অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అంకెల విజ్ఞానం అంకె - 7

అంకెల విజ్ఞానం అంకె - 7

feb10శేషు: ఈ రోజు మనం '7' అనే అంకె గురించి తెలుసుకొందాము.

మధు: ఏడును ఇంగ్లీషులో 'సెవన్' అని హిందీలో ‘సాత్’ అని సంస్కృతంలో ‘సప్త’ అనీ, లాటిన్లో ‘సెప్టమ్' అని అంటారు. ఇవి అన్ని 'స' అనే శబ్దంతోనే ప్రారంభమవుతుంది. కానీ గ్రీకులో 'హెప్టా' అంటారు.

రంగ: అందుకే '7' భుజాలు గల సరళ సంవృత పటంను 'సప్త భుజి' అని 'హెప్తాగాన్' అని అంటుంటాము. కేశవ: ఏడు ఆకారం మాత్రం, గొడ్డలి, మూలమట్టం, కుళాలు గొట్టంలను పోలి ఉంటుంది.

జయప్రకాష్: తెల్లని కాంతిలో ఏడు రంగులు ఉంటాయి.

ప్రసాద్: అవును సార్. పట్టకం ద్వారా చూసినప్పుడు కానీ ఇంద్రధనుస్సులో కూడా ఏడురంగులుంటాయి. అవి Violet, Indigo, Blue, Green, Yellow, Orange, Red అని వీటిని సులబంగా గుర్తు పెట్టు కోవటానికి "VIBGYOR” అని గుర్తుపెట్టుకోవాలని మా Physics సార్ చెప్పారు.

శేషు: అవును అందుకే మన దేశంలో "VIBGYOR" ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు కూడా ఉన్నాయి. ప్రసాద్: పీరియాడిక్ టేబుల్ నందు 7వ మూలకం నైట్రోజన్. ఇది గాలిలో 78 శాతం ఉంటుందని “VIIA' గ్రూపులోని మాలకాలను హాలీజన్స్ అంటారని అవి Fluorine, Chlorine, Bromine, Iodine అని మా Chemistry teacher చెప్పారు.

మహా: ఖంగాలు '7' అవి Asia, Europe, North America, South America, Africa, Australia, Antarctica అని మా సోషియల్ టీచర్ అన్నారు.

బిందు: క్రమానుగత వర్గీకరణలో 7 అంశాలు ఉంటాయి. అవి 1. రాజ్యం, 2. వర్గము 3. తరగతి 4. క్రమము 5. కుటుంబము 6. ప్రజాతి 7. జాతి అని మా బయాలజీ టీచర్ చెప్పారు.

అన్నారావు: “FIFTEEN (15)", "SIXTEEN(16)'', HUNDRED (100)”, “MILLION (10 lakhs)" ఇవి 7 letter numbers అని మా లెక్కల టీచర్ అన్నారు.

ఆలీ: "SUCCESS”, “FAILURE' ఇవి రెండూ 7 letter Words ఇవి మనం చేసే కృషిని బట్టి ఫలితంగా ఉంటుందని English Teacher చెప్పారు.

వెంకటేష్: భార్య భర్తలది “ఏడు అడుగులబంధం”

సబితా: తిరుమలలో ఉన్నది ఏడు కొండలు. ముస్లిం సోదరులు పవిత్ర సంఖ్య 786 కూడా 7 తో ప్రారంభమగును.

ఉషా: స్వరాలు ఏడు. “సరిగమపదని” ను సప్తస్వరాలు అంటారు.

కేశవా: వారానికి రోజులు 7. మాకు ఆదివారం అంటే ఇష్టం.

మంజులా: ప్రపంచంలో ఏడు సముద్రాలు ఉన్నాయి. అవి 1) ఫసిఫిక్ 2) అట్లాంటిక్ 3) హిందూ 4) ఆర్కిటిక్ 5) మెడిటేరిలియన్ 6) కరేబియన్ 7) గుల్ఫ్ ఆఫ్ మెక్సికో.

రవి: ప్రపంచ వింతలు కూడా ఏడే.

శేషు: ఇక గణితంలో ఏడుకు ఉన్న ప్రత్యేకతలు చెప్పండి.

దినకర్: సహజ సంఖ్యలలో ఏడవది. ప్రధాన సంఖ్యలలో నాల్గవది. ఒక అంకె గల సంఖ్యలలో పెద్ద ప్రధానాంకము 7.

శేషు: రెండు వేర్వేరు ప్రధాన సంఖ్యల సరాసరి కూడా ప్రధాన సంఖ్య అయ్చే రెండవ సంఖ్య ఏడు.

తులసి: అవును. 3, 7 రెండు ప్రధాన సంఖ్యలు వీటి సరాసరి 3 + 7/2 = 10/5 = 5 ప్రధానాంకం అలాగా 3, 11 రెండు ప్రధాన సంఖ్యలు వీటికి సరాసరి 3 + 11/2 = 14/2 = 7 ఇది కూడా ప్రధానాంకము.

శేషు: నాలుగు సంఖ్యల వర్గాల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య '7'.

శ్రీధర్: 7=12+12+12+22

శేషు: x0+x1+x2+x3 ల విలువ వర్గ సంఖ్య అయ్యే విధంగా X ను తృప్తిపరిచే ఏకైక ప్రధాన సంఖ్య ‘7' అని Schin Zel అనే గణిత శాస్త్రవేత చెప్పారు.

పార్ధసారధి: అంటే 70+71+72+73 = 1+7+49+343 = 400 = (20)2 అని అర్థం.

శేషు: n3-1 = (n-1) (n2+n+1) విలువ ప్రధానంకం అయ్యే ఏకైక విలువ ‘7’.

ప్రవీణ్: 23-1 = (2-1)(22+2+1) = 1(4+2+1) = 7. ఇచ్చట n విలువ ‘2' ప్రధానాంకం, ఫలితం 7. ప్రధానాంకం కావడం గమ్మత్తుగా ఉంది. ఇలా రెండూ ప్రధానాంకాలు అయ్యే సంఖ్యలు మరేదిలేదు.

మోహన్: ఫెర్కట్ సంఖ్యలు అంటే ఏమిటి సార్? వీటితో ఎప్పుడూ ఒకట్ట స్థానంలో “ఏడు' వస్తుందట నిజమేనా?

శేషు: 22n+1 రూపంలో ఉండే సంఖ్యలను ఫెర్కట్ సంఖ్యాలు అంటారు.

n=1 అయిన 221+1 = 22+1 = 5

n=1 అయిన 222+1 = 24+1 = 17

n=3 అయిన 223+1 = 28+1 = 256+1 = 257

n=4 అయిన 224+1 = 216+1 = 65536+1 = 65537

n=5 అయిన 225+1 = 232+1 = 4294967296+1 = 4294967297

n=6 అయిన 226+1 = 264+1 = 18446744073709551617+1 = 257

ఇలా n>1 అయిన ప్రతి ఫెర్శట్ సంఖ్య విలువలలో ఒకట్ల స్థానం ‘7’ అని గమనించండి.

గుణ: చాలా బాగుంది సార్. మేము ఈ రోజు ఫెర్మట్ సంఖ్య గురించి తెలుసుకొన్నాం. మరి ఏడు తో భాజనీయతా సూత్రం చెబుతారా?

శేషు: ఏడుతో భాజనీయతా సూత్రం లేదు కానీ ababab రూపంలో గల సంఖ్య ఎప్పుడూ 7 తో భాగిస్తుంది.

హరిబాబు: a = 2, b = 5 అనుకొనిన 252525 అనే సంఖ్య 7 భాగిస్తుంది. ab లకు ఏ విలువ ఇచ్చినా ఇది ఏడుతో భాగిస్తుంది.

శేషు: 3n (n-1)+1 రూపంలో గల సంఖ్యలను Hex number అంటారు. 7 Hex number అవుతుంది.

మహా: n=2 అయిన 3(2) (2-1)+1 = 6x1+1 = 7 కాబట్టి 7 ఒక Hex number

బాబు: 2n విలువలో n యొక్క ఏ విలువ 7 తో ప్రారంభమవుతుంది సార్.

శేషు: 2n విలువలో n=1, 2, 3, 4 ......... అయిన వాటి విలువలు 21=2, 22=4, 23=8, 24=16, 25=32, 26=64, 27=128 … ఇలా వస్తాయి n =56 అయిన 256 = 72057594037927936. 2n విలువలలో 7తో ప్రారంభమయ్యే చిన్న విలువ 56.

లావణ్య: ఏ రెండు వరుస ప్రధాన సంఖ్యల మధ్య బేధం '7' గా ఉండదు.

కాంచన: ఏడు సంఖ్యల ఘనాల మొత్తంను సూచించు చిన్న సంఖ్య 7, 7 = 13+13+13+13+13+13+13

శ్రీకాంత్: 7 భుజంగా గల పథాగరస్ త్రికాల 7, 24, 25

భోలాజి: 242+722 = 252 ; 576+49 = 625

శ్రీధర్: రెండు ధన సంఖ్యల ఘనాల బేధంగారాయలిగే చిన్న సంఖ్య 7, 23-13 = 8-1 = 7

శేషు: ఇలాంటి వాటిని Lucas Number అంటారు. చివరగా Happy Number గురించి తెలుసుకొందాం. Happy numbers లో చిన్నది 7. Happy numbers గురించి పరిశీలించండి

72 = 49 → 42+92 = 16+81 = 97

97 → 92+72 = 81+49 = 130

130 → 12+32+02 = 1+9 = 0

10 → 12+02 = 1

ఇలాంటి సంఖ్యలను Happy సంఖ్యలు అంటారు. మీరందరూ Happy గా ఉండండి అంటూ మరో క్లాస్ కు వెళ్ళాడు.

ఆధారం: పాచ. అరుణ శివప్రసాద్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate