు 14 పుస్తకాలను, 400 పరిశోధనా వ్యాసాలకు ప్రచురణకర్తగా ప్రపంచ ఖ్యాతి పొందారు. ఇతను 19 దేశాల నుండి 38 గొరవ డాక్టరేట్లు స్వీకరించారు. ఇతను భారతదేశంలోని మేటి 10 శాస్త్రవేత్తలలో ఒక్కరిగా చెరగని ముద్రవేస్తారని ‘Times of India’ ప్రకటించింది. 2002లో ఇటలీ నందు శాస్త్రవేత్తలకు ఇచ్చే ఆ దేశ అత్యున్నత జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. ఇండియన్ ఇన్య్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగపూర్ ఈయన రూపొందించిన ఆధునిక సాంఖ్యక శాస్త్రంలోని అంశాలకు 2014 జులై 20న 38వ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఇంతే కాక 2001లో భారత ప్రభుత్వం పద్మవిభుషణ్, భఠ్నగర్ అవార్డు, మేఘనాథసాహా అవార్డు, ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ పురస్కారం పొందారు.

ఇతను కేవలం సాంఖ్యకశాస్త్రానికే పరిమితం కాలేదు. ఇతను ఢిల్లీలోని కూచిపూడి నృత్య అకాడమీకి అధ్యక్షునిగా పనిచేశారు. కొన్ని పత్రికలలో నీరు రచించిన హాస్యకథలు ప్రచురితమయ్యాయి. మొక్కలు పెంచడం, వంటలు చేయడంలో కూడా నేర్పరి. ఇతను తీసిన కొన్ని ఫోటోలు అమెరికన్ పత్రికలలోను ప్రచురితమయ్యాయి.

ఇంతటి ప్రతిభ గల సి.ఆర్. రావు వృద్ధాప్యంలో సైతం యువకుడిగా దేశవిదేశాలలో ప్రాచుర్యం పొందుతూ ఉండటం మనకు గర్వకారణం.

గోవింద్ స్వరూప్

govindswaroopరేజియో ఆస్ట్రానమీలో భారత ఖ్యాతిని దిగంతాలకు చాటిన మేటి శాస్త్రవేత్త గోవింద్ స్వరూప్.

భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సందర్భంలో మన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1947, ఆగస్టు 14 అర్థరాత్రి చేసిన ప్రసంగాన్ని విని దేశం కోసం తరలివచ్చిన తొలితరం శాస్త్రవేత్తల్లో గోవింద్ స్వరూప్ ఒకరు. రేడియో ఖగోళ విజ్ఞాన శాస్త్రానికి (Radio Astronomy) మనదేశంలో పునాదులు వేసిన గొప్ప శాస్త్రవేత్త గోవింద్ స్వరూప్. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో యం.యస్సీ. చదివే రోజుల్లో డా. కె.యస్.కృష్ణన్ స్వరూప్ ను బాగా ప్రభావితం చేశారు. అందుకే భౌతికశాస్త్రం పట్ల మక్కువ ఏర్పరచుకున్నాడు స్వరూప్. ఆయన గురువు కె.ఎస్. కృష్ణన్ మరెవరో కాదు సి.వి. రామన్ శిష్యుడు. ఆయనకు నోబెల్ బహుమతి తెచ్చిన 'రామన్ ఎఫెక్ట్' సహ పరిశోధకుడు కూడ. ఆ తర్వాత కృష్ణన్ జాతీయ భౌతికశాస్త్ర సంస్థ (National Physical Laboratory - NPL)కు తొలి డైరెక్టర్ అయ్యాడు. స్వరూప్ యం.యస్సీ పూర్తి చేశాడో లేదో NPLలో చేరేందుకు కృష్ణన్ నుంచి పిలుపు వచ్చింది. అయస్కాంతత్వ క్వాంటం సిద్ధాంతంపై కృష్ణన్ పరిశోధనలు చేపట్టి ఎలక్ట్రాన్ స్పిన్ అనువాదాన్ని (Electron Spin Resonance) అధ్యయనానికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ను అభివృద్ధి చేసే పనిని స్వరూప్ కు అప్పజెప్పాడు. అప్పుడప్పుడే కాలేజీ నుండి వచ్చిన ఒక విద్యార్థికి ఇది చాలా పెద్ద పనే. రెండో ప్రపంచ యుద్ధకాలంలో మిగిలిపోయిన కొన్ని రాడార్ సెట్లు సంపాదించి, అప్పట్లో అంతంత మాత్రంగా ఉన్న శాస్త్ర సమాచారాన్ని అధ్యయనం చేసి కేవలం 18 నెలల్లోనే సిన్ రెసొనెన్స్ ప్రయోగాన్ని సాకారం చేసి చూపించాడు స్వరూప్.

భౌతిక శాస్త్రవేత్తలు వారి మేధస్సునూ, నైపుణ్యాన్ని ఉపయోగించి రాడార్లను అభివృద్ధి చేసి సూర్యుడు, నక్షత్రాలు, గెలాక్సీల నుండి వచ్చే రేడియో తరంగాలను అధ్యయనం చేయటం అప్పుడప్పుడే మొదలయ్యింది. ఇలా గెలాక్సీలు, నక్షత్ర సమూహం, సూర్యుడి నుండి వెలువడే రేడియో తరంగాలను అధ్యయనం చేసే శాస్త్రాన్నే ‘రేడియో ఆస్ట్రానమీ' లేదా రేడియో ఖగోళ విజ్ఞాన శాస్త్రం (Radio Astronomy)గా పిలుస్తారు. అంతర్జాతీయ రేడియో సైన్సు యూనియన్ సభలకు వెళ్లిన కె.యస్.కృష్ణన్ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు జోసెఫ్ పాసే (Joseph Pawsey), పాల్ వైల్డ్ (Paul Wild), క్రిస్టెన్ సెన్ (Christensen)ల పరిశోధనలు చూసి NPLలో రేడియో ఆస్ట్రానమీ ప్రారంభించదలిచాడు. ఆ కాలంలోనే (1953) స్వరూప్ ఫెలోషిప్ పై రెండేళ్లు ఆస్ట్రేలియా వెళ్లి పాసేతో కలిసి పనిచేశాడు. అక్కడే పాల్ వైల్డ్, జాన్ బోల్టన్, బెర్నార్డ్ మిల్స్ ల సాంగత్యం లభించింది. సూర్యునిపై అధ్యయనానికి క్రిస్టెన్ సెన్ డిజైన్ చేసి నిర్మిస్తున్న 32 ఆంటెన్నాల టెలిస్కోప్ నిర్మాణంలో మరో భారత శాస్త్రవేత్త పార్థసారధితో కలిసి స్వరూప్ కీలకపాత్ర పోషించాడు. స్వరూప్ తిరిగి NPLకు వచ్చే ముందు క్రిస్టెన్ సెన్ మరో కొత్త టెలిస్కోప్ ను నిర్మిచాలని నిర్ణయించాడు. దీని కోసం 32 యాంటెన్నాల నిర్మాణాన్ని, దానితో వున్న ఎలక్ట్రానిక్స్ ను తీసి వేస్తున్నారు, దాన్నలా మూలన పడేసి, చెడగొట్టే బదులు తన దేశానికి బహుమతిగా ఇస్తే ఎంత బాగు అనుకున్నాడు స్వరూప్. సంకోచంగానే తన కోరికను పాసేతో చెప్పాడు. వారు సంతోషంగా స్వరూప్ కు ఆ టెలిస్కోప్ ను బహుకరించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని NPL డైరెక్టర్ కృష్ణన్ కు తెలిపారు. తను ప్రారంభించాలనుకున్న రేడియో ఆస్ట్రానమీకి ఇది ఎంతగానో తోడ్పడుతుందని కృష్ణన్ సంతోషించాడు. కాని ఆస్ట్రేలియా వాళ్లు ఉచితంగా ఇచ్చిన టెలిస్కోప్ ను తెచ్చుకోటానికి కావలసిన 1400 డాలర్ల విమాన ఛార్జి NPL దగ్గర లేక దిగుమతి చేసుకోలేకపోయారు. తర్వాత ఆ డబ్బు కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వమే ఇవ్వటంతో కథ సుఖాంతమైంది. స్వరూప్ రేడియో ఆస్ట్రానమీ పరిశోధనలకు మార్గం సుగమమైంది.

1956 ఆగస్టులో ప్రఖ్యాత రేడియో ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రేస్ వెల్ దగ్గర డాక్టరేట్ చేసేందుకు అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ కు వెళ్లాడు. స్వరూప్ వెళ్లిన కొద్ది నెలల్లోనే ఆసక్తికరమైన డిస్కవరి చేశాడు. సూర్యుడి నుండి వెలువడే కొత్తరకం రేడియో విస్పోటనం ఇది. దీన్నే సైక్లోట్రాన్  రేడియేషన్ అంటారు. అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్లు గిరికీలు కొట్టడం వల్ల ఈ రేడియేషన్ వస్తుందని కన్గొన్నాడు. కాలిఫోర్నియాలో 1961లో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల సమావేశంలో స్వరూప్ మరో ముగ్గురు భారత ఖగోళ శాస్త్రజ్ఞులతో (టి.కృష్ణన్, టి.కె.మీనన్, యం.ఆర్.కుందు) కలిసి స్వదేశం రావాలనుకున్నారు. సమిష్టిగా పరిశోధనలు చేయాలని నిర్ణయించుకొని ఎక్కువ తరంగ దైర్ఫ్యం ఉన్న టెలిస్కోప్ నిర్మాణానికి ఉమ్మడి ప్రతిపాదనను పంపారు. ముంబై టాటా పరిశోధనా సంస్థ (TIFR) డైరెక్టర్ హోమీ భాభా వారిని సాదరంగా ఆహ్వానించి భారతదేశంలో రేడియో ఆస్ట్రానమీ వికాసానికి దోహదం చేశాడు..

ఖగోళశాస్త్రంలో క్వాసర్ల (QUASARS) డిస్కవరీ పెద్ద సంచలనం సృష్టించింది. చంద్రగ్రహణం ఏర్పడి విడిచే సందర్భాల్లో క్వాసర్ల వంటి వాటిని పరిశీలించటం సాధ్యమనే ఆవిష్కరణ ఖగోళ పరిశోధనల్లో నూతన అధ్యాయానికి బాటలు వేసింది. విశ్వం ఎలా ఆవిర్భవించింది? ఈ విశ్వానికి ఆరంభం ఉందా? ఉంటే అది ఒక మహా విస్ఫోటనం లేదా 'బిగ్ బాంగ్' (Big Bang) ద్వారానా లేక నిశ్చల స్థితిలో (Steady State Theory) జరిగిందా? అనే సత్యాన్వేషణ పై పెద్ద చర్చ జరుగుతున్న కాలం అది. సుదూర రేడియో గెలాక్సీలను పాత్రిపదికగా, కొలమానంగా తీసుకొని ఈ ప్రశ్నకు సమాధానం వెదకవచ్చు. అందుకు వాటి కోణీయ వ్యాసాన్ని (Angular diameter) లెక్కించటం అవసరం. కాని గెలాక్సీల నుండి విడుదలయే రేడియో తరంగాలు చాలా బలహీనంగా ఉంటాయి. వీటిని అధ్యయనం చేసేందుకు చాలా సామర్థ్యం గల పెద్ద టెలిస్కోపు కావాలి. విద్యుదయస్కాంత తరంగాలను సేకరించే విస్తృత ఏరియాతో ఉండాలి. అది ఎటు అంటే అటు తిప్పేలా ఉండాలి. ప్రపంచంలో అప్పటివరకూ ఉన్న అతి పెద్ద ఆంటెనా వున్న జోడ్రెల్ బాంక్ టెలిస్కోపు వ్యాసం కూడా కేవలం 76 మీటర్లే. స్వరూప్ ఇందుకు 4 రెట్లు ఎక్కువ సామర్థ్యం, 10 వేల చ.మీ. మేర రేడియో తరంగాలు సేకరించగల టెలిస్కోప్ కావాలని అంచనా వేశాడు. పొడవైన పారాబోలిక్ టెలిస్కోప్ నిర్మాణం చేయాలని సంకల్పించి హోమీ భాభాతో చర్చించాడు. దీనిపై ఇంకా చర్చలనవసరం, వెంటనే నీ యువ టీమ్ ను ఎంపిక చేసుకొని రంగంలోకి దిగమని భాభా ప్రోత్సహించాడు. స్వరూప్ తన శిష్యుడు ఆర్.పి.సిన్హాతో కలిసి ఊటీ

కొండలను సర్వే చేసి 1956లో అనువైన ప్రాంతాన్ని గుర్తించాడు. భాభా స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి పచ్చజెండా ఊపాడు. 1969లో ఊటీ రేడియో టెలిస్కోప్ పూర్తయ్యే నాటికి దురదృష్టం భాభా కన్నుమూశారు. 530 మీ. పొడవు, 30 మీ. వెడల్పుతో భూపరిభ్రమణ కక్ష్యకు సమాంతరంగా తిరిగేట్లుగా 8 వేల చ.మీ. మేర రేడియో తరంగ సేకరణా సామర్థ్యంతో ఈ టెలిస్కోప్ నిర్మించారు. ఆనాడు ఎలక్ట్రానిక్, ఇంజనీరింగ్ రంగాల్లో నైపుణ్యం లేదు. వనరులు అంతంత మాత్రం. అంతా తానై యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నేతృత్వం వహించి స్వరూప్ రికార్డు సమయంలో టెలిస్కోప్ నిర్మించాడు. ఆ నిర్మాణంలో పాలుపంచుకున్న టీం సభ్యుల సగటు వయస్సు కేవలం 26 సం. అంటే స్వరూప్ స్వతంత్ర ఆలోచన, లక్ష్యం పట్ల నిబద్ధత, విజయంపై నమ్మకం చెప్పుకోదగ్గవి. దీనిపై చేసిన పరిశోధనల ఆధారంగా స్వరూప్ విశ్వావిర్భావానికి 'బిగ్ బాంగ్' కారణమని రుజువులు చూపాడు. ఊటి టెలిస్కోప్, స్వరూప్ నాయకత్వం ఎందరో యువకులను ఖగోళ శాస్త్రవేత్తలుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దింది.

స్వరూప్ తన విజయాలతో తృప్తి చెందలేదు. తన గ్రూపుతో కలిసి ప్రపంచంలోనే అతి పెద్ద జెయింటిమీటర్ వేవ్ రేడియో టెలిస్కోపు నిర్మాణానికి మళ్లీ నడుం కట్టాడు. దీన్నే GMRT టెలిస్కోపుగా పిలుస్తారు. ఒక జత యాంటెన్నాలు కలిసి ఒక పెద్ద టెలిస్కోపుగా పనిచేస్తాయని, దీనితో అపర్చర్ విస్తృతమవుతుందన్న మార్టిన్ రైల్ సిద్ధాంతానికి రూపమిచ్చాడు స్వరూప్. మార్టిన్ 5 కి.మీ. వరకు పనిచేసే టెలిస్కోపు రూపొందిస్తే, స్వరూప్ ఏకంగా 36 కి.మీ. మేర పనిజేసే టెలిస్కోపు రూపొందించాడు. A. స్వరూప్ గ్రేట్ ఇండియన్ రోప్ ట్రాక్ అని మొర పేరు పెట్టాడు. తర్వాత SMRTగా పిలువబడుతోంది GMRT టెలిస్కోపు ఆరంభం నుండే అంతర్జాతీయ స్థాయిలో 31 దేశాలు వినియోగించుకుంటున్నాయి. దీన్ని చూసిన ప్రఖ్యాత నోబెల్ శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ చంద్రశేఖర్, ఇటువంటిదొకటి సాధ్యమవుతుందని ఊహాలో కూడా అనుకోలేదన్నాడట. అది నేటికీ వినియోగంలో ఉంది. దీన్ని ప్రతి విద్యార్థి, యువకుడు, చూసి తీరాలన్నాడు. మనదేశ శాస్త్ర సాంకేతిక రంగాల స్వావలంబానానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడే వసతులూ లేవు, ఏమీ చేయలేం అనుకునే నేటి యువతకు స్వరూప్ శాస్త్రీయ దృక్పథం, అరకొరి వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చునని చేసి చూపించిన ధీరత్వం కనువిప్పు కావాలి.

శాస్త్రీయ స్పృహ మానవత మేళవించిన విజ్ఞాన స్పటికం ప్రొ. యం. విజయన్

mar0029.jpgకొందరు తమ కృషితో భావి తరాలకే మార్గదర్శులవుతారు. అలా స్ఫటిక విజ్ఞాన శాస్త్ర (Crystallography) రంగంలో భారతదేశంలోనే మేటి శాస్త్రవేత్తగా ఎదిగి ఎందరో శాస్త్రవేత్తలకు ఒక రోల్ మోడల్ గా నిలిచిన వ్యక్తి ప్రొ. మామన్నమాన విజయన్. ఎక్కడో కేరళలోని చెర్పులో పుట్టి, త్రిసూర్ కేరళ వర్మ కళాశాలలో చదువుకుని, అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో డాక్టరేట్ చేసిన 28 ఏళ్ల కుర్రాడికి ఒక అద్భుతం 1968లో తలుపుతట్టింది. ఆ అద్భుతం 1968లో తలుపుతట్టింది. ఆ అద్భుతమే ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొ. దొరోతి హాడ్కిన్ (Dorothy Hodgkin) దగ్గర పరిశోధన చేసే అవకాశం. ఆమె అసమాన్య ప్రతిభా పాటవాలున్న గొప్ప మహిళ, ప్రొ. విజయన్ మాటల్లోనే చెప్పాలంటే “ఒక తల్లి, ఒక ఉ పాధ్యాయుడు, ఒక స్నేహితుడు, గొప్ప మార్గదర్శకుడు అన్నింటినీ కలబోసిన మానవతా మూర్తి దొరోతి హాప్కిన్”. దొరోతి హాడ్కిన్ లా గౌరవం పొందిన గొప్ప శాస్త్రవేత్తలుండవచ్చునేమో గాని తన సహచరుల, విద్యార్థుల అభిమానాన్ని చూరగొనటంలో మాత్రం ఆమెకు ఆమే సాటి అంటారు ప్రొ. విజయన్. సైన్సులో నోబెల్ బహుమతి అందుకున్న అతికొద్ది మంది అరుదైన మహిళల్లో దొరోతి హాడ్కిన్ ఒకరు. మరి అంతటి గొప్ప మనిషితో కలిసి పరిశోధనలు చేసే అవకాశం రావడం అద్భుతం కాక మరేమిటి!

mar0028.jpgఇన్సులిన్ గురించి విన్నారా? వినే ఉంటారు. అదో హార్మోన్. దీని వల్లనే మన రక్తంలో చక్కెర నియంత్రణలో " ఉండేది. దీంట్లో తేడా వస్తే..? వస్తే వచ్చే వ్యాధి మధుమేహం లేదా డయాబెటిస్. ఇన్సులిన్ ప్రాముఖ్యం తెలుసుగాని ఈ హార్మోన్ ఎలా ఉంటుందో, దాని స్ఫటిక నిర్మాణం ఏమిటో తెలియదు అప్పట్లో దొరోతి హాడ్కిన్ కు అత్యంత ప్రియమైన పరిశోధనాంశం - ఇన్సులిన్, దాని స్ఫటిక నిర్మాణం. ఇన్సులిన్ స్ఫటిక నిర్మాణ రహస్యాలను ఛేదించే దొరోతి రీసెర్చిటీమ్ లో విజయన్ కు చోటు దక్కింది. 1969 వీరి టీమ్ ఇన్సులిన్ స్ఫటిక నిర్మాణాన్ని ఛేదించింది. దొరోతి ఒక శాస్త్రవేత్తగానే కాకుండా ఒక మహామనిషిగా ఎప్పటికీ తాను రుణపడి ఉంటానని విజయన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

mar0026.jpgఆక్స్ ఫర్డ్ లో స్ఫటిక నిర్మాణ శాస్త్ర అనుపానులు శోధించిన విజయన్ 1971లో భారతదేశం తిరిగి వచ్చి బెంగళూరులోని భారత శాస్త్ర విజ్ఞాన సంస్థ (Indian Institute of Science) భౌతికశాస్త్ర విభాగంలో చేరి అణు జీవభౌతిక శాస్త్ర (Molecular Biophysics) ప్రయోగశాలను స్థాపించాడు. ఇక్కడే ఆయన ఆస్పిరిన్ వంటి ఔషధ అణువుల స్ఫటిక నిర్మాణాలపై విస్తృత పరిశోధనలు చేశారు. అంతే కాదు ప్రోటీన్లు ఏర్పడటంలో కీలకపాత్ర వహించే అమైనో ఆమ్లాల సంక్లిష్టాలపై తొలిసారి పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే మన మనుగడకు అవసరమైన 20 ఎమైనో ఆమ్లాలలో చాలావాటి నిర్మాణాలను వెల్లడించింది విజయన్ సారథ్యంలోనే లైసీన్, హిస్టిడీస్, ఆర్జినైన్, ఆర్నిథీన్, ఆస్పార్టిక్ ఆమ్లం, గ్లుటామిక్ ఆమ్లం వీటిలో చెప్పుకోదగినవి.

mar0027.jpgజీవావిర్భావం (Origin of Life) లో కీలక పాత్ర వహించిన రసాయన పదార్థాలు ఏర్పడటాన్ని వివరించిన ప్రఖ్యాతిగాంచిన యురే-మిల్లర్ ప్రయోగం (Urey-Miller experiment) తర్వాత తమంతట తామే ప్రతికృతి (Self replication) జరిపే వ్యవస్థల ఏర్పాటుకు చోదకశక్తిగా పనిచేసే పాలిమర్ల ఏర్పాటును విజయన్ పరిశోధనలు రుజువు చేశాయి. అమైనో ఆమ్లాలు ఒక వైపు తల, మరో వైపు తోక ఉండేలా వాటంతట అవే జమ కూడటాన్ని నిరూపించాడు. ఇది పాలిమర్ల ఏర్పడటాన్ని (Polymerization) ప్రోత్సహిస్తుందని చూపాడు. అమైనో ఆమ్లాలు అమరికలో చూపే ఈ విధమైన ధోరణి పూర్వజీవ (Prebiotic) లేదా జీవం ఏర్పడటానికి ముందున్న వాతావరణంలో అమైనో ఆమ్లాలు ప్రోటీన్లుగా ఏర్పడటాన్ని సాధ్యం చేసిందని విజయన్ చెప్పారు.

ఇంతే గాక లైసోజైమ్, రైబోన్యూక్లియేజ్ వంటి ఎంజైములు, హీమోగ్లోబిన్ వంటి ప్రోటీన్, చక్కెర పదార్థాలను బంధించ గల లెక్టిన్, పనసపండులో ఉండే జాకాలిన్, ఆర్టో కార్పిన్లు, అరటి లెక్టిన్ ల నిర్మాణ రహస్యాలనెన్నింటినో విజయన్ బృందం వెల్లడించింది. తన పరిశోధనలు సమాజ హితానికి తోడ్పడాలని నమ్మినవాడు విజయన్. క్షయను కలిగించే మైకోబాక్టీరియా ట్యుబర్కులోసిన్ ఆంటిబయాటిక్స్ ను తట్టుకునే కొత్త రకం బక్టిరియాగా రూపొందటం వలన అంతరించి పోయిందనుకున్న జబ్బు మూడవ ప్రపంచ దేశాల్లో మళ్లీ పొడచూపింది. ఈ సమస్య పరిష్కారానికై మొట్టమొదటిసారి విజయన్ క్షయ ప్రోటీన్ (TB Protein) స్ఫటికాలను విశ్లేషించారు. DNA ప్రతికృతి, రిపేర్లలో పాల్గొనే ప్రోటీన్లు రెండు రూపాల్లో ఉంటాయని కన్గోన్నాడు. ఒకటి చురుకైన దశ అయితే మరొకటి నిదానంగా (Passive) ఉండే తంతువుల్లా ఉంటాయి. చురుకైన తంతువులు రెండవ దాని కంటే పొడవుగా ఉంటుంది. ఈ రకమైన నిర్మాణ వైవిధ్యాలు క్షయ కల్గించే బాక్టీరియా కొత్త రూపాలుగా మారటంలో పాత్ర వహిస్తాయి.

mar0025.jpgభారతీయ సైన్సులో ప్రముఖ పాత్ర వహిస్తున్న ప్రొ. విజయన్ ను వరించని అవార్డు లేదు. భట్నాగర్, రామచంద్రన్ మెడల్‌లతో పాటు 'పద్మశ్రీ' బిరుదును కూడా ప్రభుత్వం ఇచ్చింది. జీవ బృహదణువుల (Biological Macromolecules)పై వేసిన అంతర్జాతీయ కమిషన్ కు ఛైర్మన్ గా కూడా పనిచేశాడు. అన్నింటికంటే మిన్న ప్రొ. విజయన్ గొప్ప మానవతా వాది, హేతువాది. ప్రజాసైన్సు ఉద్యమంలో పాల్గొన్న గొప్ప శాస్త్రవేత్త. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ (KSSP)లో చురుకుగా పనిచేసి సైన్సు ఉద్యమాన్ని నడిపిన మేధావి. నేటి తరానికి, రేపటి తరానికి కూడా విజయన్ ఒక గొప్ప రోల్ మోడల్, స్ఫూర్తిదాత.

సైంటిఫిక్ టెంపర్ కు (శాస్త్రీయ దృక్పధం) నిలువెత్తు రూపం పద్మభూషణ్ డా.పి.ఎం.భార్గవ

feb001.jpgభారత రాజ్యాంగపు 51A అధికరణంలో పొందుపరిచిన పౌర విధుల్లో ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేయటం అత్యంత ముఖ్యమైనది. బాధ్యతాయుతమైన పౌరులు హేతుబద్ధంగా ఆలోచించాలి. అటువంటి ఆలోచనలను ప్రోత్సహించటం ద్వారా మాత్రమే వైజ్ఞానిక భారతాన్ని నిర్మించగలం. ఈ అధికరణంలో శాస్త్రీయ దృక్పథం’ (Scientific Temper)ను చేర్చటంలో ఒక గొప్ప ఆధునిక జీవశాస్త్రవేత్త కీలక పాత్ర పోషించాడు. ఆయన మరెవరో కాదు వద్మభూషణ్ ముష్పమిత్ర భార్గవ (P.M. Bhargava)నే. ఆయన ముందు చూపుకు ఇది ఒక నిదర్శనం మాత్రమే. భారతదేశంలోనే అగ్రగణ్య శాస్త్ర పరిశోధనా సంస్థగా వెలుగుతున్న సి.సి.యం.బి. (Centre for Cellular and Molecular Biology) స్థాపించిన శాస్త్రవేత్త డా. భార్గవ. స్వతంత్ర భారతంలో సైన్సు అభివృద్ధి చెందాలని కలలుగన్న తొలి తరం శాస్త్రవేత్తగా వారి కలలకు రూపం ఇస్తే ఆధునిక జీవశాస్త్ర సంస్థ ఎలా ఉంటుందో అందుకు ప్రతి రూపమే మన సిసియంబి (CCMB). డా. భార్గవ దార్శనితకు ఇది చిహ్నం .

ప్రపంచంలో ఏ పరిశోధనా సంస్థకూ తీసిపోని విధంగా CCMBని తీర్చిదిద్దిన ఘనత డా. భార్గవకు దక్కుతుంది. అన్ని సౌకర్యాలు, అందరికీ అందుబాటులో ఉండటం ఆ సంస్థ ప్రత్యేకత. కేవలం ఆధునిక పరికరాలు మాత్రమే గాక శాస్త్రరంగాన్ని నడిపించే యువ శాస్త్రవేత్తల బృందాన్ని ఒక చోట చేర్చటంలో భార్గవ కృషి పలువురి మన్ననలు పొందింది. అక్కడ ఏ లాభను, ఏ మొక్కను అంతెందుకు ఏ చిన్న ఇటుకను, రాయిని పలుకరించినా భార్గవ కనబడతాడంటే అతిశయోక్తి కాదు. ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే పలుకరించే కళారూపాలు, గొప్ప గొప్ప ఆర్టిస్టులచే వేయబడిన పెయింటింగ్స్ ఒక కళా ప్రదర్శన శాలను తలపిస్తాయి. కారిడార్ దాటామా ఇక పరిశోధనల్లో మునిగి తేలే యువ పరిశోధకులు, శాస్త్రజ్ఞులు. అక్కడ వారికి ఆదివారాలు పగలు రాత్రులు పెద్దగా పట్టవు. కొత్త విషయాలను కల్గినటంలోనే వారి దృష్టంతా.

feb002.jpgఇంతా గొప్ప ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగే పరిశోధనలు మనం నిజంగా హైదరాబాద్ లోనే ఉన్నామా! అనేలా ప్రయోగశాలలు అబ్బుర పరుస్తాయి. ఆ భార్గవ కేవలం ఒక సంస్థను మాత్రమే స్థాపించలేదు. విలువలతో కూడిన ఒక గొప్ప సంస్కృతిని నెలకొల్పినాడని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా. యం.యస్. స్వామినాథన్ అన్నమాటలు అక్షర సత్యాలు. ఆనాటి ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల (Regional Research Lab)లో జీవ రసాయన శాఖగా మొదలైన ఒక చిన్న ప్రయోగశాలను ప్రపంచ స్థాయి పరిశోధనా తీర్చిదిద్దినవాడు భార్గవ.

feb005.jpgభార్గవ దృష్టిలో సైన్సు, కళలు వేర్వేరు కాదు. మానవ మేధస్సుకు అవి రెండు పార్మ్వాలు, పువ్వులు, మాత్రమే. అందుకేనేమో ప్రాన్సిస్ క్రిక్ వంటి ఎందన నోబెల్ శాస్త్రవేత్తలు, పండిట్ రవిశంకర్ యం.యఫ్.హుస్సేన్ వంటి ఎందరో కళాకారులు CCMBని చూసి మెచ్చుకున్నారు. ఎక్కడో రాజస్థాన్ లోని అజ్మీర్ లో 1928 ఫిబ్రవరి 22న జన్మించిన భార్గవ పదేళ వయస్సులో వారణాసిలో అడుగుపెట్టి 1946 నాటికి రసాయన శాస్త్రంలో డాక్టరేట్ చేశాడు. పి.హెచ్.డి. తర్వాత అమెరికా వెళ్లి ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఛార్లెస్ హైడెల్ బర్గర్ (Charles Heidelburger) దగ్గర పరిశోధనలు చేసి కాన్సర్ ను నివారించే 5-ఫ్లోరోయురాసిల్ (5-Flucouracil)ను కనుగొన్నాడు. 1950లో హైదరాబాద్ లోని అప్పటి శాస్త్ర, పారిశ్రామిక ప్రయోగశాల (Scientific Industrial Lab)లో చేరినది వెదలు తాను CCMB డైరెక్టరుగా 1990లో పదవీ విరమణ చేసే వరకూ తన పరిశోధనా వ్యాసంగమంతా మన హైదరాబాద్ లోనే సాగింది. వెల్ కంట్రస్ట్ ఫెలోగా బ్రిటన్ లో పరిశోధనలు చేసిన భార్గవ తన పరిశోధనా రంగాన్ని జీవశాస్త్రం వైపు మళ్లించాడు.

CCMB నిర్మాణానికి అప్పట్లో 67 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విశేషమేమిటంటే డా. భార్గవ నాయకత్వంలో దాన్ని కేవలం 12.5 కోట్లకే నిర్మించటం. తాను జీవితంలో ఎన్నడూ లంచం ఇవ్వటం కానీ, తీసుకోవడం కానీ చేయలేదని ప్రకటించిన నిస్వార్థ జీవి భార్గవ. శాస్త్ర ప్రపంచం, ప్రభుత్వం కూడా ఆయనను అలానే గౌరవించాయి. భారత ప్రభుత్వంచే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అందుకోవడమే గాక వందకు పైగా అవార్డులు పొందాడు.

శాస్త్రరంగంలో ఎంతటి దిట్టనో, సామాజిక రంగంలో కూడా డా. భార్గవ తనదైన విశిష్ట పాత్ర పోషిస్తూ ఎందరో యువకులకు మార్గదర్శిగా ఉన్నాడు. శాస్త్రజ్ఞుల్లో శాస్త్రీయ దృష్టి కొరవడుతోందన్న నెహ్రూ అభిప్రాయాలను గౌరవించే డా. భార్గవ 1964లోనే సతీష్ ధావన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలతో కలిసి సైంటిఫిక్ టెంపర్ ను ప్రోది చేసే ఒక సొసైటీని (Society for Promotion of Scientific Temper)ను స్థాపించాడు. ఆయన కేవలం పరిశోధనా వ్యాసాలకే పరిమితం కాలేదు. విద్య, వ్యవసాయం, ఆహారం, హేతువాదం, వైద్యం సైన్సులో నీతి నియమాలు, కళలకూ సైన్సుకూ మధ్య ఉన్న సంబంధం ఇలా అనేక విషయాలను ప్రభావితం చేసే 500లకు పైగా వ్యాసాలు, పుస్తకాలను రాసిన రచయిత డా. భార్గవ. భారతదేశంలో సైన్సు పాలసీని నిలచే పలు కీలక కమిటీలలో సభ్యుడుగా ఉన్నాడు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు జాతీయ నాలెడ్జ్ కమిషన్ కు (National Knowledge Commission) ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. కమీషన్లో 80 శాతం సభ్యులు 20 శాతం ప్రజలకు ప్రాటినిధ్యం వహిస్తే తాను 80 శాతం బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్య వహిస్తానని చెప్పిన మేధావి భార్గవ, తన అభిప్రాయాలను వెల్లడించడంలో ఏనాడూ రాజీపడలేదు. చివరకు పదవినన్నా వదులుకున్నాడు కాని విలువలను ఏనాడూ వదులుకోలేదు.

శాస్త్ర వ్యతిరేక భావాలపై అలుపెరగని పోరు చేస్తున్న వ్యక్తి డా. భార్గవ, గత బిజెపి ప్రభుత్వం జ్యోతిష్యాన్ని సైన్సుగా యూనివర్శిటీలో ప్రవేశ పెట్టాలనుకున్నప్పుడు ప్రముఖ శాస్త్రజ్ఞులు జయంత్ నర్లేకర్, యష్ పాల్ వంటి వారితో కలిసి పోరాడాడు, ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలందరితో కలిసి 1981లో 'సైంటిఫిక్ టెంపర్' పైన ఒక స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. బాబాలకు, స్వాములకు వ్యతిరేకంగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన శాస్త్రవేత్త భార్గవ, 'నీ స్నేహితులెవరో చెప్పు నీ గురించి చెబుతా'ననే సామెత భార్గవ గారి విషయంలో వాస్తవం. ఆయన సహచరులు, శాస్త్రవేత్తలు చాలా మంది నోబెల్ బహుమతి గ్రహీతలు. 1987లో CCMBని ప్రారంభించినప్పుడు ఫ్రాంన్సి స్క్రిక్, కెండ్రూ, బ్లూమ్ బర్గ్ వంటి ఎందరో నోబెల్ శాస్త్రజ్ఞులు హైదరాబాద్ వచ్చి CCMBలో ఉపన్యాసాలిచ్చారు. ప్రేమానంద్ వంటి ఎందరో హేతువాదులు డాఖాధన మిత్రులు. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్సు, మానవత్వం మూర్తీభవించిన భారత శాస్త్రవేత్త డా. పి.యం. భార్గవ. .

తు యుయు

nov2విదేశాల్లోనే గొప్ప పరిశోధనలు జరుగుతాయని, నోబెల్ బహుమతి వంటి వాటిని గెలుసుకోవాలంటే విదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేయాలని యువతరం ఇటీవలి కాలంలో బాగా నమ్ముతున్నది. సమాజానికి, మానవాళికి మేలు చేసే పరిశోధనలు మన దేశాల్లో కూడా చేయవచ్చుననీ, చేయగలమనీ నిరూపించిందో చైనా శాస్త్రవేత్త. ఆమే తు యుయు Tu Youyou)  2015 నోబెల్ బహుమతిని గెలుచుకున్న తొలి చైనా మహిళగా ప్రసిద్ధి పొందింది. అమెరికాకు చెందిన విలియం కాంబెల్, జపాన్ కు చెందిన సతోషి, ఓమురాలతో కలిసి ఈ సంవత్సరం వైద్య శాస్త్రానికి ఇచ్చే నోబెల్ బహుమతిని గెలుచుకుంది. ఈమె ఒక ఔషధ శాస్త్రవేత్త. వియాత్నాంతో అమెరికా చేసిన సుదీర్ఘ యుద్ధంలో వియాత్నం వీరులకు అండగా నిలిచిన చైనా సైనికులు యుద్ధంలో శత్రువును ఓడించగలిగారు. కానీ వందలాది మంది మలేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ (Plasmodium Falciparum) అనే పరాన్న జీవితో మెదడుకు వచ్చే మలేరియా ప్రాణాంతకంగా మారింది. మలేరియాకు సాధారణంగా మందుగా వాడే క్లోరోక్విన్ ఈ జీవులపై పనిచేయకపోవడంతో చైనా కమ్యునిష్టు నాయకుడు మావో జెడాంగ్ శాస్త్రవేత్తలకు మలేరియాకు మందుకనిపెట్టమని ఒక పిలుపునిచ్చాడు. మావో పిలుపునందుకుని కాలేజీలో డిగ్రీ చదివే ఓ అమ్మాయి మలేరియా మందు కనిపెట్టినందుకు  సాహసించింది. అదే పనిపై రాత్రింబవల్లు పని చేసింది. ఎందరో శాస్త్రవేత్తలుతో కలిసి పని చేసే అవకాశం లభించింది. అదొక మిలటరీ ప్రాజెక్టు. ఐదు వందల మంది శాస్త్రవేత్తల ఒక బృందం అప్పటివరకు తెలిసిన 40 వేల రసాయనాలను జల్లెడబట్టడం ప్రారంభించింది. గ్రీమీణ ప్రజల్లో ఆయా ప్రాంతాల్లో వుండే ప్రజా విజ్ఞాణాన్ని గాలించారు. రెండు వేలకు పైగా మూలికలను, వందలాది మొక్కలను, కషాయాలను పరీక్షించారు. పెద్ద ప్రయోజనం ఏమి కనబడలేదు. శాస్త్ర పరీక్షలకు అవి నిలువలేదు.

అదే సమయంలో క్రీ. పూ. 340 నాటి ఒక వైద్య గ్రంథం తు యుయు కంట పడింది. దానిలో కింగ్ హో అనే ఔషధ ప్రస్తావన ఉంది. తు యుయు పరిశేధనలకు ఇదో మంచి మలుపు. ఆ మొక్క పేరు శాస్త్రీయంగా ఆర్టిమిసియా యన్నువా, దీనిపై చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి. ఈ మొక్క నుంచే ఆమె ఆర్టిమీసినిన్ అనే రసాయనాన్ని వెలికి తీసింది. ఈ పరిశోధనకు ఆమెకు ఐదేళ్ళు పట్టింది. 1971 అక్టోబర్ నాలుగవ తేదీన ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ ను నియంత్రించే మందును కనిపెట్టింది. ఈ ఔషధం ఎలుకలు, కోతులలో ప్రభావం చూపింది, 1980లో ఆమె తన పరిశోధనలు ప్రచురించే వరకు ఈ ఆవిష్కరణ గురించి ఎవరికీ తెలియలేదు. తెలిసి మూడున్నర దశాబ్దాలయినా కూడా ఆదరణకు నోచుకోలేదు. కాని ఆమె ప్రచారం కోసం, పురస్కారాల కోసం చూడలేదు. తన మేధస్సు ప్రజలకు తోడ్పడాలన్నదే ఆమె కోరిక.

ఎట్టకేలకు ఈ సంవత్సరం నోబెల్ బహుమతి యుయు కు రావటం సంప్రదాయ వైద్యానికి గొప్ప విజయంగా భావిస్తున్నారు. గడిచిన 10-15 సంవత్సరాల కాలంలో మలేరియాతో మరణాలు ప్రపంచవ్యాప్తంగా 60 శాతం తగ్గాయి. దీనికి ఆర్పిమాసినిన్ మందు ప్రధాన కారణి. ఇప్పటివరకు మలేరియాతో ప్రతి సంవత్సరం ఐదు లక్షల ఎనభై నాలుగు వేల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నది. యుయు కనిపెట్టిన ఆర్టిమీసినిన్ ద్వారా వ్యాధిగ్రస్తుల్లో మూడో వంతు రక్షించబడుతున్నారు. ప్రాచీన వైద్య విధానాన్ని శోధించి, ఆయా రసాయనాల పనితీరును నిర్ధారించే కృషి చైనాలో కొంతమేరకు జరుగుతున్నది. కాని మనదేశంలో ఇటువంటి పరిశోధనలు జరగటం లేదు. యుయు నోబెల్ భారతదేశంలో ఆయుర్వేదం వంటి ప్రాచీన వైద్య విజ్ఞానానికి, మరింత పరిశోధించి ఫలితాలు రాబట్టేందుకు స్ఫూర్తినిస్తుందనవచ్చు.

వైద్య రంగంలో విశిష్ట సేవలందించేవారికి నోబెల్ పురస్కారం అంతటి లస్కర్ ప్రైజు తు యుయు కు 2011లోనే వచ్చింది. ఇప్పుడు నోబెల్ బహుమతి వరించింది. ఆర్టిమీసినిన్ ఆధారిత మిశ్రమ ఔషధం (ACT-artimesinin based combination therapy)  మలేరియా నివారణకు ఇప్పటికీ మంచిమందుగా పనిచేస్తున్నది. డాక్టర్లు, శాస్త్రవేత్తలు కావాలని కలలుగనే చెకుముకి రవ్వలకు డా. తు యుయు కృషి గొప్ప స్ఫూర్తినిస్తుందనటంలో సందేహం లేదు.

ఆల్బర్ట్ ఇన్ స్టీన్

సైన్సు అంటే వెంటనే గుర్తుకొచ్చే వ్యక్తి ఐన్ స్టీన్. సైన్సులో అతిగొప్పది, చాలా సులభంగా అనిపించే సూత్రం E=mc2. ఈ సూత్రం ఆధారంగానే ప్రపంచంలో అత్యధిక మోతాదులో అణు విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఈయన వ్రాసిన రీసెర్చ్ పేపర్లు పది కూడా లేవు. అయినా అన్నీ ఆణిముత్యాలే! కొన్ని ప్రపంచంలో కొందరికే అర్థమయ్యాయని అంటుంటారు. సాపేక్ష సిద్ధాంతానికి ఆయనే నిర్మాత. క్వాంటం సిద్ధాంతంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు.

ఐన్ స్టీన్ మేధోశక్తికి ఆశ్చర్యపడి ఆయన మెదడునూ పరిశోధించేందుకు ఇప్పటికీ అమెరికాలోని న్యూజెర్సీ హాస్పిటల్లో భద్రంగా దాచిపెట్టారని చెబితే ఎవరికైనా ఆశ్చర్యమే అనిపిస్తుంది!

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలోని 'ఉల్మ్' అనే పట్టణంలో జన్మించాడు. గణితంలో ఆయన చాలా చురుకుగా ఉండేవాడు. 1900 సంవత్సరంలో స్విట్జర్లాండ్ లోని జూరిష్' విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందాడు. ఆయన మొదట ఉపాధ్యాయునిగా స్థిరపడదామనుకున్నాడు. కానీ ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. చివరకు ఏ దారీ లేక స్విస్ పెటెంట్ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు.

1903లో ఆయన మిలీవా మెరెక్ అనే యుగో స్లేవియా అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. 1905లో తాను 26 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు పిహెచ్ డి డిగ్రీ సంపాదించాడు. అదే సమయంలో ఆయన ఐదు గొప్ప పరిశోధనా వ్యాసాలను ప్రచురించాడు. అందులో ఒకటైన కాంతి విద్యుత్ ఫలితం' (Photo electric effect) ఆయనకు 1921లో భౌతిక శాస్త్రపు నోబెల్ బహుమతి లభించింది. అందులో మూడవది నాలుగవది మాత్రం సాపేక్ష సిద్ధాంతానికి సంబంధించినవి. E=mc2 అనేది సాపేక్ష సిద్ధాంతం లోనిదే! విశ్వంలో గ్రహాల క్రమాలు, కాంతి గుణాలు, బ్లాక్ హోల్స్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

ఐన్ స్టీన్ రెండవ ప్రపంచ యుద్ధం చివరిదశలో ఆటంబాంబు తయారీకి పరోక్షంగా కారణభూతుడయ్యాడు. అప్పట్లో అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ కు ఆటంబాంబు తయారుచేయమని ఉత్తరం వ్రాశాడు. అదే 'మాన్ హాట్టన్' ప్రాజెక్టు పేరుతో ఆటంబాంబు తయారీకి దారితీసింది. ఆటంబాంబు ప్రయోగించిన తర్వాత జరిగిన మానవ వినాశం పట్ల ఐన్ స్టిన్ ఎంతో పశ్చాత్తాప ప డ్డాడు. జీవితాంతం శాంతి కోసం ప్రచారం చేశాడు. “మూడవ ప్రపంచ యుద్ధమే జరిగితే, ఆ తర్వాత నాలుగవ ప్రపంచ యుద్ధం రాళ్లూ, కర్రలతో జరుగుతుంది. అంటే నాగరికత మొత్తమే మళ్లీ తిరిగి రాయాల్సి ఉంటుంది. అందుకే మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా చూడండి” అని ప్రజల్ని అభ్యర్థించాడు.

ఐన్ స్టీన్ యూదు కావటం వల్ల ఆయన ఆస్తిని హిట్లర్ ధ్వంసం చేయించాడు. ఆ సమయంలో ఐన్ స్టీన్ అమెరికాలో ఉపన్యాసాలు ఇస్తున్నాడు. జర్మనీలోని అతని మిత్రులు అక్కడే ఉండమని ఐన్ స్టీన్ కు ఉత్తరం వ్రాశారు. దానితో ఆయన మిగతా జీవితాన్ని అమెరికాలోనే గడిపాడు.

ఐన్ స్టీన్ స్వతహాగా సంగీతాభిమాని, శాంతి కాముకుడు. 99వ మూలకాన్ని ఆయన గౌరవార్థం " ఐన్ స్టీనియం' (ES) అని పిలుస్తున్నారు. ఐన్ స్టీన్ 1955, ఏప్రిల్ 18వ తేదీన అమెరికాలోని ప్రిన్స్ టన్ నగరంలో ఉండే న్యూజెర్సీ హాస్పిటల్ లో గాఢ నిద్రలోనే మరణించాడు.

డా. రఘునాథ్ ఎ. మషేల్కర్

mashelkarపది మందికి పంచితే పరిమళించేది. అందరికి ఉపయోగపడితేనే ఇనుమడించేదీ విజ్ఞానం. జ్ఞానం ఏ ఒక్కరి సొత్తు కాదు, కాకూడదన్నది మానవతావాదుల దృఢ విశ్వాసం. కాని గత శతాబ్దపు చివరి దశాబ్దాల్లో అంటే 1990 తర్వాత, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించాక, ప్రతీది వ్యాపార వస్తువైపోయింది. మరీ ముఖ్యంగా జ్ఞాన సంపదను మేథోపరమైన వాణిజ్య హక్కుల పేరుతో నడిబజారులో అమ్మకానికి పెట్టారు. ఆయా జేశాలు తరతరాలుగా సముపార్జించిన సంప్రదాయ విజ్ఞానం (Traditional Knowledge) కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ పరిస్థితుల్లో ప్రాచీన భారత విజ్ఞానాన్ని వ్యాపార విషపు కోరల నుండి కాపాడేందుకు కృషి చేసిన విజ్ఞానవేత్త. నేటి మన సమకాలిన శాస్త్రవేత్త డా. రఘునాథన్ అనంత్ మషేల్కర్ (R. A. Mashelkar). మషేల్కర్ రసాయన సాంకేతిక శాస్త్రం (Chemical Technology)లో ఇంజనీరింగ్ చేసి 1969లోనే డాక్టరేట్ చేశారు. ఒక దశాబ్ద కాలానికి పైగా (11 సంవత్సరాలు) భారత ప్రభుత్వ శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలికి (CSIR – Council of Scientific and Industrial Research) నేతృత్వం వహించారు. ఆ కాలంలోనే మషేల్కర్ మేథో సంపద హక్కులపై (Intellectual Property Rights) కృషి చేశారు. 2003-2005 ప్రాంతంలో మేథోసంపదపై పని చేసిన 50 మంది ముఖ్య వ్యక్తుల్లో ఒకరిగా వినతికెక్కారు. భారతదేశంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, కంపెనీలలో మేథో హక్కులపై అవగాహన కల్పించేందుకు ఒక జాతీయ ఉద్యమాన్ని నడిపారు మషేల్కర్.

ఆ కాలంలోనే మన దేశీయ విజ్ఞానం, వనరులపై అమెరికాలో పేటెంట్లు పొందటాన్ని సవాలు చేసి విజయం సాధించారు. పసుపు, బాస్మతి బియ్యం అందుకు గొప్ప ఉదాహరణలు. మనదేశంలో ఏ మూలకు వెళ్ళినా, మన అమ్మో, అమ్మమో లేక వాళ్ల అమ్మమ్మలో చేతికి, కాలికి గాయలైనప్పుడు వెంటనే పసుపు అద్దటం అనాదిగా వస్తున్నది. పసుపుకు గాయాన్ని మాన్పించే శక్తి ఉందని కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనకు తెలుసు. కాని పసుపులో గాయం మాన్పించే Wound healing property) లక్షణాన్ని తానే కనుగొన్నామని దరఖాస్తు చేసుకుంటే అమెరికా అమెరికా అందుకు వారికి సర్వహక్కులు కట్టబెడుతూ పేటెంట్ (USP 5, 401, 5041) మంజూరి చేసింది. అలాగే మన బాస్మతి బియ్యానికి సువాసనిచ్చే లక్షణాన్ని కలిగించినామంటే రైస్ చెట్ అనే కంపెనీకి (USP 5, 663, 484) సర్వహక్కులు కల్పిస్తూ పేటెంట్ ఇచ్చింది. అత్తసొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదేనేమో. కాని ఇక్కడ దానం చేసిన వారికి ఆ చుట్టరికం కూడా లేదు. ఆ దేశానికి పసుపు, బాస్మతి బియ్యానికి ఏ రకమైన లంబంధం లేదు. ఈ పరిస్థితుల్లో మన సంప్రదాయ విజ్ఞానాన్ని, అనాదిగా మన రైతులు అభివృద్ధి చేసిన పంటలను కాపాడుకునే అవసరం వచ్చింది. అంతర్జాతీయ న్యాయవేదికలపై సవాలు చేసి, మన దేశం తరపున దావాలు వేసి వేసి, ఋజువులు చూపి మరీ ఆ దుర్మార్గపు పేటెంట్లను అమెరికా వెనక్కు తీసుకునేలా చేశారు డా. మషేల్కర్ పారిశ్రామిక ఆస్తులతో సమానంగా సంప్రదాయ విజ్ఞానాన్ని పరిగణించాలని అంతర్జాతీయ మేథోబక్కుల సంస్థ WIPO (World Intellectual Property Organisation) లో గట్టిగా వాదించారు. సంప్రదాయ విక్షానానికి డిజిటల్ లైబ్రరీని స్థాపించడంలో (Traditional Knowledge Digital Library) మషేల్కర్ కృషి ఎంతో ఉంది. మషేల్కర్ భారతదేశపు సంప్రదాయ విజ్ఞానాన్ని అంతర్జాతీయ పేటెంట్ వర్గీకరణ వ్యవస్థలో చేర్పించారు. ఇది కేవలం మనదేశానికే కాక మూడవ ప్రపంచ దేశాలకు సైతం ఎంతగానో తోడ్పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation WHO) మేథోహక్కులపై ఏర్పరచిన కమిషన్ కు మషేల్కర్ ఉపాధ్యక్షులుగా పనిచేసి (2004-2006) ఔషధ ధరలు పేదలకు అందుబాటులో ఉండేలా మార్గనిర్దేశం చేశారు.

మషేల్కర్ ను గొప్ప శాస్త్రవేత్తగా నిలబెట్టింది ఆయన పాలిమర్లపై, వాటి స్వభావంపై చేసిన పరిశోధనలు. ఆయన పాలిమరైజేషన్ రియాక్టర్ల మోడళ్లను తయారు చేయటంలో అందెవేసిన చెయ్యి. ద్రవమూ, ఘనమూ కాని ఒక విశిష్ట స్థితిని జెల్ (Gel) అంటారు. జీవం ఉన్న ప్రాణుల్లో ఈ జెల్స్ జీవవ్యవస్థ లక్షణాలను అనుకరిస్తాయని మొదటిసారి ఋజువు చేసి చూపిన వాడు డా. మషేల్కర్. ప్రేరణకు స్పందించటం, ఎంపిక, కదలిక, గుర్తుపట్టేయటం, స్వయం నిర్మాణ వ్యవస్థ, ఎంజైము చర్యల వంటి జీవ లక్షణాలను జెల్స్ లో కనుగొన్నాడు. కృత్రిమంగా తయారుచేసిన హైడ్రోజెల్స్ (Hydrogels) జీవులను అనుకరించేందుకు మంచి ఉపకరణాలుగా ఉపయోగపడతాయని చూపారు. ప్రేరణ-స్పందన చూపించే జెల్స్ లో ఒక దశ నుండి మరో దశకు జరిగే రూపాంతరీకరణను అణువుల స్థాయిలో విశదీకరించటంలో మషేల్కర్ విజయం సాధించాడు. ఆయన చేసిన అనేక పరిశోధనలను ఆధారం చేసుకొని రసాయన సాంకేతిక విజ్ఞానం ముందడుగు వేసింది. మషేల్కర్ పరిశోధనలను గుర్తించిన ఎన్నో విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టాలనిచ్చినాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనకు దక్కాయి. అనేక అంతర్జాతీయ శాస్త్ర సమాజాలు ఆయనను తమ గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడిన మూడవ భారతీయ ఇంజనీరు మషేల్కర్. భారత జాతీయ సైన్సు అకాడమీ (INSA), అమెరికా జాతీయ సైన్సు అకాడమీ (USNAS), బ్రిటిష్ కెమికల్ ఇంజనీర్ల సంస్థలో విశిష్ట సభ్యులు (Fellow). భారత ప్రభుత్వం పద్మశ్రీ (1991), పద్మవిభూషణ్ (2000), పద్మవిభుషణ్ (2014) వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులిచ్చి సత్కరించింది. దేశం కోసం పరిశోధనలు చేసి మన్ననలు పొందిన మషేల్కర్ శాస్త్రవేత్తలుగా రాణించాలనుకునే వారికి గొప్ప స్ఫూర్తి అనటం అతిశయోక్తి కాదు.

పద్మశ్రీ డా. లాల్జీసింగ్

laljisingh

జననం: జూలై 5, 1947

మరణం: డిసెంబర్ 10, 2017

విద్యాభ్యాసం: కల్వరి, ప్రతాప్ ఘడ్ (ఉత్తర్ ప్రదేశ్), బెనారస్ హిందూ యూనివర్సిటీ

భార్య: అమరావతీ సింగ్

అవార్డులు: శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, పద్మశ్రీ, ఇంకా అనేక ఇతర బహుమతులు

స్థాపించిన సంస్థలు:

 1. డిఎన్ఏ వేలిముద్రణ, రోగనిర్ధారణ కేంద్రం-హైదరాబాద్ (Centre for DNA Finger printing Diagnostics CDFD)
 2. జన్యుచిత్రణా సంస్థ-హైదరాబాద్ (Genome Foundation)
 3. అంతరిస్తున్న జాతుల సంరక్షణా ప్రయోగశాల - హైదరాబాద్ (Laboratory for the Conservation of Endangered Species - LaCONES)

రచించిన పుస్తకాలు:

 1. You deserve, we conserve: A Biotechnological approach to wildlife.
 2. My Travails in the witness Box
 3. DNA Fingerprinting: The witness within.
 4. Scientific tell-tale of Genome and DNA
 5. ఇంకా సుమారు 80 పరిశోధక వ్యాసాలు

పి. హెచ్.డి. చేయడానికి దరఖాస్తు చేసుకున్న ఆ యువకుడ్ని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జెనిటిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎస్.పి రాయ్ చౌధురి, “ఏ అంశం మీద పరిశోధన చేయాలనుకుంటున్నావు?” అని అడిగాడు.

ఆ యువకుడు వినమ్రంగా “మీరే సూచించండి!”  అన్నాడు. “అయితే పాముల క్రోమోజోముల మీద పరిశోధన చేయి.” అని ఆదేశించాడు రాయ్ చౌధురి. "పాములా?” అని అడిగాడా యువకుడు భయం భయంగా. “అవును ఇంతవరకూ ఎవరూ ఆ అంశం మీద పరిశోధన చేయలేదు.” అన్నాడు ప్రొఫెసర్.

ఆ యువకుడు లాల్జీసింగ్. ఆయనకు పాములంటే భయం. కానీ తప్పదు. ప్రొఫెసర్ గారి ఆదేశం మరి! ఒక సామాన్య రైతు సూర్య నారాయణ్ సింగ్ కుటుంబంలో జన్మించిన లాల్జీ సింగ్ పేదరికాన్ని, కష్టాలను తట్టుకుని 8వ తరగతి వరకు జన్మస్థలం కల్వరిలోనూ, 9 నుండి 12 తరగతుల వరకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వున్న ప్రతాప్ ఘర్ లోనూ రోజు నడిచి వెళ్ళి మరీ చదువుకున్నాడు. తర్వాత బెనారస్ హిందు యూనివర్సిటీలో బి.ఎస్.సి. (1964) యం.ఎన్.సి. (జంతుశాస్త్రం) 1966 పి.హెచ్.డి ( సైటోజెనిటిక్స్) 1971లో పూర్తి చేసుకుని అదే యూనివర్సిటీలో 1970 నుండి 1972 వరకు రిసెర్చి అసోసియేట్ గా పనిచేశాడు.

లింగ నిర్ధారణలో జీవకణాల తన అధ్యయనం పాముల పరిశోధనతోనే ప్రారంభమైందని ‘విజ్ఞాన్ ప్రసార్' వారికి ఇచ్చిన ఒక ముఖాముఖిలో (Interview) చెప్పాడు లాల్జీసింగ్. మానవ లింగ నిర్ధారణ క్రోమోజోములకు భిన్నంగా పక్షులు, కొన్ని చేపలు, రొయ్యలు, ప్రాకెడు జంతువుల్లో Z-W క్రోమోజోములతో నిర్ధారించ బడుతుంది. ZZ క్రోమోజోములు మగతనాన్ని, Z-W ఆడతనాన్ని సూచిస్తాయి. ఆడపాముల్లో వుండే W క్రోమోజోముల్లో డి.ఎన్.ఏ లో వుండే చిన్న పరిచారిక ఉపవిభాగం మగపాముల్లో ఉండదని ఆయన ప్రతిపాదన (Hypothesis) చేశాడు. కానీ దీన్ని నిర్ధారించడానికి తగిన ప్రయోగశాల సదుపాయాలు ఇండియాలో లేవు. విదేశాల్లో వున్న ఇతర శాస్త్రజ్ఞుల సాయం తీసుకుంటానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళెవరూ అతడి ప్రతిపాదనలను విశ్వసించలేదు. చివరకు 1974 లో ఎడిన్ బరో యూనివర్సిటీ (UK) అతడి ప్రతిపాదననుసరించి ప్రయోగాలకు ఉపకారవేతనం మంజూరు చేసింది. దానితో ఆయన భారతదేశానికి చెందిన కట్లపాము జాతి (Branded Krait) మీద పరిశోధనలు చేసి చిన్న పరిచారిక డి.ఎన్.ఏ జన్యు పదార్థాన్ని విడదీయగలిగాడు. ఈ ప్రయోగమే డి.ఎన్.ఏ వేలిముద్రణ సాంకేతికతకు దారితీసింది.

అలెక్ జాఫ్రీ (లైసెస్టర్ విశ్వవిద్యాలయం యునైటెడ్ కింగ్డమ్) 1985 లో మానవ జన్యు చిత్రాన్ని ఉపయోగించి డి.ఎన్.ఏ వేలిముద్రణ చేయగలిగాడు. కానీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. లాల్టీసింగ్ ప్రతిభను గుర్తించిన Center for Cellular and Molecular Biology-(CCMB) సంచాలకులు డా. పుష్పమిత్ర భార్గవ ఆహ్వానంపై 1987 లో భారతదేశం తిరిగి వచ్చిన లాల్జీసింగ్ సిసియంబిలో సీనియర్ సైంటిస్టుగా చేరి హైద్రాబాదులోనే డి.ఎన్.ఏ. వేలిముద్రణను రూపొందించాడు.

1988 లో ఈ సాంకేతికతను లైంగిక వారసత్వం (Paternity) నిర్ధారించడానికి మొదటిసారి ఒక కేసులో సాక్షిగా కేరళలోని తలసరి సబ్ కోర్టు లాల్జీసింగ్ ని ఆహ్వానించింది. ఒక మహిళా ఇన్సురెన్స్ ఏజెంటుకి ఒక వ్యాపారస్థునికి జన్మించిన మగ బిడ్డను వారసునిగా అంగీకరించడానికి వ్యాపారసుడు నిరాకరించినప్పుడు తలెత్తిన కోర్టు వివాదంలో లాల్జీసింగ్ సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది.

ఆయన వివరణ పూర్తిగా శాస్త్రీయ పదాలతో నిండి వున్నదనీ, దాన్ని తేలిక మాటల్లో చెప్పమని డిఫెన్సు లాయర్ కోరినప్పుడు ఆ కోర్టులో అందరికి అర్థం అయ్యేలా వివరించాడు లాల్జీసింగ్. కోర్టు ఆ పిల్లవాడి తండ్రి వ్యాపారస్థుడేనని నిర్ణయించింది. తర్వాతి కాలంలో లాల్జీసింగ్ సి.సి.యం.బి. కి జూలై 1998లో సంచాలకునిగా నియుక్తులై జూలై 2009 వరకు పనిచేశాడు.

భారత ప్రభుత్వంలోని జీవసాంకేతిక విభాగం (Department of Biotechnology) ఆయన సూచనల మేరకు డి.ఎన్.ఏ వేలిముద్రణ, రోగనిర్ధారణ కేంద్రం (CDFD) హైద్రాబాద్ లో ప్రారంభించడానికి అనుమతినిచ్చింది. మానవునిలో వుండే 46 క్రోమోజోముల్లో 23 క్రోమోజోములు తండ్రి నుండి (వీర్యంలో) లభిస్తాయి. ఇవి విభజన చెంది పిండంగా మారేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో క్రోమోజోము యూనిట్లు! తల్లిదండ్రుల యూనిట్లను పోలివుంటాయి. అయితే ఈ అమరిక ప్రతి వ్యక్తికి భిన్నంగా వుంటుంది. అంటే ఒక వ్యక్తి డి.ఎన్.ఏ అమరిక మరో వ్యక్తి అమరికను ఎప్పటికీ పోలి వుండదు. కాని, ఈ అమరికలో కొన్ని ప్రాంతాల్లో వున్న తల్లిదండ్రుల యూనిట్ల అమరికల్లోని సాదృశ్యాలను బట్టి వారసత్వాన్ని నిర్ణయిస్తారు.

అంతరించిపోతున్న వన్యజాతులను సంరక్షించడానికి కృత్రిమంగా అంతరిస్తున్న జాతుల సంరక్షణా ప్రయోగశాల (La CONE) ఆయన 1998 లో తలపెట్టగా భారత ప్రభుత్వం దానికి 16 సెప్టెంబరు 2001 లో హైద్రాబాద్ లో శంఖుస్థాపన చేసింది. దాని నిర్మాణం పూర్తి అయి 2007 లో ఫిబ్రవరి రెండవ తేదిన అప్పటి రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఇందులోని, జాతీయ వన్య మృగ విభాగం రక్త ఈ నమూనాలోని డి.ఎన్.ఏ ను బట్టి వన్యమృగాలను గుర్తిస్తుంది. ఆ విధంగా వన్యమృగాలపట్ల జరిగే ఆ నేరాలకు మంగళం పాడవచ్చు. అంతేగాకుండా సహాయక పునరుత్పత్తి అ సాంకేతికతతో కృత్రిమంగా వీర్యదానం చేయటం ద్వారా 14 మార్చి 2006లో మొదటిసారి మచ్చల ఆ జింక నొక దాన్ని పునరుత్పత్తి చేయగలిగారు. అలాగే 2007 లో కృష్ణమృగాన్ని (black buck) ని సృష్టించారు.

ఆయన స్థాపించిన జన్యుచిత్రణ సంస్థ (Genome Foundation) జన్యులోపాలను సవరించగలిగిన సాంకేతికతను వృద్ధి చేసింది. ఆఫ్రికాలోని కొన్ని తెగలు 60, 70 వేల సంవత్సరాల క్రితం అండమాన్ నికోబార్ దీవులకు తరలి వచ్చారని డి.ఎన్.ఏ విశ్లేషణ ద్వారా ఆయన అధ్వర్యంలో సైంటిస్టుల బృందం నిర్ధారించింది. ఈ విధంగా మానవ పరిణామ క్రమాన్ని వారు వలసపోయిన మార్గాలను అన్వేషించగలిగారు.

2011 నుండి 2014 వరకు తను చదివిన బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఆయన ఉపకులపతిగా నామమాత్రపు జీతం 1 రూపాయి తీసుకుని పనిచేశారు. బెనారస్ వచ్చి అక్కడి నుండి ఢిల్లీ వెళ్ళడానికి బయలుదేరి విమానాశ్రయంలో గుండెపోటు వచ్చి యూనివర్సిటీ హాస్పిటల్ కి తరలించగా ఆయన మరణించారు.

ఈ రోజుల్లో చదువుకున్న వాళ్లకూ, చదువులేని సామాన్యులకు కూడా 'డియన్ఏ ఫింగర్ ప్రింటింగ్’ (DNA Finger printing) లేదా 'డియన్ఏ వేలిముద్రలు’ ఎంతో కొంత తెలుసు. అవి దొంగల్ని పట్టుకునేవని. ప్రతి మనిషికీ వారి వారి వేలిముద్రలు ప్రత్యేకంగా ఉన్నట్లే వారిలో ఉండే జన్యుపదార్థమైన డియన్ఏ కూడా విశిష్టత కలిగి ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ డియన్ఏ కారణంగానే మన వేలిముద్రల్లో వైవిధ్యం వస్తుంది. ఇది సైన్సు. దీన్ని ఉపయోగించి నేర నిర్ధారణ చేయడానికి, పిల్లల తల్లిదండ్రులెవరో ప్రశ్నార్థకమైతే గుర్తించడానికి ఒక వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేసి ఖ్యాతిగడించిన గొప్ప శాస్త్రవేత్త డా. లాల్జీసింగ్ (Lalji Singh). నేరం జరిగిన స్థలంలో వెంట్రుక వాసి ఆధారం దొరికితే చాలు, దాని ద్వారా నేరం చేసిన వ్యక్తి డియన్ఏ వేలిముద్రలను విశ్లేషించి నిందితుణ్ణి పట్టేయవచ్చు. 1991 లోనే లాల్జీసింగ్ ఈ టెక్నాలజీని ఉపయోగించి న్యాయస్థానంలో ఋజువులతో సహా ప్రశ్నార్థకమైన ఒక వ్యక్తి తల్లిదండ్రులెవరో నిరూపించాడు. అప్పట్నించి వందలాది క్రిమినల్, సివిల్ కేసుల్లో డియన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఖచ్చితమైన ఋజువుగా ఉపయోగపడుతున్నది. మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల్ని పట్టించడం, ప్రఖ్యాతిగాంచిన నైనాసాహ్ని తందూర్ హత్యకేసును ఛేదించడం వంటి ఎన్నో సంచలనాత్మక నేరాలకు డియన్ఏ ఫింగర్ ప్రింటింగ్ తిరుగులేని సాక్ష్యాలను అందించింది. అందుకే లాల్జీసింగ్ ను భారతదేశంలో డియన్ఏ వేలిముద్రల టెక్నాలజీకి పితామహుడిగా పేర్కొంటారు.

ఎక్కడో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మారుమూల ‘కల్వారి' గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రోజూ ఆరేడు కిలోమీటర్లు నడిచి ప్రతాప్ గంజ్ ప్రభుత్వ బడిలో చదువుకున్న లాల్జీసింగ్ మొదట్నుంచీ చురుకైన విద్యార్థి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి

1964లో బీయస్సీ డిగ్రీ చేశాడు. యూనివర్సిటీ లోనే అత్యధిక మార్కులతో 1966లో యంయస్సీ జంతుశాస్త్రంలో ఉత్తీర్ణుడై బనారస్ హిందూ గోల్డ్ మెడల్ సాధించాడు. అదే యూనివర్సిటీ నుండి 1971లో డాక్టరేట్ పూర్తిచేశాడు.

ఒక పుష్కరకాలం పాటు కామన్ వెల్త్ షిప్ పై ఎడింబరో విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేసి 1987లో భారతదేశం తిరిగి వచ్చి సి.సి.ఎం.బి లో సీనియర్ శాస్త్రవేత్తగా చేరాడు. పాముల్లో క్రోమోజోముల పరిణామాన్ని అధ్యయనం చేసినాడు. మనదేశపు పాముల్లో ఒకటైన కట్లపాము (Banded Krait)లో లింగ నిర్ధారణ చేసే క్రోమోజోము (Sexchromosome) పరిణామాన్ని అధ్యయనం చేసే క్రమంలో లాల్జీసింగ్, అతని సహచరులు పునశ్చరణగా మళ్లీ మళ్లీ వచ్చే కొన్ని డిఎన్ఏ వరుసక్రమాలను (repeated DNA sequences) కనుగొన్నారు. ఇవి కేవలం పాముల్లోనే కాకుండా వెన్నుముక కల్గిన అన్ని జీవుల్లోనూ ఉండటాన్ని గమనించారు. వీటికి వారు 1980లో 'కట్లపాము చిరువరుసలు' (Banded Krait Minor - BKM)గా పేరు. పెట్టారు. దీన్ని ఆధారం చేసుకునే లాల్జీసింగ్ హైదరాబాద్ లోని కణాణు జీవశాస్త్ర కేంద్రం (Centre

for Cellular and Molecular Biology)లో డియన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీకి పునాదులు వేశారు. సిసియుంబి ని నడిపించిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు పి.యం. భార్గవ, డి. బాలసుబ్రమణియన్ ల తర్వాత లాల్జీ సింగ్ దానికి డైరెక్టర్ అయ్యారు. లాల్జీసింగ్ కనిపెట్టి అభివృద్ధి చేసిన డియన్ ఏ వేలిముద్రల టెక్నాలజీ ప్రాముఖ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1995లో CDFD (Centre for DNA Finger printing and Diagnostics) అనే వ్యాధి నిర్ధారణ, నేర నిర్ధారణకు తోడ్పడే విజ్ఞాన కేంద్రాన్ని లాల్జీసింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. ఇప్పుడా సంస్థ పలురంగాల్లో విశిష్ట సేవలందిస్తూ, పరిశోధనలు చేస్తోంది.

డియన్ఏ వేలిముద్రలనగానే లాల్జీసింగ్ పేరు గుర్తొచ్చే మాట నిజమే అయినా ఆయన పరిశోధనలు, ఆలోచనలు దానికే పరిమితం కాలేదు. జంతువుల పట్ల ప్రేమనో లేక జంతుశాస్త్ర అభిమానమోగాని మనదేశంలో నానాటికి క్షీణిస్తున్న వన్యజంతువుల జనాభాను, వాటిని సంరక్షించవలసిన అవసరాన్ని గొప్పగా గుర్తించిన శాస్త్రవేత్త లాల్జీసింగ్. 1998 లో సి.సి.ఎం.బి సంచాలకులుగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేక ప్రయోగశాలకు రూపకల్పన చేశాడు. దాని పేరే LaCONES (Laboratory for the Conservation of Endangered Species) లేదా అంతరించిపోతున్న జాతుల సంరక్షణా ప్రయోగశాల. అప్పటి రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం ఈ ప్రయోగశాలను ప్రారంభించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వన్యప్రాణి ఓ వనరులను (Wild life resources) ఇక్కడ సంరక్షిస్తారు. వన్య జంతువులను చంపిన నేరాల్లో చంపబడింది ఏ జంతువులో నిర్ధారించేందుకు డిఎన్ఏ ఆధారిత పరీక్షలు చేసి నిజాన్ని నిగ్గు తేలుస్తారు. మచ్చల జింక (పొడల జింక) బిడ్డ కృత్రిమ ప్రత్యుత్పత్తి పద్ధతులు 2006 మార్చి 14న జన్మించడంతో వన్య జీవుల జనాభా అభివృద్ధిలో ఈ ప్రయోగశాల విజయం సాధించింది. అందుకే 2013 ప్రపంచ హెరిటేజ్ దినం నాడు LaCONES ప్రాంగణాన్ని హెరిటేజ్ మాన్యుమెంట్ (Heritage Monument)గా గుర్తించారు.

మానవ పరిణామాన్ని కనిపెట్టడంలో, మానవుడు ఎక్కడ ఆవిర్భవించి, ఎక్కణ్ణించి ఎక్కడకు వలస వెళ్లాడన్న సమాచారాన్ని రాబట్టడంలో కూడా లాల్జీసింగ్ పరిశోధనలు గొప్ప మేలు చేశాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో వున్న ఆదిమ తెగలు 60 వేల సం. క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చినారని డిఎన్ఏ పరీక్షల సహాయంతో కనుగొనటంలో లాల్జీసింగ్ పాత్ర ఎనలేనిది. జన్యు లోపాలను కనుగొనటం, తద్వారా వాటిని నివారించడం 1998కి ముందు లేవు. లాల్జీసింగ్, ఆయన సహచరుల పరిశోధనల విజ్ఞాన ప్రయోగశాలలు

నేడు రూపుదిద్దుకున్నాయంటే అతిశయోక్తి కాదు. 2004లో లాల్జీసింగ్ లాభాపేక్షలేని 'జినోమ్ ఫౌండేషన్' (Genome Foundation)ను స్థాపించి పేద ప్రజల్లో జన్యులోపాల పట్ల పల్లె ప్రాంతాల్లో అవగాహన, సేవలను అందిస్తున్నారు. తాను చదువుకున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికే 25వ వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. మూడేళ్లు వైస్ ఛాన్సలర్ గా కేవలం ఒక రూపాయి జీతాన్నే తీసుకున్నాడంటే లాల్జీసింగ్ నిజాయితీని, నిస్వార్థ సేవను గమనించండి. ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 'పద్మశ్రీ’ బిరుదునిచ్చి సత్కరించింది. ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక సొసైటీలలో గౌరవ సభ్యులు, మరెన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు గౌరవ సలహాదారు. ప్రతిష్టాత్మక జగదీశ్ చంద్రబోస్, శాంతిస్వరూప్ భట్నాగర్ రీసెర్చి ఫెలో షిప్ లు ఆయనను వరించాయి. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యులు. జంతు జన్యువనరుల జాతీయ బ్యూరో, పౌల్ట్రీ, ఫిషరీస్ జన్యువనరుల జాతీయ బ్యూరోలకు అధ్యక్షులుగా పనిచేశారు. హిమాలయమంత ఖ్యాతి గడించినా పొంగిపోని నిరాడంబరత, ప్రజల కోసం పరిశోధనలు చేయాలనే నిరంతర ఆలోచన కాబోయే యువశాస్త్రవేత్తలెందరికో ఆదర్శంగా నిలుస్తాడు లాల్జీసింగ్,

అబ్దుల్ కలాం

ప్రియమైన బాలలూ!

abdulkalamఒక మహోన్నత వ్యక్తి భారత రాష్ట్రపతిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించాడు. దేశ విదేశాలలో ఎనిమిది గౌరవ డాక్టరేట్లు పొందాడు. అనేక స్వదేశీ ఉపగ్రహాల రూపకల్పనకు సారధ్యం వహించి ‘ది మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా'గా కీర్తి సంపాదించాడు. 'భారతరత్న' అవార్డును అందుకున్నాడు. అయినా విద్యార్థులు కనిపిస్తే చాలు, ఒక గురువుగా మారిపోయి పాఠాలు చెప్పేవాడు. ఆయన ఎవరో తెలుసా? ఇంకెవరు? మన మాజీ రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం. ఆయన జూలై 27న తను ఎంతగానో ప్రేమించే విద్యార్థులకు 'భూమి' గూర్చిన పాఠం చెబుతూనే కన్నుమూశారు. ఆదర్శప్రాయమైన ఆయన జీవితాన్ని గూర్చి తెలుసుకుందాం. డా. కలాం 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు జైనులాబుద్దీన్. తల్లి ఆషియమ్మ. ఆయన కుటుంబం ఎంత బీదరికంలో ఉన్నదంటే వాళ్ల అమ్మ ఆ కుటుంబంలోని అందరికీ తలా రెండు రొట్టెలు చేసేదట. కుటుంబంలో చిన్నపిల్లలు ఎవరైనా మరో రెండు రొట్టెలు వేయమని ఏడిస్తే, ఆమె వారికి పెట్టి తాను పస్తు పడుకొనేదట. తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి కలాం ఉదయాన్నే ఇంటింటికీ పత్రికలు పంచేవారట. ఆయన స్కూలు చదువు అయిపోయిన తర్వాత తిరుచిరాపల్లిలో ఫిజిక్స్ లో డిగ్రీ సంపాదించారు. తర్వాత 'మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' నుండి 'ఏరో స్పేస్ ఇంజనీరింగ్' డిగ్రీని 1960లో సంపాదించారు. ఆ కాలేజీలో ఒక ప్రాజెక్టు పై ఆయన పనిచేస్తున్నప్పుడు, కాలేజీ డీన్ ఆయనను పిలిపించి "నీవు చాలా నెమ్మదిగా పనిచేస్తున్నావు. ఈ ప్రాజెక్టును నీవు మూడు రోజుల్లో సరి చేయకపోతే నీ స్కాలర్ షిప్ ను రద్దు చేస్తాను.” అన్నారు. కలాం మూడు రోజులు కష్టపడి ప్రాజెక్టును పూర్తి చేసి డీన్ కు చూపించారు. ఆయన మెచ్చుకొని “నీవు జీవితంలో కష్టమైన లక్ష్యాలు చేరుకోవడానికి అలవాటు పడాలనే నేను నీకు ఈ క్లిష్టమైన పనికి మూడురోజుల గడువు విధించాను. నీవు ప్రశాంతంగా ఆలోచించి, తీవ్రంగా శ్రమపడి ఇలానే జీవితంలో విజయాలు సాధిస్తావు.” అని ఆశీర్వదించాడు.

కలాం ఫైటర్ విమానాల పైలట్ అవుదామనుకొన్నాడు గాని కొద్దిలో ఆ అవకాశం తప్పిపోయింది. అందువలన ఆయన 'డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్' (డి.ఆర్.డి.ఓ)లో చేరాడు. భారత సైన్యానికి ఒక చిన్న హెలికాప్టర్ ను రూపకల్పన చేయడంతో ఆయన జీవితం ప్రారంభించారు. తర్వాత 'ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్’ (ఇస్రో)కి బదిలీ చేయబడ్డాడు. అక్కడ ఆయన సారధ్యంలో భారత దేశపు మొట్టమొదటి ఉపగ్రహ వాహక నౌక (ఎస్.ఎల్.వి-III) నిర్మించబడి, 1980 జూలైలో 'రోహిణి' అనే ఉపగ్రహానికి వాహక నౌకగా విజయవంతంగా ప్రయోగించబడింది. 1998లో భారతదేశం జరిపిన ప్రోక్రాన్-2 అణుపరీక్షలో కలాం కీలకమైన సాంకేతిక పాత్ర పోషించాడు. 2002 నుండి 2007 వరకు ఆయన భారత రాష్ట్రపతి పదవిని అలంకరించి, ఆ పదవికి వన్నె తెచ్చి ‘ప్రజల రాష్ట్రపతి’ అని ప్రజలచే ఆప్యాయంగా పిలవబడ్డారు.

రక్షణ రంగం, అణుబాంబుల రూపకల్పనలోనే కాదు, పేద ప్రజల కోసం ఆయన తపన అనేక నూతన పరికరాల రూపకల్పనకు దారితీసింది. ఒకప్పుడు గుండెజబ్బు రోగులకు అమర్చే స్టెంట్లు చాలా ఖరీదుగా ఉండి పేదలకు అందుబాటులో ఉండేవి కాదు. దీని పట్ల ఆయన ఆవేదన చెంది, హైదరాబాద్ లోని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డా. సోమరాజుతో కలిసి అతి తక్కువ ధరలో 'కరోనరీ స్టెంట్'ను రూపొందించారు. దీన్ని 'కలాం-రాజు స్టెంట్' అని పిలుస్తున్నారు. దీని వలన వేలాది మంది పేదల గుండెజబ్బులకు చాలా చికిత్స అంది. వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆ 2012లో కలాం, సోమరాజులిద్దరూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం 'కలాం-రాజు టాబ్లెట్' అనే టాబ్లెట్ పీసీని (చిన్న కంప్యూటర్) రూపొందించారు. ఇలా పేదల కోసం కలాం చివరి వరకూ తపించి శ్రమించారు.

శాస్త్ర విజ్ఞానంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన కలాం మంచి సంగీత కళా నిధి కూడా. ఆయన అద్భుతంగా వీణ వాయించేవారు.

కలాం గొప్ప రచయిత కూడ. ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, 'ఇండియా-2020’, 'ఎ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం’, 'మై జర్నీ అండ్ ఇగ్మైటెడ్ మైండ్స్', 'అన్లీషింగ్ ది పవర్ వితిన్ ఇండియా' అనే పుస్తకాలు రచించి ప్రజలకు స్పూర్తినందించారు.

అన్నింటికీ మించి ఆయన పిల్లలను, విద్యార్థులను అమితంగా ప్రేమించారు. వాళ్లకొక గొప్పదైన, స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించారు. అదేమిటంటే, 'కలలు కనండి - ఆ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడండి’ అని. అలా భారతదేశ భావిపౌరులలో దేశభవితవ్యంపై నమ్మకాన్ని, కష్టపడే మనస్తత్వాన్ని తన స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాల ద్వారా ద్విగుణీకృతం చేశారు. ఆయన స్ఫూర్తితో లక్షలాది విద్యార్థులు అనేక దేశ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఉన్నతమైన ఆశయాలతో ముందుకు ఉరుకుతున్నారు.

ఉపాధ్యాయులకు కూడా ఆయన గొప్ప మార్గనిర్దేశనం చేశారు. 'మీరు విద్యార్థులలో కేవలం జ్ఞానాన్ని పెంచి, వారిలో నైతిక విలువలను పెంచకపోతే, మీరు వారి మనస్సుకు మాత్రమే శిక్షణ ఇచ్చిన వారౌతారు. అందువలన మీరు విద్యార్థులకు నైతిక విలువలు నేర్పండి' అని నిరంతరం కోరేవారు.

విద్యార్థుల తల్లిదండ్రులకు కూడ ఆయన గొప్ప సందేశమిచ్చారు. 'దేశంలో అవినీతి పోవాలంటే ముందుగా మీరు మీ ఇంటిలో అవినీతి పనులు చేయడం మానేయండి. మీ పిల్లలకు లంచాలివ్వడం మానండి. వారికి బహుమతులు సంపాదించడం నేర్పండి. వారి వలన దేశంలో మంచి మార్పు వస్తుంది' అని ఆయన ఉద్బోరించేవారు.

కలాం చాలా నిరాడంబరుడు. ఈనాటి మన రాజకీయ నాయకులులాగా కాకుండా ఆయన ముఖ్య అతిథిగా ఉన్న సభలకు కూడా సమయానికి ముందే వచ్చేవాడు. ఒకసారి ఒక సభకు ముందే వచ్చి, ప్రజలు కూర్చునే కుర్చీలలో కూర్చొని నిర్వాహకులతో మాట్లాడుతున్నారు. ఆయన దృష్టి స్టేజీపై ఉన్న ఒక ఖరీదైన కుర్చీ పై పడింది. దానిని గూర్చి విచారించగా, అది ఆయన కోసం ప్రత్యేకంగా తెప్పించబడిందని నిర్వాహకులు తెలిపారు. వెంటనే ఆయన నిర్వాహకులతో, ఆ కుర్చీ తీసి వేయించమనీ, మిగిలిన వారికిలాగే తనకూ మామూలు కుర్చీ వేయించమని కోరి, సాదా కుర్చీ వేయించుకున్నారు. అదీ ఆయన నిరాడంబరత!

భవిష్యత్ దర్శనాన్ని గూర్చిన ఆయన ఉద్భోదం విద్యార్థులందరికీ ఉత్తేజకరం. ఆయన ఏమన్నారంటే ‘కల అంటే నీకు నిద్రలో వచ్చేది కాదు, కల అనేది నీకు నిద్ర రాకుండా చేసేది'. ఈ ఉత్తేజకరమైన ఉద్బోధ చేసిన ఆయనను మనం మనసారా స్మరించుకుందాం. భారతదేశాన్ని ఆదర్శదేశంగా చేయడానికి మనం నిద్రలేని రాత్రులు గడుపుదాం. అలాంటి మహనీయుని చేతులు మీదుగా 'సైన్సు ప్రచార సంస్థ’గా జనవిజ్ఞానవేదిక అధ్యక్ష, కార్యదర్శులు 2006 ఫిబ్రవరి 28న జ్ఞాపికను, రాష్ట్రపతి భవన్ లో అందుకోవడాన్ని గర్వంగా స్మరించుకొని, సైన్సు ప్రచారాన్ని మున్ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి

డా. మాధవ్ గాడ్గిల్

apr001.jpgమనం నివసిస్తున్న ఈ నేల, ఈ భూమి ఎంతో విలక్షణమైంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మనతో పాటు మరెన్నో రకాల జీవజాతులు నివసించగలవు. భూమ్మీద నివసించే జీవజాతులు లెక్కకు మిక్కిలి. ఒకదానికి మరొక దానితో పోలికలుండవు. ఆ మాటకొస్తే ఏ జీవైనా, లేదా మనుషులైనా నూటికి నూరుపాళ్లు బింబ ప్రతిబింబాల్లో ఒకేలా ఉండరు. దీన్నే వైవిధ్యం అని, జీవ వైవిధ్యం అని పిలుస్తాం. ప్రపంచం నలుమూలలా ఇలా జీవసంపద విలసిల్లుతున్న ప్రదేశాలు 10, 12 ఉంటే మనదేశంలో అలాంటి జీవవైవిధ్య కేంద్రాలు ప్రధానంగా రెండు ఉన్నాయి. అవి ఒకటి హిమాలయాలు, రెండు పశ్చిమకనుమలు. పశ్చిమ కనుమల్లో నెలకొన్న జీవవైవిధ్యం, ఆ జీవ జాతులు అంతరించకుండా ఉండటానికి కృషి చేసిన జీవశాస్త్రవేత్త డా.మాధవ్ గాడ్గిల్. పరిశోధనలు చేయటం ఒక ఎత్తైతే, వాటిని ప్రజానుకూలంగా చేయటం, ప్రజలకు మేలు చేకూర్చటం కేవలం నూటికో కోటికో ఒకరికి మాత్రమే సాధ్యం. అలాంటి ప్రజాశాస్త్రవేత్తల్లో మేటి ప్రముఖ జీవ ఆవర పరిశోధకులు డా.మాధవ్ గాడ్గిల్.

భూగోళ వాతావరణంలో వస్తున్న మార్పులు, జీవ వనరులను సైతం వ్యాపారసరుకుగా మార్చటం వలన అరుదైన జీవజాతులు అంతరించే పరిస్థితులొచ్చాయి. ఏ దేశానికాదేశం తమ జంతు, వన సంపదను కాపాడుకునే పనిలో పడ్డాయి. భారతదేశంలో ముఖ్యంగా మన పశ్చిమ కనుమల్లో నెలకొన్న జీవసంపద పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం మాధవ్ గాడ్జిల్ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ జీవ వైవిధ్య పరిరక్షణకు అడవులను రిజర్వు చేయాలనీ, వాటిని సంరక్షించుకోవాలని సూచిస్తూ రిపోర్టును 2012లో ఇచ్చింది. గత సంచికలో మీరు చదివిన ప్రొ. విజయన్ కూడా ఈ కమిటీలో సభ్యుడుగా ఉన్నాడు. గాడ్జిల్ కమిటీ చేసిన సూచనలు చాలా శాస్త్రీయంగా ఉన్నాయని “పశ్చిమ కనుమలు ప్రమాదంలో ఉన్న గొప్ప జీవవనరులు నిధి'' అని పేర్కొన్నారు. దీనిని కాపాడుకోవటం, ఇక్కడ ఉన్న జీవజాతులను పరిరక్షించటం తక్షణ అవసరం” అని ఆ రిపోర్టును అధ్యయనం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త కస్తూరి రంగన్ పేర్కొన్నారు.

apr002.jpgమాధల్ గాడ్గిల్ కేవలం పరిశోధనలు చేయటం, విషయాలు కనిపెట్టడం మాత్రమే చేయలేదు. తాను చేసే పనిని ప్రజల వద్దకు చేర్చాడు. చేర్చటం కాదు వారినే ఆ పనిలో భాగస్వాముల్ని చేశాడు. ఉపాధ్యాయుల్ని, పరిశోధకుల్ని, విధాన నిర్ణేతల్ని, రైతుల్ని, పౌరుల్ని ఇలా ప్రతి ఒక్కర్నీ జీవవైవిధ్య పరిరక్షణ మహాయజ్ఞంలోకి తీసుకొచ్చాడు. పర్యావరణ పరిరక్షణకు, దేశవ్యాప్తంగా ఉన్న జీవవనరులను నమోదు చేసేందుకు వినూత్న పద్ధతి చేపట్టాడు. అదే "ప్రజా జీవవైవిధ్య రిజిస్టర్ల” (Peoples Biodiversity Register) తయారీ. ప్రజల్లో పర్యావరణ చైతన్యానికి, జీవ వైవిధ్య ప్రాధాన్యతపై అవగాహన కోసం పాఠశాల సిలబసను మార్పు చేసే పనిని చేపట్టి ఆ కమిటీకి చైర్మన్ గా పనిచేశారు. భారతదేశపు జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు భారత ప్రభుత్వం “జీవవైవిధ్య చట్టం 2002” తీసుకురావటంలో డా. గాడ్గిల్ విశిష్ట కృషిచేశాడు. మనదేశంలో మొట్టమొదటి “బయోస్పియర్ రిజర్వు” (Biosphere Reserve)ను ఏర్పర్చటంలో గాడ్గిల్ కృషి ప్రశంశనీయం. డా.మాధవ్ గాడ్గిల్ మాటల మనిషి కాదు. నిత్యకృషీవలుడు. పూనే విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రంలో పట్టభద్రుడైనది మొదలు హార్వర్డ్ యూనివర్శిటీ నుండి గణితంలో ఆవరణశాస్త్రం పై డాక్టరేట్ చేసే వరకు, అటు తర్వాత బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో 'ఆవరణ శాస్త్ర విజ్ఞాన కేంద్రాన్ని (Centre for Ecological Science)ను స్థాపించేవరకు నిరంతర కృషి చేశాడు. ఆయన ఖ్యాతి దేశదేశాల్లో విస్తరించింది. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో విశిష్ట ప్రొఫెసర్ గా సేవలందించాడు. ప్రధానమంత్రికి సైన్సు పై సలహాలిచ్చే కమిటీ సభ్యులుగా 1986-90 మధ్య పనిచేశారు.

apr003.jpg1942లో మహారాష్ట్రలోని పూనేలో జన్మించిన గాడ్గిల్ యువశాస్త్రవేత్తగా ప్రతిష్టాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును గెల్చుకున్నారు. విక్రమ్ సారాభాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అవార్డులతో పాటు హార్వర్డు యూనివర్శిటీ నూరేళ్ల మెడల్ (Centennial medal) 2002లో ఇచ్చి సత్కరించింది. 2003లో హాలో పర్యావరణ ప్రైజ్ గెల్చుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత సత్కారాలనిచ్చి గాడ్గిల్ ను గౌరవించింది. పర్యావరణ పరిరక్షణలో విజయం సాధించినందుకు నిన్నగాక మొన్న 2015లో ట్రైలర్ ప్రైజు గెలుచుకున్నారు. ఈ ప్రైజును మరో గొప్ప పర్యావరణ శాస్త్రవేత్త జేన్లుబిషెంకో (Jane Lubchenco)తో కలిసి పంచుకున్నారు. డా. గాడ్గిల్ మన దేశపు, ప్రపంచ సైన్సు సంస్థలెన్నింటిలోనో గౌరవ సభ్యులుగా ఎంపికైనారు. మూడవ ప్రపంచ దేశాల సైన్సు సంస్థ, యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో, బ్రిటిష్ అమెరికా ఎకొ లాజికల్ సొసైటీల్లో గౌరవ సభ్యులుగా కొనసాగుతున్నారు. అన్నింటికీ మించి సైన్సు ప్రజల కోసమని, ప్రజలే సైన్సుకు సృష్టికర్తలని నమ్మినవాడు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే 'జీవన వనరుల పరిరక్షణ'ను సుసాధ్యం చేయగలమని చెప్పి, చేసి చూపిస్తున్న గొప్ప ప్రజాశాస్త్రవేత్త డా.మాధల్ గాడ్గిల్.

డా. బారీ మార్షల్

jun001.jpg“పదుగురాడు మాట పాడియై ధరజెల్లు” అన్నది సైన్సులో కూడా చెల్లుబాటు అవుతుంది. ఆనాటి వరకూ అందరికీ ఆమోదయోగ్యమైన సిద్దాంతాన్ని సవాలు చేసి కొత్తబాట’ వేయడం సామాన్య విషయమేమీ కాదు. అది సామాజిక అంశమైనా, సైన్సు పరిశోధనలోనైనా. ప్రఖ్యాత శాస్త్రవేత్త బారీ మార్షల్ విషయంలో కూడా ఇదే జరిగింది. మన చిన్న పేగు గోడలపై ఏర్పడే పుండ్లు లేదా అల్సర్లు జీర్ణాశయంలో నిల్వ అయ్యే ఆల వలన ఏర్పడతాయని గట్టి నమ్మకం. వీటిని పెప్టిక్ అల్సర్లు లేదా పేగు గోడలపై వచ్చే పుండ్లు అని చెప్పుకోవచ్చు. ఇతమిద్దంగా ఈ పుండ్లకు ఇదీ కారణం అని చెప్పలేని పరిస్థితి. అందుకే ఈ అల్సర్లకు అనేక కారణాలని భావించేవారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ బారీ మార్షల్ బృందం దీనికి కారణం ఒక సూక్ష్మజీవి అని, అది ఒక మెలికలు తిరిగిన బాక్టీరియా అని చెప్పారు. శాస్త్ర ప్రపంచానికిది అంతగా రుచించలేదు. కొందరు పెదవి విరిచారు. మరికొందరు అవహేళన చేశారు. శాస్త్ర పరిశోధనలను ప్రచురించే పత్రికల్లో భారీ మార్షల్ పరిశోధనా వ్యాసాలు ప్రచురితం కావడానికి అంగీకరించలేదు. పేగుల్లో ఏర్పడిన పుండ్లతో కడుపు నొప్పితో వచ్చే రోగులను పరీక్షిస్తే ఒకోసారి ఏ రకమైన వ్యాధి లక్షణాలు కనుపించేవి కావు. ఎందువలన వస్తుందో తెలిసేది కాదు. జీర్ణాశయ విజ్ఞాన శాస్త్రంలో (Gasteroenterology) ఇదొక పజిల్ గా ఉండేది.

పశ్చిమ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో యం.బి.బి.యస్. చదివిన బారీ మార్షల్ ఎలిజిబెత్ మహారాణి 11 వైద్యకేంద్రంలో జనరల్ మెడిసిన్ లో శిక్షణ పూర్తి చేశాడు. వ్యాధి నిర్ధారణ, నివారణపై పరిశోధనలు చేయటం బారీకి ఇష్టం. ఈ విభాగంలో నైపుణ్యం సాధించేందుకు 1979లో రాయల్ పెర్త్ హాస్పిటల్ (Royal Perth Hospital)లో చేరాడు. ఆ రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే పరిజ్ఞానం అక్కడి కార్డియాలజీ (హృద్రోగ శాస్త్రం)కే ఉండేది. అక్కడ శిక్షణ పొందే డాక్టర్లు ఒకో విభాగంలో ఆరునెలలు ప్రత్యేకంగా తర్ఫీదు. పొందుతారు. 1981 ఉత్తరార్థంలో భారీ మార్షల్ ను జీర్ణాశయ విజ్ఞాన శాస్త్ర (Gasteroenterology) విభాగానికి పంపించారు. పరిశోధనా ప్రాజెక్టు చేయడం ఆయా విభాగాల్లో పొందే శిక్షణలో భాగంగా ఉండేది. దాన్ని బాగా ప్రోత్సహించే వారు కూడా. అప్పటికే బారీ పరుగెత్తే వాళ్లలో వచ్చే గుండె జబ్బులపై ప్రాజెక్టు చేస్తున్నాడు. దాన్నే కొనసాగిస్తే బారీ స్పోర్ట్స్ మెడిసిన్ లో ఒక స్పెషలిస్టు అయ్యేవాడు. కాని బారీ ఆ విభాగ అధిపతి డాక్టర్ టామ్ వాటర్స్ ను జీర్ణాశయ విజ్ఞాన శాస్త్రంలో ఏమైనా ప్రాజెక్టులున్నాయేమోనని వాకబు చేశాడు. ఆ క్షణమే బారీ జీవితంలో గొప్ప మలుపుకు నాంది పలికింది. అదే బారీ మార్షలకు రాబిన్ వారెన్ తో పరిచయంకావటం. రాబిన్ వారెన్ దగ్గర కొందరు రోగుల జాబితా ఉందనీ, వారంతా పేగుపుండు, కడుపునొప్పి బాధితులని చెప్పినాడు. రాబిన్ ను సంప్రదించి రీసెర్చి ప్రాజెక్టు చేపట్టమని సలహా ఇచ్చాడు. రాబిన్ వారెన్ బారీని హాస్పిటల్ సెల్లార్ లో వున్న వ్యాధి శాస్త్ర(Pathology) ప్రయోగశాలకు తీసుకుపోయి మైక్రోస్కోపులో తాను చూసిన కొన్ని సూక్ష్మజీవులను చూపించాడు. పేగుపుండు వ్యాధిగ్రస్తుల పేగుగోడలను బయాప్సీ చేసి పరీక్షించినప్పుడు ఈ బాక్టీరియా వచ్చాయని చెప్పాడు. ఇంతకు ముందెన్నడూ ఈ రకం బాక్టీరియాను కనుగొనలేదు. అవి మెలికలు తిరిగి ఉన్నాయి. అవి గాస్టరో ఎంటరైటిస్, కోలైటిస్ వ్యాధులకు కారణమైన కాం పైలోబాక్టర్ లా ఉన్నాయి.

బారీ మార్షల్, రాబిన్ వారెన్ ల మైత్రి, పరిశోధనలు ఆనాటి నుండి నిరంతరాయంగా కొనసాగాయి. బారీ డాక్టరు అయినప్పటికీ అతని హాబీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్. 1981 చివరికి తనే స్వంతంగా ఒక కంప్యూటర్ ను తయారు చేశాడు. తనకున్న ఈ అదనపు నాలెడ్, తను దేశదేశాల పరిశోధనా బృందాలతో పరిచయానికి, సమాచార సేకరణకు తోడ్పడింది. ఆ క్రమంలోనే ఎక్కడో మారుమూల ఒక మైక్రోబయా పరిశోధనా పత్రికలో ప్రచురించబడిన ఒక ఆసక్తికరమైన వ్యాసాన్ని చూశాడు. కాని అప్పటికి బారీ మారలకు కూడా తామేమి డిస్కవర్ చేయబోయేదీ తెలియదు. తమలాగే వివిధ దేశాలలో పేగుపుండు వ్యాధితో బాక్టీరియా కలిసి ఉండటాన్ని గమనించారు. తాము సేకరించిన సమాచారం, చేసిన ప్రయోగాల పర్యవసానంగా భారీ మార్షల్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మెలికలు తిరిగిన హెలికోబాక్టర్ పైలోరీ అనే బాక్టీరియా పేగు పుండు వ్యాధికి ప్రధానకారణం అని. కాని బారీ మార్షల్ ప్రతిపాదనలను శాస్త్ర ప్రపంచం స్వీకరించలేదు. కొందరు ఈ బాక్టీరియా కేవలం కల్తీ జరిగి (Contamination) శాంపుల్స్ లో వచ్చి వుంటుందన్నారు. jun002.jpgఅది ఒక హాని కలిగించని జీవి అన్నారు. ఏది ఏమైన ఈ బాక్టీరియా వ్యాధికి కారణం కాదన్నారు. భారీ మార్షల్ చూపిన పరిశోధనా ఫలితాలు వేరే వాళ్లు చేసి చూసినప్పుడు సరిగ్గా రాకపోటమే వారు ఇలా భావించటానికి కారణం. కాని భారీ మార్షల బాక్టీరియాలను నాశనంజేసే ఆంటిబయాటిక్స్ ఉపయోగించి విజయవంతంగా వ్యాధి నివారణ, ఉపశమనం రాబట్టగలిగాడు. ఒక వైపు వ్యాధి కారణంపై తర్జనభర్జనలు జరుగుతుండగానే బారీ మార్షల్ కు వివిధ దేశాల నుండి వచ్చే రోగుల రద్దీ పెరిగింది. ఆంటీబయాటిక్స్ కు వ్యాధి తగ్గుతున్నదంటే వ్యాధికి కారణం బాక్టీరియా అనే ప్రాథమిక సూత్రం బారీని ముందుకు నడిపించింది. కడుపునొప్పికి 200 ఏళ్లుగా పనిజేస్తున్న బిస్మత్ రహస్యాన్ని ఛేదించి, ఆంటీబయాటిక్స్ తో బాటు బిస్మత్ ను కూడా ఇచ్చి ఎందరో రోగులకు స్వాంతన కలిగించాడు బారీ మార్షల్.

శాస్త్ర ప్రపంచం నమ్మాలంటే సరైన రుజువులు కావాలి. తాను జంతువులపై చేస్తున్న ప్రయోగాలు సఫలం కావటం లేదు. చివరకు తన పైనే హెలికో బాక్టర్ బాక్టీరియంను ప్రయోగించి దాని ప్రభావాన్ని, వ్యాధి కలిగించే శక్తిని లోకానికి చూపించిన ధీశాలి డాక్టర్ బారీ మార్షల్. సత్యం కోసం తన జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి ప్రయోగాలు చేసిన భారీ మార్షల్ ధైర్యసాహసాలు కొనియాడదగినవి. కనీసం భార్య ఆద్రినేతో కూడా మాట మాత్రం చెప్పకుండా ఈ పనిచేశాడు. దీనితో ఈ బాక్టీరియం కేవలం పేగుపుండు(Peptic Ulcer)ను కలిగించడమే కాక జీర్ణాశయ కాన్సర్ కు దారి తీస్తుందన్న తన సిద్దాంతం రుజువు చేయబడింది. భారీ తీసుకున్న రిస్కు మిలియన్ల కొలదీ పేగుపుండు వ్యాధిగ్రస్తులకు సులభంగా, త్వరితంగా వైద్యం అందించేందుకు మార్గం సుగమం చేసింది. గినీపిగ్ డాక్టర్ అల్సర్ కు కారణాన్ని, నయం చేసే మార్గాన్ని కనిపెట్టాడని పత్రికలు హెడ్డింగ్ పెట్టి మరీ రాశాయి.

jun003.jpgహెలికో బాక్టర్ పైలోరి బాక్టీరియం మన ! పొట్ట, చిన్న పేగు పొరల్లో చేరి గాయం చేయటం వల్ల పేగుపుండ్లు వస్తాయని, ఆ గాయం కారణంగానే ఆమ్లం విడుదలై కడుపులో మంట వస్తుందనీ రుజువు చేశారు బారీ మార్షల్, రాబిన్ వారెన్ లు. కడుపులో నిల్వ ఉన్న ఆమ్లం వలన అల్సర్లు లేక పుండ్లు ఏర్పడతాయన్న నమ్మకాన్ని వమ్ము చేసి బాక్టీరియంతో వచ్చే పుండ్ల వలన ఆమ్లాలు వస్తాయని నిరూపించాడు. ఇది వైద్యరంగంలో ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ. ఈ ఆవిష్కరణకు గాను బారీ మార్షల్, రాబిన్ వారెన్ తో కలిసి 2005 సం. నోబెల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. సత్యాన్వేషణలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విజ్ఞాన రహస్యాలను కన్గో న్న డాక్టర్ బారీ మార్షల్ చెకుముకి నేస్తాలవంటి ఎందరో భవిష్యత్ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిప్రధాత.

జోన్ లుబిషెంకో

janeఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన సైన్సు టీమ్ కు మొట్టమొదటిసారిగా ఒక మహిళా శాస్త్రవేత్తను ఎంపిక చేశాడు. మహాసముద్రాలు, వాతావరణానికి సంబంధించిన నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ ఎడ్మినిస్ట్రేషన్ కు (National Oceanic and Atmospheric Administration-NOAA)  ఆమెను అధిపతిగా నియమించాడు. ఈ పదవిలో ఆమె 2009 నుండి 2013 వరకు కొనసాగారు. ఆమె అప్పటివరకూ ఓరెగాన్ స్టేట్ యూనివర్శిటీలో జంతుశాస్త్రం పాఠాలు చెపుతూ పరిశోధనలు చేసే ప్రఖ్యాత అమెరికన్ పర్యావరణ శాస్త్రవేత్త, జేన్ లుబిషేంకో సాగర ఆవరణ శాస్త్రంలో (Marine Ecology), జీవవైవిధ్యం, పర్యావరణ మార్పు (Climate Change) వంటి అంశాలలో నిపుణురాలు కావటమే ఒబామా ఎంపికకు కారణం.

శాస్త్రవేత్తలు సమాజానికి రుణపడి ఉన్నారని, సామాజిక ప్రగతి శాస్త్రవేత్తల బాధ్యతగా గుర్తించి ఆమె పనిచేసేది. శాస్త్రవేత్త కేవలం జ్ఞానాన్ని (నాలెడ్జ్) సృష్టించటం మాత్రమే కాకుండా ఆ జ్ఞానాన్ని శాస్త్రవేత్తలతోనే కాకుండా విస్తృత ప్రజానీకంతో పంచుకోవాలని నమ్మిన గొప్ప వ్యక్తి జేన్ లుబిషెంకో. ఇందుకోసం ఆమె మూడు ఆర్గనైజేషన్ లను ఏర్పరచింది. COMPASS, లియోపాల్ట్ లీడర్ షిప్  ప్రోగ్రాముల ద్వారా పౌరులు, ప్రచార సంస్థలు, విధాన కర్తలు, వ్యాపారస్తులతో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను సమర్థవంతంగా ప్రచారం చేసేందుకు శిక్షణనిచ్చేది. ఈ రెంటికి తోడు క్లైమేట్ సెంట్రల్ (Climate Central) అనే పర్యావరణ చైతన్యాన్ని కలిగించే కేంద్రాన్ని స్థాపించింది. దీని ద్వారా అమెరికా ప్రజలకు అర్థం అయే రీతిలో పర్యావరణ పరిరక్షణ సమాచార విజ్ఞానాన్ని అందించింది జేన్ లుబిషేంకో, తన ఉపన్యాసాలు, రచనల ద్వారా లాభార్జన ఆశించని అనేక సంస్థల ద్వారా ప్రజలకు శాస్త్రవేత్తలకు మధ్య ఒక వారధి నిర్మించిందంటే అతిశయోక్తి కాదు. మహాసముద్రాలు కలుషితం కాకుండా, సముద్ర జీవరాసులను కాపాడే అనేక కమిషన్ లలో ఆమె సభ్యులుగా పనిచేసింది. అందులో ప్యూ మహాసముద్ర కమిషన్ (Pew Oceans Commission) ఒకటి.

అమెరికా ఇకాలజీ సంఘానికి (Ecological Society of America) నాయకత్వం వహించి జీవవైవిధ్యం, పర్యావరణ మార్పు, సుస్థిర విజ్ఞానం కోసం పరిశోధనలు చేసేందుకు ‘సుస్థిర జీవావరణానికి చొరవ’ (Sustainable Biosphere initiative)ను ప్రారంభించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న వాస్తవ పర్యావరణ సమస్యలను అధిగమించే దిశలో శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసేందుకిది ఎంతో తోడ్పడింది.

2010వ సం. ఏప్రిల్ లో లూసియానా తీరంలో ఆయిల్ తవ్వే రిగ్గు పేలిపోయి సముద్ర జలాలు కాలుష్యం అయినప్పుడు లుబిషెంకో  NOAA అధికారిగా సమర్థవంతంగా పనిచేసి నష్టాన్ని నివారించింది. అంతరించిపోతున్న ఎన్నో అరుదైన తాబేలు జాతి జంతువులను పరిరక్షించింది. అమెరికా సముద్ర తీరాలు, పర్యావరణం, చేపల పెంపకం వంటి అనేక రంగాల్లో విధానాలను రూపొందించటంలో లుబిషెంకో చురుకైన పాత్ర నిర్వహించింది. అన్నింటికీ మించి పర్యావరణ సర్వీసులను నిరంతరం అందించే ఒక వ్యవస్థను రూపొందించింది. ఉపగ్రహాల ద్వారా అందే సమాచారాన్ని, వాస్తవ పరిస్థితులకు జోడించి విపత్కర వాతావరణ పరిస్థితుల నుండి, ప్రకృతి విధ్వంసం నుండి రక్షించుకునేందుకు Weather-Ready Nation (వాతావరణపరంగా దేశాన్ని సంసిద్ధం) ప్రాజెక్టును రూపొందించింది.

సైన్సును సమాజ ప్రయోజనాలకు అన్వయించిన జేన్ లుబిషెంకో 1947, డిసెంబర్ 4వ తేదీన జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పూర్వీకులు ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లీషు, స్కాటిష్, ఇరిష్ వంటి పలు దేశాలకు చెందినవారు. తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. తండ్రి సర్జన్, తల్లి పిల్లల డాక్టర్. జీవశాస్త్రంలో బి.ఏ. 1969లో చేసి 1971లో ఎం.ఎస్. జంతుశాస్త్రంలో చేసింది. 1975లో పి.హెచ్.డి పట్టా పొందింది. విశాఖ, భీమ్లీ వంటి రాళ్ల సముద్ర తీరాల్లాంటి న్యూఇంగ్లాండ్ సముద్ర తీర జంతువులు, సముద్ర గడ్డిపై పరిశోధించింది. కాలేజీలో చదివే రోజుల్లో ఆమె హాజరైన ఒక సాగర జీవశాస్త్ర వర్క్ షాప్ ఆమెను ఈ రంగంలో కృషి చేసేలా స్ఫూర్తినిచ్చిందట. ఇక ఆమెకు వృత్తిపరంగా వచ్చిన అవార్డులు, రికార్డులకు లెక్కేలేదు. వాటిలో మెకార్తర్ జీనియస్ అవార్డు, 18 గౌరవ డాక్టరేట్లు కొన్ని మాత్రమే. 2010వ సం. కి ఆమెను ఆ సంవత్సరం వార్తలలోని వ్యక్తిగా ప్రఖ్యాత సైన్సు పత్రిక 'నేచర్' ఎంపిక చేసింది. ఇటీవల 2015లో మన పర్యావరణ శాస్త్రవేత్త డా. మాధవ్ గాడ్గిల్ తో కలిసి పర్యావరణ పరిరక్షణకిచ్చే ప్రతిష్టాత్మక టైలర్ ప్రైజును గెలుచుకుంది.

సి.వి.యస్.

cvsఇద్దరు పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు.

చేతిలో ఏదో తీసుకుని నా గుప్పెట్లో ఏముందో చెప్పుకో చూద్దాం! అంటూ రెండోవాడికి 'క్విజ్' పెట్టాడు మొదటివాడు.

వీళ్ళ ఆటని దూరం నుంచి గమనిస్తున్న తల్లి వీళ్ల దగ్గరకు వచ్చి నేనో తమాషా సంగతి చెబుతాను అంది.

“ముందు నా చేతిలో ఉన్నది చెబితేనే.” అంటూ మంకుపట్టుపట్టాడు మొదటివాడు.

”దాంట్లో ఏముంది నీ చేతిలో ఉన్నది మట్టి.” అన్నాడు రెండో వాడు.

తన రహస్యం ఇంత తేలిగ్గా బయటపడ్డందుకు నీరసపడ్డాడు మొదటివాడు.

”సరే, నీ చేతిలోది మట్టేకదా! మరి ఆ మట్టిలో ఏముందో చెప్పండి చూద్దాం.” అని అమ్మ వారిద్దరికీ పరీక్షపెట్టింది.

”మట్టిలో ఏముంటుంది మట్టే.” అన్నారిద్దరూ.

”కాని మట్టిలో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి.” అంది అమ్మ.

”మాకు తెలుసు నీరుంది.” అన్నారిద్దరూ.

”అవును. ఈ నీటితోపాటు రకరకాల ధాతువులు, ఇసుక, బంకమన్ను, గ్రాఫైట్... ఇలా ఎన్నో భౌతిక పదార్థాలు కలసి మట్టి ఏర్పడుతుంది.” అని చెప్పింది అమ్మ.

”ఓస్. ఇంతేకదా! ఇందులో గొప్ప ఏముంది.” అని పెదవి విరిచారు పిల్లలు.

”ఇంతేకాదు, మన కంటికి కన్పించని ఎన్నో జీవులు ఇందులో ఉన్నాయి తెలుసా?” అంటూ పిల్లల్ని ఉత్సాహపర్చింది అమ్మ.

”ఈ మట్టిలో జీవులుండటమేమిటి?” అనడిగారు పిల్లలిద్దరూ.

”నీ పిడికెట్లో ఉన్న మట్టిలో ఎన్నో రకాల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. ఆ సూక్ష్మజీవుల సంఖ్యను ఊహించండి చూద్దాం!” అని అడిగింది అమ్మ.

”వందో రెండొందలో ఉంటాయి గావచ్చు.” అన్నారు పిల్లలు.

”కాదు. ఈ మట్టి అంతా పక్కకు పెట్టండి. కేవలం ఒక గ్రాము మట్టిలోనే కొన్ని వేల, లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇటువంటి వాటి నుండే మన ఎల్లాప్రగడ సుబ్బారావు గొప్ప ఆంటీ బయోటిక్ ఔషదం ‘స్ప్రెప్టొమైసిన్’ ను కనిపెట్టాడు. ఇలాంటి మట్టిలోంచే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ‘అద్భుత ఔషధం’ (Wonder drug) పెన్సిలిన్ ను ఇచ్చే 'పెనిసీలియం' శిలీంద్రాన్ని కనుగొన్నాడని మీకు తెలుసా?” అనడిగింది అమ్మ

”మేం ఇప్పుడే తెలుసుకున్నాం.” అన్నారు పిల్లలిద్దరూ

”శిలీంధ్రాలను వాడుకభాషలో 'బూజులు' అని కూడా అంటారు. వీటిలో కంటికి కన్పించేవి కొన్నయితే కంటికి కనపడనివి బోలెడు. ప్రపంచంలో కీటకాల తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్న జీవులు శిలీంధ్రాలు. మనకు ఉపయోగపడే శిలీంధ్రాలను కngoన్గోనటం ద్వారా ప్రపంచంలో ఎందరో శిలీంధ్ర శాస్త్రవేత్తలు మానవజాతికి అలా మేలు చేశారు. అలా మేలు చేసిన భారతీయ శిలీంధ్ర శాస్త్రవేత్తనే డా. సి.వి. సుబ్రమనియన్ (C.V. Subramanian) గురించి మీకు వివరిస్తాను.” అంటూ మొదలుపెట్టింది అమ్మ.

భారతదేశంలో శిలీంధ్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన వారిలో అగ్రగణ్యుడు, ఈ శాస్త్రానికి పితామహుడు సి.వి. సుబ్రమనియన్. ఈయన సి.వి.యస్. అనే పేరుతో సుప్రసిద్ధులు. 1924 ఆగస్టు 11న ఎర్నాకులంలో జన్మించిన సివియస్ పదకొండేళ్ళ వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి పార్వతి అమ్మాళ్ సివియస్ ను పెంచి విద్యాబుద్ధులు నేర్పించింది. చిన్నప్పట్నుంచే సివియస్ కు మొక్కలను సేకరించటం తన ఇంటి పెరటితోటలో పెంచటం అలవాటు. అందుకేనేమో అటుతర్వాత గొప్ప శిలీంధ్ర శాస్త్రవేత్త అయ్యాడు.

సివియస్ కు సైన్సు అంటే సత్యాన్వేషణ. నేటి ప్రపంచంలో జీవించి ఉన్న ఎన్నో రకాల జీవుల్ని సేకరించి బతికించుకోవటం, వాటిని మానవ క్షేమానికి ఉపయోగించటం చాలా ముఖ్యం. దేనికైనా ముందుగా మన నేలలో, మట్టిలో, నీళ్ళలో, వాతావరణంలో ఉండే సూక్ష్మజీవుల జాడలు వెతకాలి. ఎన్నో రకాల శిలీంధ్రాలను కన్గోనటం ద్వారా సివియస్ అలా భారతదేశపు శీలింధ్ర విజ్ఞానాన్ని పరిపుష్టం చేశాడు.

ఆయన కన్గొన్నన్ని శిలీంధ్రాలను కనిపెట్టలేదు. దాదాపు 130 కొత్త ప్రజాతులను వర్ణించాడు. భారతదేశంలో జీవవైవిధ్య కేంద్రాలైనా హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల నుండి దక్షిణ ఆసియా దేశాల్లోని శిలీంధ్రాలను కనిపెట్టిన వ్యక్తి సివియస్. ఆయన కనిపెట్టిన శిలీంధ్రాలకు సంస్కృతంలో పేర్లు పెట్టటం సివియస్ ప్రత్యేకత.

ఆయన మైకలాజికల్ సొసైటీని స్థాపించి, ఎందరో యువ శిలీంధ్ర శాస్త్రవేత్తలకు ప్రేరణనిచ్చారు. పశ్చిమకనుమల్లో స్థాపించాలనుకున్న 'సైలెంట్ వాలీ జలవిద్యుత్ కేంద్రాన్ని' సివియస్ కృషితో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి నిలిపివేసి మొత్తం ఆ ప్రాంతాన్ని జీవవైవిద్య రిజర్వుగా ప్రకటించారు.

భారతదేశపు నోబెల్ బహుమతిగా పరిగణించే భట్నాగర్ అవార్డును డా. సి.వి. సుబ్రమనియన్ 1972 లో గెలుచుకున్నారు. అంతర్జాతీయ శిలీంధ్ర శాస్త్రజ్ఞుల సంఘానికి 1977లో ఎన్నికైన తొలి భారతీయుడుగా ఖ్యాతి గడించాడు. మద్రాస్ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగానికి 1985 వరకూ రెండు దశాబ్దాలకు పైగా డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన కేవలం శాస్త్రవేత్తగానే గాక కర్ణాటక సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాడు.

”సివియస్ కు జీవితం అంటే నేర్చుకోవటం. నేర్చుకోవటం అంటే ఆనందాన్ని ఆస్వాదించటం. దేన్నైనా నిశితంగా పరిశీలించటం, నేర్చుకునేందుకు ప్రయత్నించటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ గుణాలను మీరు, ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి.” అంటూ ముగించింది అమ్మ

'”సరే!” అన్నారు పిల్లలిద్దరూ.

రోమ్యులస్ వైటేకర్

romulus పిల్లలూ! పాములంటే మీరు భయపడతారు కదూ! మీరేంటి పెద్దవాళ్ళు కూడా గజగజ వణుకుతారు. అంతే కాదు పాములన్నీ విషపూరితమనీ, అవి పగబడతాయనీ చాలా మంది నమ్ముతుంటారు. కానీ అది సరియైనది కాదు. పంటలను నాశనం చేసే ఎలుకల్ని తిని ఇవి రైతులకు సహాయపడతాయి. ప్రకృతి అంటేనే సమతుల్యత ఏ జీవులు ఎంత నిష్పత్తిలో ఉండాలో అంతే ఉండాలి. అలాంటి అసమతుల్యత ఏర్పడి పాములు నశించిపోవటాన్ని గమనించిన రోమ్యులస్ ఎర్ల్ వైటేకర్ అనే జంతు ప్రేమికుడు చెన్నైలోని అడయార్‌లో ఒక స్నేక్ పార్క్ ను ప్రారంభించాడు. ఈయన విలుప్తమైపోతున్న రెస్టీలియా జాతుల్ని సంరక్షించటానికి ఈ పార్క్ ను ఏర్పాటుచేశాడు. దీని నిర్వహణా బాధ్యతను ఒక ట్రస్టు నిర్వహిస్తోంది. దీన్ని 'మద్రాస్ స్నేక్ పార్క్ ట్రస్ట్' అంటారు. ఈ పార్కులో దాదాపు ముప్పై కరాల ఇండియన్ స్నేక్స్ ఉన్నాయి. అందులో కింగ్ కోబ్రా, ఇండియన్ రాక్ పైధాస్, రెటిక్యులేటెడ్ పేధాన్ మొదలైనవి ఉన్నాయి.

వెటేకర్ క్రూరమృగాలను సంరక్షించటానికి కంకణం కట్టుకున్నాడు. అంతే కాక ఈయన 'హెరటాలజిస్ట్' కూడా! హెర్పటాలజీ అంటే సరీసృపాల గురించి చదివే శాస్త్రము. ఈయన మద్రాసు స్నేక్ పార్క్ ను స్థాపించటమే గాక అండమాన్ ది నికోబార్ ఎన్విరాన్ మెంట్ ట్రస్ట్ ను, మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ ట్రస్ట్ ను కూడా స్థాపించాడు. మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్ ట్రస్ట్ అనేది హెర్పటాలజీ సెంటర్. అంతరించిపోయేంత విషమ పరిస్థితిలో ఉన్న 'ఘరియల్ (gharial) అనే వెసళ్లను వైటేకర్ ఇక్కడ సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం వైటేకర్ ఈ ట్రస్బకు వ్యవస్థాపక డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

International Union for the Conservation of Natural and Natural Resources (IUCN) కు వైటేకర్ గౌరవ సలహాదారునిగా, మొసళ్ళు ప్రత్యేక విభాగానికి వైస్ చైర్మన్ గానూ, సముద్రపు తాబేళ్ళ ప్రత్యేక విభాగానికి మెంబర్ గానూ ఉ న్నారు. వీరికి 2005 లో ప్రకృతి సంరక్షణ బాధ్యతను నిర్వర్తించినందుకు గాను వైట్లీ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును వైటేకర్ కర్ణాటకలోని 'ఆగంబే రెయిన్' ఫారెస్ట్ రీసెర్చి స్టేషన్ ను ఏర్పాటు చేయటానికి ఉపయోగించుకున్నారు. ఈ రీసెర్చి సెంటర్ లో 'కింగ్ కోబ్రాలను', వాటి యొక్క ఆవాసాలను కనుక్కోవటానికి పరిశోధన జరుగుతుంది. 'ఇరులా' అనే జాతి గిరిజనులు పాముల్ని పట్టుకొని తమ జీవనాన్ని సాగిస్తుంటారు. పాముల్ని పట్టడాన్ని నిషేధించడంతో ఆ గిరిజనులకు పని లేకుండా పోయింది. అందువల్ల వైటేకర్ వీరికి రీసెర్చి సెంటర్ లో పునరావాసం కల్పించారు. వారికి పాముల నుండి స్నేక్ వీనమ్ తీసే పనిని అప్పగించాడు. ఇది పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ విధంగా పాముల్ని సంరక్షించడంతో పాటు పాముల పట్టేవాళ్ళకు కూడా పని కల్పించారు. అంతేకాక భారతదేశమంతటా ఎన్నో రెయిన్ ఫారెస్ట్ రీసెర్చి సెంటర్స్ ను స్థాపించారు.

వైటేకర్, కింగ్ కోబ్రాల యొక్క జీవన చిత్రణ మీద 53 ని. నిడివి గల ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. ఇది 1996 వ సంవత్సరంలో తీయగా దీనికి 1998 వ సం. లో 'ఎమ్మీ అవార్డు’ లభించింది. ఎమ్మీ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు. దీనిని డాక్యుమెంటరీలు, వార్తలను కళాత్మకంగా చిత్రించే ఛాయాగ్రాహకులకు ఇస్తారు. ఇదే కాక 'కొమడో డ్రాగన్లు' 'డ్రాకోట' అనే సరీసృపాల సహజ జీవితాన్ని 'నేచర్' అనే డాక్యుమెంటరీగా తీశాడు. డాక్యుమెంటరీలు తీయడమే గాకుండా ఎన్నో పుస్తకాలు కూడా వ్రాశాడు. ఎక్కువగా పాముల మీద వ్రాశాడు. ఈ పుస్తకం 'స్కేర్స్ ఆఫ్ ఇండియా' పేరుతో ప్రచురితమైంది.

రోమ్యులస్ వైటేకర్ 1943 వ సం. మే 23న జన్మించాడు. తల్లి పేరు 'డోరిస్ నార్డిన్' తండ్రి పేరు 'రామ ఛటోపాధ్యాయ'. వైటేకర్ కు ఏడు సంవత్సరాల వయస్సులో ఈ కుటుంబం న్యూయార్క్ నుండి భారతదేశం వచ్చేసింది. ఈయన 1974 లో “జాయ్” అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికిద్దరు పిల్లలు. నిఖిల్, సమీర్. నిఖిల్ వైల్డ్ లైఫ్ మేనేజిమెంట్ చదవగా, సమీర్ మైక్రోబయాలజిస్ట్ గా ఉన్నాడు. వైటేకర్ ప్రస్తుతం తమిళనాడులో నివసిస్తు న్నారు. అంతరించిపోయే దశలో ఉన్న క్రూరమృగాలను సంరక్షించి ప్రకృతిలో సమతుల్యతను కాపాడుతున్న వైటేకర్ గురించి తెలుసుకున్నారు కదా పిల్లలూ!

ధామస్ ఆల్వా ఎడిసన్

thomas ప్రపంచంలో అత్యధిక పేటెంట్లు పొందిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఇతను 1847 ఫిబ్రవరి 11 న అమెరికాలో జన్మించాడు. పుట్టినప్పుడు తల లావుగా, శరీరం పీలగా ఉంటే ఆ బిడ్డ బతకరని అప్పటి (మూఢ) నమ్మకం. ఎడిసన్ కు కూడా తల లావుగా శరీరం పీలగా ఉంటే ఇతను కూడా బతకడని ఇతని తల్లి నాన్సీ. తండ్రి సామ్యూల్ ఎడిసన్ అనుకున్నాడు. ఈమెకు ఆరు మంది పిల్లల్లో అప్పటికే ముగ్గురు చనిపోయారు. కాబట్టి ఎడిసన్ ఎక్కువ కాలం బతకడని అతని తల్లితోపాటు చుట్టు ప్రక్కవారు అనుకొన్నారు.

ఏడేళ్ళ వయసులో ఎడిసన్ కు విషజ్వరం వచ్చింది. తల్లి మరింత భయపడినది కానీ విషజ్వరం తగ్గిపోయినా చెవిటితనం మిగిలిపోయింది. ఇతని తండ్రి వ్యాపారంలో లాభాలు తగ్గిపోయినవి. 1859 లో పోర్టు హరన్ - డిట్రాయిట్ మధ్య రైళ్ళ రాకపోకలు మొదలయ్యాయి. ఎడిసన్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. స్కూలులో ఎడిసన్ ఉపాధ్యాయులు బుద్ది హీనత కలిగిన వ్యక్తి గా పరిగణించారు. ఎడిసన్ తల్లికి ఉపాధ్యాయులు “ఇతనికి చదువు రాదు” అని చెప్పగా ఎడిసన్ తల్లి ఇంట్లోనే చదువు చెప్పుతూ ఎడిసన్ ను ప్రోత్సహించింది. ఎడిసన్ ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. కేవలం మూడు నెలలు మాత్రమే పాఠశాలకు వెళ్ళిన ఎడిసన్ కు తల్లే టీచర్ ఇల్లే బడి. బుట్టలో గుడ్లపై బాతు కూచుంటే పిల్లలు వస్తాయని తెలిసి ఒక రోజు తానే గుడ్లపై కూర్చున్నాడు. ఆ గుడ్లన్ని పగిలిపోయాయి. రెండు గండు పిల్లుల తోకలను రాపిడి చేయడం ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయాలని ప్రయత్నించాడు. కరంట్ రాలేదు కానీ ఎడిసన్ కు గాయాలైతే అయ్యాయి. ప్రయోగాలతో ఇల్లు దడదడలాడేది. తండ్రి మందలించినా తల్లి వెనకేసుకొని వచ్చేది. మేధావుల జీవిత చరిత్రలు, వాళ్ళ పరిశోధనలు, ప్రాముఖ్యతలను శ్రద్దగా చదివేవాడు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల పన్నెండేళ్ళ వయసులోనే వార్తా పత్రికలు అమ్మే ఉద్యోగంలో చేరి విరామ సమయంలో పుస్తకాలు చదివేవాడు. అచ్చుయంత్రం కొని స్వయంగా వార్తా పత్రికలను ముద్రించి అమ్మి వచ్చే డబ్బుతో ప్రయోగాలు చేసేవాడు. రైలులో లగేజీ బోగీలో చిన్న ప్రయోగాలు చేసేవాడు అయితే అక్కడ ప్రమాదం జరిగి ఉద్యోగం ఊడింది.

పదహారేళ్ళ వయసులో రైలో రోడ్ టెలిగ్రాఫ్ ఆపరేటర్ గా రాత్రి షిప్టులలో వనిచేసేవాడు. 'తను నిద్ర పోలేదని’ హెడ్ ఆఫీసుకు ప్రతి గంటకు సిగ్నల్ ఇవ్వాలి. కానీ ఎడిసన్ గడియారం ప్రతి గంటకు సిగ్నల్ ఇచ్చేది. కొద్ది రోజులకు ఈ విషయం అధికారులకు తెలిసి ఉద్యోగం ఊడింది. ఈ గడియారమే ఎడిసన్ తొలి ఆవిష్కరణ.

పెద్ద పెద్ద చదువులు, డిగ్రీలు లేకపోయినా. తన తెలివి, పట్టుదలతో తంతి ద్వారా వార్తలు పంపేయంత్రాన్ని కనిపెట్టి గడియారపు పెండ్యులమ్ కు అనుసంధానం చేసి వార్తలను పంపేవాడు. 1868 లో అమెరికా కాంగ్రెస్ సభ కోసం “ఓట్ రికార్డర్” ను ఆవిష్కరించి పేటెంట్ పొందాడు. కానీ ఇది అవసరంలేదని కాంగ్రెస్ అనడంతో డబ్బు రాలేదు. కానీ ప్రజలకు అవసరంలేని ఆవిష్కరణను చేయరాదనే గుణపాఠంగా భావించాడు.

రెండు సందేశాలను ఏక కాలంలో తీసుకుపోగా 'డైస్లెక్స్' ను రూపొందించాడు. టెలిగ్రాఫ్ ద్వారా షేర్ల రేటును తెలుసుకొనే “స్టాక్ టిక్కర్” ను ఆవిష్కరించి 40,000 డాలర్లు సంపాదించాడు. ఇలా ఇరవై మూడేళ్ళకే ప్రముఖ ఆవిష్కర్తగా గుర్తింపు పొందాడు. ఒకేసారి 45 పరికరాల మీద పరిశోధన చేసి అందరి దగ్గర ప్రశంసలు పొందాడు. తంతి ద్వారా 2500 మాటలను ఒక నిమిషంలో పంపిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే. తంతి ద్వారా నాలుగు సందేశాలను ఒకేసారి ప్రసారం చేయగలిగాడు. ఎడిసన్ తనవద్ద పరిశోధకురాలిగా పనిచేసే ఆమెకు మోర్స్ కోడ్ ద్వారా తన ప్రేమను తెలిపి వివాహం చేసుకొన్నాడు. తర్వాత అతని ప్రయోగాలలో భార్య చాలా సహకరించింది. టెలిఫోన్స్ బాగా పరిశీలించి శబ్దతరంగాలను విద్యుత్ తరంగా మార్చే మైక్రోఫోన్లు తయారు చేసాడు. తనకు చిన్నతనం నుండి చెవిటితనం ఉన్నా గ్రాంఫోన్ నిర్మాణం చేసి, మూకీ సినిమాలకు ధ్వనిని చేర్చాడు. విద్యూత్ బల్బును కనుక్కొని ప్రతి ఇంటా వెలుగులు నింపేందుకు వందల ప్రయోగాల తర్వాతనే విజయం సాధించాడు. డైనమో మొదలు స్విచ్ బల్బుల వరకు ఎడిసన్ తయారుచేసి విజయం సాధించాడు. “కైనెటోస్కోప్” కనిపెట్టి మనం చూసే దృశ్యాలను తెరపై చూపడమే కాకుండా ఫోనోగ్రాఫ్ ను ఉపయోగించి ధ్వనిని చేర్చి ప్రదర్శించాడు.

ఇలా దాదాపు 1098 ఆవిష్కరణలకు పేటెంట్ పొంది 2500 కోట్ల డాలర్ల డబ్బును సంపాదించి యావత్ ప్రపంచానికి సైన్స్ ఫలితాలను అందించిన ఎడిసన్ 1981 వ సం. అక్టోబర్ 18 న మరణించినా ఆయన చేసిన ప్రయోగవలితాలు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఈయన 171 వ జయంతి సందర్భంగా ఎడిసన్ కృషిని తలచుకోవడమే ఆయనకు మనమిచ్చే నివాళులు.

గెలీలియో

galileoమత మౌఢ్యానికి చావుదెబ్బ కొట్టి తను నమ్మిన సిద్ధాంతానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా మహనీయుడు గెలుస్తుందని ఋజువు చేసిన శాస్త్రవేత్త గెలీలియో గెలిలీ. గెలీలియో అంటే టెలిస్కోపును కనుగొన్న శాస్త్రవేత్త అని మనకు గుర్తుకొస్తుంది. అది నిజం. కానీ ఆయన ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురైనా, గృహనిర్బంధం చేసినా ఆత్మవిశ్వాసం కోల్ఫోకుండా తన ప్రయత్నాలను కొనసాగించిన వ్యక్తి గెలీలియో.

ఇటలీ దేశంలోని పీసానగరంలో గెలిలియో 1564 ఫిబ్రవరి 15న జన్మించాడు. చిన్న తనంలో చిన్న చిన్న కొయ్యబొమ్మలు, అట్ట బొమ్మలు వివిధ ఆకారాల్లో తయారు చేయడం చూసి ఇతని తండ్రి ‘విన్సినోజో’ గెలీలియోను పీసా విశ్వవిద్యాలయంలో ‘వైద్య శాస్త్రం’ లో చేర్పించారు. అది ఐరోపా అంధయుగం నుండి వెలుగులోనికి వస్తున్న కాలం. న్యూటన్ బర్గ్ కృషి వల్ల అచ్చు యంత్రాలు, తద్వారా వచ్చిన పుస్తకాలను కొనియాడుతున్న కాలంలో గెలీలియో తను కూడా ఏదైనా కొత్త ఆవిష్కరణ చేసి అందరిచేత ప్రశంసలు పొందాలని భావించాడు. పీసా విశ్వవిద్యాలయంలోనే తొలి ఆవిష్కరణ చేశాడు. పీసా కేథడ్రల్ (చర్చి) లోని ఊగుతున్న దీపాలను పరిశీలించాడు. ఆ దీపాలు చేసే చలనాలు క్రమబద్ధంగా వున్నాయని, అలా ఊగుతున్నప్పుడు ఊగే దూరం తగ్గినా, పెరిగినా దానికి పట్టే సమయంలో మార్పులేదని తన నాడి కొట్టకోవడం ద్వారా అర్థం చేసుకొన్నాడు. దీని ఆధారంగా పెండ్యులమ్ సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు. నాడి కొట్టుకోవడం, గుండెకొట్టుకోవడం వంటి విషయాలను గమనించి 'పల్స్ మీటర్' రూపొందించాడు. ఇది వైద్యులకు చాలా ఉపయోగపడుతున్నది. ఒక దారం కొసన బంతిని కట్టి అది ఊగుతున్నప్పుడు చేసే చలనాల వలన ‘లఘు లోలకం సిద్దాంతాల’ ను నిరూపించాడు.

26 సం. వయస్సుకే గెలీలియో భౌతిక శాస్త్రం, గణితంపై ఉన్న ఆసక్తితో వైద్యశాస్త్రాన్ని కాదని పీసావిశ్వవిద్యాలయంలో గణిత శాస్త్ర ఆచార్యుడిగా చేరి అరిస్టాటిల్ ప్రతిపాదనలు పరిశీలించాడు. బరువైన వస్తువులు తేలిక వస్తువుల కంటే ముందే భూమిని చేరుతాయని చెప్పిన అరిస్టాటిల్ సిద్ధాంతం తప్పని ఋజువు చేశాడు. పీసా నుండి గెలీలియో చేసిన పరిశీలన, 1590 లో రాసిన ‘Peirta' పుస్తకం అరిస్టాటిల్ తప్పును వెలుగులోకి తెచ్చాయి. అప్పట్లో అరిస్టాటిల్ ఎంతమేధావో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ప్రతిపాదనలను ధైర్యంగా తిరస్కరించడం ఫలితంగా పీసావిశ్వ విద్యాలయంలో ఉద్యోగం ఊడింది.

1592 లో పడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ఆచార్యుడుగా చేరాడు. ఇక్కడ 18 సం. లు పనిచేసి మంచి శాస్త్రవేత్తగా గుర్తింపుపొందాడు. 1604 లో అంతరిక్షంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని గమనించి సూర్యకుటుంబానికి అవతల ఒక స్థిరమైన నక్షత్రంగా నిరూపించాడు. 1606 లో ‘జ్యా మెట్రికల్ మిలిటరీ కాంపస్’ అనే యంత్రాన్ని తయారు చేసి దీని సహాయంతో గుణకార, భాగహారాలను త్వరగా చేయడానికి ఉపయోపయోగించాడు.

1608 లో ఉచ్కు చెందిన లిప్పర్ షే ఒక గొట్టం చివర రెండు కంటి అద్దాలు బిగించి, దూరపు వస్తువును చూస్తే అది దగ్గరగా తలక్రిందులుగా కనిపిస్తుందని గుర్తించాడు. ఈ విషయం 1609 లో గెలీలియోకు తెలిసి దీని ద్వారా పరిశీలనలు చేసి ‘టెలిస్కోపు' రూపొందించాడు. ఇది సామాన్యుడికి వింతగా తోచి ఒక నెలరోజుల దీనిపై చర్చలు విస్తృతంగా జరిగాయి. A సహాయంతో స్థిరంగా వుండే నక్షత్రాలు, కంత సాయంతో కనబడని పాలపుంతల గురింని వివరించాడు. జూపిటర్ గ్రహానికి ఉన్న ఉపగల శుక్ర గ్రహం, సూర్యునిలోని మచ్చలు సూర్యభ్రమణం, చంద్రభ్రమణం మొదలగు విషయాలు తెలిపాడు. అప్పటికే కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాధించాడు. అను వరకు మతగ్రంథాలు చెబుతున్న భూకేంద్రక సిద్ధాంతాన్ని తన ప్రయోగాల ద్వారా తప్పని రుజువుచేస్తూ కోపర్నికస్ సిద్ధాంతానికి మద్దతు తెలిపాడు.

గెలీలియో అంతరిక్ష పరిశోధనలు, వాటి ద్వారా ఆయన చెప్పే విషయాలు మతానికి విరుద్ధమైనవిగా మత పెద్దలు భావించారు. పైగా ప్రఖ్యాతి గడించిన అరిస్టాటిల్ సిద్దాంతాలు తప్పని అన్నందుకు 1610 లో తాను వ్రాసిన గ్రంథం The Starry Messenger ద్వారా అంతరిక్ష వాస్తవాలను చిత్రించినందుకు పోపు ఆయనకు జైలు శిక్ష వేశాడు. ఆ తర్వాత గెలీలియో యావజ్జీవం గృహనిర్బంధంలో ఉంచాడు. తన చివరి రోజుల్లో ఆయన చూపునుకోల్పోయాడు అధిక ఇబ్బందుల మధ్య 1642 జనవరి 8 న గెలీలియో కన్నుమూశాడు.

ఈ విధంగా వాస్తవాలు చెప్పినందున ఒక వైపున బ్రూనోను సజీవ దహనం చేసిన ఆ నాటి వ్యవస్థ గెలీలియోను కూడా హింసించింది.

ఆయన కనుగొన్న టెలిస్కోపు వలన ఖగోళశాస్త్రం అనంతమైన ఎదుగుదలను సాధించింది. ఈ రోజు చాలా పాఠశాలల్లోను ప్లానటేరియంలలో ఉపయోగిస్తున్నారు. తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కూడా గెలీలియో టెలిస్కోపు నమూనాను ప్రదర్శిస్తున్నారు.

డా. రుక్మాబాయి

rukmabaiసమాజం ఉన్న స్థితి నుండి మెరుగైన స్థితికి మార్పుచెందాలి. ఆలా లేదంటే ఆ సమాజ సంస్కృతిలో ఏదో లోపముంది.  వైద్యశాస్త్రాన్ని అభ్యసించి భారతదేశంలో ప్రాక్టీసు పెట్టిన లేడీ డాక్టరు రుక్మాబాయి సమాజ సోకడలను ఎదిరించి భరతదేశంలో ఓ చట్టం రూపుదిద్దుకుంటానికి కారణమైన ధీరురాలు.

జననం: నవంబరు 22, 1884

మరణం: సెప్టెంబరు 25, 1995 (వయస్సు 90 సం. రాలు)

జననీ జనకులు: జనార్దన్ పాండురంగ్ సుతార్, జయంతీబయి

1884-88 మధ్య భారతదేశంలో స్త్రీలు చదువుకుంటానికి సమాజం అంగీకరించేది కాదు. వివాహమైన స్త్రీ భర్తకు స్వంత ఆస్థిలాగా భావించబడేది. అటువంటి కాలంలో రుక్మాబాయి జనార్దన్ పాండురంగ్ సుతార్, జయంతీబాయి దంపతులకు జన్మించింది. మరాఠీ మాతృభషగా గల కుటుంబం వారిది. ఆమె రెండేళ్ళ వయస్సులో తండ్రి మరణించాడు. ఆ రోడుల్లో శూద్దుల్లో భర్త మరణిస్తే భర్య తిరిగి వివాహంచేసుకునే హక్కువుంది. అందుచేత జయంతీబాయి సఖారాం అర్జున్ రౌత్ అనే డాక్టరుని తిరిగి వివాహం చేసుకుంది. డాక్టరు సఖారాం అర్జున్ తన మొదటి భార్య మరణించడంతో అప్పటికే అరేళ్ళ నుండి వితంతు జీవితం గడువుతున్న జయంతీబాయిని చూశాడు. స్వయంగా సమాజ సేవకుడు, ఆదర్శభావాలు కలిగిన యువకుడైనందున ఆమెను వివాహం చేసుకున్నాడు.

బాల్యవివాహాలు ముమ్మరంగా సాగుతున్న కాలం అది. తల్లి తన ద్వితీయ వివాహం జరిగిన రెండున్నర ఏళ్ళకు, కూతురు రుక్మాబాయి 11 ఏళ్ళ వయస్సులో 19 ఏళ్ళ దాదాజీ భికాజీ అనే యవకుడికియిచ్చి వివాహం చేసింది.  మరొక విశేషం ఏమిటంటే ఆ రోజుల్లో వున్న సంప్రదాయానికి భిన్నంగా భికాజీ ఇల్లరికం రావాలని డా. లఖారాం అర్జున్, జయంతీబాయి యిరువురూ షరతు వధించారు. సఖారాంకి వున్న ఆస్థులను దృష్టిలో పెట్టుకుని భికాజీ అంగీకరించాడు, పైగా అప్పటికే జులాయిగా తిరిగే వాడికి తేరగా వచ్చిన సంపద అనుభవించడానికి అభ్యంతరం ఎందుకుంటుంది? అయితే డా. సఖారాం అల్లుడు చదువుకుకొని మంచివాడిగా మారాలని ఆశించాడు.

ఇంతలో రుక్మాబాయి యుక్తవయస్సు రాలైంది. కానీ భీకాజీ రుక్మాబాయితో సంసార జీవితం సాగించడానికి డా. సఖారాం అర్జున్ వ్యతిరేకించాడు. రుక్మాబాయి చదువుకొని ఇరవైఏళ్ళు నిండేదాక సంసారం చేయడం సరికాదని ఆయన భావించాడు. రుక్మాబాయి తన సమతి తండ్రి కోరికను తీర్చాలని నిశ్చయించుకుని ఇంటి వద్దనే చదువు కొనసాగించింది. దగ్గర్లో వున్న చర్చి మిషన్ లైబ్రరీ నుండి చదువుకు కావలసిన పుస్తకాలను ఉచితంగా తెచ్చుకుంది. ఆమె సవతి తండ్రి యింటికి అనేక మంది ఆదర్శవాదులు, సంఘసంస్కర్తలు వచ్చేవాళ్ళు. వారిలో స్త్రీలకు హక్కులుండాలను వాదించే విఘ్ణశాస్త్రీ పండిట్ ఒకరు. ఆయన రుక్మాబాయిని బాగా ప్రోత్సహించేవారు.

12 ఏళ్ళ రుక్మాబాయి చదువు మీద ధ్యాస నిలిపి భర్తతో కాపురానికి నిరాకరించింది. దానితో కుపితుచైవ దాదాజీ భికాజీ ఇంట్లో నుండి వెళ్ళిపోయి తన మేనమామ వారాయణ్ ధుమాజీ యింటికి వెళ్ళివోయాడు. పైగా అప్పులు చేసి జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత రుక్మాబాయికి వచ్చే ఆస్తి మీద కన్నువేసి 1884 మార్చిలో తన భార్యని కాపురానికి పంపాల్సిందేనని కోర్టునోటీసు ఇచ్చాడు. అతడికి చాక్, వాకర్ అనే యిరువురు యూరోపియన్లు లాయర్లు కాగా రుక్మాబాయి వైపు వాదించడానికి పేన్ గిల్బర్ట్ అన్ యూరోపియన్ లాయర్ నీ, సయానీ అనే భారతీయుడ్నీ డా. సఖారాం నియమించాడు. ఆ రోజుల్లో ఈ వివాహ వివాదానికి చెందిన కేసు ‘భికాజీ Vs రుక్మాబాయి 1885’ కేసుగా సుప్రసిద్దం. ఈ కేసు విచారించిన న్యయాధికారి రాబర్ట్ హిల్ పిన్హే, ఆంగ్లచట్టం భార్యాభర్తల సమ్మతిపైనే కాపుకం సాగాలని పేర్కొనలేదని తప్పుపడుతూ, హిందూ చట్టంలో కూడా యిటువంటి కేసు ఇంతకు ముందు జరిగినట్లు ప్రమాణం లేదని పేర్కొంటూనే ఆసహాయ బాల్య స్థితిలో రుక్మాబాయి పెళ్ళిపీటల మీదకెక్కినందురు ఆమెను బలవంతంగా అత్తగారింటికి పంపడం కుదరదని తీర్పుచెప్పాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయన పదవీ విరమణ పొందాడు.

ఈ తీర్పుని భారతీయ పత్రకలు దుమ్మెత్తిపోశాయి. స్వాతంత్య్ర సమరసేనాని బలగంగాధర్ తిలక్ హిందూమతం ప్రమాదంలో వుందని వ్యాసాలు రాశాడు. అదే సమయంలో రుక్మాబాయి నిర్ణయాన్ని సమర్థిస్తూ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో అనేక వ్యాసాలు ఒక మారు పేరుతో వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఆ వ్యాసకర్త రుక్మాబాయియే అని వెల్లడయింది. ఇంతలో భికాజీ తిరిగి పెట్టిన కేసు విచారణకు వచ్చి అప్పటి న్యాయనిర్ణేతలు ప్రధాన న్యాయమూర్తి సర్ ఛార్లెస్ సార్జెంట్, న్యాయమూర్తి యఫ్. హెట్ బేలే ఇరువురూ భికాజీ వాదన అంగీకరించి రుక్మాబాయి వాదన చల్లనేరదని తీర్పుయిచ్చారు. ఈ తీర్పు 18 మార్చి 1886 లో రాగా తిరిగి మార్చి 4, 1887 లో న్యాయమూర్తి ఫరన్ రుక్మాబాయి కాపురానికి వెళ్ళవలసిందేనని వెళ్ళకపోతే అర్నెలలు జైలుకి వెళ్ళనలసిందేనని తీర్పు చెప్పాడు. ఈ తీర్పుని బాలగంగాధర్ తిలక్ తో సహా భారతదేశంలోని చాలామంది నాయకులు సమర్ధించారు. మాక్స్ ముల్లర్ అనే భాషాశాస్త్రవేత్త వ్యతిరేకించాడు. రుక్మాబాయి ‘తాను జైలుకి వెళ్తాను గాని అత్తగారింటికి పోనని’ భీష్మించి తనకు న్యాయం చేయాల్సిందిగా రాణి విక్టోరియాకు విన్నపం పంపుకుంది. కేసు పూర్వపరాలు విచారించిన రాణి విక్టోరియా రుక్మాబాయిని సమర్దిస్తూ వివాహాన్ని రద్దుచేసింది. అయితే అప్పటికే రుక్మాబాయి 17 సం|| వయస్సున్నప్పుడు ఆమె తల్లి జయంతీబాయి మరణించింది. ఈ ఇంతకాలం ఆమెను సమర్థించిన సవతి తండ్రి భికాజీతో సంధిచేసుకుని వివాహం రద్దుచేసుకోవాలని భావించి జూలై 1888 లో రెండు వేల రూపాయలు చెల్లించి వివాహం రద్దు చేయించాడు. ఈ న్యాయపోరాటం ఎన్నో పత్రికలను, ప్రముఖులను ఆకర్షించింది. ప్రఖ్యాత కవి రడ్ యార్డ్ కిప్లింగ్ లాంటి వాడు కూడా ఈ కేసుని ఎంతో శ్రద్ధతో అనుసరించాడు. చివరకు ఈ న్యాయపోరాటం కాపురం చేయాల్సిన వయస్సుని భారతదేశం మార్చివేసింది. బ్రిటిష్ ఇండియాలో చేసిన ఈ చట్టాన్ని ‘వివాహ సమ్మత వయస్సు చట్టం 1891 (Age of Consent 1891)’ గా పిలిచారు.

రుక్మాబాయి చదివుకుంటానికి ఆమెకు శివాజీరావు హొల్కర్ (ఇండోర్ మహారాజు) తో సహా అనేక మంది అనేక విరాళాలు