অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

అమ్మా అవనీ !

అమ్మా అవనీ !

'తాతా! బలిచక్రవర్తి తలమీద కాలు పెట్టి వామనుడు పాతాళలోకానికి పంపించాడని కథ వుంది కదా! పాతాళలోకం భూమి కింద వుందా?'

కీర్తన నవ్వింది. కీర్తన అర్పణకు అక్క 'ఎందుకు నవ్వుతున్నావు' కోపంగా అడిగింది. అర్పణ.

“మొన్న మన యింటి ఆవరణలో బోరు వేశారుగా! మరి బలి చక్రవర్తికి ఆ బోరుగొట్టం తగిలి వుండదా? తగిలితే బాధ కలగదా?' అని తలుచుకుని నవ్వుతున్నాను. ఏం తప్పా? అని అడిగింది కీర్తన.

'తప్పేరా కన్నా!' అన్నది వాళ్ళ అమ్మమ్మ. 'పురాణ గాథలను వెక్కిరించకూడదు'.

“అది మీ అమ్మమ్మ అభిప్రాయం' అన్నాడు తాత.

“నువ్వు చెప్పు తాతా!” అన్నది అర్పణ. “పాతాళలోకం వుందా, లేదా?”

'ఈ విషయం జియాలజిస్టులను అడగాలి' అన్నాడు తాత.

' అంటే ? అనడిగింది కీర్తన.

‘జియాలజీ లేక ధరిత్రీ శాస్త్రం లేక భూ విజ్ఞానశాస్త్రం విజ్ఞానశాస్త్రంలో సమస్త వివరాలు వాళ్ళు చేస్తారు.

ఓ తెలిసింది! మన యింటి ఆవరణలో బోరు వేయడానికి ముందు నాన్న ఒక జియాలజిస్టుని పట్టుకుని వచ్చాడు. మనింటి ఆవరణలో నీళ్ళు బాగా దారికే ప్రదేశం ఏదో చెప్పమని ఆయనను తీసుకువచ్చాడు. అవునా, తాతా? అడిగింది కీర్తన.

అవన్నిజమే! ఒప్పుకున్నాడు తాత.

అయితే నాకు భూ విజ్ఞానశాస్త్రం గురించి చెప్పు అన్నది అర్పణ.

భూ విజ్ఞానశాస్త్రం అనేది భూమి గురించి అన్ని వివరాలు అంటే ఈ భూగ్రహ నిర్మాణం, అందులోని ప్రతి అంశాన్ని బోధిస్తుంది. అంతేగాకుండా గతంలో భూమి ఎలా వుండేదన్న అంశాన్ని రేడియోధార్మిక లవణాలు, శిలలను పరీక్షించడం దీన్నే ఆంగ్లంలో డేరింగ్ అంటారు; గుల్లలు, ఎముకలు, ఆకులు, చెట్టు బోదెల శిలాజాలను అధ్యయనం చేసి చెపుతుంది. దీని మూలంగానే శిలాజ ఇంధనం అయిన బొగ్గు, అలాగే అణు ఇంధన వనరులు పెట్రోలియం, యురేనియం మొదలైన వాటిని శోధిస్తారు. గనులన్నీ అందరికీ పూనకాలు వచ్చేస్తున్నాయి' అన్నది అమ్మమ్మ.

భూగర్భ ప్రాంతం (Core) 7200°C ఉష్ణోగ్రత కలిగి వుందని ధరిత్రీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. రేడియోధార్మిక శక్తి గల మూలకాలు యురేనియం, ధోరియం క్రమంగా విచ్చిన్నం కావడం వలన ఈ వేడి పుడుతుంది. భూమి గుండ్రంగా వున్నదన్న అభిప్రాయం మొట్టమొదటిసారి పైథాగరస్ (క్రీ. పూ. 500 సం) వెలిబుచ్చాడని అంటారు. అయితే హిందూ పురాణాలు మొదలుకొని అన్ని మతాలు భూమి నలుచదరంగా వున్నదనే అంటాయి. హిరణ్యాక్షుడు భూమిని చాపను చుట్టినట్లు చుట్టి సముద్రంలో దాగి వుంటే మత్స్యావతారంలో మహా విష్ణువు భూమిని రక్షించాడని కథ వుంది.” అన్నాడు తాత.

“ఇందాకటి బలి కథలాగే అన్న మాట” అంది కీర్తన.

కోపర్నికస్ అనే శాస్త్రవేత్త భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. దీన్నే గెలీలియో సమర్థించాడు. ఫెర్డినాండ్ మాజినాన్ మొదటి సారి ఓ ఓడలో బయలుదేరి భూమిని చుట్టి వచ్చి భూమి గుండ్రంగా వుందని చెప్పాడు. భూమి గుండ్రంగా వున్నదన్న సత్యాన్ని సర్ ఐజాక్ న్యూటన్ ‘భూమ్యాకర్షణ సిద్దాంతం' ప్రస్ఫుటంగా నిరూపించింది.

మొదటి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు

అల్ బిరూని మొదటి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలలో ఒకరు. ఆయన ప్రకారం మన “ఇండియా' భూభాగం ఒకప్పుడు సముద్రగర్భంలో ఉండేది. మధ్యయుగం కాలం వాడైన అవిసెన్నా అనే పర్షియన్ శాస్త్రవేత్త భూమ్మీద పర్వతాలు ఏర్పడిన పద్ధతిని, భూకంపాలు ఎలా వస్తాయనే అంశాన్ని, లవణాలు ఏర్పడిన విధానం, భూభాగం మీద గల అనేక పొరల మీద సిద్ధాంతాలు ప్రవచించాడు. 1696లో 'విలియం దిట్ స్టన్' ఒక కొత్త భూ సిద్ధాంతం' అనే పుస్తకాన్ని ప్రచురించాడు. అయితే జేమ్స్ హట్టన్ అనే స్కాట్లండ్ శాస్త్రవేత్తని అందరూ 'ఆధునిక ధరిత్రీ నిర్మాత'గా ప్రస్తుతిస్తారు.

భూ చరిత్ర: భూమి 4.6 బిలియన్ సంవత్సరాలు పురాతనమైంది. 510 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగివుంది. దాని వ్యాసం 6400 కి.మీ., కాని భాగంలో 70% నీటితోనే నిండి వుంది. భూమి నాలుగు నిర్దిష్టమైన పొరలు కలిగి వుంది. భూ పటలం (crust), భూ ప్రావారం (mantle), బాహ్య భూకేంద్రం (outer core), అంతర భూకేంద్రం (Inner core).

భూ పటలం: ద్రవం గడ్డ కట్టిన రాళ్ళు (Jedimentary rocks), గ్రానైట్ రాళ్ళు, అగ్గిరాళ్ళ (basalt)తో ఏర్పడింది.

భూ ప్రావారం: అత్యధిక ఉష్ణోగ్రత గల రాయితో ఏర్పడింది. భూమి బరువులో 85% ఈ విభాగం వలననే.

బాహ్య భూకేంద్రం: అత్యధిక ఉష్ణోగ్రత గల లావాతో ఏర్పడింది.

అంతర భూకేంద్రం: లేక భూ కేంద్రం పూర్తిగా ద్రవ రూపంలో గల ఇనుము, నికెల్తో ఏర్పడింది.

శిలలు: భూమ్మీద గల శిలలను భూ చరిత్ర పుస్తకంలోని పేజీలుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. ఈ శిలలు ఏర్పడిన విధానం బట్టి భూమి చరిత్రను నిర్ణయిస్తారు శాస్త్రవేత్తలు. ఈ శిలలను విచక్షణారహితంగా పగలగొట్టడం వలన మనిషి భూమి చరిత్రను నాశనం చేస్తున్నాడు. ఇలా విచక్షణారహితంగా పెద్ద పెద్ద శిలలను పగలగొట్టడం గాని, రాతిగుట్టల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటనలు రంగులతో రాయడం గాని ప్రకృతిని నాశనం చేయడమేనని ఒకసారి భారత సుప్రీం కోర్టు తీర్పుని వెలువరించింది. కాని దేశంలో అనేక చోట్ల శిలల నిలువు దోపిడి సాగుతూనే వున్నది. శిలలను అధ్యయనం చేయడం వలన భూమి ఎలా పనిచేస్తున్నదో అర్ధం అవుతుంది.

శిలాజాలు: చెట్లూ, జంతువులూ చనిపోయిన తర్వాత వాటి శరీర భాగాలు శిథిలమైన తర్వాత ఆకులూ, ఎముకలూ, గుల్లలుగా ఘనీభవించి శిలాజాలుగా మార్తాయి. వాటిని అధ్యయనం చేయడం వలన భూమి చరిత్ర కొంత అర్ధం అవుతుంది. ఆయా జంతువులూ, చెట్లు వున్న కాలంలో గల వాతావరణ పరిస్థితులు, ఆనాటి జీవావరణం, జీవ పరిణామం అర్ధం అవుతాయి.

“నేనెప్పుడూ శిలాజాలను చూడలేదు' అంది అర్పణ.

'మనం ఎవరూ చూసివుండం. చూసినా అవి శిలాజాలని మనకు అర్ధం కావాలిగా. భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు తేలిగ్గా గుర్తుపడతారు' అన్నాడు తాత.

19, 20 శతాబ్దాల కాలం: 19వ శతాబ్దం ధరిత్రీశాస్త్రంలో ముఖ్యమైన కాలంగా భావిస్తారు. విలియంస్మిత్ అనే బ్రిటీష్ శాస్త్రవేత్త బ్రిటన్ మ్యాపుని రూపొందించాడు. అంతేకాకుండా డార్విన్ అనేక శిలాజాలను అధ్యయనం చేయడం వలప జీవ పరిణామ సిద్ధాంతాన్ని రూపొందించాడు.

20వ శతాబ్దంలో మనిషి లవణాలు, లోహాలు, సహజ వాయువులు, పెట్రోలియంల కోసం విపరీతంగా భూగర్భ అన్వేషణ మొదలు పెట్టాడు. ముఖ్యంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిశ్రమలు, ఇండ్లు నిర్మించడం మొదలైన తర్వాత కాల్షియం, సిమెంటు లాంటి లవణ పదార్థాల ఆవశ్యకత పెరిగింది. అంతేకాకుండా భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుళ్ళు, సముద్ర లోయలు, పర్వతాలు ఏర్పడటం సంభవించాయి. వీటికి గల కారణాల గురించి భూ పేలికల సిద్ధాంతం వివరించింది. భూమిలో గల శిలల పొరలు తవ్వకాల మూలంగాను, ఇతర కారణాల మూలంగానూ కదులుతాయని ఈ సిద్ధాంతం వివరించింది. ఈ సిద్ధాంతం 1960లో రూపుదాల్చింది. అంతేకాకుండా 1915లో ఆల్ ఫ్రైడ్ వెజినర్ అనే జర్మన్ భూ విజ్ఞాన శాస్త్రవేత్త ఖండాలే కదులుతున్నాయని సిద్దాంతరీకరించాడు. అలాగే సముద్రమట్టం తగ్గి క్రమంగా సముద్ర భూభాగం విస్తరిస్తున్నదని ఆధునిక ధరిత్రీ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీని మూలంగా సముద్ర గర్భంలో భూకంపాలు సంభవించి సునామీలు ఏర్పడ్డాయి. 1950లో కొన్ని భూగర్బశిలలు అయస్కాంత తత్వం కలిగి వున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. పూర్వకాలంలో షెన్ కువో అనే చైనీస్ శాస్త్రవేత్త భూ శీతోష్ణ స్థితి మార్పులకు గల కారణాలను వివరించాడు.

బొగు: భూమిలో లభించే శిలాజ ఇంధనం బొగ్గు. నేడు విద్యుత్తు ఉత్పత్తికి బొగ్గు అవసరం. ఎంతైనా వుంది. మనిషి ప్రత్నామ్నాయ విద్యుత్తు పట్ల శ్రద్ద చూపించక పోయినట్లయితే 2030 సంవత్సరానికి 7000 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి సంసిద్ధమవుతాడు.

21వ శతాబ్ద కాలం: కృత్రిమ ఉపగ్రహాలు వచ్చిన తర్వాత మనిషి ధరిత్రీ పట్టా, పర్యావరణం పట్లా తను దృష్టి సారించక తప్పదని అర్ధం చేసుకున్నాడు. అంతేకాకుండా సమాచార సాంకేతికత, సాగరశాస్త్రం (Oceanography) భూతాపం ఈ మూడు అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

భూ సమాచార వ్యవస్థ (Geographical Information System): 1962 ఒట్టావా(కెనడా)లో భూసమాచార వ్యవస్థను (GIS) డా రోజర్ టామ్లిన్సన్ అభివృద్ధి చేశాడు. దీని మూలంగా భూ ఉపరితలం మీద వాతావరణ సూచక కృత్రిమ ఉపగ్రహ సమాచారాన్ని భూ సమాచార వ్యవస్థ సాంకేతికత ద్వారా స్వీకరించి భూమి మార్పులను కనుగొంటారు. అంతే కాకుండా ఇది ప్రయాణీకులకు తన అందుబాటులోని సమాచారాన్ని విశ్లేషించి అందజేయడం ద్వారా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఉగ్రవాదులు ఈ సమాచారంతోనే ముంబయిలో దాడి చేశారన్న విషయం మర్చిపోకూడదు.

ఆధారం:  పైడిముక్కల ఆనంద్ కుమార్.

 © 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate