పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అడవిని ప్రేమించండి

అడవుల అందాలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మా అమ్మా నాన్న కన్హ అడవులను చూడటానికి అందరం వెత్తున్నామని మాతో చెప్పగానే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే రడ్యూర్డ్ కిప్లింగ్ అనే రచయిత పుస్తకం "జంగిల్ బుక్ కి స్పూర్తి ఈ అడువులే. మీలో కొందరు "జంగిల్ బుకె సినిమా చూసే వుంటారు.

కన్హ పేరు మా తల్లిదండ్రులు చెప్పగానే మేము గూగుల్ లో వెదికాము. ఈ అడవులు మధ్యప్రదేశ్లో వున్నాయి. సాత్పూరా పర్వత పంక్తుల్లో మైకాల్ పర్వతాల్లో మాండా, బాలాఘాట్ జిల్లాల్లో విస్తరించి వున్నాయి. 1955 నుండి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ అడవుల్ని రక్షిత అడువులు (Reserve Forests) గా ప్రకటించింది. చూడాల్సిందే. అంతేకాకుండ ఈ అడువులను కొట్టి పోడు వ్యవసాయం చేస్తున్న కనాపల్లెను అక్కడి నుండి తరలించింది. మా ప్రయాణంలో పల్లెప్రాంతం ఇంకా బీడుగానే కనిపించింది కూడా 1973-74 లో అంతరించి పోతున్న పులులను కాపాడటానికి 9 పులి సంరక్షణ కేంద్రాలు (Sanctuaries) ఏర్పర్చాలని భారత ప్రభుత్వం భావించి ఒక కేంద్రాన్ని ఈ అడవుల్లో ఏర్పాటు చేసింది.

forestఈ అడవుల్లో అత్యంత అరుదైన వృక్ష, జంతు జాలాలు వున్నాయి. జీవవైవిధ్యం అంటే ఈ అడవిలో చూడాల్సిందే. కన్నా అడవులు 4 జోన్లుగా ఫారెస్టు డిపార్టుమెంటు విభజించింది. అది కన్నా కిస్తి, మక్కి సర్టీ జోన్లు. ఈ జోన్లలోపలకు రావడానికి ఒక్కోజోన్కి. ఒక్కోగేటు ఉంటుంది. అడవులు చూడాలనుకున్న వెంటనే మా నాన్న ఆన్లైన్లో వికెట్ల రిజరు చేశారు అయితే ఏ జోన్లో రిజర్వుచేసుకుంటే ఆ జోన్లో మాత్రమే సఫారీలో ప్రయాణించటానికి అనుమతిస్తారు. సఫారీ ఇతర పులి సంరక్షణ కేంద్రాల్లోలాగా కాకుండా ఓపెన్ టాప్ జీపులో (జిప్సీ) నిర్వహిస్తారు. ఒక జీపులో అgరుగురు కూర్చోవచ్చు. ఒక్క జీపుకి టిక్కెటు రూ. 4500/- కన్నా అడవుల పెంపకం కోర్-బఫర్ జోన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రధాన అటవీ ప్రాంతం (Core) 917. 43 చదరపు కిలోమీటర్లు బాహ్యా రక్షకప్రాంతం వుంది. మధ్యస్థ ప్రాంతం (Buffer) 113.4 చదరపు కిలోమీటర్లు అవరించి వుంది. మధ్యస్థప్రాంతం చుటూ 110 చదరపు కిలోమీటర్ల బాహ్య రక్షకప్రాంతం వుంది. భారతదేశంలో మొత్తం 79.42 వేల హెక్టార్ల భూమి అటవీ ప్రాంతంగా వుంది. ఇది భారతదేశ విస్తీర్ణంలో 24.7% మాత్రమే నిజానికి కనీసం 30% అటవీప్రాంతం వుండాలి. అన్నింటి కంటే అత్యధిక అడవులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ తర్వాత స్థానం అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, మహారాష్ట ఒడిషా రాప్తాలు వున్నాయి. తక్కువలో తక్కువ అడవులు కలిగిన రాస్దాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాఫ్రాలు.

resort27 మార్చి 2017 సోమవారం :

విశాఖపట్టణంలో మేము రాత్రి 8 గంటలకు రైలు ఎక్కాం. మర్నాడు ఉదయం 7 గంటలకు రాయ్ పూర్ చేరుకున్నాం. రాయ్ పూర్ నుండి కారు మాట్లాడుకొని మోతీనాలా అనే గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ మా నాన్నగారి స్నేహితుడొకరువున్నారు. ఆయనింట్లో ఆతిధ్యం పొందాం. అక్కడే రెండ్రోజులు వున్నాం. అయితే మూ నాన్న స్నేహితుడి యింట్లో పడుకుంటానికి తగిన మంచాలు లేవు. ఆ సంగతి మాకుముందే తెలుసుకాబట్టి ఒక టెంట్ (గుడారం) తీసుకుని వెళ్ళి వాళ్ళింటి డాబామీద ఆ టెంట్లో నిద్రించాం. మా టెంట్లో నలుగురం హాయిగా పడుకోవచ్చు. ఈ రెండు రోజుల్లో మేము మా అతిథేయుల ఇంట్లోవున్న పిల్లలతో కలిసి కొంత దూరం ట్రెక్కింగ్ చేశాం. ప్రతి సాయం కాలం ఇంటికి తిరిగివచ్చాం ఈ నడక ఎంతో బాగుంది. కొత్త ప్రాంతం కొత్త మనుషులు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.

31 మార్చి 2017 శుక్రవారం:

ఉదయం 6:30 గం. లకు బయలుదేరి కన్హా అడువుల ముక్కి గేట్ వద్దకు చేరుకున్నాం. మేతీనాలా నుండి ముక్కిగేట్ 30 కి.మీ. దూరంలో వుంది. అయితే అక్కడి అటవీ అధికారులు విసుక్కోకుండా మమ్మల్ని మక్కి గేటి నుండి అడవి గుండా కన్నా జోన్లోకి సఫారీలో తీసుకెళ్ళారు. సఫారీజీపు ఎక్కేముందు వారు చేసిన సూచనలుయివి.

 1. ముదురు రంగు దుస్తులు ధరించి వుండ కూడదు. (అయితే మేం అనుకోకుండా అందరం లేత రంగు దుస్తువుల్లోనే వున్నాం.)
 2. సఫారీ ప్రయాణమంత ఓపెన్టాపు జీపు (జిప్సీ)లో సాగుతుంది. (నిజం చెప్పాలంటే  ముంది కొద్దిగా భయం అనిపించినప్పటికీ తర్వాత అంతా ద్రిల్లింగ్గా వుంది). మామూలు జీపుకంటే జిప్సీ కొద్దిగా ఎత్తు వుంటుంది. కాబట్టి పులులు దాడిచేయడానికి ప్రయత్నించవు, కాని పొరబాటున కూడా జీపు దిగకూడదని హెచ్చరించారు.
 3. ఒక వేళ పులి దారికి అడ్డంగావచ్చి నిలబడి పోతే జీపు ఆపుచేస్తారు. పులి కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూసే ప్రయత్నం చేయకూడదు. సైగలు చేయడం అరవడం అస్సలు చేయకూడదు, శబ్దం చేయకూడదు.
 4. పులులకు గాని ఇతర జంతువులకు గాని ఆహార పదార్గాలు విసరకూడదు.
 5. వాళ్ళు మాకు చెప్పని అంశం ఒకటి వుంది. అదేమిటంటే కనా అడవుల్లో 365 రోజులు చల్లగానే వుంటుంది. జీపులో ప్రయత్నం చేస్తుంటే మార్చినెలలో మాకు చలి పెట్టిందంటే మా దగ్గర ఒక దుప్పటివుంటే దాన్నేఅందరం కప్పకుంటానికి ప్రయత్నం చేశాం.

animalముక్కి జోన్ నుండి కన్హా జోన్ వరకు ప్రయాణం చేసేటప్పుడు. ఒక్కచోట మాత్రం పులి కనిపించింది. పక్కనున్న పొదల్లోకి పడుకొని మావైపు చూస్తున్నది. మమ్మల్ని బాగా ఆకర్షించిన జంతువు చిత్తడి జింక (Swamp Deer) ఈ జింకలకి ఎంతో పెద్ద పెద్ద కొమ్మలున్నాయి. ఈ జింకను హిందీలో 'బారాసింగా అంటారు. ఈ చిత్తడి జింక కేవలం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో కనపడుతుందట, గాని ప్రస్తుతం ప్రపంచంలో ఇక్కడ కన్నా అడవుల్లో మాత్రమే వుందట. కన్నా ఎంబ్లంలో కూడా ప్రముఖంగా ఈ జింకనే కనపడుతుంది. నెమళ్ళు గుంపులు గుంపులుగా వున్నాయి. ఒకటి పురి విప్పగానే నెమళ్ళు అన్నీ పురి విప్పి ఆడుతున్నాయి.

గైడ్ మాకు రెండు పిట్టలను ప్రత్యేకంగా చూపాడు. అరుదుగా కనిపించే పిక్రా పిట్ట ఒకటి (దీనిని తెలుగులో ఏమంటారో మాకు తెలియదు), పిట్టలకు శిక్షణ ఇచ్చే శిక్షకులకు ఈ పిట్ట చాలా ఇష్టం. ఎందుకంటే తేలిగ్గాను, తొందరగాను యిది నేర్చుకుంటుంది. వేటగాళ్ళకు సాయపడుతుంది. ముఖ్యంగా డేగలను కవ్వించి అవి వెంటబడగానే అవి వేటగాడి వలలో చిక్కకునేట్టు పయనం చేస్తుంది.

మరొక పిట్ట పాలపిట్ట, పాలపిట్టలు చాలా వున్నాయి. దసరా వేడుకల్లో పాలపిట్టను చూస్తే కోరికలు నెరవేరుతాయని మూఢనమ్మకం వుంది. అందుకే దసరా వస్తుందంటే ఈ పిట్టను వేటగాళ్ళ బంధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా పాల పిట్టలను మనుషులు ఫ్రీడ్డిస్తారని గైడ్ చెప్పాడు. పాలపిట్ట తెలుగు రాప్తాలకే గాకుండా కర్నాటక, ఒడిషా, బీహార్ రాష్ట్రాలకు కూడా రాష్ట్ర పక్షి ఓరాంగ్టాన్ కోతులు ఈ అడవుల్లో చాలా ఉన్నాయి.

కన్హాలో మేము నేషనల్ పార్కు చూశాం. అనేక జంతువుల మృతకళేబరాలను వాటి సహజ ఆకారాలలో నిల్వచేశారు. చెక్క ఉన్ని వైర్లతో తయారైన ఆకారాల మీదకు చనిపోయిన జంతువు చర్మాలను రసాయనాలతో శుద్ధి చేసి ఎక్కించడం ద్వారా అవి స్వయంగా నిలబడేవున్నాయా అని భ్రమ కలుగుతుంది. ఈ కళను టాక్సీడెర్మి (Taxidermy) అంటారు. పాలగుమ్మి పద్మరాజు అనే రచయిత ఇటువంటి పార్కుని బ్రతికిన కాలేజీ అనే వాడని, ఒక సినిమాలో పాట కూడా వుందని మా తాత చెప్పాడు.

అయితే మాకు మళ్ళీ అడవి ఒకసారి చూడాలని అనిపించింది. కాబట్టి మక్కి గేటు దగ్గరికి మా జిప్సీ వాపసురాగానే మర్నాటికి టిక్కెట్లు వున్నాయేమో కనుగొన్నాం. ఎవరో రద్దుచేసుకున్నటిక్కెట్లు దొరికాయి, మళ్ళీ అడవిని సందర్శిస్తాం.

ముక్కిలో గేటు బయట రిసార్టులున్నాయి. అవి బాగాలేవని అక్కడే దగ్గర్లోవున్న ఫారెస్ట్ గెస్ట్ శ్యా5లో మా నాన్న స్నేహితుడు ఒక గదిని కేటాయింపచేశాడు. అడవిలోనే వున్న ఈ చిన్న గెస్ట్హౌజ్లో రాత్రి గడిపాం. మాకేం అనిపించందంటే అడవికి కూడా ఒక భాష ఉందని. సర్రుమని వీస్తున్నగాలుల మధ్య అడవి రకరకాల జంతువుల అరుపులు, ధ్వనులతో ప్రతిధ్వనిస్తుంటే అడవి మాట్లాడుతున్నట్లే వుంది. ఆ మాటలు వింటూ మేము ఎప్పడు నిద్రపొయ్యామో మాకే తెలియదు.

18 ఏప్రిల్ 2017, శనివారం:

ఉదయం 7.30 గంటలకు మొదలైన మా ముక్కి జోన్ అటవీ సందర్శనలో ఈసారి పులి ప్రత్యక్షంగా మా దారికి అడ్డం వచ్చి రోడ్డు మీద కూర్చుంది. దానితో పాటు ఒక కుక్కపిల్ల కూడా వుంది. ఆ పులి పిల్ల రోడ్డు పక్కనే వున్న పొదల్లోకి పోతూ వస్తూవుంటే పులి రోడ్డు మీదనే వుంది. మా జీపు ఆగిపోయింది. నిశ్శబ్దంగా కూర్చున్నాం. ఒక పదినిమిషాల తర్వాత హుందాగా కదిలి పలి రాజసంగా వెళ్ళిపోయింది. ఆ రోజంతా అడవిలో తిరిగాం, ఈ సారి ప్రతి ఒక్కరు ఒక్కొక్కదుప్పటి కప్పకుని జీపులో కూర్చున్నాం. అంత చలివుంది. ఆ రోజు సాయంత్రం ముక్కి గేట్ దగ్గర నుండి రాయ్ పూర్ కి. అక్కడి నుండి రైలు ద్వారా విశాకపట్నం చేరుకున్నాం.

ప్రతి సంవత్సరం 5 జూన్ నాడు పర్యావరణ దినోత్సవం జరుగుతుంది. అడవి పర్యావరణంలో భాగం. అడవుల్లో వన్యమృగాలు సంరక్షింపబడితే అడవులు సంరక్షింపబడతాయి. అడవులుంటే లాభమేమిటో మరోసారి నెమరేసుకున్నాం.

 1. భూతాపం తగుతుంది. కార్బన్ డయాక్సైడ్ భూవాతావరణంలో తగుతుంది. వర్శపాతం పెరుగుతుంది.
 2. అడవులు భూక్షయం నివారిస్తాయి.
 3. అడగున వున్న భూగర్భ జలాలను చెట్లవేర్లు పైకి తీసుకునివస్తాయి. భూగర్భ జలాలు అడుగంట కుండా చెట్లు నిరోధిస్తాయి.
 4. అటవీ ఉత్పత్తులనేకం అనేక చిన్నచిన్న పరిశ్రమలకు కారణం అవుతాయి. ఔషధ మొక్కలతో ఔషధాలు తయారువుతాయి.
 5. వన్యమృగ సంరక్షణతో జీవవైవిధ్యం పెరుగుతుంది. భూమ్మీద జీవసమతౌల్యం ఏర్పడుతుంది.
 6. అడవుల టూరిజం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. చాలా మందికి ఉపాధిదొరుకుతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే “వృక్షో రక్షిత రక్షితః" అడవులు మనిషి మనుగడను రక్షిస్తాయి. అందుకే మనం అడవిని ప్రేమించడం నేర్చుకోవాలి.

వ్రాసిన వారు: కీర్తన ఉప్పల (10వ తరగతి), అర్పణ ఉప్పల (7వ తరగతి), ఇటాసి-టింపనీ స్టీల్ సిటీ స్కూల్, గాజువాక.

3.01113585746
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు