অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కాకి కధ

కాకి కధ

apr014.jpg

కాకి కథంటే మనింటికి చుట్టాలొస్తున్నారని 'కావు కావు' మంటూ అరిచే కథనుకునేరు. అలానే ఉపాయంతో అపాయం తప్పించుకున్న (దాహం తీర్చుకొన్న) కడవల కాకిని' గురించి; హంసతో పోటీపడిన గర్వపోతు కాకిని గురించి, చిన్నయసూరి మిత్రలాభంలో కాకిని గురించి మనం చదువుకొన్నాం. కాకి అనే పక్షి మన నివాసాల మధ్య మనల్ని అంటిపెట్టుకొనుండే ఒక ముఖ్య జీవి. వాటి ఆకారాన్ని, అలవాట్లను ఎప్పుడైనా గమనించారా?

కాకుల్లో వందల రకాలున్నప్పటికీ మన ప్రాంతంలో నివసించే యింటి పరిసరాల కాకి (house crow) కొంత భిన్నమైనది. వేల సంవత్సరాల నుండి మనిషికి మిత్రుడుగా తోడున్నజీవి. దీన్ని శాస్త్రీయంగా కార్వస్ సెండెన్స్ కోర్ విడ్యు' అంటారు. దీనికి శరీరమంతా నలుపు ఈకలున్నప్పటికీ, మెడచుట్టూ ఒక ఆభరణంలాగా లేతనలుపు (గ్రే) వెంట్రుకలుంటాయి. అయితే దీంతోపాటు మన నివాసాల చుట్టూ ఉండే మరొకాకి, పూర్తిగా నల్ల ఈకల్లో ఉంటుంది. దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘జెముడు కాకి' అని కూడా అంటారు.

కాకులు తమ నివాసాన్ని (గూళ్ళు) నిర్మించుకోవటంలో వాటికవేసాటి. ఎండుపుల్లలు, యినుపచువ్వలు, వైరుముక్కలు, చెత్త చెదారాన్ని ఏరుకొనిపోయి, ప్రమాదాల్లేని స్థావరాల్లో గూళ్లు కడతాయి. పల్లెల్లోనైతే చెట్ల మీద తరచుగా కాకి గూళ్లను చూస్తాం. అయితే పట్టణాల్లో, చెట్లులేని ప్రాంతాల్లో అవి టెలీఫోన్ స్థంబాల మీద, ట్రాఫిక్ సిగ్నల్స్ మధ్య, యితర జీవులు చొరలేని సందుల్లో గూళ్లు కడతాయి. కాకులు వర్షాకాలంలో పిల్లల్ని పొదిగే స్థితిని సంతరించుకొంటాయి. అనగా తమ పిల్లలకు ఆహారం (పురుగులు, గింజలు) దొరికే స్థితికి అనుకూలంగా తమ జీవనచక్రాన్ని మార్చుకొంటాయి.

కాకి తన కుశాగ్ర బుద్దితో ఎటువంటి ప్రమాదాన్నయినా గుర్తించగలదు. దానికున్న ఈ నేర్పును మనం పొరపాటుగా అర్థం చేసుకొని “జిత్తులమారి’ కాకి అంటూ ఉంటాం. యివి గుంపులుగా నివసించడమేగాక, యితర కాకుల్లో ఆహారాన్ని పంచుకోవటంలో ప్రమాదాలప్పుడు హెచ్చరికల్ని చేయడంలో ప్రత్యేకమైన పక్షులని గమనించాలి. తమ గుంపులో ఏదైనా ఒక కాకికి ప్రమాదం జరిగితే పెద్దగా అరుస్తాయి. కొన్నిసార్లు ప్రమాదానికి కారకులైన మనుష్యుల్ని, జంతువుల్ని గుంపుగా తరుముతాయి. జంతుశాస్త్రవేత్తల విశ్లేషణల ప్రకారం కాకి అతి తెలివైన పక్షులలో ఒకటి. దీనికున్న వాడైన కంటి దృష్టి, జ్ఞాపకశక్తి,

ఎక్కువకాలం బ్రతగ్గలిగిన ఆయుషు దీన్నొక ప్రత్యేక జీవిని చేశాయి. కాకులు 25-30 సంవత్సరాలు కూడా బ్రతగ్గలవు. అలానే తరచుగా చూసే మనుష్యుల్ని, జంతువుల్ని అవి గుర్తుంచుకొంటాయి. అందుకే మిత్రుల, చుట్టాల రాకను తెలిపే అరపులు కాకి ప్రత్యేకమైనమనే నమ్మకం యిప్పటికీ పల్లెల్లో నిలబడి పోయింది.

కాకులు మన పరిసరాల్ని శుభ్రపరిచే జీతం పొందని సేవకులంటే అతిశయోక్తి కాదు. మనం వదిలేసిన (ఎంగిలి) మెతుకులు, కుళ్లిన పళ్ళు, కూరలు తింటూ బ్రతుకుతాయి. అలానే చచ్చిన ఎలుకల్ని దూరంగా తీసుకెళ్లి అవి తమ ఆహారంగా పనికొస్తే తింటాయి. అనగా ప్రమాదకరమైన ప్రదార్థాల్ని (విషాల్ని) ముందుగానే గుర్తించగలవు. అంతేగాదు యితర కాకులకు హెచ్చరికలు చేస్తాయి. మనం కాకి కేవలం కావుకావు మని అరిచే ఒకే తరహా శబ్దాన్ని గ్రహించగలం. కాని కాకుల శబ్దాల్లో ఉండే వైవిధ్యాన్ని తోటి కాకులే గుర్తిస్తాయి.

apr019.jpgకాకుల ప్రత్యేకతను మనుష్యులెప్పుడో గుర్తించారు. అందుకే వాటిని మన పితరులు చనిపోయిన పెద్దలుగా భావించి, అన్నం ముద్దల్ని ఆరగింపజేస్తాం, ఈ కాలంలో కూడా. కాకులు తమకు తెలియకుండానే మరో ఉపకారం చేస్తున్నాయి. అవి తమ గూళ్లల్లో కోయిల డి ద్వారా పెట్టబడిన గుడ్లను కూడా పొదిగి పిల్లల్ని చేస్తాయి. యిప్పుడు గమనించండి, కాకుల్ని! అందుకే కాకి మన మిత్రుడు. తేలిగ్గా చూడొద్దు. వాటిని కాపాడుకొందాం. అదే మనకు పర్యావరణ రక్షకులు, జీవశాస్త్రవేత్తలు చెప్పేది. (గీతా పద్మనాభన్, ది మిందూ ఆధారంగా కూర్చినది)

ఆధారం: ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate