హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / సైన్స్ గమనంలో మైలు రాళ్ళు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సైన్స్ గమనంలో మైలు రాళ్ళు

విజ్ఞాన శాస్త్రములలో కాలాక్రమంగా వివిధ సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు

atlasసంవత్సరం 1570

భౌగోళిక అట్లాసు ముద్రణ. వివిధ దేశాలతో దాని రీసెర్చ్ చేసుకోవడం.

సంవత్సరం 1572

కేథలిక్కులు, ప్రొటెస్టంట్లు అంటూ క్రైస్తవులు రెండు వర్గాలుగా విడిపోయాక వేలాది మంది ప్రొటెస్టంట్లను కేథలిక్కు నాయకుడు కేథరిన్ డిమెడిసిస్ ఉచకోత కోయించడం.

సంవత్సరం 1574

ఉల్సె ఆల్డోవాండ్రె అనే సాంప్రదాయ వైద్యుడు వృక్షాలు, మూలికల ద్వారా వైద్య విధానాలను, కషాయాలను తయారు చేసే విధానాలను ప్రచురించడం.

tychobraheసంవత్సరం 1576

టైకో బ్రాహి (Tycho Brahe) అనే డెన్మార్క్ ఖగోళ శాస్త్రవేత తోలిసారిగా తన ఖగోళ దర్శిని (Observator)నీ రూపొందించి విశ్వాంత రాళాల్లోకి నక్షత్రాల, గ్రహాల గమనాలను తిలకించడం, అరిస్టాటిల్ చెప్పిన విశ్వనిర్మాణాన్ని ఆయన ఖండించడం.

సంవత్సరం 1577

సిక్కుల నాల్గవ గురువు రామదాసు అమృతసర్ లో సిక్కుల పురమందిరాన్ని స్థాపించడం.ramadas

సంవత్సరం 1580

వయొలిన్ అనే సంగీత సాధనం రూపకల్పనకు ఫిడేలు దోహదపడడం.

సంవత్సరం 1582

పాత జూలియన్ క్యాలండర్ స్థానంలోకి నేడు మనం వాడుతున్న గ్రెగెరియన్ క్యాలండర్ రావడం.

సంవత్సరం 1583

డచ్ యాత్రికుడు యువాన్ హువా భారతదేశంలోని గోవాను చేరుకోవడం. ఈస్ట్ ఇండియా వారి రాకకు పరిస్థితులను సుగమం కావడం.

సంవత్సరం 1589

విలియం లీ అనే బ్రిటీషు శాస్త్రవేత్త తొలిసారిగా కుట్లు, అల్లికలకు వీలయ్యే స్టాకింగ్ చక్రాన్ని రూపొందించడం.

సంవత్సరం 1590

తొలిసారిగా ఫ్లష్ టాయిలెట్ ను బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ హారింగ్ టన్ రూపొందించడం.

సంవత్సరం 1590

జర్మనీ దేశంలో బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికితీసే ప్రక్రియ కొనసాగడం.

క్రీ.శ. 1600

 • giordanobrunoఇటలీ తాత్వికుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు బ్రూనో (Giordano Bruno 1548 - 1600) ను పరమ పాశవికంగా సజీవ దహనం చేయడం. ఆయన చేసిన నేరం భూమి చుట్టూగ్రహాలు కాకుండా, సూర్యుని చుట్టూ భూమి తదితర గ్రహాలు తిరుగుతున్నాయని ప్రచారం చేయడం.
 • విలియం గిల్ బర్ట్ రిమాగ్నటి అనే ఆంగ్లేయ భౌతిక శాస్త్రవేత్త అయస్కాంత లక్షణాల్ని అవిష్కరించండం.భూమికూడా అయస్కాంతమని రుజువు చేయడం.
 • ఇరాక్ తదితర పశ్చిమ ఆసియా దేశాల్లో స్త్రీలే వ్యవసాయాన్ని ఉధృతం చేయడం.

క్రీ.శ. 1601

మనం స్వేచ్చగా ఉన్నప్పుడు వేసుకొనే పైజామాల రూపకల్పన పశ్చిమదేశాల్లో జరగడం.

క్రీ.శ. 1603

జోహన్ బాయర్ అనే జర్మనీ దేశపు ఖగోళ శాస్త్రజ్ఞుడు నక్షత్రాలకు పేరు పెట్టే ఆధునికgalileo పద్దతికి పునాది వేయడం.

క్రీ.శ. 1608

గెలిలియో తో పాటు డచ్ శాస్త్రజ్ఞుడు హాన్స్ లిప్పర్ షీ అనే భౌతిక శాస్త్రవేత్త కూడా ఖగోళ దూరదర్శనిని కనుగొనడంలొ పాల్గొన్నాడు. (స్వతంత్రంగా) అయితే లిప్పర్ షీ దాన్ని వాణిజ్య పరం చేసేందుకు పేటెంటు కోసం దాచుకున్నాడు. ఈ లోగా తాను కనుగొన్న దూర దర్శినిని (Telescope)ను గెలీలియో ప్రజలకు వెల్లడి చేశాడు. దాని సాయంతో జూపిటర్ గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను కూడా గెలీలియో ఆవిష్కరించాడు.

keplerక్రీ.శ. 1609

జర్మనీ ఖగోళ శాస్త్రవేత్త కెప్లర్ గ్రహ గతులకు సంబంధించిన రెండు ముఖ్యమైన సిద్దాంతాలను ప్రతిపాదించాడు. అవి నేటకీ కెప్లర్ నియమాలు (Keplers Laws of Planetary Motion) పేరుతో చలామణిలో వున్నాయి.

క్రీ.శ. 1610

 • galilioప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో తాను నిర్మించిన నూతన దూరదర్శిని (Telescope) సాయంతో జూపిటర్ గ్రహానికి ఉన్న నాలుగు ఉపగ్రహాల్ని (Moons) గుర్తించారు.
 • సిజేరియన్ ఆపరేశన్ ద్వారా బిడ్డల్ని బయటకి తీసే పద్దతిని పుస్తకీకరణ చేశారు.

క్రీ.శ. 1614

స్కాటిష్ దేశస్తుడైన జాన్ నేపియర్ స్వతంత్రంగా సంవర్గమానాల్ని రూపొందించాడు.

క్రీ.శ. 1619

 • 1609లో రెండు గ్రహగమన సిద్దాంతాల్ని ఆవిష్కరించిన కెప్లర్ 1619లో తన గ్రహగతి సిద్దాంతాల్లోని నూరవదైన సౌష్టవ సూత్రాన్ని ప్రకటించాడు.
 • స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ప్రతిపక్షం చేసిన ప్రతిపాదనను బ్రిటీష్ ప్రభుత్వం తిరస్కరించింది.

క్రీ.శ. 1620

ఫ్రాన్సిస్ బేకన్ వ్రాసిన “నోవమ్ ఒర్గానమ్” అనే పుస్తకం బాగా ప్రచారం పొందింది. ప్రకృతి జ్ఞానాన్ని మానవ సమాజానికి ఏ విధంగా వాడుకోవాలో ఆయన తన పుస్తకాల్లో ప్రస్తావించారు.

క్రీ.శ. 1620

మాంచెస్టర్ లో తొలిసారిగా ప్రత్తిని ప్రోసెసింగ్ చేయడం మొదలు పెట్టారు.

క్రీ.శ. 1621

స్నెల్ అనే డచ్ శాస్త్రజ్ఞుడు కాంతి వక్రీభవన ధర్మాన్ని ప్రతిపాదించాడు. కాంతి గాలిలో నుంచి గాజులాంటి సాంద్రతర యానకంలోకెళ్ళేటప్పుడు పతనకోణం కన్నా వక్రీభవన కోణం తక్కువని ఋజవు చేశాడు. ఈ రెండు కోణాలు సైను (Sine) నిష్పత్తికి సమానమన్నాడు.

క్రీ.శ. 1623

బ్రిటిష్ దేశంలో పేటెంటు హక్కులకు చట్టబద్దత కల్పించారు.

williamharveyక్రీ.శ. 1628

విలియం హార్వే అనే బ్రిటిష్ శాస్త్రవేత్త రక్తప్రసరణ వ్యవస్థ గురించి సవివరంగా తెలియజేశారు.

క్రీ.శ. 1630

సింకోనా చెట్టు బెరడును కషాయం చేసి మలేరియా జబ్బు నివారణకు వాడడం (దీనిలో క్వినైన్ రసాయనిక ఆల్కలాయిడ్ ఉన్నట్టు తర్వాత తెలిసింది).

క్రీ.శ. 1632

కోపర్నికస్ సిద్ధాంతాన్ని గెలీలియో అనే ఇటలీ శాస్త్రవేత్త బలపరిచారు. అతనితో మత పెద్దలు వాదనకు దిగారు.

copurnicusక్రీ.శ. 1633

విలియం ఆటెలెడ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త స్లైడ్ రూల్ (Slide Rule) అనే సాధనాన్ని రూపొందించాడు. దీని సాయంతో గుణకారం, భాగహారం, కూడికలు, తీసి వేతలు సులభమయ్యాయి.

క్రీ.శ. 1635

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘బోస్టన్ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం (అమెరికా)

క్రీ.శ. 1637

జాన్ గ్రీవ్స్ అనే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్త భారత దేశం, చైనా వంటి దేశాల్లో 2 సంవతేసరాలు గడిపి ఎన్నో ఖగోళ సంబంధ రాశులను లెక్కించారు. నేటికీ ఆ రాశుల్ని ఆమోదిస్తున్నారు.

క్రీ.శ. 1639

బ్రిటీష్ ఖగోళ శాస్త్రవేత్త జెరిమి హొరాక్స్ సూర్యునిపై వీనస్ విన్యాసాన్ని (Transit of Venus) తొలుత కనుగొన్నాడు.

barometerక్రీ.శ. 1643

ఎవాంజిలిస్టా టోరిసెల్లి అనే ఇటలీ శాస్త్రవేత్త పాదరస భారమితి (Mercury Barometer)ను రూపొందించాడు.

క్రీ.శ. 1644

లెనెడెస్కార్టెస్ సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరగడానికి కారణం సూర్యుడి దగ్గర ఖగళ సంబంధమైన సుడిగుండం అని సిద్ధాంతీకరించాడు. ఈథర్ అనే ద్రవం విశ్వం అంతా వ్యాపించి ఉందని అప్పుడు నమ్మేవారు.

digestivesystemక్రీ.శ. 1648

జాన్ బాప్టిస్టావాన్ హిల్మంట్ అనే రసాయనిక శాస్త్రవేత్త, జీర్ణక్రియ మొత్తం రసాయనిక చర్యల సమాహారమేనని ఋజువు చేశాడు. శరీరంలో ఎన్నో ధర్మాలు రసాయనికమైనవేనని ప్రతిపాదించాడు.

క్రీ.శ. 1650

నేటి క్రికెట్. బేస్ బాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి బంతి, బ్యాట్ సంబంధిత ఆటలన్నింటికీ మూలమైన షింటీ అనే ఆటను స్కాట్ లాండ్ లో ధనికులు ఆడడం మొదలు పెట్టారు.schote

క్రీ.శ. 1650

గాజు సీసాల ఉత్పత్తి అధికం కావడంలో పాటు వాటికి చెక్క బిరా పెట్టవచ్చని గుర్తించాక మధుపానాల వ్యాపారం వృద్ధి.

క్రీ.శ. 1677

జూహన్నెస్ కెప్లర్ గ్రహ గమన సూత్రాన్ని మరింత పకడ్బందీగా ప్రతిపాదించాడు.

ప్రియమైన బాలలూ,

గత1a.jpg సంచికలో టోలామీ చెప్పిన భూకేంద్ర సిద్ధాంతాన్ని, కోపర్నికస్ ప్రశ్నించిన ఘట్టం వరకు చెప్పుకున్నం ఆ తరువాత ఘటనలను తెలుసుకుందాం.

క్రీ.శ. 130

(SORANUS) సొరానస్ అనే గ్రీకు వైద్యుడు చిన్న పిల్లల, గర్భిణీ స్త్రీల వ్యాధుల గురించి విశేష కృషి చేసాడు. బాలింతలు చిన్న పిల్లల పట్ల తీసుకోవాలిసిన జాగ్రత్తల గురించి సూచించాడు. ఈయన ప్రతిపాదించిన ఆరోగ్య సూత్రాలు దాదాపు 1500 సం.ల పాటు ప్రజలు పాటించారు.

క్రీ.శ. 140

(ARETAEUS)అరిటాస్ శ్వాసకు సంబంధించిన ఆరోగ్యం ఎలా పనిచేస్తుందో ఇతడు గుర్తించాడు.

క్రీ.శ. 160

గాలెన్ (Galen) అనే గ్రీకు దేశపు మానవ శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు విశేష కృషి, చేసాడు. మధ్య యుగాల వరకు ఈయన తెలిపిన విషయాలే శరీర నిర్మాణంను గురించి తెలుసుకొనుటకు మూల ఆధారాలుగా నిలిచాయి. “తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేని వైద్యుడు ఇతరుల ఆరోగ్యాన్ని ఏం కాపాడతాడు” అని ప్రజలు భావిస్తారని గాలెన్ చెపుతుండేవాడు.

మానవుడు తిన్న ఆహారం కాలేయంలో రక్తంగా మారుతుందని, ఆ రక్తం, రక్తనాళాల ద్వారా ప్రవహించి గుండెకు చేరుకొని, అక్కడ నుండి (Diaphragm) ఉదరవితానం ద్వారా కుడి నుండి ఎడమ వైపుకు పోతుందని అక్కడ నుండి శరీరంలోకి మాయమవుతుందని ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం రక్తం వలయాకారంలో ప్రసరించదు.

16వ శతాబ్దంలో విలియం హార్వే ప్రయోగ పూర్వకంగా ప్రసరణ వలయాకారంగా జరుగుతుందని ఋజువు చేసే వరకు అంటే సుమారు 1400 సంవత్సరాలు పాటు గాలెన్ ప్రతిపాదనలనే నమ్మారు.

క్రీ.శ. 165

మధ్యధరా ప్రాంతంలో 15 సం,,ల పాటు మశూచీ, (దీనిని కూడా ప్లేగు అనే వారు) దాదాపు 75% జనాభాను కబళించి వేసింది.

క్రీ.శ. 200

నివాస ప్రాంతాలను కలుపుతూ సుమారు 80 వేల కిలోమీటర్ల పొడవు రహదారులను రోమ్ దేశంలో నిర్మించారు. తద్వారా సామాజిక, వాణిజ్య సంబంధాలు మెరుగు పడటమే కాకుండా, జంతు, పశు పక్షాద్యుల జీవన విధానం సుఖప్రదమైనది. భారతదేశంలో బౌద్ద మతానికి చెందిన నాగార్జునుడు మాధ్యమిక అనే ఆలోచనా విధానం ద్వారా శూన&య భావనను (Empty Ness) ను ప్రస్తావించాడు.

క్రీ.శ. 206

వ్యవస్థీకృత1b.jpg మురుగు కాలవల ఏర్పాటుతో మొదటిసారిగా రోమ్ నగరంలో, స్నానపు గదులు, పాయఖానాలను నిర్మించారు.

క్రీ.శ. 370

(St.Basil) సెయింటోబాసిల్ కుష్టివ్యాధితో బాధపడే వారికోసం ఆసుపత్రులను ఏర్పాటు చేసాడు. అప్పటి దాకా ఈ వ్యాధిగ్రస్తులను, లోయలలో పడవేయటం ద్వారా సమాజ బహిష్కరణ చేసేవారు.

క్రీ.శ. 397

రోమ్ దేశంలో ఫెబీయోలా అనే మహిళ తొలిసారిగా ఉచిత ప్రజా వైద్యశాలను ప్రారంభించింది. ఈ స్పూర్తితోనే, పలు దేశాలలో ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ఏర్పడ్డాయి.

క్రీ.శ. 400

1c.jpgదక్షిణ అమెరికా సముద్రతీరానికి 2200 మైళ్ళ దూరంలో ఉన్న ఈస్టర్ ద్వీపాలలో పాలినేషియన్ల వలసలు వెళ్ళారు. నేటికి సంభ్రమాశ్చర్యాలను గొలిపే మానవ శిలా రూపాలను, అగ్ని పర్వతరాళ్ళను చెక్కి తయారు చేసారు. అయితే ఈ శిలలు క్రీ.శ. 400 శతాబ్దం నాటివి కావని, ఇవి పైలోకాల నుండి అదే రూపంలో ఎన్నో లక్షల సం,,రాల నుండి ఈస్టర్ ద్వీవులలోవున్నాయని కొందరు అశాస్త్రీయవాదులు, పరిణామవాదాన్ని వ్యతిరేకించేవారు కట్టు కథలు అల్లుతున్నారు.

క్రీ.శ. 400

దక్షిణ భారత దేశంలో మహాయాన బౌద్దమత వ్యాప్తి జరిగింది. విగ్రహారాధననూ, దైవభావననూ వ్యతిరేకించే మీమాంస బలపడింది. ఇది బౌద్దమత వ్యాప్తిలో ఉచ్ఛస్త దశ అనవచ్చు. అయితే క్రమేపీ హేతువాదాన్ని వ్యతిరేకించే కొందరూ హిందుమత ఛాందసులు బౌద్దమతం పైదాడి ప్రారంభించారు.

క్రీ.శ. 402

భారతదేశంలో చైనా సందర్శకుడు ఫాహియాన్ రావడంతో, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. బౌద్దమతములోని ఎన్నో హేతువాద దోరణులను ప్రతిభింభించే సంస్కృత భాషా పుస్తకాలను ఫాహియాను తనవెంట వెంట తీసుకెళ్లి అక్కడ అనువదించాడు.

క్రీ.శ. 415

ప్రపంచ వైజ్ఞానిక శాస్త్ర చరిత్రలో ఒకటి చీకటి సంవత్సరము ఇది. అశాస్త్రీయ చాంధసవాదుల సంస్కృతిని ప్రతిభింభించిన ఘటన ఈ సంవత్సరం జరిగింది. అది అలెగ్జాండ్రీయా నగరం, గ్రీకు, ఈజిప్టు మేధావి గొప్ప భౌతిక గణిత శాస్త్ర బోధకురాలు హైపేషియా అప్పటికే ఎన్నో శాస్త్రీయా ప్రచార కార్య క్రమాలలో పాల్గొంది. చాందస భావాలను వ్యతిరేకించినది. ప్రయోగ ఫలితాల ద్వారా ఋజువు కాబడిన దానినే నమ్మాలని ప్రచారం చేసేది. మత భావాలకు ఈమె తన యొక్క భౌతిక గణిత శాస్త్ర ప్రచారంతో ప్రజాస్వామికాన్ని శాస్త్రీయ దృక్ఫధం పెంపొందించుతుండటంతో అసహానులైన మత చాందసులు ఈమెను నడిరోడ్డు పై పట్ట పగలే బ్రతికుండగానే గవ్వలతో ఆమె దేహాన్ని చెక్కి చంపారు

క్రీ.శ. 480

భారతదేశంలో శాస్త్రాన్ని అడ్డుకోవడానికి హిందూమత ప్రచారకులు, తాంత్రిక పద్ధతులను వ్యాప్తి చేశారు. కొన్ని పనులు ఎడమ చేతితో, మరికొన్ని పనులు కుడి చేతితో చేయాలనీ రకరకాల ఆచారాలను, పద్దతులను, మూఢనమ్మకాలను వ్యాప్తి చేశారు.

క్రీ.శ. 500

భారతదేశం, శ్రీలంక దేశాలకు, మధ్య భూమార్గం బదులుగా సముద్రమార్గం వాణిజ్యం ప్రారంభమైనది.

క్రీ.శ. 500

1d.jpgకొరియా దేశం నుంచి జపాను దేశానికి భౌధ్ధమత ఆసోచనలు, భౌద్ధమత ప్రచారం, జరిగింది. అంత వరకు జపాను దేశంలో ప్రజలు అతీంద్రీయ శక్తుల్ని నమ్మేవారు.

క్రీ.శ. 500

1e.jpgపశ్చిమ ఐరోపాలో వ్యవసాయ పనులకు ఇనుప పనిముట్లు, ఇతర వ్యవసాయ, పనిముట్లు వాడనారంభించారు.

క్రీ.శ. 500

మొదటి సారిగా ఐరోపాలో సబ్బు తయారీ అయితే ఈ సబ్బుని కేవలం బట్టలు ఉతకడానికి మాత్రమే వాడేవారు. స్నానాల సబ్బు అప్పటికి ఇంకా తయారీ కాలేదు. క్రీ.శ. 510 :- చైనా దేశంలో తొలిసారిగా వ్రాత పేజీలను ఒత్తలుగా చేసి దళసరి అట్టలతో బైండింగ్ విధానమును ప్రవేశపెట్టారు.

క్రీ.శ. 512

చెట్ల పసరు,.బెరడు, వేర్లు, కాయరసాలు, గింజలు, ముట్టెలు, ఆకులు , పుష్పాలు, తదితర వృక్షసంబంధ ద్రవ్యాలతో ఔషదాలుగా పనికివచ్చే దాతువులున్నాయని గుర్తించారు. ఇవి చైనా, భారతదేశాలలో విరివిగా వాడుకలోకి వచ్చాయి.

01.jpgమీరందరూ వేసవి సెలవుల తరువాత మీమీ పాఠశాలలలో కొత్త తరగతులలో ప్రవేశించివుంటారు. ఒక తరగతి తర్వాత మరో తరగతి మీరు వెళుతున్నట్లే విజ్ఞాన శాస్త్రం కూడా ఒక దశ నుంచి మరొక దశకు మార్పు చెందుతూనే వుంటుంది. మానవ సామాజిక చరిత్రలాగే వైజ్ఞానిక శాస్త్ర చరిత్ర కూడా కొంతకాలం పాటు పరిమాణాత్మక మార్పులకు లేనై ఆ తదుపరి ఒక్కసారిగా గుణాత్మక మార్పును సంతరించుకుంటుంది.

02.jpgఇలా గుణాత్మక మార్పును సంతరించుకున్న తర్వాత తిరిగి కొంతకాలం పాటు పరిమాణాత్మక మార్పులు చెంది మళ్లీ కొత్త గుణాత్మక మార్పులను చవిచూస్తుంది. దీనినే గతి తార్కిక భౌతిక వాదం అంటారు. గత నెల మనం సైన్సు గమనంలో మైలురాళ్ళు శీర్షికన క్రీ.శ. 6వ శతాబ్ధారంభమున అడుగిడినాము. ఈ నెల మరికొన్ని మైలురాళ్లను పరిశీలిద్దాం.

క్రీ.శ. 520

04a.jpgబోథియస్ అనే తత్వవేత్త సంగీతానికి సంబంధించి కొంత ప్రవచించాడు. ప్రపంచంలో మూడే రకాల సంగీత సాధనాలున్నాయని అన్నాడు. అవి 1. ప్రకృతి సిద్ధమైన ధ్వనులు (గాలి కదలికలు, సముద్రపు అలలు, జీవ కణాల సహజ ధ్వనులు వగైరా) 2. మానవ జనితం (రాగాలాపన పాటలు, తదితర గాత్ర సంగీత పద్ధతులు) 3. మానవ నిర్మిత సంగీత పరికరాలు (సన్నాయి, వీణ, తబల, గజ్జెలు వగైరా .

క్రీ.శ. 529

ప్రపంచ వ్యాప్తంగా పలువురు తత్వవేత్తలు మత గ్రంథాల రచనలు ప్రారంభించారు చాలా మట్టుక విజ్ఞాన శాస్త్ర వాస్తవాల కన్నా పాలకులకు సంతోషాన్నిచ్చే కథా వస్తువులకు ప్రాధాన్యతనిచ్చారు.

క్రీ.శ. 535

పలు రాజ్యాలలో జెస్టీనియన్ నీతి అనే చట్టం అమలు చేయనారంభించారు. దీని ప్రకారం ఒక స్త్రీ వైవాహికేతర సంబంధాలున్నట్లయితే ఆమెకు మరణశిక్ష విధిస్తారు. కాని అటువంటి నియమం పురుషులకు ఈ చట్ట ప్రకారం లేదు.

క్రీ.శ. 537

కాన్ స్టాంటి నోపుల్ నగరంలో హేగియా సోఫియా అనే అద్భుత కట్టడం నిర్మాణం పూర్తయింది. మొదట్లో చర్చిగా ఉపయోగపడ్డ ఈ నిర్మాణం సుమారు 1000 సంవత్సరాల తర్వాత కాన్ స్టాంటినోపుల్ ను క్రీ.శ. 1453 లో ఒట్టోమాన్ ఆక్రమించుకున్నాక మసీదుగా మార్చబడింది.

క్రీ.శ. 541

మధ్య ఆసియా, ఈజిప్టు చరిత్రలో చీకటి యుగం ప్రారంభం, దాదాపు 25 సం,,ల పాటు ప్లేగు వ్యాధి బారినపడి జనాభాలో సగం మంది మరణించారు. ఒక్క కాన్ స్టాంటినోపుల్ నగరంలోనే కొన్ని రోజుల పాటు రోజుకు పదివేల మంది మృత్యువాత పడ్డారు.

క్రీ.శ. 547

03a.jpgఅలెగ్జాండ్రియా దేశానికి చెందిన కోస్మాస్ అనే వర్తకుడు ఎర్రసముద్రం, హిందూ మహాసముద్రం, తీరాన వున్న దేశాలలో పర్యటించాడు. టోపోగ్రాఫికా క్రిస్టియానా అనే పుస్తకంలో భూమి ఆకృతి గురించి వివరించాడు. బైబిల్ గ్రంథం చెప్పిన విధముగానే భూమి ఆకారాన్ని బల్ల పరుపుగా వున్నట్లు వర్ణించాడు.

క్రీ.శ. 550

తొలిసారిగా ఖగోళశాస్త్రాధ్యయనానికి ఉపయోగపడే ఆస్ట్రోల్యాబ్ అనే పరికరం నిర్మించబడింది. గ్రహాలు, నక్షత్రాల సాపేక్ష విన్యాసం గురించి తెలుసుకోవడానికి ఇది బాగా ఉపకరించేది. అంతేకాదు నావికాయానంలో నావికులకు ఇది దిక్సూచిగా ఉపయోగపడేది.

 1. క్రీ.శ.550 :- చైనా దేశంలో తుపాకీ మందు కనుగొన్నారు.
 2. క్రీ.శ.550 :- చైనీయులు జంతువుల ఆరోగ్య శాస్త్రం అబివృద్ధి పరిచారు. వ్యవసాయ పంటలకు తెగుళ్లు ఆశించడానికి కారణం అతీంద్రియశక్తులు కారణం కాదని క్రిమి కీటకాదులు కారణమని కనుగొన్నారు. వాటి జీవిత చక్కాలను దృష్టిలో వుంచుకొని ఏ కాలంలో ఏ పంట వేయాలో తెలుసుకోగలిగారు.
 3. క్రీ.శ.565 :- ట్రాలెస్ కు చెందిన అలెగ్జాండర్ అనే వైద్యుడు, నైటికీ గుర్తింపు పొందిన వైద్యగ్రంథాన్ని రచించాడు. అది ఆనాడే ఎన్నో భాషలకు అనువదించబడింది.
 4. క్రీ.శ.570 :- ఆధునిక చదరంగం ఆటను భారతదేశంలో రూపొందించారు.
 5. క్రీ.శ.576 :- భారతదేశంలో గణిత శాస్త్రజ్ఞులు సున్నా(0) అనే సంకేతాన్ని అంక గణింతలోకి చేర్చారు. సున్నా వాడకం అమలులోకి వచ్చాక హిందూ-అరబిక్ సంఖ్యామానములు ప్రాధాన్యతను కోల్పోయాయి.
 6. క్రీ.శ.590 :- 05.jpgసెయింట్ గ్రెగరీ అనే క్రైస్తవ మఠాధిపతి సరికొత్త క్యాలండర్ రూపొందించాడు. మనం ప్రస్తుతం వాడే క్యాలండర్ కు చాలా సామీప్యత ఉన్నందున ఈ క్యాలండర్ ను గ్రేగేరియన్ క్యాలండర్ అంటారు.
 7. క్రీ.శ.600 :- సున్నము, సున్నపు రాయి, ప్లాస్టర్ ఆఫ్ పారస్ మిశ్రమాన్ని భవంతుల నిర్మాణాలకు వాడవచ్చునని మెక్సికో దేశంలో కనుగొన్నారు.
 8. క్రీ.శ.600 :- గాలి మరల సహాయంతో నీటిని పైకి తోడే పద్ధతి ఇరాన్ అమలులోకి వచ్చింది. ఈ గాలి మరల సహాయంతో లోతైన బావులు, వాగులలో వున్న నీటిని రైతులు వ్యవసాయ నిమిత్తం వాడటం మొదలు పెట్టారు.
 9. క్రీ.శ.600 :- పెరూ దేశానికి చెందిన నావికులు సముద్రపుటల ప్రవాహాము ఆధారంగా నడిచే నావలను నిర్మించి దక్షిణ మెక్సికోకు ఏ ఇతర యాంత్రిక శక్తిని ఉపగించకుండా వెళ్ళగలిగారు.
 10. ఢంకాలను క్రీ.శ.600 :- 06.jpgజంతు చర్మాలను చర్మాలను ఉపయోగించి, తప్పెటలను తయారు చేయవచ్చునని పర్షియనులు కనుగొన్నారు. క్రమేపీ ఈ పద్ధతి ఆసియా, ఆఫ్రికా ఖండాలకు విస్తరించింది.

క్రీ.శ.600

ఇంగ్లాండులో నేరం చేసిన ఆడవారిని వీధుల్లో శిక్షించే లైంగిక వివక్షత నెలకొంది. అది దాదాపు వేయి సంవత్సరాలు పాటు కొనసాగింది. అయితే పురుషులకు మాత్రం శిక్ష గదుల్లోనే వేసేవారు. అంటే ఆడవారి పట్ల న్యాయవ్యవస్థ నిర్థాక్షిణ్యంగా ప్రవర్తించేది.

క్రీ.శ.607

చైనా దేశంలో ఉత్తర దక్షిణ భాగాన్ని రవాణా సౌకర్యాలతో సంధానించే నైకాయానం అభివృద్ధిచెందింది. రైతులు తాము పండించే పంటను అమ్ముకోవడానికి ఒక చోటునుంచి మరో చోటికి వెళ్లడం సులభమయ్యింది.

క్రీ.శ.629

08.jpgయువాన్ సాంగ్ అనే చైనా బౌద్ధ యాత్రికుడు భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ ఆయన హర్షవర్ధనుడి పాలనను గురించి వివరించాడు.

క్రీ.శ.659

తొలిసారిగా విద్య అనే భారతీయ వనిత (రాజ్యానికి రాణి ) సంస్కృత భాషలో గేయాలను రచించింది.

క్రీ.శ.700

07.jpgగుర్రాల మీద అంత వరకు రౌతులు, అశ్వ సైనికులు నేరుగా ఏ ఆధారం లేకుండా వాటి వీపుల మీద కూచుని నడిపేవారు. గుర్రాలను అదుపు చేయడం కష్టంగా ఉండేది. అయితే క్రీశ,,700 లో రౌతులు సౌకర్యంగా కూచోవడానికి, కాళ్లను బాగా స్థిరంగా ఉంచడానికి, గుర్రాన్ని అదుపులో పెట్టడానికి వీలుగా అశ్వపగ్గాలు రూపొందాయి

క్రీ.శ.700

ఈస్టర్ ద్వీపాల్లో గుండ్రటి మొహలతో వక్షస్థలం వరకు మాత్రమే కనిపించేలా నేలలో మానవ విగ్రహాల్ని పాతారు. అద్భుత అంశాలుగా నేటికీ అవి కొనియాడబడుతున్నాయి.

క్రీ.శ.700 భారతీయ తాత్విక గ్రంథాలయిన ఉపనిషత్తుల మీద ఆదిశంకరాచార్యుడు అద్వైత వాదంలో చర్చించాడు.

క్రీ.శ. 715

09.jpgగ్రేట్ మాస్క్ఆఫ్ డెమాస్కస్ గా ప్రసిద్ధి పొందిన మసీదును నిర్మించారు. తొలిసారిగా పాలరాయిని ఉపయోగించి గాడలు, కిటికీలు, కిటికీ చువ్వలు నిర్మించారు. ఈ నిర్మాణాల్లో ఎంతో సంక్లిష్టమైన రేఖా గణిత సూత్రాలు ఇమిడి వున్నాయి. అంటే మతం సైన్సును వాడుకొనడం తీవ్రమయిందన్నమాట.

క్రీ.శ. 721

ప్రేగ్ నగరాన్ని నిర్మించారు. లిబ్యూస్ అనే యువరాణి ప్రేగ్ నగరాన్ని రూపొందించారని ప్రసిద్ధి.

క్రీ.శ. 730

మూడవ లియో గా పేరు పొందిన సిరియాదేశపు చక్రవర్తి పరిపాలనలో లౌకిక వాదాన్ని ప్రవేశపెట్టాడు. మతం అనేది వ్యక్తిగత నమ్మకాలకు పరిమితం కావాలనీ, బహిరంగ ప్రదేశాల లో మత సంబంధ చిత్రాలు, గుర్తులు, విగ్రహాలు, ఉండకూడదని శాసించాడు. మత నిగ్రహాల తయారీని నిషేదించాడు. ఆర్ధిక రంగంలో నాణేల వినియోగాన్ని విస్తృతపర్చాడు.

క్రీ.శ. 740

10aa.jpgఐరోపా, ఆప్రికా దేశాల మధ్య వాణిజ్య వస్తువుల మార్పిడి వ్యవస్థ బలపడింది. ఆఫ్రికా వాళ్లకు కావలసిన ఉప్పు, తదితర ఆహార పదార్థాలకు ప్రతిఫలంగా ఐరోపా వారికి బంగారు చూర్ణాన్ని ఆఫ్రికా వాళ్లు యిచ్చేవాళ్లు.

క్రీ.శ. 740

డెమాస్కన్ దేశానికి చెందిన సెయింట్ జాన్ అనే కళాకారుడు చర్చిలో బృందగానం కోసం అష్టపది (మనం సప్తపదిగా స,రి,గ,మ,ప,ద,ని,స, అంటాం. దాన్నే సరిగమపదనిస అంటే అష్టపది అవుతుందని వాడాడు.

క్రీ.శ. 750

ఆంగ్లో శాక్సన్ అనే బ్రిటన్ తత్వవేత్త (ది నేచురారిరమ్, అనే సైన్సు పుస్తకాన్ని రచించాడు. ఇందులో భౌతిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు రెండూ వుండేవి . ఆ రోజు ఇది బాలల సైన్సు సాహిత్యంగా పాఠశాలల్లో బోదించేవారు.

క్రీ.శ.760

జబీర్ యిబిన్ హయ్య అనే అరబ్బు రసవాది. పదార్థాలకు మూలం - మూలకాలని వాదించాడు. గ్రీకు తత్వవేత్తలలాగానే మూలకాలను నిర్వచించాడు. అగ్ని, నేల, ఆకాశం, గాలి, నీరు, యివన్నీ ఆయన దృష్టిలో మూలకాలే.

క్రీ.శ. 787

జైజంటైన్ మహారాణి విగ్రహారాధనను ఖండించింది. ఆమె ఆస్థానంలో ఉన్న ఎందరో బిషప్పులు, సనాతనవాదులు విగ్రహారాధనను ప్రోత్సహించేవారు.

క్రీ.శ. 790

జర్మనీ దేశంలో ఏషెన్ నరరంలో అద్భుతమైన పాలెంటైన్ చాపెల్ అనే నిర్మాణం ప్రారంభించారు. ఈ చర్చిలోపల అపూర్వమైన కళా వైభవం నేటికీ కనిపిస్తుంది.

క్రీ.శ. 800

ఐరోపా దేశాల్లో రోమన్ తరహా భవన నిర్మాణాలకు మంచి ప్రాచుర్యం వచ్చింది.

క్రీ.శ. 800

ఐరోపా దేశాల్లో అడవుల ఆవశ్యకతను గురించి, పర్యావరణ పరిరక్షణలో వాతి పాత్ర గురించి ప్రచారం జరిగింది.

క్రీ.శ. 800

అరబ్బు, పర్షియాకు చెందిన నావికులు హిందూ మహాసముద్రంలో నౌకాయానం గురించి ఎన్నో శాస్త్రసాంకేతిక విషయాలను రచించారు. వివిధ ఓడరేవులు, సముద్రతీరాలు, అలల ఉధృతి, గాలి వీచే దిశలు, నిరపాయకరమైన సముద్రమార్గాల గురించి ఈ రచనల్లో విస్త్రుతంగా చర్చించారు.

క్రీ.శ. 800

భారతదేశంలో భువనేశ్వర్ సమీపంలో ప్రసిద్ధి చెందిన హైందవ దేవాలయ నిర్మాణాలు చేపట్టారు. ఈ దేవాలయ నిర్మాణాల్లో సంబ్రమాశ్చర్యాలను గొలిపే కళాసృష్టి జరిగింది.

క్రీ.శ. 800

మధ్యయుగాల్లో పాశ్చాత్య దేశాలలో కనుమరుగవకుండా ఉండేందుకు ఎన్నో గ్రీకు, రోమన్ శాస్త్రసాంకేతిక పరిశోధనా ఫలితాలను అరబిక్, సిరియాక్ భాషల్లోకి అనువాదం చేసి పదిలపరిచారు.

క్రీ.శ. 800

బొగ్గుపొడి, గంథకం, తదితర పదార్థాలను చూర్ణం చేసి గన్ పౌడర్ ను మొట్టమొదట సారిగా చైనా దేశంలో తయారుచేశారు. ఈ రహస్యం ఇతర దేశాలకు , ముఖ్యంగా ఐరోపా దేశాలకు 14 వ శతాబ్దం వరకు తెలియదు.

క్రీ.శ. 810

జబీర్ ఇబిన్ హయ్యా అనే అరబ్బు శాస్త్రవేత్త పదార్థాల తయారీ గురించి వ్రాసిన “The Book of the Composition of Alchemy” అనే పుస్తకం బహుళ ఆదరణ పొందింది. జబీర్ ఇబిన్ హయ్యా అరబ్బు రసవాద పితామహుడు (father of the Arabic Alchemy) అని ప్రస్తుతించేవారు.

క్రీ.శ. 813

బెన్ షాకు సోదరులు సూర్య గమన రేఖకు భూపరిభ్రమణ కక్ష్యలకు ఉన్న కోణాన్ని లెక్కించారు.

క్రీ.శ. 820

పశ్చిమ ఐరోపా దేశంలో సేవా సంస్థలు, దేవదాసీ నిలయాలు ఏర్పడ్డాయి. వారు యాత్రికులకు, పేదలకు, స్థానికులకు వైద్య, విద్య సేవలు అందిస్తూ ఉండేవారు.

క్రీ.శ. 820

సోమాలియా దేశంలో సీలాక్ అనే సముద్ర తీర నగరం గురించి ప్రపంచానికి తెలిసింది. కొన్ని సహస్రాబ్దాలపాటు అది గొప్పవాణిజ్య నగరంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ. ఆఫ్రికా, అరేబియా దేశాల మధ్య వాణిజ్య జరిగింది. బట్టలు, లోహాలు, తోళ్లు బదులు దంత సామగ్రి, బానిసలు వస్తుమార్పిడి సమీపంలో విక్రయం జరిగేది.

క్రీ.శ. 820

అల్బమజార్ అనే అరబ్బు ఖగోళ శాస్త్రజ్ఞుడు తనకున్న తేలికపాటి ఖగోళశాస్త్ర పరిజ్ఞానాన్ని పర్షియన్, భారతీయ జ్యోతిశాస్త్రాలతో మిళితం చేసి, గ్రీకు, తాత్విక శాస్త్రాన్ని కూడా అందులో రంగరించి జ్యోతిశాస్త్రాన్ని తయారుచేశాడు. దీన్ని ఇస్లామిక్ ప్రపంచం, ఆ తర్వాత పాశ్చాత్య దేశాల్లో చట్టపరంగా ఆమోదించారు.

క్రీ.శ. 821

జపాన్ చక్రవర్తి చెట్లు నరికే పద్ధతిని క్రమబద్ధం చేశాడు. విచ్చలవిడిగా చెట్లు నరకడాన్ని నిషేధించాడు. కేవలం వ్యవసాయానికి అద్దంకిగా ఉన్న వృక్షాలను మాత్రమే తొలగించేవారు. చెట్లు నరకడాన్ని నిషేధించడాన్ని బట్టి అప్పుడే పర్యావరణ సమతౌల్యత గురించి వర్షాలు రావడానికి, పచ్చదనానికి ఉన్న సంబంధాన్ని గురించి వారికి అవగాహన ఉన్నట్టు మనం భావించవచ్చును.

క్రీ.శ. 833

బాగ్దాద్ లో తొలి అంతరిక్ష అబ్జర్వేటరీని నిర్మించారు.

క్రీ.శ. 837

తొలిసారిగా అరబ్బు దేశాల్లో పావురాలతో వార్తలను పంపడాన్ని ప్రవేశపెట్టారు.

క్రీ.శ. 840

పాశ్చాత్య వైద్య పద్ధతుల గురించిన అనేక ఆంగ్ల గ్రంథాలను అరబ్బీలోకి హునాయాన్ ఇషాక్ అనే అతను అనువాదం చేశాడు. క్రమేపీ పాశ్చాత్య వైద్య పద్ధతులు ఇస్లామిక్ వైద్య పద్ధతుల్లో కలిసిపోయాయి.“గేలన్” వైద్య గ్రంథాలు అరబ్బు భాషల్లోకి తర్జుమా కావడం ప్రధానఘట్టం.

క్రీ.శ. 850

11aa.jpgఇండోనేషియా దేశంలో బొరాబుదూర్ అనే పర్వత ప్రాంతంలో ఒక బౌద్ధారామాన్ని నిర్మించారు. చాలా కాలంపాటు అది ప్రసిద్ధ కట్టడంగా పేరుపొందింది. పిరమిడ్ రూపంలో మెట్లుమెట్లుగా ఉండే ఆ ఆరామం నిర్మాణం గురించి గొప్పగా చెప్పుకునేవారు.

3.0027173913
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు