অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అంకెల విజ్ఞానం – అంకె 2

అంకెల విజ్ఞానం – అంకె 2

zimageశేషు : (ఉపాధ్యాయుడు) గత నెలలో అంకె ఒకటి? అంకె, (1) గురించి చర్చించుకున్నాం కదూ! మరి ఈ నెలలో రెండు అంకె (2) గురించి నేర్చుకుందామా?

సింధు : సార్, నేను '2' (రెండు) ఆకారంలో ఉన్నవాటిని చెబుతాను. నీటిపై బాతు, పడగెత్తిన నాగుపాము, చేతిలో కొడవలి. మరి రెండు గురు "2" ఇలా ఉండటానికి కారణం ఏమైనా ఉందా?

శేషు : మంచి ప్రశ్న వేశావు సింధూ! ఇప్పడు, మన శరీరంలో రెండు ప్రపంచమంతా వాడుతున్న అంకెల సంఖ్య (Symbols)ల్లో చాలా వాటి రూపాల్ని కోణాల ఆధారంగా భారతీయ గణిత శాస్రవేత్త రూపొందించారు. ఆయన ఒక రేఖను రెండు కోణాల వచ్చే విధంగా వంచాడు. ఈ ఆకారం కాలక్రమేణ '2' గా మారినది.

సింధు : సార్ '2' గుర్తుకు కారణం భలేగా ఉంది సార్! రెండు కోణాల ఆధారంగా రెండును Z (జెడ్) లాగా సూచిస్తామని నాకు ఇంతవరకు తెలియదు.

శేషు : గుడ్ ఇప్పడు మనం రెండును ఎక్కడెక్కడ వాడుతామో చెప్పండి.

షంషీర్ : జత అంటే రెండు. మన శరీరంలో రెండు కళ్ళు రెండు చెవులు, రెండు మూత్రపిండాలు, రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి.

శ్రీనిధి : మంచి చెడులు రెండు, కష్టసుఖాలు రెండు, రేయింబవళ్ళు రెండు, అమ్మానాన్న రెండు.

డేవిడ్ : మనిషికి ముఖ్యమైనవన్ని రెండక్షరాలే! కూడు, గుడ్డ, గూడు, దయ, జాలి, ప్రేమ, భార్య, భర్త, మన్ను, మిన్ను, అగ్ని, గాలి, నీరు మొదలైనవి.

వెంకీ : సంవత్సరంలో రెండవ నెల ఫిబ్రవరి. సంవత్సరంలో అన్నింటికన్నా తక్కువ రోజులు గల నెల ఇది.

కేశవ : లీపు సంవత్సరంలో 29 రోజులు, సాధారణ సంవత్సరంలో 28 రోజులు ఇలా రెండు రకాలైన రోజులు గల నెల రెండవ నెల.

gandhiకాంచన : సైన్స్ డే ని జరుపుకొనే నెల, జనవిజ్ఞాన వేదిక ఆవిర్భవించిన నెల ఫిబ్రవరి. జాతిపిత గాంధీ, 2వ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి జన్మదినం జరుపుకొనే తేది కూడా అక్టోబరు రెండే.

శేషు : అందరూ బాగా చెప్పారు. కాని బుజ్జి మాత్రం ఏమీ చెప్పలేదు, నువ్వుచెప్పు బుజ్జీ!

బుజ్జీ : మన ముఖ్యమంత్రి విజయానికి చిహ్నంగా (V) రెండువేళ్ళే, నిన్నకేశవకు అతిసారం (motions) అయినప్పుడు Permission కోసం రెండువేళ్ళే చూపించాడు. (అందరు నవ్వుతారు)

శేషు : నీవు ఎప్పడూ ఇంతేరా వెధవా!

పార్థ : రేఖా ఖండానికి "—" రెండు అంత్య బిందువులుంటాయి.

రవి : ఏదైనా ఆకారంను " రెండు” సమాన భాగాలు చేస్తే వాటిని సౌష్ఠనం Symmetry అంటారు. శనగకాయ ఒలచినపుడు, చిక్కుడు కాయను నిలువుగా చీల్చినపుడు, టమాటా, ఎర్రగడ్డ లాంటివి సగంగా తరిగిన అవి సౌష్టవాలు ఏర్పరుస్తాయి.

figuresదినకర్ : రవి చెప్పింది కరక్ట్ సార్, ఇప్పడు నేను రెండు సౌష్టవాలు ఉండేవి చెపుతాను. దీర్ఘచతురస్రం, వృత్తానికి రెండు సౌష్ఠనాలు ఉంటాయి. ఇంకా రెండు సౌష్ఠానాలు కూడా చెప్తాను. ఇంగ్లీషు అక్షరాలైన H, I, X లకు రెండు సౌష్టవాలుంటాయి.

సబిత : రెండును సంసృతంలో "ద్వి" అంటారు. అందుకే ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం అయితే దానిని "సమ ద్విబాహు త్రిభుజం" అంటారు.

డేవిడ్ : లెక్కల పరంగా రెండు ప్రత్యేకతలు చెప్పతాను సార్. రెండు మొట్టమొదటి సరిసంఖ్య

శ్రీవాత్సవ్ : రెండుచే సంపూర్ణంగా భాగించబడే సంఖ్యలను సరిసంఖ్యలు అంటారు. సరిసంఖ్యలన్నింటిని భాగించేసంఖ్య రెండు.

సలీం : సరి ప్రధాన సంఖ్య కూడా రెండే ఆ తర్వాత ప్రధాన సంఖ్యలన్నీ (Prime Numbers) బేసి సంఖ్యలే!

శశి : రెండుచే భాగిస్తే శేషం ఒక్కటి వచ్చే సంఖ్యలన్నీ బేసి సంఖ్యలు అవుతాయి.

రంగ : రెండు వరుస సరి సరిసంఖ్యల మధ్య తేడా ఎప్పడూ రెండే.

లలిత : రెండు వరుస బేసి సంఖ్యల మధ్య తేడా ఎప్పడూ రెండే.

శ్రీధర్ : 2+2 = 4, 2X2 = 4 ఇలా కూడగా, గుణించిగా ఒకే సంఖ్య (4) రావడం 2కు మాత్రమే సాధ్యం సార్! అంటే X2 = 2X అయ్యేలా X విలువ '2' అయితేనే సాధ్యం.

శేషు : గుడ్, బాగా చెప్పావు శ్రీధర్!

S.N.D ప్రసాద్ : రెండు ప్రధాన సంఖ్యల మధ్య తేడా '2' అయితే వాటిని "కవల ప్రధాన సంఖ్యలు (Twin Primes) అంటారు. ఉదా. 5-3 = 7-5 = 13 - 11 = 1917 = 31-29 = 43-41 = 2

శ్రీకాంత్ : వర్గంను సూచించడానికి "రెండు" ను ఆ సంఖ్య ఘాతంగా రాస్తాము.

22 = 2x2 = 4 (రెండు వర్గం నాలుగు)

32 = 3X3 = 9 (మూడు వర్గం తొమ్మిది)

42 = 4X4 = 16 (నాలుగు వర్గం పదహారు)

మంజుల : ఏదైనా సంఖ్యను రెండుతో భాగిస్తే సగం అంటాము.

నాలుగులో సగం రెండు (4/2 = 2)

రెండులో సగం ఒక్కటి (2/2 = 1)

ఏడులో సగం మూడున్నర (7/2 = 3.5)

రత్న: చతురస్రం, దీర్ఘ చతురస్రాలలో రెండు కర్ణాలు సమానంగా ఉంటాయి.

శేషు : అందరూ చాలా బాగా చెప్పారు. ఇంకొన్ని ఆసక్తికర విషయాలు నేను చెబుతాను.

  1. 2 = 1+1 = 12+12 = 12+12 = 13=13 =14=14=15+15=… ఇలా సహజ సంఖ్యలను ఉపయోగించి రాయగల సంఖ్య, 2 ఒక్కటే.
  2. రెండు వరుస సంఖ్యల లబ్దంగా రాయగల సంఖ్య 2 ఒక్కటే 1 Χ 2 = 2.
  3. 15384/7692 = 2. ఈ భిన్నంలో 1 నుండి 9 వరకు గల అన్ని అంకెలు ఒక్కసారి ఉ పయోగించబడ్డాయి.
  4. ఒక సంఖ్య దాని విలోమాల మొత్తం రెండు కంటే ఎక్కువ (2+1/2>2, 3+1/3>2, 4+1/ 4>2............ ) కాని 1+1/1 = 2 ఇలా ఒక సంఖ్య దాని విలోమాల మొత్తం రెండు అవ్వడం 1 కి మాత్రమే వీలగును.
  5. ప్రధాన సంఖ్య '1' కలిపిన ప్రధాన సంఖ్య వచ్చు సంఖ్య ‘రెండు’ ఒక్కటే.
  6. సరి సంఖ్యల సాధారణ రూపం 2n. ఇచ్చట n సహజ సంఖ్యల సమితికి చెందును.
  7. బేసి సంఖ్యల సాధారణ రూపం 2n+1. ఇప్పుడు n పూర్ణసంఖ్యా సమితికి చెందుతుంది.
  8. ఏ రెండు సరి సంఖ్యల భేదంనైనా, ఏ రెండు భేసి సంఖ్యల భేదంనైనా తప్పకుండా నిశ్శేషంగా భాగించే సంఖ్య రెండు ఒక్కటే.
  9. రెండు కంటే పెద్దదైన ఏ రెండు ప్రధాన సంఖ్యల భేదంనైనా భాగించే సంఖ్య రెండు ఒక్కటే.

(అంతలో బడి గంట ప్రెమోగినది.)

శేషు: ఇలా రెండు గురించి ఇంకా చాలా విషయాలున్నాయి. అవి ప్రయత్నించండి. (అని తర్వాత క్లాస్ కు బయలుదేరాడు)

రచయిత: -హెచ్. అరుణ్ శివ ప్రసాద్, సెల్: 9059593071© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate